బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
బాధ్యతగా విధులు నిర్వర్తించాలి
Published Wed, Aug 3 2016 9:57 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM
అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి
పట్నంబజారు : కృష్ణా పుష్కరాల్లో ప్రతి ఒక్కరూ బాధ్యతగా విధులు నిర్వర్తించాలని అర్బన్ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్ఠత్రిపాఠి పేర్కొన్నారు. నగరంపాలెంలోని పోలీసు కల్యాణ మండపంలో బుధవారం పుష్కరాలను పురస్కరించుకొని పోలీసు అధికారులు, సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. బాంబ్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, క్విక్ రియాక్షన్ టీం (క్యూఆర్టీ), రోప్ పార్టీ, వీఐపీ సెక్యూరిటీ, టవర్ వాచ్ టీంలకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పుష్కర ఘాట్‌ల వద్ద విధులపై వివరించారు. ఘాట్‌ల వద్ద ఎప్పటికప్పుడు అప్పటి పరిస్థితులను బట్టి తీసుకోవాల్సిన చర్యలను క్షుణ్ణంగా తెలిపారు. స్పెషల్ బ్రాంచ్ పూర్తిస్థాయిలో నిఘా ఉంచాలని ఆదేశించారు. నేరగాళ్లు చేతివాటాన్ని ప్రదర్శించే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. భక్తులతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ విధులు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీలు జె.భాస్కరరావు, సుబ్బరాయుడు, బీపీ తిరుపాల్, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలు తదితరులు పాల్గొన్నారు.
Advertisement