ఒడిశా రైలు దుర్ఘటన పట్ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ చేశారు.
ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే..
‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్‌లో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్‌ఐసీ బాసట
ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్2న జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది.
उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं।
— Gautam Adani (@gautam_adani) June 4, 2023
हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा।
पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है।
Comments
Please login to add a commentAdd a comment