రాజమండ్రి: తూర్పుగోదావరి జిల్లా బొమ్మూరులో పోలీసులు గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి భారీగా నల్లమందు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితులు విశాఖపట్నం జిల్లా చింతపల్లి వాసులని పోలీసులు వెల్లడించారు. పట్టబడిన నల్లమందు విలువ రూ. 2.40 లక్షలు ఉంటుందని పోలీసులు తెలిపారు.