- ఈవ్‌టీజింగ్, వేధిపులకు పాల్పడితే ఫిర్యాదు చేయండి
- రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ రాజ కుమారి
అసాంఘిక శక్తులను అణచివేస్తాం
Published Sun, Dec 11 2016 11:10 PM | Last Updated on Mon, Sep 4 2017 10:28 PM
రాజమహేంద్రవరం క్రైం :
అసాంఘిక శక్తులను ఉక్కుపాదంతో అణచివేస్తామని రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి అన్నార. ఆదివారం తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో రాజమహేంద్రవరంలోని, రాజేంద్ర నగర్‌లో ఆమెతో పాటు అదనపు ఎస్పీ ఆర్.గంగాధరరావు పర్యవేక్షణలో ఆకస్మిక తనిఖీలు (కార్డ¯ŒS సెర్చ్) నిర్వహించారు. ప్రతి ఇంటిని క్షుణంగా పరిశీలించి ఆ ఇంట్లో నివసిస్తున్న వారి వివరాలు సేకరించారు. ఆయా ఇళ్లలో ఉంటూ సరైన సమాధానం చెప్పని, బయటి వ్యక్తులను, అనుమానితులను, రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. ఇంటి ముందు పార్కింగ్ చేసిన ద్విచక్ర వాహనాలు, ఆటోలు, తనిఖీలు చేశారు. అనుమానిత వాహనాలు, సరైన పత్రాలు లేని వాహనాలు, యజమానులు లేని వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ బి. రాజకుమారికి స్థానిక మహిళలు తమ ప్రాంతంలో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలపై వివరించారు. ఎస్పీ రాజకుమారి మాట్లాడుతూ అర్బన్ జిల్లా పరిధిలో నేరాలు సాగనీయబోమని హెచ్చరించారు. నగరంలో అనుమానిత ప్రాంతాల్లో ఇటువంటి తనిఖీలు తరచూ నిర్వహిస్తామన్నారు. తనిఖీల్లో ముగ్గురు అనుమానితులను, ముగ్గురు రౌడీ షీటర్లను అదుపులోకి తీసుకున్నారు. రికార్డులు సక్రమంగా లేని 56 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నట్టు, వాహనాలు యజమానులు వచ్చిన తరువాత రికార్డులు పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ ప్రాంతంలో నేరస్తుల కదలికలు ఎక్కువగా ఉన్నందున ఈ తనిఖీలు చేసినట్టు తెలిపారు. గుర్తు తెలియని వ్యక్తులు, ఇబ్బందికరంగా ప్రవర్తించే వారి సమాచారం వెంటనే పోలీసులకు తెలియజేయాలని స్థానికులకు ఎస్పీ ఫో¯ŒS నెంబర్ ఇచ్చారు. షీటీమ్ ఫో¯ŒS నెంబర్‌ను మహిళలకు ఇచ్చారు. తనిఖీల్లో అర్బన్ పరిధిలోని సెంట్రల్ జో¯ŒS డీఎస్పీ జె. కులశేఖర్, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ బి.రామకృష్ణ, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.
Advertisement