urban sp
-
ప్రాణనష్టం నివారణకు రోడ్డుసేఫ్టీ వెహికల్స్
ప్రారంభించిన అర్బన్ ఎస్పీ రాజకుమారి అందుబాటులో మూడు వాహనాలు రాజమహేంద్రవరం రూరల్ : రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశామని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ పి.రాజకుమారి తెలిపారు. శనివారం సాయంత్రం మోరంపూడి సెంటర్లో మూడు వాహనాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ వాహనాలు ఆ ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకుని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చుతాయన్నారు. అర్బ¯ŒS జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 45 మంది, 2014లో 75 మంది మృత్యువాత పడ్డారన్నారు. రాజానగరం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో నరేంద్రపురం, బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో మోరంపూడి, కడియం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో బుర్రిలంక గ్రామాల్లో జాతీయరహదారి పక్కన ఈ వాహనాలు ఉంటాయన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని, ప్రమాదం తెలిసిన వెంటనే ఐదు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటాయన్నారు. అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ : రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ–బీట్ సిస్టమ్‌లో ఆఫ్లై¯ŒS యాప్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్బ¯ŒS జిల్లాలో 68 బీట్లు ఉన్నాయన్నారు. బీట్ షెడ్యూల్ ప్రకారం పది నుంచి 20 పాయింట్లు ఉంటాయన్నారు. ప్రతి పాయింట్ వద్ద బీట్ కానిస్టేబుల్ 20 నుంచి 30 నిమిషాలు ఉండాలన్నారు. ఇప్పటికే 26 సెల్ఫోన్లకు ఈ–బీట్ సిస్టమ్ అప్లోడ్ చేశామన్నారు. కార్యక్రమాల్లో డీఎస్పీలు రమేష్‌బాబు, కులశేఖర్, నారాయణరావు, సత్యానందం, త్రినాథరావు, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇ¯ŒSస్పెక్టర్లు చింతా సూరిబాబు, కనకారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె.వరప్రసాదరావు, సురేష్, కృపానందం, రవీంద్ర, రవికుమార్, రామకోటేశ్వరరావు, సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మానవ తప్పిదాలతోనే రోడ్డు ప్రమాదాలు
రాజమహేంద్రవరం క్రైం : మానవ తప్పిదాల వల్లే రోడ్డు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పేర్కొన్నారు. బుధవారం రాజమహేంద్రవరం ట్రాఫిక్ డీఎస్పీ జి. శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఆర్టీసీ భద్రతా వారోత్సవాల సందర్భంగా ఆర్టీసీ లో పని చేస్తున్న డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతి«థులుగా వచ్చిన రాజమహేంద్రవరం ఆర్టీసీ రీజనల్ మేనేజర్ రవికుమార్ మాట్లాడుతూ ఆర్టీసీ 28 వ రోడ్ భద్రత వారోత్సవాలు మంగళవారం నుంచి 30 వ తేది వరకూ జరుగుతాయన్నారు. ప్రతీ రోజు రక్తదానం శిబిరాలు, రోడ్డు ప్రమాదాలకు గురైన డ్రైవర్లకు చేయూత అందించడం జరుగుతుందన్నారు. డ్రైవర్లకు ట్రాఫిక్ నిబంధనల పై అవగాహన కల్గించడం ద్వారానే ప్రజలు సౌకర్యవంతంగా ప్రయాణించగలరని అన్నారు. డిఫ్యూటీ సీఎంఈ విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ప్రమాదాల శాతం తక్కువ అన్నారు. ఎస్పీ బి.రాజ కుమారి మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు మానవ తప్పిదాల వలనే జరుగుతున్నాయని పేర్కొన్నారు. అప్రమత్తంగా ఉండడం వలన ప్రమాదాలు నివారించవచ్చునని అన్నారు. డ్రైవింగ్ సమయంలో కుటుంబ సభ్యులు ఫో¯ŒS చేసి విసిగిస్తుంటారని ఇలాంటి సమయంలో కొన్ని సందర్భాలలో ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం ఉందని అన్నారు. సెల్లో మాట్లాడుతూ డ్రైవింగ్ చేయవద్దని సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణపై పవర్ పాయింట్ ప్రజెంటేష¯ŒS ద్వారా డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డీఎస్పీలు కులశేఖర్, శ్రీనివాసరావు, ట్రాఫిక్ సీఐలు సిహెచ్ సూరిబాబు, బాజీలాల్, అర్టీసీ డ్రైవర్లు ఇతర అధికారులు పాల్గొన్నారు. -
అసాంఘిక శక్తులను అణచివేస్తాం
ఈవ్‌టీజింగ్, వేధిపులకు పాల్పడితే ఫిర్యాదు చేయండి రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజ కుమారి రాజమహేంద్రవరం క్రైం : అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి అన్నార. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రాజమహేంద్రవరంలోని, రాజేంద్ర నగర్లో ఆమెతో పాటు అదనపు ఎస్పీ ఆర్.గంగాధరరావు పర్యవేక్షణలో ఆకస్మిక తనిఖీలు (కార్డ¯ŒS సెర్చ్) నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణంగా పరిశీలించి ఆ ఇంట్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించారు. ఆయా ఇళ్లలో ఉంటూ సరైన సమాధానం చెప్పని, బయటి వ్యక్తులను, అనుమానితులను, రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తనిఖీలు చేశారు. అనుమానిత వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలు, యజమానులు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బి. రాజకుమారికి స్థానిక మహిళలు తమ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై వివరించారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ అర్బన్ జిల్లా పరిధిలో నేరాలు సాగనీయబోమని హెచ్చరించారు. నగరంలో అనుమానిత ప్రాంతాల్లో ఇటువంటి తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను, ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 56 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు, వాహనాలు యజమానులు వచ్చిన తరువాత రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో నేరస్తుల కదలికలు ఎక్కువగా ఉన్నందున ఈ తనిఖీలు చేసినట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు, ఇబ్బందికరంగా ప్రవర్తించే వారి సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్థానికులకు ఎస్పీ ఫో¯ŒS నెంబర్ ఇచ్చారు. షీటీమ్ ఫో¯ŒS నెంబర్‌ను మహిళలకు ఇచ్చారు. తనిఖీల్లో అర్బన్ పరిధిలోని సెంట్రల్ జో¯ŒS డీఎస్పీ జె. కులశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
అనుమానితుల సమాచారం ఇవ్వండి
అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి వాంబే గృహాల తనిఖీ రికార్డులు లేని ద్విచక్ర వాహనాల గుర్తింపు రాజమహేంద్రవరం సిటీ : అనుమానాస్పదంగా వ్యక్తులు సంచరిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ రాజకుమారి సూచించారు. నేరాలను అదుపునకు ముందస్తు చర్యల్లో భాగంగా నగరంలోని ఆర్యాపురం సమీపంలో ఉన్న ఆదెమ్మదిమ్మ వాంబే గృహాలను ఆదివారం ఆమె తనిఖీ చేశారు. సుమారు 200 మంది పోలీసులు, యాంటీ గూండా స్క్వాడ్‌తో ఈ కార్డన్ చెక్ నిర్వహించారు. ఆదెమ్మదిబ్బ వాంబేగృహాల కేంద్రంగా నగరంలో నేరాలు జరుతున్నాయనే అనుమానంతో తనిఖీలు చేపట్టారు. అక్కడి 1026 గృహాల్లో నివాసం ఉంటున్న వారి వివరాలు పరిశీలించారు. 20 మోటారు సైకిళ్ల గుర్తింపు ఈ తనిఖీల్లో ఏ విధమైన ఆధారాలు లేని 20 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. నగరంలో నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని అదుపు చేసేందుకు ఈ తనిఖీ నిర్వహించినట్టు రాజకుమారి తెలిపారు. కాగా.. రాత్రి సమయాల్లో వాంబే గృహాల సమీపంలో కొందరు పేకాడుతున్నారని, అలాగే మత్తు ఇంజెక్షన్లు వాడుతున్నారని స్థానికులు మహిళలు.. ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో డీఎస్పీలు కులశేఖర్, ఇ¯Œæస్పెక్టర్లు రవీంద్ర, రామకోటేశ్వరరావు పాల్గొన్నారు. -
ఒకే గూటికి పోలీస్
అర్బన్ జిల్లా పరిధిలో చురుగ్గా భవనాల నిర్మాణం త్వరలోనే ప్రారంభోత్సవాలు రాజమహేంద్రవరం క్రైం : రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పరిధిలోని పోలీస్ కార్యాలయాలన్నీ ఒకే గొడుగు కిందకు రానున్నాయి. సుమారు 17. 47 కోట్లతో అర్బన్ కార్యాలయం, డిస్ట్రిక్ ఆర్్మడ్ ఫోర్స్ కార్యాలయం, బెల్ ఆఫ్ ఆర్్మ్స(ఆయుధ గారం), డీఐజీ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం తదితర భవనాలన్నింటినీ రాజమహేంద్రవరం లాలా చెరువు వద్దగల ఓఎన్జీసీ కార్యాలయం సమీపంలో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకూ పోలీస్ కార్యాలయాలకు సరైన భవనాలు లేక శి«థిలావస్థకు చేరిన భవనాల్లోనే కొనసాగాయి. జాంపేట వద్ద ఆర్్మడ్ రిజర్వు కార్యాలయం పూర్తిగా పాడైపోయింది. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కూడా శిథిలావస్థకు చేరడంతో తాత్కాలికంగా నిర్మించిన భవనంలో పరిపాలన సాగిస్తున్నారు. అన్ని డీఎస్పీ కార్యాలయాలు అద్దె భవనాలలోనే పరిపాలన సాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అన్నింటినీ ఓకేచోట నిర్మిస్తున్నారు. రూ.14 కోట్లతో.. అర్బన్ జిల్లా పోలీసు కార్యాలయం రూ. 14 కోట్లతో రూపుదిద్దుకుంటోంది. ఈ భవనంలో పరిపాలన, మినిస్ట్రీయల్, వేలిముద్రల టీమ్, ఐటీ టీమ్, క్రైం తదితర శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉంటాయి. అలాగే క్రైం సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు పెద్ద కాన్ఫెరెన్స్ హాల్ కూడా నిర్మిస్తున్నారు. ప్రత్యేక ఆయుధ గారం రాజమహేంద్రవరం అర్బన్ జిల్లాకు సంబంధించిన ఆయుధ గారం బెల్ ఆఫ్ ఆర్మ్స్ (ఆయుధ గారం) ప్రత్యేకంగా నిర్మించారు. ఇక్కడ అధునాతన ఆయుధాలు దాచేందుకు వీలుగా స్ట్రాంగ్ రూమ్ ఏర్పాటు చేశారు. చుట్టూ రక్షణ కంచెతో నిర్మించిన ఈ భవనంలో ఆయుధాలు దాచేందుకు వీలుగా నిర్మాణం జరిగింది. ఆర్్మడ్ రిజర్వు ఫోర్స్ ఇక్కడ నుంచే కార్యాకలాపాలు సాగిస్తుంది. సీఐడీ భవనం సీఐడీ భవనం ప్రస్తుతం ఏవీ అప్పారావు రోడ్డులో అద్దె భవనంలో కొనసాగుతోంది. ఈ విభాగపు నూతన భవనాన్ని రూ 3.47 కోట్లతో నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పనులు వేగవంతగా జరుగుతున్నాయి. ఈ భవనం 2017 జనవరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. కాగా..అన్ని శాఖల కార్యాలయాలు ఒకేచోట ఉండడం ప్రజలకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది. త్వరలో నూతన భవనాల్లోకి.. రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా పోలీస్ కార్యాలయం మరో నెల రోజుల్లో పూర్తికానుంది. త్వరలోనే ప్రారంభోత్సవం జరుగుతుంది. ప్రస్తుతం అద్దె భవనాల్లో పోలీస్ కార్యాలయాలు కొనసాగుతున్నాయి. –బి.రాజకుమారి, అర్బన్ ఎస్పీ -
హైటెక్ మోసంపై కేసులు నమోదు
కంబాలచెరువు (రాజమహేంద్రవరం): ఇంటివద్దే కూర్చుని వేలాది రూపాయలు సంపాదించవచ్చంటూ ఆశపెట్టి నిరుద్యోగులు, గృహిణుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు దండుకొని బోర్డు తిప్పేసిన ‘ఆపిల్ ఔట్సోర్సింగ్’ సంస్థ మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చోటుచేసుకున్న ఈ వ్యవహారంపై మంగళవారం కూడా పలువురు బాధితులు రాజమహేంద్రవరం వన్‌టౌన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదులు చేశారు. ‘ఇంటివద్దే కూర్చోబెట్టి.. హైటెక్ మోసం’ శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో సోమవారం కథనం ప్రచురితమైన కథనం ఆధారంగా ఆపిల్ ఔట్ సోర్సింగ్ మోసాలు వెలుగులోకి వచ్చాయి. మోసానికి గురైన బాధితులు జిల్లావ్యాప్తంగా ఉండటంతో అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఈ కేసుపై ప్రత్యేక శ్రద్ధకనబరుస్తున్నారు. మంగళవారం వరకు ఈ హైటెక్ మోసంపై 30 వరకు ఫిర్యాదులు అందినట్టు వన్‌టౌన్ సీఐ తెలిపారు. బాధితుల్లో ఎక్కువ మంది రాజమహేంద్రవరానికి చెందినవారే అన్నారు. దీనిపై కేసులు అధికంగా నమోదవడంతో ప్రత్యేక పోలీస్ టీం ఏర్పాటుచేసి నిందితులు పట్టుకుంటామన్నారు. తమకు ఆపిల్ ఔట్సోర్సింగ్ సంస్థ వారు ఇచ్చిన ఫోన్ నంబర్ పనిచేయడంలేదని, బాధితులు ఫిర్యాదులో పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని ఆపిల్ ఔట్సోర్సింగ్ చిరునామాను ‘సాక్షి’ సంపాదించింది. అక్కడ ఈ దందాను ఇంకా భారీస్థాయిలో కొనసాగిస్తున్నట్టు తెలిసింది. హైదరాబాద్‌లోని ఆపిల్ ఔట్సోర్సింగ్ చిరునామా ఇదే... జి,స్టార్ టెక్నాలజీ, 1–8–303/25, నాలుగవ అంతస్తు, ఆర్ఎస్.టవర్స్, నియర్ సింధు భవన్, పీజీ.రోడ్డు, సింధీ కాలనీ, సికింద్రబాద్. నిందితులను పట్టుకుంటాం ఆపిల్ ఔట్సోర్సింగ్ సంస్థ నిర్వాహకులను పట్టుకుంటాం. ఈ వ్యవహారంపై వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసులు నమోదవుతున్నాయి. బాధితులు ఫిర్యాదుతోపాటు ఆ సంస్థవారు ఇచ్చిన పత్రాలను తీసుకువచ్చి వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో ఇవ్వాలి. –రాజకుమారి, అర్బన్‌జిల్లా ఎస్పీ -
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి పట్నంబజారు : కృష్ణా పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పేర్కొన్నారు. నగరంపాలెంలోని పోలీసు కల్యాణ మండపంలో బుధవారం పుష్కరాలను పురస్కరించుకొని పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రియాక్షన్ టీం (క్యూఆర్టీ), రోప్ పార్టీ, వీఐపీ సెక్యూరిటీ, టవర్ వాచ్ టీంలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పుష్కర ఘాట్ల వద్ద విధులపై వివరించారు. ఘాట్ల వద్ద ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు. నేరగాళ్లు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బరాయుడు, బీపీ తిరుపాల్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు. -
అంకితభావంతో పుష్కర విధులు నిర్వర్తించండి
యాత్రికులతో మర్యాదగా వ్యవహరించండి l రాజమహేంద్రవరం అర్బన్ జిల్లా ఎస్పీ రాజకుమారి ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం): గోదావరి అంత్యపుష్కరాలలో అంకితభావంతో విధులు నిర్వర్తించాలని అర్బన్ జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పోలీసులకుసూచించారు. యాత్రికులతో మర్యాదగా వ్యవహరించి వారికి ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా సహకారించాలన్నారు. ఆదివారం నుంచి ప్రారంభం కానున్న అంత్యపుష్కరాలను పురస్కరించుకుని అర్బన్జిల్లాతో పాటు ఉభయగోదావరి జిల్లాల నుంచి వచ్చిన 2500 మంది పోలీసుసిబ్బంది, అధికారులకు శుక్రవారం సాయంత్రం స్థానిక ఎంఆర్ మైదానంలో విధులను కేటాయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అంత్య పుష్కరాల అనుభవంతో కృష్ణాపుష్కరాలలో పనిచేయాల్సి ఉంటుందన్నారు. అర్బన్ పరిధిలో ఏడు ప్రధాన్ఘాట్లను గుర్తించి ఒక్కో ఘాట్‌కు ఒక డీఎస్పీని, ఒక సీఐని పర్యవేక్షకులుగా నియమించామన్నారు. పోలీసు సిబ్బందితో పాటు 200 మంది ఎన్సీసీ, 200 మంది ఎన్ఎస్ఎస్ వలంటీర్లు సేవలందిస్తారన్నారు. పోలీసుగెస్ట్‌హౌస్ వద్ద ప్రధాన కంట్రోలు రూమ్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వాహనాల పార్కింగ్‌కు పది ప్రాంతాలను గుర్తించామన్నారు. జాతీయరహదారి మీదుగా వచ్చే వాహనాలను నగరంలోకి అనుమతించబోమని తెలిపారు. టింబర్‌యార్డు, గోదావరి రైల్వేస్టేçÙన్, సంస్కృత కళాశాలలలో మోటార్‌సైకిల్ పార్కింగ్‌కు అనుమతిస్తామన్నారు. రద్దీగా ఉన్న సమయాల్లో స్నానఘట్టాల పరిసర ప్రాంతాల్లో నివసించే వారు ఇబ్బందులు పడకుండా గుర్తింపు కార్డులు సూచిస్తే తిరగడానికి అనుమతిస్తామన్నారు. అంత్యపుష్కరాల్లో నేరాల నిరోధానికి అనుమానితులు, యాచకులు, నిరాశ్రయులను తరలించేందుకు స్పెషల్ డ్రైవ్ నిర్వహించామని, పాత నేరస్థులకు కౌన్సెలింగ్ ఇచ్చామని తెలిపారు. ఘాట్లు రద్దీగా ఉన్న సమయంలో యాత్రికులను ఇతర ఘాట్లకు తరలించేందుకు చర్యలు తీసుకోవాలని, తప్పిపోయిన వ్యక్తులను వెంటనే సమీపంలోని అవుట్‌పోస్టుకు చేర్చాలని సూచించారు. అనుమానాస్పద వస్తువుల సమాచారాన్ని వెంటనే బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ అధికారులకు తెలియజేయాలన్నారు. అంత్యపుష్కరాలలో పోలీసు సిబ్బంది పాటించాల్సిన అంశాలపై రూపొందించిన పుస్తకాన్ని ఎస్పీ ఆవిష్కరించారు. డీఎస్పీలు అంబికాప్రసాద్, నారాయణరావు, రామకృష్ణ, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టారా!
పుష్కరఘాట్ (రాజ మండ్రి) : రాజమండ్రి అర్బన్ ఎస్పీ హరికృష్ణను లూప్లైన్లో పెట్టారా! పుష్కర ఘాట్ దుర్ఘటనకు బాధ్యుడిని చేస్తూ ఆయనపై వేటు పడనుందా! అంటే అవుననే అంటున్నాయి పోలీసు వర్గాలు. పుష్కరాల ప్రారంభం రోజున పుష్కర ఘాట్ వద్ద జరిగిన తొక్కిసలాటలో 27 మంది మృత్యువాతపడగా, వందలమంది ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటనకు పోలీసుల తీరే కారణమంటూ సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలి సిందే. ఈ సంఘటన అనంతరం పుష్కర విధులకు సంబంధించి అర్బన్ ఎస్పీని లూప్లైన్లోకి నెట్టేశారు. పుష్కర విధులు నిర్వహిస్తున్న అధికారులు, సిబ్బందికి ఆహారం, ఇతర సౌకర్యాల కల్పన బాధ్యతలు అప్పగించారు. ఆయనపై త్వరలో వేటు పడే అవకాశముందని మంత్రు లు, అధికారులు చర్చించుకుంటున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో రాష్ట్ర స్థాయి అధికారులు, మంత్రులపై కూడా వేటు పడే అవకాశాలున్నాయని, అంతకుముందే అర్బన్ ఎస్పీని లూప్లైన్కు పంపారని జిల్లా అధికారులు చర్చించుకుంటున్నారు. అయితే పుష్కర ఏర్పాట్లు, భక్తులను నియంత్రించడంవంటి వ్యవహారాల్లో అర్బన్ పోలీసులను దూరంగా ఉంచారని, సంఘటన జరిగిన తర్వాత అర్బన్ పోలీసులను బలి చేయడం ఎంతవరకూ సమంజసమని పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. కర్నాటక పోలీసు అధికారులకు ప్రాధాన్యం పుష్కరాల నిర్వహణకు సంబంధించి భక్తులను అదుపు చేసే బాధ్యతలను కర్నాటక పోలీసు అధికారులకు పూర్తిస్థాయిలో అప్పగించారు. దఫదఫాలుగా రాజమండ్రి చేరుకున్న కర్నాటక స్టేట్ పోలీస్, కర్నాటక స్టేట్ రిజర్వ పోలీసులకు అన్ని ఘాట్లలో అధిక ప్రాధాన్యమిస్తున్నారు. శాంతిభద్రతల పరిరక్షణను కూడా వారికే అప్పగించారు. పుష్కరాల్లో భక్తుల రద్దీకి అనుగుణంగా చర్యలు చేపట్టడంలో జిల్లా పోలీసు యంత్రాంగం విఫలమైనట్టు ఇప్పటికే సీఎం చెప్పడం కొసమెరుపు. దీంతో ఆ బాధ్యతను కర్నాటక పోలీసులకు అప్పగించి ఉండవచ్చని పలువురు నిపుణులు చెబుతున్నారు. -
అర్బన్ ఎస్పీ అవమానించేలా వ్యవహరించారు
తిరుపతి రూరల్ : ఎమ్మెల్యేల నియోజకవర్గ సమీక్షకు పోలీసులు వెళ్లాలన్న నిబంధనలు లేవని తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖర్‌బాబు ప్రజా ప్రతినిధులను అవమానించేలా వ్యవహరించారని చంద్రగిరి ఎమ్మెల్యే డాక్టర్ చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపించారు. తిరుపతిలోని ఓ ప్రయివేట్ హోటల్లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రగిరి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత తాను తొలిసారిగా నియోజకవర్గ స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం ఏర్పాటు చేశానన్నారు. ఈ సమావేశానికి పోలీసు శాఖ నుంచి ఒక్కరుకూడా హాజరు కాలేదన్నారు. ఇదే విషయం ఎస్పీకి ఫోన్ చేసి చెప్పానన్నారు. ఎమ్మెల్యేల సమీక్షకు పోలీసులు రావాల్సిన పనిలేదని, అలాంటి నిబంధనలేమీ లేవని ఎస్పీ తనకు బదులిచ్చారని చెప్పారు. నిబంధనేమీ లేవని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరానన్నారు. నువ్వూ రాతపూర్వకంగా ఇస్తే నేనూ ఇస్తానని ఎస్పీ చెప్పారని తెలిపారు. ఆ మేరకు తాను ఈ నెల 2 న ఎస్పీకి రాతపూర్వకంగా నియోజకవర్గ సమీక్షకు పోలీసులు ఎందుకు రాలేదో తెలియజేయాలని కోరానన్నారు. ‘ఎమ్మెల్యే నియోజకవర్గ సమీక్షకు పోలీసులు హాజరవ్వాలా... వద్దా’ అనే నిబంధన తనకు తెలియదని, నిబంధనల కోసం డీజీపీకి లేఖ రాశానని ఎస్పీ తనకు రెండువారాల తర్వాత రిప్లై ఇచ్చారన్నారు. నిబంధనలు తెలియనప్పుడు సమీక్షకు పోలీసులను పంపాల్సిన పనిలేదని ఎందుకు అన్నారో వివరణ ఇవ్వాలన్నారు. ఎస్పీ ప్రజా ప్రతినిధులను అవమానించే విధంగా వ్యవహరించారన్నారు. ఫోన్లో ఎస్పీకి తనకు మధ్య జరిగిన సంభాషణను పత్రికలకు చెప్పి వార్తలు రాయించడం ఆయనకు తగదన్నారు. అందుకే ఎస్పీకి, తప్పుడు కథనం రాసిన ఓ పత్రికకు నోటీసులు ఇచ్చానని చెప్పారు. అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలి ఓటేరు చెరువుని అన్యాక్రాంతం చేసిన అధికారులపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి డిమాండ్ చేశారు. పేదలు ఇల్లు కట్టుకోవాలంటే సవాలక్ష రూల్స్ చెప్పే అధికారులు అప్పనంగా కోట్ల విలువ చేసే చెరువును కట్టబెట్టడంపై ఆయన మండిపడ్డారు. అవినీతి అధికారులను తక్షణం సస్పెండ్ చేయాలన్నారు. అవిలాల గ్రామ కంఠంలో ఉన్న ఓటేరు చెరువుకు పట్టాలు ఇవ్వడం వెనుక భారీ మొత్తంలో చేతులు మారాయన్నారు. పట్టాలు, పాస్ పుస్తకాలు ఇచ్చిన స్థలం పక్కాగా చెరువని రెవెన్యూ అధికారులే న్యాయస్థానంలో కేసువేశారని గుర్తు చేశారు. రెండు రోజుల్లో రూ.300 కోట్ల విలువ చేసే చెరువును అమ్మేశారంటే అధికారులు ఏ స్థాయిలో అడ్డదారి తొక్కారో తెలుస్తోందన్నారు. ఓటేరు చెరువు ఒకవేళ చెరువు కాదని తేలితే ఆ స్థలాన్ని స్వాధీనం చేసుకుని పేదలకు పట్టాలివ్వాలని డిమాండ్‌చేశారు. ఈ విషయంపై అసెంబ్లీ, న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు. -
అర్బన్ ఎస్పీ తీరుపై చెవిరెడ్డి మండిపాటు
తిరుపతి అర్బన్ ఎస్పీ రాజశేఖరబాబు తీరుపై వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. ప్రొటోకాల్ విషయంలో వారం క్రితం తాను ఫోన్లో మాట్లాడిన విషయాలను ఆయన ఉద్దేశపూర్వకంగానే ఈనాడు పత్రికకు లీక్ చేశారని, తన పరువుకు భంగం కలిగించినందున ఎస్పీపై తాను పరువునష్టం దావా దాఖలు చేశానని ఆయన చెప్పారు. అయితే, వారం రోజుల క్రితం తాను రాసిన లేఖకు అర్బన్ ఎస్పీ నుంచి ఇంతవరకు ఎలాంటి సమాధానం లేదని ఆయన అన్నారు. ఇప్పటికైనా తన లేఖపై ఎస్పీ స్పందించాలని చెవిరెడ్డి భాస్కరరెడ్డి డిమాండ్ చేశారు.