rjy
-
వనం–మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ): వనం – మనం కార్యక్రమం చిత్తశుద్ధితో నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన ఆటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో ‘వనం – మనం’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోని నిర్వహించాలని అన్నారు. అవగాహన కోసం సెమినార్లు, ర్యాలీలు నిర్వహించి పంచాయతీ వంటి ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 125 రోజులలో 25 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా చేపట్టామని తెలిపారు. మారేడుమిల్లి, కోరంగిలలో ఎకో– టూరిజం అభివృద్ధి చేయడానికి అధికారులకు సూచించామని తెలిపారు. వైజాగ్, నెల్లూరు జిల్లాల్లో కూడా అభివృద్ధి చేస్తామనన్నారు. వృక్ష సంపదను కాపాడుకోవడానికి అటవీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనిఅటవీ శాఖ అధికారులకు ఆదేశించామని పేర్కొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అటవీ శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలో సిబ్బంది కొరత తీసుస్తామన్నారు. ఎర్ర చందనం అమ్మకాలకు 2 వేల మెట్రిక్ టన్నులు వేలానికి అనుమతి లభించిందని, దీన్ని బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. లాలా చెరువు ప్రాంతంలోని నగరవనంలో మంత్రి శిద్దా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అవీశాఖ సీసీఎఫ్ ఎం. రవికుమార్, ఆర్.ఎం ఏపీ ఎఫ్డీసీ భరత్ కుమార్, ఏపీఎఫ్ అకాడమీ డైరెక్టర్ లోహిదాసుడు, డీఎఫ్ఓ వైల్డ్‌లైఫ్ ప్రభాకరరావు, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 25 కోట్ల మొక్కలు లాలాచెరువు (రాజానగరం) : రాష్ట్రంలో హరితవనాన్ని అభివృద్ధి చేసి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవిధంగా నిర్వహిస్తున్న వనం – మనం కార్యక్రమంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. లాలాచెరువులోని మహా పుష్కరవనంలో బుధవారం మొక్కను నాటిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తొలిరోజునే కోటి మొక్కలను నాటారన్నారు. మంత్రి వెంట అటవీ శాఖ అధికారులున్నారు. -
‘గుడా’ చైర్మన్‌గా గన్ని కృష్ణ
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, రాజమహేంద్రవరం : కాకినాడ, రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలు, చుట్టుపక్కల మున్సిపాలిటీలు, గ్రామాలను కలుపుతూ ఏర్పాటు చేసిన గోదావరి అర్బన్ డెవలెప్మెంట్ అథారిటీ (గుడా) చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరానికి చెందిన టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు శనివారం ప్రిన్సిపల్ సెక్రటరీ కరికాళ వలవన్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు గుడాకు తాత్కాలిక చైర్మన్‌గా జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా తాత్కాలిక వైస్ చైర్మన్‌గా రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కమిషన్ వి.విజయరామరాజు అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇకపై గుడాకు పూర్తి స్థాయిలో వైస్ చైర్మన్, పాలక మండలి సభ్యులను నియమించాల్సి ఉంది. అలాగే గుడా ప్రధాన కార్యాలయాన్ని కాకినాడలో ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో వైఎస్సార్సీపీ నగరపాలక సంస్థ ఫ్లోర్‌లీడర్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశాలు కార్యాలయాన్ని రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు బలంగా వినిపించాయి. అదేవిధంగా షర్మిలారెడ్డి చొరవతో ఈ నెల 15న జరిగిన కౌన్సిల్ సమావేశం అజెండాలో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయాలనే అంశాన్ని చేర్చారు. కౌన్సిల్ కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. సిటీ, రూరల్ ఎమ్మెల్యేలు ఆకుల సత్యనారాయణ, గోరంట్ల బుచ్చయ్య చౌదరిలు కూడా మద్దతు లేఖలు ఇచ్చారు. రాజమహేంద్రవరం నగరానికే చెందిన గన్ని కృష్ణ గుడా చైర్మన్‌గా ఎంపికవడంతో కార్యాలయం నగరంలో ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటారా? లేదా? అన్న విషయం తెలియాల్సి ఉంది. -
నేరాలకు అడ్డా
రాజమహేంద్రవరం మెయిన్‌రోడ్డులో పెరుగుతున్న క్రైం చెలరేగిపోతున్న జేబుదొంగలు, దోపిడీ ముఠాలు వరుస నేరాలతో బెంబేలెత్తుతున్న వ్యాపారులు సాక్షి, రాజమహేంద్రవరం : ఉభయ గోదావరి జిల్లాలకు వాణిజ్య రాజధానిగా గుర్తింపు పొందిన రాజమహేంద్రవరం మెయిన్ రోడ్డులోని ఓ ప్రాంతం దొంగల ముఠాల కు, జేబుదొంగలకు అడ్డాగా మారింది. ఇక్కడి నల్లమం దు సందు ఎంట్రన్, రోజ్మిల్క్ సెంటర్లలో మాటు వేసిన దొంగలు.. అదును చిక్కినప్పుడు ప్రజలను, వ్యా పారులను దోచుకుంటున్నారు. వ్యాపారులు, కొనుగోలుదార్లు, పోలీసులు తేరుకొనేలోపే దొంగలు పని పూర్తి చేసుకొని పరారవుతున్నారు. మెయిన్ రోడ్డులోని నల్లమందు సందు పరిసరాల్లో అధిక సంఖ్యలో బంగా రు దుకాణాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలోని గంటాల మ్మ గుడి వీధిలోని ఓ బంగారు నగలకార్ఖానాలో గత గురువారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఓ దోపిడీ ముఠా రెచ్చిపోయింది. బంగారు నగలు తయారు చేసే ముసుగులోనే బెంగాల్‌కు చెందిన ఆ ముఠా దోపిడీకి పాల్పడడం, అందుకోసం తుపాకులు, కత్తులు, ఇతర మారణాయుధాలు ఉపయోగించడం కలకలం రేపింది. దొంగలను పట్టుకునేందుకు ఆయా దుకాణాల్లో పని చేసే యువకులు యత్నించడంతో దోపిడీ ముఠాకు చెందిన ఓ వ్యక్తికి కత్తి గాయం కూడా అయ్యింది. లేదంటే పట్టుకునేందుకు యత్నించిన యువకుల ప్రాణాలకే ప్రమాదమొచ్చేది. ఈ ఘనటతో మరోసారి మెయిన్ రోడ్డులోని బంగారు, ఇతర వ్యాపారులు బెంబేలెత్తుతున్నారు. వందలాదిగా దుకాణాలు, కార్ఖానాలు మెయిన్ రోడ్డులోని ఇసుకవీధి, నల్లమందు సందు, గుండువారి వీధి, చందా సత్రం వీధి, గంటాలమ్మ గుడి వీధి ప్రాంతాల్లో దాదాపు 200 బంగారు దుకాణాలున్నాయి. ఇవి కాకుండా బంగారు నగలు తయారు చేసే కార్ఖానాలు దాదాపు 500 ఉన్నాయి. వీటిలో బంగారు నగలు తయారు చేసేవారు (గోల్డ్‌స్మిత్‌లు) దాదాపు 10 వేల మంది ఉన్నారు. ఇందులో పశ్చిమ బెంగాల్‌కు చెందిన గోల్డ్ స్మిత్‌లు దాదాపు 3 వేల మంది ఉన్నారు. పశ్చిమ బెంగాల్ గోల్డ్‌స్మిత్‌ల మాటున ఆ రాష్ట్రానికి చెందిన కొందరు నేరగాళ్లు ఇక్కడ కొద్ది రోజులు నమ్మకంగా పని చేస్తున్నారు. వారిని నమ్మి స్థానిక బంగారు దుకాణ యజమానులు ముడి బంగారం ఇచ్చి నగలు చేయించుకుంటున్నారు. తరుగు, కూలి చెల్లిస్తున్నారు. పెద్ద మొత్తంలో బంగారం వచ్చినప్పుడు కార్ఖానాలో పని చేస్తున్న పశ్చిమ బెంగాల్ నేరగాళ్లు ఆ బంగారంతో పరారవుతున్నారు. ఫలితంగా ఉపాధి కోసం వచ్చి ఇక్కడ నిజాయితీగా పని చేసుకుంటున్న ఆ రాష్ట్ర గోల్డ్‌స్మిత్‌లు ఇబ్బందిపడుతున్నారు. దోపిడీ దొంగలకు ఇక్కడ పెద్ద వ్యాపారాలు చేస్తున్న కొందరు పశ్చిమ బెంగాల్ వ్యాపారులు, స్థానిక వ్యాపారులు కూడా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. గతంలోనూ.. ఆరు నెలల కిందట దేవ్ అనే పశ్చిమ బెంగాల్ గోల్డ్ స్మిత్ ఏడు కేజీల బంగారంతో పరారయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. కానీ స్థానికంగా పెద్ద వ్యాపారిగా పేరున్న ఓ పశ్చిమ బెంగాల్ వ్యాపారి సోదరుడు తాము రాజీ చేస్తామని చెప్పి అతడిని విడిపించుకుపోయాడు. వ్యాపారులు కూడా తమ సొమ్ము వస్తే చాలనుకుని రాజీకి సిద్ధమయ్యారు. ఏడు కేజీల బంగారంలో 5 శాతం మాత్రమే రికవరీ అయ్యింది. ఆ కేసు ఇప్పటివరకూ తేలలేదు. గతంలో కూడా ఇలాగే అనేక ఘటనలు జరిగాయి. కొంతమంది స్థానిక గోల్డ్‌స్మిత్‌లు కూడా ఇలాగే కొద్దిపాటి బంగారంతో పరారైన ఘటనలున్నాయని బంగారు వ్యాపారులు చెబుతున్నారు. అయితే వారిలో కొంతమంది తిరిగి వచ్చి ఎవరి బంగారం వారికి ఇచ్చి యథావిధిగా పని చేసుకుంటున్నారు. మరికొంత మంది పరారీలోనే ఉన్నారు. అర్ధాంతరంగా ఆగిన సీసీ కెమెరాల ఏర్పాటు నల్లమందు సందు ప్రారంభం, రోజ్మిల్క్ సెంటర్, బంగారు నగల దుకాణాల కూడలిలో ఇతర నేరాలు కూడా అధికంగా ఉన్నాయి. మెయిన్ రోడ్డు ఒకటి, రెండు, మూడు పోలీస్ స్టేషన్ల పరిధిలోకి వస్తోంది. ఈ మూడు స్టేషన్లలో నెలకు దాదాపు 15 జేబు దొంగతనాలు, చైన్ స్నాచింగ్ కేసులు నమోదవుతున్నాయి. నేరాలను అదుపు చేసేందుకు, నేరగాళ్లను గుర్తించేందుకు ఈ కూడలిలో పోలీస్ కంట్రోల్ రూమ్, నాలుగువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని 2015లో అప్పటి సెంట్రల్ డీఎస్పీ నామాల బాబ్జీ భావించారు. ఈ మేరకు బంగారం వ్యాపారులతో చర్చించారు. వారు కూడా ఆర్థిక సహాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆ భవనం శ్లాబ్ దశలో ఆగిపోయింది. ఈలోగా బాబ్జీ బదిలీపై వెళ్లిపోయారు. ఆ చిన్నపాటి భవనం ట్రాఫిక్‌కు అడ్డంగా ఉందని భావించిన నగరపాలక సంస్థ దానిని తొలగించింది. దీంతో ఆ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. -
పింఛను డ్రామా
నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు 50 డివిజన్లకు 40 చొప్పున కేటాయింపు ప్రతిపక్ష డివిజన్లలో 10 చొప్పున కోత మిగిలిన 30లో సగం జన్మభూమి కమిటీలకు రూరల్ 8 డివిజన్లకు కూడా ఇందులోనే... పింఛన్ల కేటాయింపులో పారదర్శకలేమి పేదలు, ధనవంతుల డివిజన్లకు సమానంగా కేటాయింపు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో పింఛ¯ŒS రాజకీయం హాట్ టాపిక్‌గా మారింది. నియోజకవర్గానికి ఇచ్చిన పింఛన్లను 50 డివిజన్లకు పంపిణీ చేయడంతో కొందరు కార్పొరేటర్లు పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్ పరిధిలోని 8 డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి వచ్చిన పింఛన్లను పంపిణీ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అర్హుల సంఖ్యతో సంబంధం లేకుండా పేద, ధనిక వర్గాల ప్రజలున్న డివిజన్లకు సమానంగా పింఛన్లను కేటాయించారు. ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్ ప్రజాప్రతినిధిగా ఉన్న డివిజన్లకు ఇచ్చిన పింఛన్లలో అధికారికంగా కోత విధిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 50 డివిజన్లు న్నాయి. ఇందులో రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గ పరిధిలో 8 డివిజన్లు కలిశాయి. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి సభల అనంతరం ప్రభుత్వం నియోజకవర్గానికి 2 వేల పింఛన్ల చొప్పున కేటాయించింది. అర్బన్, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గానికి సమానంగా పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగర, రూరల్ నియోజకవర్గాలకు కూడా రెండు వేల చొప్పున పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గం చొప్పున కేటాయించిన పింఛన్లను నగరపాలక సంస్థ పరిధిని ప్రమాణికంగా తీసుకుని 50 డివిజన్లకు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి కేటాయించిన పింఛన్లను పంపిణీ చేశారు. రూరల్ నియోజకవర్గానికి వచ్చిన రెండువేల పించన్లకు అదనంగా సిటీ పరిధిలోని పింఛన్లు 8 డివిజన్లకు 320 కేటాయించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మురికివాడలు, పేదలు ఎక్కువగా నివశించే డివిజన్లున్నాయి. నగర పరిధిలో అర్హులైన వారు వేల మంది ఉన్నారు. అయితే నగరపాలక సంస్థలో హవా కొనసాగిస్తున్న ప్రజాప్రతినిధి సిటీకి వచ్చిన పింఛన్లలో 320 తన నియోజకవర్గానికి తీసుకుపోవడంతో సిటీ పరిధిలోని వేలాది మంది వృద్ధులు, వికలాంగులకు ఎదురు చూపులే మిగిలాయి. అందరికీ సమానంగా ఎలా ఇస్తారు? అన్ని డివిజన్లకు 40 చొప్పున పింఛన్లు కేటాయించడాన్ని కొందరు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో 3, 5, 11, 12, 22, 24 డివిజన్లలోని ప్రజలు ఆర్థికంగా బలమైనవారు. ఈ డివిజన్లలో అర్హుల సంఖ్య మంజూరైన 40 పింఛన్ల కన్నా తక్కువగా ఉంది. ఉదాహరణకు 12వ డివిజ¯ŒSలో అర్హులైన వారి దరఖాస్తులు 37 ఆ¯ŒSలై¯ŒS అవగా ఆ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లు కేటాయించారు. 5వ డివిజ¯ŒSలో 32 దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS అవగా 40 కేటాయించారు. ఇలా దాదాపు 10 డివిజన్లలో అర్హుల కన్నా ఎక్కువ పింఛన్లు కేటాయించారు. ఇక 31, 41, 46, 49 డివిజన్లలో 90 శాతం పేదలున్నారు. ఇక్కడ అర్హుల సంఖ్య కూడా వందల్లో ఉంది. 31వ డివిజ¯ŒSలో 300లకు పైగా దరఖాస్తులు రాగా 102 మాత్రమే ఆ¯ŒSలై¯ŒS అయ్యాయి. ఇది ప్రతిపక్ష కార్పొరేటర్ డివిజ¯ŒS కావడంతో 30 ఫించన్లే కేటాయించారు. అందులోనూ సగం జన్మభూమి కమిటీలకు ఇచ్చారు. 41వ డివిజ¯ŒSలో 96 మంది అర్హుల దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS కాగా పేదలు ఎక్కువగా ఉన్న ఈ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లనే కేటాయించారు. ప్రతిపక్ష డివిజన్ల కేటాయింపుల్లో కోత... టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తు న్న డివిజన్లకు 40 చొప్పున కేటాయించగా ప్రతి పక్ష, కొందరు స్వతంత్ర కార్పొరేటర్ల డివిజన్లకు మా త్రం 30 పింఛన్లే కేటాయించారు. ఆ 30లో కూడా సగం ఆ డి విజ¯ŒSలో టీడీపీ ప్రభుత్వం వేసిన జన్మభూమి కమిటీలకు కేటాయిం చారు. ఆ 15 పింఛన్ల లబ్ధిదారులను జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తా యి. దీంతో కొందరు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆందోళనకు సిద్ధమవతున్నారు. ప్రతిపక్షం, స్వతంత్ర కార్పొరేటర్లలో పలుకుబడి కలిగిన వారు మాత్రం 40 పింఛన్లు సాధించుకోగలిగారు. వారు మాత్రం కిమ్మనడం లేదు. కొందరికి ‘కృతజ్ఞత’ పింఛన్లు.. ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు కేటాయించిన పింఛన్లలో 10 చొప్పున కోత విధించిన ‘పెద్ద మనుషులు’ వాటిని తమ అనునూయులకు బహుమతిగా, తమ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసిన వారికి ‘కృతజ్ఞత’గా ఇచ్చారు. ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో తమ అనుచరుడి భూ కబ్జాకు సహకరించిన కార్పొరేటర్లకు రెట్టింపు పింఛన్లు కానుకగా ఉచ్చారు. అదేవిధంగా సీనియర్ నేత అనుంగు అనుచరులు కూడా పింఛన్ల కేటయింపుల్లో పై‘చేయి’ సాధించారు. -
మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
రాజమహేంద్రవరం క్రైం : మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ జి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతి«థులుగా వచ్చిన రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ 28 వ రోడ్ భద్రత వారోత్సవాలు మంగళవారం నుంచి 30 వ తేది వరకూ జరుగుతాయన్నారు. ప్రతీ రోజు రక్తదానం శిబిరాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన డ్రైవర్లకు చేయూత అందించడం జరుగుతుందన్నారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్గించడం ద్వారానే ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అన్నారు. డిఫ్యూటీ సీఎంఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల శాతం తక్కువ అన్నారు. ఎస్పీ బి.రాజ కుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండడం వలన ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యులు ఫో¯ŒS చేసి విసిగిస్తుంటారని ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాలలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. సెల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డీఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐలు సిహెచ్ సూరిబాబు, బాజీలాల్, అర్టీసీ డ్రైవర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చోరీలకు పాల్పడుతున్న ఏడుగురి అరెస్ట్
రూ.3.84 లక్షల విలువైన 128 గ్రాముల బంగారు నగలు స్వాధీనం రాజమహేంద్రవరం క్రైం : వ్యసనాలకు బానిసలైన యువకులు మహిళల మెడలో బంగారు నగలు చోరీ చేస్తూ పట్టుబడ్డారు. బుధవారం రాజమహేంద్రవరం త్రీటౌ¯ŒS పోలీస్ స్టేష¯ŒSలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ కె.శ్రీరామకోటేశ్వరరావు వివరాలు వెల్లడించారు. ఏడుగురు యువకులు ముఠాగా ఏర్పడి మహిళల మేడలో నగలు చోరీలు చేస్తూ వాటిని అమ్మగా వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తు విలాసంగా గడుపుతున్నారన్నారు. మంగళవారం సాయంత్రం 4.30 సమయంలో కోరుకొండ రోడ్డులోని ముత్తుట్ ఫైనా¯Œ్స కంపెనీ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న యువకుల సమాచారం రావడంతో త్రీటౌ¯ŒS ఎస్సై ఎం.వెంకటేశ్వరావు, హెడ్ కానిస్టేబుల్ డీవీ భాస్కరరావు, కానిస్టేబుళ్లు అక్కడకు వెళ్లి యువకులను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. పిఠాపురానికి చెందిన అనుపోజు శంకర్ శాంతి స్వరూప్ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం పీ అండ్ టీ కాలనీకి చెందిన కాకర్ల శ్రీనివాసరెడ్డి, మరో ఐదుగురు ముఠాగా ఏర్పడి మహిళల మెడల నుంచి బంగారు పుస్తెలతాళ్లు, మంగళ సూత్రాలు చోరీలు చేసి పరారవుతున్నారని తెలిపారు. నిందితుల నుంచి 6 బంగారు మంగళ సూత్రాల తాడులను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీటి బరువు 128 గ్రాములు ఉంటుందని తెలిపారు. విలువ రూ 3.84 లక్షలు ఉంటుందని తెలిపారు. నిందితులను రిమాండ్ నిమిత్తం తరలించారు. -
టీడీపీ జాబ్‌మేళా..నిరుద్యోగుల గోల
జాబ్‌మేళా పేరుతో టీడీపీ నేతల ప్రచారం వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు కలరింగ్ నిజమేనని నమ్మిన నిరుద్యోగులు కాల్‌లెటర్ తీసుకుని వెళితే అవి కంపెనీలే కావు అవుట్ సోర్సింగ్, కన్సల్టెన్సీ ఏజెన్సీలు మాత్రమే... పిల్లలతో వెళ్లిన తల్లిదండ్రుల కన్నీళ్లు మోసపోయామని నేతలపై ఆగ్రహం ‘సాక్షి’ కార్యాలయానికి సాక్ష్యాలతో వచ్చిన బాధితులు సాక్షి, రాజమహేంద్రవరం : మెగా జాబ్ మేళా పేరుతో జిల్లా టీడీపీ నేతలు చేపట్టిన క్యాంపస్ ఇంటర్వూ్యల దగా బట్టబయలైంది. ఇంటికో ఉద్యోగం ఇస్తామని, లేదంటే నెలకు రూ.2 వేల నిరుద్యోగ భృతి అందజేస్తామని చెప్పిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీని అమలు చేయకుండా నిలువునా మోసం చేశారు. దాన్ని కప్పిపుచ్చుకునేందుకు యువతకు ఏదో మేలు చేస్తున్నట్లు, వేల ఉద్యోగాలు కల్పిస్తున్నట్లు ప్రచార ఆర్భాటం చేపట్టారు. ఆ మేళాలకు ప్రఖ్యాత కంపెనీలు వస్తున్నట్లు బ్రోచర్లు విడుదల చేసి మీడియా సమావేశాలు పెట్టి స్థానిక ఎమ్మెల్యేలు విస్తృత ప్రచారం చేసుకుంటున్నారు. జాబ్‌మేళాలో ఉద్యోగాలు ఇచ్చినట్లు నిరుద్యోగులకు సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేల చేతుల మీదుగా పత్రాలు అందజేస్తున్నారు. అదంతా నిజమనుకొని ఎంతో సంతోషంతో కంపెనీలో చేరడానికి వెళ్లిన యువతీ యువకులకు, వారి వెంట వెళ్లిన తల్లిదండ్రులను టీడీపీ నేతలు నిర్వహించిన జాబ్ మేళాలు కంగుతినిపించాయి. ఉద్యోగం ఇచ్చామని చెప్పిన కంపెనీలు అక్కడ లేకపోగా, ఉన్న ఒకటి రెండు కంపెనీలు చిన్న గదిలో... ఒక కంప్యూటర్ పెట్టుకుని నడుస్తున్నాయి. ఆ తతంగమంతా చూసిన యువత, తల్లిదండ్రులకు అసలు విషయం అర్థమైంది. ఎంతో కష్ట పడి చదివించిన తమ కుమార్తెకు ఉద్యోగం వచ్చిందని ఆశపడిన ఆ తల్లిదండ్రులు తాము మోసపోయమన్న బాధతో ఊరుకాని ఊరులో కన్నీరు పెట్టుకుంటున్నారు. గత ఏడాది డిసెంబర్ 16, 17 తేదీల్లో రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో ఉద్యోగాలు వచ్చినట్లు మంత్రుల చేతుల మీదుగా పత్రాలు పొంది కంపెనీలో చేరడానికి వెళ్లిన రాజమహేంద్రవరం నగరానికి చెందిన నిరుద్యోగులు తాము మోసపోయామని గ్రహించి తిరిగి నగరానికి చేరుకున్నారు. గురువారం ‘సాక్షి’ కార్యాలయం వద్దకు వచ్చి తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పండగ పూట పయనం... రాజమహేంద్రవరం నగరానికి చెందిన వి.బి.ఎ¯ŒS.తేజ గత ఏడాది ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఎన్టీఆర్ ట్రస్ట్, వికాస సంయుక్త ఆధ్వర్యంలో గత ఏడాది డిసెంబర్ 16,17న రాజమహేంద్రవరంలో నిర్వహించిన జాబ్ మేళాలో పాల్గొన్నాడు. ఉద్యోగం వచ్చిందని మాట్రిక్స్ కంపెనీ ప్రతినిధులు ఆఫర్ లెటర్ ఇచ్చారు. అది తీసుకుని సంక్రాంతి కనుమ పండుగ రోజు హైదరాబాద్ వెళ్లాడు. 18న రిపోర్టింగ్ చేయాలని చెప్పడంతో 15వ తేదీ రద్దీ తక్కువగా ఉంటుందని తల్లిదండ్రులను ఒప్పించి మరీ వెళ్లాడు. 16 ఉదయం ఎంతో ఉత్సాహంతో కంపెనీకి వెళ్లాడు. హైదరాబాద్ మాదాపూర్‌లోని కంపెనీ కార్యాలయానికి వెళ్లిన తేజకు అసలు విషయం బోధపడింది. అది కంపెనీయే కాదని, అదొక కన్సల్టెన్సీ సంస్థ అని గుర్తించాడు. అయినా 18వ తేదీన వెళ్లాడు. ఇది రిపోర్టింగ్ తేదీ మాత్రమేనని చెప్పిన అక్కడివారు మరో రెండు వారాల్లో ఎçప్పుడు చేరేది మెయిల్ చేస్తామని పంపించేశారు. ఇదే విషయం కాకినాడ కలెక్టరేట్లో ఉన్న వికాస కార్యాలయం మేనేజర్‌కు ఫో¯ŒS చేసి చెప్పగా జాబ్ మేళా నిర్వíßంచడమే తమ పని అని మిగతా విషయాలు తమకు సంబంధం లేదని చెప్పుకొచ్చారు. దీంతో చేసేదేమీ లేక తేజ బుధవారం తిరిగి రాజమహేంద్రవరం చేరుకున్నాడు. -
బుసలు కొట్టిన రియల్ మాఫియా
మాజీ సైనికుడైన రియల్ వ్యాపారి కిడ్నాప్ కారులో తిప్పుతూ చితకబాదిన వైనం ఆస్తులు రాయించుకుని విడుదల పోలీసులకు బాధితుడి ఫిర్యాదు సాక్షి, రాజమహేంద్రవరం : రాజమహేంద్రవరంలో రియల్ మాఫియా బుసలు కొడుతోంది. విభజన అనంతరం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఒకటిగా అభివృద్ధి చెందుతున్న రాజమహేంద్రవరంలో ‘రియల్’ నేరాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో తలెత్తిన ఆర్థిక వివాదాల నేపథ్యంలో ఓ మాజీ సైనికుడిని కిడ్నాప్ చేసి, బెదిరించి ఆస్తులు రాయించుకుని, అనంతరం విడుదల చేసిన ఉదంతం కలకలం రేపుతోంది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం.. రాజమహేంద్రవరం ఏవీ అప్పారావు రోడ్డులోని జయశ్రీ అపార్ట్మెంట్లో మాజీ సైనికుడు అరసాడ శరత్‌కుమార్ కుటుంబం ఉంటోంది. భారత సైన్యంలో 22 ఏళ్ల పాటు పని చేసిన శరత్‌కుమార్ ఉద్యోగ విరమణ తర్వాత స్థిరాస్తి వ్యాపారం ప్రారంభించారు. భూముల కొనుగోలుకు సంబంధించి పలువురితో ఆర్థిక లావాదేవీలు జరిపారు. ఈ నేపథ్యంలో కొంతమంది శరత్‌కుమార్‌ను కిడ్నాప్ చేశారు. ఈ నెల 27వ తేదీ ఉదయం శరత్‌కుమార్ తన ఇంటి బయటకు వచ్చారు. అడ్రస్ కావాలంటూ ఆయన వద్దకు ఇద్దరు ఆగంతకులు వచ్చారు. ఆ వెనుకే మరో నలుగురు వచ్చి శరత్‌కుమార్‌ను బలవంతంగా ఏపీ ఏఎం 0459 ఇన్నోవా వాహనంలోకి ఎక్కించి, కిడ్నాప్ చేశారు. రాజానగరం ప్రాంతంలో తిప్పుతూ ఆస్తులు తమ పేరిట రాయాలని తీవ్రంగా కొట్టారు. ఆస్తులు రిజిస్ట్రేషని చేయకపోతే తన కొడుకును, భార్యను చంపుతామంటూ బెదిరించి రూ.3.5 కోట్ల విలువైన తన ఆస్తులను రాయించుకున్నారని శరత్‌కుమార్ తెలిపారు. ధవళేశ్వరం సర్వే నంబర్ 98/1లో 3.75 ఎకరాలు, హుకుంపేటలో 39 సెంట్లు, కాకినాడలో సర్వే నంబర్ 210/6లోని 615 గజాల భూమిని కిడ్నాపర్లు పిడింగొయ్యి రిజిస్ట్రేషని కార్యాలయంలో బలవంతంగా రిజిస్ట్రేషని చేయించుకున్నారు. అనంతరం శరత్‌కుమార్‌ను మరో వాహనంలో నగర శివారులోని శాటిలైట్ సిటీ ప్రాంతంలో కిడ్నాపర్లు వదిలేశారు. ఎస్పీకి ఫిర్యాదు శరత్‌కుమార్ కిడ్నాప్ జరిగిన గంటకు ఆయన కుమారుడు స్థానిక ప్రకాశ్ నగర్ పోలీస్ స్టేషనిలో ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అదే రోజు రాత్రి శరత్‌కుమార్ అర్బని ఎస్పీ రాజకుమారిని కలిశారు. తనను కంపెన సత్యనారాయణ, పుచ్చల సాయికిరణ్, పుచ్చల సాయి, డ్రైవర్ ఈశ్వర్లతోపాటు మరో 8 మంది కిడ్నాప్ చేశారని ఫిర్యాదు చేశారు. ప్రామిసరీ నోట్లు, తెల్లకాగితాలు, వాహనాల ట్రానిఫర్ సెట్లపై తనతో సంతకాలు పెట్టించుకున్నారని పేర్కొన్నారు. పిడింగొయ్యి రిజిస్ట్రేషని కార్యాలయంలో రూ.3.5 కోట్ల విలువైన తన ఆస్తులను రాయించుకున్నారని ఫిర్యాదు చేశారు. అర్బని ఎస్పీ ఆదేశాల మేరకు ప్రకాశ్‌నగర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆర్థిక లావాదేవీలే ఈ ఘటనకు కారణమని సీఐ ఆర్.సుబ్రమణ్యేశ్వరరావు తెలిపారు. -
మంత్రి కామినేనికి చుక్కెదురు