వనం–మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి
వనం–మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి
Published Wed, Jul 12 2017 11:55 PM | Last Updated on Thu, Oct 4 2018 6:10 PM
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ):
వనం – మనం కార్యక్రమం చిత్తశుద్ధితో నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన ఆటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో ‘వనం – మనం’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోని నిర్వహించాలని అన్నారు. అవగాహన కోసం సెమినార్లు, ర్యాలీలు నిర్వహించి పంచాయతీ వంటి ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 125 రోజులలో 25 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా చేపట్టామని తెలిపారు. మారేడుమిల్లి, కోరంగిలలో ఎకో– టూరిజం అభివృద్ధి చేయడానికి అధికారులకు సూచించామని తెలిపారు. వైజాగ్, నెల్లూరు జిల్లాల్లో కూడా అభివృద్ధి చేస్తామనన్నారు. వృక్ష సంపదను కాపాడుకోవడానికి అటవీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనిఅటవీ శాఖ అధికారులకు ఆదేశించామని పేర్కొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అటవీ శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలో సిబ్బంది కొరత తీసుస్తామన్నారు. ఎర్ర చందనం అమ్మకాలకు 2 వేల మెట్రిక్ టన్నులు వేలానికి అనుమతి లభించిందని, దీన్ని బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. లాలా చెరువు ప్రాంతంలోని నగరవనంలో మంత్రి శిద్దా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అవీశాఖ సీసీఎఫ్ ఎం. రవికుమార్, ఆర్.ఎం ఏపీ ఎఫ్‌డీసీ భరత్ కుమార్, ఏపీఎఫ్ అకాడమీ డైరెక్టర్ లోహిదాసుడు, డీఎఫ్‌ఓ వైల్డ్‌లైఫ్ ప్రభాకరరావు, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
25 కోట్ల మొక్కలు
లాలాచెరువు (రాజానగరం) : రాష్ట్రంలో హరితవనాన్ని అభివృద్ధి చేసి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవిధంగా నిర్వహిస్తున్న వనం – మనం కార్యక్రమంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. లాలాచెరువులోని మహా పుష్కరవనంలో బుధవారం మొక్కను నాటిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తొలిరోజునే కోటి మొక్కలను నాటారన్నారు. మంత్రి వెంట అటవీ శాఖ అధికారులున్నారు.
Advertisement