పాపాయికి తల్లిపాలతోనే బతుకంతా మనుగడ. తల్లిపాలు పిల్లలకు కేవలం చిన్నప్పటి ఆహారం మాత్రమే కాదు. బతుకంతా వాళ్లలో ఎన్నో వ్యాధులు రాకుండా చేసే వ్యాధినిరోధక శక్తి కూడా అందులో ఉంది. తల్లిపాలలో ఉన్న సుగుణాల గురించి మీకెంత అవగాహన ఉందో ఒకసారి చెక్ చేసుకోండి.
1. తల్లి కాబోతున్న యువతిని పరామర్శించేటప్పుడు ఆమె ఆరోగ్యంతోపాటు పాపాయికి తల్లి పాలు ఎంత అవసరమో చెబుతుంటారు.
ఎ. అవును బి. కాదు
2. పాపాయి పెరుగుదలకు కావల్సిన పోషకాలు తల్లిపాలతోనే సాధ్యమని, పోతపాలతో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలను తెలియచేస్తుంటారు.
ఎ. అవును బి. కాదు
3. బాలింతను కలిసినప్పుడు పాపాయికి సరిపడినన్ని పాల కోసం తీసుకోవాల్సిన ఆహార జాగ్రత్తలు చెబుతారు.
ఎ. అవును బి. కాదు
4. పుట్టిన అరగంట లోపుగానే తల్లిపాలను తాగించాలని మీకు తెలుసు.
ఎ. అవును బి. కాదు
5. ఇది పాపాయి ఆకలిని తీర్చడమే కాదు, బిడ్డకు వ్యాధినిరోధక శక్తినిచ్చే గుణాలు తొలిపాలలోనే ఉంటాయి.
ఎ. అవును బి. కాదు
6. పుట్టిన తరవాత వీలయినంత త్వరగా తల్లిపాలు పట్టాలి. అది పాపాయికి తల్లితో స్పర్శబంధం పెరగడానికి కూడా దోహదం చేస్తుంది.
ఎ. అవును బి. కాదు
7. ఎంత ఖరీదైన బ్రాండెడ్ పాలపొడి అయినా, మరే ఇతర ఆహారమైనా తల్లిపాల స్థానాన్ని భర్తీ చేయలేదని నిపుణుల అభిప్రాయం.
ఎ. అవును బి. కాదు
8. మొదటి ఆరు నెలలు తల్లిపాలు తాగిన పిల్లలు పెద్దయిన తర్వాత కూడా ఆరోగ్యంగా ఉంటారనే డాక్టర్ల అభిప్రాయంతో మీరు ఏకీభవిస్తారు.
ఎ. అవును బి. కాదు
మీ సమాధానాల్లో ‘ఎ’లు ఆరు అంతకంటే ఎక్కువగా వస్తే మీకు తల్లిపాల గొప్పదనం తెలుసు. మీకు తెలిసిన వాటిని ఇతరులకు చెప్పి వాళ్లు కూడా ఆ ప్రయోజనాన్ని పొందేలా ప్రోత్సహిస్తున్నట్లు అర్థం. ‘బి’లు ఎక్కువైతే అమృతతుల్యమైన తల్లిపాల అవసరాన్ని గుర్తించండి, ఆరోగ్యవంతమైన సమాజం కోసం సాగుతున్న ఈ ఉద్యమంలో మీరూ ఒకరు కావడానికి ప్రయత్నించండి.
Comments
Please login to add a commentAdd a comment