‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ ఆలోచన సరికాదు | Herd immunity as COVID-19 strategy risky | Sakshi
Sakshi News home page

‘హెర్డ్‌ ఇమ్యూనిటీ’ ఆలోచన సరికాదు

Published Mon, Jun 1 2020 6:26 AM | Last Updated on Mon, Jun 1 2020 6:26 AM

Herd immunity as COVID-19 strategy risky - Sakshi

న్యూఢిల్లీ: కరోనాపై పోరాటంలో ఏ దేశమైనా ‘సామూహిక రోగ నిరోధకత (హెర్డ్‌ ఇమ్యూనిటీ)’పై ఆధారపడడం ప్రమాదకరమని కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రీసెర్చ్‌(సీఎస్‌ఐఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ శేఖర్‌ మందే అభిప్రాయపడ్డారు. ‘జనాభాలో దాదాపు70% మంది ఆ వ్యాధిన పడి కోలుకుంటే ఇది సాధ్యమవుతుంది. అలాంటి పరిస్థితి ఏ దేశానికైనా ప్రమాదమని నా ఉద్దేశం. వైరస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవడమే సరైంది’ అన్నారు. ‘కోవిడ్‌దశలు, దశలుగా వ్యాప్తి చెందే అవకాశముంది. ప్రజలు అందుకు సిద్ధంకావాలి’ అన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement