![2022 Pensions Application Affiter Dies Pension grant](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/8/5455555.jpg.webp?itok=MB4zNUnd)
191 మందికి పెన్షన్ మంజూరు..
వారిలో 32 మంది చనిపోయినట్లు గుర్తింపు
2022లో దరఖాస్తు చేయగా.. ఇప్పుడు మంజూరు
కాప్రా, హైదరాబాద్: బతికున్నంత కాలం కాసింత ‘ఆసరా’ కోసం తపించారు. తీరా ఆ ఆశ తీరకుండానే చనిపోయాక వారికి పెన్షన్లు మంజూరయ్యాయి. దీంతో నివ్వెరపోవడం బాధిత కుటుంబాల వంతైంది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని కాప్రా సర్కిల్‌లో 2022లో పెన్షన్ కోసం పలువురు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 191 మందికి పెన్షన్ మంజూరైనట్లు తాజాగా సర్కిల్ అధికారులకు జాబితా చేరింది. కాగా ఈ జాబితాలో 32 మంది మృతుల పేర్లు కూడా ఉన్నాయని అధికార వర్గాల సమాచారం.
బతికున్నప్పుడు పెన్షన్ కోసం దరఖాస్తు చేసుకుంటే.. చనిపోయాక వారి పేరున మంజూరైంది. 191 మందితో జాబితా సర్కిల్ కార్యాలయానికి చేరడంతో సంబంధిత అధికారులు వారికి ఫోన్ చేసి వివరాలు తెలుసుకుంటున్నారు. ‘మీకు పెన్షన్ వస్తుంది.. బ్యాంక్ ఖాతా తనిఖీ చేసుకోండి’ అని లబ్ధిదారులకు ఫోన్ చేసి చెబుతున్నారు. కాగా, వారిలో కొందరు చనిపోయినట్లు వారి కుటుంబసభ్యులు చెప్పారని అధికార వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment