సీఎం చంద్రబాబు కార్యక్రమంలో అపశ్రుతి
గుంటూరు: సీఎం చంద్రబాబునాయుడు పాల్గొన్న కార్యక్రమంలో అపశ్రుతి దొర్లింది. గుంటూరు జిల్లా ఓబులనాయుడుపాలెంలో శనివారం నిర్వహించిన 'వనం-మనం' కార్యక్రమంలో అనూహ్య ప్రమాదం చోటుచేసుకుంది. ఈ కార్యక్రమం సందర్భంగా సీఎం చంద్రబాబు లాంఛనంగా హీలియం బెలూన్లు ఎగురవేయగా.. అవి ఒక్కసారిగా పేలిపోయాయి. దీంతో ఇద్దరు విద్యార్థులకు గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను సమీపంలోని ఆస్పత్రికి అధికారులు తరలించారు.