ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం..
హెల్త్ టిప్స్
- తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది.
- సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ని శరీరం బాగా గ్రహిస్తుంది.
- విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment