పింఛను డ్రామా | pention | Sakshi
Sakshi News home page

పింఛను డ్రామా

Published Thu, Jan 26 2017 12:38 AM | Last Updated on Sat, Jul 6 2019 4:04 PM

pention

 
 
  • నియోజకవర్గానికి 2 వేల పింఛన్లు 
  • 50 డివిజన్లకు 40 చొప్పున కేటాయింపు 
  • ప్రతిపక్ష డివిజన్లలో 10 చొప్పున కోత
  • మిగిలిన 30లో సగం జన్మభూమి కమిటీలకు
  • రూరల్‌ 8 డివిజన్లకు కూడా ఇందులోనే...
  • పింఛన్ల కేటాయింపులో పారదర్శకలేమి 
  • పేదలు, ధనవంతుల డివిజన్లకు సమానంగా కేటాయింపు 
 
సాక్షి, రాజమహేంద్రవరం :
రాజమహేంద్రవరంలో పింఛ¯ŒS రాజకీయం హాట్‌ టాపిక్‌గా మారింది. నియోజకవర్గానికి ఇచ్చిన పింఛన్లను 50 డివిజన్లకు పంపిణీ చేయడంతో కొందరు కార్పొరేటర్లు పాలక వర్గంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూరల్‌ పరిధిలోని 8 డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి వచ్చిన పింఛన్లను పంపిణీ చేయడాన్ని ఆక్షేపిస్తున్నారు. అర్హుల సంఖ్యతో సంబంధం లేకుండా పేద, ధనిక వర్గాల ప్రజలున్న డివిజన్లకు సమానంగా పింఛన్లను కేటాయించారు. ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్‌ ప్రజాప్రతినిధిగా ఉన్న డివిజన్లకు ఇచ్చిన పింఛన్లలో అధికారికంగా కోత విధిస్తున్నారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో 50 డివిజన్లు న్నాయి. ఇందులో రాజమహేంద్రవరం రూరల్‌ నియోజకవర్గ పరిధిలో 8 డివిజన్లు కలిశాయి. ఈ నెల మొదటి వారంలో నిర్వహించిన నాలుగో విడత జన్మభూమి సభల అనంతరం ప్రభుత్వం నియోజకవర్గానికి 2 వేల పింఛన్ల చొప్పున కేటాయించింది. అర్బన్, గ్రామీణ అనే తేడా లేకుండా ప్రతి నియోజకవర్గానికి సమానంగా పింఛన్లను మంజూరు చేసింది. ఇందులో భాగంగా రాజమహేంద్రవరం నగర, రూరల్‌ నియోజకవర్గాలకు కూడా రెండు వేల చొప్పున పింఛన్లు మంజూరయ్యాయి. నియోజకవర్గం చొప్పున కేటాయించిన పింఛన్లను నగరపాలక సంస్థ పరిధిని ప్రమాణికంగా తీసుకుని 50 డివిజన్లకు పంపిణీ చేశారు. రాజమహేంద్రవరం రూరల్‌ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే డివిజన్లకు కూడా సిటీ నియోజకవర్గానికి కేటాయించిన పింఛన్లను పంపిణీ చేశారు. రూరల్‌ నియోజకవర్గానికి వచ్చిన రెండువేల పించన్లకు అదనంగా సిటీ పరిధిలోని పింఛన్లు 8 డివిజన్లకు 320 కేటాయించారు. నగరంలో అనేక ప్రాంతాల్లో మురికివాడలు, పేదలు ఎక్కువగా నివశించే డివిజన్లున్నాయి. నగర పరిధిలో అర్హులైన వారు వేల మంది ఉన్నారు. అయితే నగరపాలక సంస్థలో హవా కొనసాగిస్తున్న ప్రజాప్రతినిధి సిటీకి వచ్చిన పింఛన్లలో 320 తన నియోజకవర్గానికి తీసుకుపోవడంతో సిటీ పరిధిలోని వేలాది మంది వృద్ధులు, వికలాంగులకు ఎదురు చూపులే మిగిలాయి.
అందరికీ సమానంగా ఎలా ఇస్తారు?
అన్ని డివిజన్లకు 40 చొప్పున పింఛన్లు కేటాయించడాన్ని కొందరు కార్పొరేటర్లు ప్రశ్నిస్తున్నారు. ఉదాహరణకు నగరంలో 3, 5, 11, 12, 22, 24 డివిజన్లలోని ప్రజలు ఆర్థికంగా బలమైనవారు. ఈ డివిజన్లలో అర్హుల సంఖ్య మంజూరైన 40 పింఛన్ల కన్నా తక్కువగా ఉంది. ఉదాహరణకు 12వ డివిజ¯ŒSలో అర్హులైన వారి దరఖాస్తులు 37 ఆ¯ŒSలై¯ŒS అవగా ఆ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లు కేటాయించారు. 5వ డివిజ¯ŒSలో 32 దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS అవగా 40 కేటాయించారు. ఇలా దాదాపు 10 డివిజన్లలో అర్హుల కన్నా ఎక్కువ పింఛన్లు కేటాయించారు. ఇక 31, 41, 46, 49 డివిజన్లలో 90 శాతం పేదలున్నారు. ఇక్కడ అర్హుల సంఖ్య కూడా వందల్లో ఉంది. 31వ డివిజ¯ŒSలో 300లకు పైగా దరఖాస్తులు రాగా 102 మాత్రమే ఆ¯ŒSలై¯ŒS అయ్యాయి. ఇది ప్రతిపక్ష కార్పొరేటర్‌ డివిజ¯ŒS కావడంతో 30 ఫించన్లే కేటాయించారు. అందులోనూ సగం జన్మభూమి కమిటీలకు ఇచ్చారు. 41వ డివిజ¯ŒSలో 96 మంది అర్హుల దరఖాస్తులు ఆ¯ŒSలై¯ŒS కాగా పేదలు ఎక్కువగా ఉన్న ఈ డివిజ¯ŒSకు కూడా 40 పింఛన్లనే కేటాయించారు. 
 
ప్రతిపక్ష డివిజన్ల కేటాయింపుల్లో కోత...
టీడీపీ కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తు న్న  డివిజన్లకు 40 చొప్పున కేటాయించగా ప్రతి పక్ష, కొందరు స్వతంత్ర కార్పొరేటర్ల డివిజన్లకు మా త్రం 30 పింఛన్లే కేటాయించారు. ఆ 30లో కూడా సగం ఆ డి విజ¯ŒSలో టీడీపీ ప్రభుత్వం వేసిన జన్మభూమి కమిటీలకు కేటాయిం చారు. ఆ 15 పింఛన్ల లబ్ధిదారులను జన్మభూమి కమిటీలే ఎంపిక చేస్తా యి. దీంతో కొందరు ప్రతిపక్ష పార్టీల కార్పొరేటర్లు ఆందోళనకు సిద్ధమవతున్నారు. ప్రతిపక్షం, స్వతంత్ర కార్పొరేటర్లలో పలుకుబడి కలిగిన వారు మాత్రం 40 పింఛన్లు సాధించుకోగలిగారు. వారు మాత్రం కిమ్మనడం లేదు.
 
కొందరికి ‘కృతజ్ఞత’ పింఛన్లు..
ప్రతిపక్ష, స్వతంత్ర కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లకు కేటాయించిన పింఛన్లలో 10 చొప్పున కోత విధించిన ‘పెద్ద మనుషులు’ వాటిని తమ అనునూయులకు బహుమతిగా, తమ పనులకు ఎలాంటి ఆటంకం లేకుండా చూసిన వారికి ‘కృతజ్ఞత’గా ఇచ్చారు. ఆదెమ్మ దిబ్బ ప్రాంతంలో తమ అనుచరుడి భూ కబ్జాకు సహకరించిన కార్పొరేటర్లకు రెట్టింపు పింఛన్లు కానుకగా ఉచ్చారు. అదేవిధంగా సీనియర్‌ నేత అనుంగు అనుచరులు కూడా పింఛన్ల కేటయింపుల్లో పై‘చేయి’ సాధించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement