vanam-manam
-
గోదావరిలో విషాదం
-
వనం–మనం చిత్తశుద్ధితో నిర్వహించాలి
తాడితోట (రాజమహేంద్రవరం సిటీ): వనం – మనం కార్యక్రమం చిత్తశుద్ధితో నిర్వహించాలని రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖా మంత్రి శిద్దా రాఘవరావు పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరంలో పర్యటించిన ఆయన ఆటవీ శాఖ కార్యాలయంలో అటవీ శాఖ అధికారులతో ‘వనం – మనం’ కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రటిష్టాత్మకంగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు సీరియస్‌గా తీసుకోని నిర్వహించాలని అన్నారు. అవగాహన కోసం సెమినార్లు, ర్యాలీలు నిర్వహించి పంచాయతీ వంటి ఇతర శాఖలు కూడా సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. 125 రోజులలో 25 కోట్లు మొక్కలు నాటాలని లక్ష్యంగా చేపట్టామని తెలిపారు. మారేడుమిల్లి, కోరంగిలలో ఎకో– టూరిజం అభివృద్ధి చేయడానికి అధికారులకు సూచించామని తెలిపారు. వైజాగ్, నెల్లూరు జిల్లాల్లో కూడా అభివృద్ధి చేస్తామనన్నారు. వృక్ష సంపదను కాపాడుకోవడానికి అటవీ స్మగ్లింగ్‌ను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలనిఅటవీ శాఖ అధికారులకు ఆదేశించామని పేర్కొన్నారు. విలేకర్లు అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అటవీ శాఖలో సిబ్బంది కొరత తీర్చేందుకు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్ళామని, త్వరలో సిబ్బంది కొరత తీసుస్తామన్నారు. ఎర్ర చందనం అమ్మకాలకు 2 వేల మెట్రిక్ టన్నులు వేలానికి అనుమతి లభించిందని, దీన్ని బహిరంగ వేలం వేస్తామని తెలిపారు. లాలా చెరువు ప్రాంతంలోని నగరవనంలో మంత్రి శిద్దా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అవీశాఖ సీసీఎఫ్ ఎం. రవికుమార్, ఆర్.ఎం ఏపీ ఎఫ్డీసీ భరత్ కుమార్, ఏపీఎఫ్ అకాడమీ డైరెక్టర్ లోహిదాసుడు, డీఎఫ్ఓ వైల్డ్‌లైఫ్ ప్రభాకరరావు, ప్రసాద్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. 25 కోట్ల మొక్కలు లాలాచెరువు (రాజానగరం) : రాష్ట్రంలో హరితవనాన్ని అభివృద్ధి చేసి, పర్యావరణ సమతుల్యాన్ని కాపాడేవిధంగా నిర్వహిస్తున్న వనం – మనం కార్యక్రమంలో ఈ ఏడాది 25 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించామని రాష్ట్ర అటవీ శాఖ మంత్రి సిద్ధా రాఘవరావు అన్నారు. అలాగే నాటిన ప్రతి మొక్కకూ జియోట్యాగ్ ఇవ్వాలని అధికారులకు సూచించారు. లాలాచెరువులోని మహా పుష్కరవనంలో బుధవారం మొక్కను నాటిన మంత్రి విలేకరులతో మాట్లాడుతూ జూలై ఒకటి నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో తొలిరోజునే కోటి మొక్కలను నాటారన్నారు. మంత్రి వెంట అటవీ శాఖ అధికారులున్నారు. -
‘అనంత’ను హరితవనంగా మారుస్తాం
- ‘వనం- మనం’లో పాల్గొన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా కలెక్టర్ ఆత్మకూరు (రాప్తాడు) : పెద్ద ఎత్తున మొక్కలు నాటి ‘అనంత’ను హరితవనంగా మారుస్తామని రాష్ట్ర మంత్రులు గంటా శ్రీనివాసరావు, పరిటాల సునీత, కాలవ శ్రీనివాసులు పేర్కొన్నారు. శనివారం ఆత్మకూరు మండలంలోని పంపనూరు వద్ద ఏర్పాటు చేసిన సిటీ పార్కు వద్ద ‘వనం– మనం’ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర మంత్రులతో పాటు ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి , కలెక్టర్ వీరపాండియన్, ఎమ్మెల్యేలు హనుమంతరాయ చౌదరి, పార్థసారథి, పల్లె రఘునాథరెడ్డి హాజరయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తీ ఒక మొక్క అయినా నాటి, వాటి సంరక్షణ చూసుకోవాలన్నారు. రాష్ట్రంలో 1.25 కోట్ల విద్యార్థులు ఉన్నారని ఒక్కొక్కరు ఒక్కో మొక్క నాటాలన్నారు. అనంతరం సిటీ పార్కు వద్ద మంత్రులు, ఎమ్మెల్యేలు, కలెక్టర్ మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖ అధికారులు చంద్రశేఖర్, శ్రీధర్, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ ఆదినారాయణ, జెడ్పీటీసీ సభ్యుడు కుళ్లాయప్ప పాల్గొన్నారు. -
సీఎం చంద్రబాబు కార్యక్రమంలో అపశ్రుతి
గుంటూరు: సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో శనివారం నిర్వహించిన 'వనం-మనం' కార్యక్రమంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు లాంఛనంగా హీలియం బెలూన్లు ఎగురవేయగా.. అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి అధికారులు తరలించారు. -
కష్టాలుంటాయ్...భరించాల్సిందే..!
సాక్షి, కడప : పెద్దనోట్లను రద్దు చేస్తూ మోదీ ఒక నిర్ణయం తీసుకున్నారు. నల్లధనం వెలికితీతలో వేసిన అడుగు. అయితే ప్రజలకు కష్టాలు ఉంటాయి...తప్పదు భరించాల్సిందే! భవిష్యత్తులో మంచి రోజులు వస్తాయి...చిన్ననోట్ల సమస్య ఇప్పట్లో తీరదు...ప్రతి సమస్యకు పరిష్కారం వెతుకుతున్నాం...అందులో భాగంగానే డిసెంబరు మొదటి నుంచి నగదు రహిత చెల్లింపులు చేసేలా ప్రణాళిక రూపొందించామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. అందుకు సంబందించి రాజంపేటలో పలు అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయడంతోపాటు వనం–మనం, జనచైతన్య యాత్రలో భాగంగా పాదయాత్రగా వచ్చిన అనంతరం పాత బస్టాండులో ఏర్పాటు చేసిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు. ప్రతి ఇంటిలో ఖచ్చితంగా సెల్‌ఫోన్ ఉంటుందని....అదేవిధంగా బ్యాంకులో అకౌంట్ ఉంటుందని, కేవలం చిన్న అవగాహనతోనే చెల్లింపులు, ఇతరులకు మనీ ట్రాన్స్ఫర్ వంటివి అనేక సదుపాయలు పొందవచ్చన్నారు. ఇకనుంచి బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేదని, ఇంటి వద్దనుంచే ఒక పాస్వర్డ్ ద్వారా ఆపరేట్ చేయవచ్చని, లేకపోతే వేలిముద్ర ద్వారా కూడా చెల్లింపులు చేసుకోవచ్చన్నారు. ఎక్కడికి వెళ్లినా కేవలం కార్డు ద్వారానే సరుకులు కొనుగోలు చేయవచ్చు...డబ్బులు తీసుకోవచ్చు...ప్రయాణాలు చేయవచ్చు...ఇలా ఏ పనైనా చేయవచ్చని, అందుకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు డ్వాక్రా మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులతోపాటు పలువురిని ఇళ్ల వద్దకు పంపి ప్రజలకు నేర్పిస్తామన్నారు. ప్రతి కుటుంబానికి ఆదాయం సుమారు 15 సూత్రాల ద్వారా ప్రత్యేక పథక రచన చేశానని, దాని ద్వారా ప్రతి కుటుంబానికి రూ. 10 వేల ఆదాయం వచ్చేలా ప్రణాళిక రూపొందించామని చంద్రబాబు పునరుద్ఘాటించారు. పేదరికాన్ని పారద్రోలడమే లక్ష్యంగా అహర్నిశలు కృషి చేస్తున్నానని, శాశ్వతంగా డబ్బులు కుటుంబానికి అందేలా చూస్తానని తెలిపారు. ఎక్కడ సమస్య ఉన్నా తాను ముందుటానని, నేడు పట్టిసీమ ద్వారా నీళ్లు తీసుకు రావడం ద్వారానే సీమలో కరువు లేకుండా పోయిందని...లేకుంటే ఈసారి సీమ రాళ్ల సీమగా మారేందన్నారు. గండికోటకు, బ్రహ్మంసాగర్‌కు నీళ్లు తెచ్చా! ఎన్నో ఏళ్లుగా 'సీమ'లో కడప ప్రజలు తాగు, సాగునీటి కోసం అల్లాడిపోతున్నారు. పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా శ్రీశైలంకు నీరు తీసుకొచ్చి అక్కడి నుంచి నేరుగా గండికోటకు తీసుకొచ్చాను. అంతేకాదు బ్రహ్మంసాగర్‌కు తొలిసారిగా నీళ్లు తీసుకొచ్చాను. తొమ్మిది టీఎంసీలు నీళ్లు తీసుకొచ్చా...జిల్లాను సస్యశ్యామలం చేశా...చివరికి పులివెందులలో చెట్లు ఎండిపోకుండా నేనే కాపాడా...ప్రతి అంశంలోనూ జిల్లాను అన్ని రంగాలలో రాష్ట్రంలోనే అన్ని జిల్లాల కంటే కడపజిల్లాను అధికంగా అభివృద్ది చేస్తున్నాను. ఎస్సీ ఎస్టీ బీసీ కాపు రుణాలను ఎంతోమందికి అందించా.. కార్యక్రమంలో జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, కలెక్టర్ కేవీ సత్యనారాయణ, ప్రభుత్వ విప్ మేడా మల్లికార్జునరెడ్డి, మాజీ ఎంపీ సాయిప్రతాప్, మాజీ మంత్రి బ్రహ్మయ్య, టీడీపీ జిల్లా అధ్యక్షురాలు పత్తిపాటి కుసుమకుమారి, మల్లెల శ్రీవాణి, కస్తూరి విశ్వనాథరెడ్డి, ఎద్దల సుబ్బరాయుడు, ఇతర పలువురు నేతలు పాల్గొన్నారు. -
మొక్కలతో మానవ మనుగడ
ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : కాలుష్యం పెరిగిపోతోందని, మొక్కలు నాటకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక 220 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఏపీ ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ విజయకుమార్, ఏడీఈ (టెక్నికల్) పుల్లయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. -
పచ్చదనంతోనే ఆరోగ్యం
రాష్ట్రాన్ని గ్రీన్‌బెల్ట్‌గా మార్చేందుకు ‘వనం – మనం’ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప రామవరంలో ముగ్గురు మంత్రుల చేతులు మీదుగా కార్యక్రమం ప్రారంభం జగ్గంపేట : పచ్చదనంతోనే ఆరోగ్యం చేకూరుతుందని ఉపముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. జిల్లాలో ‘వనం – మనం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం మండలంలోని రామవరం గ్రామంలో చినరాజప్ప, ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రారంభించారు. ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో రామవరం పంచాయతీ ప్రాంగణం, మర్రిపాక, ఇర్రిపాక గ్రామాలతోపాటు మార్గం పొడవునా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా చినరాజప్ప మాట్లాడుతూ రాష్ట్రంలో 24 శాతం మొక్కలు మాత్రమే ఉన్నాయని గ్రీన్‌బెల్ట్‌కు అవసరమైన 33శాతం వరకు మొక్కలు పెంచే లక్ష్యంతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. ఈ పథకంలో భాగంగా ఉపాధి హామీ ద్వారా మొక్క పెంచుకునేవారికి మూడు సంవత్సరాలకు రూ.750 అందజేస్తామన్నారు. కొండలు, సముద్రతీరంలోను మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. కార్యక్రమంలో ఎంపీ తోట నరసింహం, కలెక్టర్ అరుణ్‌కుమార్, జెడ్పీ సీఈవో పద్మ, జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు, జెడ్పీటీసీ జ్యోతుల నవీన్‌కుమార్, ఎమ్మెల్యేలు వరుపుల సుబ్బారావు, ఎస్వీఎస్ వర్మ, పెందుర్తి వెంకటేష్, ఏలేరు చైర్మన్ జ్యోతుల చంటిబాబు, ఎమ్మెల్సీలు బొడ్డు రామారావు, ఆదిరెడ్డి అప్పారావు, రవి కిరణ్ వర్మ, డ్వామా పీడీ నాగేశ్వరరావు, కందుల కొండయ్యదొర, ఎస్వీఎస్ అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటాలి
కడప అర్బన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృతృంలో ‘వనం–మనం’ కార్యక్రమం చేపడుతున్నామనీ, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను ప్రజా ఉద్యమంలా నాటాలని సంకల్పించామని రాష్ట్ర మానవ వనరుల, విద్యాశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కడప నగర శివార్లలోని రిమ్స్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప నగర వనం ప్రాంగణంలో ‘వనం– మనం’ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 11.48 లక్షల మొక్కలను నాటుతామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలను నాటడంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం చెట్లను అవగాహన లేని సమయంలో వంటచెరకుగా వాడిన సందర్భాలున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్య నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి కరుణించి 30 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. చిన్నారుల చేతుల మీదుగా మొక్కలు నాటే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ ఉదయ భాస్కర్, జిల్లాజాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ, డీఎఫ్ఓ బి.ఎం.దివాన్ మైదీన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, సురేష్ నాయుడు, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రీష్మ అనే చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమం ముగింపులో మొక్కల పెంపకంపై అందరూ ప్రతిజ్ఞ చేశారు. -
ప్రజా ఉద్యమంలా మొక్కలు నాటాలి
కడప అర్బన్ : రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృతృంలో ‘వనం–మనం’ కార్యక్రమం చేపడుతున్నామనీ, ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను ప్రజా ఉద్యమంలా నాటాలని సంకల్పించామని రాష్ట్ర మానవ వనరుల, విద్యాశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శుక్రవారం కడప నగర శివార్లలోని రిమ్స్ సమీపంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో కడప నగర వనం ప్రాంగణంలో ‘వనం– మనం’ కార్యక్రమాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కోటి మొక్కలను నాటే కార్యక్రమం చేపట్టామన్నారు. ఇందులో భాగంగా జిల్లాలో 11.48 లక్షల మొక్కలను నాటుతామని జిల్లా కలెక్టర్ కేవీ సత్యనారాయణ ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఈ మొక్కలను నాటడంతో సరిపెట్టకుండా ప్రతి ఒక్కరూ పది మొక్కలను నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్ ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎర్రచందనం చెట్లను అవగాహన లేని సమయంలో వంటచెరకుగా వాడిన సందర్భాలున్నాయన్నారు. జిల్లా కలెక్టర్ కెవి సత్య నారాయణ మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి కరుణించి 30 సెంటీ మీటర్లకు పైగా వర్షపాతం నమోదైందన్నారు. చిన్నారుల చేతుల మీదుగా మొక్కలు నాటే అవకాశం దక్కడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో అటవీ శాఖ అడిషనల్ పీసీసీఎఫ్ ఉదయ భాస్కర్, జిల్లాజాయింట్ కలెక్టర్ శ్వేత తేవతీయ, డీఎఫ్ఓ బి.ఎం.దివాన్ మైదీన్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి, నాయకులు హరిప్రసాద్, గోవర్ధన్ రెడ్డి, సురేష్ నాయుడు, దుర్గాప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో వ్యాసరచన, వక్తృత్వ పోటీలలో ప్రతిభ కనపర్చిన విద్యార్థులకు ప్రశంసా పత్రాలను అందజేశారు. గ్రీష్మ అనే చిన్నారి ప్రదర్శించిన కూచిపూడి నృత్యం అందరినీ ఆకట్టుకుంది.కార్యక్రమం ముగింపులో మొక్కల పెంపకంపై అందరూ ప్రతిజ్ఞ చేశారు. -
‘వనం–మనం’లో సినీతారలు
రాజమండ్రి : ఓడలరేవు బీవీసీ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన ‘వనం–మనం’ కార్యక్రమానికి సినిమా గ్లామర్ అద్దుకుంది. హీరో భరత్, హీరోయిన్ శ్వేతాశర్మ ముఖ్య అతిథులుగా పాల్గొని కళాశాల ఆవరణంలో మొక్కలను నాటారు. వారితో పాటు విద్యార్థులు 500 మొక్కలను నాటారు. కళాశాల ప్రిన్సిపాల్ డీఎస్వీ ప్రసాద్, కొల్లు విష్ణుమూర్తి,నాతి లెనిన్‌బాబు, గిడుగు భాస్కరరావు పాల్గొన్నారు. -
'వనం-మనం' ప్రారంభించిన చంద్రబాబు
నూజివీడు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శుక్రవారం 'వనం-మనం' కార్యక్రమాన్ని ప్రారంభించారు. కృష్ణాజిల్లా నూజివీడు మండలం లైన్ తండా వద్ద ఆయన ఈ రోజు ఉదయం 11 గంటలకు వనం-మనం ఆరంభించారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఔషద, రావి, వేప చెట్లను నాటారు. కాగా హరితాంధ్రప్రదేశ్ లక్ష్యంగా ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన వనం- మనం కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమైంది. ఒక్క రోజే కోటి మొక్కలు నాటాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరోవైపు మంత్రులు, ఎమ్మెల్యేలు తమ తమ నియోజకవర్గాల్లో వనం-మనం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. -
మొక్కలు కోసం చెట్ల తొలగింపు !
నూజివీడు : వనం–మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల నిర్వహణకు అటవీశాఖ అధికారులు చేస్తున్న నిర్వాకం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. మొక్కల పెంపకం కోసం దాదాపు 15 ఎకరాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. ఈనెల 29న ‘వనం–మనం’లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు మండలంలోని లైన్‌తండా వద్ద ఉన్న అటవీప్రాంతంలో ప్రారంభించనున్నారు. అయితే అధికారులు కార్యక్రమ నిర్వహణకు గాను ఇక్కడ ఉన్న 8 హెక్టార్ల అటవీప్రాంతాన్ని చదును చేశారు. ఇందులో ఐదు హెక్టార్లలో మొక్కలు నాటడం, మూడు హెక్టార్ల ప్రాంతంలో బహిరంగ సభకు ఏర్పాటకు సన్నాహాలు ప్రారంభించారు. 30 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న చెట్లన్నింటినీ నేలమట్టం చేసి మొక్కలు నాటడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఫొటో రైటప్: 27ఎన్జడ్డీ04: సీఎం మొక్కలు నాటే ప్రదేశంలో చెట్లు తొలగించి చదును చేసిన అటవీప్రాంతం -
14లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక
విజయవాడ : జిల్లాలో ‘వనం – మనం’ కార్యక్రమంలొ భాగంగా 14 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక రూపొందించామని కలెక్టర్ బాబు.ఎ అటవీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ డాక్టర్ పి.వి.రమేష్‌కు తెలిపారు. వనం – మనం కార్యక్రమం కింద రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న కోటి మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా సోమవారం హైదరాబాద్ నుంచి స్పెషల్ చీఫ్ సెక్రటరీ పి.వి.రమేష్ స్పెషల్ సెక్రటరీ సురేంద్రపాండే, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు ఎస్.వి.ఎల్.మిశ్ర అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విజయవాడలోని కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ బాబు.ఎ ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ జిల్లాలో ముఖ్యమంత్రి కోటి మొక్కల నాటే కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. ఇందు కోసం గ్రామస్థాయిలో ప్రణాళికలు రూపొందించుకుని చేస్తున్నామన్నారు. అన్ని శాఖల అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు ప్రతి ఒక్కరు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. కలెక్టర్‌తో పాటు జాయింట్ కలెక్టర్ గంధం చంద్రడు, విజయవాడ సబ్‌కలెక్టర్ డాక్టర్ జి.సృజన, జిల్లా అటవీ శాఖ అధికారులు బెనర్జీ, అశోక్‌కుమార్ పాల్గొన్నారు.