- ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్
మొక్కలతో మానవ మనుగడ
Published Mon, Aug 15 2016 10:52 PM | Last Updated on Sat, Aug 18 2018 8:53 PM
బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) :
కాలుష్యం పెరిగిపోతోందని, మొక్కలు నాటకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక 220 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఏపీ ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ విజయకుమార్, ఏడీఈ (టెక్నికల్) పుల్లయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు.
Advertisement