మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
రాజమహేంద్రవరం క్రైం :
మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ జి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతి«థులుగా వచ్చిన రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ 28 వ రోడ్ భద్రత వారోత్సవాలు మంగళవారం నుంచి 30 వ తేది వరకూ జరుగుతాయన్నారు. ప్రతీ రోజు రక్తదానం శిబిరాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన డ్రైవర్లకు చేయూత అందించడం జరుగుతుందన్నారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్గించడం ద్వారానే ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అన్నారు. డిఫ్యూటీ సీఎంఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల శాతం తక్కువ అన్నారు. ఎస్పీ బి.రాజ కుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండడం వలన ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యులు ఫో¯ŒS చేసి విసిగిస్తుంటారని ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాలలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. సెల్‌లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డీఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐలు సిహెచ్ సూరిబాబు, బాజీలాల్, అర్టీసీ డ్రైవర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు.