రాజమహేంద్రవరం: రాత్రిపూట బయట తిరగొద్దు! | AP News: Rajamahendravaram Leopard Alert By Officials | Sakshi
Sakshi News home page

రాజమహేంద్రవరం: చిరుత సంచారంతో హెచ్చరికలు జారీ

Published Sat, Sep 7 2024 8:32 PM | Last Updated on Sat, Sep 7 2024 8:32 PM

AP News: Rajamahendravaram Leopard Alert By Officials

తూర్పుగోదావరి, సాక్షి: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచరిస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు చిరుత కదలికలను గుర్తించేందుకు 36 ట్రాప్‌ కెమెరాలు, రెండు బోన్లు అమర్చారు. రెండు కెమెరాల్లో పులి సంచరిస్తున్న ఫొటోలు రికార్డయినట్లు అధికారులు తెలిపారు. 

జనసంచారం ఉన్న  రిజర్వ్‌ ఫారెస్ట్‌ పరిసరాల్లో చిరుత సంచరిస్తోందని డీఎఫ్‌వో భరణి చెప్పారు. చిరుతను అడవిలోకి పంపేందుకు కృషి చేస్తామని, అత్యవసరమైతే ఉన్నతాధికారుల అనుమతితో బంధిస్తామని తెలిపారు. శివారు ప్రాంతాలైన హౌసింగ్‌ బోర్డ్‌ కాలనీ,. స్వరూప్‌ నగర్, రూప్‌ నగర్, పద్మావతి నగర్, ఫాతిమా నగర్, తారకరామ నగర్, దివాన్‌ చెరువు పరిసర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. రాత్రిపూట ఆరుబయట కూర్చోవద్దని, పిల్లల్ని బయటకి పంపవద్దని సూచించారు.

చిరుత గురించి సమాచారం తెలిస్తే.. 18004255909 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫోన్‌ చేయాలని చెప్పారు. జాతీయ రహదారి వద్ద దూరదర్శన్‌ కేంద్రం వెనుక చిరుత తిరిగినట్లు ఆనవాళ్లు కనిపించాయి. చిరుత సంచారం దృశ్యాలు దూరదర్శన్‌ కేంద్రం సీసీ కెమెరాలోనూ నిక్షిప్తమయ్యాయి. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement