టీడీపీ జాబ్‌మేళా..నిరుద్యోగుల గోల
-
జాబ్‌మేళా పేరుతో టీడీపీ నేతల ప్రచారం
-
వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కలరింగ్
-
నిజమేనని నమ్మిన నిరుద్యోగులు
-
కాల్‌లెటర్ తీసుకుని వెళితే అవి కంపెనీలే కావు
-
అవుట్ సోర్సింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీలు మాత్రమే...
-
పిల్లలతో వెళ్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు
-
మోసపోయామని నేతలపై ఆగ్రహం
-
‘సాక్షి’ కార్యాలయానికి సాక్ష్యాలతో వచ్చిన బాధితులు
సాక్షి, రాజమహేంద్రవరం :
మెగా జాబ్ మేళా పేరుతో జిల్లా టీడీపీ నేతలు చేపట్టిన క్యాంపస్ ఇంటర్వూ్యల దగా బట్టబయలైంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతకు ఏదో మేలు చేస్తున్నట్లు, వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచార ఆర్భాటం చేపట్టారు. ఆ మేళాలకు ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నట్లు బ్రోచర్లు విడుదల చేసి మీడియా సమావేశాలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరుద్యోగులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పత్రాలు అందజేస్తున్నారు. అదంతా నిజమనుకొని ఎంతో సంతోషంతో కంపెనీలో చేరడానికి వెళ్లిన యువతీ యువకులకు, వారి వెంట వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు నిర్వహించిన జాబ్ మేళాలు కంగుతినిపించాయి. ఉద్యోగం ఇచ్చామని చెప్పిన కంపెనీలు అక్కడ లేకపోగా, ఉన్న ఒకటి రెండు కంపెనీలు చిన్న గదిలో... ఒక కంప్యూటర్ పెట్టుకుని నడుస్తున్నాయి. ఆ తతంగమంతా చూసిన యువత, తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమైంది. ఎంతో కష్ట పడి చదివించిన తమ కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు తాము మోసపోయమన్న బాధతో ఊరుకాని ఊరులో కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రుల చేతుల మీదుగా పత్రాలు పొంది కంపెనీలో చేరడానికి వెళ్లిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించి తిరిగి నగరానికి చేరుకున్నారు. గురువారం ‘సాక్షి’ కార్యాలయం వద్దకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు.
పండగ పూట పయనం...
రాజమహేంద్రవరం నగరానికి చెందిన వి.బి.ఎ¯ŒS.తేజ గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ట్రస్ట్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 16,17న రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ఉద్యోగం వచ్చిందని మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు ఆఫర్ లెటర్ ఇచ్చారు. అది తీసుకుని సంక్రాంతి కనుమ పండుగ రోజు హైదరాబాద్ వెళ్లాడు. 18న రిపోర్టింగ్ చేయాలని చెప్పడంతో 15వ తేదీ రద్దీ తక్కువగా ఉంటుందని తల్లిదండ్రులను ఒప్పించి మరీ వెళ్లాడు. 16 ఉదయం ఎంతో ఉత్సాహంతో కంపెనీకి వెళ్లాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయానికి వెళ్లిన తేజకు అసలు విషయం బోధపడింది. అది కంపెనీయే కాదని, అదొక కన్సల్టెన్సీ సంస్థ అని గుర్తించాడు. అయినా 18వ తేదీన వెళ్లాడు. ఇది రిపోర్టింగ్ తేదీ మాత్రమేనని చెప్పిన అక్కడివారు మరో రెండు వారాల్లో ఎçప్పుడు చేరేది మెయిల్ చేస్తామని పంపించేశారు. ఇదే విషయం కాకినాడ కలెక్టరేట్‌లో ఉన్న వికాస కార్యాలయం మేనేజర్‌కు ఫో¯ŒS చేసి చెప్పగా జాబ్ మేళా నిర్వíßంచడమే తమ పని అని మిగతా విషయాలు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక తేజ బుధవారం తిరిగి రాజమహేంద్రవరం
చేరుకున్నాడు.