mosam
-
టీడీపీ జాబ్‌మేళా..నిరుద్యోగుల గోల
జాబ్‌మేళా పేరుతో టీడీపీ నేతల ప్రచారం వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కలరింగ్ నిజమేనని నమ్మిన నిరుద్యోగులు కాల్‌లెటర్ తీసుకుని వెళితే అవి కంపెనీలే కావు అవుట్ సోర్సింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీలు మాత్రమే... పిల్లలతో వెళ్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు మోసపోయామని నేతలపై ఆగ్రహం ‘సాక్షి’ కార్యాలయానికి సాక్ష్యాలతో వచ్చిన బాధితులు సాక్షి, రాజమహేంద్రవరం : మెగా జాబ్ మేళా పేరుతో జిల్లా టీడీపీ నేతలు చేపట్టిన క్యాంపస్ ఇంటర్వూ్యల దగా బట్టబయలైంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతకు ఏదో మేలు చేస్తున్నట్లు, వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచార ఆర్భాటం చేపట్టారు. ఆ మేళాలకు ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నట్లు బ్రోచర్లు విడుదల చేసి మీడియా సమావేశాలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరుద్యోగులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పత్రాలు అందజేస్తున్నారు. అదంతా నిజమనుకొని ఎంతో సంతోషంతో కంపెనీలో చేరడానికి వెళ్లిన యువతీ యువకులకు, వారి వెంట వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు నిర్వహించిన జాబ్ మేళాలు కంగుతినిపించాయి. ఉద్యోగం ఇచ్చామని చెప్పిన కంపెనీలు అక్కడ లేకపోగా, ఉన్న ఒకటి రెండు కంపెనీలు చిన్న గదిలో... ఒక కంప్యూటర్ పెట్టుకుని నడుస్తున్నాయి. ఆ తతంగమంతా చూసిన యువత, తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమైంది. ఎంతో కష్ట పడి చదివించిన తమ కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు తాము మోసపోయమన్న బాధతో ఊరుకాని ఊరులో కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రుల చేతుల మీదుగా పత్రాలు పొంది కంపెనీలో చేరడానికి వెళ్లిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించి తిరిగి నగరానికి చేరుకున్నారు. గురువారం ‘సాక్షి’ కార్యాలయం వద్దకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పండగ పూట పయనం... రాజమహేంద్రవరం నగరానికి చెందిన వి.బి.ఎ¯ŒS.తేజ గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ట్రస్ట్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 16,17న రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ఉద్యోగం వచ్చిందని మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు ఆఫర్ లెటర్ ఇచ్చారు. అది తీసుకుని సంక్రాంతి కనుమ పండుగ రోజు హైదరాబాద్ వెళ్లాడు. 18న రిపోర్టింగ్ చేయాలని చెప్పడంతో 15వ తేదీ రద్దీ తక్కువగా ఉంటుందని తల్లిదండ్రులను ఒప్పించి మరీ వెళ్లాడు. 16 ఉదయం ఎంతో ఉత్సాహంతో కంపెనీకి వెళ్లాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయానికి వెళ్లిన తేజకు అసలు విషయం బోధపడింది. అది కంపెనీయే కాదని, అదొక కన్సల్టెన్సీ సంస్థ అని గుర్తించాడు. అయినా 18వ తేదీన వెళ్లాడు. ఇది రిపోర్టింగ్ తేదీ మాత్రమేనని చెప్పిన అక్కడివారు మరో రెండు వారాల్లో ఎçప్పుడు చేరేది మెయిల్ చేస్తామని పంపించేశారు. ఇదే విషయం కాకినాడ కలెక్టరేట్లో ఉన్న వికాస కార్యాలయం మేనేజర్‌కు ఫో¯ŒS చేసి చెప్పగా జాబ్ మేళా నిర్వíßంచడమే తమ పని అని మిగతా విషయాలు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక తేజ బుధవారం తిరిగి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. -
వజ్రాల పేరిట ఘరానా మోసం
కళ్లలో కారం కొట్టి రూ.15 లక్షలు చోరీ బాధితులు కృష్ణాజిల్లా వాసులు నిందితుల్లో ఒకరు అల్లవరం వాసిగా గుర్తింపు మామిడికుదురు : లక్షల విలువ చేసే వజ్రాలు అతి తక్కువ మొత్తానికి మీ సొంతం అవుతాయంటూ రియల్ ఎస్టేట్ వ్యాపారుల కళ్లల్లో కారం కొట్టి రూ.15 లక్షలతో ఉడాయించిన సంఘటన మండల పరిధిలోని కొమరాడ గ్రామంలో జరిగింది. బాధితుడు విజయవాడకు చెందిన మేదరమట్ల శ్రీధర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నగరం పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజయవాడకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి మేదరమట్ల శ్రీధర్ తన సోదరుడు గంటా రాజేష్, స్నేహితుడు ఎలీషాలకు పది రోజుల క్రితం కృష్ణా జిల్లా తిరువూరుకు చెందిన పాస్టర్ ఎంఎస్ రాజుతో పరిచయం ఏర్పడింది. అతను అమలాపురానికి చెందిన తన స్నేహితుని వద్ద రూ.40 లక్షల విలువ చేసే నాలుగు వజ్రాలు ఉన్నాయని, అవి కేవలం రూ.15 లక్షలకే మన వశమవుతాయని నమ్మించాడు. దీంతో అన్నదమ్ములిద్దరూ స్నేహితుడు రాజును ముందువెళ్లి వజ్రాలు చూడమని, వెనుక తాము వస్తామని బుధవారం రాత్రి అమలాపురం పంపారు. వజ్రాలు తాను చూశానని, డబ్బు తీసుకుని రావడమే తరువాయన్న రాజు సూచన మేరకు గురువారం విజయవాడ నుంచి వారు ముగ్గురూ కారులో అమలాపురం వచ్చారు. ఇక్కడ జనం రద్దీ ఎక్కువగా ఉంది. ఇక్కడ ఈ డీల్ అంత కరెక్టు కాదు పాశర్లపూడి రేవులో మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ డబ్బు తీసుకుని వజ్రాలు ఇస్తామని చెప్పడంతో అక్కడి నుంచి బాధితులు మధ్యాహ్నం పాశర్లపూడి రేవు దగ్గరకు వచ్చారు. తీరా ఇక్కడ వచ్చాకా ఇక్కడ కూడా పరిస్థితులు అనుకూలంగా లేవని మామిడికుదురు వెళ్దామని చెప్పడంతో ఇక్కడకు వచ్చారు. ఇక్కడకు సమీపంలోని కొమరాడలో వజ్రాలు ఇస్తామని చెప్పి అక్కడకు వెళ్లాకా కారు వెనుక మోటార్ సైకిళ్లపై వచ్చిన పాస్టర్ రాజుతో సహా ముగ్గురు వ్యక్తులు గంటా రాజేష్‌ను ఎక్కించుకుని మళ్లీ వచ్చి మిమ్మల్ని ఇద్దరినీ తీసుకు వెళ్తామని చెప్పి వెళ్లారు. పొలాల్లో రాజేష్‌తో పాటు పాస్టర్ రాజు కళ్లలో కారం కొట్టిన నిందితులు రూ.15 లక్షలు తీసుకుని పరారయ్యారు. జరిగిన విషయాన్ని బాధితులు కారులో వేచి ఉన్న మేదరమట్ల శ్రీధర్, ఎలీషాలకు చెప్పడంతో వారు లబోదిబోమన్నారు. నగరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్సై జి.వెంకటేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రధాన నిందితుడు అల్లవరానికి చెందిన పి.రాజేష్‌గా గుర్తించి కేసు దర్యాప్తు చేపట్టారు. -
ఇంటి వద్ద కూర్చోబెట్టి.. హైటెక్ మోసం
నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చంటూ ఆశ పెట్టిన సంస్థ ∙బోర్డు తిప్పేసిన ‘ఆపిల్ ఔట్ సోర్సింగ్’! కంబాలచెరువు (రాజమõß ంద్రవరం) : ‘ఎలాంటి ఖర్చు లేకుండా ఇంటి వద్దే ఉంటూ నెలకు రూ.30 వేలు సంపాదించవచ్చు..’ ఇలాంటి ప్రకటన ఎవరికైనా ఇట్టే ఆకట్టుకుంటోంది. అలాగే ఆశపడిన అనేక మంది సొమ్ము పోగొట్టుకుని, ఇప్పుడు గగ్గోలు పెడుతున్నారు. ఇంటి వద్ద కంప్యూటర్ ద్వారా వారు చెప్పినట్టు చేస్తే.. ఒక్క రూపాయి రాకపోగా, ఇంటర్నెట్ కనెక్షన్‌కు తడిసిమోపెడైంది. రాజమహేంద్రవరంలో ‘ఆపిల్ ఔట్సోర్సింగ్’ సంస్థ నిర్వాకంతో బాధితులు లబోదిబోమంటున్నారు. బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తన ఫేస్బుక్ అకౌంట్లో శ్రీవల్లి అనే యువతి ఓ ఆకర్షిణీయమైన ప్రకటన చూసింది. ఇంటి వద్ద నుంచే నెలకు వేలకు వేల రూపాయలు సంపాదించవచ్చనేది దాని సారాంశం. ఆమె అందులో ఫోన్ నంబర్‌కు ఫోన్ చేసింది. ఓ వ్యక్తి ఆమెతో మాట్లాడి, రాజమహేంద్రవరంలోని దానవాయిపేటలో ఉన్న ఆపిల్ ఔట్సోర్సింగ్ కార్యాలయానికి వెళ్లమన్నాడు. అక్కడ నాయుడు అనే వ్యక్తి ఆమెను కలిశాడు. తమ వద్ద నాలుగు రకాల ప్లాన్లు ఉన్నాయని, ఎస్ఎంఎస్లు చేయడం, రోజుకు 500 వీడియోలు వీక్షించడం, రోజంతా నెట్ ఆ¯Œæలో ఉంచడం వంటి ప్లాన్లు చెప్పారు. వాటికి రూ.5,500 నుంచి రూ.10 వేలు చెల్లించాల్సి ఉందన్నాడు. ముందుగా ఫీజు చెల్లించి రిజిస్టర్ చేసుకోవాలని పేర్కొన్నాడు. నగలు తాకట్టు పెట్టి.. మరుసటి రోజు శ్రీవల్లి తన వద్ద ఉన్న బంగారు చెవిదిద్దులు తాకట్టుపెట్టి, రూ.5,500 చెల్లించి, ఆ సంస్థలో రిజిస్టర్ అయింది. ఆమెకు ధ్రువపత్రంతో పాటు కంప్యూటర్ ఐడీ ఇచ్చారు. ఇంటర్నెట్ కనెక్షన్ కోసం ఆమె మరో రూ.వెయ్యి అప్పు చేయాల్సి వచ్చింది. రోజుకు 500 వీడియోలు చూసే ప్లాన్ చేపట్టి, కొద్దిరోజులకు అస్వస్థతకు గురైంది. రెండు నెలలు గడిచినా.. ఆమెకు ఒక్క పైసా కూడా రాలేదు. దీంతో సంస్థ కార్యాలయానికి వెళితే, ఆపిల్ ఔట్సోర్సింగ్ షిఫ్ట్ టు హైదరాబాద్ అనే బోర్డు కనిపించడంతో అవాక్కైంది. దీనిపై ఆరాతీస్తే.. నాయుడు అనే వ్యక్తి ఆఫీసు మార్చి వెళ్లిపోయాడని తెలిసింది. అదే సమయంలో మరికొందరు బాధితులు అక్కడకు చేరుకుని, విషయం తెలిసి బావురుమన్నారు. ఈ విషయాన్ని ‘సాక్షి’కి వివరించారు. అక్కడున్న సిబ్బందిని ప్రశ్నించగా, పొంతన లేని సమాధానాలు చెప్పారు. నాయుడు అనే వ్యక్తి తమకూ జీతాలు ఇవ్వలేదని తెలిపారు. ప్రస్తుతం ఆఫీసు నిర్వహిస్తున్న రాజు అనే వ్యక్తి.. తాను ఎనిమిది ఐడీలకు సొమ్ము చెల్లించానని పేర్కొన్నాడు. బాధితులు ఫిర్యాదు చేస్తే చర్యలు సంస్థ బోర్డు తిప్పేయడంపై అర్బన్‌జిల్లా ఎస్పీ రాజకుమారిని వివరణ కోరగా, ఈ సంఘటనపై ఆరా తీస్తామని చెప్పారు. బాధితులు ఒన్‌టౌన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చే స్తే, చర్యలు తీసుకుంటామన్నారు.