breastfeeding
-
తల్లిపాల వారోత్సవాలు: ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు ఏదంటే?
అన్ని దానాల్లోకెల్లా ఉత్తమమైనది అన్నదానం అంటారు. అది పెద్దలకు. మరి చంటి పిల్లలకు? తల్లిపాలు తాగే వీలు లేక పోతపాలు పడక ఆకలితో అల్లాడే చిన్నారి కూనల కోసం తల్లిపాలను దానం ఇవ్వడం ఒక బాధ్యత. తల్లిపాలు పిల్లలకు జీవశక్తి. కాని అవి అందరికీ అందవు. నేటికీ దేశంలో తల్లిపాల బ్యాంకులు అతి తక్కువ ఉన్నాయి. ఆరోగ్యకరమైన బాలింతలు తమ పిల్లలకు సరిపడా పాలు ఇచ్చాక ఇంకా ఎక్కువ ఉంటే అవి దానం చేసే వీలు కొన్నిచోట్ల ఉంది. అక్కడి నుంచి పాలు తెచ్చుకుని తమ పిల్లలకు తాగించే వీలు తల్లులకు ఉంది. ‘తల్లిపాల వారోత్సవాల’ సందర్భంగా తల్లిపాల బ్యాంకుల గురించి ఒక అవగాహన.పుట్టిన వెంటనే పసిబిడ్డకు తల్లిపాలు నోటికి అందితేప్రాణం పుంజుకుంటుంది. కాని కొందరు తల్లులు అనేక కారణాల రీత్యా బిడ్డకు చనుబాలు ఇవ్వరు. ఇలాంటి స్థితి నుంచి తల్లులను సొంత బిడ్డలకు పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించే కార్యక్రమాలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూనే ఉన్నాయి. తల్లిపాల గురించి అవగాహన కల్పించడానికి కేంద్రం ‘మదర్స్ అబ్సల్యూట్’ ఎఫెక్షన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. అయితే ప్రసవం తర్వాత కొందరు తల్లులకు పాలు పడవు. లేదా అనారోగ్య కారణాల రీత్యా పాలు ఇచ్చే వీలు ఉండదు. కాని పిల్లలు తల్లిపాలు తాగే స్థితిలో ఉంటారు. ఇలాంటి వారి కోసం తల్లిపాల బ్యాంకులు కీలకంగా మారాయి. కాని ఇవి ఉండాల్సినన్ని లేవు. దేశవ్యాప్తంగా ఇప్పటికి కేవలం 90 తల్లిపాల బ్యాంకులు ఉన్నాయి. హైదరాబాద్‌తో పాటు సిద్ధిపేట, ఖమ్మంలలో ప్రభుత్వ ఆధ్వర్యంలో పాల బ్యాంకులు ఉన్నాయి. పాల బ్యాంకులకు ఇతర రాష్ట్రాల నుంచి తల్లిపాలను పంపడానికి ‘సుదేనా హెల్త్ ΄ûండేషన్’ కృషి చేస్తోంది. హైదరాబాద్‌లోని కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులు కూడా తల్లిపాలను నిల్వ చేసి, శిశువులకు అందజేస్తున్నాయి.ఆసియాలోనే మొట్టమొదటి తల్లిపాల బ్యాంకు..ముంబైలోని సియోన్ హాస్పిటల్లో హ్యూమన్ మిల్క్ బ్యాంక్‌ను 1989లోప్రారంభించారు. ఇది ఆసియాలో మొట్టమొదటి బ్రెస్ట్ మిల్క్ బ్యాంకు. ఈ ఐదేళ్లలో 43,412 మంది తల్లుల నుండి పాలను విరాళంగా ΄÷ందింది. 10,523 మందికి పైగా నవజాత శిశువులప్రాణాలను రక్షించే పాలను అందించింది. 1989లో నియోనాటాలజీ విభాగం అధిపతి డాక్టర్ జయశ్రీ మోంద్కర్ చొరవతో ఈ పాల బ్యాంక్‌ను ఏర్పాటు చేశారు. ప్రతియేటా 10 వేల నుండి 12 వేల మంది శిశువులు పుడితే వీరిలో 1,500 నుండి 2,000 మంది బ్యాంకు నుండి పాలు ΄÷ందుతున్నారు. సియోన్ హాస్పిటల్ మిల్క్‌బ్యాంక్ గుజరాత్, గోవా, మధ్యప్రదేశ్, డామన్, డయ్యూతో పాటు మహారాష్ట్రలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలోని పాల బ్యాంకుల ఏర్పాటుకు మద్దతు ఇస్తుంది.సంప్రదించి.. పాలు ఇవ్వచ్చు..తల్లికి ఆరోగ్య సమస్యలు ఉంటే వారి పిల్లలకు మరో తల్లి పాలు అవసరం అవుతాయి. వీటిని మేం సేకరించి, పాలను స్టెరిలైజ్ చేసి, ఫ్రీజర్‌లో నిల్వ ఉంచుతాం. శిశువులకు అవసరం అయినప్పుడు ఫ్రీజర్ నుంచి తీసి, రూమ్ టెంపరేచర్‌లోకి వచ్చాక ఇస్తాం. హైదరాబాద్ నీలోఫర్ ఆసుపత్రిలో 2017 నుంచి సుషేన హెల్త్ ఫౌండేషన్ నెలల నిండకుండా పుట్టిన శిశువులకు తల్లి పాలను అందజేసే ఆరోగ్య కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. సాధారణంగా ఇక్కడ నెలకు వెయ్యి ప్రసవాలు అవుతుంటాయి. నెలలు నిండకుండా పుట్టినా, తల్లులకు శస్త్రచికిత్స వంటి సమస్యలు ఉంటే ఆ శిశువుకు ఈ పాల బ్యాంక్ నుంచి పాలను అందిస్తాం. ఎవరైనా తల్లులు తమ బిడ్డకు ఇవ్వగా అదనపు పాలను మా బ్యాంక్‌ను సంప్రదించి, ఇవ్వచ్చు. అందుకు తగిన పరీక్షలు చేసి, పాలను ఎలా సేకరించి, ఇవ్వాలో అవగాహన కల్పిస్తాం.– డా.ఉషారాణి తోట, ప్రొఫెసర్ ఆఫ్ పిడియాట్రిక్స్, నీలోఫర్ హాస్పిటల్బ్లడ్ బ్యాంకులను పోలిన విధంగా! రక్తదానం చేసినట్టుగానే నవజాత శిశువులప్రాణాలను రక్షించడానికి తల్లిపాలను దానం చేయవచ్చు. పాలిచ్చే తల్లులు పంపింగ్ మెషీన్లను ఉపయోగించి లేదా చేతితో అదనపు పాలను సేకరిస్తారు. ఆ తర్వాత వారికి సంబంధం లేని నవజాత శిశువుకు విరాళంగా ఆ పాలను అందిస్తారు.హెచ్ఐవి, హెపటైటిస్, లైంగిక వ్యాధులు లేని తల్లుల నుంచి మాత్రమే టెస్ట్ రిపోర్ట్స్ ఆధారంగా పాల సేకరణ చేస్తారు. అందుకని తల్లులు తమ ఆరోగ్య నివేదికలను ముందుగా పాల బ్యాంకుకు ఇవ్వాలి.ఆరోగ్యకరమైన తల్లులకు తమ పాలు దానంగా ఇవ్వాలని ఉన్నా కుటుంబం అంగీకరించకపోవచ్చు. కుటుంబంప్రోత్సహిస్తే ఎందరో శిశువులకు మేలు జరుగుతుంది.తల్లి పాలను సేకరించి, బ్యాంకుకు ఇచ్చిన తర్వాత, వాటిలో ఏదైనా కలుషితం ఉన్నట్టు తెలిస్తే వెంటనే దాతకు తెలియజేస్తారు. దీని వల్ల ఆ తల్లి ఆరోగ్యస్థితి కూడా మెరుగుపడుతుంది.తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ధాత్రి మదర్స్ మిల్క్ బ్యాంక్ ఉన్న హాస్పిటల్స్, హైదరాబాద్‌లోని నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, ఇఎస్ఐ హాస్పిటల్, మహబూబ్‌నగర్‌లోని గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, కాకినాడలోని ప్రభుత్వ హాస్పిటల్, అమలాపురంలోని డిస్ట్రిక్ట్ హాస్పిటల్ని సంప్రదించి తల్లులు తమ పాలను దానంగా ఇవ్వచ్చు. – నిర్మలారెడ్డి -
వయనాడ్ వారియర్స్: ఈ తల్లి ఒక అద్భుతం!
ప్రకృతి ప్రమాదాలు సంభవించినప్పుడు పాత బట్టలు, గిన్నెలు తీసుకుని బయల్దేరతారు కొందరు. కానీ, తల్లిని కోల్పోయి పాలకోసం ఏడుస్తున్న చంటిపిల్లలకు తన పాలు ఇవ్వడానికి బయల్దేరింది ఆ తల్లి.ప్రకృతి ప్రకోపంతో వయనాడు తల్లడిల్లితే ఆ విషాదంలో కొందరు శిశువులు తల్లిపాలు లేక అల్లాడారు. అయితే ఆ వార్త తెలిసిన వెంటనే ఇడుక్కికి చెందిన భావన బాధిత శిబిరాల దగ్గరకు వెళ్లి తన పాలు అందించింది. నాలుగేళ్ల వయసు, నాలుగు నెలల వయస్సు గల ఇద్దరు పిల్లలు ఆమెకు ఉన్నారు. ఆమె భర్త సజిన్ డ్రైవర్‌గా పనిచేస్తాడు. సేవా కార్యక్రమాలు కూడా చేస్తాడు. వయనాడ్‌లోని పసికందుల అవస్థను భార్యకు చెప్పి తల్లి పాలు ఇచ్చేందుకు ప్రోత్సహించాడు.ఇడుక్కిలోని వారి ఇంటి నుండి పికప్ ట్రక్‌లో కేరళలోని వయనాడ్ కొండలపైకి వెళ్లి మెప్పాడిలోని శిబిరాల్లో కుటుంబాలకు సేవ చేసిన తర్వాత ఇడుక్కికి తిరిగి వచ్చారు ఆ దంపతులు. ‘మేం కొన్ని శిబిరాలు, హాస్టళ్లను సందర్శించాం. నేను ఆరు నెలల కంటే తక్కువ వయస్సు ఉన్న కొంత మంది పిల్లలకు నా పాలు ఇచ్చాను. కొందరికి ఆహారాన్ని తినిపించాను. కొండచరియలు విరిగిపడి గాయపడిన తల్లులు కోలుకున్న వెంటనే తమ పిల్లల బాధ్యతలు స్వీకరించారు. మేం ఒక కుటుంబంగా పిల్లల్ని చూసుకున్నాం. నేను చేస్తున్న పని తెలిసి చాలా మంది మెచ్చుకున్నారు. కొందరు మా ట్రిప్‌ను స్పాన్సర్ చేస్తామన్నారు. కానీ, ఆ మాత్రం ఖర్చును భరించలేమా? నేను తల్లిని, పిల్లలకు తల్లి పాలు ఉత్తమమని నాకు తెలుసు. అందుకే, వాటిని కొందరికైనా అందించాలనుకున్నాను’ అని భావన చెప్పింది. -
Police Officer breastfeeds: అమ్మ ఎక్కడైనా అమ్మే
నెలల పసికందు. తల్లి ఆస్పత్రిలో..బిడ్డ పోలీసు వొడిలో. బిహార్‌కు చెందిన ఒక కూలి మనిషి కేరళలో హాస్పిటల్ పాలైంది. ఆలనా పాలనా చూసేవారులేక బిడ్డ పోలీస్ స్టేషన్‌కు చేరింది. వెక్కి వెక్కి ఏడుస్తున్న పసిగుడ్డును చూసి ఒక పోలీసు గుండె ఆగలేదు. వెంటనే పాలిచ్చింది. ఈ వీడియో చూసినవారు అమ్మ ఎక్కడైనా అమ్మే అంటున్నారు. ఖాకీ యూనిఫామ్ వేసుకున్న మాత్రాన తల్లి గుండె తల్లి గుండె కాకుండా పోతుందా? ఏ తల్లి మనసైనా తన బిడ్డను ఒకలా మరొకరి బిడ్డను ఒకలా చూస్తుందా? ప్రాణం పోసే స్వభావం కదా తల్లిది. ఎర్నాకుళానికి పట్నా నుంచి వలస వచ్చిన ఒక కుటుంబంలో తల్లికి గుండె జబ్బు రావడంతో ఐసియులో చేరింది. అప్పటికే ఆమె భర్త ఏదో కారణాన జైల్లో ఉన్నాడు. ఆమెకు నలుగురు పిల్లలు. ఆఖరుది నాలుగు నెలల పాప. హాస్పిటల్ వాళ్లు దిక్కులేని ఆమె పిల్లల గురించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు వెళ్లి స్టేషన్‌కు తీసుకొచ్చారు. పసిపాప ఏడ్వడం మొదలెట్టింది. ఆర్య అనే పోలీసు ఆఫీసర్ మనసు ఊరికే ఉండలేకపోయింది. ఆమెకు కూడా 9 నెలల పసిపాప ఉంది. అందుకే చటుక్కున పసిదాన్ని ఒడిలోకి తీసుకొని పాలు ఇచ్చింది. ఊరుకో బెట్టింది. పై అధికారులు ఇందుకు అనుమతించారు. కొచ్చి పోలీసులు ఈ వీడియోను ఫేస్బుక్ పేజీలో లోడ్ చేశారు. సాటి మహిళా పోలీసులే కాదు నెటిజన్లు కూడా ఆర్యను మెచ్చుకున్నారు. ఆ బిహార్ మహిళ పూర్తిగా కోలుకునే వరకు పిల్లలను స్టేట్ హోమ్‌కు తరలించి అక్కడ ఉంచుతామని అధికారులు తెలిపారు. పాలిచ్చిన బంధంతో ఆర్య ఆ పసిగుడ్డును హోమ్‌కు వెళ్లి చూడకుండా ఉంటుందా? -
మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్!
పిల్లల చదువు, పెంపకంలో తల్లిపాత్ర కీలకమైనది. తల్లి దినచర్యలో పిల్లలతో హోంవర్క్ చేయించడం ఒక భాగం. అయితే అందరు తల్లులకు ఇది వీలవుతుందా? కాకపోయినా... తప్పదు కదా! అంటుంది ఈ తల్లి, రోడ్డు పక్కన బండిపై పండ్లు అమ్ముకునే ఒక మహిళ, బండి పక్కన నేలపై కూర్చొని పిల్లలతో ఓపిగ్గా హోం వర్క్ చేయిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ‘ఈ వీడియోకు కాప్షన్ ఇవ్వడానికి పదాలు రావడం లేదు’ అని రాస్తూ ఝార్ఖండ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సంజయ్ కుమార్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశాడు. ‘ఈ రోజు పడే కష్టమే రేపటి విజయం’ అని నెటిజనాలు ఆ తల్లిపై ప్రశంసల జల్లు కురిపించారు. ‘మదర్ పవర్ ఈజ్ డివైన్ పవర్’ అని ఒకరు రాశారు. -
వెస్ట్రన్ కల్చర్.. తల్లిపాలు ఇవ్వట్లేదు, అరగంటలోపే మరణాలు
పాశ్చాత్య సంస్కృతి అంటూ కొందరు, సౌందర్యం తగ్గుతుందని మరికొందరు, ఉద్యోగరీత్యా ఇంకొందరు తల్లులు బిడ్డలకు పాలివ్వడం లేదు. పుట్టిన నెలరోజులకే పోతపాలు పట్టిస్తున్నారు. ఇది మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలు బిడ్డకు అమృతంతో సమానమని, పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం వల్ల శిశువుకు అనేక ప్రయోజనాలు ఉన్నట్లు వైద్యులు వివరిస్తున్నారు. నేటికీ కొందరు మూఢ నమ్మకాలతో పుట్టిన రెండు, మూడు రోజుల వరకూ తల్లిపాలను ఇవ్వడం లేదని సర్వేలు వెల్లడిస్తున్నాయి. ఇలాంటి చర్యల వల్ల బిడ్డలతో పాటు, తాము నష్టపోతున్నామనే విషయాన్ని తల్లులు గ్రహించలేక పోతున్నారని వైద్యులు వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో తల్లిపాలలో ఉండే పోషకాలు, బిడ్డ ఎదుగుదలపై చూపే ప్రభావంపై పూర్తిస్థాయిలో అవగాహన కలిగించేందుకు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఏటా ఆగస్టు 1 నుంచి 7 వరకూ వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా నేత్ర, శిశు సంక్షేమశాఖతో కలిసి వైద్య ఆరోగ్యశాఖ అవగాహన కార్యక్రమాలు నిర్వహించనుంది. శిశు మరణాలు నివారించవచ్చు.. ఎక్కువ మంది శిశువులకు ఇన్ఫెక్షన్స్లు సోకడం, పుట్టగానే కామెర్లు, శ్వాసకోశ వ్యాధులతో మరణాలు సంభవించడం జరుగుతున్నట్లు యూనిసెఫ్ గుర్తించింది. అలాంటి మరణాలను నివారించేందుకు పుట్టిన అరగంటలోపు తల్లిపాలు తాగించడం ద్వారా నెలలోపు శిశువుల్లో సంభవించే మరణాలను తగ్గించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ పేర్కొంది. దీంతో తల్లిపాల ఆవశ్యకతపై గర్భిణులుగా ఉన్నప్పటి నుంచే విస్తృతంగా అవగాహన కలిగిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు. తల్లిపాలతో ప్రయోజనాలెన్నో.. ► బిడ్డకు పాలిచ్చే తల్లులకు బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువ. ► రక్తహీనత, ఎముకల బలహీనత వంటి జబ్బులు రావని వైద్యులు చెబుతున్నారు. ► అంతేకాదు బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవం అనంతరం అయ్యే రక్తస్రావాన్ని అదుపు చేస్తాయని వైద్యులు వివరిస్తున్నారు. ► తల్లిపాలలో అన్ని పోషకాలు సమపాళ్లలో ఉంటాయి. వ్యాధి నిరోధకశక్తిని కూడా పెంపొందిస్తాయి. ► తల్లిపాలు తాగిన శిశువుల్లో యాంటీబాడీస్ వృద్ధి చెంది ఇన్ఫెక్షన్లు, నిమోనియా, డయేరియా వంటి వ్యాధులు సోకకుండా నివారించవచ్చు. ► మెదడు ఎదుగుదలకు దోహదం చేయడంతో పాటు, జ్ఞాపకశక్తి పెంపొందుతుంది. తల్లిపాలు తాగిన పిల్లల్లో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. ● పసిబిడ్డకు ► ప్రధాన శత్రువు చలి. బిడ్డను ఒడిలో ఉంచుకుని పాలివ్వడం ద్వారా తల్లిశరీరం నుంచి శిశువుకు అవసరమైన వేడి అందుతుంది. అంతేకాదు తల్లీబిడ్డ మధ్య ఆప్యాయత పెరుగుతుంది. ► ముర్రుపాలు వ్యాధి నిరోధకశక్తిని పెంచడంతో పాటు, శిశువు జీర్ణాశయ అభివృద్ధికి దోహదపడే విటమిన్–ఎ అధిక మోతాదులో ఉంటుంది. ►శిశువు మొట్టమొదట విసర్జించే నల్లటి మెకోనియం అనే మలంతో పాటు, పచ్చకామెర్లు కలిగించే బెలురూబిన్ అనే పదార్థాన్ని కూడా త్వరగా విసర్జించేలా ముర్రుపాలు దోహదం చేస్తాయి. బిడ్డకు మొదటి వారంలో కలిగే పచ్చకామెర్లను నివారిస్తాయి. అవగాహన కల్పిస్తున్నాం తల్లిపాల విశిష్టతపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నాం. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేందాల్లో, కుటుంబ డాక్టర్ కార్యక్రమంలో, వైఎస్సార్ విలేజ్ హెల్త్ క్లినిక్‌లో గర్భిణులు, బాలింతలకు తల్లిపాల విశిష్టతను వివరిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తాం. బిడ్డకు పాలివ్వడం ద్వారా తల్లికీ ప్రయోజనాలు ఉన్నాయని అవగాహన కల్పిస్తాం. – డాక్టర్ మాచర్ల సుహాసిని, వైద్య ఆరోగ్యశాఖాధికారి, ఎన్టీఆర్ జిల్లా -
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు..
టాయ్లెట్లో కూర్చొని మనం తినగలమా? మరి అలాంటప్పుడు తల్లులు తమ పిల్లలకు బహిరంగ ప్రదేశాల్లో పాలివ్వడానికి పబ్లిక్ టాయిలెట్లకు ఎందుకు వెళ్లాలి? సిగరెట్ తాగడం కోసం స్మోకింగ్ జోన్లు ఏర్పాటు చేస్తారు. కానీ, ఆకలితో ఉన్న పిల్లలకు పాలివ్వడానికి ప్రతిచోటా బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్‌లు ఎందుకు లేవు? అందరి ముందు తమ బిడ్డకు పాలిచ్చే తల్లులు ప్రజల చెడు దృష్టిని ఎందుకు ఎదుర్కోవాలి? ఢిల్లీవాసి, న్యాయవాది నేహా రస్తోగి ఈ సమస్యల నుండి తల్లులను రక్షించడానికి ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత దేశవ్యాప్తంగా పింక్ టాయిలెట్లు, పిల్లలకు తల్లిపాలు ఇచ్చే గదులు ప్రారంభమయ్యాయి. ఇప్పటికీ ఆమె ఈ దిశగా తన ప్రచారాన్ని కొనసాగిస్తూనే ఉంది. ప్రజల్లో అవగాహన కలిగిస్తూనే ఉంది. ఇంతకీ నేహా రస్తోగి తల్లిపాల ఆలయాలు ఎందుకు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేసింది. దీని ద్వారా ఆమె ఏం సాధిస్తోంది. లాయర్‌గా ఆమె పోరాటం దేనికి? ముందుగా తను ఎదుర్కొన్న సమస్యను వివరిస్తూ.. ‘‘నేను 2017, అక్టోబరులో మొదటిసారి తల్లిని అయ్యాను. నా బాబుకి మూడు నెలల వయసున్నప్పుడు బెంగళూరు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ నుంచి బయల్దేరాలి. గంటల గంటల ట్రాఫిక్ తాకిడిని తప్పించుకుంటూ విమానాశ్రయానికి చేరుకునేసరికి బాబు ఆకలితో ఏడుపు మొదలెట్టాడు. అక్కడ వాడికి పాలు ఎక్కడ ఇవ్వాలో తెలియలేదు. వాష్‌రూమ్‌లో తల్లి పాలు తల్లిపాలు పట్టేందుకు విమానాశ్రయంలోని వాష్‌రూమ్‌కి వెళ్లాల్సి వచ్చింది. ఆ తర్వాత ఫ్లైట్‌లో వాడికి మరోసారి ఆకలి వేసింది. పక్కన కూర్చున్న వ్యక్తిని ‘బిడ్డకు పాలు పట్టాలి, కొద్దిగా స్థలం ఇవ్వమని అడిగాను. కానీ, అతను కాదన్నాడు. ఎయిర్‌హోస్టెస్‌ను అడిగితే ‘టాయ్‌లెట్‌కి వెళ్లు’ అని చెప్పింది. చాలాసేపు ప్రాధేయపడ్డాక ఎయిర్ హోస్టెస్ కూర్చున్న చోట కూర్చుని, పిల్లవాడికి పాలు పట్టాను. బెంగళూరు విమానాశ్రయంలోనూ బిడ్డకు తల్లి పాలు పట్టేందుకు చోటు లేదు. అలా బిడ్డతో నా మొదటి ప్రయాణం వ్యవస్థ నిర్లక్ష్యం కారణంగా చాలా బాధకారంగా అనిపించింది. గంటల తరబడి నా కొడుకు ఆకలితో ఏడుస్తూ ఉంటే, నేను నిస్సహాయంగా ఉండిపోయాను. విషయ సేకరణ ఈ సంఘటన తర్వాత నేను దేశవ్యాప్త సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డాను. దేశంలో ఎక్కడా చంటి బిడ్డలకు తల్లిపాలు పట్టే గదులు లేవని తెలిసింది. ఈ విషయంపై చాలా మంది మహిళలతో మాట్లాడి, వారి బాధాకరమైన అనుభవాలను విన్నాను. నాలాంటి తల్లులకు బహిరంగ ప్రదేశాల్లో పాలిచ్చే హక్కును కల్పించాలని, అందుకు ఎంతకాలం యుద్ధం చేసినా పర్వాలేదని నిర్ణయించుకున్నా. అదే సమయంలో ఓ ఎంపీ కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతానని హామీ ఇచ్చారు. అప్పుడే ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గీతా మిట్టల్ ఈ కేసు విచారణ సందర్భంగా దేశవ్యాప్తంగా బహిరంగ ప్రదేశాలలో లక్షలాదిమంది చంటిబిడ్డలకు తల్లిపాలు ఇచ్చే ఏర్పాటు లేదని తెలుసుకొని ఆశ్చర్యపోయారు. రైల్వేస్టేషన్, బస్టాప్, ఎయిర్పోర్ట్, మాల్స్‌తో సహా ప్రతి బహిరంగ ప్రదేశాల్లో తల్లిపాల బూత్‌లు ఏర్పాటు చేయాలని కోర్టును కోరాను. తల్లులు పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ కార్యాలయాల్లో కూడా ఈ సదుపాయాన్ని కల్పించాలన్నాను. లైంగిక వేధింపులు బిడ్డలకు చనుబాలివ్వడానికి గదులు అందుబాటులో లేకపోవడంతో తల్లులు రద్దీగా ఉండే ప్రాంతాల్లోనే తమ పిల్లలకు పాలివ్వాల్సి వస్తోంది. ఈ సమయంలో వారు లైంగిక వేధింపులను కూడా ఎదుర్కోవాల్సి వస్తోంది. తల్లి గౌరవాన్ని దెబ్బతీసే వారు ఆమెను గౌరవంగా చూడరు. కంప్లైంట్ చేస్తే టాయ్లెట్లో కూర్చొని పాలు ఇవ్వమని సలహా ఇచ్చేవారున్నారు. కానీ, అటువంటి మురికి, దుర్వాసన ఉన్న ప్రదేశంలో కూర్చొని పాలు ఇవ్వడం తల్లి, బిడ్డ ఇద్దరి ఆరోగ్యానికీ ప్రమాదకరం. ఈ సమస్యకు సంబంధించి అన్ని శాఖలు, ఏజెన్సీలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. 2019లో నిర్ణయం తీసుకుని, ఫీడింగ్ రూమ్‌లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సదుపాయాన్ని కల్పించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు పంపారు. హైకోర్టు తీర్పు తర్వాత చైనా, అమెరికా, లండన్‌తో సహా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మీడియా దానిని కవర్ చేసింది. ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న దేశంలో కనీస సౌకర్యాలు కూడా లేవని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. హైకోర్టు నిర్ణయం తర్వాత పింక్ టాయిలెట్, బ్రెస్ట్ ఫీడింగ్ రూమ్ ప్రారంభమైంది. ఇందులో తల్లులకు ప్రత్యేక భోజన గదులు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ తల్లి హాయిగా కూర్చొని బిడ్డకు పాలు పట్టచ్చు. స్నానం చేసి, బట్టలు కూడా మార్చుకోవచ్చు. ఢిల్లీలో కన్నాట్ ప్లేస్‌లోని పార్లమెంట్ స్ట్రీట్‌లో మొదటి ఫీడింగ్ రూమ్‌ను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఆ తర్వాత ఢిల్లీ ఎన్‌సిఆర్‌లో 700కు పైగా పింక్ టాయిలెట్లు ఏర్పాటు చేశారు. ఆలయాల నుంచీ.. షిర్డీలో సాయిబాబా ఆలయం నుండి తాజ్‌మహల్ వరకు తల్లిపాలు ఇచ్చే గదులు నిర్మించారు. బస్టాప్‌లు, రైల్వే స్టేషన్లలో తల్లిపాల క్యాబిన్లు ప్రారంభించారు. ఇప్పుడు రైల్వేస్టేషన్లలోనే కాదు రైళ్లలో కూడా ప్రత్యేక ఫీడింగ్ క్యాబిన్లను తయారుచేస్తున్నారు. ఈ విజయం ప్రభావం దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ కనిపించింది. తల్లి పాల బ్యాంక్ దేశంలో ఏ ఒక్క తల్లీ బిడ్డ కూడా బహిరంగ ప్రదేశాల్లో ఫీడింగ్ సమస్యను ఎదుర్కోకూడదు. ఈ ఆలోచనతో ‘మాతృ స్పర్ష్ ఇనిషియేటివ్ బై అవ్యన్ ఫౌండేషన్’ పేరుతో ఒక ఎన్జీవోని ప్రారంభించాను. దీని ద్వారా ఫీడింగ్ రూమ్, తల్లి పాల బ్యాంకు సౌకర్యాన్ని కల్పించే ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాను. ఇప్పుడు చాలా మంది తల్లి పాలు కావాలనే వాళ్లు కూడా సంప్రదిస్తున్నారు. దీంతో తల్లిపాలను దానం చేయాలనుకుంటున్న తల్లుల నుంచి పాలుతీసుకొని, అవసరమైన పిల్లలకు ఇస్తుంటాం. ఈ పనిలో ప్రభుత్వాలు చొరవ తీసుకుంటే, ప్రతి బిడ్డ తల్లి పాలు సులభంగా పొందుతుంది. ఆ దిశగానే ఇప్పుడు నేను ప్రయత్నిస్తున్నాను. లండన్ యూనివర్శిటీలో జరుగుతున్న పరిశోధనలో నేను వాదించిన తల్లిపాల కేసు చేర్చారు. కేవలం తొమ్మిది నెలల వయసులో పిల్ దాఖలు చేసినందుకు నా కొడుకు అవ్యన్ పేరు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో నమోదైంది. రొమ్ము లైంగిక అవయవం కాదు. ఇది తల్లి–బిడ్డల మధ్య పవిత్ర సంబంధాన్ని కలిగిస్తుంది. ఈ పోరాటం అంత సులువు కాలేదు. మాది చిన్న కుటుంబం. నా కొడుకు సిజేరియన్ ద్వారా పుట్టాడు. ఈ పోరాటంలో నేను ఆపరేషన్ నుంచి చాలా రోజుల వరకు కోలుకోలేకపోయాను. ఇంటి నుండి కోర్టు పనులు పూర్తయ్యేవరకు పిల్లాడిని పట్టుకొనేదాన్ని. సమాజంలో పాతకాలపు ఆలోచనలను మార్చడం పెద్ద సవాల్. ఎంతో మంది మహిళలు కూడా ఎన్ని ఇబ్బందులు పడినా మాట్లాడలేకపోతున్నారు’’ అంటూ ఈ సమస్య గురించి సుధీర్గంగా తన గళం వినిపిస్తారు ఈ లాయర్. చదవండి: రూమ్, ఫుడ్ ఉచితం, మంచి జీతం.. జాబ్ ఏంటని తెలిస్తే షాక్ అవుతారు! -
హాట్సాఫ్ రమ్య.. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించావు
తల్లికి దూరమైన పన్నెండు రోజుల పసిపాప ఆకలితో ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎక్కువై పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ‘పాపకు ఏమైనా అవుతుందేమో’ అనే భయం ఆవరించింది. అలాంటి విపత్కర సమయంలో దేవుడు పంపిన మనిషిలా వచ్చింది కానిస్టేబుల్ రమ్య... ఒక మహిళ గట్టిగా ఏడుస్తూ పోలీస్‌స్టేషన్‌కు వచ్చింది. ‘ఏమైంది?’ అని అడిగే లోపే తన బిడ్డను భర్త ఎత్తుకెళ్లిపోయాడని గుండెలు బాదుకుంది. తనకూ, భర్తకు మధ్య తగాదాలు జరుగుతున్నాయి. అతడి కోసం వెదికితే జాడలేదు. ‘పాప ఎన్ని ఇబ్బందులు పడుతోందో!’ అనే ఆందోళన అందరిలో మొదలైంది. ప్రాథమిక దర్యాప్తులో అతడు బెంగళూరుకు పారిపోయే ప్రయత్నంలో ఉన్నాడని తెలుసుకున్నారు. చెక్‌పోస్ట్‌ల దగ్గర నిఘా పెట్టారు. వయనాడ్ (కేరళ) సరిహద్దుల దగ్గర చెక్‌పోస్ట్‌లో బాధితురాలి భర్తను పట్టుకున్నారు పోలీసులు. అతడి చేతుల్లో పాప ఉంది. ఎప్పటి నుంచి ఏడుస్తుందో ఏడుస్తూనే ఉంది. పాపను తల్లి దగ్గరకు చేర్చాలంటే చాలా సమయం పట్టేట్లు ఉంది. ఈలోపు పాప పరిస్థితి ఆందోళనకరంగా మారింది, పాప బతకాలంటే పాలు పట్టాలి. తల్లి ఎక్కడో దూరంలో ఉంది. ఈ పరిస్థితుల్లో దేవుడు పంపిన మనిషిలా ముందుకు వచ్చింది పోలీస్ కానిస్టేబుల్ ఎంఆర్ రమ్య. పాప పరిస్థితి చూసి చలించిపోయింది. ఇంటి దగ్గరున్న తన పిల్లలు గుర్తువచ్చారామెకు. ఈ పాప తన మూడో పాప అనుకుంది. అక్కున చేర్చుకుని అమ్మలా పాలు పట్టింది. దాంతో ప్రమాదం తప్పింది. ‘పాపను తల్లికి అప్పగించి ఊరికి వచ్చేసరికి చాలా పొద్దుపోయింది. విపరీతమైన ఆకలి. ఏదైనా తిందామంటే ఒక్క దుకాణం కూడా తెరిచి లేదు. ఆ భయానకమైన ఆకలి కాస్తా ఈ రోజు నేను ఒక మంచిపని చేశాను అని గుర్తు తెచ్చుకోవడంతో మాయమైపోయింది’ అంటుంది రమ్య. రమ్య చేసిన మంచిపని పోలీసు ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. వారామెను సత్కరించి ప్రశంసించారు. కేరళ హైకోర్టు జడ్జి జస్టిస్ దేవన్ రామచంద్రన్ రమ్యను ప్రశంసిస్తూ ఉత్తరం రాశారు. అందులో ఇలా ఉంది... ‘నువ్వు చేసిన మంచి పని పోలీస్ డిపార్ట్మెంట్ మానవతా దృక్పథానికి అద్దం పడుతుంది. నిబద్ధత ఉన్న ఉద్యోగిగా, చల్లని మనసు ఉన్న తల్లిగా ఒకే సమయంలో రెండు విధులు నిజాయితీ గా నిర్వహించావు. మానవత్వంపై ఆశ కోల్పోయిన వారిలో ఆశలు రేకెత్తించేలా చేశావు...’ కోళికోద్‌కు చెందిన రమ్యకు ఇద్దరు పిల్లలు. భర్త స్కూలు టీచర్. ఒకప్పుడు రమ్య పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. అయితే పాపకు పాలు పట్టిన వార్తతో ఆమె పేరు అందరికీ సుపరిచితం అయింది. ఎక్కడికి వెళ్లినా ‘చల్లగా జీవించు తల్లీ’ అనే దీవెనలు లభిస్తున్నాయి. -
బిడ్డకు పాలివ్వడం వల్ల తల్లికి ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు! ఇంకా..
World Breastfeeding Week 2022: శిశువు భూమ్మీదకు వచ్చి ‘కేర్’మనగానే తల్లి స్థనం పాలతో ఉప్పొంగుతుంది. పాలా అవి? శిశువు పాలిటి అమృతం. పుట్టిన బిడ్డ నోటికి స్థన్యమందించడం పాలిచ్చే ప్రతి జీవరాశిలో అత్యంత సహజం. కాని మనిషికి తెలివి జాస్తి. కొందరు తల్లులు కొన్ని కారణాల రీత్యా పిల్లలకు తల్లిపాలను నిరాకరిస్తారు. ‘తల్లి పాలు ఇవ్వండి’ అని వారోత్సవాలు జరపడమే ఒక రకంగా ప్రకృతి విరుద్ధం. బిడ్డకు తల్లి పాలివ్వడమే కదా ప్రకృతి సహజం. తల్లి పాలకు దూరమైన బిడ్డ అమృతానికి దూరమైనట్టు కాదా? ఇంతకాలం తల్లిపాలు బిడ్డకు శ్రేష్ఠం అనుకుంటూ వచ్చాం. కాని తల్లిపాలు ఇవ్వడం వల్ల బిడ్డకు ఎంత ప్రయోజనమో తల్లికీ అంతే ప్రయోజనం అని అధ్యయనాలు చెబుతున్నాయి. ‘తల్లి తన బిడ్డకు పాలివ్వడం ద్వారా ప్రసవానంతర కుంగుబాటుకు దూరమయ్యి ఆనందం, సంతృప్తి పొందుతుంది. ఆరోగ్య లాభాలు! ఆమెకు భవిష్యత్తులో టైప్ 2 డయాబెటిస్, రుమటాయిడ్ ఆర్థ్రరైటిస్, కార్డియోవాస్క్యులర్ డిసీజ్, రక్తపోటు వచ్చే అవకాశాలు తగ్గుతాయి. అన్నింటి కంటే మించి బ్రెస్ట్ కాన్సర్ ప్రమాదం కూడా తప్పుతుంది. ప్రపంచంలో తల్లిపాలు ఇవ్వాలనే చైతన్యం వల్ల తల్లిపాలు ఇచ్చే తల్లుల సంఖ్య పెరగడంతోపాటు బ్రెస్ట్ కాన్సర్ బారిన పడే స్త్రీల సంఖ్య ఏటా 20 వేల చొప్పున తగ్గుతోంది’ అంటారు ఆగ్రాకు చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్ నిహారికా మల్హోత్రా. ముగ్గురికి ఇద్దరు... ప్రపంచ ఆరోగ్య సంస్థ అధ్యయనాల ప్రకారం ప్రపంచంలో ప్రతి ముగ్గురు పిల్లల్లో ఇద్దరికి తల్లిపాలు అందడం లేదు. ‘తల్లిపాలలో యాంటీబాడీస్ ఉంటాయి. పసిపిల్లలకు వచ్చే వ్యాధులను నివారించే శక్తి తల్లిపాలకు ఉంది. బిడ్డ పుట్టాక మొదటి గంటలోనే మొదలెట్టి కనీసం 6 నెలల పాటు తల్లి పాలు ఇవ్వడం మేలని డబ్యు.ఎచ్.ఓ అధ్యయనం తెలుపుతోంది’ అంటారు నిహారిక మల్హోత్రా. పిల్లలకు కూడా! తల్లిపాలు తాగిన పిల్లల కంటే పోతపాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం, అధిక బరువు కనిపిస్తున్నాయి. తల్లిపాలు తాగిన పిల్లల రోగ నిరోధక శక్తి, మానసిక ఆరోగ్యం మిగిలిన పిల్లల్లో కనిపించడం లేదని నిర్థారణ అయింది. అంతే కాదు తల్లిపాలు తాగిన పిల్లల్లో మాటలు తొందరగా రావడం, భాషను గ్రహించే శక్తి ఎక్కువగా ఉండటం కూడా గుర్తించారు. తల్లికి సహాయంగా... బిడ్డకు పాలు ఇవ్వడం బిడ్డను అనుక్షణం గమనించుకోవడం ఇవి తల్లికి చాలా ముఖ్యం అవుతాయి. అందుకు తగ్గట్టుగానే ఇంటి వాతావరణం ఉండాలి. అందుకే పెద్దలు కాన్పుకు పుట్టింటికి పంపేవారు. పుట్టింట్లో తల్లిదండ్రులు తల్లిని చూసుకునేవారు. కాని రెండో కాన్పుకు వచ్చేసరికి ఈ మర్యాదను తప్పిస్తారు. తప్పించవచ్చు... అంతే విశ్రాంతి... చూసుకునే మనుషులు ఉంటే. ఆహారం విషయంలో.. కాన్పు తర్వాత బిడ్డను చూసుకునే తల్లికి భావోద్వేగాలు ఎక్కువగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యం గురించి ఆందోళన ఉంటుంది. వీటి మధ్య వంట– వార్పు ఇతర సంతానం బాగోగులు చూసుకోవడం కూడా భారంగా మారతాయి. భర్త, తల్లిదండ్రులు, అత్తామామలు ఈ విషయంలో పూర్తి శ్రద్ధ పెట్టాలి. అంతేకాదు... పాలిచ్చే తల్లి ఆహారం పట్ల జాగ్రత్త తీసుకోవాలి. ఏవి తింటే ఎక్కువ శక్తి వచ్చి పాలు బాగా పడతాయో తల్లి ఆరోగ్యంగా ఉంటుందో తెలుసుకొని ఆ ఆహారం ఇవ్వాలి. లేకపోవడం తప్పు కాదు... కొందరు తల్లులు ఉద్యోగాలకు వెంటనే వెళ్లాల్సి రావడం వల్ల తల్లి పాలు ఇవ్వడం వీలవదని అంటారు. కొందరికి థైరాయిడ్ వంటి సమస్యల వల్ల తక్కువ పాలు పడవచ్చు. కొందరు తల్లుల్లో ఏ సమస్యలూ లేకపోయినప్పటికీ తగినన్ని పాలు ఉండవు. ఈ సందర్భాలను కూడా కుటుంబం అర్థం చేసుకోవాలి తప్ప ఒత్తిడి పెట్టడం సరి కాదు. కాని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమంటోందంటే తల్లిపాలు ఏ మాత్రం కల్తీ కాలేవు. కాని కలుషితమైన నీటిలో కలిపే పౌడర్, పోతపాల వల్ల జరుగుతున్న పసికందుల మరణాలను తల్లిపాలు ఇవ్వడం ద్వారా 13 శాతం నివారించవచ్చు అని. పోతపాలు తప్పనిసరి అయితే రెట్టింపు జాగ్రత్తలు తీసుకోవాలని గుర్తు పెట్టుకోవాలి. కాని తల్లిపాలు పొందడం పిల్లల ప్రాథమిక హక్కు. ఎందుకంటే ‘బ్రెస్ట్ మిల్క్ ఈజ్ బెస్ట్ మిల్క్’ అనేదే అందరు నిపుణుల నినాదం. చదవండి: Tips For Healthy Pregnancy: గర్భసంచి వదులుగా ఉంది.. కుట్లు వేయాలి? ఏమైనా ప్రమాదమా? -
పాజిటివ్ వచ్చినా తల్లి పాలివ్వొచ్చా? డాక్టర్లు చెప్తున్నదేంటి..
వరంగల్ ఎంజీఎం: ‘కరోనా వైరస్ కొద్ది రోజులుగా విస్తరిస్తోంది. కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పాజిటివ్ నిర్ధారణ అయిన కుటుంబంలో చిన్న పిల్లలు ఉంటే మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రస్తుతానికి చిన్నారులెవరూ కరోనాతో అస్వస్థతకు గురికాకపోవడం మంచి పరిణామమే’ అని ఎంజీఎం పిడియాట్రిక్ ప్రొఫెసర్ డాక్టర్ ఎ.సుధాకర్ శుక్రవారం ‘సాక్షి ఫోన్ ఇన్’లో పేర్కొన్నారు. పలువురు చిన్న పిల్లల తల్లులు తమకు పాజిటివ్ వస్తే.. పిల్లలకు పాలు పట్టించొచ్చా అని డాక్టర్‌ను ప్రశ్నించగా.. పిల్లలకు పాలు ఇవ్వొచ్చని, పాల ద్వారా కరోనా వ్యాప్తి జరగదని స్పష్టం చేశారు. గర్భిణులు 12 వారాల తర్వాత కచ్చితంగా వ్యాక్సినేషన్ చేసుకోవాలని సూచించారు. లేదంటే పుట్టిన పిల్లలకు కరోనా సోకే అవకాశం ఉందన్నారు. ఫోన్ ఇన్ కార్యక్రమంలో మాట్లాడుతున్న డాక్టర్ సుధాకర్ నాకు రెండేళ్ల చిన్నారి ఉంది. కరోనా లక్షణాలుంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? – ప్రియ, హన్మకొండ డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ వచ్చినప్పుడు చిన్నపిల్లల పట్ల జాగ్రత్తగా ఉండాలి. పిల్లల్లో జలుబు, జ్వరం, దగ్గును కరోనా లక్షణాలుగా పరిగణిస్తాం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే కరోనా పరీక్షలు చేయించాలి. నిర్ధారణ అయితే వైద్యుల సలహా మేరకు మందులు వాడాలి. సాధారణ జ్వరం వస్తే పారాసిటమాల్ సిరఫ్ వాడుకోవచ్చు. (చదవండి: కరోనా పాజిటివ్ ఉన్నా.. లేనట్లుగా..) నాకు ఈనెల 13న పాజిటివ్ వచ్చింది. ఐదు రోజుల తర్వాత జ్వరం తగ్గింది. మళ్లీ టెస్టు చేయించుకోమంటారా? – నసీరొద్దీన్, హన్మకొండ డాక్టర్ ::ప్రస్తుతానికి మీకు కరోనా లక్షణాలేమీ లేకపోతే పది రోజుల తర్వాత హోం ఐసోలేషన్ పూర్తి చేసుకుని బయటకు వెళ్లొచ్చు. 14 రోజుల వరకు మాస్క్ తప్పనిసరిగా ధరించి మీ కార్యక్రమాలు చేసుకోవచ్చు. నెగెటివ్ కోసం మళ్లీ పరీక్ష చేసుకోవాల్సిన అవసరం లేదు. పాజిటివ్ నిర్ధారణ అయి ఆరు రోజులైంది. ప్రస్తుతానికి నీరసంగా ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – ఈశ్వర్, భీమారం డాక్టర్ : కరోనా తగ్గిన తర్వాత కొద్దిగా నీరసంగా ఉన్నా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నడుస్తున్నప్పుడు ఇబ్బందిగా ఉన్నా.. శ్వాసకోశ ఇబ్బందులు ఉన్నా వైద్యుడిని సంప్రదించి ఆ మేరకు చికిత్స పొందాలి. కరోనా తగ్గిన తర్వాత కూడా మల్టీ మిటమిన్ మాత్రలు వేసుకోవడం మంచిది. ఒకే గదిలో ఇద్దరు మిత్రులం ఉంటాం. నా మిత్రుడికి పాజిటివ్ వచ్చింది? నాకు కొద్దిగా తలనొప్పిగా ఉంది. పరీక్ష చేసుకోవడం తప్పనిసరా? – లక్ష్మణ్, రాయపర్తి డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన వ్యక్తికి అతి దగ్గరగా ఉన్న ప్రతి ఒక్కరూ పరీక్ష చేసుకోవాల్సిందే. తలనొప్పి.. కొద్ది నీరసంగా ఉందని చెబుతున్నారు కదా.. కరోనా పరీక్ష చేసుకున్న తర్వాత చికిత్స పొందాలి. కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత వ్యాక్సిన్ ఎప్పుడు తీసుకోమంటారు? – భూక్య రామ్, వరంగల్ డాక్టర్ : కరోనా వ్యాధికి గురైన సమయంలో మన శరీరంలో యాంటీబాడీస్ వృద్ధి చెందుతాయి. అందుకే మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకుంటే మంచిది. మా ఇంట్లో నా భర్తకు పాజిటివ్ వచ్చింది. నాకు ఏడాది పాప ఉంది. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోమంటారు? – భీమారం, అనూష డాక్టర్ : ఇంట్లో ఎవరికైనా పాజిటివ్ నిర్ధారణ జరిగినప్పుడు వారికి దూరంగా పిల్లలను ఉంచాలి. వారికి ఎలాంటి లక్షణాలు లేకపోతే ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జ్వరం, జలుబు, దగ్గు వంటి లక్షణాలు కనిపిస్తే వైద్యుడి సలహా మేరకు మాత్రమే మందులు వాడాలి. పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత చిన్నారులకు పాలు ఇవ్వొచ్చా? – భానుప్రియ, పోచమ్మమైదాన్ డాక్టర్ : కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ జరిగిన తర్వాత కూడా మాస్క్, చేతులకు గ్లౌజ్‌లు ధరించి జాగ్రత్తలు పాటిస్తూ చిన్నారులకు పాలు ఇవ్వొచ్చు. తల్లిపాల ద్వారా చిన్నారులకు కరోనా వ్యాప్తి జరగదు. మా ఇంట్లో అందరికి పాజిటివ్ వచ్చింది. ప్రభుత్వం ద్వారా అందిస్తున్న కిట్టు మందులు వాడితే సరిపోతుందా? – సిద్ధార్థ, పలివేల్పుల డాక్టర్ : ప్రభుత్వం అందిస్తున్న కిట్టు మందులు వాడుతున్న సందర్భంలో శ్వాసకోశ ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. ఆక్సిజన్ లెవల్స్‌ను ఎప్పటికప్పుడు చేక్ చేసుకోవాలి. శ్వాసకోశ ఇబ్బందులు ఏర్పడితే వెంటనే వైద్యుడిని సంప్రదించి ఆస్పత్రిలో చేరాలి. (చదవండి: కరోనా ఎఫెక్ట్.. 55 రైళ్లు రద్దు..) -
Baby Blues: పుట్టిన బిడ్డతో పాటే.. బేబీ బ్లూస్..
గర్భం దాల్చడం, బిడ్డకు జన్మనివ్వడం అనేవి మహిళకు ఎంతో ఆనందాన్ని, మర్చిపోలేని అనుభూతిని అందిస్తాయి. అదే సమయంలో కొన్ని శారీరక సమస్యలు కూడా తెచ్చిపెడతాయి. ప్రసవానంతరం 3/4 రోజుల స్వల్ప వ్యవధిలో వచ్చే ఈ తరహా సమస్యలను బేబీ బ్లూస్‌గా పేర్కొంటారు. దీని గురించి అపోలో స్పెక్ట్రా ఆసుపత్రులకు చెందిన క్లినికల్ సైకాలజిస్ట్ డా.మేఘాజైన్ అందిస్తున్న సూచనలివి... దీర్ఘకాలం ఉంటే... హార్మోన్లలో హెచ్చుతగ్గులు తద్వారా వచ్చే ప్రవర్తనా పరమైన మార్పులు, కొంత ఆందోళన తల్లల్లో కనిపించడమే ఈ బేబీ బ్లూస్. సాధారణంగా ఈ తరహా సమస్యలు 10రోజుల్లోగా సర్ధుకుంటాయి. అయితే 2 వారాలకు పైగా కూడా ఉంటే... వీటని ప్రసవానంతర డిప్రెషన్‌గా వ్యవహరిస్తారు. ఆ డిప్రెషన్ తీవ్రతను బట్టి పలు రకాల లక్షణాలు కనిపిస్తాయి. నిద్రలేమి/అతినిద్ర మొదలుకుని తీవ్రమైన అలసట, శక్తి హీనంగా అనిపించడం, ఏకాగ్రత లోపించడం, మతిమరపు, ఆత్మవిశ్వాసం లోపించడం, పుట్టిన బిడ్డ మీద కూడా ఆసక్తి కనపరచకపోవడం..వంటివి ఉంటాయి. ప్రసవానంతర ఒత్తిడి, బ్రెస్ట్ ఫీడింగ్‌కి సంబంధం... అమ్మ పాలను మించిన అమృతం లేదని మన పెద్దలెప్పుడో చెప్పినట్టుగానే ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా తల్లిపాలను పిల్లలకు అందివ్వడాన్ని ప్రోత్సహిస్తోంది. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల పుష్కలమైన పోషకాలు లభించి, బిడ్డకు అవసరమైన శక్తియుక్తులకు బలమైన పునాది పడడంతో పాటు ఇది తల్లి ఆరోగ్యానికి కూడా ఇతోధికంగా సహకరిస్తుందనేది నిస్సందేహం. తల్లిపాలు ఫీల్ గుడ్ హార్మోన్‌గా పిలవబడే ఆక్సిటోసిన్ విడుదలకు కారణమవుతాయి. అంటే... ప్రసవానంతర ఒత్తిడిని తగ్గించడంలో ఇది సహకరిస్తుందని తెలుస్తోంది. అయితే ఒకసారి ప్రసవానంతర డిప్రెషన్‌కు లోనవడం జరిగితే... బ్రెస్ట్ ఫీడింగ్ పట్ల తల్లులు ఎలా స్పందిస్తున్నారో తెలుసుకోవడం కీలకం. కొన్ని సార్లు బంధువులు, సమాజం కోసమే తల్లులు బ్రెస్ట్ ఫీడింగ్‌కు బలవంతంగా అంగీకరించడం వారిలో డిప్రెషన్‌ను మరింత పెంచుతుంది. కాబట్టి తల్లికి కౌన్సిలింగ్‌తో పాటు ప్రత్యామ్నాయాల సూచన కూడా చికిత్సలో భాగం అవుతాయి. గతంలో డిప్రెషన్‌కు గురైన దాఖలాలు ఉన్నా, తమ కుటుంబంలో ఎవరైనా ప్రసవానంతర మానసిక సమస్యలు చవిచూసి ఉన్నా, దీని గురించి జనరల్ ప్రాక్టీషనర్‌తో గర్భం దాల్చిన వెంటనే మాట్లాడాలి. ప్రసవానంతర ఒత్తిడి దరి చేరకుండా కొన్ని నివారణ మార్గాలు కూడా ఉన్నాయి. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించడం, తరచుగా కుటుంబ సభ్యులు, స్నేహితులు,తమ వైద్యునితో ముచ్చటించడం, సన్నిహితులతో కలిసి మంచి ప్రదేశాలలో కాలం గడపడం, గర్భిణిలను స్నేహితులుగా మార్చుకోవడం వంటివి కూడా మేలు చేస్తాయి. –మేఘాజైన్, క్లినికల్ సైకాలజిస్ట్, అపోలో స్పెక్ట్రా హాస్పిటల్, కొండాపూర్ -
తల్లిపాలు: పాలిచ్చే సమయంలో ఈ జాగ్రత్తలు తప్పక తీసుకోండి
బిడ్డకు అమ్మ పాలు వరం.. సురక్షితం.. పౌష్టికాహారం.. అన్ని పోషకాలు అందించి రోగాల నుంచి రక్షించే అమృతం. పోతపాల కంటే తల్లిపాలు తాగే పిల్లలు బలంగా, తెలివిగా ఉంటారన్నది నిరూపితమైన వాస్తవం. శిశువు సంపూర్ణ ఆరోగ్యంతో, వజ్ర సమానమైన రోగనిరోధక శక్తిని పొందాలంటే తల్లిపాలు పట్టించాల్సిందే. తల్లి పాలతో తల్లికి, బిడ్డకు ఇద్దరికీ లాభాలున్నాయి. ఎన్నోరకాల వ్యాధుల నివారణకు దోహదపడుతాయి. ఇంతటి విశిష్టత కలిగిన తల్లిపాలను బిడ్డ ఎంత వయస్సు వచ్చే వరకు ఇవ్వాలి.? రోజుకు ఎన్నిసార్లు పట్టాలి.? ఎలా పట్టాలి.? తల్లిపాలు పుష్కలంగా రావాలంటే ఏమి తినాలి.? ముర్రుపాలు ఎప్పుడు పట్టాలి.? ఇలా చాలా అంశాలపై అందరికి అవగాహన ఉండదు. ఆధునిక కాలం అమ్మలకు మరింత తక్కువ. ఇలాంటి అంశాలను వారికి తెలియజేస్తూ, తల్లిపాల ప్రాముఖ్యతను చాటేందుకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వారోత్సవాలను ఆగస్టు 7వ తేదీ వరకు కోవిడ్–19 నేపథ్యంలో టీ శాట్ ద్వారా నిర్వహించనున్నారు. సాక్షి, మంచిర్యాల: బిడ్డ పుట్టిన గంటలోపు నుంచి 6నెలల వరకు తల్లిపాలు తప్ప మరే పదార్థాలూ ఇవ్వకూడదు. తల్లి పాలు తేలికగా జీర్ణమవుతాయి. అంతే కాకుండా శుభ్రంగా ఎటువంటి క్రీములు లేకుండా ఉంటాయి. శ్వాసకోశ, అలర్జీ, అస్తమా, చర్మవ్యాధుల నుంచి పిల్లలను రక్షిస్తాయి. బిడ్డ మానసిక శారీరక వికాసానికి అవసరమైన పోషకాలు అందిస్తాయి. రోజులో బిడ్డకు 8–10 సార్లు పాలు ఇవ్వాలి. ఆరు మాసాల తర్వాత నుంచి బిడ్డకు తల్లిపాలతో పాటు అనుబంధ ఆహారం ఇవ్వాలి. రెండేళ్ల వరకు క్రమం తప్పకుండా పాలు పట్టాలి. దీంతో ఎలాంటి వ్యాధులు దరిచేరకుండా బిడ్డ ఎదుగుదల సక్రమంగా ఉంటుంది. పాలిచ్చే సమయంలో ఇవి తీసుకోకూడదు.. ♦ బిడ్డకు పాలిచ్చే సమయంలో తల్లి కొన్నింటిపై ప్రత్యేకంగా శ్రద్ధ చూపాలి. బిడ్డను పడుకోబెట్టి, నిలబెట్టి పాలు పట్టకూడదు. ♦ పాలిచ్చే సమయంలో కెఫిన్ అధికంగా ఉండే పదార్థాలు, శీతల పానీయాలు తీసుకోకూడదు. ఇది బిడ్డ శారీరక, మానసిక ఎదుగుదలపై ప్రభావం చూపుతుంది. ముర్రుపాలు తప్పనిసరి ♦ బిడ్డ పుట్టిన మొదటి అరగంటలోపు తల్లులకు వచ్చే పాలను ముర్రుపాలు అంటారు. ♦ ఇవి రోగనిరోధక శక్తిని పెంచడమే కాకుండా బిడ్డకు సమతుల్యమైన పోషకాహార పదార్థాలు అందజేస్తాయి. ఇందులో మాంసకృత్తులు, విటమిన్ ‘ఏ’ ఉంటుంది. ♦ వ్యాధులు రాకుండా ముర్రుపాలు బిడ్డను జీవిత కాలం కాపాడుతాయి. ♦ శిశువు ప్రేగులను శుభ్రం చేసి, మొదటి మల విసర్జనకు తోడ్పడుతాయి. ♦ తల్లులు సహజంగా బిడ్డకు సరిపడా పాలు రావడం లేదని అనుకోవడం అపోహ మాత్రమే. ♦ బిడ్డ పుట్టగానే పాలు మూడు, నాలుగు రోజుల వరకు పడవని తేనె నాకించడం, పంచదార నీళ్లు ఇవ్వడం, గ్లూకోజ్ నీళ్లు ఇవ్వడం చేయకూడదు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే... ♦ గర్భిణిగా ఉన్నప్పటి నుంచే పోషక విలువలున్న ఆహారం తీసుకోవాలి. పాలు, చేపలు, గుడ్లు, వెల్లుల్లిపాయ, తాజా కూరగాయలు, పండ్లు తగిన మోతాదులో తీసుకోవాలి. ♦ ఆహారంలో తీపి పదార్థాలు(స్వీటు కాదు) అంటే ప్రకృతి సహజంగా దొరికే పండ్లు తినాలి. తల్లికి కలిగే లాభాలు.. ♦ తల్లులు చనుపాలు ఇవ్వడంతో గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గడంతో పాటు త్వరగా కోలుకుంటారు. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ♦ చనుపాలు ఇవ్వడంతో ఊబకాయం వచ్చే ప్రమాదం తగ్గుతుంది. గర్భానికి పూర్వం ఉన్న బరువును తిరిగి పొందగలుగుతారు. ♦ బిడ్డకు పాలు పట్టించడంతో రొమ్ము, గర్భ సంచి క్యాన్సర్లు రావు. ♦ తల్లులకు మలి వయసులో వచ్చే అస్టియో పొరొసిన్ (ఎముకల బలహీనత) నుంచి కాపాడుతుంది. ♦ తల్లి శిశువుల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. ♦ ఆరు నెలల వరకు రోజుకు 8 నుంచి 10 సార్లు పాలు ఇవ్వాలి. ♦ తల్లికి, శిశువుకు జ్వరం వచ్చినప్పుడు, టీకాలు ఇచ్చినప్పుడు కూడా పాలు పట్టించవచ్చు. తల్లిపాలతో కలిగే లాభాలు ► తల్లిపాలు శిశువుకు సంపూర్ణమైన సంతులిత ఆహారాన్ని అందిస్తాయి. ► నాణ్యమైన ప్రోటీన్లు, ఒమెగా 3,.6 అలాగే 9 బిడ్డ మెదడుకు వికాసానికి తోడ్పడుతాయి. ► ఈ పాలలో బిడ్డలకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ► ఇందులోని లాక్టోజ్‌తో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. బిడ్డను రక్తహీనత నుంచి కాపాడుతాయి. ► తొలి నెలలో శిశువులకు వివిధ రకాల అంటువ్యాధుల బారినుంచి కాపాడుతాయి. ► తల్లిపాలతో బిడ్డలకు డయేరియా, నిమోనియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడుకోవచ్చు. క్యాన్సర్, చెవికి సంబంధించిన వ్యాధులు, గుండె జబ్బులు వంటి వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. ► ఎలర్జీ, అస్తమా, డయాబెటీస్ వంటి వ్యాధులు రావు. ► బాల్యంలో, యవ్వనంలో ఊబకాయం వచ్చే ప్రమాదం తక్కువ. తల్లిపాలు ఎంతో శ్రేష్ఠమైనవి ప్రతి ఏటా తల్లిపాల వారోత్సవాలను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించడం జరుగుతుంది. కోవిడ్ 19 నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా, టీ శాట్ ద్వారానే చిన్నారులకు ప్రీస్కూల్ పాఠాలను బోధిస్తున్నాం. గర్భిణులు కరోనా సమయంలో మరింత జాగ్రత్తలను తీసుకుని, పుట్టే బిడ్డలకు తల్లిపాలనే అందించాలి. – ఉమాదేవి, మంచిర్యాల జిల్లా ఇన్చార్జి సంక్షేమశాఖ అధికారి -
తల్లి పాలే తొలి టీకా!
తల్లిపాలలో ఎన్నెన్నో అమూల్యమైన పోషకాలు ఉంటాయి. వాటిని అధ్యయనం చేయాలనుకుని సంకల్పిస్తే ఇంతవరకు మన పరిశీలనకు అందినవి కేవలం 400 రకాల పోషకాలే. కానీ నిజానికి అంతకంటే ఎక్కువ పోషకాలే అందులో లభ్యమవుతాయి. అందునా వాటిని కృత్రిమంగా తయారుచేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అనేక రకాల ఫార్మూలా ఫీడ్స్ అందుబాటులో ఉన్నా... అవేవీ తల్లిపాలకు సాటిరావు. బిడ్డ పుట్టగానే ఊరే ముర్రు పాలు! బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరూ, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరూ అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. దాంతో ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుతాయి. ముర్రుపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ముర్రుపాల తర్వాత... ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు ఆర్నెల్ల వయసు వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వండిన అనువైన అదనపు ఆహారం ప్రారంభించి, రెండేళ్ల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలూ పడుతూ ఉండాలి. ఇది బిడ్డ పూర్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుందని డబ్ల్యూహెచ్ఓ వారి సూచన. పాలిచ్చే తల్లులకుS కొన్ని సూచనలు ►కరోనా సోకిన తల్లి సైతం తన బిడ్డకు తల్లిపాలు పట్టడం చాలా ఉత్తమం. మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ►తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఇక్కడ పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే, పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. ►పాలిచ్చే తల్లి దాహం తీరేంతగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువగా తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. ►తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ తగినంతగా సమకూరడానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. ►తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ►క్యాల్షియమ్ అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ పుష్కలంగా తీసుకోవాలి. ►విటమిన్ బి12తో పాటు విటమిన్ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ►ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా ఆదా అవుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలేలివే... ♦నీరు : పాలలో ఎక్కువ భాగం (87 – 88 శాతం) నీరు ఉంటుంది. ♦ప్రోటీన్లు : బిడ్డకు సరిపడినన్ని (0.9 – 1 %) ప్రోటీన్లు ఉంటాయి. ♦కొవ్వు పదార్థాలు : శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి హెల్దీ కొవ్వు పదార్థాలు కావాల్సిందే. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్ఏ అనే కొవ్వుపదార్థం ఉంటుంది. డీహెచ్ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్ యాసిడ్ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. అంతేకాదు... కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల కంటిలోని రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఈ రెటీనా నిర్మితమయ్యే కొవ్వులలో... 93 శాతం ఈ డీహెచ్ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వు పదార్థాలూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్ఏ అంటారు. ఆరాకిడోనిక్ యాసిడ్ అనే మాటకు ఏఆర్ఏ సంక్షిప్త రూపం. మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్ఏ సమకూర్చుతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నింటినీ అమ్మ నుంచి బిడ్డకు అందేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వు పదార్థాలన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వు పదార్థాలు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వు పదార్థాలను రిజర్వ్‌లో ఉంచుకోవాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో అంటువ్యాధులు రాకుండానూ, అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక దీర్ఘకాలిక జబ్బుల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అవి... ►తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. ►పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తద్వారా పెద్దయ్యాక డయాబెటిస్, అధిక రక్తపోటు, తదితర దీర్ఘకాలిక జబ్బులు రావడం చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (చైల్డ్‌హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►నవజాత శిశువులలో నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఏయే మోతాదుల్లో తల్లిపాలు పిల్లలు తల్లిపాలు తీసుకునే పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలుంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్’ పండంత సైజు ఉంటుంది. తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. తల్లిపాలు అవసరం. అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తూ... అలాగే నిర్దేశించిన విధంగా బరువు పెరుగుతూ ఉంటే... ఆ పిల్లలకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. కొన్ని గణాంకాలు నవజాత శిశువులు మొదలుకొని పాలు తాగే చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి, శారీరక, మానసిక వికాసాలకు తల్లిపాలు అవసరంపై అవగాహన ఉన్నప్పటికీ... గణాంకాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2019–20 (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం... దాదాపు 88% తల్లులు ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిస్తున్నారు. అందులో కేవలం 51% మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలో తల్లిపాలు పట్టడం ప్రారంభిస్తున్నారు. 61.9% మంది తల్లులు మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే పడుతున్నారు. కేవలం 56% మంది పిల్లలు మాత్రమే 6–8 నెలల్లో ఆ వయసుకు తగినట్లుగా అదనపు ఆహారం పొందగలుగుతున్నారు. ఫలితంగా మన దేశంలో 26.9% మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుంటున్నారు. 31.9% మంది పిల్లలు తమ వయసుకు ఉండాల్సిన ఎత్తు పెరగడం లేదు. 18.1% పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. 5.5% పిల్లులు ఊబకాయంతో ఉన్నారు. దేశంలోని దాదాపు సగం మంది పిల్లలకు అత్యంత శ్రేష్ఠమైన, ఎన్నెన్నో పోషకాలతో కూడిన, మంచి వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే ముర్రుపాలు అందడం లేదు. ఇంకా చెప్పాలంటే గత ఎన్ఎఫ్హెచ్ఎస్–4తో (2015–16) పోల్చినప్పుడు తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్–5లో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టే శాతం 2.5% తక్కువగా ఉంది. దీన్నిబట్టి పుట్టగానే తల్లిపాలు పట్టించే సంస్కృతిని పెంపొందించుకోవడం అవసరమనీ, అపోహలేమీ లేకుండా ముర్రుపాలను ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనీ... ఈ మేరకు దేశంలోని దాదాపు సగంమంది తల్లులకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తేలుతోంది.డబ్ల్యూహెచ్ఓ 1981లో తీసుకొచ్చిన తల్లిపాల ప్రత్యామ్నాయాల నియంత్రణ చట్టాన్ని అనుసరించి... భారత ప్రభుత్వం 1992లో తల్లిపాల ప్రత్యామ్నాయాలు పాలసీసాలు, శిశు ఆహారాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. కొన్ని చట్ట సవరణలతో ఇది మళ్లీ 2003లో సమగ్ర చట్టంగా రూపొంది, అమల్లో ఉంది. దీని ప్రకారం పరిశ్రమల ఉత్పత్తుల వాణిజ్యప్రకటనలు, ప్రోత్సాహకాలను నియంత్రించి... పేరెంట్స్ వాటివైపు ఆకర్షితులు కాకుండా చూడాలి. ఈ చట్ట నిబంధనలూ, వాటి ఉల్లంఘనల పర్యవసానాలపై అవగాహన కల్పించడమే ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాల ప్రధానోద్దేశం. -
చనుబాలు ఇస్తున్నారా?
మీరు మీ బిడ్డలకు చనుబాలు పట్టిస్తున్నారా? అయితే మీరు గర్భసంచి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వంటి కొన్ని రకాల క్యాన్సర్ల ముప్పు తప్పినట్టేనని అంటున్నారు బ్రిస్బెన్ (ఆస్ట్రేలియా)లోని క్యూఐఎమ్ఆర్ బెర్ఘోఫెర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు. యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి కొన్ని దేశాల్లో ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. అయితే కేవలం చనుబాలు పట్టించడం అన్న ఒకే ఒక్క ఆరోగ్యకరమైన, స్వాభావికమైన అలవాటుతోనే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 11 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. అంతేకాదు... ఈ తాజా అధ్యయనం మాత్రమే గాక... గతంలో నిర్వహించిన పదిహేడు పరిశోధనల్లోనూ ఇదే విషయం తెలిసిందనీ, ఇదే విషయం మరోమారు కచ్చితంగా నిర్ధారణ అయ్యిందని పేర్కొంటున్నారు. గర్భసంచికి వచ్చే క్యాన్సర్లను స్వాభావికంగా నివారించే మార్గాల్లో చనుబాలు పట్టించడం చాలా ప్రధానమైనదని ఈ పరిశోధనల్లో పాలుపంచుకున్న కీలక పరిశోధకురాలు సుసాన్ జోర్డాన్. ఈ తాజా అధ్యయన ఫలితాలు ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ జర్నల్ లో ప్రచురితమయ్యాయి. చదవండి: మహిళల్లో ప్రధాన క్యాన్సర్ అదే.. వారికే రిస్క్ వివిధ రకాల క్యాన్సర్లు: లక్షణాలు ఇవే -
విద్యార్థులు నిలబెట్టిన తల్లిపాల బ్యాంక్
పుట్టిన వెంటనే తల్లి స్తన్యం అందిన బిడ్డ అదృష్టవంతుడు. కాని ఆ అదృష్టం అందరు పిల్లలకూ దక్కదు. కాన్పు సమయంలో కాంప్లికేషన్స్ వల్ల తల్లి నుంచి వేరైన బిడ్డలకు పాలు ఎవరు పడతారు? చెన్నైలోని ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్’ ఒక పరిష్కారం. లాక్డౌన్ సమయంలో ఈ బ్యాంక్‌కు నిరంతరం పాలు అందేలా సేకరించిన విద్యార్థులు ఇప్పుడు ప్రశంసలు పొందుతున్నారు. బ్లడ్ బ్యాంక్ అవసరం అందరికీ తెలుసు. కాని తల్లి పాల బ్యాంక్ అవసరాన్ని తమిళనాడులో ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండగా జయలలిత గుర్తించారు. కాన్పు సమయంలో తల్లికి లేదా బిడ్డకు కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు వారు విడివిడి గా చికిత్స పొందుతూ ఉంటే అలాంటి పిల్లలకు తల్లిపాలు కావాల్సి వస్తుంది. తల్లిపాలు రాని పిల్లలకు తల్లి పాలు కావాల్సి వస్తుంది. దురదృష్టవశాత్తు తల్లి కాన్పు సమయంలో చనిపోతే తల్లిపాలు కావాల్సి వస్తుంది. హెచ్ఐవి కేసుల్లో తల్లి నుంచి కాక ఇతరుల నుంచి తల్లిపాలు బిడ్డకు కావాల్సి వస్తుంది. వీరందరి కోసమని చెన్నైలోని ప్రభుత్వ ఆస్పత్రి ‘ఇన్స్టిట్యూట్ ఆఫ్ చైల్డ్ హెల్త్’ లో, విజయ హాస్పిటల్లో ‘హ్యూమన్ మిల్క్ బ్యాంక్స్’ మొదలయ్యాయి. ఎలా సేకరిస్తారు? ఈ బ్యాంకులకు పాలను ఇవ్వడానికి తల్లులు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. వారి ఆరోగ్యాన్ని వారి నుంచి వచ్చిన పాలను పరీక్షించి, అనుమతి ఇచ్చాక వీరు రెగ్యులర్‌గా తాము ఇవ్వగలిగినంత కాలం పాలను డొనేట్ చేయవచ్చు. నేరుగా హాస్పిటల్‌కు వచ్చి ఇవ్వొచ్చు. లేదా సేకరించుకునే వ్యవస్థ కూడా ఉంటుంది. అలా తెచ్చిన పాలను శాస్త్రీయ పద్ధతులలో తగిన ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేసి అవసరమైన పిల్లలకు అందిస్తారు. లాక్డౌన్లో ఏమైంది? లాక్డౌన్ దేశాన్ని స్తంభింప చేసినట్టే ఈ తల్లిపాల వ్యవస్థను కూడా స్తంభింప చేసింది. చెన్నైలో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ౖచెల్డ్హెల్త్లో రోజూ యాభై అరవై మంది పసి కూనలు నియోనేటల్ విభాగంలో చికిత్స కోసం అడ్మిట్ అవుతారు. వీరి తల్లులు వేరే క్కడో ఉంటారు. వీరిలో కనీసం పది మందికి తల్లిపాల బ్యాంక్ నుంచి పాలు కావాల్సి వస్తుంది. రోజులో ఒకసారికి ఒక బిడ్డకు 100 ఎమ్.ఎల్ పాలు కావాలి. ఈ పాలు డోనర్స్ నుంచి అందకపోతే పిల్లలు పస్తులు ఉండాల్సి వస్తుంది. లేదా పౌడర్పాలతో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. లాక్డౌన్ సమయంలో రాకపోకలు అన్నీ ఆగిపోయిన వేళ కొంతమంది కాలేజీ విద్యార్థులు ఈ పాల సేకరణకు ముందుకు వచ్చారు. ఏ బ్యాంక్ అయినా ఖాళీగా ఉండొచ్చు కాని తల్లిపాల బ్యాంకు ఖాళీగా ఉండరాదని చేతులు చేతులు కలిపి కదిలారు. 100 లీటర్ల పాలు లాక్డౌన్ వల్ల తల్లిపాల బ్యాంకులో పాలు నిండుకునే పరిస్థితి ఉంది అనగానే కొందరు విద్యార్థులు రంగంలోకి దిగారు. డోనర్ల లిస్టు తీసుకుని తామే వాళ్ల ఇళ్లకు వెళ్లి పాలు సేకరించి హాస్పిటల్‌కు అందజేసే పని మొదలెట్టారు. అయితే ఇది అంత సులువు కాదు. చెన్నైలో రోడ్లన్నీ మూసేశారు. పోలీసుల అడ్డంకులు. ఇళ్లల్లో తల్లిదండ్రుల గద్దింపులు. కాని విద్యార్థులు వెనుకంజ వేయలేదు. తగిన పర్మిషన్లతో రోడ్ల మీద దూసుకువెళుతూ పాలు నిరంతరం అందేలా చేశారు. ‘నేను ప్రతిసారి మా అమ్మకు ఏదో ఒక అబద్ధం చెప్పాను’ అని ఒక విద్యార్థి చెప్తే ‘మా అమ్మకు చెప్పి చెప్పి చివరకు ఒప్పించాను. అందరూ ఇళ్లల్లో కూచుంటే సహాయం పొందాల్సిన వారు ఎలా పొందుతారు అని ఆమెకు చెప్పాను’ అని మరొక విద్యార్థి అన్నాడు. ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఈ విద్యార్థులు గత నాలుగు నెలల్లో 100 లీటర్ల తల్లిపాలు హాస్పిటల్‌కు అందేలా చేశారు. ప్రశంసలు లాక్డౌన్ సమయంలో నీళ్లకే కటకటలాడే పరిస్థితి ఉన్నప్పుడు చెన్నైల్లో పసికూనలు కడుపునిండుగా తల్లిపాలు తాగి కోలుకునేలా చేసిన ఈ విద్యార్థులకు ప్రశంసలు దక్కుతున్నాయి. కొంతమంది కుర్రవాళ్లు ముందుతరం దూతలు అని కవి అన్నది ఇలాంటి వారి గురించే కాబోలు. – సాక్షి ఫ్యామిలీ -
తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు
తల్లిపాలు అంటే ఈ లోకంలోకి అప్పుడే వచ్చిన చిన్నారికి అమ్మ పెట్టే మొట్టమొదటి పాలబువ్వ! తల్లి ఇచ్చే ఈ మొదటి ఆహారం ఎంత బలమంటే... ఆనాడు మొదలుకొని బిడ్డ ఎదిగి, వృద్ధాప్యంలోకి వచ్చి...తన చివరి రోజులు గడిపేవరకూ ఎన్నో వ్యాధుల్నీ, మరెన్నో రుగ్మతలనీ తట్టుకునేలా ఆ పాలు పడుతుంది అమ్మ. ఆ బువ్వ పెడుతుంది తల్లి. అందులోని ఎన్నో రకాలు పోషకాలు బిడ్డ పెరుగుదలకు దోహదపడేలా ఉంటాయి. కేవలం శారీరకంగా ఎదుగుదలకే కాదు... బిడ్డ మానసిక వికాసానికీ తోడ్పడతాయి. ప్రతి ఏడాదీ ఆగష్టు 1 నుంచి 7 వరకు జరిగే తల్లిపాల వారోత్సవాల రూపంలో నిర్వహితమవుతాయి. ఈ ఏడాది థీమ్ ‘‘ఈ భూగోళాన్ని ఆరోగ్యవంతం చేయడం కోసం బిడ్డకు చనుబాలు ఇవ్వడాన్ని ప్రోత్సహించండి’’. ఇంగ్లిష్‌లో చెప్పాలంటే...‘‘సపోర్ట్ బ్రెస్ట్‌ఫీడింగ్ ఫర్ ఏ హెల్దియర్ ప్లానెట్’’. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా వాటి విశిష్టత, ప్రాధాన్యంపై అవగాహన కలిగించేందుకే ఈ కథనం. తల్లిపాలలో లెక్కకు మించి పోషకాలు ఉంటాయి. మన అధ్యయనానికి అందేవి కేవలం 400 రకాల పోషకాలే. వాటని కృత్రిమంగా తయారు చేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాల విశిష్టతను చెప్పడానికి ఒకే ఒక్క ఉదాహరణ ఏమిటంటే... వాటికి ప్రత్యామ్నాయంగా రకరకాలైన ఫార్మూలా ఫీడ్స్ అందుబాటులో ఉన్నా, అవేవీ తల్లిపాలకు సాటిరావు. కృత్రిమంగా తయారు చేద్దామన్నా... దాని దరిదాపుల్లోకి వెళ్లడానికి కూడా సాధ్యంకాలేదంటే తల్లిపాల గొప్పదనాన్ని అర్థం చేసుకోవచ్చు. బిడ్డ పుట్టగానే ఊరే పాలు... ముర్రుపాలు! బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరు, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరు అంటుంటారు. ఇలాంటి సందేహాలు కొత్తగా తల్లి అయినవారిని అయోమయంలో పడేస్తాయి. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. ఆ నేచురల్ ఇమ్యూనిటీ... తన జీవిత కాలంలో బిడ్డ ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుకుంటుంది. అంతేకాదు... పిల్లాడి వయసు పెరిగాక కనిపించే ఎన్నో జబ్బులు, డీ జనరేటివ్ డిసీజెస్ వంటివి ఈ ముర్రుపాల కారణంగా రాకపోవచ్చు లేదా ఆలస్యం కావచ్చు. అందుకే బిడ్డకు ముర్రుపాలు తప్పక పట్టించాలి. ముర్రుపాలు ముగిశాక చనుబాలు... ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు సాధ్యమైనంతవరకు తల్లిపాలే ఇవ్వాలి. కేవలం తల్లికి తగినన్ని పాలు పడనప్పుడు మాత్రమే పోతపాలకు వెళ్లాలి తప్ప... తల్లి దగ్గర పాలు ఉంటే మాత్రం పిల్లలకు తల్లిపాలు తాగించడం మంచిది. ఏయే మోతాదుల్లో తల్లిపాలు? చనుబాలు తీసుకోవడంలో పిల్లలు తీసుకునే పరిణామం వేర్వేరుగా ఉంటుంది. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలు ఉంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్’ పండంత సైజు ఉంటుంది. తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. చనుబాలు అవసరం. అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డు అంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరుసార్లు మూత్ర విసర్జన చేస్తుంటే... ఆ పిల్లలకు చనుబాలు సరిపోతున్నాయని అర్థం. ఇక పిల్లలకు పాలు పట్టగానే వెంటనే పడుకోబెట్టకుండా భుజం మీద వారిని వేసుకుని వారి వీపు మీద చిన్నగా తట్టాలి. దాంతో వారు మెల్లగా తేన్చడం వల్ల కడుపులోని గాలి బయటకు వెళ్లిపోతుంది. దీనివల్ల వాళ్లకు చంటిపిల్లల్లో వచ్చే కడుపునొప్పి (కోలికీ పెయిన్) వంటివి రావు. దాంతో హాయిగా నిద్రపోతారు. ప్రిమెచ్యుర్ బేబీస్‌లో తల్లిపాల మేలు తల్లిగర్భంలో పూర్తి వ్యవధి పాటు లేకుండా త్వరగా పుట్టేసే (ప్రిమెచ్యుర్ బేబీస్) పిల్లల్లో గుండె గదులు (ఛేంబర్లు) ఒకింత చిన్నవిగా ఉంటాయి. అందువల్ల ఆ పిల్లలు పెద్దయ్యాక గుండెపోటుకు గురయ్యే అవకాశాలు కాస్తంత ఎక్కువగానే ఉంటాయట. ఇలాంటి పిల్లలకు వీలైనంతవరకు రొమ్ముపాలే పట్టించడం వల్ల వారికి అవసరమైన హార్మోన్లు, గ్రోత్ఫ్యాక్టర్లు వంటివి సమకూరుతాయి. ఆ పరిశోధనల ప్రకారం... ఇలా పుట్టేవారిలో గుండెజబ్బులు (కార్డియో వాస్క్యులార్ సమస్యలు) ఒకింత ఎక్కువ. వారి గుండెగదులు ఒకింత చిన్నవిగా ఉండటంతో తోటిపిల్లలతో పోల్చినప్పుడు వారి రక్తపోటు కూడా ఎక్కువే. ఈ అంశాలన్నీ వారిని గుండెజబ్బులకు గురయ్యేలా చేస్తుంటాయి. అయితే ఇలాంటి పిల్లలను పూర్తిగా రొమ్ముపాలపైనే పెరిగేలా చేయడం వల్ల గుండెజబ్బు లు వచ్చే అవకాశాలు తక్కువని ఈ అధ్యయన పరిశోధకుల్లో ఒకరైన ప్రొఫెసర్ ఆఫిఫ్ ఎల్ ఖుఫాష్ అనే ఐర్లాండ్‌లోని ‘రాయల్ కాలేజ్ ఆఫ్ సర్జన్స్’ చెందిన పీడియాట్రిషియన్ పేర్కొంటున్నారు. ఈ అంతర్జాతీయ పరిశోధనల్లో యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్, హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన పరిశోధకులు కూడా ఉన్నారు. తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. దాంతో వారి వైద్య అవసరాల కోసం, వారి రక్షణ (కేర్) కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా తక్కువ. కాబట్టి ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని మనలోని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. బిడ్డకు చనుబాలు పట్టే తల్లుల్లో గర్భసంచి, ఎండోమెట్రియల్ క్యాన్సర్ల ముప్పు తప్పుతుందని అంటున్నారు బ్రిస్బెన్ (ఆస్ట్రేలియా)లోని క్యూఐఎమ్ఆర్ బెర్ఘోఫెర్ మెడికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కు చెందిన పరిశోధకులు. బాగా అభివృద్ధి చెందిన దేశాలని చెప్పుకునే యునైటెడ్ స్టేట్స్, కెనడా, ఆస్ట్రేలియా వంటి చోట్ల కూడా ఎండోమెట్రియల్ క్యాన్సర్ ముప్పు చాలా ఎక్కువ. చనుబాలు పట్టించడం అన్న ఒకే ఒక్క ఆరోగ్యకరమైన, స్వాభావికమైన అలవాటుతోనే ఈ క్యాన్సర్ వచ్చే ముప్పు 11 శాతం తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు. తల్లిపాలలోని ప్రధానమైన అంశాలు ► నీరు: పాలలో ఎక్కువ భాగం నీరు ఉంటుంది. ► ప్రోటీన్లు: పాలలో 75% వరకు ప్రోటీన్లు ఉంటాయి. ► కొవ్వులు: శరీరానికి అవసరమైన ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్‌తోపాటు... లాంగ్ చైన్ పాలీ ఆన్శాచ్యురేటెడ్ ఫ్యాటీ ఆసిడ్స్ అని పిలిచే పోషకాలూ ఇందులో ఉంటాయి. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్ఏ అనే కొవ్వు ఉంటుంది. డీహెచ్ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్ యాసిడ్ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వులతో నిర్మితమై ఉంటుంది. ఈ కొవ్వులలోనూ 93 శాతం ఈ డీహెచ్ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వులూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్ఏ (ఆరాకిడోనిక్ యాసిడ్) అంటారు. మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్ఏ సమకూర్చుతాయి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వులన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వులు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వుల రిజర్వ్ ఉంచుకోవాలి. పైగా బిడ్డ కంటి చూపు బాగుండాలంటే కూడా ఇవే కొవ్వులు కావాలి. ఎందుకంటే రెటీనా కూడా కొవ్వులతోనే నిర్మితమవుతుంటుందని చదివాం కదా. ఇక బిడ్డ ఈ లోకంలోకి వచ్చాక ఇవే కొవ్వులు రెండేళ్ల పాటు అందుతుండాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల ఉంటుంది. అందుకే అన్నిరకాల పోషకాలతో పాటు, ఈ కొవ్వులనూ (ఫ్యాటీ యాసిడ్స్‌ను) తల్లిపాలు సురక్షితంగా అందజేస్తుంటాయి. డీహెచ్ఏ ఇంకెన్ని రకాలుగా ఉపయోగం.. ► కేవలం మెదడు ఎదుగుదలకూ, కంటి చూపు సునిశితత్వానికే కాకుండా ఈ కొవ్వులు చిన్ని గుండెకూ తగినంత బలాన్ని సమకూర్చుతాయి. ► చిన్నిబిడ్డల మెదడు విషయానికి వస్తే దానిలోని ‘గ్రే–మ్యాటర్’ నిర్మాణానికి ఈ కొవ్వులే ఎక్కువగా ఉపకరిస్తాయి. తల్లిపాల మీద బిడ్డ ఎన్ని ఎక్కువ రోజులు పెరిగితే... భవిష్యత్తులో వాళ్ల కంటి చూపూ అంత ఎక్కువ కాలం పదిలంగా ఉంటుంది. బిడ్డకు పాలు పడుతున్నామంటే భవిష్యత్తులో వాళ్లను గుండెజబ్బులనుంచి రక్షిస్తున్నామని అర్థం. వాళ్ల చూపును ఎక్కువకాలం పదిలంగా కాపాడుతున్నామని అర్థం. ► పిండిపదార్థాలు: పాలలో పిండి పదార్థాలు ఉంటాయి. ల్యాక్టోజ్ అనేది తల్లిపాలలో ఉండే ప్రధాన కార్బోహైడ్రేట్. ► ఇతర పోషకాలు : పైన పేర్కొన్న ప్రధాన అంశాలతో పాటు చాలా రకాల ఖనిజలవణాలు, విటమిన్లు, మ్యాక్రో, మైక్రో న్యూట్రియెంట్లు, చాలా అరుదుగా లభ్యమయ్యే కొన్ని విలువైన మూలకాలు కూడా ఉంటాయి. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో జబ్బులు రావు లేదా డయాబెటిస్ వంటి కొన్ని భవిష్యత్తులో రావాల్సిన జబ్బులు చాలా ఆలస్యమవుతాయి. ఇక తల్లి పాలు తాగే పిల్లలతో పోలిస్తే, తల్లి పాలపై లేని పిల్లల్లో చాలా రకాల జబ్బులు కనిపిస్తాయి. అవి... ► జీర్ణకోశ సమస్యలు: తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. ► ఆస్తమా : పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ► తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. ► తల్లిపాలపై పెరిగే పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. స్థూలకాయం పెద్దయ్యాక డయాబెటిస్ వంటి సమస్యలను... ఆ సమస్యలు మరెన్నో ఇతర రుగ్మతలను తెచ్చిపెడతాయన్న విషయం తెలిసిందే కదా. అలాంటి వాటిని నివారించాలంటే చిన్నప్పుడు తల్లిపాలు పట్టడం తప్పనిసరి. ► తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (ఛైల్డ్‌హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ► నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. పాలిచ్చే తల్లులకు సూచనలు ► ప్రస్తుతం కరోనా వైరస్‌తో కోవిడ్–19 వస్తున్న రోజుల్లో సైతం బిడ్డకు చనుబాలు పట్టడం చాలా ఉత్తమం. చనుబాలు ఇవ్వకపోతే వైరస్‌ను నివారించే అవకాశాలతో పోలిస్తే బిడ్డకు చనుబాలు లేకపోవడం వల్ల కలిగే నష్టమే ఎక్కువ కాబట్టి తప్పక పాలు పట్టాల్సిందే. ► తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తూ తల్లిపాలను ఇష్టంగా తాగుతుంటాడు. ► పాలిచ్చే తల్లి ఎక్కువగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువ తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ ఆమెను తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. ► తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ ఎక్కువగా ఉండటానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. అలాగే ఆమె ఆహారంలో మెంతికూర వంటివి తీసుకోవడం కూడా పాలు పుష్కలంగా పడేలా చేస్తుంది. ► తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ► క్యాల్షియమ్ బాగా అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ వంటివి పుష్కలంగా తీసుకోవాలి. ► విటమిన్ బి12తో పాటు విటమిన్ డి పుష్కలంగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతోపాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. -
భారీ మాల్ చిన్నబోయింది..
కోల్‌కతా : బహిరంగ ప్రదేశాల్లో చంటి పిల్లలకు పాలివ్వడం తల్లులకు ఇప్పటికీ నరకప్రాయమేననే ఘటన చోటుచేసుకుంది. ఆకలితో మారాం చేస్తున్న చిన్నారికి పాలుపట్టేందుకు సైతం ఆ భారీ మాల్లో అవకాశం లేకుండా పోయింది. కోల్‌కతాలోని భారీ షాపింగ్ మాల్లో తన చిన్నారికి పాలుపట్టేందుకు అనువైన ప్రదేశం చూపాలని కోరిన మహిళకు సిబ్బంది నుంచి నిర్ఘాంతపోయే సమాధానం వచ్చింది. కోల్‌కతాలో అత్యంత ప్రముఖ షాపింగ్ మాల్ సౌత్ సిటీ మాల్లో 29 ఏళ్ల మహిళకు ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన ఏడు నెలల పసికందుకు పాలుపట్టేందుకు సరైన ప్రదేశం కోసం మాల్ మొత్తం కలియదిరిగానని ఆమె ఫేస్బుక్ పేజ్‌లో పోస్ట్ చేశారు. అంత పెద్ద మాల్లో చిన్నారికి తాను పాలిచ్చేందుకు సరైన స్థలమే లేదని, పైగా అక్కడి సిబ్బంది టాయ్లెట్లో పాలివ్వాలని సూచించారని తెలిపారు. ఇది భారీ మాల్ కాదని..యూజ్లెస్ మాల్ అంటూ మండిపడ్డారు. సిబ్బంది తీరుతో అవాక్కైన తనకు వారి నుంచి మరింత నిర్లక్ష్య సమాధానం ఎదురైందని చెప్పుకొచ్చారు. ప్రజల గోప్యతను గౌరవించాలని, ఇలాంటి పనులన్నీ ఇంట్లో చక్కబెట్టుకుని రావాలని, మాల్లో కాదని ఉచిత సలహాలిచ్చారని చెప్పారు. అత్యాధునిక హంగులతో నిర్మించిన ఆ భారీ మాల్ తన నిర్వాకంతో చిన్నబోయిందని నెటిజన్లు స్పందిస్తున్నారు. -
ఈ ఎయిర్ హోస్టెస్‌కు సోషల్ మీడియా సలాం!
సోషల్ మీడియా మొత్తం ఇప్పుడు ఆ ఎయిర్ హోస్టెస్‌కు హ్యాట్సాఫ్ చెబుతోంది. ఆకలితో గుక్కపట్టిన ఓ ప్రయాణికురాలి బిడ్డకు పాలిచ్చి అమ్మ ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచింది ఫిలిప్పిన్ ఎయిర్ లైన్స్‌కు చెందిన ప్రతీశా అనే ఎయిర్ హోస్టెస్. దీంతో మొన్నటిదాకా ఎవ్వరికీ తెలియని ఆమె పేరు, ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా మారుమోగుతుంది. ఈ విషయాన్ని ఆమె ‘చాలా తృప్తి పడే పనిచేశాను.. సంతోషంగా ఉంది’ అంటూ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అయింది. ఈ పోస్ట్‌కు ఏకంగా 35 వేలకు పైగా షేర్లు, 8.1 వేల కామెంట్లు రావడం విశేషం. ఆ పోస్ట్ ఏంటంటే.. ‘ఫ్లైట్‌లో ఆకలితో ఉన్న ఓ పసిపాపకు నా పాలిచ్చాను. రోజువారి పనిలో భాగంగానే ఫ్లైట్‌లో నా పని నేను చేసుకుంటున్నాను. ఫ్లైట్ టేకాఫ్ అయిపోయింది. ఇంతలో నాకు ఓ పసిపాప ఏడుపు వినిపించింది. దీంతో నేను ఆ పసిపాప తల్లి వద్దకు వెళ్లాను. ఆ తల్లి కూడా కన్నీళ్లు పెట్టుకుంటున్నది. ఎందుకమ్మా, పాప ఏడుస్తున్నది.. ఆకలితో ఉన్నట్టుంది.. పాలు పట్టండి అన్నాను. పాపకు పట్టే ఫార్ములా పాలు అయిపోయాయని ఆ తల్లి కన్నీటి పర్యంతమైంది. ఫ్లైట్‌లోని తోటి ప్రయాణీకులంతా ఏమైందని అడుగుతున్నారు. రకరకాలుగా ఆలోచిస్తున్నారు. విమానంలో మామూలు పాలు తప్పా ఫార్ములా పాలు లేవు. ఆ పాప ఏడుపు, తోడుగా ఆ తల్లిని చూస్తే బాధేసింది. నాకు ఎక్కడో కదిలినట్టు అనిపించింది. నా బిడ్డ గుర్తకొచ్చింది. వెంటనే నా పాలు ఇచ్చి ఆ బిడ్డ ఆకలి తీర్చాలనుకున్నాను. ఆ పాపను నా ఒడిలోకి తీసుకొని పాలు పట్టాను. చాలా ఆకలితో ఉందేమో, పాప ఆతృతగా తాగింది. ఆ పాప ఏడుపు ఆపి, నిద్రపోయాక ఆ తల్లికి అప్పగించాను. ఆ తల్లి నాకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ క్షణాన ఆ బిడ్డ ఆకలి తీర్చే శక్తినిచ్చినందుకు ఆ దేవునికి ధన్యవాదాలు. ఇదేమీ గొప్పపని కాదు. కానీ తృప్తినిచ్చే పని. ఈ రోజు నా ఫ్లయింగ్ కెరీర్లోనే ఓ అద్భుతమైన రోజు.’ అని ఆ ఫొటోను షేర్ చేసింది. -
పాలివ్వడానికి సిగ్గెందుకు?!
‘‘నువ్వేమైనా పశువ్వా... ఎక్కడపడితే అక్కడ బిడ్డకు పాలివ్వడానికి?’’ అంటూ కుప్పలుతెప్పలు ట్రోలింగ్స్ లిసాహెడెన్కు. ఇంతకీ ఆమె ఎవరు? ‘‘క్వీన్’’సినిమా చూశారా? కంగనా రనౌత్‌కి ఫ్రెండ్‌గా నటించింది. ఆయెషా సినిమా చూసినా తెలుస్తుంది లిసా ఎవరో! బోల్డ్ అండ్ బ్రిలియంట్ యాక్ట్రెస్. మోడల్ కూడా. తల్లిపాల విలువ గురించి ప్రచారం జరుగుతున్న సందర్భంగా అంతే బోల్డ్‌గా లిసా తన బిడ్డకు పాలిస్తున్న ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. ‘‘బిడ్డకు పాలివ్వడానికి ఎందుకు సిగ్గుపడాలి? బిడ్డకు ఆకలైనప్పుడు మీరెక్కడున్నా నిరభ్యంతరంగా.. నిస్సంకోచంగా పాలివ్వచ్చు.. నేనూ ఇస్తాను’’ అనే కామెంట్ రాసింది. ఓ మహిళగా.. తల్లిగా.. తల్లిపాల అవసరం గురించి చెప్పడం తన బాధ్యతగా భావించే.. ఆ ఫొటోను పోస్ట్ చేసింది ఆ అమ్మ. కానీ లిసాను అమ్మలా చూడకుండా.. ఓ నటిగా.. సెక్సువల్ ఆబ్జెక్ట్‌గా ట్రీట్ చేస్తూ చవకబారు కామెంట్లతో ఆమెను అబ్యూజ్ చేశారు కొందరు నెటిజన్లు. యేడాది అవుతున్నా ఆ ట్రోలింగ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలోనే కాదు.. ఆమె ఎక్కడికి వెళ్లినా.. ఏ ఈవెంట్లో కనిపించినా.. ‘‘మీ బిడ్డకు ఇంకా పాలిస్తున్నారా? ఫొటోలు పెట్టట్లేదే?’’ అంటూ ఎగతాళి చేస్తున్నారట. ‘‘ఇలాంటి మాటలు, ప్రశ్నలతో చాలా అన్‌కంఫర్ట్‌గా ఫీలవుతున్నాను. సేమ్‌టైమ్ వాళ్ల మీద జాలి కూడా వేస్తోంది. ఈరకంగా మాట్లాడే వాళ్లంతా మగవాళ్లే. పాపం.. వాళ్లకు తెలియదు కదా తల్లి బాధ్యతేంటో? వాళ్లూ తల్లి అయితే ఇలా మాట్లాడరు’’ అంటుంది లిసా. ఆమె కొడుకు జాక్.. యేడాది వయసు. మాతృత్వపు ఆనందాన్ని ఆస్వాదిస్తోంది. పెళ్లయినా.. ఆడవాళ్లు ఇండిపెండెంట్‌గానే ఉంటున్నారు. చంటిపిల్లను చంకన వేసుకొని బయట పనులు చక్కదిద్దుకోవాల్సిందే. ఏ వర్గం మహిళలైనా ఇందుకు మినహాయింపు కాదు. బిడ్డకు ఆకలేసినప్పుడు తల్లి పాలు ఇవ్వాల్సిందే. బయట.. పది మంది మగాళ్ల మధ్య.. ‘మా అమ్మ ఉంది.. ఆకలేసినా నేను ఓర్చుకోవాలి.. ఏడ్వకూడదు’ అని నెలల బిడ్డకు తెలియదు కదా. ‘అయ్యో నలుగురి మధ్య పాలెలా ఇవ్వాలి’ అని తల్లీ సంకోచించకూడదు. ఆ విషయాన్నే సెలబ్రిటీ హోదాలో లిసా చెప్పింది. దానికి సెక్సువల్ కలర్ ఎందుకు యాడ్ చేయడం? అని చాలా మంది మహిళలు లిసాను సపోర్ట్ చేశారు. ఇలాంటి ఆలోచనలు మారాలనే.. స్త్రీలను సాటి మనుషులుగా చూడాలనే ఈ చైతన్యం అంటున్నారు. ‘‘పోషకాహార లోపం, అందం మీదున్న మమకారం, బిడ్డకు పాలు పట్టడం పట్ల ఉన్న అపోహలు.. పాలు పడని శరీర తత్వం.. ఇలా రకరకాల కారణాలతో తల్లిపాలకు బిడ్డలు దూరమవుతున్నారు. అలాంటి అపోహలన్నిటినీ తొలగించి.. తల్లి పాల మీద తల్లులకు అవేర్నెస్ కల్పించడంలో నేనూ భాగమయ్యానన్న సంతృప్తి ఉంది. అదృష్టవశాత్తు ఎలాంటి ఇబ్బందులు లేకుండా నా బిడ్డకు పాలివ్వగలిగాను. బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల తల్లికి, బిడ్డకు మధ్య ఏర్పడే అనుబంధం.. అమూల్యమైనది. అది బిడ్డ శారీరకంగానే కాదు మానసికంగానూ దృఢంగా ఉండేలా చేస్తుంది. ఈ విషయాన్నే ప్రతి న్యూ మదర్‌కి చెప్పాలనుకున్నాను.. చెప్పాను.. చెప్తాను కూడా! ట్రోలింగ్స్ బాధపెట్టినా పట్టించుకోను. నిజానికి మదర్ అయ్యాక ఇలాంటివి ఇగ్నోర్ చేసే సహనమూ వచ్చింది (నవ్వుతూ). పిల్లలకు ఆరోగ్యకరమైన బాల్యాన్ని, అంతే హెల్దీ ఫ్యూచర్‌ను ఇవ్వడమే పేరెంట్స్ లక్ష్యం. దాన్నే ప్రచారం చేస్తాను’’ అంటోంది లిసా. – శరాది -
‘అమ్మ’ సమయస్ఫూర్తికి సలామ్.. వైరల్
బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుందంటారు. ఆ బిడ్డ ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. ఆ సమయంలో మరో విషయం ఆలోచించకుండా మాతృమూర్తులు తన బిడ్డకు చనుపాలు ఇస్తారు. కానీ నేటికీ పలానా చోట ఉన్నప్పుడు పాలు ఇవ్వకూడదు, పలానా సమయంలో చనుపాలు అలా ఎలా ఇస్తారంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఓ మెక్సికన్ మదర్ చేసిన పనిని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. పరిస్థితిని చాలా హుందాగా ఎదుర్కొన్నారంటూ ఆమెకు మద్దతు లభిస్తోంది. మెలానీ డడ్లీ అనే మహిళకు సంతానం నాలుగు నెలల బాబు ఉన్నాడు. ఆమె మెక్సికోలోని కాబో శాన్లుకాస్లో రెస్టారెంట్‌కు ఇటీవల కుటుంబంతో పాటు వెళ్లారు. అయితే అదే సమయంలో ఆమె బిడ్డ ఆకలితో ఏడుపు మొదలుపెట్టాడు. ఆ కన్నతల్లి వెంటనే తన బిడ్డకు పాలు ఇస్తూ మాతృత్వంలోని మాధుర్యాన్ని ఆస్వాధిస్తున్నారు. రెస్టారెంట్ ముందు నుంచి వెళ్తున్న ఓ వ్యక్తి కవర్ చేసుకోండి అని ఆమెకు సూచించాడు. దీంతో తన ఉద్దేశాన్ని స్పష్టం చేయాలనుకున్న మెలానీ వెంటనే తన చీర కొంగుతో తల, ముఖం మొత్తం కప్పేసుకుని ఆ పాదచారికి బదులిచ్చారు. ఇందుకు సంబంధించిన ఓ ఫొటోను మెలానీ ఫ్యామిలీ ఫ్రెండ్ కారల్ లాక్వుడ్ తన ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. (ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు) ఆమె ఫ్యామిలీ నాకు సన్నిహితులే. కానీ నేను ఆమెను ఎప్పుడూ చూడలేదు. అయితేనేం ఆమె చేసిన పని ప్రశంసనీయం. మెలానీ చాలా మంచిపని చేశారు. ఆమె అనుమతిని కోరుతూ లాక్వుడ్ తన ఫేస్బుక్లో ఈ వివరాలను పోస్ట్ చేయగా విశేష స్పందన వస్తోంది. సమయస్ఫూర్తితో ఆమె తల, ముఖాన్ని కవర్ చేసుకుని తనకు సూచనలిచ్చిన వ్యక్తికి బదులిచ్చారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మెలానీ మీడియాతో మాట్లాడుతూ.. మహిళలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో.. తమ పిల్లలకు బహిరంగ స్థలాల్లో చనుపాలు ఇవ్వడం ఒకటని చెప్పారు. కుటుంబంతో పాటు ఉన్న తనకు శరీరాన్ని కవర్ చేసుకోవాలని ఓ వ్యక్తి సూచించడం విచిత్రంగా అనిపించిందన్నారు. అందుకే తెలివిగా నా ముఖాన్ని కవర్ చేసుకున్నానని వివరించారు. కాగా, ఇటీవల అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ మియామీలో ర్యాంప్ వాక్ చేస్తుండగా ఆమె ఐదు నెలల చిన్నారి ఏడుస్తున్నాడని.. బిడ్డకు పాలిస్తూనే ఈవెంట్లో పాల్గొని తల్లిప్రేమను మించింది మరొకటి లేదని నిరూపించారు. (మాతృత్వానికే అంబాసిడర్‌గా నిలిచిన మోడల్) -
తల్లిపాలు శిశువుకు ప్రాణాధారం
తెలంగాణలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాల శాతం గణనీయంగా పెరిగి 91.5 శాతానికి చేరుకుందని జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్హెచ్ఎస్–4, 2015–16) సూచిస్తోంది. కానీ పుట్టిన గంటలోపే పసిపిల్లలు తల్లిపాలు తాగడం ప్రారంభించడానికి సంబంధించిన కీలక సూచిక మాత్రం 37 శాతంగానే నమోదవడం ఆందోళనకరం. కేసీఆర్ కిట్లు, లేబర్ రూమ్‌ల ప్రామాణీకరణ వంటి చర్యల ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు, జననాల పెరుగుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం భారీగా మదుపు పెట్టింది. కానీ రాష్ట్రంలో శిశువులకు తల్లిపాలు పట్టే అంశంలో ఇదే స్థాయిలో పెరుగుదల నమోదు కావడం లేదు. ప్రసవానంతరం తొలి 28 రోజుల్లో పిల్లలు బతికి బట్టగట్టడం పిల్లల జీవితంలో చాలా ముఖ్యమైన అంశం. తెలంగాణలో ప్రతి వెయ్యి జననాల్లో 21 శిశువులు పుట్టిన తొలి 28 రోజుల్లోనే చనిపోతున్నారు. తల్లి పాలు పట్టడం ఎంత ఆలస్యమైతే, శిశు మరణాల రేటు అంత ఎక్కువయ్యే అవకాశం ఉంది. ప్రతి సంవత్సరం 8.2 లక్షలమంది పిల్లలు పుట్టిన 28 రోజులకే చనిపోతున్నారు. పిల్లలు పుట్టిన గంటలోపే తల్లి పాలు పట్టడం ద్వారా ఈ రకం మరణాల రేటును గణనీయంగా తగ్గించవచ్చు. బిడ్డపుట్టిన తర్వాత తల్లి పాలు పట్టే సమయం ఎంత ఆలస్యమైతే అంత ఎక్కువగా శిశుమరణాల రేటు పెరుగుతూ పోయే ప్రమాదం ఉందని అధ్యయనాలు తెలుపుతున్నాయి. తల్లి బిడ్డకు పట్టే తొలి పాలు అతి ముఖ్యమైన యాంటీబాడీస్‌ని కలిగి ఉంటాయి. వైరస్లు, బాక్టీరియాతో పోరాడే రోగనిరోధక వ్యవస్థ పెంపుదల విషయంలో బిడ్డకు ఇవి చాలా అవసరం. పైగా తల్లిపాలు పట్టడం అనేది పిల్లల ఐక్యూని 3 పాయింట్లు అదనంగా పెంచుతుంది. ఇది భారత స్థూల జాతీయ ఆదాయానికి రూ.4,300 కోట్లను అదనంగా చేరుస్తుందని ఒక అంచనా. పుట్టిన బిడ్డకు తొలి ఆరు నెలలనుంచి రెండేళ్లవరకు తల్లిపాలు పట్టడంలోని ప్రాధాన్యత గురించి గత రెండు దశాబ్దాలుగా చర్చ జరుగుతూనే ఉంది. కానీ భారత్‌లో మాత్రం ఈ దిశగా పురోగతి ఏమంత సంతృప్తికరంగా లేదు. దేశంలోని 93 శాతం గర్భిణీస్త్రీలకు తల్లిపాలు పట్టడం గురించి సకాలంలో సూచనలు చేస్తున్నప్పటికీ, ఇంట్లో, కమ్యూనిటీలో లేక పని స్థలంలో ఎక్కడ ప్రసవం జరిగినా అలా తల్లి తన బిడ్డకు తానే పాలు పట్టడానికి అవకాశమిచ్చే వాతావరణ కల్పనపై తగినంత శ్రద్ధ పెట్టడం లేదు. తల్లి బిడ్డకు తన పాలు పట్టడాన్ని పలురకాల సామాజిక, సాంస్కృతిక ఆచారాలు, భయాలు అడ్డుకుంటున్నాయి. దీనికి తోడుగా తల్లి సొంతంగా బిడ్డకు పాలు పట్టేలా చేయడంలో ఎవరూ చొరవ తీసుకోవడం లేదు. మురుగుపాలు పట్టడంపై సమాజంలో విశ్వాసాలు ఎలా ఉన్నప్పటికీ, బిడ్డ పుట్టిన వెంటనే వారికి తల్లిపాలు పట్టడం చాలా మంచిదని నిపుణుల వ్యాఖ్య. ప్రతి సంవత్సరం ఆగస్టు తొలి వారంలో ప్రపంచమంతటా తల్లిపాల వారోత్సవాన్ని నిర్వహిస్తుంటారు. తల్లిపాలు అనేవి అన్ని రకాల పోషక విలువల లేమిని నిరోధిస్తాయి. పిల్లల ఆహార భద్రతకు, మంచి ఆరోగ్యానికి తల్లి పాలు అత్యంత శ్రేయస్కరమైనవి. ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలు జీవితం మొత్తానికి మూలాధారం వంటిది. ఇంటిలో ఉన్నా, కమ్యూనిటీలో ఉన్నా, పనిస్థలంలో ఉన్నా తమ బిడ్డలకు తామే పాలు పట్టేవిషయంలో మహిళలను ప్రోత్సహించాలని ఈ సంవత్సరం తల్లి పాల వారోత్సవం పిలుపునిస్తోంది. ఈ విషయంలో తండ్రులు, యజమానులు, కమ్యూనిటీ, ఎకోసిస్టమ్‌లు సమాన భాగస్వామ్యం చేబూనాలని ఈ వారోత్సవం పేర్కొంటోంది. తల్లి పాల విధానంలో మంచి ఫలితాలు రావాలంటే రాష్ట్ర, జాతీయ స్థాయిలో అవగాహన, విధానాలలో మార్పు రావలసిన అవసరముంది. ఆసుపత్రుల్లో స్టాఫ్ నర్సులు, రాష్ట్ర స్థాయిలో ఏఎన్ఎమ్లు బిడ్డ పుట్టిన గంటలోపే పాలు పట్టేలా తల్లులను ప్రోత్సహించాలి. తల్లి పుట్టిన బిడ్డలకు పాలు పట్ట డంలో కుటుంబంలోని తల్లులు, భర్తలు, అత్తలకు తప్పనిసరిగా కౌన్సెలింగ్ ఇవ్వాల్సి ఉంది. దీని కోసం ప్రధానమంత్రి సురక్షిత్ మాతృత్వ అభియాన్ వంటి వేదికలను ఉపయోగించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం తల్లిపాలకు ప్రోత్సాహం ఇవ్వడానికి సంబంధించి ప్రయత్నాలు చేపట్టింది. దీన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా అమలు చేయాల్సి ఉంది. పిల్లల్లో పోషక విలువలు దెబ్బతినకుండా చేయడానికి ఇలాంటి కార్యాచరణ చక్కగా ఉపయోగపడుతుంది. (ఆగస్టు తొలివారం ప్రపంచ తల్లిపాల వారోత్సవం) విజయేందిర బోయి, ఐఏఎస్, డైరెక్టర్, మహి ళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, తెలంగాణ -
బిడ్డకు పాలిస్తూ ర్యాంప్‌పై నడిచిన మోడల్
‘బిడ్డ ఆకలి తల్లికే తెలుస్తుంది. తన చిన్నారి ఆకలి తీర్చడమే అమ్మకు ప్రధానం. తల్లి ఎక్కడ ఉన్న, ఏం చేస్తున్న ఆమె ఆలోచనలన్ని తన బిడ్డ చూట్టే తిరుగుతుంటాయి. పిల్లలు ఆకలితో ఏడిస్తే తల్లి పేగు కదులుతుంది. అంతే ఇంక ఆ సమయంలో ఏం ఆలోచించదు. వెంటనే బిడ్డ ఆకలి తీర్చే ప్రయత్నం చేస్తుంది. బిడ్డ ఆకలి తీర్చడానికి తల్లికి ప్రకృతి ప్రసాదించిన గొప్ప వరం చనుబాలు. కానీ నేటికి మన సమాజంలో మహిళలు బహిరంగంగా బిడ్డకు పాలివ్వడానికి ఇబ్బంది పడుతుంటారు. కారణం చుట్టూ ఉన్న నలుగురు గురించి ఆలోచించి. కేవలం ఈ కారణం వల్లనే ప్రపంచ వ్యాప్తంగా మహిళలు తల్లి అయిన తర్వాత కొన్నేళ్లపాటు ఉద్యోగాలు మానుకుంటున్నారు. ఈ విషయంలో విచక్షణ లేని పశుపక్ష్యాదులే మనిషి కంటే మేలు. బిడ్డ ఆకలి తీర్చడంలో వాటికున్న స్వతంత్రలో కనీసం ఒక్క శాతాన్ని కూడా సమాజం మన తల్లులకు ఇవ్వడంలేదు’. కానీ ఇప్పుడిప్పుడే మాతృమూర్తుల ఆలోచన ధోరణి మారుతుంది. ‘బిడ్డకు పాలు ఇవ్వడం నా ధర్మం. తల్లిగా నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. దీనికి సమాజం గురించి పట్టించుకోనవసరం లేదు’ అనుకుంటున్నారు. ప్రపంచ దేశాలు కూడా ఇప్పుడు ఈ అంశంపై దృష్టి సారిస్తున్నాయి. అమెరికాలాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే కాక, భారత్ లాంటి సనాతన దేశాల్లో కూడా ఇప్పుడు ఈ అంశం చర్చనీయాంశమైంది. కొన్నాళ్ల క్రితమే ప్రముఖ కేరళ పత్రిక ‘మాతృభూమి’ తన గృహలక్ష్మి మ్యాగ్జైన్లో బిడ్డకు పాలు ఇస్తున్న మోడల్ ఫోటో ప్రచురించి ఈ అంశం గురించి దేశవ్యాప్తంగా చర్చకు తెరలేపింది. అమెరికా లాంటి దేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ అంశానికి సంబంధించి విధివిధానాలను రూపొందిస్తున్నారు. తాజాగా అమెరికాకు చెందిన ఒక మోడల్ బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేసి మాతృత్వానికి సరికొత్త నిర్వచనం చెప్పారు. వివరాల ప్రకారం.. అమెరికాకు చెందిన మారా మార్టిన్ అనే మోడల్ స్లిమ్ షూట్ ప్రచార కార్యక్రమంలో భాగంగా మియామిలో నిర్వహించిన ఒక ర్యాంప్ షోలో పాల్గొంది. మోడల్ కంటే ముందు మార్టినా ఓ బిడ్డకు తల్లి. ఆ విషయం ఆమెకు బాగా తెలుసు. ర్యాంప్ వాక్ చేస్తుండగా మార్టినా ఐదు నెలల చిన్నారి ఏడుపు ప్రారంభించింది. తల్లి కదా అందుకే బిడ్డ ఎందుకు ఏడుస్తోందో మార్టినాకు వెంటనే అర్ధమైంది. ర్యాంప్‌వాక్ నుంచి బయటకు వచ్చి తన చిన్నారి ఆకలి తీర్చాలనుకుంది. కానీ షో నిర్వాహకులు బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేయమని సలహా ఇచ్చారు. దాంతో మార్టినా బిడ్డకు పాలు ఇస్తూనే ర్యాంప్ వాక్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు మార్టినా. మార్టినా షేర్ చేసిన ఈ ఫోటోకు అనూహ్యంగా.. పెద్ద ఎత్తున జనాలు మార్టినాకు అభినందనలు తెలుపుతున్నారు. కానీ కొందరు మాత్రం దీన్నో పబ్లిసిటి స్టంట్లా భావించి విమర్శలు చేస్తున్నారు. అయితే తనను విమర్శించే వారికి చాలా గట్టిగానే సమాధానం చెప్పారు మార్టినా. ‘నేను ఈ రోజు చేసిన పని కావాలని, నలుగురి దృష్టిలో పడాలని చేసింది కాదు. నేను గత ఐదు నెలలుగా చేస్తున్న పనినే ఇప్పుడు చేశాను. రోజు నా బిడ్డకు నేను ఇదే సమయంలో పాలు ఇస్తాను. ఈ రోజు కాస్తా ఆలస్యం అయ్యేసరికి తను ఏడుస్తుంది. తన ఆకలి తీర్చడం కంటే మరేది నాకు ముఖ్యం కాదు. ఈ విషయం కేవలం తల్లికి మాత్రమే అర్ధమవుతుంది. నన్ను విమర్శించే ముందు ఈ విషయం గురించి మీ అమ్మను అడగండి. వారికి తెలుసు నేను చేసింది కరెక్టో, కాదో’ అంటూ కాస్తా ఘాటుగానే స్పందించారు. ఇప్పటికైతే అమెరికాలో బిడ్డలకు తల్లులు బహిరంగంగా పాలు ఇవ్వొచ్చు, కానీ రెస్టారెంట్లు, మాల్స్ వంటి రద్దీ ప్రదేశాల్లో మాత్రం కవర్ చేసుకోవాలనే ఆదేశాలు ఉన్నాయి. అమెరికా మహిళలు ఈ ఆదేశాలను తప్పు పడుతున్నారు. ‘మేము కవర్ చేసుకోవడం కాదు మీరు మీ బుద్ధిని సరి చేసుకోండి’ అంటూ విమర్శిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా బిడ్డకు తల్లిపాలే శ్రేయస్కరం అంటూ ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. -
ఆ ఫొటోలో అశ్లీలత లేదు: హైకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: పసి పిల్లలకు చనుబాలు ఇచ్చేందుకు తల్లులు మొహమాటం వీడాలనే ఉద్దేశంతో కేరళకు చెందిన ‘గృహలక్ష్మి’ మేగజీన్ చేసిన ప్రయత్నం మంచిదేనని కేరళ హైకోర్టు వ్యాఖ్యానించింది. తల్లి బిడ్డ ఆకలి తీర్చుతున్న కవర్ ఫోటోపై అభ్యంతరాలు లేవని తెలిపింది. భారతీయ సంప్రదాయంలో మానవ దేహానికి ఎంతో ప్రాధాన్యం ఉందనీ, ప్రాచీన కళలు, బొమ్మల్లో మానవ దేహ సౌందర్యాన్ని వర్ణించారని తెలిపింది. అయితే, చూసే కళ్లను బట్టి దాని అంతరార్థం బోధ పడుతుందని పేర్కొంది. అజంతా చిత్రాలు, రవివర్మ పేయింటింగ్స్‌లో అశ్లీలతను చూసేవారు కొందరైతే, అద్భుత కళా సౌందర్యాన్ని చూసేవారు మరి కొందరని వివరించింది. విషయం.. దేశ వ్యాప్తంగా ప్రతియేడు తల్లిపాలు సరిపడా అందక దాదాపు లక్ష మంది శిశువులు డయేరియా, న్యూమోనియా బారినపడి చనిపోతున్నారు. విదేశాల్లో మాదిరిగా మన దేశంలో పిల్లలకు పాలు ఇవ్వడానికి సదుపాయాలు లేవు. జన సమూహ ప్రదేశాల్లో, బహిరంగంగా చిన్నారుల ఆకలి తీర్చడానికి తల్లులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తల్లులకు అవగాహన కల్పించాలనే సదాశయంతో గృహలక్ష్మి మేగజీన్ తన మార్చి సంచిక కవర్ ఫోటోపై మోడల్ గిలు జోసెఫ్ బిడ్డకు చనుబాలు ఇస్తున్న చిత్రాన్ని ప్రచురించింది. అయితే, స్త్రీ జాతిని అవమానిస్తున్నారని కొందరు, మోడల్ చేతిలో ఉన్న శిశువు హక్కులను కాలరాస్తున్నారని మరికొందరు సోషల్ మీడియాలో విమర్శించారు. కేరళకు చెందిన వినోద్ మాథ్యూ విల్సన్ మేగజీన్ నిర్వాహకులు, జోసెఫ్‌పై కేసు పెట్టారు. పిటిషన్లను విచారించిన హైకోర్టు కవర్ ఫోటోలో అశ్లీలత ఏమీ లేదని పేర్కొంటూ పై విధంగా తీర్పు వెలువరించింది. -
తల్లిపాలకు ఏదీ సాటిరాదని తెలుసా?
పాపాయికి తల్లిపాలతోనే బతుకంతా మనుగడ. తల్లిపాలు పిల్లలకు కేవలం చిన్నప్పటి ఆహారం మాత్రమే కాదు. బతుకంతా వాళ్లలో ఎన్నో వ్యాధులు రాకుండా చేసే వ్యాధినిరోధక శక్తి కూడా అందులో ఉంది. తల్లిపాలలో ఉన్న సుగుణాల గురించి మీకెంత అవగాహన ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. 1. తల్లి కాబోతున్న యువతిని పరామర్శించేటప్పుడు ఆమె ఆరోగ్యంతోపాటు పాపాయికి తల్లి పాలు ఎంత అవసరమో చెబుతుంటారు. ఎ. అవును బి. కాదు 2. పాపాయి పెరుగుదలకు కావల్సిన పోషకాలు తల్లిపాలతోనే సాధ్యమని, పోతపాలతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలియచేస్తుంటారు. ఎ. అవును బి. కాదు 3. బాలింతను కలిసినప్పుడు పాపాయికి సరిపడినన్ని పాల కోసం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు చెబుతారు. ఎ. అవును బి. కాదు 4. పుట్టిన అరగంట లోపుగానే తల్లిపాలను తాగించాలని మీకు తెలుసు. ఎ. అవును బి. కాదు 5. ఇది పాపాయి ఆకలిని తీర్చడమే కాదు, బిడ్డకు వ్యాధినిరోధక శక్తినిచ్చే గుణాలు తొలిపాలలోనే ఉంటాయి. ఎ. అవును బి. కాదు 6. పుట్టిన తరవాత వీలయినంత త్వరగా తల్లిపాలు పట్టాలి. అది పాపాయికి తల్లితో స్పర్శబంధం పెరగడానికి కూడా దోహదం చేస్తుంది. ఎ. అవును బి. కాదు 7. ఎంత ఖరీదైన బ్రాండెడ్ పాలపొడి అయినా, మరే ఇతర ఆహారమైనా తల్లిపాల స్థానాన్ని భర్తీ చేయలేదని నిపుణుల అభిప్రాయం. ఎ. అవును బి. కాదు 8. మొదటి ఆరు నెలలు తల్లిపాలు తాగిన పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారనే డాక్టర్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు. ఎ. అవును బి. కాదు మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు తల్లిపాల గొప్పదనం తెలుసు. మీకు తెలిసిన వాటిని ఇతరులకు చెప్పి వాళ్లు కూడా ఆ ప్రయోజనాన్ని పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువైతే అమృతతుల్యమైన తల్లిపాల అవసరాన్ని గుర్తించండి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం సాగుతున్న ఈ ఉద్యమంలో మీరూ ఒకరు కావడానికి ప్రయత్నించండి. -
ఆట మధ్యలోనూ అమ్మతనం చాటింది..
అల్బర్టా : ఎనిమిది వారాల కిందట పాపకు జన్మనిచ్చిన కెనడా హాకీ క్రీడాకారిణి సారా స్మల్కు ఓ సమస్య ఎదురైంది. ఇటీవల ఓ హాకీ మ్యాచ్‌లో పాల్గొన్న ఆమె తనతోపాటు పాలిచ్చే బ్రెస్ట్ పంప్ తీసుకెళ్లడం మరచిపోయింది. విరామ సమయంలో డ్రెసింగ్ రూమ్‌కి వచ్చిన ఆమె తన చిన్ని పాప పాలకోసం ఏడవటం చూసి క్షణం కూడా ఆలోచించకుండా టీషర్ట్ తీసివేసి బిడ్డకు స్తన్యమిచ్చారు. తల్లిప్రేమను చాటుతూ ఆట మధ్యలో ఆమె పాలిస్తున్న ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తన బిడ్డకు పాలిస్తున్న సందర్భంగా తీసిన ఫొటోను ఫేస్బుక్లో పోస్ట్ చేసిన ఆమె.. ‘ఓ తల్లిగా చాలా గర్వపడుతున్నాను. నా బిడ్డ అవసరాలు తీర్చడంతో నాకు ఏదో సాధించాననే ఆనందం కలిగింది. మీరు కూడా మీకు నచ్చిన పనిచేయండి. బయటివారి గురించి ఆలోచించకుండా మీ పిల్లలకు స్తన్యమివ్వండి. మీ పిల్లలకు మరింత చేరువ అవ్వండి’ అని పేర్కొన్నారు. కొద్ది రోజుల్లోనే ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. చాలామంది ఆమె చూపిన మాతృప్రేమను అభినందిస్తున్నారు. కొంతమంది వికృతమైన కామెంట్లు కూడా పెడుతున్నారు. తల్లి కావడమే మహిళకు జీవితంలో అత్యంత సంతోషకరమైన సందర్భం. బిడ్డ కోసం నవమాసాలు మోసి ఎన్ని సమస్యలు ఎదురయినా తట్టుకునే మహిళలు, తమ పిల్లలు పాలకోసం అలమటిస్తే మాత్రం ఒక్క క్షణం కూడా ఆలోచించరు. వారు ఎక్కడున్నా పిల్లల ఆకలి తీర్చేందుకు ప్రయత్నిస్తారు. ఇదే అంశంపై అవగాహన కల్పించేందుకు కేరళకు చెందిన ఓ హీరోయిన్ బిడ్డకు పాలిస్తూ ఫొటోషూట్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది. బహిరంగ ప్రదేశాల్లో పిల్లలకు స్తన్యమివ్వడం నేరం కాదు. బిడ్డ ఏడ్వగానే ఆ బుజ్జీ కడుపును నింపాల్సిన బాధ్యత తల్లిపై ఉంటుంది. ఈ విషయంలోనూ సామాజికంగా ప్రతికూల ఆలోచనలు ఉండటాన్ని పలువురు ప్రశ్నిస్తున్నారు. బిడ్డకు పాలివ్వడంలో మాతృత్వం కల్పించే గొప్ప వరం.. దానిని కూడా సంకుచిత దృష్టితో చూడవద్దని కోరుతున్నారు. -
ఆట మధ్యలో అమ్మగా...
టొరంటో (కెనడా): అప్పటి వరకు మైదానంలో చురుగ్గా కదులుతూ ఆమె తమ ప్రత్యర్థి జట్టుపై ఆధిపత్యం ప్రదర్శిస్తోంది... తల్లిగా మారిన తర్వాత ఆడుతున్న తొలి టోర్నీలో అయినా ఆటలో ఏమాత్రం పదును తగ్గలేదు... ఇంతలో ఆటకు చిన్న విరామం! ఆ సమయంలో ఆమెలోని అమ్మతనం బయటకు వచ్చింది. అంతే... తమ జట్టు లాకర్ రూమ్‌లోనే సహచర క్రీడాకారిణుల మధ్య తన పాపకు పాలు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఎక్కడ ఉన్నా తల్లిగా తన బాధ్యత నిర్వహించడం తప్పు కాదంటూ ఆమె పాలు ఇస్తున్న ఫొటోపై అన్ని వైపుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి. క్రీడా ప్రపంచంలో ఇది ఎప్పుడూ జరగని ఒక అరుదైన ఘటనగా చెప్పవచ్చు. ఆమె పేరు సేరా స్మాల్. కెనడా ఐస్ హాకీ ప్లేయర్. ప్రస్తుతం తమ జాతీయ టోర్నీలో ఆల్బర్టా రాష్ట్ర జట్టు గ్రూవ్డేల్ వైపర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తోంది. ఎనిమిది వారాల క్రితం పాపకు జన్మనిచ్చిన సేరా, మళ్లీ ఫిట్నెస్ సాధించి బరిలోకి దిగడం విశేషం. టోర్నీ లేని సమయంలో టీచర్‌గా పని చేసే ఆమె... చిన్నతనం నుంచే హాకీని ఇష్టపడింది. అప్పట్లో ఐస్ హాకీలో మహిళలకు అంత మంచి ప్రోత్సాహం లేకపోయినా 13 ఏళ్ల వయసులో పురుషుల జట్టుతో చేరి సేరా సాధన చేసేది. అందుకోసం ఆమె తన పోనీటెయిల్‌ను కూడా కట్ చేసుకుంది! ఆటలో ఒక వెలుగు వెలిగిన తర్వాత పెళ్లి, ప్రసవం తర్వాత తిరిగొచ్చి మళ్లీ మైదానంలో తమ సత్తా చాటిన వారు చాలా మంది ఉన్నారు కానీ మ్యాచ్ మధ్యలో ఇలాంటిది గతంలో ఎప్పుడూ చూడలేదు. ‘నిజానికి ఈ ఫొటోను బయటపెట్టే విషయంలో నేను చాలా సంకోచించాను. అయితే మా జట్టు సభ్యులు తప్పేమీ లేదంటూ ప్రోత్సహించారు. ఒక అమ్మగా నేను చేసిన పనికి గర్వపడుతున్నాను. దీనికి అన్ని వైపుల నుంచి సానుకూల స్పందన రావడం నాకు సంతోషాన్నిచ్చింది’ అని సేరా స్మాల్ పేర్కొంది.