ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా.. భారత్‌కు చెందిన పారిశ్రామికవేత్త వ్యవస్థాపకురాలు. సింగపూర్‌లో పిల్లల కోసం లిటిల్ పాడింగ్‌టన్ అనే ప్రీ స్కూల్‌ను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఇది ఇప్పుడక్కడ బాగా పాపులరైన ప్రీ స్కూల్. దీంతోపాటు పిల్లల కోసం ఆమె ప్రారంభించిన మొబైల్ యాప్‌కు విశేష ఆదరణ లభిస్తోంది.
కోటి డౌన్‌లోడ్‌లు
లిటిల్ పాడింగ్‌టన్ ప్రీ స్కూల్‌ను నిర్వహిస్తూనే కోవిడ్ సమయంలో క్రియేటివ్ గెలీలియో అనే మొబైల్ యాప్‌ను ప్రారంభించారు. ఇది 3 నుంచి 8 సంవత్సరాల పిల్లలకు విద్యను అందించడానికి ఉద్దేశించిన స్టార్టప్. ఈ అప్లికేషన్ భారత ఉపఖండంలో దాదాపు కోటి మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. ఈ యాప్ వీడియోలు, గేమిఫికేషన్, వ్యక్తిగతీకరించిన అభ్యాస ప్రక్రియల ద్వారా పిల్లల విద్యలో సహాయం చేస్తుంది. పిల్లలకు ఇష్టమైన పాత్రలైన చక్ర, బాహుబలి, శక్తిమాన్, బిగ్ బీస్ జూనియర్ తదితర క్యారెక్టర్లు పాఠాలు చెబుతాయి.
వ్యాపార నేపథ్యం లేకుండానే..
ప్రేరణ ఝున్‌ఝున్‌వాలా న్యూయార్క్ యూనివర్సిటీ నుంచి సైన్స్‌లో గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. ఆమెకు ఎలాంటి వ్యాపార నేపథ్యం లేదు.. ఎటువంటి బిజినెస్ కోర్సులు ఆమె చేయలేదు. కానీ ఈ కంపెనీలను ప్రారంభించి విజయవంతంగా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ గత ఏడాది ఫండింగ్ రౌండ్‌లో సుమారు రూ.60 కోట్లు సమీకరించింది. 40 మిలియన్ డాలర్ల (రూ. 330 కోట్లు) వాల్యుయేషన్‌తో తమ కంపెనీ రౌండ్‌ను పెంచిందని ప్రేరణ చెప్పారు.
తక్కువ మార్కెటింగ్ ఖర్చులతో తన ఎదుగుదల క్రమబద్ధంగా జరిగిందన్నారు. 30 మంది సిబ్బంది ఉండగా ఏడాదిలోనే రెట్టింపు అంటే 60 మందికి పెంచినట్లు తెలిపారు. ఇండోసియా, వియత్నాంలో తమ సంస్థలను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు అప్పట్లో ఆమె పేర్కొన్నారు. ఆమె సింగపూర్ వెంచర్‌లో ఇప్పుడు ఏడు పాఠశాలలు ఉన్నాయి. పెరుగుతున్న జనాభా, ఉపాధ్యాయుల లోటును తీర్చడానికి ఆన్‌లైన్ విద్యను ప్రారంభించారామె.
Honored to be featured in the current edition of @EntrepreneurIND's #Shepreneurs- Women to Watch 2023. Thank you for the feature @PunitaSabharwal https://t.co/IvZLcfsm0b
— Prerna Jhunjhunwala (@prernaj87) April 3, 2023
ఇదీ చదవండి: Ameera Shah: కూతురొచ్చింది! చిన్న ల్యాబ్‌ను రూ.వేల కోట్ల సంస్థగా మార్చింది..
Comments
Please login to add a commentAdd a comment