ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత | High tension in osmania university arts college | Sakshi
Sakshi News home page

ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

Published Wed, Jul 1 2015 11:15 AM | Last Updated on Sun, Sep 3 2017 4:41 AM

ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

ఉస్మానియా ఆర్ట్ కాలేజీ వద్ద ఉద్రిక్తత

హైదరాబాద్: ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. టీటీడీఎల్పీ ఉప నేత రేవంత్రెడ్డికి ఓటుకు నోటు వ్యవహారంలో బెయిల్ రావడంపై ఉస్మానియా యూనివర్శిటీలో విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. అందులోభాగంగా రేవంత్రెడ్డి ఫ్లెక్సీపై విద్యార్థులు పెట్రోల్ తగలబెట్టారు. ఆ క్రమంలో అక్కడే ఉన్న విద్యార్థి శివన్నారాయణపై ప్రమాదవశాత్తూ పెట్రోల్ పడి... మంటలు చెలరేగాయి.

ఉహించని పరిణామం ఒక్కసారి ఎదురుకావడంతో అక్కడే ఉన్న విద్యార్థులంతా ఆందోళనకు గురైయ్యారు. ఆ వెంటనే తేరుకుని శివన్నారాయణకు అంటుకున్న మంటలను ఆర్పివేసి... ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న వెంటనే ఓయూ క్యాంపస్ పోలీసులు... ఆర్ట్స్ కాలేజీ వద్ద భారీగా సిబ్బందిని మోహరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement