గాంధీనగర్: దేశంలోని యువతకు 10 లక్షల ఉద్యోగాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని మోదీ చెప్పారు. యువతకు ఇచ్చే ప్రభుత్వ ఉద్యోగాల సంఖ్య కూడా పెరుగుతుందని చెప్పారు. రాబోయే నెలల్లో జాతీయ, రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాల స్థాయిల్లో మరిన్ని ఉద్యోగ మేళాలు నిర్వహిస్తామన్నారు. గుజరాత్ ప్రభుత్వం శనివారం గాంధీనగర్‌లో ‘ఉద్యోగమేళా’ ప్రారంభం సందర్భంగా ఆయన ఈ మేరకు ఒక వీడియో సందేశం పంపించారు.
ధంతెరాస్ సందర్భంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఉద్యోగమేళాలో 75 వేల మందికి నియామక పత్రాలను అందజేసినట్లు ప్రధాని పేర్కొన్నారు. 2022లో 35 వేల ప్రభుత్వ ఉద్యోగాలను ఇవ్వాలన్న లక్ష్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా సాధించిందని చెప్పారు. ఈ మేళా సందర్భంగా గుజరాత్ పంచాయతీ సర్వీస్ బోర్డు నుంచి 5 వేల మందికి, సబ్ ఇన్‌స్పెక్టర్ రిక్రూట్‌మెంట్ బోర్డు నుంచి 8 వేల మందికి సీఎం భూపేంద్ర పటేల్ నియామక పత్రాలను అందజేశారు.
చదవండి: గుజరాత్‌లో పంజాబ్ ఫార్ములాను ఫాలో అవుతున్న కేజ్రీవాల్..
Comments
Please login to add a commentAdd a comment