విశాఖపట్నం : విశాఖపట్నం జిల్లా అరకులో ఎక్సైజ్ పోలీసులు శనివారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా అక్రమంగా తరలిస్తున్న 700 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందుకు సంబంధించి.. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారును సీజ్ చేశారు. వారిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో వైపు పెద్దబయలు పోలీసులు పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకున్నారు. మండలంలోని సీకరి పంచాయతీ దరియాపల్లికి చెందిన పాంగి జయరాం, గొల్లూరి రాంబాబు కలసి 1000 కిలోల గంజాయిని కొనుగోలు చేసి నిల్వ ఉంచారు. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు ఎస్సై రామకృష్ణ ఆధ్వర్యంలో గ్రామంలో సోదాలు జరిపి ఆ గంజాయిని స్వాధీనం చేసుకుని నిందితులను రిమాండ్కు పంపారు. పట్టుబడిన గంజాయిని ఒడిశా తరలించేందుకు నిందితులు అదను కోసం ఎదురు చూస్తున్నారని ఎస్సై తెలిపారు.