Children Education
-
నెలవారీ సంపాదనలో పొదుపు.. ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా?
నెలవారీ సంపాదనలో పొదుపు చేసిన మొత్తాన్ని.. రిటైర్మెంట్, పిల్లల విద్య, ఇల్లు కొనుగోలు తదితర లక్ష్యాలకు ఎలా కేటాయించుకోవాలి? ఇందుకు ఏదైనా ఆర్థిక సూత్రం ఉందా? – వికాస్ సింగ్మీ ఆదాయం, ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా వివిధ లక్ష్యాల కోసం పొదుపు, పెట్టుబడులు నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఒకరు తమ ఆదాయంలో కనీసం 20 శాతాన్ని పొదుపు చేసి, ఇన్వెస్ట్ చేయాలన్నది సాధారణ సూత్రం. ఈ పొదుపు మొత్తాన్ని వివిధ లక్ష్యాలకు ఎలా విభజించాలనే దానికి సార్వత్రిక సూత్రం అంటూ లేదు. వ్యక్తుల ఆదాయ పరిస్థితులు, రాబడుల ఆకాంక్షలు, లక్ష్యాలకు అనుగుణంగానే నిర్ణయించుకోవాలి.మీ ప్రాధాన్యతలు, కాలవ్యవధికి అనుగుణంగా లక్ష్యాలను స్వల్పకాలం, మధ్యకాలం, దీర్ఘకాలం అంటూ వేరు చేయండి. దీర్ఘకాలం అంటే కనీసం ఏడేళ్లు అంతకుమించిన లక్ష్యాల కోసం ఈక్విటీ సాధనాలపై దృష్టి సారించాలి. ఎందుకంటే ఇవి అద్భుతమైన రాబడులతోపాటు, కాంపౌండింగ్ ప్రయోజనాన్నిస్తాయి. 5–7 ఏళ్ల మధ్యకాల లక్ష్యాల కోసం ఈక్విటీ, డెట్ ఫండ్స్‌లో లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి. వీటిల్లో వృద్ధి, స్థిరత్వం ఉంటుంది. 3–5 ఏళ్ల స్వల్ప కాలానికి సంబంధించిన లక్ష్యాల కోసం ఫిక్స్డ్ డిపాజిట్లు, రికరింగ్ డిపాజిట్లు, లిక్విడ్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేసుకోవాలి.ఇక క్రమం తప్పకుండా అంటే ఆరు నెలలు లేదా ఏడాదికోసారి అయినా మీ పెట్టుబడులు మీ లక్ష్యాలకు అనుగుణంగానే ఉన్నాయా? అన్నది సమీక్షించుకోవాలి. లక్ష్యాలకు చేరువ అవుతున్న క్రమంలో ఈక్విటీ పెట్టుబడులను డెట్ సాధనాల వైపు మళ్లించుకోవాలి. క్రమం తప్పకుండా పొదుపు, వ్యూహాత్మక పెట్టుబడుల ద్వారా మీ ఆర్థిక లక్ష్యాలను చేరుకునే చురుకైన ప్రణాళికను ఆచరణలో పెట్టండి. నా వద్ద 2020లో కొనుగోలు చేసిన డెట్ ఫండ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని విక్రయిస్తే పన్ను భారం ఎలా పడుతుంది? – పి.కె గుప్తాస్థిరమైన రాబడులకు డెట్ ఫండ్స్ మంచి ఎంపిక. మీరు 2020లో డెట్ మ్యూచువల్ ఫండ్స్ కొనుగోలు చేసి, ఇప్పుడు విక్రయిస్తే వచ్చిన లాభంపై 12.5 శాతం పన్ను చెల్లించాలి. పైగా లాభంలో ద్రవ్యోల్బణం ప్రభావం తీసివేసేందుకు (ఇండెక్సేషన్) అవకాశం లేదు. డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన తేదీ, ఎంత కాలం పాటు కొనసాగించారు, ఎప్పుడు విక్రయించారనే ఆధారంగా పన్ను భారం మారిపోతుంది.2023 ఏప్రిల్ 1కి ముందు డెట్ ఫండ్స్ కొనుగోలు చేసిన వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం లభిస్తుంది. కాకపోతే 36 నెలల పాటు వాటిని కొనసాగించి, 2024 జూలై 23లోపు విక్రయించిన వారికే ఈ ప్రయోజనం పరిమితం. మీ కొనుగోలు ధరలో ఇండెక్సేషన్ సర్దుబాటు జరుగుతుంది. దీంతో లాభంపై చెల్లించాల్సిన పన్ను కూడా తగ్గిపోతుంది. కాకపోతే 2023 ఏప్రిల్ 1కి ముందు కొనుగోలు చేసినప్పటికీ, 2024 జూలై 23లోపు విక్రయించని వారికి ఇండెక్సేషన్ ప్రయోజనం కోల్పోయినట్టే.దీంతో గతంతో పోల్చితే డెట్ ఫండ్స్ లాభాలపై ప్రస్తుత పన్ను ఆకర్షణీయంగా లేదు. కాకపోతే మరింత కాలం పాటు డెట్ ఫండ్స్‌లో పెట్టుబడులు కొనసాగించడం ద్వారా సంప్రదాయ ఫిక్స్డ్ డిపాజిట్ల కంటే అధిక రాబడులు పొందేందుకు అవకాశం ఉంటుంది. ఎఫ్డీలపై వడ్డీ ఏటా పన్ను పరిధిలోకి వస్తుంది. డెట్ ఫండ్స్‌లో విక్రయించినప్పుడే లాభంపై పన్ను అమల్లోకి వస్తుంది. -
చంద్రబాబూ.. విద్యార్థుల జీవితాలతో చెలగాటమా?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందంటూ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు. ‘‘చంద్రబాబు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో ఫీజు రీయింబర్స్మెంట్ రాక, ఫీజులు కట్టలేక పనులకు వెళ్తున్న విద్యార్థి కథనం నాకు ఆవేదన కలిగించింది.’’ అంటూ వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.‘‘చంద్రబాబు రాగానే అన్ని రంగాల్లోనూ తిరోగమనమే కనిపిస్తోంది. ముఖ్యంగా విద్యారంగాన్ని దారుణంగా దెబ్బతీశారు. అమ్మ ఒడిని, ఇంగ్లీష్ మీడియాన్ని, 3వ తరగతి నుంచి టోఫెల్, 3వ తరగతి నుంచే సబ్జెక్టు టీచర్లు, సీబీఎస్ఈ, సీబీఎస్ఈ నుంచి ఐబీదాకా ప్రయాణం, 8వ తరగతి పిల్లలకు ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడు ఇలా అన్నింటినీ రద్దుచేసి 1-12వ తరగతి విద్యార్థులను, వారి తల్లులను దెబ్బతీశారు. వసతిదీవెన, విద్యాదీవెన నిలిపేసి, డిగ్రీ, ఇంజినీరింగ్, డాక్టర్ చదువులు చదువుతున్నవారినీ తీవ్రంగా ఇబ్బందిపెడుతున్నారు.’’ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.‘‘వైఎస్సార్సీపీ హయాంలో ప్రతి త్రైమాసికం పూర్తికాగానే తల్లుల ఖాతాలో జమచేసే వాళ్లం. ఇలా గత విద్యాసంవత్సరం డిసెంబర్ త్రైమాసికం వరకూ రూ.12,609 కోట్లు ఒక్క విద్యాదీవెనకే ఖర్చు చేశాం. తలరాతలను మార్చేది చదువులు మాత్రమేనని గట్టిగా నమ్ముతూ వైఎస్సార్సీపీ హయాంలో మొత్తం ఈ రెండు పథకాలకే రూ.18వేల కోట్లు వరకూ ఖర్చు చేశాం.’’ అని వైఎస్ జగన్ వివరించారు.1.@ncbn గారి కూటమి ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోంది. మూడు త్రైమాసికాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులను పిల్లల చదువులకు చెల్లించకపోవడంతో చదువులు మానుకోవాల్సిన పరిస్థితులు వచ్చాయి. చంద్రబాబుగారు వారిపై కక్షకట్టినట్టు వ్యవహరిస్తున్నారు. ఒంగోలు జిల్లా జె.పంగులూరులో… pic.twitter.com/6aXEQoRKqv— YS Jagan Mohan Reddy (@ysjagan) November 24, 2024 ‘‘ఎన్నికల కోడ్ కారణంగా జనవరి-మార్చి త్రైమాసికానికి, ఏప్రిల్ లో వెరిఫికేషన్ చేసి మే నెలలో ఇవ్వాల్సిన ఫీజు డబ్బులు ఇవ్వనీయకుండా ఇదే కూటమి పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేశారు. పోనీ ఎన్నికలు అయిన తర్వాత వీళ్లు జూన్‌లో అయినా ఇచ్చారా అంటే అదీలేదు. అప్పటినుంచి ఒక్కపైసాకూడా చెల్లించడంలేదు. ఏప్రిల్‌లో ఇవ్వాల్సిన వసతి దీవెన పరిస్థితి కూడా అంతే. తర్వాత ఏప్రిల్-జూన్, తర్వాత జులై-సెప్టెంబరు త్రైమాసికాలకు సంబంధించి ఫీజులు చెల్లింపులో ఎలాంటి అడుగూ ముందుకు పడ్డంలేదు. ఇప్పుడు అక్టోబరు-డిసెంబరు త్రైమాసికం కూడా సగం గడిచిపోయింది. దీంతో కలుపుకుంటే సుమారు రూ.2,800 కోట్లకుపైగా ఫీజులు రీయింబర్స్ చేయాల్సి ఉంది. మరో రూ.1,100 కోట్లు లాడ్జింగ్, బోర్డింగ్ ఖర్చుల కింద వసతిదీవెన బకాయిలు కూడా ఉన్నాయి. మొత్తంగా బకాయిలు పెట్టిన డబ్బులు డిసెంబర్ నాటికి రూ.3,900 కోట్లకు చేరుకుంటాయి. కానీ, ఈ ప్రభుత్వం తీరుచూస్తే మాటలేమో కోటలు దాటుతున్నాయి. కాళ్లేమో గడపకూడా దాటడం లేదు’’ అని దుయ్యబట్టారు.‘‘ఫీజులు కట్టకపోతే కాలేజీలకు రానివ్వడంలేదు, చదువులు పూర్తిచేసినవారికి బకాయిలు కడితేగానీ సర్టిఫికెట్లూ ఇవ్వడంలేదు. ఇలా 11 లక్షల మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చేసేదిలేక తల్లిదండ్రులు అప్పులు చేయడమో, వాటిని తీర్చలేక ఆస్తులు అమ్ముకోవడమో చేయాల్సి వస్తోంది. ఏదారీలేనివారు తమ పిల్లలను పనులకు తీసుకెళ్తున్నారు. చదువులకు నిలయమైన ఏపీలో దౌర్భాగ్యకర పరిస్థితులు ఇవి...ప్రభుత్వం వచ్చాక ఇసుక స్కాం, లిక్కర్ స్కాం, పేకాట క్లబ్బులు, మాఫియా సామ్రాజ్యాలు, ప్రైవేటీకరణ ముసుగులో స్కాములు చేస్తూ మెడికల్ కాలేజీలు, ప్రభుత్వ పోర్టులను దోచిపెట్టే స్కాంలు తప్ప పిల్లల చదువుల మీద శ్రద్ధలేకుండా పోయింది. వెంటనే అమ్మకు వందనం, ఫీజు రీయింబర్స్మెంట్ సహా వసతి దీవెన డబ్బులు విడుదల చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. పిల్లల చదువులను దెబ్బతీసే చంద్రబాబు నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: అదిగో పులి... ఇదిగో తోక!సమస్యల వలయంలో సం‘క్షామ’ హాస్టళ్లు -
నాడు చతికిల‘బడి’.. నేడు ఉజ్వలంగా మారి..
సాక్షి, అమరావతి: ప్రభుత్వ బడులను గత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పూర్తిగా నిర్వీర్యం చేశారు. బడుల అభివృద్ధిని పూర్తిగా వదిలేయడంతో చాలా వరకూ శిథిలావస్థకు చేరాయి. ఇలాంటి బడుల్లో ఉండలేక చాలామంది పేదింటి పిల్లలు చదువుకు దూరమయ్యారు. బడులను బాగు చేయాల్సిన ఆ ప్రభుత్వం.. సరిపడినంత మంది విద్యార్థులు లేరన్న సాకుతో 2014–19 మధ్య 1,785 పాఠశాలలను మూసివేసింది. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలను సైతం విద్యా సంవత్సరం ముగిసిపోతున్నా పూర్తిస్థాయిలో అందివ్వలేకపోయింది. పేద పిల్లలకోసం ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజనాన్ని నాణ్యతలేకుండా చేసింది. తన వర్గంగా భావించిన నారాయణ, శ్రీచైతన్య వంటి విద్యా సంస్థలకు మేలు చేసేలా ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేశారు. చివరికి ఎంతో అనుభవం ఉన్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కూడా నారాయణ విద్యా సంస్థల సిబ్బందితో శిక్షణ ఇచ్చేందుకు కాంట్రాక్టు అప్పగించేలా దిగజార్చింది. జగన్ హయాంలో బడులకు మహర్దశ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం పేదింటి పిల్లలు ప్రపంచంతో పోటీ పడాలని అనేక సంస్కరణలను అమలు చేసింది. 58 నెలల్లో దాదాపు రూ.73 వేల కోట్ల నిధులను వెచ్చింది 45 వేల ప్రభుత్వ పాఠశాలలను సమూలంగా మార్చేలా ప్రణాళికను అమలు చేసింది. ఓ పక్క పిల్లలను బడికి పంపించే ప్రతి తల్లి ఖాతాలో జగనన్న అమ్మఒడి కింద రూ.15 వేలు జమ చేసే సంక్షేమ పథకాన్ని అందిస్తూనే మరో పక్క విద్యా సంస్కరణలను అమలు చేసింది. తద్వారా బడిలో హాజరుశాతం గణనీయంగా పెరిగింది. రాష్ట్ర ప్రభుత్వం 2021లో విద్యా సంస్కరణలపై అధ్యయనం చేసింది. ఎంతోమంది నిపుణులైన ఉపాధ్యాయుల సూచనలతో ‘నాడు–నేడు’ పథకానికి శ్రీకారం చుట్టింది. మూడో తరగతి నుంచే అత్యున్నత ప్రమాణాలను అందిస్తూ సబ్జెక్టు టీచర్లతో విద్యా బోధన చేపట్టింది. ఫలితంగా 3వ తరగతి నుంచే విద్యార్థులకు బీఈడీ అర్హత గల సబ్జెక్టు టీచర్ల ద్వారా విద్యాబోధన అందిస్తున్నారు. అంతేగాక 2014–2019 మధ్య చంద్రబాబు ప్రభుత్వం మూసివేసిన 1,785 పాఠశాలలను తిరిగి తెరిపించింది. సర్కారు బడుల నిర్వహణలో ఇద్దరికీ ఉన్న వ్యత్యాసం ఇది. గత ప్రభుత్వం సర్కారు బడులపై చిన్నచూపు చూసింది. ప్రైవేటు యాజమాన్యాల మత్తులో పడి పూర్తిగా నిర్వీర్యం చేసింది. రకరకాల కారణాలతో పెద్ద సంఖ్యలో మూసివేసింది. పైగా విద్యనందించడం ప్రభుత్వ బాధ్యత కాదంటూ సరికొత్త భాష్యం చెప్పింది. ఫలితంగా వేలాదిమంది నిరుపేదలు చదువులకు దూరమయ్యారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ సర్కారు విద్యారంగంలో ప్రత్యేక సంస్కరణలు తీసుకొచ్చింది. ఆధునిక దేవాలయాలుగా తీర్చిదిద్దింది. ప్రతి గ్రామంలో సాంకేతిక పరిజ్ఞానంతో అత్యంత ఆకర్షణీయంగా తరగతిగదులను మార్చింది. మూతపడిన పాఠశాలలను తెరిపించడమే గాకుండా ప్రైవేటు పాఠశాలలకు దీటుగా తయారు చేసింది. ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేసి... జాతీయ స్థాయి పరీక్షలను సమర్థంగా ఎదుర్కొనేలా పిల్లలకు తర్ఫీదునిచ్చింది. రాష్ట్రంలో నెలకొన్న విద్యావిప్లవం నేడు అంతర్జాతీయ వేదికల ప్రశంసలు అందుకునేలా చేసింది. ఉత్తమ ఫలితాల సాధనలో ముందంజ గత ప్రభుత్వం విధానాలతో నిర్వీర్యమైన ప్రభుత్వ విద్యను గాడిన పెట్టేందుకు ముఖ్యమంత్రిగా వై.ఎస్.జగన్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అప్పటికే పలు సంస్థలు చేసిన అధ్యయనాల్లో ప్రాథమిక పాఠశాలల్లోని పిల్లలు వయసుకు తగిన అభ్యాస ఫలితాలను సాధించలేకపోతున్నారని, బోధనా ప్రమాణాలు సైతం తక్కువగా ఉన్నాయని తేల్చారు. ఆరో తరగతికి వచ్చే విద్యార్థులు తక్కువ లెర్నింగ్ స్టాండర్డ్స్‌తో ఉంటున్నారని, సిలబస్‌ను సైతం అర్థం చేసుకోలేకపోతున్నారని, బేసిక్స్ కూడా తెలియడం లేదని తెలుసుకున్నారు. అప్పటినుంచి దానిని అధిగమించేందుకు ప్రత్యేక దృష్టిసారించారు. ► 2021–22 విద్యా సంవత్సరం నుంచి అంగన్వాడీల నుంచి ఉన్నత పాఠశాలల వరకు ప్రభుత్వంలోని అన్ని మేనేజ్మెంట్లలోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు శ్రీకారం చుట్టారు. ఒకటో తరగతి నుంచి ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారు. ► అంగన్వాడీలను పీపీ–1, పీపీ–2 బోధన స్థాయికి పెంచడంతో పాటు ప్రాధమిక పాఠశాలల్లో 45 వేల స్మార్ట్ టీవీలతో, హైస్కూళ్లల్లో 62 వేల ఐఎఫ్‌పీ స్క్రీన్స్‌తో డిజిటల్ విద్యాబోధన ప్రవేశపెట్టారు. ప్రభుత్వ బడిపిల్లలు ఇంగ్లిష్‌లో రాణించేందుకు టోఫెల్ శిక్షణను ప్రవేశపెట్టారు. ► బైలింగ్వుల్ పాఠ్యపుస్తకాలను ప్రవేశపెట్టి ఇంగ్లిష్ నేర్చుకోవడం సులభతరం చేశారు. ప్రాధమిక పాఠశాలల్లోని ఒకటి నుంచి 5 తరగతుల విద్యార్థులకు పాఠ్య పుస్తకాల్లో పదాలతోనే పిక్టోరియల్ డిక్షనరీని రూపొందించి అందించారు. ‘రోజుకో ఇంగ్లిష్ పదం’ నేర్చుకునే విధానం ప్రవేశపెట్టారు. ► 1000 పాఠశాలల్లో సీబీఎస్ఈ బోధనను అమలు చేశారు. ఈ సంస్కరణల ఫలితాలను సైతం తల్లిదండ్రులు చూశారు. 2023–24 విద్యా సంవత్సరంలో దాదాపు 94 శాతం మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీడియంలోనే పరీక్షలు రాశారు. 2022–23లో పదో తరగతి, ఇంటర్మీడియట్లో రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు అన్నీ ప్రభుత్వ విద్యార్థులే కైవసం చేసుకున్నారు. 2025 జూన్ నుంచి ఇంటర్నేషనల్ బాకలారియెట్ బోధనకు శ్రీకారం చుట్టనున్నారు. -
పిల్లల చదువు కోసం ఎందులో పెట్టుబడులు పెడితే మంచిది?
మార్కెట్లలో అస్థిరతలను ఇన్వెస్టర్లు అధిగమించడం ఎలా?– కిరణ్ అస్థిరతలనేవి ఈక్విటీల సహజ లక్షణం. ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా చలిస్తుంటాయి. గడిచిన ఐదు, పదేళ్లుగా మార్కెట్లలో ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇన్వెస్టర్లు వీటిని ఎదుర్కోడం ఎలా అన్నది తెలుసుకోవాలి. ఇందుకోసం కొన్ని చర్యలను అమలు చేయాల్సి ఉంటుంది. ముందుగా ప్రతీ ఇన్వెస్టర్ లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్లను తీసుకుని తమకు, తమ కుటుంబ సభ్యులకు రక్షణ కల్పించుకోవాలి. అత్యవసర సందర్భాల్లో ఈక్విటీ పెట్టుబడులను కదిలించకుండా ఉండాలి. ఇందుకోసం ప్రత్యేకంగా అత్యవసర నిధిని (ఈఎఫ్) ఏర్పాటు చేసుకోవాలి. ఈక్విటీల్లో మీ పెట్టుబడులను కనీసం ఐదు నుంచి ఏడేళ్ల పాటు కదపకూడదు. ఈక్విటీ అస్థిరతలను అధిగమించేందుకు ఈ చర్యలు అవసరం. అలాగే, సిప్ వంటి సాధనాల ద్వారా ఇన్వెస్ట్ చేయడం వల్ల మార్కెట్ అస్థిరతల నుంచి ప్రయోజనాన్ని పొందొచ్చు. సిప్ రూపంలో క్రమం తప్పకుండా ఇన్వెస్ట్ చేసే వారికి మార్కెట్లలో కరెక్షన్లు మంచి అవకాశాలను తెస్తాయి. ఎందుకంటే ఆ సమయాల్లో ఎక్కువ ఫండ్ యూనిట్లను తక్కువ ధరకే సమకూర్చుకోవచ్చు. మార్కెట్లు దిద్దుబాటుకు గురైతే చౌకగా కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. కానీ, మీడియాలో వచ్చే గందరగోళ సమాచారం ఇన్వెస్టర్లను నిరాశకు, అయోమయానికి, భయానికి గురి చేస్తుంది. దాంతో వారు ప్రతికూల సమయాల్లో పెట్టుబడులు చేయడానికి వెనుకాడుతుంటారు. పైగా కొందరు అమ్మకాలు కూడా చేస్తుంటారు. ఇదే అతిపెద్ద తప్పు. ఆ సమయంలో తప్పకుండా సిప్‌ను కొననసాగించాలి. వీలైతే సిప్ మొత్తాన్ని పెంచుకోవాలి. దీనివల్ల దీర్ఘకాలంలో మరిన్ని రాబడులు సమకూర్చుకోడానికి వీలుంటుంది. నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. వారి వయస్సు పదేళ్లలోపే ఉంటుంది. వారి ఉన్నత విద్య కోసం ఏకమొత్తంలో ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇందుకు అనుకూల సాధనాలు ఏవి? – విజయశ్రీ పిల్లల విద్య కోసం ఏక మొత్తంలో ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి?.. చాలా మంది తల్లిదండ్రులు సాధారణంగా ఎదుర్కొనే సందేహం ఇది. ప్రాపర్టీ విక్రయం లేదా బోనస్ లేదా తాతలు తమ మనవళ్లు, మనవరాళ్ల కోసం నగదు బహుమతి ఇచ్చినప్పుడు.. ఆ మొత్తాన్ని పిల్లల భవిష్యత్తు కోసం ఇన్వెస్ట్ చేయాలని చాలా మంది తల్లిదండ్రులు భావిస్తారు. ఇందుకోసం పలు మార్గాలు ఉన్నాయి. సాధారణంగా ఈ మొత్తాన్ని పిల్లల ఉన్నత విద్య కోసం ఇన్వెస్ట్ చేయాలని అనుకుంటే అందుకు, సాధారణంగా పదేళ్ల కాల వ్యవధి ఉంటుంది. అటువంటప్పుడు ఈక్విటీలకు మించి మెరుగైన సాధనం లేదనే చెప్పాలి. ఈక్విటీల్లోనూ ఫ్లెక్సీక్యాప్ విభాగం అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఫ్లెక్సీక్యాప్ పథకాలు పెట్టుబడులను వైవిధ్యం ఉండేలా చూస్తాయి. అన్ని రంగాల పరిధిలో, భిన్న మార్కెట్ క్యాప్ కలిగిన (డైవర్సిఫైడ్) కంపెనీల్లో ఫండ్ మేనేజర్ పెట్టుబడులు పెడతారు. ఒకవేళ పన్ను ప్రయోజనం కూడా కోరుకుంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్)ను ఎంపిక చేసుకోవచ్చు. ఇవి కూడా ఫ్లెక్సీక్యాప్ మాదిరే పనిచేస్తుంటాయి. అన్ని రంగాలకు చెందిన కంపెనీల్లో పెట్టుబడులు పెట్టడం ద్వారా రిస్క్ తగ్గించే విధంగా ఈఎల్ఎస్ఎస్ పథకాల పనితీరు ఉంటుంది. ఈ పథకాల్లో ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.1.5 లక్షలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనం పొందొచ్చు. ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ ఐదేళ్ల కాలంలో సగటున 12 శాతానికి పైనే వార్షిక రాబడులు ఇచ్చాయి. ఈ రాబడి రేటు ప్రకారం ఎవరైనా రూ.లక్షను పదేళ్ల కాలానికి ఇన్వెస్ట్ చేస్తే.. రూ.3.14 లక్షలు సమకూరుతుంది. ఈక్విటీల్లో అస్థిరతలు సహజంగా ఉంటాయి. కనుక ఫ్లెక్సీక్యాప్ పథకాల్లోనూ ఇదే కనిపిస్తుంది. అందుకనే ఈక్విటీల్లో ఏక మొత్తంలో ఇన్వెస్ట్ చేయడం కాకుండా, తమ దగ్గరున్న పెట్టుబడులను కొన్ని విడతలుగా ఇన్వెస్ట్ చేసుకోవాలి. మీ దగ్గర ఉన్న ఏక మొత్తాన్ని ఏదైనా డెట్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేసి.. దాని నుంచి ప్రతి నెలా సిస్టమ్యాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ (ఎన్టీపీ) రూపంలో ఈక్విటీ పథకాల్లోకి మళ్లించుకోవాలి. మూడేళ్ల కాలంలో దీన్ని పూర్తి చేయాలి. దీనివల్ల మార్కెట్ల ర్యాలీ, కరెక్షన్లలోనూ ఇన్వెస్ట్ చేసినట్టు అవుతుంది. -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
ఒడిశా రైలు దుర్ఘటన: వారి బాధ్యత మాదే.. అదానీ కీలక ప్రకటన
ఒడిశా రైలు దుర్ఘటన పట్ల అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో మృతి చెందినవారి పిల్లలకు సంబంధించి కీలక ప్రకటన చేశారు. ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకుంటుందని ప్రకటించారు. ఈ మేరకు హిందీలో ఓ ట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రైలు ప్రయాణ బీమా గురించి తెలుసా? కేవలం 35 పైసలే.. ‘ఒడిశా రైలు ప్రమాదం మమ్మల్ని తీవ్ర మనోవేదనకు గురి చేసింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ తీసుకోవాలని నిర్ణయించాం. బాధితులకు, వారి కుటుంబాలకు ధైర్యాన్ని, మృతుల పిల్లలకు మంచి భవిష్యత్ అందించడం మనందరి బాధ్యత’ అని గౌతమ్ అదానీ ట్విటర్లో పేర్కొన్నారు. ఇదీ చదవండి: ఆ సర్టిఫికెట్లు అవసరం లేదు.. రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు ఎల్ఐసీ బాసట ఒడిశాలోని బాలాసోర్‌లో జూన్2న జరిగిన రైలు ప్రమాదంలో దాదాపు 280 మంది మరణించారు. 800 మందికి పైగా గాయపడ్డారు. బాలాసోర్ జిల్లాలోని బహనాగా బజార్ స్టేషన్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. దీనిపై రైల్వే మంత్రిత్వ శాఖ విచారణకు ఆదేశించింది. उड़ीसा की रेल दुर्घटना से हम सभी बेहद व्यथित हैं। हमने फैसला लिया है कि जिन मासूमों ने इस हादसे में अपने अभिभावकों को खोया है उनकी स्कूली शिक्षा की जिम्मेदारी अडाणी समूह उठाएगा। पीड़ितों एवं उनके परिजनों को संबल और बच्चों को बेहतर कल मिले यह हम सभी की संयुक्त जिम्मेदारी है। — Gautam Adani (@gautam_adani) June 4, 2023 -
రూ. 330 కోట్ల యాప్.. ఈమె స్టార్టప్ పిల్లల కోసమే..
ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.. భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్త వ్యవస్థాపకురాలు. సింగపూర్‌లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్టన్ అనే ప్రీ స్కూల్‌ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడక్కడ బాగా పాపులరైన ప్రీ స్కూల్. దీంతోపాటు పిల్లల కోసం ఆమె ప్రారంభించిన మొబైల్ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది. కోటి డౌన్లోడ్లు లిటిల్ పాడింగ్టన్ ప్రీ స్కూల్‌ను నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్. ఈ అప్లికేషన్ భారత ఉపఖండంలో దాదాపు కోటి మంది డౌన్లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లల విద్యలో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రలైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి. వ్యాపార నేపథ్యం లేకుండానే.. ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు.. ఎటువంటి బిజినెస్ కోర్సులు ఆమె చేయలేదు. కానీ ఈ కంపెనీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది ఫండింగ్ రౌండ్లో సుమారు రూ.60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్ల (రూ. 330 కోట్లు) వాల్యుయేషన్‌తో తమ కంపెనీ రౌండ్‌ను పెంచిందని ప్రేరణ చెప్పారు. తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో తన ఎదుగుదల క్రమబద్ధంగా జరిగిందన్నారు. 30 మంది సిబ్బంది ఉండగా ఏడాదిలోనే రెట్టింపు అంటే 60 మందికి పెంచినట్లు తెలిపారు. ఇండోసియా, వియత్నాంలో తమ సంస్థలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆమె సింగపూర్ వెంచర్లో ఇప్పుడు ఏడు పాఠశాలలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఉపాధ్యాయుల లోటును తీర్చడానికి ఆన్లైన్ విద్యను ప్రారంభించారామె. Honored to be featured in the current edition of @EntrepreneurIND's #Shepreneurs- Women to Watch 2023. Thank you for the feature @PunitaSabharwal https://t.co/IvZLcfsm0b — Prerna Jhunjhunwala (@prernaj87) April 3, 2023 ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది.. -
అక్షరాల రెక్కలనిద్దాం!
బాల్యంలోనే పిల్లల ఊహలకు రెక్కలొస్తాయి. ఆట పాటలతో గడిపే పిల్లలకు ఆటవిడుపుగా కథలు చెప్పాలి. పాటలు పాడించాలి. బొమ్మలు గీయాలని ఉబలాటపడే చిట్టి చేతులకు పెన్సిళ్లు, రంగులు, కాగితాలు అందివ్వాలి. వాళ్ల లేత భుజాల మీద చదువుల భారాన్ని తగ్గించాలి. విజ్ఞానాన్ని వినోదాత్మకంగా పెంపొందించు కోవడానికి ఉపయోగపడే సాధనం బాలసాహిత్యం. పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యం ఉండాల్సిన అవసరాన్ని పాశ్చాత్య ప్రపంచం పద్దెనిమిదో శతాబ్ది నాటికి గాని గుర్తించలేదు. మన దేశం పిల్లలకు ప్రత్యేకమైన సాహిత్యాన్ని క్రీస్తుశకం తొలి సహస్రాబ్ది ప్రారంభం లోనే సృష్టించింది. విష్ణుశర్మ ‘పంచతంత్ర’ ద్వారా పిల్లలను ఆకట్టుకునే కథలు రాశాడు. విష్ణుశర్మ రాసిన ‘పంచతంత్ర’ కథలలో ఎక్కువగా జంతువులు, పక్షులే ప్రధాన పాత్రలు. ఇందులోని కథలేవీ పుక్కిటి పురాణాలు కావు. ఇందులోని కథలు పిల్లల ఆలోచనలకు పదును పెడతాయి. వారికి లోకం పోకడను అవగతం చేస్తాయి. ‘పంచతంత్ర’ కథలు పిల్లలను మాత్రమే కాదు, పెద్దలనూ ఆకట్టుకుంటాయి. ‘పిల్లల పుస్తకాన్ని మీరు పిల్లల కోసం మాత్రమే రాసేటట్లయితే, మీరు విఫలమైనట్లే’ అని అమెరికన్ రచయిత, సినీ దర్శకుడు డాన్ రాఫ్ నిర్మొహమాటంగా తేల్చిచెప్పాడు. సార్వజనీనతే ఉత్తమ బాలసాహిత్యానికి గీటురాయి. ఒకప్పుడు తెలుగులో విరివిగా బాలల పత్రికలు ఉండేవి. రేడియోలో బాలల కార్యక్రమాలు వచ్చేవి. టీవీలు, స్మార్ట్ఫోన్లు లేనిరోజుల్లో పిల్లలకు వాటితోనే చక్కని కాలక్షేపం జరిగేది. చక్రపాణి, నాగిరెడ్డి ప్రారంభించిన ‘చందమామ’ దాదాపు ఆరున్నర దశాబ్దాలు ఆబాల గోపాలాన్నీ అలరించింది. ‘చందమామ’ తెలుగు సహా పదకొండు భాషలలో ప్రచురితమయ్యేది. అగ్రశ్రేణి రచయిత కొడవటిగంటి కుటుంబరావు దాదాపు మూడు దశాబ్దాల పాటు ‘చందమామ’కు సంపాదకుడిగా వ్యవహరించి, ‘చందమామ’ను భారతీయ బాలల పత్రికల్లోనే ధ్రువతారగా తీర్చిదిద్దారు. ‘చందమామ’ ప్రచురణ నిలిచిపోయినా, పాత సంచికలన్నీ ఇంట ర్నెట్లో అందు బాటులో ఉన్నాయి. పెద్దలుగా ఎదిగిన తర్వాత కూడా కొందరు మనసులో బాల్యాన్ని నింపుకొనే ఉంటారు. బహుశా అలాంటి వాళ్లను గురించే ‘పెద్దలు కాలం చెల్లిన పిల్లలు’ అని అమెరికన్ బాలల రచయిత డాక్టర్ సూస్ చమత్కరించాడు. ‘చందమామ’ పాత సంచికలను ఇప్పటికీ ఇష్టంగా చదువుకునే కాలం చెల్లిన పిల్లలు చాలామందే ఉన్నారు. ఆధునిక తెలుగు సాహిత్యంలో బాలసాహిత్యానికి పంతొమ్మిదో శతాబ్దిలోనే పునాదులు పడ్డాయి. రావిపాటి గురుమూర్తి 1834లో ‘పంచతంత్ర కథలు’ సంస్కృతం నుంచి అనువదించారు. ఆ తర్వాతి కాలంలో ‘పంచతంత్ర’ కథలకు తెలుగులో దాదాపు అరడజను అనువాదాలు వెలువ డ్డాయి. పూడూరి సీతారామశాస్త్రి 1845లో ‘పెద్దబాలశిక్ష’ను తొలిసారిగా ప్రచురించారు. ఆయనే 1856లో పిల్లల కోసం ‘నీతి కథలు–చిత్ర కథలు’ ప్రచురించారు. ‘జనవినోదిని’ పత్రిక 1884లో పిల్లల పాటలను ప్రచురించింది. ‘వివేకవతి’ పత్రిక 1908 నుంచి పిల్లల రచనలను ప్రచురించేది. ఆనాటి సుప్రసిద్ధ రచయితల్లో దాదాపు అందరూ బాలల కోసం ప్రత్యేకమైన రచనలు చేశారు. కందుకూరి వీరేశలింగం ‘నీతికథామంజరి’ రాశారు. గిడుగు సీతాపతి పిల్లల కోసం ‘చిలకమ్మ పెండ్లి’, ‘రైలుబండి పాటలు’ రాశారు. వేంకట పార్వతీశ కవులు ‘బాలగీతావళి’ రాశారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, అడివి బాపిరాజు, వావిలికొలను సుబ్బారావు, చింతా దీక్షితులు వంటి సుప్రసిద్ధులు బాలల సాహిత్యాన్ని సృష్టించారు. ‘భారతి’, ‘గృహలక్ష్మి’, ‘ఆంధ్రభూమి’ వంటి పత్రికలు బాల సాహిత్యానికి చెందిన రచనలను కూడా ప్రచురించేవి. తొలి బాలల పత్రిక ‘బాలకేసరి’ 1940లో ప్రారంభమైంది. దానికి ఏడాది ముందే– 1939లో మద్రాసు ఆకాశవాణి కేంద్రం నుంచి న్యాపతి రాఘవరావు బాలల కార్యక్రమాలను ప్రారంభించారు. తెలుగు బాలసాహిత్యంలో ఇవన్నీ ముఖ్యమైన మైలురాళ్లు. తెలుగులో బాలల సాహిత్యానికి ఆనాటి కాలం స్వర్ణయుగం అని చెప్పుకోవచ్చు. ఇరవై ఒకటో శతాబ్ది మొదలయ్యాక తెలుగు బాలల పత్రికలు ఒక్కొక్కటే కనుమరుగవడం మొదలైంది. ఇంగ్లిష్, హిందీ సహా మిగిలిన పలు ప్రధాన భారతీయ భాషల్లో బాలల పత్రికలు ఇంకా ప్రచురితమవుతున్నా, తెలుగులో మాత్రమే కొంత భిన్నమైన పరిస్థితి కనిపిస్తుంది. తెలుగులో ప్రధాన దినపత్రికల ఆదివారం అనుబంధాలకు మాత్రమే ప్రస్తుతం బాలసాహిత్యం పరిమితమవుతోంది. జనాదరణ గల బాలల పత్రిక తెలుగులో ఒక్కటైనా ప్రస్తుతం మనుగడలో లేకపోవడం దురదృష్టకర పరిణామం. ఇంతటి గడ్డు పరిస్థితుల్లోనూ కేవలం బాలల కోసమే ప్రత్యేకంగా రచనలు సాగిస్తున్న రచయితలు ఇంకా ఉండటమే విశేషం. కేంద్ర, రాష్ట్ర సాహిత్య అకాడమీలు ఏటేటా బాల సాహితీవేత్తలకు కూడా అవార్డులు అందిస్తున్నాయి. అయితే, బాల సాహిత్యాన్ని ప్రత్యేకంగా వ్యాప్తిలోకి తెచ్చేందుకు తగినంత చొరవ తీసుకోవడంలో మాత్రం విఫలమవుతున్నాయి. ‘బాల సాహిత్యాన్ని తక్కువ ధరకు అందించాలి. ప్రచురణలకు ప్రభుత్వం ప్రోత్సహించాలి. పుస్తకం ఆకర్షణీయంగా ఉండాలి’ అని కొడవటిగంటి కుటుంబరావు చెప్పిన మాటలను ప్రభుత్వాలు కాస్త పట్టించుకుంటే బాగుంటుంది. రేపటి పౌరులను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలంటే, వారికి తగిన సాహిత్యాన్ని విరివిగా అందుబాటులోకి తేవడం, ఆ సాహిత్యాన్ని ఆసక్తిగా చదివేలా వారిని ప్రోత్సహించడమే సరైన మార్గం. ఇదంతా కాలం చెల్లిన పిల్లలు తప్పనిసరిగా నెరవేర్చాల్సిన బాధ్యత. -
పిల్లల చదువులపై కోవిడ్ ప్రభావం ఎంత?
సాక్షి, అమరావతి: కోవిడ్ కారణంగా రెండేళ్లుగా దెబ్బతిన్న విద్యారంగాన్ని తిరిగి గాడిన పెట్టేందుకు నేషనల్ అచీవ్మెంట్ సర్వే చేపట్టిన కేంద్ర విద్యాశాఖ పలు తరగతుల విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ప్రత్యేకంగా పరీక్షలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా 1.23 లక్షల స్కూళ్లకు చెందిన 30 లక్షల మంది విద్యార్థులు దీనికి హాజరయ్యారు. కోవిడ్ కారణంగా 2017 తరువాత సర్వే నిర్వహించలేదు. శాస్త్రీయతపై అభ్యంతరం.. కోవిడ్ ప్రభావంతో దీర్ఘకాలం పాఠశాలలకు దూరమైన విద్యార్ధులు ఏమేరకు చదవడం, అర్థం చేసుకోవడం, రాయడం చేయగలుగుతున్నారు? దెబ్బతిన్న విద్యార్ధుల చదువులను ఎలా సరిదిద్దాలి? అనే అంశాలపై సర్వే ద్వారా ఒక అవగాహనకు రానున్నారు. విద్యార్ధులు సంతరించుకున్న కొత్త నైపుణ్యాలను గుర్తించి ప్రోత్సహించేందుకు కూడా సర్వే ఉపకరించనుంది. కోవిడ్‌తో పాఠశాలలకు దూరమైన విద్యార్ధులు తమ సమయాన్ని ఇతర అంశాలకు వెచ్చించారు. పెద్దలకు ఇంటి పనుల్లో సహకరించడం, ఫొటోగ్రఫీ, రీడింగ్, గార్డెనింగ్ లాంటివాటిల్లో ఆసక్తిని అంచనా వేసేందుకు సర్వేలో కొన్ని అంశాలను పొందుపరిచారు. అయితే సర్వే ప్రమాణాలను, శాస్త్రీయతను కొన్ని టీచర్ల సంఘాలు తప్పుబడుతున్నాయి. కోవిడ్ సమయంలో పలువురు విద్యార్థులకు ఆన్లైన్ వేదికల ద్వారా బోధన జరగలేదు. మరికొంతమంది గతంలో నేర్చుకున్న అంశాలను కూడా మరిచిపోయారు. ఇప్పుడు విద్యార్ధులందరికీ ఒకే రకమైన పరీక్ష నిర్వహించడం వల్ల సరైన అంచనా ఫలితాలు రావని పేర్కొంటున్నారు. ఇప్పుడిప్పుడే బోధనాభ్యసన ప్రక్రియలు గాడిలో పడుతున్నాయని, ఈ సమయంలో సర్వేలు నిర్వహించి ఇతర కార్యక్రమాలు చేపట్టడం వల్ల ఇబ్బందులు వస్తాయంటున్నారు. స్థానికంగా విద్యార్ధుల పరిస్థితిని ఉపాధ్యాయులే అంచనా వేసి సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. కోవిడ్ కారణంగా దాదాపు రెండేళ్లు స్కూళ్లు మూతపడటంతో బోధనాభ్యసన ప్రక్రియలకు విద్యార్ధులు దూరం కావడం తెలిసిందే. ఆన్లైన్ వేదికలు పూర్తిస్థాయిలో విద్యార్ధులకు మేలు చేకూర్చలేకపోయాయి. పట్టణ, మైదాన ప్రాంతాల్లోని పేద విద్యార్ధులకు కంప్యూటర్లు, ల్యాప్‌టాప్‌లు, ఆండ్రాయిడ్ ఫోన్లు అందుబాటులో లేక వాటిని అందిపుచ్చుకోలేకపోయారు. గ్రామీణ, మారుమూల ఏజెన్సీ విద్యార్ధులకు ఆ అవకాశాలూ లేకపోవడం చదువులపై తీవ్ర ప్రభావం చూపింది. రాష్ట్రం నుంచి లక్ష మంది.. నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (జాతీయ విద్యాపరిశోధన శిక్షణ సంస్థ) ఈ సర్వే కోసం ప్రశ్నపత్రాలను అందించింది. 3, 5 తరగతుల పిల్లలకు లాంగ్వేజెస్, మేథమెటిక్స్, పర్యావరణ అంశాలపై ప్రశ్నలు రూపొందించారు. 8వ తరగతి విద్యార్ధులకు భాషలు, మేథమెటిక్స్, సైన్సు, సోషల్ సైన్సెస్‌లో నైపుణ్యాలను పరీక్షించారు. 10వ తరగతి విద్యార్ధులకు భాషలు, మేథమెటిక్స్ సైన్సు, సోషల్ సైన్సెస్‌తో పాటు ఇంగ్లీషు అంశాల్లో పరిజ్ఞానాన్ని పరిశీలించారు. 22 భాషా మాధ్యమాల్లో ఈ పరీక్షలు జరిగాయి. నూతన జాతీయ విద్యావిధానాన్ని అమల్లోకి తెచ్చాక చేపడుతున్న తొలి సర్వే ఇదే కావడం గమనార్హం. రాష్ట్రంలో ఈ పరీక్షకు లక్ష మంది వరకు విద్యార్థులు హాజరయ్యారు. -
పేదల చదువుకు "లియోన్ హ్యూమన్ ఫౌండేషన్" చేయూత
హైదరాబాద్: సుఖ సంతోషాలతో జీవిస్తున్న కుటుంబంలో అనుకోకుండా జరిగిన ప్రమాదం వలన , ఆ కుటుంబానికి ఆధారమైన నరసింహాచారి మంచానికే పరిమితమయ్యారు. పిల్లల చదువులు, ఇల్లు గడవడం కష్టంగా మారింది. విషయం తెలుసుకున్న లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ (ఆస్టిన్ - టెక్సాస్ ) డైరెక్టర్స్ పుల్లారెడ్డి యెదురు, పరమేశ్వర రెడ్డి నంగి అడ్వయిజరీ కౌన్సిల్ మెంబర్ రవి కుమార్ పులిమి పేద విద్యార్థుల చదువుకు మా సంస్థ తమ వంతు సహాయం చేస్తుందని తెలిపారు. లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ అనుబంధ సంస్థ అయినటువంటి విన్ ఫౌండేషన్ ద్వారా పిల్లల చదువుకు ఒక లక్ష ఎనిమిదివేల రూపాయలచెక్ ని నరసింహాచారితల్లికి అందచేశారు. అయితే, ఈ విషయాన్ని లియోన్ హ్యూమన్ ఫౌండేషన్ దృష్టికి తీసుకొచ్చిన మాధవ రెడ్డి గారిని అభినందించారు . -
పిల్లల చదువుకు ప్లాన్ చేశారా?
నేనెప్పుడూ ఒకటే చెబుతుంటాను. మంచి చదువు చెప్పించడానికి మించి తల్లిదండ్రులు పిల్లలకిచ్చే గొప్ప బహుమతి మరొకటి లేదని. ఇది వారి భవిష్యత్తుకు భద్రతను కల్పిస్తుంది. కాకపోతే పేరున్న విద్యా సంస్థ లేదా విశ్వవిద్యాలయంలో పిల్లల చదివించాలన్న కోరిక ఇప్పటి తల్లిదండ్రులకు భయాన్ని కలిగిస్తోంది. దీనికి కారణం పేరున్న సంస్థలు, విశ్వవిద్యాలయాల్లో ఫీజులు మామూలుగా లేవు. నా అంచనా ప్రకారం చాలా మంది తల్లిదండ్రులు పిల్లల చదువుల కోసం సరైన ప్రణాళికలు లేకుండా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎంత రాబడి వస్తుంది, అది మన పిల్లలకు చదువుకు అక్కరకు వస్తుందా...లేదా! అన్న వాటితో సంబంధం లేకుండా ఎవరో చెప్పారని ఫిక్స్డ్ డిపాజిట్లు లేదా మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. గతంలో మాదిరి పిల్లల చదువులకు డబ్బులు సమకూర్చుకోవడం అంత సులువేమీ కాదు. ఇప్పుడు పరిస్థితులు చాలావరకూ మారాయి. చదువుల్లో పోటీ బాగా పెరిగింది. అలాగే విద్యావ్యయాలు కూడా బాగా పెరిగిపోయాయి. మంచి సంస్థల్లో సీటు పొందడానికి ప్రత్యేకంగా కోచింగ్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇంతటి భారీ వ్యయంతో కూడుకున్న చదువుకు సరైన ప్రణాళిక లేక చాలామంది తల్లిదండ్రులు చదువుల కోసం అప్పులు చేయాల్సి వస్తోంది. ఇది వారి పొదుపు, ఇతర భవిష్యత్తు ఆర్థిక అవసరాలపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. ఇవి ఆలోచించారా? ఇతర ధరల పెరుగుదలతో పోలిస్తే విద్యావ్యయం మరింత వేగంగా పెరుగుతోంది. ఎంత వేగంగా అంటే... జీతాలు ఏ మూలకూ సరిపోనంత. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పిల్లల చదువుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలి. వీటికి బీమా పథకాలు అనువుగా ఉంటాయి. మీ అవసరానికి తగినట్టుగా ఉన్న బీమా పథకాన్ని ఎంచుకోవాలి. ఇందుకోసం ఈ అంశాలను పరిశీలించండి. - ఇంటర్ పూర్తయ్యాక పిల్లలకు కీలకమైన ఉన్నత చదువులు ప్రారంభమవుతాయి. అంటే పిల్లలకు 17-18 ఏళ్లు వస్తాయి. అప్పటికి నగదు చేతికి వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. కాబట్టి పిల్లలకు 17 ఏళ్లు వచ్చే వరకు మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొనసాగించండి. - ఉన్నత చదువుల కోసం ఎంత మొత్తం దాచాలన్నది కీలకమైన ప్రశ్న. దీన్ని లెక్కించడానికి అనేక అంశాలను పరిశీలించాలి. అవసరమైతే నిపుణులైన ఫైనాన్షియల్ అడ్వైజర్స్‌ను సంప్రదించండి. సాధారణంగా ఇప్పుడున్న విద్యావ్యయం 10 ఏళ్లకి రెట్టింపు అవుతుందని ఒక లెక్క. దీని ప్రకారం ఇన్వెస్ట్ చేసుకోండి. లేకుంటే జీతంలో 5-10 శాతం పిల్లల చదువుకోసం పొదుపు చేయండి. - ఇంటర్‌లోపు చదువు వరకు అయ్యే వ్యయాలను మీ నెలవారీ ఇంటి ఖర్చుల్లోకి లెక్కించుకోవాలి. ఇంటర్ తర్వాత నుంచి ఫీజులు బాగా పెరుగుతాయి కాబట్టి దానికి అనుగుణంగా నిధిని సమకూర్చుకోవాలి. ఇందులో మీ పిల్లలు ఎంచుకునే కోర్సును బట్టి కూడా ఎంత మొత్తం, ఎంత కాలానికి అవసరమవుతుందన్నది ఆధారపడి ఉంటుంది. సాధారణంగా గ్రాడ్యుయేషన్ అనేది మూడు నుంచి ఐదేళ్లు ఉంటుంది. మునీష్ షర్దా ఫ్యూచర్ జెనెరాలీ లైఫ్ ఇన్సూరెన్స్ -
బీమా.. ధీమా!
చివరగా కీలకమైన మరో అంశం...! అనుకోని సంఘటన జరిగి పిల్లలు ఒంటరి అయినా మీ ఆశయం నెరవేరాలి. ఈ విషయంలోనే ఇతర సేవింగ్ పథకాలతో పోలిస్తే పిల్లల చదువుకు బీమా పథకాలు ముందు వరుసలో ఉంటాయి. ప్రీమియం చెల్లించే తల్లిదండ్రులకు ఏమైనా జరిగితే భవిష్యత్తు ప్రీమియంలు చెల్లించకుండానే పాలసీ కొనసాగుతుంది. తద్వారా ఎటువంటి ఆర్థిక ఇబ్బంది లేకుండా కుటుంబసభ్యులు మీ ఆశయాన్ని సులభంగా చేరుకోగలరు.