– నేటి నుంచి ఆర్ట్స్ కళాశాల మొదటి సంవత్సరం పరీక్షలు
అనంతపురం ఎడ్యుకేషన్ : ఆర్ట్స్ కళాశాలలో తొలిసారిగా స్వయం ప్రతిపత్తి హోదాలో సొంతంగా పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్.రంగస్వామి ఓ ప్రకటనలో తెలిపారు. ఇన్నిరోజులూ ఎస్కేయూ పరిధిలో నిర్వహించిన ఈ కళాశాల శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే డిగ్రీ మొదటి సంవంత్సరం పరీక్షలు తామే నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి పరీక్షలుంటాయని వివరించారు. పరీక్షలకు 1,800 మంది విద్యార్థులు హాజరవుతారని కళాశాల కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డాక్టర్ ఎ. జానకీరామ్, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి. పద్మశ్రీ తెలిపారు.
తొలిసారి స్వయంప్రతిపత్తి హోదాలో పరీక్షలు
Published Thu, Nov 24 2016 10:42 PM | Last Updated on Wed, Sep 26 2018 3:25 PM
Advertisement
Advertisement