సాక్షి, హైదరాబాద్: కరోనా వైరస్ గాలిలో ఉండగలదని, గాలి ద్వారా వ్యాపించగలదనడానికి సరైన ఆధారాలను సీఎస్‌ఐఆర్–సీసీఎంబీ హైదరాబాద్, సీఎస్‌ఐఆర్–ఇమ్‌టెక్ చండీగఢ్ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందుకోసం కోవిడ్–19 చికిత్స అందించిన ఆస్పత్రులు, కోవిడ్–19 రోగులను ఉంచిన గదులు, హోం ఐసోలేషన్ పాటించిన కోవిడ్–19 రోగులున్న గదుల నుంచి గాలి నమూనాలను సేకరించి పరిశోధన చేశారు. ఈ క్రమంలో గాలిలో వైరస్ ఉన్నట్లు జీనోమ్ సీక్వెన్సింగ్ ద్వారా కనుగొన్నారు.
కరోనా రోగులున్న పరిధిలో వైరస్ గాలిలోకి వ్యాపిస్తోందని, ఇతరులు ఆ పరిధిలోకి వెళ్తే వైరస్ బారిన పడతారని అంచనాకు వచ్చారు. గదిలో ఇద్దరి కన్నా ఎక్కువ మంది రోగులున్న చోట కోవిడ్–19 పాజిటివిటీ రేటు 75 శాతం ఉందని.. ఒకరు ఉన్నా లేదా రోగులు వెళ్లిపోయిన తర్వాత ఖాళీ చేసిన గదిలో పాజిటీవిటీ రేటు 15.8 శాతంగా ఉందని కనుగొన్నారు.
బయటి గాలిలో కన్నా గదిలోని గాలిలో వైరస్ ఎక్కువ యాక్టివ్‌గా ఉందని పరిశోధనలో పాల్గొన్న శాస్తవేత్త డాక్టర్ శివరంజని మొహరీర్ స్పష్టం చేశారు. వీలైనంత వరకు ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించాలని సీసీఎంబీ ప్రొఫెసర్, సీనియర్ సైంటిస్ట్, టాటా ఇన్‌స్టిట్యూట్ ఫర్ జెనిటిక్స్ అండ్ సొసైటీ డైరెక్టర్ డాక్టర్ రాకేశ్ మిశ్రా సూచిస్తున్నారు.
చదవండి: టీకా వేసుకోవాలని... బలవంతపెట్టలేం: సుప్రీం
Comments
Please login to add a commentAdd a comment