ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల | Arts college Degree Results released | Sakshi
Sakshi News home page

ఆర్ట్స్ కళాశాల డిగ్రీ ఫలితాలు విడుదల

Published Tue, Jun 14 2016 8:32 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

Arts college Degree Results released

వైవీయూ :  కడప నగరంలోని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) డిగ్రీ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. ఎన్. సుబ్బనరసయ్య విడుదల చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిగ్రీ ప్రథమ సంవత్సరం 68 శాతం, ద్వితీయ సంవత్సరం 70 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారన్నారు. పూర్తి ఫలితాల కోసం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ. జీసీఎంకడప.ఓఆర్‌జీ అనే వెబ్‌సైట్‌లో చూడవచ్చని తెలిపారు. అదే విధంగా డిగ్రీ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు ప్రారంభమయ్యాయన్నారు.

అడ్మిషన్‌లు పొందగోరు విద్యార్థులు కళాశాల కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కళాశాల కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఐఎల్‌ఎన్ చంద్రశేఖర్, అసిస్టెంట్ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఎస్. రామచంద్రయ్య, ఎల్‌ఎంబీ భక్షు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement