- ప్రారంభించిన అర్బన్ ఎస్పీ రాజకుమారి
- అందుబాటులో మూడు వాహనాలు
ప్రాణనష్టం నివారణకు రోడ్డుసేఫ్టీ వెహికల్స్
Published Sat, Apr 1 2017 11:29 PM | Last Updated on Thu, Aug 30 2018 5:35 PM
రాజమహేంద్రవరం రూరల్ :
రాజమహేంద్రవరం అర్బన్ పోలీసు జిల్లా పరిధిలోని జాతీయ రహదారిపై జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో ప్రాణనష్టం తగ్గించేందుకు రోడ్డు సేఫ్టీ వాహనాలను ఏర్పాటు చేశామని అర్బ¯ŒS జిల్లా ఎస్పీ పి.రాజకుమారి తెలిపారు. శనివారం సాయంత్రం మోరంపూడి సెంటర్‌లో మూడు వాహనాలను ఆమె ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రమాదం జరిగిన వెంటనే రోడ్డు సేఫ్టీ వాహనాలు ఆ ప్రాంతానికి వెళ్లి క్షతగాత్రులను తీసుకుని సమీపంలోని ఆస్పత్రుల్లో చేర్చుతాయన్నారు. అర్బ¯ŒS జిల్లా పరిధిలో 16వ నంబరు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదాల్లో గతేడాది 45 మంది, 2014లో 75 మంది మృత్యువాత పడ్డారన్నారు. రాజానగరం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో నరేంద్రపురం, బొమ్మూరు పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో మోరంపూడి, కడియం పోలీస్‌స్టేష¯ŒS పరిధిలో బుర్రిలంక గ్రామాల్లో జాతీయరహదారి పక్కన ఈ వాహనాలు ఉంటాయన్నారు. ఈ వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్ ఉందని, ప్రమాదం తెలిసిన వెంటనే ఐదు నిమిషాల్లో ఘటనాస్థలికి
చేరుకుంటాయన్నారు.
అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ : రాజమహేంద్రవరం అర్బ¯ŒS జిల్లాలో ఈ–బీట్ సిస్టమ్ అమలు చేస్తున్నామని ఎస్పీ రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె ఈ–బీట్ సిస్టమ్‌లో ఆఫ్‌లై¯ŒS యాప్‌ను ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ అర్బ¯ŒS జిల్లాలో 68 బీట్లు ఉన్నాయన్నారు. బీట్ షెడ్యూల్ ప్రకారం పది నుంచి 20 పాయింట్లు ఉంటాయన్నారు. ప్రతి పాయింట్ వద్ద బీట్ కానిస్టేబుల్ 20 నుంచి 30 నిమిషాలు ఉండాలన్నారు. ఇప్పటికే 26 సెల్‌ఫోన్లకు ఈ–బీట్ సిస్టమ్ అప్‌లోడ్ చేశామన్నారు. కార్యక్రమాల్లో డీఎస్పీలు రమేష్‌బాబు, కులశేఖర్, నారాయణరావు, సత్యానందం, త్రినాథరావు, జి.శ్రీనివాసరావు, రామకృష్ణ, ఇ¯ŒSస్పెక్టర్లు చింతా సూరిబాబు, కనకారావు, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కె.వరప్రసాదరావు,
సురేష్, కృపానందం, రవీంద్ర, రవికుమార్, రామకోటేశ్వరరావు,
సాయిరమేష్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement