సాక్షి, కడప : సమైక్యవాదులు సింహాలై గర్జించారు. శనివారం ఆర్ట్స్ కళాశాల మైదానంలో భారీ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షలాది మంది ప్రజలు వెల్లువలా తరలివచ్చారు. కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ నేతలు అఫ్జల్‌ఖాన్, భూపేష్‌రెడ్డి, నరసింహారెడ్డి చేస్తున్న ఆమరణ దీక్షలు శనివారంతో ఆరవరోజుకు చేరుకున్నాయి.
వీరికి ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, ఆకేపాటి అమర్‌నాథరెడ్డి, జిల్లా కన్వీనర్ సురేష్‌బాబు, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. కడప నగరంలో న్యాయవాదులు, విద్యుత్ కార్మికులు, జేఏసీ, ఉపాధ్యాయ, ఆర్‌అండ్‌బీ, మున్సిపల్ కార్మికులు, న్యాయశాఖ ఉద్యోగుల రిలే దీక్షలు కొనసాగాయి. ప్రొద్దుటూరు పట్టణంలో మహిళా ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. న్యాయవాదులు, వైద్యులు కూడా రిలే దీక్షల్లో కూర్చొన్నారు. పట్టణంలో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. రాయచోటి పట్టణంలో శిబ్యాల గ్రామానికి చెందిన వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు రిలే దీక్షల్లో పాల్గొన్నారు.
వీరికి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి సంఘీభావం తెలిపారు. రాజంపేట పట్టణంలో విద్యార్థుల జేఏసీ ఆధ్వర్యంలో విష్ణువర్ధన్ నాయక్ అనే విద్యార్థి ఆమరణ దీక్ష చేపట్టారు. మైదుకూరులో న్యాయవాదులు, రిటైర్డ్ ఉపాధ్యాయులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందులలో ఉపాధ్యాయ జేఏసీ ఆద్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. పోరుమామిళ్ల, బద్వేలులో విద్యార్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. కాశినాయనలో సమైక్యాంధ్రకు మద్దతుగా రాస్తారోకో, మానవహారం చేపట్టారు. జమ్మలమడుగులో మున్సిపల్ ఉద్యోగులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. ఎర్రగుట్ల, ఆర్టీపీపీలలో రిలే దీక్షలు కొనసాగాయి.
ఆగని పోరు
Published Sun, Sep 1 2013 4:12 AM | Last Updated on Tue, May 29 2018 2:26 PM
Advertisement
Advertisement