
కొరాపుట్(భువనేశ్వర్): జిల్లాలోని నందపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో దుప్పట్ల విక్రయం మాటున జరుగుతున్న గంజాయి కొనుగోళ్ల గుట్టురట్టయింది. కొమరగుడా జంక్షన్ వద్ద హర్యానా నుంచి వచ్చిన సుల్తాన్ సింగ్ ఓ గుడారం ఏర్పాటు చేసుకుని, సమీప గ్రామాల్లో దుప్పట్ల అమ్మకం ప్రారంభించాడు. అయితే అతడు దుప్పట్లు అమ్ముతూనే మరోవైపు ఎవరికి తెలియకుండా గంజాయి కొనుగోలు చేస్తుండేవాడు. శుక్రవారం ఉదయం అతడు సేకరించిన గంజాయిని తరలించేందుకు సిద్ధం చేస్తుండగా, సమాచారం అందుకున్న పోలీసులు అత డి నివాసానికి చేరుకుని, రూ.660 కిలోల గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించినట్లు ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్‌కుమార్ బనువా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment