లండన్ : ఉల్లిగడ్డలు, అరటి, వెల్లుల్లి వంటి ప్రిబయాటిక్స్‌తో క్యాన్సర్ పెరుగుదలను నిరోధించవచ్చని తాజా అథ్యయనం వెల్లడించింది. ఎలుకలపై చేసిన ప్రయోగంలో ప్రిబయాటిక్స్ వ్యాధి నిరోధక వ్యవస్థను బలోపేతం చేసినట్టు పరిశోధకులు గుర్తించారు. క్యాన్సర్ శరీరంలోని మరిన్ని కణాలకు విస్తరించిన క్రమంలో వ్యాధి పురోగతిని ఇవి నియంత్రించినట్టు కనుగొన్నారు. మానవులపై ఈ ప్రయోగం విజయవంతమైతే ప్రిబయాటిక్స్ అత్యున్నత క్యాన్సర్ చికిత్సలో కీలక పాత్ర పోషిస్తాయని చెప్పారు.
కణితి నిరోధక ఇమ్యూనిటీని పెంచడం ద్వారా ప్రిబయాటిక్స్ క్యాన్సర్ వృద్ధిని అడ్డుకుంటాయని తొలిసారిగా తమ అథ్యయనంలో తేలిందని సెల్ రిపోర్ట్స్‌లో ప్రచురితమైన అథ్యయన రచయిత డాకట్ర్ జీవ్ రొనాయ్ పేర్కొన్నారు. ఇవి శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని ప్రేరేపించి క్యాన్సర్‌పై దాడి చేసే సామర్ధ్యాన్ని పెంపొందిస్తాయని చెప్పుకొచ్చారు. ఇక ప్రీబయాటిక్స్ జీర్ణవ్యవస్థలో మంచి బ్యాక్టీరీయాకు దోహదకారిగా ఉంటాయని ఎముకలు బలం పుంజుకునేందుకు అవసరమైన కాల్షియమ్‌ను శరీరం సంగ్రహించేందుకు అనుకూలంగానూ పనిచేస్తాయని వెల్లడైంది. ఒత్తిడికి గురయ్యే వారి అలసటను నిరోధించి మంచి నిద్రను ఆస్వాదించేందుకూ ఇవి ఉపకరిస్తాయని మరో అథ్యయనంలో పరిశోధకులు గుర్తించారు.
Comments
Please login to add a commentAdd a comment