![Covid 19: Health Tips To Boost Immunity Eat These Foods Amazing Results - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/29/Covid-19-Health-Tips.jpg5_.jpg.webp?itok=zPWcyZ7h)
కోవిడ్ బారిన పడ్డవారు, ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆహార చిట్కాలు...
►నాలుగైదు బాదం పప్పులు, పది కిస్‌మిస్‌లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్‌మిస్‌లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. బాదం పప్పు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి.
►రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది.
►బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ,ఇ, డి, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేగాక, ఎముకలు గట్టిపడతాయి.
►రాత్రి పూట తీసుకునే ఆహారంలో కిచిడి ఉండాలి. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని సమస్థితితో ఉంచడమేగాక జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి.
చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల..
Comments
Please login to add a commentAdd a comment