డాక్టర్ కర్రి రామారెడ్డికి కీర్తి పురస్కారం
Published Sun, Jan 29 2017 11:07 PM | Last Updated on Tue, Sep 5 2017 2:25 AM
రాజమహేంద్రవరం రూరల్ :
సమాజంలోని జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు వివిధ రంగాల్లో కృషి చేస్తున్న విశిష్ట వ్యక్తులకు ఇచ్చే కీర్తి పురస్కారాన్ని ప్రముఖ మానసిక వైద్యులు, విద్యావేత్త, ప్రజాసేవకుడు డాక్టర్ కర్రిరామారెడ్డికి ప్రదానం చేయనున్నట్టు ఫిలాంత్రోఫిక్ సొసైటీ వ్యవస్థాపకుడు అద్దంకి రాజయోనా ఓ ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి మూడో తేదీన బొమ్మూరులోని పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం ఆవరణలో ఫిలాంత్రోఫిక్ సొసైటీ, పొట్టిశ్రీరాములు తెలుగువిశ్వవిద్యాలయం సంయుక్తంగా ఆయనకు ప్రదానం చేస్తుందన్నారు. తెలుగు రాష్ట్రాల్లో ప్రప్రథమంగా వైద్య రంగంలో ఇచ్చే డాక్టర్ డీఎల్‌ఎ¯ŒS మూర్తి ప్రతిష్టాత్మక పురస్కారాన్ని అందుకున్న సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామన్నారు.
Advertisement
Advertisement