
న్యూఢిల్లీ: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అన్ని దేశాలు టీకాను కనిపెట్టడానికి తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే టీకా కనిపెట్టడానికి ఇంకా సంవత్సర కాలం పడుతుందని ఆరోగ్య నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ క్రమంలో ‘హెర్డ్ ఇమ్యూనిటీ’ అనే పదానికి ప్రాధాన్యత ఏర్పడింది. ఈ క్రమంలో కరోనా వైరస్ నియంత్రణకు హర్డ్ ఇమ్యునిటీ ఉపయోగపడుతుందని దేశాలు భావించడం పెద్ద రిస్క్ అని కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సీఎస్‌ఐఆర్) డైరెక్టర్ శేఖర్ మండే తెలిపారు. కరోనా నియంత్రణకు ఐదు సూత్రాల ఫార్ములాను సీఎస్ఐర్ ప్రతిపాధించిన విషయాన్ని గుర్తు చేశారు. దేశ జనాభాలో 60 నుంచి 70 శాతం ప్రజలు వ్యాధితో బాధపడుతన్నప్పుడే హర్డ్ ఇమ్యునిటీ పని చేసే అవకాశం ఉందని మండే తెలిపారు.
ఏదయినా అంటువ్యాధితో అధిక జనాభా బాధపడుతున్నప్పుడు కొంత కాలం తరువాత వారి శరీరంలో వ్యాధిని ఎదుర్కొవడానికి రోగనిరోధకశక్తి లభిస్తుంది. ఇటీవల కరోనాకు టీకా అవసరం లేదని.. ప్రజలకు సహజంగా లభించే రోగనిరోధకశక్తి ద్వారా వైరస్ అంతమవుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment