మొక్కలు కోసం చెట్ల తొలగింపు !
మొక్కలు కోసం చెట్ల తొలగింపు !
Published Wed, Jul 27 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 6:35 AM
నూజివీడు :
వనం–మనం కార్యక్రమంలో భాగంగా మొక్కల నిర్వహణకు అటవీశాఖ అధికారులు చేస్తున్న నిర్వాకం చూసి ప్రజలు ముక్కున వేలు వేసుకుంటున్నారు. మొక్కల పెంపకం కోసం దాదాపు 15 ఎకరాల్లో ఉన్న పెద్ద పెద్ద చెట్లను తొలగించి, మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడంపై విమర్శలకు తావిస్తోంది. ఈనెల 29న ‘వనం–మనం’లో భాగంగా కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నూజివీడు మండలంలోని లైన్‌తండా వద్ద ఉన్న అటవీప్రాంతంలో ప్రారంభించనున్నారు. అయితే అధికారులు కార్యక్రమ నిర్వహణకు గాను ఇక్కడ ఉన్న 8 హెక్టార్ల అటవీప్రాంతాన్ని చదును చేశారు. ఇందులో ఐదు హెక్టార్లలో మొక్కలు నాటడం, మూడు హెక్టార్ల ప్రాంతంలో బహిరంగ సభకు ఏర్పాటకు సన్నాహాలు ప్రారంభించారు. 30 నుంచి 50 ఏళ్ల వయస్సు ఉన్న చెట్లన్నింటినీ నేలమట్టం చేసి మొక్కలు నాటడం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు.
ఫొటో రైటప్:
27ఎన్‌జడ్‌డీ04: సీఎం మొక్కలు నాటే ప్రదేశంలో చెట్లు తొలగించి చదును చేసిన అటవీప్రాంతం
Advertisement