bommuru
-
స్వాధార్ గృహం వాచ్మెన్ అరెస్టు: తానేటి వనిత
సాక్షి, తూర్పుగోదావరి : రాజమండ్రి బొమ్మూరులోని స్వాధార్ గృహం వార్డెన్ అరుణ, వాచ్మెన్ రెడ్డిబాబును విధుల నుంచి తొలగించామని ఆంధ్రప్రదేశ్ మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి తానేటి వనిత పేర్కొన్నారు. జిల్లాలోని బొమ్మూరులో స్వాధార్ గృహంలో వాచ్మెన్ నలుగురు యువతులపై అఘాయిత్యాలకు పాల్పడ్డాడు. వాచ్మెన్ వేధింపులు ఎక్కువవ్వడంతో తీవ్ర మనో వేదనకు గురైన బాధితులు రెడ్డిబాబు చర్యలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వాధార్ గృహంలో యువతులపై వాచ్మెన్ అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనపై మంత్రి తానేటి వనిత, ఎంపీ భరత్ స్పందించారు. ఘటన బాధిత యువతులను, మహిళలను ప్రభుత్వాస్పత్రిలో బుధవారం పరామర్శించారు. (ఇప్పటి వరకు 10 వేల ఇళ్లు అందించాం: తలసాని) ఈ సందర్భంగా తానేటి వనిత మాట్లాడుతూ.. మేనేజర్ రమణాశ్రీని సస్పెండ్ చేశామని, బాధితులైన నలుగురు అమ్మాయిలతో మరో నలుగురిని వేరే స్టేట్ హోంకు తరలిస్తామని తెలిపారు. స్వాధార్ గృహంలో సీసీ కెమెరాలను వాచ్మెన్, వార్డెన్ కలిసి నిలిపి వేశారని పేర్కొన్నారు. వాచ్మెన్ రెడ్డిబాబును అరెస్ట్ చేశామన్నారు. మహిళలందరూ ధైర్యంగా, భరోసాగా ఉండేందుకే దిశ చట్టాన్ని తీసుకు వచ్చామని తెలిపారు. (కరోనా కాటు, ఓలా ఉద్యోగులపై వేటు) -
ట్యాంకర్లో గంజాయి తరలింపు
2,150.450 కిలోల స్వాధీనం ముగ్గురి అరెస్ట్ పరారీలో ఇద్దరు నిందితులు రాజమహేంద్రవరం రూరల్ : ఎవరికి అనుమానం రాకుండా ట్యాంకర్లో గంజాయిని తరలించాలన్న వారి ఆశలు అడియాసలయ్యాయి. పోలీసులు తనిఖీల్లో ట్యాంకర్లో తరలిస్తున్న 2,150.450 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ముగ్గురు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని రాజమహేంద్రవరం అర్బ¯ŒS ఎస్పీ బి.రాజకుమారి తెలిపారు. బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒSలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆదివారం సాయంత్రం అందిన విశ్వసనీయ సమాచారంపై తూర్పు మండల డీఎస్పీ కె.రమేష్‌బాబు సూచనల మేరకు బొమ్మూరు పీఎస్ ఇ¯ŒSస్పెక్టర్ పి.కనకారావు, ఏజీఎస్ పార్టీ ఎస్సై శివాజీ, సిబ్బంది రాజానగరం మండలం దివా¯ŒSచెరువు గ్రామం గామ¯ŒS బ్రిడ్జి వద్ద హైవేపై వాహనాలు తనిఖీ చేశారు. ఆయిల్ ట్యాంకర్‌ను తనిఖీ చేస్తుండగా, అందులో 76 బస్తాల గంజాయి మూటలు బయటపడ్డాయి. వాటి విలువ విలువ రూ.1.10 కోట్లు ఉంటుంది. గంజాయి రవాణా చేస్తున్న విశాఖ జిల్లా పెందుర్తి మండలం వేపగుంటకు చెందిన గుమ్మళ్ళ పైడిబాబు, లారీ డ్రైవర్ విశాఖ జిల్లా అనకాపల్లి మండలం కొత్తూరుకు చెందిన కాశిరెడ్డి రహా నరసింహామూర్తి, లారీ క్లీనర్ జాన ప్రభులను రాజానగరం ఈఓపీఆర్డీ, వీఆర్వోల సమక్షంలో అరెస్ట్ చేశారు. గంజాయితో పాటు మూడు సెల్ఫోన్లు, రూ.2700 స్వాధీనం చేసుకున్నామన్నారు. అనుమానం రాకుండా ట్యాంకర్లో.. ఇటీవల గంజాయిని ట్రావెల్స్ వ్యాన్లు, ఇతర వాహనాల్లో తరలిస్తున్నారని, అయితే ఆయిల్ ట్యాంకర్లో తరలిస్తే అనుమానం రాదన్న ఉద్దేశంతో నిందితులు ఈ మార్గం ఎంచుకున్నట్టు అర్బ¯ŒS ఎస్పీ రాజకుమారి తెలిపారు. విశాఖ నుంచి మహారాష్ట్ర రాష్ట్రంలో సంగ్లీ పట్టణానికి చెందిన సమీర్‌కు ఈ గంజాయిని అప్పగించేందుకు తీసుకువెళుతుండగా పట్టుకున్నామన్నారు. గుమ్మళ్ళ పైడిబాబు, మణి గంజాయి రవాణా చేస్తున్నారన్నారు. గతంలో పైడిబాబుపై ఒక గంజాయి కేసు నమోదైందన్నారు. అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరుస్తామన్నారు. పైడిబాబు, భాగస్వామి మణితో పాటు మహారాష్ట్రకు చెందిన సమీర్ కోసం ప్రత్యేక బృందాలను నియమించామన్నారు. గంజాయిని పట్టుకున్న పోలీసు అధికారులను అభినందించారు. ఈ విలేకరుల సమావేశంలో డీఎస్పీ రమేష్‌బాబు, ఇ¯ŒSస్పెక్టర్ కనకారావు, ఎస్సైలు కిషోర్‌కుమార్, నాగబాబు పాల్గొన్నారు. -
డాక్టర్ కర్రి రామారెడ్డికి కీర్తి పురస్కారం
రాజమహేంద్రవరం రూరల్ : సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులకు ఇచ్చే కీర్తి పురస్కారాన్ని ప్రముఖ మానసిక వైద్యులు, విద్యావేత్త, ప్రజాసేవకుడు డాక్టర్ కర్రిరామారెడ్డికి ప్రదానం చేయనున్నట్టు ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రాజయోనా ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి మూడో తేదీన బొమ్మూరులోని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ఆవరణలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం సంయుక్తంగా ఆయనకు ప్రదానం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా వైద్య రంగంలో ఇచ్చే డాక్టర్ డీఎల్ఎ¯ŒS మూర్తి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు. -
తెలుగు సాహిత్యానికి స్వర్ణయుగం అంతర్జాలం
రేపు ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’పై జాతీయ సదస్సు l బొమ్మూరు సాహిత్యపీఠం, మనోజ్ఞ అకాడమీల నిర్వహణ ∙ వివిధ రాష్ట్రాల నుంచి రానున్న పరిశోధకులు, ప్రొఫెసర్లు రాజమహేంద్రవరం కల్చరల్ : ‘చిన్నతనంలో వీధి బడులలో పలకలు పట్టుకుని చదువుకున్నాం. నేడు విద్యార్థులు లాప్‌టాప్‌లతో చదువుకుంటున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే తరాలు కంప్యూటర్ పరిజ్ఞానంతో తెలుగుభాషా సాహిత్యాలను స్వర్ణయుగంలోకి తీసుకు వెళ్లాలి. ఈ లక్ష్యంతోనే ఈనెల 11న బొమ్మూరు తెలుగు సాహిత్యపీఠంలో మనోజ్ఞ సాంస్కృతిక సాహిత్య అకాడమీతో కలసి ‘అంతర్జాలంలో తెలుగు సాహిత్యం’ అనే అంశంపై జాతీయస్థాయి సదస్సును నిర్వహిస్తున్నాం’ అని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం సాహిత్యపీఠం డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ ‘సాక్షి’కి తెలిపారు. సోమవారం హైదరాబాద్‌లో ఉన్న ఆయన ఈ విషయంపై ‘సాక్షి’తో ప్రత్యేకం ఫోనులో మాట్లాడారు..వివరాలు ఆయన మాటల్లోనే... రాతియుగంనుంచి అంతర్జాలయుగంలోకి ప్రవేశించిన ఉజ్వలయుగంలో నేడు మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారు అంతర్జాలం వేదికపై కలుసుకుంటున్నారు. తెలుగు సాహిత్యానికి వెయ్యేళ్ళ పైబడ్డ చరిత్ర ఉంది. అద్దంకి శాసనంనుంచి అంతర్జాల సాహిత్యం వరకు తెలుగు వాజ్ఞ్మయం వివిధ ధోరణులకు, పరిణామాలకు గురి అయింది. తెలుగు ఎంఏలో అంతర్జాలం ఒక పాఠ్యాంశంగా మారింది. కంప్యూటర్ను ధారణాయంత్రమని అంటున్నాం. మిగతా భాషల కన్నా, సాహిత్యానికి సంబంధించినంతవరకు అంతర్జాల వినియోగంలో బెంగాలీ, హిందీ, తెలుగు భాషలు ముందున్నాయి. రాబోయే తరాల కోసం ఈ సదస్సు ఒక దశను, దిశను నిర్ధారిస్తుంది. ఒక్క క్లిక్‌తో విశ్వసాహిత్యం నేటికీ అంతర్జాలం అనే పదం చాలామందికి పరిచయం లేదు. ఇంటర్నెట్ అంటేనే వారికి తెలుస్తుంది’ అన్నారు జాతీయ సదస్సులో భాగస్వామి అయిన మనోజ్ఞ సాంస్కృతిక అకాడమీ వ్యవస్థాపకురాలు డాక్టర్ పుట్ల హేమలత. 11న జరిగే సదస్సులో మాత్రమే కాదు, నిజజీవితంలో కూడా ఎండ్లూరి సుధాకర్, పుట్ల హేమలతలు భాగస్వాములే. 11వ తేదీన జరగనున్న జాతీయ సదస్సుగురించి పుట్ల హేమలత విశ్లేషణ.. ‘అంతర్జాలం ద్వారా అద్భుతమైన సాహిత్యానికి దగ్గర కావచ్చునని నేటి యువత తెలుసుకోవాలి. గతంలో ఒక పుస్తకం కావలసి వస్తే వెతుకులాట తప్పేది కాదు. నేడు ఒక క్లిక్‌తో ఏ దేశసాహిత్యమైనా చదువుకునే సౌలభ్యం ఏర్పడింది. మన భాషను ఇతర భాషలలోకి తీసుకువెళ్ళడానికి అంతర్జాలం ఉపయోగపడుతోంది. విద్యార్థులు ఫేస్ బుక్‌లకు, ఛాటింగులకు పరిమితం కారాదు. పద్యరచనకు ఛందోనియమాలను తెలిపే సాఫ్ట్వేర్ అందుబాటులోకి వచ్చింది. మీరు తప్పురాస్తే అది చూపుతుంది. పుస్తకాలు చదువుకోవడంలో ఉన్న సౌలభ్యం అంతర్జాలాన్ని ఉపయోగించడంలో లేదని అంటున్నారు. కానీ, జనరేష¯ŒS గ్యాప్‌ను మనం అర్థం చేసుకోవాలి. నేటి యువతరం ఉద్యోగం చేస్తూ, విరామసమయాల్లో సోషల్ సైట్లలోకి వెళ్ళి సాహిత్య చర్చల్లో పాల్గొంటున్నారు. మొదటఆసక్తి చూపని నిన్నటి తరం కూడా నేడు ఆసక్తి చూపుతోంది. ఇది మంచి పరిణామమే.. సాంకేతికంగా కొన్ని ఇబ్బందులు అంతర్జాలంలో తెలుగు టైపింగ్‌కు యూనికోడ్ మాత్రమే ఉపయోగపడుతోంది. అందులో కొన్ని అక్షరాలకోసం చాలా కష్టపడవలసి వస్తోంది. ఉదాహరణకు ‘ఠ’. ఇటీవల ప్రభుత్వం 18 రకా ల ఫాంట్లను విడుదల చే యడంతో పరిస్థితి కాస్తమెరుగయింది. అయిదు అంశాలపై సదస్సులు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, బెనారస్ హిందు విశ్వవిద్యాలయంనుంచి సుమారు 150 మంది పరిశోధకులు, ప్రొఫెసర్లు సదస్సులో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు జరిగే ప్రారంభ సదస్సుకు డీ¯ŒS ఆచార్య ఎండ్లూరి సుధాకర్ అధ్యక్షత వహిస్తారు. తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఎస్వీ సత్యనారాయణ, విజయనగరం ఆంధ్రవిశ్వవిద్యాలయ ప్రాంగణం ప్రత్యేక అధికారి ఆచార్య జి.యోహా¯ŒSబాబు తదితరులు పాల్గొంటారు. 11 గంటలకు ‘తెలుగు భాష–సాంకేతిక పరిజ్ఞానం–ఆవశ్యకత’ అనే అంశంపై సదస్సుకు హైదరాబాద్ విశ్వవిద్యాలయం అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ దార్ల వెంకటేశ్వరరావు అధ్యక్షత వహిస్తారు. బెంగళూరుకు చెందిన కవి, డిజిటల్ ప్లానెట్ ఎం.డి. డాక్టర్ ఇక్బాల్ చంద్ ‘డయస్పోరా సాహిత్యం–వెబ్సైట్లు–బ్లాగులు’ అనే అంశంపై జరిగే సదస్సుకు అధ్యక్షత వహిస్తారు. భోజన విరామానంతరం ‘విహం గ’ అంతర్జాల మహిళాపత్రిక వార్షికోత్సవం జరుగు తుంది. అనంతరం ‘సోషల్ నెట్ వర్కింగ్‌సైట్లు–సాహిత్య చర్చలు’ అనే అంశంపై మూడో సదస్సు, ‘అంతర్జాలంలో తెలుగు పత్రికల కృషి’ అనే అంశంపై నాలుగో సదస్సు, ‘అంతర్జాలంలో బాల సాహిత్యం’ అనే అంశంపై అయిదో సదస్సు జరుగుతాయి. సమాపనోత్సవంలో ఆచార్య కాత్యాయనీ విద్మహే, కొలకలూరి ఆశాజ్యోతి, ఇతర ప్రముఖులు పాల్గొంటారు. -
మొక్కలతో మానవ మనుగడ
ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ బొమ్మూరు (రాజమహేంద్రవరం రూరల్) : కాలుష్యం పెరిగిపోతోందని, మొక్కలు నాటకపోతే మానవ మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని ఏపీ ట్రాన్స్‌కో చీఫ్ ఇంజనీర్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. సోమవారం స్థానిక 220 కేవీ సబ్‌స్టేషన్ ఆవరణలో వనం మనం కార్యక్రమంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. ముందుగా స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని సూచించారు. ఏపీ ట్రాన్స్‌కో సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యాంప్రసాద్, డీఈ శ్రీనివాసరావు, ఏడీఈ విజయకుమార్, ఏడీఈ (టెక్నికల్) పుల్లయ్య, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నల్లమందు స్వాధీనం: నలుగురు అరెస్ట్
రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా చింతపల్లి వాసులని పోలీసులు వెల్లడించారు. పట్టబడిన నల్లమందు విలువ రూ. 2.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు. -
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
కనురెప్ప పడిందో... ఆదమరుపే ఆవహించిందో... అదే అదనుగా మృత్యువు కబళించింది. తీర్థయాత్ర వారి పాలిట విషాదయాత్రగా మారింది. హైవేపై దూసుకుపోతున్న కారు అదుపు తప్పింది... ఆగి ఉన్న లారీని పెద్దశబ్దంతో ఢీకొంది... హాహాకారాలు.. ఆర్తనాదాలతో ఆ ప్రాంతం ప్రతిధ్వనించింది. దుర్గమ్మ దర్శనానికి బయలుదేరిన విశాఖ జిల్లావాసులు తొమ్మిది మందిలో ఐదుగురిని ఈ ప్రమాదం పొట్టనబెట్టుకుంది. రాజమండ్రిలోని బొమ్మూరు సమీపాన జరిగిన ఈ ఘోర ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్నారు. బొమ్మూరు (రాజమండ్రిరూరల్), విశాఖ పట్టణం, న్యూస్‌లైన్ : విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు విశాఖ జిల్లా నుంచి కారులో బయలుదేరిన తొమ్మిది మంది రాజమండ్రిలో బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జాతీయరహదారిపై సుద్దకొండ సమీపంలో ఆగి ఉన్న లారీని వీరు ప్రయాణిస్తున్న టవేరా కారు ఢీకొట్టడంతో ఐదుగురు అక్కడక్కడే మరణించారు. మంగళవారం తెల్లవారుజామున ఈ దారుణం జరిగింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. విశాఖ జిల్లా పెదగంట్యాడ మండలం కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన గొన్నా శివకుమార్ (28), గద్దే శ్రీనివాసరావు(26), గద్దే వెంకటేష్, వానపల్లి అప్పలరాజు భవానీ దీక్షలో ఉన్నారు. చిననడపర్రు గ్రామానికి చెందిన గురు భవాని పగడాల జోగారావుతో కలసి వారు కనకదుర్గమ్మవారి దర్శనం కోసం విజయవాడ బయలుదేరారు. సింహాచలం శ్రీనివాసనగర్‌కు చెందిన ధమర్‌సింగ్ శంకరరావు (28)కు చెందిన టవేరాకారును వారు బుక్ చేసుకున్నారు. కారులో ఇంకా ఖాళీ ఉండడంతో కొత్తకర్ణానివారిపాలేనికి చెందిన విరోతి అప్పలశ్రీను (28), అతని భార్య శిరీష, యర్రా రమేష్ (26) కూడా విజయవాడ గుడికి బయలుదేరారు. సోమవారం రాత్రి కొత్తకర్ణానివారి పాలెంలో జరిగిన దుర్గమ్మ ఊరేగింపు అనంతరం అర్ధరాత్రి సమయంలో వారు కారులో విజయవాడకు బయలుదే రారు. మంగళవారం తెల్లవారు జామున 3.35 గంటల సమయంలో రాజమండ్రిలోని బొమ్మూరు మీదుగా వెళుతున్న ఈ కారు జాతీయరహదారిపై సుద్దకొండ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి అతివేగంగా ఢీకొట్టింది. లారీ వెనుక చక్రం వరకూ కారు దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ ధమర్సింగు శంకరరావు, గొన్నా శివకుమార్, గద్దే శ్రీనివాసరావు, విరోతి అప్పలశ్రీను, యర్రా రమేష్ అక్కడిక్కడే మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన గద్దే వెంకటేష్, విరోతి శిరీష, వానపల్లి అప్పరాజు, పగడాల జోగారావులు ఆర్తనాదాలు చేయడంతో అటుగా వెళుతున్న వారు ఆగి పోలీసులకు సమాచారాన్ని అందజేశారు. ట్రాఫిక్ డీఎస్పీ అనిల్‌కుమార్, బొమ్మూరు సీఐ బి.సాయిరమేష్ సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గాయపడిన నలుగురినీ 108 అంబులెన్సులో రాజమండ్రి ప్రభుత్వాస్పత్రికి పంపించారు. లారీ కింద చిక్కుకుపోయిన కారును క్రేన్ సహాయంతో బయటకు లాగారు. కారు ముందు భాగం పూర్తిగా నుజ్జయిపోవడంతో మృతదేహాలు కారులో ఇరుక్కుపోయాయి. క్రేన్ సహాయంతో కారు శకలాలను పెకలించి మృతదే హాలను బయటకు తీయాల్సి వచ్చింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన అర్బన్ ఎస్పీ టి.రవికుమార్‌మూర్తి మాట్లాడుతూ ఆగి ఉన్న లారీని కారు అతివేగంగా ఢీకొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగిందన్నారు. తలపైన బలమైన గాయాలు తగలడం వల్లనే ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందారన్నారు. డీజిల్ అయిపోవడంతో లారీని రోడ్డుకు పక్కగా ఆపారని ఎస్పీ చెప్పారు. కారు డ్రైవర్ అలసిపోయి ఉండడంతో కునుకుపట్టి ఈ ప్రమాదం జరిగి ఉంటుందన్నారు. సంఘటన స్థలాన్ని రాజమండ్రి ఆర్డీఓ వేణుగోపాలరెడ్డి పరిశీలించారు. ప్రమాదం తీరును ఆయన పోలీసు అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించారు. వీరికి మెరుగైన వైద్యసదుపాయాలు కల్పించాలని, అవసరమైతే కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించాలని కలెక్టర్ నీతూప్రసాద్ ఆదేశించారన్నారు. వైద్యసేవలను దగ్గరుంచి పర్యవేక్షించాల్సిందిగా రూరల్ తహశీల్దార్ జి.భీమారావును ఆర్డీఓ ఆదేశించారు. కాగా పరిస్థితి విషమంగా ఉన్న గద్దే వెంకటేష్, పగడాల జోగారావులను మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతదేహాలకు రాజమండ్రి ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బంధువులకు అప్పగించారు. బొమ్మూరు సీఐ సాయిరమేష్ కేసు నమోదు చేయగా ట్రాఫిక్ సీఐ మురళీకృష్ణారెడ్డి, ప్రకాశంనగర్ సీఐ బీవీ సుబ్బారావు, బొమ్మూరు ఎస్సై షేక్జాన్మియా, సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఆధారం కోల్పోయిన రమేష్ కుటుంబం ప్రమాదంలో యర్రా రమేష్ దుర్మరణం చెందడంతో ఆ కుటుంబం ఆధారం కోల్పోయింది. తండ్రి దేముడు పక్షవాతంతో బాధపడుతుండగా, తల్లి వెంకయ్యమ్మ అనారోగ్యంతో బాధపడుతోంది. రమేష్‌కు పదో తరగతి చదువుతున్న తమ్ముడు నగేష్ ఉన్నాడు. షిప్‌యార్డులో ఓ ప్రైవేటు ఫ్యాబ్రికేషన్ సంస్థలో సూపర్వైజర్గా పనిచేస్తున్న రమేష్ మరణించినట్టు తల్లిదండ్రులకు తెలియపర్చలేదు. కుటుంబానికి పెద్ద దిక్కు కోల్పోవడంతో సోదరుడు, కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఎక్సైజ్ కానిస్టేబుల్‌గా ఎంపికైన ఇంతలోనే.. గొన్నా శివకుమార్ ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో కుటుంబ సభ్యులంతా ఆనందంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో అతని మరణ వార్త వారిని కలిచివేసింది. అతని తల్లిదండ్రులు రామారావు, అప్పలనర్సమ్మ గుండెలవిసేలా రోదిస్తున్నారు. స్టీల్‌ప్లాంట్ జనరల్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న రామారావుకు కుమార్తె భాగ్యలక్ష్మితో పాటు శివకుమార్, కనకరాజు ఇద్దరు కుమారులు ఉన్నారు. కుమార్తె వివాహం చేశారు. కనకరాజు బీకాం చదువుతున్నాడు. వివాహమైన ఐదు నెలలకే.. రెండేళ్ల క్రితం దుబాయ్ నుంచి వచ్చిన గద్దె శ్రీనివాసరావుకు ఈ ఏడాది మే 30న కశింకోట గ్రామానికి చెందిన నాగమణితో శ్రీనివాసరావుకు వివాహమైంది. ప్రస్తుతం ఫార్మాసిటీలో కాంట్రాక్ట్ కార్మికునిగా పనిచేస్తున్నాడు. శ్రీనివాసరావు మరణవార్తతో అతని భార్య నాగమణి రోదనలు అక్కడివారిని కలచివేసింది. అల్లుడు మరణంతో నాగమణి తల్లిదండ్రులు ఉషారత్నం, గోవింద్‌రాజు కుమార్తెను పట్టుకొని గుండెలు బాదుకుంటూ విలపిస్తున్నారు. ప్రమాదంలో శ్రీనివాసరావు సోదరుడు వెంకటేష్‌కు తీవ్రగాయాలయ్యాయి. దుఃఖసాగరంలో శ్రీను కుటుంబం స్టీల్‌ప్లాంట్‌లో కాంట్రాక్ట్ కార్మికుడిగా పనిచేస్తున్న విరోతి అప్పల శ్రీను, శిరీషకు మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. ప్రమాదంలో అతడు దుర్మరణం పాలవ్వగా, శిరీష తీవ్రగాయాలతో రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. తల్లిదండ్రులు దేముడు, వరహాలమ్మ అనారోగ్యంతో ఉండడం వల్ల కుమారుని మరణవార్త వారికి చెప్పలేదు. కర్ణవానిపాలేనికి చేరుకున్న శిరీష తల్లిదండ్రులు ప్రమాదాన్ని తలుచుకుంటూ కుమిలిపోతున్నారు. అందరికీ దారి చూపి అందని లోకాలకు.. గోపాలపట్నం : దమన్‌సింగ్ శంకర్(28)కు మూడేళ్ల క్రితమే వివాహం జరిగింది. ఇతనికి భార్య నాగేశ్వరమ్మ, ఏడాదిన్నరకొడుకు ఉన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తల్లిదండ్రులను అతనే చూసుకుంటున్నాడు. ఇద్దరు చెల్లెళ్లకీ వివాహాలు జరిపించాడు. అతని మృతి కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ప్రమాద వార్త తెలుసుకున్న భార్య నాగేశ్వరమ్మ స్పృహ తప్పి పడిపోయింది. -
బొమ్మూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి
తూర్పుగోదావరి జిల్లాలో ఈ రోజు తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. 16వ నెంబర్ జాతీయ రహదారిపై బొమ్మూరు వద్ద ఆగి ఉన్న లారీని టవేరా కారు ఢీకొట్టింది. ఆ ఘటనలో ఆరుగురు వ్యక్తులు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు భవానీ భక్తులు కూడా ఉన్నారు. మృతులంతా విశాఖపట్నంలోని గాజువాక ప్రాంతానికి చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. విశాఖ నుంచి విజయవాడకు వస్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లుగా సమాచారం. ప్రమాద స్థలంలో ఐదుగురు మృతి చెందారు. హస్పటల్‌కు తరలిస్తుండగా మరోకరు మరణించారు. పొగమంచు కారణంగానే ప్రమాదం చోటు చేసుకుని ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తూర్పుగోదావరి జిల్లాలో ఘెర రోడ్డు ప్రమాదం