
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా?
కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.
‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు.