Immunity
-
వైరస్ల పనిపట్టే కృత్రిమ ప్రోటీన్.. పరిశోధకుల కీలక విజయం
పరమాణువులపై పరిశోధన చేస్తున్న ఢిల్లీ జవహర్‌లాల్‌నెహ్రూ విశ్వవిద్యాలయ పరిశోధకులు గొప్ప ముందడుగు వేశారు. ముందులకు లొంగకుండా వైరస్లు ‘వ్యాధి నిరోధకత’ను సంతరించుకుంటున్న పరిస్థితికి చెక్‌పెట్టే దిశగా పరిశోధకులు కీలక విజయం సాధించారు. రష్యన్ శాస్త్రవేత్తలతో కలిసి సంయుక్తంగా చేపట్టిన ఒక పరిశోధనలో జేఎన్‌యూ సైంటిస్టులు హెచ్ఎస్పీ70 అనే మానవ ప్రోటీన్‌ను కనుగొన్నారు. మానవల్లో కోవిడ్, మలేరియా వంటి వైరస్ కారక వ్యాధులు ప్రబలడంలో హెచ్ఎస్పీ70 కీలకపాత్ర పోషిస్తోందని గుర్తించారు. వ్యాధికారక వైరస్లు ఇబ్బడిముబ్బడిగా పెరగడానికి హెచ్ఎస్పీ70 ప్రోటీన్ పరోక్షంగా సాయపడుతుంది. వ్యాధికారక ప్రోటీన్ జాడ తెలియడంతో ఈ ప్రోటీన్ చర్య, అభివృద్ధిని కట్టడిచేసే మరో ప్రోటీన్‌ను శాస్త్రవేత్తలు విజయవంతంగా అభివృద్ధిచేశారు. జేఎన్‌యూలో స్పెషల్ సెంటర్ ఫర్ మాలిక్యులార్ మెడిసన్ విభాగ అధ్యయనకారులు ఈ కృత్రిమ ప్రోటీన్‌ను అభివృద్ధిచేశారు. ఇది హెచ్ఎస్పీ70 పనితీరును క్షీణింపజేస్తుంది. దాంతో అది వ్యాధికారక వైరస్‌లకు పూర్తిస్థాయిలో సాయపడటంతో విఫలమవుతుంది. దాంతో మానవశరీరంలో వ్యాధి విజృంభణ ఆగుతుంది. చికిత్సకు, మందులకు లొంగకుండా వైరస్ కనబరిచే ‘వ్యాధినిరోధకత’సామర్థ్యమూ తగ్గుతుంది. హీట్షాక్ ప్రోటీన్ హీట్షాక్ ప్రోటీన్‌కి పొట్టిరూపమే హెచ్ఎస్పీ. వ్యాధికారక వైరస్ ప్రబలినప్పుడు కణాల్లో అవి క్షణాల్లో రెండింతలు, మూడింతలు, ఇలా కోట్ల రెట్లు పెరిగేందుకు హెచ్ఎస్పీ ప్రోటీన్ సాయపడుతుంది. శరీరాన్ని వేడెక్కేలా చేసి వైరస్ల సంఖ్య పెరగడానికి అనువైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. వైరస్ తనలాంటి లక్షలాది వైరస్‌లను తయారుచేయడంలో, అచ్చం అలాగే ఉండటంలో, రెట్టింపు ప్రక్రియలో తప్పులు దొర్లకుండా హెచ్ఎస్పీ ప్రోటీన్ చూసుకుంటుంది. ఇంతటి కీలక ప్రోటీన్ జాడను కనిపెట్టి జేఎన్‌యూ పరిశోధకులు ఘన విజయం సాధించారు. ఈ పరిశోధనా వివరాలు ప్రఖ్యాత బయోలాజికల్ మైక్రోమాలిక్యూల్స్ ఇంటర్నేషనల్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. కోవిడ్ కారక సార్స్ కోవ్–2 వైరస్‌లోని కొమ్ములతో, మానవ కణంలోని ఏస్2 గ్రాహకాలకు మధ్య హెచ్ఎస్పీ అనుసంధానకర్తలా వ్యవహరిస్తోందని పరిశోధనలో తేలింది. కణాల్లోకి వైరస్ చొరబడాలంటే ఏస్2 రిసెప్టార్లదే కీలక పాత్ర. హెచ్ఎస్పీను నిలువరించడం ద్వారా వైరస్ల సంఖ్య పెరగడాన్ని అడ్డుకోగలిగామని జేఎన్‌యూ ప్రొఫెసర్లు ఆనంద్ రంగనాథన్, శైలజా సింగ్ చెప్పారు.‘‘హెచ్ఎస్పీని అడ్డుకునేలా పీఈఎస్–సీఐ అనే కొత్త ప్రోటీన్‌ను అభివృద్ధిచేశాం. దీనిని సార్స్–కోవ్2 సోకిన కణాల్లోకి జొప్పించాం. దీంతో సార్స్–కోవ్2 కణాల రెట్టింపు ప్రక్రియ గణనీయస్థాయిలో మందగించింది. సాంప్రదాయక ఔషధాలు నేరుగా వైరస్‌లపై దాడిచేస్తాయి. కానీ వైరస్‌లకు ఆతిథ్యమిచ్చే కణాలను లక్ష్యంగా చేసుకోవడం వంటి కొత్తరకం విధానాల ద్వారా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా అడ్డుకోవచ్చు. కోవిడ్ సంక్షోభం ముగియడంతో జనం దాదాపు కరోనా గురించి మర్చిపోయారు. కానీ పరిశోధనా ప్రపంచం ఎప్పుడూ రాబోయే కొత్తరకం వైరస్ల గురించి అప్రమత్తంగానే ఉంటుంది’’అని పరిశోధకులు అన్నారు.చదవండి: నిద్రపోతున్నప్పుడే బెల్లీఫ్యాట్‌ని కరిగించే బెడ్‌టైమ్ 'టీ'..!ఢిల్లీలోని ఆలిండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లోని డాక్టర్ ప్రమోద్ గార్గ్, పీహెచ్డీ స్కాలర్ ప్రేరణ జోషి సైతం ఈ పరిశోధనలో పాలుపంచుకున్నారు. హఠాత్తుగా పుట్టుకొచ్చి విజృంభించే కొత్త రకం వైరస్ల కట్టడికి ఈ విధానం ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని ప్రేరణజోషి అన్నారు. అంతర్జాతీయంగా ఆరోగ్య సంక్షోభం తలెత్తినప్పుడు శాస్త్రసాంకేతి రంగం ఏ స్థాయిలో నూతన చికిత్సా విధానాలు, ఆవిష్కరణలతో సంసిద్ధంగా ఉండాలనే అంశాన్ని తాజా పరిశోధన మరోసారి నిరూపిస్తోంది. -
వాయు కాలుష్యం నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే..!
ఢిల్లీలో గాలి నాణ్యత తీవ్రంగా పడిపోతుంది. వాయు కాలుష్యం అంతకంతకు తీవ్రమై దేశరాజధాని ఢిల్లీ వంటి కొన్ని ప్రాంతాలను అల్లాడిపోయేలా చేస్తుంది. చలికాలంలో ఈ సమస్య మరింత తీవ్రతరంగా ఉంది. ముఖ్యంగా ఈ పొగమంచు కారణంగా పిల్లలు, పెద్దలు బయటకు రాలేని పరిస్థితి ఏర్పడుతోంది. దీని కారణంగా ప్రజలు దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు, శ్వాసకోశ వ్యాధుల బారినపడుతున్నారు. అలాంటి సమస్యల నుంచి ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే వ్యాధినిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ షాట్‌ని తీసుకుంటే మంచిదని చెబుతున్నారు నిపుణులు. అదేంటో, ఎలా తయారు చేయాలో సవివరంగా తెలుసుకుందామా..!.సీనియర్ సిటీజన్లు, చిన్నారులు వాయు కాలుష్యంతో ప్రభావితం కాకుండా ఆరోగ్యాన్ని సంరక్షించుకోవాలంటే బెస్ట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఇమ్యూనిటీ బూస్టింగ్ షాట్ తీసుకోవాలని చెబుతున్నారు. దీనికోసం అల్లం, నారింజ, ఉసిరిలతో చేసిన పానీయాన్ని తీసుకోమని సూచిస్తున్నారు. వీటిలో రోగనిరోధక శక్తిని పెంచే యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉన్నాయని తెలిపారు. తయారీ విధానం..పెద్ద అల్లం ముక్కను చిన్నచిన్న ముక్కలుగా చేసుకోవాలి.నారింజ, గింజతో సహా ఉసిరికాయలను తీసుకోండిఈ మూడింటిని మొత్తగా గ్రైండ్ చేసి వడకట్టండిదీన్ని ఐస్ ట్రైలో వేసి స్టోర్ చేసుకోండికావాల్సినప్పుడూ ఈ ఐస్క్యూబ్ని గ్లాస్లో వేసుకుని కొద్దిగా వేడినీరు జోడించండి. దీన్ని రోజు తీసుకోవడం వల్ల వ్యాధినిరోధక శక్తి వృద్ధి అవ్వడమే గాక ఆరోగ్యంగా ఉంటారని చెబుతున్నారు నిపుణులు. View this post on Instagram A post shared by Palak Nagpal - Clinical Nutritionist (@nutritionwithpalaknagpal) గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాల కోసం వ్యక్తిగత నిపుణులు లేదా వ్యైద్యులను సంప్రదించడం మంచిది.(చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
మార్కెట్లో దండిగా ఉసిరి : ఇలా ట్రై చేస్తే.. ఆరోగ్యసిరి!
ఇంట్లో ఉసిరి ఉంటే... ఒంట్లో ఆరోగ్యం ఉన్నట్లే. అందుకే ఉసిరిని ఆరోగ్యసిరి అంటాం. హైబీపీ ఉంటే ఒక డ్రింక్ తాగుదాం.డయాబెటిక్ అయితే మరో డ్రింక్. ఎనిమిక్‌గా ఉంటే తియ్యటి క్యాండీ. రోజుకో ఉసిరి కాయ తింటే చాలు...గట్ హెల్త్ గట్టిగా ఉంటుంది.ఆమ్లా జ్యూస్ కావలసినవి: ఉసిరి కాయలు: నాలుగు; అల్లం– అంగుళం ముక్క; నిమ్మరసం – టీ స్పూన్; ఉప్పు– చిటికెడు; నీరు – 200 ఎంఎల్తయారీ: ∙గింజలు తొలగించి ఉసిరి కాయలను ముక్కలుగా తరగాలి అల్లం తొక్కు తీసి ముక్కలు చేయాలి మిక్సీలో ఉసిరికాయ ముక్కలు, అల్లం ముక్కలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙నీరు కలిపి మరొకసారి తిప్పి గ్లాసులో పోయాలి. నిమ్మరసం, ఉప్పు కలిపి తాగాలి. ఇది డయాబెటిస్‌కి దివ్యమైన ఔషథం.ఆమ్లా కాండీ కావలసినవి: ఉసిరికాయలు– పావుకేజీ; చక్కెర– 150 గ్రాములు; జీలకర్ర ΄ పొడి– టీ స్పూన్; అల్లం తరుగు– టీ స్పూన్; చక్కెర పొడి– 2 టేబుల్ స్పూన్లు.తయారీ: ∙ఉసిరికాయలను శుభ్రంగా కడగాలి నీటిని మరిగించి అందులో ఉసిరికాయలను వేసి రెండు నిమిషాల తర్వాత నీటిని వంపేయాలి వేడి తగ్గిన తర్వాత ఉసిరికాయలను ముక్కలుగా తరగాలి, గింజలు తీసేయాలి. ఆ ముక్కల మీద జీలకర్ర పొడి, చక్కెర కలిపి పాత్రకు మూత పెట్టి ఆ రోజంతా కదిలించకుండా ఉంచాలి. మరుసటి రోజుకి చక్కెర కరిగి నీరుగా మారుతుంది. మూడవ రోజుకు ఆ నీటిని ముక్కలు చాలా వరకు పీల్చుకుంటాయి. మరో రెండు రోజులు ఎండబెట్టాలి. ఐదవ రోజుకు ముక్కలు చక్కెర నీటిని పూర్తిగా పీల్చుకుంటాయి. ఆ తర్వాత కూడా ముక్కలను తాకినప్పుడు కొంత తేమగా అనిపిస్తుంది. ఉసిరి ముక్కల మీద చక్కెర పొడిని చల్లాలి. వాటిని గాలి దూరని సీసాలో భద్రపరుచుకుని రోజుకు ఒకటి లేదా రెండు ముక్కలు తినాలి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచడానికి దోహదం చేస్తాయి. హనీ ఆమ్లా డ్రింక్ ఒక గ్లాసు డ్రింక్‌కి టీ స్పూన్ పౌడర్ సరిపోతుంది. కావలసినవి: ఉసిరికాయలు– నాలుగు; గోరువెచ్చటి నీరు– 200 మి.లీ; పుదీన ఆకులు– నాలుగు; తేనె – టీ స్పూన్.తయారీ: ∙ఉసిరికాయ ముక్కలు, పుదీన ఆకులను మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసులోకి తీసుకుని గోరు వెచ్చటి నీటిని కలపాలి. అందులో తేనె వేసి బాగా కలిపి తాగాలి. ఇది హైబీపీ ఉన్న వాళ్లకు మంచిది. గమనిక: ఉసిరి కాయల డ్రింకులు చేసుకోవడానికి తాజా కాయలు అందుబాటులో లేకపోతే ఆమ్ల పౌడర్ తీసుకోవచ్చు. -
సులభంగా ఇమ్యూనిటీ పెంపొందించుకోండి ఇలా..!
ఇటీవల చాలామందికి డాక్టర్లు అత్యంత ఖరీదైన బయాటిక్స్ ప్రిస్క్రయిబ్ చేస్తుండటం చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. జీర్ణవ్యవస్థ పొడవునా ఉంటూ మనకు మేలు చేసే సూక్ష్మజీవులు పెరుగులో పుష్కలంగా ఉంటాయి. అవి ఉండటం వల్లనే వ్యాధి నిరోధక వ్యవస్థ సమర్థంగా పనిచేస్తుంది. అందుకే పెరుగు తినడం అన్నివిధాలా ఆరోగ్యానికి మేలు చేసే విషయం మాత్రమే కాదు... ఎన్నో రకాల వ్యాధులను దూరంగా ఉంచేందుకు ఓ సమర్థమైన మార్గం కూడా. పెరుగుతో ఉండే ప్రయోజనాలు చూద్దాం. జీర్ణవ్యవస్థ పొడవునా కోటానుకోట్ల సంఖ్యలో ఉండే బ్యార్టీరియా జీర్ణవ్యవస్థ చురుగ్గా ఉండేలా చూడటం మాత్రమే కాకుండా... కడుపులో మంటను తగ్గిస్తాయి. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ టాబ్లెట్ తీసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది నేచురల్‌గా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ కూడా ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఓ అధ్యయనంలో తేలింది. దాదాపు 250 గ్రాముల పెరుగులో 275 ఎంజీ క్యాల్షియమ్ ఉంటుంది. కాబట్టి రోజూ పెరుగు తినేవారి ఎముకలు చాలా పటిష్టంగా ఉంటాయి. ∙చర్మంలో తేమ ఎల్లప్పుడూ ఉండేలా పెరుగు సహాయపడుతుంది కాబట్టి ఒంటికి ఆ నిగారింపు వస్తుందన్నది ఆహార నిపుణుల మాట. పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్త΄ోటును నియంత్రణలో ఉంచుతుంది. మిగతావారితో ΄ోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సెంటిఫిక్ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. మహిళలకు పెరుగు చేసే మేలు అంతా ఇంతా కాదు. పెరుగు వల్ల మనకు సమకూరే ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మేలు చేసే బ్యాక్టీరియా వల్ల మహిళల్లో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది. బరువు తగ్గాలనుకున్న వారికి కొవ్వు లేని పెరుగన్న మంచి ఆహారం అన్నది ఒబేసిటీని నియంత్రించే డాక్టర్లు చెబుతున్న మాట. (చదవండి: -
ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం.. హెల్త్ టిప్స్ తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది. సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ని శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. -
మామూలు అరటిపండు కాదు.. ‘సూపర్ బనానా’.. ప్రపంచంలో ఇదే తొలిసారి
‘రోజుకో యాపిల్.. డాక్టర్‌ను దూరం పెడుతుంద’ని ఓ సామెత ఉంది. అది సీజనల్. రేటు కూడా కాస్త ఎక్కువే. అదే సీజన్‌తో సంబంధం లేకుండా ఏడాది పొడవునా అందుబాటులో ఉండేది అరటి పండు. ధర కూడా తక్కువే. మరి యాపిల్‌లా అరటిపండుతోనూ బోలెడన్ని పోషకాలు అందితే.. తక్కువ ఖర్చుతోనే మంచి ఆరోగ్యం సొంతం. ఈ ఆలోచనతోనే ఉగాండా, ఆ్రస్టేలియా శాస్త్రవేత్తలు బిల్‌గేట్స్ ఫౌండేషన్ సాయంతో ‘సూపర్ బనానా’ను రూపొందించారు. అతి త్వరలోనే దీనిని అందుబాటులోకి తేనున్నట్టు ప్రకటించారు. కోట్ల మందికి ప్రయోజనం ఆసియా, ఆఫ్రికా ఖండాల్లోని పేద దేశాల్లో కోట్లాది మంది ప్రజలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. ముఖ్యంగా విటమిన్ ‘ఏ’ లోపంతో చిన్నారుల్లో ఎదుగుదల సరిగా లేకపోవడం, కంటి చూపు దెబ్బతినడం, వ్యాధినిరోధక శక్తి లేక రోగాల పాలవడం వంటి సమస్యలు తలెత్తుతున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇప్పటికే పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా 19 కోట్ల మంది ఐదేళ్లలోపు చిన్నారులు విటమిన్ ఏ లోపంతో బాధపడుతున్నారని ప్రకటించింది. ఈ క్రమంలోనే విటమిన్ ఏ, ఇతర పోషకాలు అధికంగా ఉండే సూపర్ బనానాను శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. బనానా21 ప్రాజెక్టు పేరిట.. జన్యు మార్పిడితో.. ♦ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌కు చెందినఫౌండేషన్ ఆర్థిక సాయం, ఆ్రస్టేలియా వ్యవసాయ శాస్త్రవేత్త జేమ్స్ డేల్ సహకారంతో ఉగాండా జాతీయ అగ్రికల్చర్ రీసెర్చ్ లేబోరేటరీ శాస్త్రవేత్తలు ‘సూపర్ బనానా’పై 2005లో పరిశోధన చేపట్టారు. ♦ అత్యవసర పోషకాలన్నీ ఉండటంతోపాటు తెగుళ్లు, ఫంగస్‌లను తట్టుకోవడం, కరువు ప్రాంతాల్లోనూ పండించగలిగేలా నీటి ఎద్దడిని తట్టుకోగలగడం వంటి లక్షణాలు ఉండేలా అరటిని అభివృద్ధి చేశారు. ♦ జన్యు మార్పిడి విధానంలో సుమారు 18 ఏళ్లపరిశోధన తర్వాత.. విటమిన్ ఏ సహా అత్యవసర పోషకాలన్నీ ఉండేలా సరికొత్త వంగడాన్ని అభివృద్ధి చేయగలిగారు. ప్రపంచంలో ఇదే మొదటిసారి.. ఇలా పోషకాలన్నీ ఉండేలా జన్యుమార్పిడి అరటి పండ్లను అభివృద్ధి చేయడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని ఈ పరిశోధనలో పాల్గొన్న శాస్త్రవేత్తలు తెలిపారు. దీని ద్వారా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది చిన్నారుల జీవితాలను కాపాడవచ్చని పేర్కొన్నారు. కొత్త అరటి రకం సాగుకు సిద్ధమైనట్టేనని, అనుమతులు రావాల్సి ఉందని వెల్లడించారు. -
పిల్లల్లో రోగ నిరోధక శక్తిని పెంచే డాక్టర్ రెడ్డీస్ ఔషధం
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఔషధ తయారీ సంస్థ డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ తాజాగా పిల్లల పోషణ ఉత్పత్తుల్లోకి ప్రవేశించింది. సెలీహెల్త్ కిడ్జ్ ఇమ్యునో ప్లస్ పేరుతో రోగ నిరోధక శక్తిని పెంచే గమ్మీస్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఇదీ చదవండి: వరల్డ్‌లోనే రిచెస్ట్ బిచ్చగాడు ఎవరో తెలుసా? ఎన్ని కోట్ల ఆస్థి తెలిస్తే..? వెల్మ్యూన్, ప్రీబయోటిక్స్, విటమిన్లు, లవణాల వంటి పదార్ధాల కలయికతో శాస్త్రీయంగా వీటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. 30 గమ్మీస్తో కూడిన ప్యాక్ ధర రూ.480 ఉంది. మందుల షాపుల్లో, ఆన్లైన్లో లభిస్తుంది. (అమెజాన్ గ్లోబల్ సెల్లింగ్: భారీగా పెరిగిన ఈ-కామర్స్ ఎగుమతులు) -
మనసు కడలిలో ఒత్తిడి ఉప్పెన
విజయవాడ పటమటకు చెందిన 45 ఏళ్ల రమేష్ ఓ కార్పొరేట్ సంస్థలో ఉద్యోగం చేసేవాడు. ఏడాది కిందట ఉద్యోగం కోల్పోయాడు. ఆర్థిక ఇబ్బందులు చుట్టు ముట్టడంతో తీవ్రమైన ఒత్తిడికి లోనయ్యాడు. నిద్ర పట్టక పోవడం, దీర్ఘ ఆలోచనలు చేయడంతో పలు రోగాల బారిన పడ్డాడు. ఎన్ని ఆస్పత్రులకు తిరిగినా జబ్బు ఏమీ లేదని తిప్పి పంపేవారు. ఆ తర్వాత తీవ్రమైన మానసిక ఒత్తిడి కారణంగానే ఇలా జరుగుతుందని వైద్యులు తేల్చారు. లబ్బీపేటకు చెందిన 35 ఏళ్ల వెంకటేష్ ప్రభుత్వ ఉద్యోగి. ప్రతిరోజూ అర్ధరాత్రి దాటే వరకూ సెల్‌ఫోన్ చూస్తూ, ఉదయాన్నే ఆఫీసుకు వెళ్లే సమయానికి గానీ నిద్రలేచే వాడు కాదు. నిత్యం ఇలా హడావుడిగా బయలు దేరడం, ఆఫీసుకు పరుగులు పెట్టే క్రమంలో ఒత్తిడికి గురయ్యాడు. అవి తీవ్రరూపం దాల్చడంతో సైకాలజిస్టును ఆశ్రయించాల్సి వచ్చింది. లబ్బీపేట(విజయవాడతూర్పు): తల తిరుగుతుంది.. కడుపులో తిప్పుతుంది.. గుండె పట్టుకుంటుంది.. ఏ పనినీ సక్రమంగా చేయనివ్వదు.. చివరకు ఆత్మహత్యకు దారి తీస్తుంది..! అదే డిప్రెషన్. ఇది ఈ కాలపు ప్రధాన సమస్య. ఒకప్పటి పాతరోజుల్లో జీవితంలో ఎప్పుడోగానీ ఒత్తిడి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురయ్యేది కాదు. కానీ ఇటీవల అందరూ నిత్యం ఒత్తిడికి గురవుతున్నారు. ఫలితంగా అనారోగ్య సమస్యలు చుట్టుముడుతున్నాయి. నిరంతరం ఒత్తిడికి గురయ్యే వారిలో వ్యాధి నిరోధక శక్తి లోపిస్తుందని, ఇన్ఫెక్షన్స్ పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇలా గుర్తించండి.. నిద్రలేమి, ఎల్లప్పుడూ దిగులుగా ఉండటం.. ఏకాగ్రతా లోపించడం వంటి సమస్యలు ఉంటే మానసిక నిపుణుల సలహా ఎంతో అవసరం. ఇలాంటి వారు క్లిష్ట పరిస్థితుల్లో నికోటిన్, డ్రగ్స్, ఆల్కాహాల్‌తో పాటు, ఆహారం ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. పిల్లల్లో తరచూ కోపం, చికాకు పడటం, తలను గోడకేసి కొట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. మానసిక అశాంతికి కారణమయ్యే వ్యతిరేక భావనలు పెరిగిపోతుంటే తక్షణమే కౌన్సెలింగ్ పొందడం, ఆరోగ్య సలహా తీసుకోవడానికి మొహమాట పడకూడదు. మీ సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఇలాంటి సమస్యలతో బాధపడుతుంటే వెంటనే నిపుణులను సంప్రదించాలి. కొరవడిన మానసికోల్లాసం నగరంలోని కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలల్లో క్రీడా ప్రాంగణాలు లేని పరిస్థితి నెలకొంది. ఉదయం 8 నుంచి రాత్రి 7 వరకూ పుస్తకాలతోనే కుస్తీ పట్టించడంతో వారిలోని సృజనాత్మకత దెబ్బతినడంతో పాటు, జ్ఞాపకశక్తిని కోల్పోతున్నట్లు, ఒత్తిళ్లకు గురవుతున్నట్లు మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ఆటపాటలతో చదివిన వారిలో తెలివితేటలు ఎక్కువగా ఉంటాయని, బట్టీ చదువుల్లో రోబోలుగా మారుతున్నారు. వారిలో సామాజిక, నైతిక విలువులు కూడా పెంపొందడం లేదని చెబుతున్నారు. ఒత్తిడితో దుష్ప్రభావాలు ♦ నిద్ర పట్టక పోవడం ♦ ఆకలి లేక పోవడం, లేక ఎక్కువ ఆహారం తినడం ♦ఎక్కువ తినేవారు ఒబెసిటీకి గురవడం ♦ హార్మోన్ల సమతుల్యత లోపించడంతో మహిళల్లో పీరియడ్స్ ఇబ్బందులు ♦ మధుమేహం, రక్తపోటు అదుపులోలేకపోవడం ♦ తీవ్రమైన ఒత్తిడి ఉన్న వారిలో హృద్రోగ సమస్యలు ♦ వ్యాధి నిరోధక శక్తి తగ్గడంలో ఇన్ఫెక్షన్స్ సోకడం జరుగుతుంది. ఇలా జయించొచ్చు ♦ రోజుకు 7 గంటలు తగ్గకుండా నిద్రపోవాలి, ఒకే సమయానికి రోజూ పడుకోవాలి. ♦ సమతుల ఆహారం తీసుకోవాలి. ♦ క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. ♦ యోగ, మెడిటేషన్‌పై దృష్టి సారించి, క్రమం తప్పకుండా పాటించాలి ♦ సెల్‌ఫోన్ చూడటం మాని, పుస్తక పఠనంపై ఆసక్తి పెంచుకోవాలి. ♦ భావోద్వేగాలు, ప్రవర్తనలపై అదుపు కలిగి ఉండాలి. ♦ అసమానతలు, సమస్యలను ధైర్యంగా పరిష్కరించుకోవాలి. ఒత్తిళ్లతో రుగ్మతలు తీవ్రమైన ఒత్తిళ్లకు గురయ్యే వారు అనేక రుగ్మతలకు గురవుతుంటారు. ముఖ్యంగా హార్మోన్ల అసమతుల్యతతో మహిళల్లో పీరియడ్స్ సంబంధిత సమస్యలు వస్తున్నాయి. నిద్రలేక పోవడం, ఎక్కువ ఆహారం తినడం కారణంగా ఊబకాయులుగా మారిపోతున్నారు. వ్యాధి నిరోధక శక్తి కూడా తగ్గుతుంది. సరైన సమయంలో కౌన్సెలింగ్, చికిత్స పొందడం ద్వారా ఒత్తిడిని అధిగమించవచ్చు. – డాక్టర్ విజయలక్ష్మి, మానసిక వైద్య నిపుణురాలు, విజయవాడ యువతలో తీవ్రమైన ఒత్తిడి ప్రస్తుతం యువత ఎక్కువగా తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నారు. వారిపై సెల్‌ఫోన్, సోషల్ మీడియా ప్రభావం కూడా ఎక్కువగా ఉంటుంది. వాటికి అడిక్ట్ అవడంతో ఇతర వాటిపై దృష్టి సారించలేక పోతున్నారు. చదువులో రాణించలేక పోవడం, ఉద్యోగంలో పనిపై దృష్టి పెట్టలేక పోవడం, వ్యాపారాలు, ఇలా అనేక రంగాల వారు కౌన్సెలింగ్ కోసం మా వద్దకు వస్తున్నారు. దేనినైనా అవసరం మేరకు వినియోగించాలి. – డాక్టర్ గర్రే శంకరరావు, సైకాలజిస్టు -
క్షయకు చెక్ పెట్టొచ్చు
లబ్బీపేట (విజయవాడ తూర్పు): క్షయ నివారించదగిన వ్యాధే. సరైన చికిత్స పొందితే ప్రాణాపాయం నుంచి బయటపడవచ్చు. వాస్తవంగా 2023 నాటికే క్షయ రహిత సమాజం నిర్మాణం కావాలని ప్రభుత్వాలు భావించినప్పటికీ, క్షయ వ్యాధి గ్రస్తులు చికిత్స పొందడంలో అలసత్వం వహించడంతో వ్యాధి వ్యాప్తి చెందుతోంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ‘నేను క్షయను నివారించగలను’ అనే నినాదంతో వ్యాధిపై ఈ ఏడాది అవగాహన కలిగిస్తున్నారు. మార్చి 24వ తేదీన ప్రపంచ క్షయ నివారణ దినోత్సవంగా జరుపుతున్నారు. వ్యాప్తి ఇలా.... క్షయ వ్యాధి గ్రస్తులు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు నోటి ద్వారా బయటకు వచ్చే వ్యాధి కారక మైక్రో బ్యాక్టీరియా ఇతరులలోకి ప్రవేశిస్తుంది. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారికి వ్యాధి సోకే అవకాశాలు ఎక్కువని వైద్యులు చెబుతున్నారు. క్షయ వ్యాధి గ్రస్తులు మందులు ప్రారంభించిన రెండు వారాల తర్వాత అతని నుంచి మరొకరికి వ్యాధి వ్యాప్తి చెందే అవకాశం ఉండదు. లక్షణాలివే.. రెండు వారాల కంటే ఎక్కువ రోజులు దగ్గు, సాయంత్రం వేళల్లో జ్వరం, ఏ కారణం లేకుండా బరువు తగ్గడం, ఆకలిలేక పోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే ద్వారా వ్యాధిని నిర్ధారిస్తారు. నియంత్రణ సాధ్యమే.. క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నియంత్రించవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎలిమినేషన్ ప్రోగ్రామ్ (ఎన్టీఈపీ)లో భాగంగా రోగులకు ఉచితంగా మందులు అందచేస్తోంది. క్షయ రోగులు చికిత్సతో పాటు పోషకాహారం తీసుకోవాలి. ఆహారంలో ప్రతిరోజూ రెండు గుడ్లు, పాలు, ఆకుకూరలు, చిక్కుడు, గోరు చిక్కుడు, నాన్‌వెజ్‌కి సంబంధించి కైమా వంటివి తీసుకుంటే మంచిది. క్షయకు చికిత్స పొందుతున్న వారికి పోషకాహారం కోసం ప్రతినెలా ప్రభుత్వం రూ. 500లు ఇస్తోంది. నివారించదగిన వ్యాధే క్రమం తప్పకుండా ఆరు నెలల పాటు మందులు వాడటం ద్వారా క్షయను పూర్తిగా నివారించవచ్చు. ప్రభుత్వం మంచి మందులు సరఫరా చేస్తోంది. కొందరు రెండు, మూడు నెలలు మందులు వాడి మానేయడంతో మొండి క్షయగా రూపాంతరం చెందుతోంది. ప్రతిరోజూ పల్మనాలజీ ఓపీకి 20 నుంచి 30 మంది క్షయ వ్యాధి లక్షణాలతో రోగులు వస్తున్నారు. వారికి కళ్లె పరీక్ష, ఛాతీ ఎక్స్‌రే తీసి వ్యాధిని నిర్ధారిస్తున్నాం. – డాక్టర్ కె.శిరీష, పల్మనాలజిస్టు, జీజీహెచ్, విజయవాడ -
మీకు తెలుసా
జీడిపప్పులో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్,ప్రోటీన్, ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన శరీరాన్ని ఎన్నో వ్యాధులనుంచి రక్షిస్తాయి. జీడిపప్పులో ఉండే మెగ్నీషియం రక్తపోటును తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. జీడిపప్పును ఒక్కొక్కరు ఒక్కోలా తింటుంటారు. కొందరు పచ్చి జీడిపప్పును తింటే ఇంకొంతమంది వీటిని రాత్రి నానబెట్టి ఉదయం తింటుంటారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పును పాలలో నానబెట్టి తింటే వాటి ప్రయోజనాలు రెట్టింపు అవుతాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడానికి బాగా సహాయపడుతుంది. ఇందుకోసం ఏం చేయాలంటే..? రాత్రిపూట గ్లాసు పాలలో మూడు లేదా నాలుగు జీడిపప్పులను వేయండి. మరుసటి రోజు ఈ జీడిపప్పు తిని పాలను తాగండి. దాంతో మామూలుగా జీడిపప్పు తినడం వల్ల కలిగే ప్రయోజనాలకంటే అనేకరెట్లు అధిక ప్రయోజనాలను పొందవచ్చు. ఆరోగ్యానికి మంచిదని మోతాదుకు మించి తింటే ఆరోగ్యం దెబ్బతింటుంది జాగ్రత్త. ఉదయం లేచిన తర్వాత వేడి వేడిగా టీ కానీ, కాఫీ కానీ తాగనిదే చాలా మంది రోజు మొదలవ్వదు. చాలా మంది సమయం సందర్భం లేకుండా టీ తాగుతూ ఉంటారు. లేవగానే ఒకసారి టీ తాగడం.. టిఫిన్ చేశాక టీ తాగడం, మళ్లీ సాయంత్రం, మధ్యాహ్నం భోజనం తర్వాత ఇలా.. ఎప్పుడు పడితే అప్పుడు తాగేస్తుంటారు. అయితే.. భోజనం తర్వాత టీ కానీ కాఫీ గానీ తాగడం వల్ల మనకు తెలీకుండానే సమస్యలు కొని తెచ్చుకున్నవాళ్లం అవుతామట. అదెలాగంటే... అన్నవాహిక అనేది ఒక పొడవాటి గొట్టం. ఇది మన నోటి నుంచి కడుపు వరకు ఉంటుంది. ఇది ద్రవాలు, లాలాజలం, నమిలిన ఆహారానికి వాహకంగా పనిచేస్తుంది. వేడి వేడి కాఫీ, టీలు ఎక్కువసార్లు తాగడం వల్ల అన్నవాహిక దెబ్బతిని క్యాన్సర్ల వంటివి వచ్చే ముప్పు ఉందట. అందువల్ల కాఫీ టీలు తాగేటప్పుడు అదీ మరీ వేడిగా తాగేటప్పుడు ఈ విషయాన్ని గుర్తుంచుకోవడం మంచిది. -
‘కోవిడ్-19’పై గుడ్‌న్యూస్ చెప్పిన డబ్ల్యూహెచ్ఓ
జెనివా: కోవిడ్-19 మహమ్మారి కోరల్లో చిక్కుకున్న ప్రపంచం ఇప్పుడిప్పుడే తేరుకుంటోంది. మరోవైపు.. కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయనే వార్తలు ఆందోళన కలిగిస్తున్న వేళ ప్రపంచ ఆరోగ్య సంస్థ శుభవార్త అందించింది. కోవిడ్-19 వైరస్‌ను ఎదుర్కొనేందుకు ప్రపంచంలోని 90 శాతం మందిలో కొంత మేర రోగనిరోధక శక్తి పెంపొందినట్లు పేర్కొంది. ‘కరోనా వైరస్‌కు గురికావటం లేక వ్యాక్సినేషన్ వల్ల ప్రపంచంలోని 90 శాతం మందిలో కోవిడ్‌ను ఎదుర్కొనే ఇమ్యూనిటీ వచ్చిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది’ అని తెలిపారు డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనోమ్. కోవిడ్-19 మహమ్మారి ఎమర్జెన్సీ దశ ముగింపునకు వచ్చిందని, అయితే, వైరస్ ఇంకా పూర్తిగా తుడిచిపెట్టుకుపోలేదని హెచ్చరించారు డబ్ల్యూహెచ్ఓ చీఫ్ టెడ్రోల్ అధనోమ్. వైరస్‌పై నిఘా, పరీక్షల నిర్వహణ, వ్యాక్సినేషన్ ప్రక్రియలో కొనసాగుతున్న లోపాలతో కొత్త వేరియంట్ల కారణంగా మరణాలు పెరిగేందుకు కారణమవుతున్నట్లు హెచ్చరించారు. అంతకు ముందు.. రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవటం ద్వారా ఏడాది తర్వాత కూడా కోవిడ్ నుంచి రక్షణ లభిస్తున్నట్లు ఓ పరిశోధన పేర్కొంది. దాని ఫలితంగా తరుచుగా బూస్టర్ డోస్‌లు తీసుకోవాల్సిన అవసరాన్ని తగ్గించినట్లు తెలిపింది. ఇదీ చదవండి: Viral Video: భయానక దృశ్యం.. చెరువులో ఈత కొడుతుండగా దాడి చేసిన మొసలి -
వ్యాధి నిరోధక సంజీవని... యోగా!
యోగా అంటే కలయిక. మన శరీరాన్ని మనస్సుతో సంయోగం చేసే ఒక ఆధ్యాత్మిక ఆరోగ్య ప్రక్రియ. దీనిని నిరంతర సాధన చేస్తే మన గమ్యమైన ముక్తి లేక మోక్షం ప్రాప్తిస్తుంది. అనగా మనస్సును ఐహిక బంధం నుండి వేరుచేయడం అన్న మాట. దైవాంశమైన ఆత్మను క్రమబద్ధంగా నియంత్రించడం వల్ల బంధ విముక్తి పొంది సమున్నత స్థితికి చేరటమే యోగా అని అరబిందో నిర్వ చించారు. యోగాలో చాలా రకాలున్నాయి. జ్ఞానయోగం, భక్తి యోగం, పతంజలి యోగం, కుండలినీ యోగం, హఠ యోగం, మంత్ర యోగం, లయ యోగం, రాజ యోగం, జైన యోగం, బౌద్ధ యోగం వంటివి వాటిలో కొన్ని. అయితే ప్రతి యోగా పద్ధతికి సంబంధించి... నియమావళి, సూత్రాలు, ఆచరణ వేరు వేరుగా ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది మన శరీర ఆరోగ్యానికి సంబంధించినదైన పతంజలి యోగా. రోజూ క్రమం తప్పకుండా యోగా చేస్తే రక్తనాళాల్లో అవరోధాలు తొలగిపోయి ప్రతి అవ యవం కండిషన్లో ఉంటుంది. దీనికి తోడు యుక్తా హారం తీసుకొని జీవనశైలిలో మార్పు తెచ్చుకొంటే ఆరోగ్య సమస్యలను రూపుమాపవచ్చు. మన శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. మనం రోజూ యోగా చేస్తే మన పంచేంద్రియాలు, శరీరం లోని జీర్ణ వ్యవస్థ, రక్త సరఫరా వ్యవస్థ, విసర్జిక వ్యవస్థ, శ్వాసకోశ వ్యవస్థ, పునరుత్పత్తి వ్యవస్థ, నాడీ వ్యవస్థ, వినాళ గ్రంథి వ్యవస్థ వంటి అన్ని వ్యవస్థలూ స్పందించి ఆయా అవయవాలు సక్రమ స్థితిలో ఉంటాయి. యోగా చేసేవారు గురువు సూచనలు పాటించాలి. ఆపరేషన్ చేయించుకున్నవారూ, గర్భిణులూ డాక్టర్ సూచనలు పాటించాలి. వ్యాధి ఒక్కరోజులో సంక్రమించదు. వ్యాధి పెరుగుదల ఐదు దశల్లో ఉంటుంది. మొదటి దశలో ఏ లక్షణాలూ పైకి కనపడవు కానీ శరీరంలో వ్యాధి పెరుగుతుంది. ద్వితీయ దశలో పైకి స్వల్ప లక్షణాలు కనపడతాయి. మూడవ దశలో వ్యాధి లక్షణాలు బాగా కనపడి బాధను కల్గిస్తాయి. ఈ దశలో త్వరగా వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందివ్వాలి. లేకపోతే నాలుగవ దశలోకి ప్రవేశిస్తాడు. ఈ దశలో అవసరమైన శస్త్ర చికిత్స చేసి అంగవైకల్యానికి పరిమితం చేస్తారు. ఐదో దశ పునరావాసం లేక మరణం. వీటిలో మొదటి రెండు దశల్లోనూ యోగా వల్ల ఉత్పత్తి అయిన రోగ నిరోధక శక్తితో వ్యాధిని విజయ వంతంగా నిరోధించవచ్చు. నేడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో కార్డియాలజీ, న్యూరాలజీ, డయబెటాలజీ వంటి క్లినిక్‌లలో అనేక వందల మంది రోగులను ప్రతిరోజూ చూస్తున్నాం. రోగుల సంఖ్య అధికమవ్వటం వల్ల డాక్టర్లు వైద్య ప్రమా ణాలు పాటించని లేని స్థితికి చేరి వైద్యం చేస్తున్నారు. ఈ రోగుల సంఖ్యను గణనీయంగా యోగా వల్ల తగ్గించవచ్చు. అంతేకాదు యోగా చేసిన వెంటనే సదరు వ్యక్తి శరీరంలో ఎండార్ఫిన్ అనే సంతోషాన్ని కలిగించే హార్మోన్ విడుదల అవుతుంది. రాత్రి చక్కగా నిద్ర పడుతుంది. అంతేకాదు యోగా వల్ల స్థూల శరీరం తగ్గి చక్కటి ఆకృతి ఏర్పడుతుంది. మన శరీరంలోని కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. యోగా వల్ల రక్తనాళాలు, నాడులకు ఉన్న సాగే గుణం సురక్షిత మవుతుంది. యోగా వల్ల వ్యాధి నిరోధక శక్తి బాగా పెరుగుతుంది. క్రమం తప్పకుండా యోగా చేస్తే మనస్సు సమస్థితిలోకి వచ్చి అసహ్యం, అసూయ, కోపం వంటి మానసిక ఉద్రేకాలు తగ్గుతాయి. యోగా రక్తపోటు, మధుమేహ మందుల డోసును గణనీయంగా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి వ్యక్తీ రోజూ ఒక గంట యోగా చెయ్యాలి. - వి.వి. రత్నాకరుడు రిటైర్డ్ నాన్ మెడికల్ ఫేకల్టీ ఆఫీసర్ (జూన్ 21న అంతర్జాతీయ యోగా దినోత్సవం) -
ఫోర్టిఫైడ్ రైస్ అంటే ఏమిటి..? అందులో ఉండే విటమిన్లేంటి?
మహబూబ్‌నగర్ రూరల్: కరోనా వైరస్ ప్రజారోగ్యాన్ని తీవ్రంగా దెబ్బతీసిన నేపథ్యంలో మనుషుల్లో రోగ నిరోధక శక్తి పెంచేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా అధిక పోష కాలు ఉన్న బియ్యాన్ని రేషన్ దుకాణాల ద్వారా అందించాలని నిర్ణయించింది. పోషక బియ్యం (ఫోర్టిఫైడ్ రైస్)ను ఎఫ్‌సీఐ ద్వారా సేకరించనుంది. రాష్ట్ర ప్రభుత్వం సైతం ఇందుకు సహకారం అందిస్తోంది. బియ్యంలో కృత్రిమంగా సూక్ష్మ పోషకాలు కలపటంతో ఆ ఆహారం తీసుకున్న వ్యక్తుల్లో రోగనిరోధక శక్తి పెరుగుతుందని.. తద్వారా కరోనాలాంటి పలురకాల వైరస్‌లను మానవులు తట్టుకుంటారని భావిస్తున్నారు. ఫోర్టిఫైడ్ రైస్ తయారీకి జిల్లాలోని రైస్‌మిల్లుల్లో యంత్రాలను మార్చాలని యజమానులకు అధికారులు సూచించారు. అంగన్వాడీ కేంద్రాలకు ఏప్రిల్‌లో సరఫరా చేయగా.. రానున్న రోజుల్లో పాఠశాల విద్యార్థులు, రేషన్ లబ్ధిదారులకు కూడా అందించేందుకు కసరత్తు చేస్తున్నారు. చదవండి👉🏻Photo Feature: అమ్మ.. అంటే ఎవరికైనా అమ్మే బ్లెండింగ్ యూనిట్ల ఏర్పాటు.. 2024 నాటికి అన్ని రాష్ట్రాల్లో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా బలవర్ధక బియ్యాన్ని పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు భారత ఆహార సంస్థ అందించిన నిల్వలకు అదనంగా పోషకాలు కలుపుతున్నారు. ఇందుకు మిల్లుల్లో బ్లెండింగ్ యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. వీటి ఏర్పాటుకు సుమా రు రూ.6 లక్షల వరకు ఖర్చవుతుంది. జిల్లాలోని 10 పారా బాయిల్డ్ రైస్‌మిల్లుల్లో వీటిని ఏర్పాటుచేసి అంగన్వాడీ కేంద్రాలకు నెలకు 700 క్వింటాళ్ల ఫోర్టిఫైడ్ నిల్వలను సరఫరా చేస్తున్నారు. మరో అయిదు మిల్లుల్లో బ్లెండింగ్ యూనిట్లు ఏర్పాటు చేసి బియ్యంలో ఐరన్, ఫోలిక్ యాసిడ్, విటమిన్–ఏ, జింక్, ఇతర విటమిన్లు చేర్చేలా చర్యలు తీసుకుంటున్నారు. 2021 యాసంగిలో పౌరసరఫరాలశాఖ సేకరించిన ధాన్యం 7,540 మెట్రిక్ టన్నులు ఈ మిల్లులకు కేటాయించగా.. ఫోర్టిఫైడ్ రైస్ పౌరసరఫరాలశాఖ గోదాములకు చేరింది. ఉపయోగం ఏంటి? సాధారణ బియ్యంలో ఐరన్ విటమిన్ డి, బి–12తో పాటు మరిన్ని పోషకాలు కలపటంతో సూక్ష్మ పోషకాలతో కూడిన బియ్యంగా మారుతాయి. గోధుమలు, మినుములు, పెసర, అపరాలు, రాగులు, సజ్జలు వంటి తృణ ధాన్యాలను పొడిగా మారుస్తారు. వీటిని కెనరల్స్ అంటారు. ఈ కెనరల్స్ పౌడర్‌ను ముద్దల రూపంలోకి మార్చి క్వింటా సాధారణ బియ్యానికి కిలో కెనరల్స్ కలుపుతారు. సాధారణ బియ్యంలో కార్బొహైడ్రేట్స్ మాత్రమే ఉంటాయి. తోడుగా కెనరల్స్ కలపటంతో పిండి పదార్థాలు, పోషకాలు జమవుతాయి. పోషకాలు కలిపిన బియ్యం వండితే బలవర్ధక ఆహారం తయారవుతుంది. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. క్వింటాకు కిలో చొప్పున.. వంద కిలోల సాధారణ బియ్యానికి కిలో పోషకాల నిల్వలను కలుపుతున్నారు. మిల్లుల్లో ఓవైపు మరపట్టిన.. మరోవైపు పోషకాల నిల్వలు వచ్చి ఒకేచోట పడేలా యంత్రాలను అమర్చుతున్నారు. ఉత్తర్వులు రావాలి.. పోషకాల మిళిత బియ్యాన్ని ఇప్పటికే అంగన్వాడీలకు సరఫరా చేస్తున్నాం. గర్భిణులు, బాలింతలు, చిన్నారుల్లో పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు చర్యలు తీసుకుంటున్నాం. మున్ముందు పాఠశాలలలు, రేషన్ లబ్ధిదారులకు అందిస్తాం. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు రావాల్సి ఉంది. – జగదీశ్‌కుమార్, మేనేజర్, పౌరసరఫరాల శాఖ, మహబూబ్‌నగర్ చదవండి👇🏽 కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
నాటుకోడి పులుసు.. రాగిముద్ద.. ఆహా ఆ రుచే వేరు.. పుంజు రూ.5 వేలు!
కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రస్తుతం ఇంటింటా నాటు కోడి రుచులు ఘుమఘుమలాడుతున్నాయి. రహదారికి ఇరువైపులా నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. చదవండి👉 Health Tips: రోజూ కోడిగుడ్డు తిన్నారంటే.. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్పిస్తున్నాయి. నాటుకోడి పులుసు–రాగిముద్ద హోటళ్లు వెలుస్తున్నాయి. రోగ నిరోధక శక్తిని పెంచే నాటుకోళ్లు పూర్వ వైభవంతో రెక్కలు విప్పుతున్నాయి. రుచిని, ఆరోగ్యాన్నిచ్చే పెరటి కోళ్ల వినియోగంతోపాటు ధరలూ పెరుగుతున్నాయి. ఈ కోళ్ల పెంపకందారులకు కాసులు కురుస్తున్నాయి. కొలువులు పోగొట్టుకున్న సాఫ్ట్వేర్లకూ ఈ కోళ్లే ఉపాధి కల్నిస్తున్నాయి. పలమనేరు/బైరెడ్డిపల్లె: ఆదివారం వచ్చిందంటే చాలు ఇళ్లల్లో మాంసాహారం ఘుమఘుమలాడాల్సిందే. అందులోనూ నాటుకోడి చారు దానికి కాంబినేషన్‌గా రాగిముద్ద ఇప్పుడు జిల్లాలో ఓ ట్రెండ్‌గా మారింది. కోవిడ్ నేర్పిన పాఠంతో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగిపోయింది. వ్యాధి నిరోధకశక్తిని పెంచుకొనేందుకు మాంసాహారంపై దృష్టి సారించారు. మందులతో పెంచే బ్రాయిలర్ కోళ్లకంటే నాటు కోళ్లలో మంచి ప్రోటీన్లు ఉండడంతో వీటికి గిరాకీ పెరిగింది. రాయలసీమ ప్రత్యేక వంటగా పేరొందిన రాగిముద్దకు నాటుకోడి పులుసుంటే ఆ మజానే వేరు. దీనికున్న డిమాండ్‌ను చూసి చిత్తూరుతోపాటు కర్ణాటకలోని కోలారు, చింతామణి, చిక్కబళ్లాపుర, బెంగళూరు ప్రాంతాల్లోనూ ఈ నాటుకోడిచారు రాగిముద్ద హోటళ్లు భారీగా వెలిశాయి. పెరుగుతున్న పెంపకం-వినియోగం గతంలో పల్లెల్లో ప్రతి ఇంటికి పెరటి కోళ్లు ఉండేవి. బంధువులు ఇంటికొచ్చినా, పండుగలొచ్చినా కోడి కూర వండడం అప్పటి సంప్రదాయం. కాల క్రమేణా జీవనశైలిలో వచ్చిన మార్పుతో పెరటికోళ్ల పెంపకం తగ్గింది. ఏ సమయంలోనైనా అందుబాటులో ఉండే బ్రాయిలర్‌కోళ్ల వినియోగం పెరిగింది. కేవలం 40 రోజుల్లో పెరిగే వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు అంతంతమాత్రమే. దీనికితోడు కోవిడ్ కారణంగా ప్రజలు ఇమ్యూనిటీని పెంచుకునే మార్గాలు అన్వేషించి, రుచిని అందించే నాటు కోడిని ఎంచుకున్నారు. చదవండి👉: నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు దీంతో నాటుకోళ్ల పెంపకంతోపాటు వినియోగమూ పెరిగింది. ప్రస్తుతం జిల్లాలో 80 దాకా నాటుకోళ్ల ఫారాలున్నాయి. కోవిడ్కారణంగా కొలువులు వదిలేసి వచ్చిని సాఫ్ట్వేర్లు సైతం నాటుకోళ్ల ఫామ్‌లు పెట్టి రెండు చేతులా ఆర్జిస్తున్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో బ్రాయిలర్ కోళ్ల అమ్మకాలు రోజుకు సగటున 30 టన్నులుగా ఉంది. నాటుకోళ్ల అమ్మకాలు 5 టన్నులుగా ఉండేది. ప్రస్తుతం రోజువారీ నాటుకోళ్ల వినియోగం 8 టన్నులకు చేరుకుందని వ్యాపారులు చెబుతున్నారు. బైరెడ్డిపల్లె సంత ప్రసిద్ధి పలమనేరు నియోజకవర్గం బైరెడ్డిపల్లెలో ప్రతి శనివారం జరిగే నాటుకోళ్ల సంత రాయలసీమలోనే ప్రసిద్ధి చెందింది. ఇక్కడ కోళ్ల సంత మూడు దశాబ్దాలుగా సాగుతోంది. చుట్టుపక్కల గ్రామాలనుంచి నాటుకోళ్లను పెంచేవాళ్లు ఇక్కడికి అమ్మకానికి తీసుకొస్తారు. వీటిని కొనేందుకు వందలాదిమంది వ్యాపారులు బయటి రాష్ట్రాలనుంచి సంతకు వస్తుంటారు. ఇక్కడ లక్షల్లో నాటుకోళ్ల వ్యాపారం జరుగుతుంది. ముఖ్యంగా బెంగళూరునుంచి ఖరీదైన కార్లలో వచ్చే వారు ఇక్కడి పందెంకోళ్లు, బెనిసికోళ్లను కొనుగోలు చేస్తుంటారు. నాటుకోడి పులుసు హోటళ్లు పలమనేరు, కుప్పం, చిత్తూరు, మదనపల్లె, తిరుపతి, రాయచోటి ప్రాంతాలతోపాటు పొరుగున ఉన్న కర్ణాటకలోని కోలారు, ముళబాగిలు, బంగారుపేట, కేజీఎఫ్, మాలూరు, విజయపుర, షిడ్లగట్ట, దొడ్డబళ్లాపురల్లో నాటుకోడిచారు– రాగిముద్ద హోటళ్లు, దాబాలు ప్రత్యేకంగా వెలిశాయి. చిన్న చిన్న పట్టణాల్లో అయితే ఇళ్లలోనే నాటు కోడివంటలు చేసి తోపుడు బండ్లపై విక్రయిస్తున్నారు. రహదారుల పక్కన వాహనాల్లోనూ నాటుకోడి పులుసు అమ్మకాలు సాగుతున్నాయి. పుంజు రూ.5 వేలు ప్రస్తుతం నాటుకోడి(లైవ్) కిలో రూ.250 నుంచి రూ.300 పలుకుతోంది. కోడి బరువునుబట్టి ధర నిర్ణయిస్తారు. అయితే ఈ సంతకొచ్చే కోడిపుంజుల్లో కొన్ని పందెంకోళ్లుంటాయి. వీటి ధర డిమాండ్‌ను బట్టి రూ.3వేల నుంచి 5వేల దాకా పలుకుతుంటాయి. మాంసం కోసమైతే కోడి పుంజు, బెనిసికోడి, నల్లకోడి, కోడిపెట్ట, గుడ్లుకోడికి మంచి డిమాండ్ ఉంటుంది. ఎంతో ఆరోగ్యం నాటుకోడిలో కొలెస్ట్రాల్ తక్కువగా ఉంటుంది. దీంతో విటమిన్-బి6తో పాటు ప్రొటీన్లు, ఫాస్ఫరస్, జింక్ ధాతువులు అందుతాయి. జీర్ణక్రియకు ఎటువంటి ఇబ్బందులుండవు. వీటికి పూర్తి సహజ సిద్ధంగా తయారైన ఆహారాన్ని అందిస్తారు కాబట్టి ఆరోగ్యానికి మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ కోడికి పూర్వ వైభవం వచ్చింది. పెరిగిన గిరాకీ నేను బైరెడ్డిపల్లి సంతలో 20 ఏళ్లుగా నాటుకోళ్లను కొంటున్నాను. గత రెండేల్లుగా వీటికి డిమాండ్ బాగా పెరిగింది. నాటుకోడి మాంసం తినేవారి సంఖ్య పెరిగింది. బ్రాయిలర్ కోడిమాంసం కంటే కొంచెం ఎక్కువ ధర అయినప్పటికీ జనం ఎగబడి కొంటున్నారు. మాకు వ్యాపారం బాగానే ఉంది. ఇక్కడ కోళ్లను కొని కర్ణాటకలో అమ్ముతుంటాం. ప్రతివారం కోళ్ల సంతకు వస్తుంటాం. – రియాజ్, నంగిళి, కర్ణాటక ఈ కోళ్ల రుచే వేరు ఎన్నో ఏళ్లుగా బైరెడ్డిపల్లెలో నాటుకోళ్ల వ్యాపారం చేస్తున్నాను. మా కర్ణాటకలో బైరెడ్డిపల్లె నాటుకోళ్ల్లకు మంచి గిరాకీ ఉంటుంది. ఎందుకంటే వీటిని రైతుల పొలాలవద్ద, పల్లెల్లో పెంచుతారు. అవి ప్రకృతిలో తిరుగుతూ పెరుగుతాయి కాబట్టి రుచిగా ఉంటాయి. ఫారాల్లో పెంచే నాటుకోళ్లు క్రాసింగ్ కాబట్టి అంతరుచి రాదు. నాటుకోడి పులుసు తినేటపుడే నాటుదా ఫారమ్దా అని తెలిసిపోతుంది. శ్రీధర్, కోళ్లవ్యాపారి, ముళబాగిళు, కర్ణాటక -
‘ఎన్ని కోవిడ్ వేవ్‌లు వచ్చినా పర్లేదు.. అయితే, అవి మాత్రం మరవొద్దు’
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా నాలుగో వేవ్ వచ్చినా ఆందోళన అవసరం లేదని ఎయిమ్స్ వైద్య నిపుణులు అంటున్నారు. ఇకపై ఎన్ని వేవ్‌లు వచ్చినా మన దేశంపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేదని చెబుతున్నారు. భారీ వ్యాక్సినేషన్, కరోనా రోగుల్లో పెరిగిన నిరోధక శక్తి వల్ల ఇకపై వచ్చే వేవ్‌లు ప్రభావం చూపలేవని ఎయిమ్స్ ఎపిడిమాలజిస్ట్ డాక్టర్ సంజయ్ రాయ్ అన్నారు. ‘‘కరోనాలో ఇప్పటికే వెయ్యికి పైగా మ్యుటేషన్లు జరిగాయి. వాటిలో ఐదు వేరియెంట్లే ఎక్కువ ప్రభావం చూపాయి. కరోనా రెండో వేవ్ భారత్‌లో తీవ్ర ప్రభావం చూపినా డెల్టా వేరియెంట్ వల్ల అత్యధికుల్లో ఏర్పడ్డ రోగనిరోధక శక్తి ఇకపై వచ్చే వేవ్‌ల నుంచి కాపాడుతుంది’’ అన్నారు. మాస్కులు, భౌతికదూరం తప్పనిసరని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రి చీఫ్ డాక్టర్ జుగల్ కిశోర్ చెప్పారు. కోవిషీల్డ్ రెండో డోసు వ్యవధి తగ్గింపు కోవిషీల్డ్ రెండు డోసుల మధ్య వ్యవధిని తగ్గించారు. తొలి డోసు తర్వాత 8 నుంచి 16 వారాల మధ్య రెండో డోసు తీసుకోవడానికి అనుమతిస్తూ నీతి అయోగ్ (ఇమ్యూనైజేషన్) నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఇది 12–16 వారాలు (84 రోజులు)గా ఉంది. -
Health Tips: కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి..
కోవిడ్ బారిన పడ్డవారు, ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆహార చిట్కాలు... ►నాలుగైదు బాదం పప్పులు, పది కిస్మిస్లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. బాదం పప్పు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. ►రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. ►బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ,ఇ, డి, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేగాక, ఎముకలు గట్టిపడతాయి. ►రాత్రి పూట తీసుకునే ఆహారంలో కిచిడి ఉండాలి. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని సమస్థితితో ఉంచడమేగాక జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
పాదాలు కదలడం లేదా? అయితే గులియన్ బ్యారీ సిండ్రోమ్!
కొంతమందిలో కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వచ్చి తగ్గాక... ఎందుకోగానీ.... వారి సొంత వ్యాధినిరోధక శక్తే వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. అలాంటి ఓ రుగ్మతే ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’. ఇందులో బాధితుడు చూడ్డానికి అంతా బాగానే కనిపిస్తుంటాడు. కానీ అతడి దేహం కాళ్ల దగ్గర్నుంచి అచేతనం కావడం మొదలై క్రమంగా పైపైకి పాకుతూ ఉంటుంది. గతంలో చాలా అరుదుగా మాత్రమే కనిపించే ఈ రుగ్మత ఇటీవల చాలామందిలో కనిపిస్తోంది. సంక్షిప్తంగా ‘జీబీ సిండ్రోమ్’ అని పిలిచే... ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ గురించి తెలిపే కథనమిది. ఓ చిన్న కేస్‌స్టడీ ద్వారా గులియన్ బ్యారీ సిండ్రోమ్ తీవ్రత ఎలా ఉంటుందో చూద్దాం. జీవన్ టాయిలెట్‌కు వెళ్లాడు. పనిపూర్తయ్యాక లేచి నిలబడి ఎప్పటిలాగే బయటకు వచ్చేద్దామనుకున్నాడు. కానీ ఎంత ప్రయత్నించినా పాదాలు కదలడం లేదు. అత్యంత కష్టంగా బయటకు వచ్చాడు. కాళ్లెందుకు స్వాధీనంలో లేవో తెలియలేదు. దాంతో హాస్పిటల్లో చేరాడు. తొలుత పాదాలూ, కాళ్లే కాదు... క్రమంగా నడుమూ... అటు తర్వాత చేతులు, మెడ... ఇలా దేహంలోని అన్ని అవయవాలూ అచేతనమైపోవడం మొదలైంది. బయటకు కనిపిస్తున్న ఆ లక్షణాలను గమనించిన డాక్టర్లు దాన్ని ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’గా భావించారు. కారణం... మనకు ఏవైనా వైరస్ల వల్ల జ్వరం/ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనలోని రోగనిరోధక శక్తి యాంటీబాడీస్‌ను ఉత్పత్తి చేసి, ఆ జ్వరానికి/ఇన్ఫెక్షన్కు కారణమైన వైరస్‌ను తుదముట్టిస్తుంది. కరోనా సోకినప్పుడు కూడా యాంటీబాడీస్ ఆ వైరస్‌ను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తాయి. ఈ క్రమంలో ఒక్కోసారి అది నరాలనూ దెబ్బతీసే అవకాశముంది. అలా జరిగినప్పుడు ‘గులియన్ బ్యారీ సిండ్రోమ్’ కనిపించవచ్చు. అయితే నరాలు ఏ మేరకు దెబ్బతిన్నాయన్న విషయం మనలో తయారైన యాంటీబాడీస్ పరిమాణంపై ఆధారపడి ఉంటుంది. గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన 70 శాతం మందిలో సాధారణంగా రెండు వారాల్లో వారు నడవలేని పరిస్థితికి చేరుకునే అవకాశాలు ఎక్కువ. దాదాపు ఒక నెల రోజులు మొదలుకొని ఆర్నెల్ల తర్వాత వారు కోలుకుని పూర్తిగా నార్మల్ కాగలరు. అయితే 10 శాతం మందిలో మాత్రం సమస్య మరింత ముదిరి శ్వాస తీసుకోడానికి ఉపయోగపడే కండరాలు కూడా చచ్చుబడిపోతాయి. దాంతో ఊపిరి తీసుకోవడం కష్టమవుతుంది. ఇలాంటి వారు మింగే శక్తిని కూడా కోల్పోతారు. మెడలను నిలపలేరు. బాధితులు ఇలాంటి దశకు చేరుకుంటే మాత్రం వెంటిలేటర్ పెట్టి చికిత్స అందించాలి. ఇక మిగతా 20 శాతం మందిలో ప్రభావం పెద్దగా ఉండదు. ఎందుకిలా జరుగుతుందంటే...? మన మెదడు... దేహంలోని ప్రతి అవయవాన్నీ నియంత్రిస్తూ ఉంటుందన్న విషయం తెలిసిందే. మెదడు నుంచే నరాల ద్వారా శరీరంలోని అన్ని అవయవాలకూ, కండరాలకు ఆదేశాలూ, సమాచారాలూ అందుతూ ఉంటాయి. ఈ నరాలన్నింటిపైనా ‘మైలీన్’ అనే పొర (మైలీన్ షీత్) ఉంటుంది. వాస్తవానికి ఈ పొర కారణంగానే ‘కదలిక’లకు సంబంధించిన సమాచారమంతా ఎలక్ట్రికల్ సిగ్నల్స్ రూపంలో అయా అవయవాలకు అందుతూ ఉంటుంది. ఒక్కోసారి మన వ్యాధినిరోధకతకు దోహదపడే యాంటీబాడీస్... ఏ కారణం వల్లనో ఈ ‘మైలీన్’ పొరను దెబ్బతీస్తాయి. ఫలితంగా మెదడు నుంచి అందే ఎలక్ట్రిక్ సిగ్నల్స్ ప్రసారానికి అంతరాయం కలుగుతుంది. దాంతో కండరాలను కదిలించడం సాధ్యం కాదు. ఆ విధంగా మైలీన్ పొర దెబ్బతిన్న ప్రతి కండరమూ అచేతనమవుతుంది. తీవ్రత స్థాయులు వ్యాధి తీవ్రత చాలా స్వల్పం మొదలు కొని అత్యంత తీవ్రం వరకు ఉండవచ్చు. స్వల్పంగా ఉంటే నడవడం కష్టం కావచ్చు. కానీ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే బాధితుడు పూర్తిగా మంచానికే పరిమితమవుతాడు. తీవ్రత మరింత ఎక్కువగా ఉంటే కాళ్లూ, చేతులకు తిమ్మిర్లు, స్పర్శ తెలియకపోవడం జరగవచ్చు. సాధారణంగా కాళ్లూచేతులు కదిలించడం అన్న పనులు మన ప్రమేయంతో మనమే చేసేవి. చాలా సందర్భాల్లో జీబీ సిండ్రోమ్‌లో మన ప్రమేయం లేకుండా జరిVó కీలక కార్యకలాపాలు చాలా అరుదుగా ప్రభావితమవుతాయి. ఒకవేళ అలా జరిగినçప్పుడు కొందరిలో గుండె స్పందనల వేగం తగ్గడం, బీపీ హెచ్చుతగ్గులకు గురికావడం, ముఖంలోంచి వేడి ఆవిర్లు వస్తున్నట్లుగా అనిపిసించడం, తీవ్రంగా చెమటలు పట్టడం జరగవచ్చు. కాస్తంత అరుదుగా మూత్రం కండరాలపైనా పట్టుకోల్పోవడయూ జరగవచ్చు. ఒకసారి వ్యాధి కనిపించడం మొదలయ్యాక అది ఏడు నుంచి పద్నాలుగు రోజుల్లో క్రమంగా పెరుగుతూ, తీవ్రమవుతూ పోవచ్చు. బాధితులు కొంతకాలం అచేతనంగా ఉండి... ఆ తర్వాత మళ్లీ కోలుకోవడం మొదలుకావచ్చు. అయితే కొంతమందిలో శ్వాసకోశ వ్యవస్థకు సంబంధించిన సిగ్నల్స్ అందకపోవడం జరిగితే... అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీవయచ్చు. చికిత్స : గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన రోగులు నడవలేని పరిస్థితుల్లో ఉన్నా, ఊపిరి తీసుకోడానికి ఇబ్బంది పడుతున్నా, బీపీలో హెచ్చుతగ్గులు, గుండె స్పందనల్లో లయ తప్పుతున్నా (అటనామిక్ న్యూరోపతి ఉన్నా) వాళ్లకు జీబీ సిండ్రోమ్‌కు ఇవ్వాల్సిన ప్రత్యేక చికిత్స అవసరం పడుతుంది. ప్రస్తుతం బాధితులకు రెండు రకాల ప్రధాన చికిత్స ప్రక్రియలు అందుబాటులో ఉన్నాయి. అవి... ►ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స: బాధితుడి బరువు ఆధారంగా నిర్ణయించిన మోతాదు ప్రకారం...అతడికి ఐదు రోజుల పాటు ఇమ్యూనోగ్లోబ్యులిన్ ఇంజెక్షన్లను ఇవ్వడం ఒక చికిత్స ప్రక్రియ. ఇవి మన దేహంలోని యాంటీబాడీస్‌ను బ్లాక్ చేయడం ద్వారా పరిస్థితిని చక్కబరుస్తాయి. తద్వారా నరాల పైన ఉండే మైలీన్ పొర మరింత ధ్వంసం కాకుండా చూస్తాయి. ►ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స: ఈ చికిత్సలో శరీరంలో జబ్బుకు కారణమైన యాంటీబాడీస్‌ను తొలగించే ప్రయత్నం చేస్తారు. ఇందులో భాగంగా బాధితుడి శరీరం బరువును పరిగణనలోకి తీసుకుని... ప్రతి కిలోగ్రాముకూ 250 ఎమ్ఎల్ ప్లాస్మాను రక్తం నుంచి తొలగిస్తారు. ఇది దశలవారీగా.... అంటే దాదాపు నాలుగు నుంచి ఆరు విడతలుగా ఈ చికిత్స చేస్తారు. రోజు విడిచి రోజు చేసే ఈ చికిత్సలో తొలగించిన ప్లాస్మాను సెలైన్, ఆల్బుమిన్‌లతో భర్తీ చేస్తారు. ఇమ్యూనోగ్లోబ్యులిన్ చికిత్స చాలా ఖరీదైనది. దానితో పోలిస్తే ప్లాస్మా ఎక్స్ఛేంజ్ చికిత్స... దాదాపు సగం ఖర్చులోనే పూర్తవుతుంది. ఈ రెండూ ఇంచుమించూ సమానమైన ఫలితాలనే ఇస్తాయి. రోగి కోలుకునే అవకాశాలు : ►జీబీ సిండ్రోమ్ వచ్చిన రోగుల్లో చాలామంది పూర్తిగా కోలుకునే అవకాశాలే ఎక్కువ. అయితే 3 శాతం నుంచి 5 శాతం రోగుల్లో మాత్రం మంచి చికిత్స ఇప్పించినప్పటికీ ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇక పది శాతం మందిలో చెప్పుకోదగ్గ పురోగతి ఉండదు. ఈ గణాంకాలు మినహాయించి మిగతా అందరిలోనూ కోలుకునే అవకాశాలు ఎక్కువే ఉండటం ఓ సానుకూల అంశం. ►వయసు పైబడిన రోగులతో పోలిస్తే వయసులో ఉన్నవారు, యుక్తవయస్కులు చాలా త్వరగా కోలుకుంటారు. ►చచ్చుబడ్డ అవయవాలు పూర్తిగా పనిచేయడం ప్రారంభించి మళ్లీ నార్మల్ కావడం అన్న అంశం రోగి నుంచి రోగికి మారుతుంది. ►ఐదు శాతం మందిలో మాత్రం జీబీ సిండ్రోమ్ వచ్చినవారికే మళ్లీ వచ్చే అవకాశాలుంటాయి. -
రోగనిరోధకతను తప్పించుకునే శక్తి ఒమిక్రాన్‌కి అధికం
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తూ కల్లోలం రేకెత్తిస్తోంది. దీని ప్రభావాలను అధ్యయనం చేసేందుకు అవసరమైన గణాంకాల లభ్యత ఇప్పటివరకు అంతంతమాత్రంగా ఉంది. కానీ తాజాగా లభించిన క్లీనికల్, పరిశోధన వివరాలను పరిశీలించిన సైంటిస్టులు, మానవ శరీరంలో ఇమ్యూనిటీ(రోగనిరోధకత)ను తప్పించుకుపోయే శక్తి సామరాŠధ్య్‌లు ఒమిక్రాన్‌కు అధికంగా ఉన్నాయని వెల్లడించారు. అయితే ప్రాథమిక సమాచారం ప్రకారం దీని వల్ల కలిగే అనారోగ్య తీవ్రత గత వేరియంట్లతో పోలిస్తే తక్కువగానే ఉందని తెలిపారు. అంతర్జాతీయ డేటా ఆధారంగా ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ– ఇండియన్ సార్స్ కోవిడ్2 జీనోమిక్స్ కన్సార్షియా) ఈ అంచనాలను తన తాజా బులిటెన్‌లో ప్రకటించింది. భారత్‌లో ఒమిక్రాన్ వ్యాప్తి, తీవ్రత పర్యవేక్షణకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు నివేదిక తెలిపింది. ఇప్పటికీ ప్రపంచంలో డెల్టానే ఆధిపత్య వీఓసీ (వేరియంట్ ఆఫ్ కన్సెర్న్)అని, కానీ దక్షిణాఫ్రికాలో మాత్రం డెల్టా స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమించిందని వెల్లడించింది. యూకే తదితర ప్రాంతాల్లో ఆధిపత్య వీఓసీ దిశగా ఒమిక్రాన్ దూసుకుపోతున్నట్లు తెలిపింది. టీకా సామర్థ్యాన్ని తగ్గిస్తోంది అంతర్జాతీయంగా లభిస్తున్న సమాచారాన్ని విశ్లేషిస్తే ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్ టీకాల సామర్థ్యాన్ని తగ్గిస్తున్నట్లు తెలుస్తోందని ఇన్సకాగ్ నివేదిక తెలిపింది. కేవలం టీకాల సామరŠాధ్యన్నే కాకుండా గతంలో ఇన్ఫెక్షన్ ఒకమారు సోకడం వల్ల కలిగే రోగనిరోధకత కూడా ఒమిక్రాన్ సోకకుండా కాపాడలేకపోతోందని అభిప్రాయపడింది. డెల్టాతో పోలిస్తే అధిక మ్యుటేషన్లు పొందిన కారణంగా దీనికి ఇమ్యూనిటీ నుంచి తప్పించుకునే శక్తి పెరిగినట్లు వివరించింది. లక్షణాల్లో తీవ్రత కనిపించకున్నా, ప్రస్తుతానికి దీని వల్ల కలిగే ప్రమాదం అధికమనే భావించాలని సూచించింది. దేశవ్యాప్తంగా జీనోమ్ సీక్వెన్స్ శాంపిళ్లను, జిల్లాలవారీ గణాంకాలను ఇన్సకాగ్ ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ పరిస్థితిని విశ్లేషిస్తోంది. 900 దాటిన ఒమిక్రాన్ కేసులు భారత్‌లో ఒమిక్రాన్ కేసులు 900 దాటిపోయాయి. మహారాష్ట్రలో బుధవారం ఒక్కరోజే 85 ఒమిక్రాన్ కేసులు రాగా... ఢిల్లీ, గుజరాత్, రాజస్తాన్, తమిళనాడు కూడా ఒమిక్రాన్ కేసులు అధికంగా వచ్చాయి. పంజాబ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు వచ్చింది. దేశంలో 9,125 కొత్త కరోనా కేసులు నమోదయ్యాయి. మణిపూర్‌లో నైట్ కర్ఫ్యూ విధించారు. -
Health Tips: పిల్లలకు గుడ్డు, పెరుగు, బాదం, వాల్నట్స్ ఎక్కువగా తినిపిస్తున్నారా..
Immunity Booster Foods For Kids: పిల్లల్లో ఇమ్యూనిటీ పెరిగేలా సరైన ఆహారాన్ని అందించాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ముఖ్యంగా కోవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్న సమయంలో మరింత అప్రమత్తంగా ఉండాలి. పిల్లలకు ఎలాంటి ఆహారం అందించాలంటే... గుడ్డు కోడిగుడ్డులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పిల్లలకు రోజూ ఒక ఉడికించిన గుడ్డు తినిపించాలి. కండరాలు, చర్మం, గుండె ఆరోగ్యానికి గుడ్డు మంచిది. పిల్లల ఎదుగుదలకు అవసరమైన విటమిన్ ఎ, బి2 (రైబోఫ్లేవిన్) కోడిగుడ్డులో లభిస్తాయి. ఆకుకూరలు ఆకుకూరలు, మునగకాడలు, కొత్తిమీర, పాలకూర వంటివి ఎక్కువగా పెట్టాలి. వీటిలో ఫైబర్‌తోపాటు ఐరన్, జింక్, మినరల్స్ లభిస్తాయి. పెరుగు పెరుగులో ప్రోబయోటిక్స్, విటమిన్ బి12 లభిస్తాయి. ఇది పొట్టలో చెడు బ్యాక్టీరియా వృద్ధి చెందకుండా కాపాడుతుంది. ఇమ్యూనిటీని పెంచుతుంది. కాబట్టి పిల్లలు ఇష్టంగా తినేలా ఫ్రూట్ యోగర్ట్, వెజిటబుల్స్ రైతా, బూందీ రైతా రూపంలో ఇవ్వొచ్చు. పసుపు పసుపులో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలుంటాయి. పిల్లలకు రోజూ ఇచ్చే ఆహారంలో పసుపును చేర్చడం వల్ల ఆస్తమా, అలర్జీకి సంబంధించిన సమస్యలు దరిచేరకుండా ఉంటాయి. పాలల్లో పసుపు వేసి తాగించడం అలవాటు చేయవచ్చు. డ్రైఫ్రూట్స్ బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష, వాల్నట్స్, అప్రికాట్స్ వంటివి ఎక్కువగా తినిపించడం వల్ల మెదడు ఎదుగుదలకు అవసరమైన పోషకాలు లభించడంతో పాటు పిల్లల్లో ఇమ్యూనిటీ పెరుగుతుంది. స్వీట్స్ వద్దు పిల్లలకు స్వీట్స్, పంచదార ఎక్కువగా ఉండే ఇతర పదార్థాలైన ఫ్రూట్‌జ్యూస్‌లు, చాక్లెట్స్, ప్యాకేజ్డ్ స్నాక్స్‌ను ఎక్కువగా తినిపించకూడదు. ఇవి ఇమ్యూనిటీని తగ్గిస్తాయి. సరిపడా నిద్ర ముఖ్యంగా పిల్లలు రోజూ తగినంత నిద్రపోయేలా చూడాలి. ఉదయం ఒక గంటసేపైనా ఎండలో ఆడుకునేలా ప్రోత్సహించాలి. చదవండి: Health Tips: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు.. దగ్గు, ఆయాసంతో ఇబ్బంది పడేవాళ్లు గోంగూరను తింటే... -
కరోనా పూర్తి నిర్మూలన అసాధ్యం!
న్యూఢిల్లీ: కరోనా వ్యాప్తి సుదీర్ఘకాలం కొనసాగవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ సీనియర్ అధికారి పూనమ్ కేత్రపాల్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఒక సమూహంలో టీకాలు, గత ఇన్ఫెక్షన్ల ఆధారంగా వృద్ధి చెందే ఇమ్యూనిటీ స్థాయిలను(హెర్డ్ ఇమ్యూనిటీ లేదా సమూహ రోగనిరోధకత) బట్టి దీర్ఘకాలంలో కరోనా ఎండమిక్(ఒకప్రాంతానికి పరిమితం అయ్యేవ్యాధి)గా మారే అవకాశాలుంటాయన్నారు. వైరస్ అదుపులో మనిషి ఉండకుండా, మనిషి అదుపులో వైరస్ ఉండే పరిస్థితిన సాధించాలని సంస్థ దక్షిణాసియా డైరెక్టర్‌గా పనిచేస్తున్న సింగ్ వ్యాఖ్యానించారు. రాబోయే రోజుల్లో హెర్డ్ ఇమ్యూనిటీ సాధించిన ప్రాంతాల ప్రజలపై కరోనా ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేశారు. కోవాక్సిన్‌కు ఈయూఏ(అత్యవసర అనుమతులు) ఇవ్వడంపై మాట్లాడుతూ ప్రస్తుతం భారత్ బయోటెక్ సమర్పించిన గణాంకాల మదింపు జరుగుతోందని, త్వరలో ఈ ప్రక్రియ పూర్తికావచ్చని తెలిపారు. చదవండి: (పోస్ట్ కోవిడ్ సిండ్రోమ్: తెలిసినవారి పేర్లు కూడా మర్చిపోతున్నారా?) దేశాలన్నింటిలో కరోనా మరణాలకు అధికశాతం కారణం టీకా తీసుకోకపోవడమేనని, ఈ సమయంలో బూస్టర్డోసులిస్తే అసలు టీకా తీసుకోనివారికి సరఫరా కష్టమవుతుందని వివరించారు. అందుకే బూస్టర్ డోసులపై సంస్థ ఈ ఏడాది చివరివరకు నిషేధం విధించిందని చెప్పారు. అన్ని దేశాల్లో కనీసం 40 శాతం ప్రజానీకానికి టీకా అందేలా చూడాల్సిఉందన్నారు. అందరూ సురక్షితమయ్యేవరకు ఏ ఒక్కరూ సురక్షితం కాదని గుర్తు చేశారు. సమయాన్ని బట్టి కరోనా టీకా ప్రభావం తగ్గుతుందనేందుకు ప్రస్తుతానికి ఎలాంటి స్థిరమైన ఆధారాల్లేవని చెప్పారు. బూస్టర్ డోసులకు తాము వ్యతిరేకం కాదని, శాస్త్రీయ నిరూపణలను బట్టి బూస్టర్‌పై సిఫార్సులుంటాయని ఆమె చెప్పారు. పూర్తి నిర్మూలన అసాధ్యం కరోనాను ప్రపంచం నుంచి పూర్తిగా తరిమివేయడం సాధ్యం కాకపోవచ్చని పూనమ్ అభిప్రాయపడ్డారు. అయితే కాలక్రమేణా దాని ప్రభావాన్ని తగ్గించవచ్చని, తద్వారా మరణాలను, ఆస్పత్రిపాలవడాన్ని, ఇతర నష్టాలను కనిష్టాలకు తీసుకురావచ్చని చెప్పారు. ఇప్పటికైతే ప్రపంచవ్యాప్తంగా వైరస్ నుంచి రక్షణ బలహీనంగానే ఉందని, చాలామంది ప్రజలకు వైరస్ సోకే అవకాశాలున్నాయని హెచ్చరించారు. అందుకే టీకా తీసుకోవడం, భౌతిక దూరం పాటించడం, మాస్కు ధరించడం, గాలాడని ప్రాంతాల్లో గుమికూడడాన్ని తగ్గించడం, చేతులను శుభ్రంగా కడుక్కోవడం తదితర చర్యలు కొనసాగించాలని గట్టిగా సూచించారు. థర్డ్ వేవ్ రాకడ, దాని బలం.. మన ప్రవర్తనపై ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలంతా కలిసికట్టుగా సరైన చర్యలు పాటిస్తే మరో వేవ్ రాకుండా చూసుకోవచ్చన్నారు. అనేక దేశాల్లో టీకా లభించని ఈ తరుణంలో తిరిగి కరోనా వ్యాక్సిన్ ఎగుమతి చేయాలన్న భారత్ నిర్ణయాన్ని స్వాగతించారు. కరోనా కారణంగా దేశాలు తమ ప్రజారోగ్య వ్యవస్థను పటిష్టపరిచే అవకాశం లభించిందని ఆమె చెప్పారు. ఆరోగ్య వ్యవస్థపై ఇలాగే పెట్టుబడులు పెరగాలని అభిలషించారు. బలమైన ఆరోగ్య వ్యవస్థలుంటే ఎలాంటి మహమ్మారినైనా ఎదుర్కోగలమని ప్రపంచ దేశాలు గుర్తించాలని సింగ్ చెప్పారు. (చదవండి: Pakistan: ఫ్యూన్ పోస్ట్ కోసం ఏకంగా 15 లక్షల మంది అప్లై చేశారు) -
కరోనా కొత్త రూపాంతరాలు.. ‘బూస్టర్’ డోసు తప్పనిసరా?
రిచ్మండ్ (అమెరికా): కరోనా వైరస్ కొత్త వేరియంట్లు (రూపాంతరితాలు) పుట్టుకొస్తున్న కొద్దీ... కోవిడ్ వ్యాక్సినేషన్ తర్వాత ఏమేరకు రక్షణ ఉంటుందనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొత్త వేరియంట్లు టీకా కల్పించే రక్షణ కవచాన్ని ఛేదిస్తాయా? టీకా కారణంగా ఎంతకాలం కోవిడ్–19 నుంచి రక్షణ లభిస్తుంది? రెండు డోసులు తీసుకున్నాక కూడా మరో బూస్టర్ డోసు అవసరమా? ఇలా పలు సందేహాలు ప్రజలను వేధిస్తున్నాయి. అమెరికాలోని వర్జీనియా యూనివర్సిటీకి చెందిన మైక్రోబయాలజిస్టు, అంటువ్యాధుల నిపుణులు విలియం పెట్రి వీటికి సమాధానాలు ఇచ్చారు. సందేహాలను నివృత్తి చేసే ప్రయత్నం చేశారు. బూస్టర్ డోస్ అంటే ఏమిటి? వైరస్, బ్యాక్టీరియాలు కలిగించే వ్యాధుల నుంచి రక్షణకు మనం వ్యాక్సిన్లు తీసుకుంటాం. సదరు వైరస్‌కు వ్యతిరేకంగా మన శరీరంలో యాంటీబాడీలు వృద్ధి చెంది... దానితో పోరాడి నిర్వీర్యం చేస్తాయి లేదా వ్యాధి తీవ్రతను తగ్గిస్తాయి. అయితే వ్యాక్సిన్ల ద్వారా లభించే రోగనిరోధకత సమయం గడిచినకొద్దీ బలహీనపడం సహజమే. ఉదాహరణకు ‘ఫ్లూ’ నిరోధానికి ఏడాదికోసారి వ్యాక్సిన్ తీసుకోవాల్సి ఉంటుంది. డిప్తీరియా, ధనుర్వాతానికి ప్రతి పదేళ్లకోసారి తీసుకోవాలి. వైరస్‌కు వ్యతిరేకంగా రోగనిరోధకత స్థాయిని కొనసాగించేందుకు వీలుగా కొన్నాళ్ల తర్వాత ఇచ్చే అదనపు డోసునే ‘బూస్టర్ డోసు’ అని పిలుస్తారు. అప్పుడే అవసరమా? అమెరికాలో ఆరోగ్య సంస్థలు ఇప్పటివరకు బూస్టర్ డోసుపై అంతగా ఆసక్తిని కనబర్చడం లేదు. అయితే ఇజ్రాయెల్‌లో 60 ఏళ్లు పైబడిన వారు మూడోడోసు తీసుకోవాలని పోత్రహిస్తున్నారు. కరోనా బారినపడే ముప్పు అధికంగా ఉన్నవారికి (వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు) బూస్టర్ డోసు ఇవ్వాలనే దానిపై ఫ్రాన్స్‌లో సమాలోచనలు జరుగుతున్నాయి. రోగనిరోధక శక్తి తక్కువుంటే ‘బూస్టర్’ అవసరమా? స్టెరాయిడ్ల వాడకం వల్ల రోగనిరోధక శక్తి తగ్గినవారు, దీర్ఘకాలిక రోగులకు బూస్టర్ డోస్ అవసరం. కిడ్నీ మార్పిడి జరిగిన 40 రోగుల్లో 39 మందిలో, డయాలసిస్ చేయించుకున్న వారిలో మూడోవంతు మందిలో (పరీక్షించిన శాంపిల్‌లో) వ్యాక్సినేషన్ తర్వాత యాండీబాడీల ఆచూకీ లేదని అధ్యయనంలో తేలింది. కిడ్నీ మార్పిడి చేసుకున్న రోగుల్లో బూస్టర్ తర్వాత యాంటీబాడీలు కనిపించాయి. ఎందుకు సిఫారసు చేయడం లేదు? టీకా మూలంగా లభించే రక్షణ శాశ్వతం కానప్పటికీ... ఎంతకాలం ఉంటుందనేది ఇప్పటికైతే స్పష్టంగా తెలియదు. ప్రస్తుతం ఆమోదం పొందిన వ్యాక్సిన్లు అన్నీ మంచి రక్షణ కల్పిస్తున్నాయి. రోగకారక వైరస్ తాలూకు నిర్మాణాన్ని ‘బి లింఫోసైట్స్’ జ్ఞాపకం పెట్టుకుంటాయి. వైరస్ సోకితే... దాన్ని ఎదుర్కొనడానికి వెంటనే తగినంత స్థాయిలో యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తాయి. వ్యాక్సినేషన్ పూర్తయిన 11 నెలల తర్వాత కూడా యాంటీబాడీలు కనపడటం ... బూస్టర్ డోస్ అప్పుడే అవసరం లేదనే అభిప్రాయానికి బలం చేకూరుస్తున్నాయి. బూస్టర్ డోస్ అవసరమని మనకెలా తెలుస్తుంది? కరోనాను ఎదుర్కొనే యాంటీబాడీలు శరీరంలో ఏమేరకు ఉన్నాయో తెలుసుకునేందుకు వీలుగా వైద్యులు ఐజీజీ టెస్టులు నిర్వహిస్తున్నారు. దీని ఫలితాన్ని బట్టి బూస్టర్ డోస్ అవసరమా? కాదా? అనేది తెలుస్తుంది. అయితే టీకా తీసుకున్న వారు సైతం కరోనా బారినపడుతున్న కేసులు అధికం అవుతుండటంతో వైద్య పరిశోధకులు వ్యాక్సిన్స్ ద్వారా లభించే రోగనిరోధకత ఏస్థాయిలో ఉంటుంది? ఎంతకాలం ఉంటుంది? అనేది కచ్చితంగా తేల్చే పనిలో ఉన్నారు. -
తల్లి పాలే తొలి టీకా!
తల్లిపాలలో ఎన్నెన్నో అమూల్యమైన పోషకాలు ఉంటాయి. వాటిని అధ్యయనం చేయాలనుకుని సంకల్పిస్తే ఇంతవరకు మన పరిశీలనకు అందినవి కేవలం 400 రకాల పోషకాలే. కానీ నిజానికి అంతకంటే ఎక్కువ పోషకాలే అందులో లభ్యమవుతాయి. అందునా వాటిని కృత్రిమంగా తయారుచేద్దామన్నా సాధ్యం కానంతటి అద్భుత పోషకాలవి. తల్లిపాలకు ప్రత్యామ్నాయంగా మార్కెట్లో అనేక రకాల ఫార్మూలా ఫీడ్స్ అందుబాటులో ఉన్నా... అవేవీ తల్లిపాలకు సాటిరావు. బిడ్డ పుట్టగానే ఊరే ముర్రు పాలు! బిడ్డ పుట్టిన తర్వాత తల్లిలో ఊరే ముర్రుపాలను కొలెస్ట్రమ్ అంటారు. మొదట ఊరిన పాలు (ముర్రుపాలు) పట్టించాల్సిందేనని కొందరూ, అవి బిడ్డకు మంచిది కాదని మరికొందరూ అంటుంటారు. కానీ బిడ్డకు ముర్రుపాలు తప్పక తాగించాలి. వీటిలో చాలా శక్తిమంతమైన యాంటీబాడీస్ ఉంటాయి. అవి బిడ్డలోని రోగనిరోధకశక్తిని స్వాభావికంగా పెంచుతాయి. దాంతో ఎన్నో ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని సమకూర్చుతాయి. ముర్రుపాలు బిడ్డకు మొట్టమొదటి వ్యాధినిరోధక టీకా అని చెప్పడం అతిశయోక్తి కాదు. ముర్రుపాల తర్వాత... ముర్రుపాల తర్వాత పసిపిల్లలకు ఆర్నెల్ల వయసు వరకు తల్లిపాలే ఇవ్వాలి. ఆ తర్వాత ఇంట్లో వండిన అనువైన అదనపు ఆహారం ప్రారంభించి, రెండేళ్ల వయసు వరకు లేదా వీలైనంత ఎక్కువకాలం తల్లిపాలూ పడుతూ ఉండాలి. ఇది బిడ్డ పూర్తి సంపూర్ణ వికాసానికి తోడ్పడుతుందని డబ్ల్యూహెచ్ఓ వారి సూచన. పాలిచ్చే తల్లులకుS కొన్ని సూచనలు ►కరోనా సోకిన తల్లి సైతం తన బిడ్డకు తల్లిపాలు పట్టడం చాలా ఉత్తమం. మాస్క్ ధరించడం, తరచూ చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు పాటించాలి. ►తల్లి రకరకాల కాయధాన్యాలు (హోల్‌గ్రెయిన్స్), పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు తినాలి. తల్లి తినే ఆహారాన్ని బట్టి బిడ్డకు పట్టే పాల రుచి (ఫ్లేవర్) కూడా తరచూ మారుతూ, కొత్త రుచి వస్తుంటుంది. అప్పుడు బిడ్డ మరింతగా ఆ రుచిని ఆస్వాదిస్తుంది. ఇక్కడ పాటించాల్సిన జాగ్రత్త ఏంటంటే, పండ్లు, కూరగాయలు వంటి వాటిని బాగా కడిగాకే తినాలి. ►పాలిచ్చే తల్లి దాహం తీరేంతగా నీళ్లు తాగాలి. కానీ చాలామంది పెద్దలు తల్లిని ఎక్కువగా నీళ్లు తాగనివ్వరు. తల్లి నీళ్లు ఎక్కువగా తాగితే బిడ్డకు జలుబు చేస్తుందంటూ తక్కువ నీళ్లు తాగేలా ఆంక్షలు పెడుతుంటారు. తల్లి ఎక్కువ నీళ్లు తాగితే బిడ్డకు జలుబు చేస్తుందనడం అపోహ మాత్రమే. ►తల్లి పాలలో బిడ్డకు మేలు చేసే ఐరన్ తగినంతగా సమకూరడానికి బీన్స్, వేరుశెనగ పల్లీలు, అలసందలు, తృణధాన్యాలు, డ్రైఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. ఐరన్ ఎక్కువగా ఉండే ఆహారాన్ని విటమిన్–సితో ఇచ్చే పండ్లతో కలిపి తీసుకోవడం మంచిది. అంటే నిమ్మజాతిపండ్లు, స్ట్రాబెర్రీస్ వంటివి. ►తల్లి పాలలో ప్రొటీన్లు పుష్కలంగా ఉండటానికి గుడ్లు, పాలు, పాల ఉత్పాదనలు, బఠాణీలు, నట్స్ వంటివి తీసుకోవాలి. ►క్యాల్షియమ్ అందేలా ముదురు ఆకుపచ్చగా ఉండే ఆకుకూరలు, సోయామిల్క్, పెరుగు, టోఫూ పుష్కలంగా తీసుకోవాలి. ►విటమిన్ బి12తో పాటు విటమిన్ డి సమృద్ధిగా లభించడానికి వీలుగా పాలు, పాల ఉత్పాదనలతో పాటు మాంసాహారం తీసుకోవాలి. అవి తీసుకోని వారు డాక్టర్ సలహా మేరకు మాత్రమే విటమిన్ బి12, విటమిన్–డి సప్లిమెంట్స్ తీసుకోవాలి. ►ఒక్కమాటలో చెప్పాలంటే తల్లిపాలపై పెరిగే పిల్లలు చాలా తక్కువగా జబ్బు పడతారు. ఫలితంగా వారి రక్షణ కోసం, వారి ఆరోగ్యం కోసం తల్లిదండ్రులు ఖర్చు చేయాల్సిన డబ్బు చాలా చాలా ఆదా అవుతుంది. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని బిడ్డ ఆరోగ్యకరంగా ఎదగడానికి తల్లి పాలు పట్టడం చాలా అవసరమని ప్రతిఒక్కరూ గుర్తించాలి. తల్లిపాలలో ఉండే కొన్ని ప్రధానమైన అంశాలేలివే... ♦నీరు : పాలలో ఎక్కువ భాగం (87 – 88 శాతం) నీరు ఉంటుంది. ♦ప్రోటీన్లు : బిడ్డకు సరిపడినన్ని (0.9 – 1 %) ప్రోటీన్లు ఉంటాయి. ♦కొవ్వు పదార్థాలు : శరీరానికి అవసరమైన కొవ్వు పదార్థాలు (ఎసెన్షియల్ ఫాటీ యాసిడ్స్)తో సమృద్ధిగా ఉంటాయి. బిడ్డ ఆరోగ్యంగా ఎదగడానికి హెల్దీ కొవ్వు పదార్థాలు కావాల్సిందే. పాలు తాగే పసిపాప కూడా అరిగించుకోగల కొవ్వును అందించడం కోసమే ప్రకృతి అమ్మ పాలను తయారు చేసింది. ఇందులో డీహెచ్ఏ అనే కొవ్వుపదార్థం ఉంటుంది. డీహెచ్ఏ అంటే డొకోసా హెగ్జానోయిక్ యాసిడ్ అనే దానికి సంక్షిప్తరూపం. ఇదొక పాలీ అన్‌శాచ్యురేటెడ్ ఒమెగా–3 ఫ్యాటీ యాసిడ్. పిల్లల మెదడులో ఉండేవన్నీ కొవ్వు కణాలే. అందులోని ఒమెగా–3 ప్యాటీ ఆసిడ్స్‌లో 97 శాతం ఈ డీహెచ్‌ఏలే. అంతేకాదు... కేవలం మెదడు మాత్రమే గాక పిల్లల కంటిలోని రెటీనా కూడా ఫ్యాటీ యాసిడ్స్ అనే కొవ్వు పదార్థాలతో నిర్మితమై ఉంటుంది. ఈ రెటీనా నిర్మితమయ్యే కొవ్వులలో... 93 శాతం ఈ డీహెచ్ఏ కొవ్వులే. ఇక తల్లిపాలలో మరో రకం కొవ్వు పదార్థాలూ ఉంటాయి. అవి ఒమెగా–6 ఫ్యాటీ యాసిడ్స్‌కు చెందినవి. వీటిని ఏఆర్ఏ అంటారు. ఆరాకిడోనిక్ యాసిడ్ అనే మాటకు ఏఆర్ఏ సంక్షిప్త రూపం. మెదడులో ఉండే ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్‌లోని 48 శాతాన్ని ఈ ఏఆర్ఏ సమకూర్చుతాయి. ఈ కొవ్వు పదార్థాలన్నింటినీ అమ్మ నుంచి బిడ్డకు అందేలా ఏర్పాటు చేసింది ప్రకృతి. సాధారణంగా పిండం ఎదుగుదలకు అవసరమైన కొవ్వు పదార్థాలన్నీ ప్లాసెంటా నుంచి అందుతుంటాయి. పిండం ఎదుగుతున్నప్పుడు మొదటి మూడు నెలలూ ఈ కొవ్వు పదార్థాలు మరింత ఎక్కువగా అందాలి. అందుకే హెచ్‌డీఏ పోషకాలు బిడ్డకు అందేలా తల్లి తగినంత కొవ్వు పదార్థాలను రిజర్వ్‌లో ఉంచుకోవాలి. అప్పుడే బిడ్డ మెదడులో మంచి ఎదుగుదల కనిపిస్తుంది. తల్లిపాలతో బిడ్డకు కలిగే ప్రయోజనాలు తల్లి పాలతో అటు బిడ్డకూ ఇటు తల్లికీ ఇలా ఎన్నో రకాలుగా మేలు చేకూరుతుంది. బిడ్డకు ఎన్నో అంటువ్యాధులు రాకుండానూ, అలాగే డయాబెటిస్, అధిక రక్తపోటు వంటి అనేక దీర్ఘకాలిక జబ్బుల నుంచి కూడా రక్షణ కలుగుతుంది. అవి... ►తల్లిపాలు స్వాభావికంగా ఉండటం వల్ల అవి జీర్ణకోశానికి ఇబ్బంది కలిగించకుండా జీర్ణమవుతాయి. ►పోతపాలపై పెరిగే పిల్లల్లో ఆస్తమా వంటి జబ్బులు, ఎగ్జిమా వంటి రుగ్మతలు ఎక్కువగా కనిపిస్తాయి. కానీ తల్లిపాలపై పెరిగే బిడ్డలకు శ్వాసకోశ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే బిడ్డకు చెవి ఇన్ఫెక్షన్లు వచ్చే అవకాశాలు తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో ఊబకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. తద్వారా పెద్దయ్యాక డయాబెటిస్, అధిక రక్తపోటు, తదితర దీర్ఘకాలిక జబ్బులు రావడం చాలా తక్కువ. ►తల్లిపాలపై పెరిగే పిల్లల్లో వారిలో కనిపించే (చైల్డ్‌హుడ్) క్యాన్సర్లు వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ►నవజాత శిశువులలో నెక్రొటైజింగ్ ఎంటెరోకొలైటిస్ వంటి వ్యాధులు వచ్చే అవకాశాలూ తక్కువే. ఏయే మోతాదుల్లో తల్లిపాలు పిల్లలు తల్లిపాలు తీసుకునే పరిమాణాలు వేర్వేరుగా ఉంటాయి. వారి వయసు (రోజులు, వారాలు, నెలలు)ను బట్టి ఆ తేడాలుంటాయి. ఉదాహరణకు బిడ్డ పుట్టిన మొదటి రోజు నుంచి ఏడవ రోజు వరకు ఆ చిన్నారి కడుపు ఒక చెర్రీ పండంత ఉంటుంది. అప్పుడా చిన్నారికి ప్రతి రెండు గంటలకోమారు 30 మి.లీ. పాలు అవసరమవుతాయి. ఇలా 24 గంటల వ్యవధిలో 12 సార్లు పాలు పట్టడం అవసరం. అలాగే వారం రోజుల వయసు గడిచిన బేబీ కడుపు చిన్న ‘ఏప్రికాట్’ పండంత సైజు ఉంటుంది. తనకు ప్రతి రెండు గంటలకు ఓసారి 45 నుంచి 60 మి.లీ. తల్లిపాలు అవసరం. అలాగే ఒక నెల వయసు ఉన్న పాప కడుపు పరిమాణం పెద్ద కోడిగుడ్డంత ఉంటుంది. ఆ వయసు పిల్లలకు ప్రతి రెండు గంటలకు ఓసారి 60 మి.లీ నుంచి 150 మి.లీ వరకు అవసరం. ఇక ఇలా పాలు తాగుతున్న చంటిపిల్లలు రోజులో ఆరు నుంచి ఎనిమిది సార్లు మూత్ర విసర్జన చేస్తూ... అలాగే నిర్దేశించిన విధంగా బరువు పెరుగుతూ ఉంటే... ఆ పిల్లలకు తల్లిపాలు సరిపోతున్నాయని అర్థం. కొన్ని గణాంకాలు నవజాత శిశువులు మొదలుకొని పాలు తాగే చిన్నారులు ఆరోగ్యంగా ఎదగడానికి, శారీరక, మానసిక వికాసాలకు తల్లిపాలు అవసరంపై అవగాహన ఉన్నప్పటికీ... గణాంకాలు పెద్దగా ప్రోత్సాహకరంగా లేవు. ఐదో జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే–2019–20 (ఎన్ఎఫ్హెచ్ఎస్–5) ప్రకారం... దాదాపు 88% తల్లులు ఆసుపత్రుల్లో బిడ్డకు జన్మనిస్తున్నారు. అందులో కేవలం 51% మంది పిల్లలకు మాత్రమే పుట్టిన గంటలో తల్లిపాలు పట్టడం ప్రారంభిస్తున్నారు. 61.9% మంది తల్లులు మొదటి ఆరునెలలు కేవలం తల్లిపాలే పడుతున్నారు. కేవలం 56% మంది పిల్లలు మాత్రమే 6–8 నెలల్లో ఆ వయసుకు తగినట్లుగా అదనపు ఆహారం పొందగలుగుతున్నారు. ఫలితంగా మన దేశంలో 26.9% మంది పిల్లలు ఉండాల్సిన దానికంటే తక్కువ బరువుంటున్నారు. 31.9% మంది పిల్లలు తమ వయసుకు ఉండాల్సిన ఎత్తు పెరగడం లేదు. 18.1% పిల్లలు బలహీనంగా ఉంటున్నారు. 5.5% పిల్లులు ఊబకాయంతో ఉన్నారు. దేశంలోని దాదాపు సగం మంది పిల్లలకు అత్యంత శ్రేష్ఠమైన, ఎన్నెన్నో పోషకాలతో కూడిన, మంచి వ్యాధినిరోధక శక్తిని ఇచ్చే ముర్రుపాలు అందడం లేదు. ఇంకా చెప్పాలంటే గత ఎన్ఎఫ్హెచ్ఎస్–4తో (2015–16) పోల్చినప్పుడు తాజా ఎన్ఎఫ్హెచ్ఎస్–5లో పుట్టిన మొదటి గంటలోనే తల్లిపాలు పట్టే శాతం 2.5% తక్కువగా ఉంది. దీన్నిబట్టి పుట్టగానే తల్లిపాలు పట్టించే సంస్కృతిని పెంపొందించుకోవడం అవసరమనీ, అపోహలేమీ లేకుండా ముర్రుపాలను ఇవ్వాల్సిన అవసరం చాలా ఉందనీ... ఈ మేరకు దేశంలోని దాదాపు సగంమంది తల్లులకు అవగాహన పెరగాల్సిన అవసరం ఉందని తేలుతోంది.డబ్ల్యూహెచ్ఓ 1981లో తీసుకొచ్చిన తల్లిపాల ప్రత్యామ్నాయాల నియంత్రణ చట్టాన్ని అనుసరించి... భారత ప్రభుత్వం 1992లో తల్లిపాల ప్రత్యామ్నాయాలు పాలసీసాలు, శిశు ఆహారాల ఉత్పత్తి, సరఫరా, పంపిణీ నియంత్రణ చట్టం తీసుకొచ్చింది. కొన్ని చట్ట సవరణలతో ఇది మళ్లీ 2003లో సమగ్ర చట్టంగా రూపొంది, అమల్లో ఉంది. దీని ప్రకారం పరిశ్రమల ఉత్పత్తుల వాణిజ్యప్రకటనలు, ప్రోత్సాహకాలను నియంత్రించి... పేరెంట్స్ వాటివైపు ఆకర్షితులు కాకుండా చూడాలి. ఈ చట్ట నిబంధనలూ, వాటి ఉల్లంఘనల పర్యవసానాలపై అవగాహన కల్పించడమే ఈ ఏడాది తల్లిపాల వారోత్సవాల ప్రధానోద్దేశం. -
పెరుగుతో ఇమ్యూనిటీ ఎందుకు పెరుగుతుందంటే?
పెరుగులో ఉండే పోషకాల కారణంగా మన వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది. రోజుకు రెండువందల గ్రాముల పెరుగు తినేవారిలో రోజూ యాంటీబయాటిక్స్ వేసుకున్నంతటి ఫలితం ఉంటుందనీ, పైగా ఇది స్వాభావికంగా కలిగే రోగనిరోధక శక్తి కాబట్టి ఎలాంటి సైడ్ఎఫెక్ట్స్ ఉండవంటూ ఆస్ట్రియాలోని యూనివర్సిటీ ఆఫ్ వియన్నాలో శాస్త్రవేత్తల బృందం నిర్వహించిన ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాదు... పెరుగులో పొటాషియమ్, మెగ్నీషియమ్ ఎక్కువగా ఉండటం వల్ల అది అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుందట. మిగతావారితో పోలిస్తే కొవ్వు అంతగా లేని పెరుగు తినేవారిలో హైబీపీ వచ్చే అవకాశాలు 31% తక్కువగా ఉంటాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్ఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రీసెర్చ్ సైంటిఫిక్ సెషన్స్‌లో పాల్గొన్న కొందరు శాస్త్రవేత్తలు వివరించారు. ఇక మహిళలకు పెరుగు వల్ల కలిగే ప్రయోజనాలు ఇన్నీ అని చెప్పలేం. పెరుగులోని ల్యాక్టోబాసిల్లస్ అసిడోఫిల్లస్ బ్యాక్టీరియా అనే మంచి బ్యాక్టీరియా వల్ల మహిళల్లో అనేక ఇన్ఫెక్షన్లు నివారితమవుతాయి. ముఖ్యంగా మహిళల యోనిలో పెరిగే హానికరమైన బ్యాక్టీరియాను తుదముట్టించి, ఎన్నో రకాల ఇన్ఫెక్షన్ల నుంచి మహిళల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. పెరుగులోని మంచి బ్యాక్టీరియా జీర్ణవ్యవస్థను చురుగ్గా పనిచేసేలా చూడటం మాత్రమే కాదు... కడుపులో మంటనూ తగ్గిస్తుంది. అందువల్ల తాజా పెరుగుతో చిలికిన మజ్జిగ తాగగానే కడుపు మంట తగ్గడం మనలో చాలామందికి అనుభవంలోకి వచ్చే విషయమే. -
కోవిషీల్డ్ టీకా.. వ్యవధి పెరిగితే మేలే!
లండన్: ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంయుక్తంగా అభివృద్ది చేసిన కోవిడ్ 19 టీకా (భారత్‌లో కొవిషీల్డ్) రెండో డోసు వేసుకోవడానికి ఎక్కువ వ్యవధి తీసుకోవడం మంచిదని తాజా అధ్యయనంలో తేలింది. ఆక్స్ఫర్డ్ వర్సిటీ చేసిన ఈ అధ్యయనంలో రెండో డోసు తీసుకోవడాన్ని వాయిదా వేయడం వల్ల, అలాగే, ఆ తరువాత మూడో డోసును కూడా ఆలస్యంగా తీసుకోవడం వల్ల కరోనా నిరోధక శక్తి బాగా పెరుగుతోందని తేలింది. మొదటి, రెండో డోసుల మధ్య 45 వారాల వ్యవధి ఉంటే ఇమ్యూనిటీ పెరుగుతుందని ఆ అధ్యయనంలో పేర్కొన్నారు. 45 వారాల వ్యవధి వల్ల కరోనా ఇమ్యూనిటీ తగ్గుతుందన్న వాదనను ఇది తోసిపుచ్చింది. రెండో డోసు తీసుకున్న ఆరు నెలల తరువాత మూడో డోసు తీసుకుంటే శరీరంలో యాంటీబాడీల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని పేర్కొంది. అయితే, ఈ అధ్యయనాన్ని మరింత లోతుగా పరీక్షించాల్సి ఉంది. ‘తగినన్ని టీకాలు అందుబాటులో లేని దేశాలకు ఇది శుభవార్త. రెండో డోసు ఆలస్యం కావడం వల్ల నష్టం కన్నా లాభమే ఎక్కువ’అని ఆ స్టడీలో పాల్గొన్న ఆండ్య్రూ పోలర్డ్ వ్యాఖ్యానించారు. మొదటి డోసు వేసుకున్న 10 నెలల తరువాత రెండో డోసు వేసుకున్న వారికి అద్భుతంగా ఇమ్యూనిటీ పెరిగిందన్నారు. మూడో డోసును ఆలస్యంగా వేయడం వల్ల కూడా సానుకూల ఫలితాలు వెలువడ్డాయన్నారు. కాగా, ఈ వ్యాక్సిన్‌తో అతికొద్ది మందిలో రక్తం గడ్డకట్టే సమస్య ఏర్పడుతున్నట్లు గుర్తించారు. దీంతో కొన్ని దేశాలు ఈ టీకాను నిషేధించగా, కొన్ని దేశాలు యువతకు ఈ టీకా ఇవ్వరాదని నిర్ణయించాయి. -
పసి ముఖానికి ముసుగు తొడగాలా?.. వద్దా? తెలుసుకోండి
విరిసీ విరియని పువ్వుల్లారా.. ఐదారేడుల పిల్లల్లారా... అన్నాడు మహాకవి. పువ్వులు సహజసిద్ధంగా వికసించినట్లే పిల్లల్లో ఇమ్యూనిటీ సహజసిద్ధంగా పెరగాలంటున్నారు నిపుణులు. ఇందుకోసం కరోనా కట్టడిలో భాగంగా చిన్నారులకు మాస్కులు తొడగాల్సిన పనిలేదంటున్నాయి నూతన అధ్యయనాలు. మాస్కు లేకపోయినా పిల్లలు కరోనా వ్యాప్తి కారకాలు కారంటున్నాయి. ఆ కథేంటో చూద్దాం.. కరోనా కట్టడిలో మాస్కులు, సామాజిక దూరం పాటించడం కీలక పాత్ర పోషిస్తూ వచ్చాయి. కానీ తాజా అధ్యయనాలు ఈ రెండు అంశాలు పిల్లల రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే అవకాశాలున్నాయని హెచ్చరిస్తున్నాయి. ఇంగ్లండ్‌కు చెందిన నిపుణుల ప్రకారం కరోనా కట్టడిలో భాగంగా లాక్డౌన్, మాస్కులు ధరించడం తదితర కారణాలతో ప్రతిఏటా పిల్లలకు సోకే పలు సాధారణ వైరల్ వ్యాధులు దూరంగా ఉన్నాయి. ఉదాహరణకు చాలామంది పిల్లల్లో ప్రతిఏటా ఒక సీజన్లో ఫ్లూ రావడం సాధారణం. కానీ మాస్క్ తదితర ఆంక్షల కారణంగా ఎక్కువమంది పిల్లల్లో గతేడాదిన్నరగా సీజనల్ జలుబు రాలేదు. దీనివల్ల శరీరంలో సాధారణంగా జరిగే ఇమ్యూనిటీ బిల్డింగ్ దూరమైందని నిపుణులు భావిస్తున్నారు. జలుబులాంటివి చేసినప్పుడు పిల్లల శరీరంలోని రక్షణ వ్యవస్థ సదరు వైరస్‌ను మెమరైజ్ చేసుకొని భవిష్యత్‌లో అడ్డుకుంటుంది. కానీ అసలు జలుబే సోకకపోవడంతో చిన్నారుల్లో కరోనా అనంతర దినాల్లో కావాల్సినంత ఇమ్యూనిటీ ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. ఏడాదిలోపు చిన్నారులకు సోకే ఆర్ఎస్వీ(రెస్పిరేటరీ సిన్షియల్ వైరస్)పై వైరాలజిస్టులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటివరకు ఈ వైరస్‌కు టీకా లేదు. కరోనా ముందు రోజుల్లో పలువురు చిన్నారులు వైరస్ కారణంగా ఆస్పత్రిలో చేరడం అనంతరం క్రమంగా ఈ వైరస్‌కు వ్యతిరేకంగా ఇమ్యూనిటీ పెంచుకోవడం జరిగేది. కానీ కరోనా కట్టడికి అవలంబించిన విధానాలతో ఈ వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట పడింది. అసలైన సమస్య కరోనా అనంతర దినాల్లో కనిపించవచ్చని, అప్పటికి ఈ ఆర్ఎస్వీ డేంజర్‌గా మారవచ్చని నిపుణులు ఆందోళన పడుతున్నారు. కరోనా పూర్తిగా కట్టడయ్యాక మాస్కుల్లాంటి విధానాలకు ప్రజలు స్వస్తి పలుకుతారని, ఆ సమయానికి పిల్లలు పలు వైరస్‌లకు ఇమ్యూనిటీ పెంచుకోకపోవడంతో వీటి విజృంభణ అధికంగా ఉండొచ్చని హెచ్చరిస్తున్నారు. రెండేళ్లపాటు పిల్లలు అతి రక్షణ వలయాల్లో ఉండి హఠాత్తుగా మామూలు వాతావరణంలోకి వస్తే వారిలో మెమరైజ్డ్ ఇమ్యూనిటీ లోపం వల్ల చిన్నపాటి జలుబు కూడా తీవ్ర ఇబ్బంది కల్గించే చాన్సుంది. అందుకే సడలించారా? పిల్లల్లో మాస్కుల వాడకం వల్ల జరిగే మేలు కన్నా జరగబోయే కీడు ఎక్కువని భావించే కేంద్ర ఆరోగ్య శాఖ ఇటీవల కీలక నిర్ణయం ప్రకటించిందని నిపుణులు భావిస్తున్నారు. ఐదేళ్లలోపు పిల్లలకు కరోనా నివారణార్థ్ధం మాస్కు వాడకం అవసరం లేదని ఇటీవలే డీజీహెచ్ఎస్ సూచించింది. అదేవిధంగా 6–11 ఏళ్లలోపు పిల్లలు మాస్కు ధరించవచ్చు కానీ డాక్టర్ కన్సల్టేషన్ అనంతరమే తల్లిదండ్రులు నిర్ణయం తీసుకోవాలని ప్రకటించింది. అదేవిధంగా పిల్లల్లో కరోనా వస్తే రెమ్‌డెసివిర్ వాడవద్దని, సిటీస్కాన్‌ను కూడా పరిమితంగా వాడాలని తెలిపింది. చిన్నారుల్లో కరోనా ముప్పు చాలా తక్కువని, అందువల్ల వీరికి మాస్కు వాడకం అలవాటు చేయకపోవడం తప్పేమీ కాదని పలువురు వైద్యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారుల్లో మాస్కు వాడకం కారణంగా వారు సహజసిద్ధంగా పెంచుకోవాల్సిన ఇమ్యూనిటీ పెరగకుండా పోతుందని నిపుణులు భావిస్తున్నారు. స్కూలుకు పోవచ్చా? చిన్నపిల్లలు స్కూలుకు పోవడం ద్వారా కరోనా ముప్పు అధికం కావచ్చని, వీరివల్ల కరోనా వ్యాప్తి పెరుగుతుందని చెప్పేందుకు సరైన ఆధారాల్లేవని అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్ అధ్యయనం చెబుతోంది. అయితే టీనేజీ పిల్లలు మాత్రం తప్పక రక్షణ నియమాలు పాటించాలని తెలిపింది. అలాగే ఇజ్రాయెల్‌లో జరిపిన రిసెర్చ్ ప్రకారం 9ఏళ్లలోపు పిల్లల వల్ల స్కూళ్లలో కరోనా వ్యాప్తి జరుగుతుందనేందుకు ఆధారాలు లేవు. అయితే 10–19 సంవత్సరాల పిల్లల్లో మాత్రం రిస్కు పెరుగుతూ వస్తుంది. అలాగే బడులు తెరవడమనేది కరోనా వ్యాప్తి రేటుపై చూపిన ప్రభావం కూడా తక్కువేనని తేలింది. మూడు అడుగుల దూరం! టీనేజీలోకి రాని పిల్లల్లో మాస్కు వాడకం వల్ల ప్రయోజనం కన్నా భవిష్యత్‌లో ఇబ్బందులకే ఎక్కువ చాన్సులున్నాయన్నది నిపుణుల ఉమ్మడి మాట. చిన్నారుల్లో మాస్కు వాడకం కన్నా ఇతరులతో 3 అడుగుల సామాజిక దూరం పాటించేలా చూస్తే చాలంటున్నారు. అలాగే పిల్లలకు టీకాలు అందుబాటులోకి వచ్చాక వాటిని అందివ్వడం మంచిదంటున్నారు. చిన్నపిల్లలు బడికి ఎక్కువకాలం దూరం కావడం వారి మానసిక వికాసంపై ప్రభావం చూపవచ్చని అందువల్ల టీచర్లు, ఇతర స్టాఫ్ తగు జాగ్రత్తలు తీసుకుంటూ పిల్లలను స్కూలుకు హాజరయ్యేలా చూడడం మంచిదని సూచిస్తున్నారు. అయితే కొందరు నిపుణులు మాత్రం రెండేళ్ల పైబడిన పిల్లలకు మాస్కు వాడడమే మంచిదని, భవిష్యత్‌లో ఇమ్యూనిటీ గురించి ఆందోళన పడడం కన్నా ప్రస్తుతం కరోనా బారినుంచి తప్పించుకోవడం కీలకమని వాదిస్తున్నారు. కానీ ఎక్కువమంది మాత్రం పిల్లల్లో మాస్కు వాడకం వారి ఇమ్యూనిటీపై ప్రభావం చూపే అవకాశాలున్నందున వీలయినంత వరకు వాడకపోవడమే మంచిదని సలహా ఇస్తున్నారు. –సాక్షి, నేషనల్ డెస్క్