Vitamin C
-
నారింజ పండులా ఉంటుంది.. కానీ తొక్కతో పాటు తినేయొచ్చు
కుమ్ఖాత్ సిట్రస్ జాతి పండు. నారింజలాగే ఉంటుంది. కానీ, గుండ్రంగా కాకుండా కోడి గుడ్డు మాదిరిగా ఓవెల్ ఆకారంలో చిన్నగా (1–2 అంగుళాలు) ఉంటుంది. చైనా దీని పుట్టిల్లు. 500 ఏళ్ల క్రితం దీన్ని ఫార్చునెల్లా అని పిలిచేవారట. చైనీస్ భాషలో గామ్ (అంటే బంగారం), గ్వాత్ (టాంగెరిన్స్కు మరో పేరు) మాటల కలయిక వల్ల కుమ్ఖాత్ అనే పేరు ఈ పంటకు, పండుకు స్థిరపడింది. 400 ఏళ్ల క్రితమే ఈ పంట యూరప్‌కి, అమెరికాకు చేరింది. ఇది అతి చలిని, అతి వేడిని కూడా తట్టుకొని బతకగల విలక్షణ నారింజ జాతి పంట. దీన్ని తొక్క తీపిగా ఉంటుంది. దాంతో పాటుగా తినేయొచ్చు. కుమ్ఖాత్ పండ్లు వగర, పులుపు, కొద్దిగా తీపి కలగలిసిన రుచి కలిగి ఉంటుంది. కట్ చెయ్యాల్సిన అవసరం లేకుండా నోట్లో పెట్టుకొని తినెయ్యగలిగే ఈ పండ్లలో విటమిన్ సి, పీచు పదార్థం పుష్కలంగా ఉన్నాయి. ఐరన్, బి కాంప్లెక్స్ విటమిన్లు, మాంగనీసు, రాగి, కాల్షియం తదితర పోషకాలు కూడా ఉన్నాయి. కుమ్ఖాత్ పండులోని విత్తనాలు కూడా తినదగినవే. ఆరోగ్యదాయకమైన ఒమెగా –3 ఫ్యాటీ ఆసిడ్స్ వున్నాయి. నీటి శాతం కూడా ఎక్కువే. కుమ్ఖాత్ పండ్ల జాతిలో అనేక రకాలున్నాయి. జనాదరణ పొందిన రకాలు.. నగమి, మరుమి, మీవ. మురుమి, మీవ కుమ్ఖాత్ రకాల పండ్లు గుండ్రంగా ఉంటాయి. ఓవెల్ షేప్‌లో కొంచెం పుల్లగా ఉండే నగమి పండ్ల కన్నా తియ్యగా ఉంటాయి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్నారింజ జాతి పండ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. మధుమేహం ఉన్న వారిలో ఈ పండ్లు బ్లడ్ గ్లూకోజ్‌ను పెంచవు. అతి తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్‌తో పాటు పుష్కలంగా యాంటీఆక్సిడెంట్లు ఉన్నందున కుమ్ఖాత్ పండ్లు షుగర్ వ్యాధిగ్రస్తులకు మేలు చేస్తాయి.అధిక పీచుకుమ్ఖాత్ పండ్లలో పీచుతో కూడిన సంక్లిష్ట పిండిపదార్థాలుంటాయి. కాబట్టి, జీర్ణకోశంలో ఎక్కువ సేపు అరిగిపోకుండా ఉంటాయి. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉంటుంది. అందువల్ల బరువు పెరగకుండా ఉండేందుకు తోడ్పడుతుంది. దీనిలోని జీర్ణమయ్యే పీచుకు విరేచనాలను అరికట్టే గుణం ఉంది. ఇది జీర్ణకోశంలోని అదనపు నీటిని పీల్చుకొని, జెల్ మాదిరిగా ఏర్పడుతుంది. అందువల్ల, ఎక్కువ సార్లు విరేచనాలు అవుతూ ఉంటే గుప్పెడు కుమ్ఖాత్ పండ్లు నోట్లో వేసుకుంటే సరి.ఆరోగ్యదాయకమైన కొవ్వులుకుమ్ఖాత్ పండ్లలో కొవ్వు చాలా తక్కువ. కాబట్టి, అధిక కొలెస్ట్రాల్‌తో బాధపడేవారు వారి దినసరి ఆహారంలో కుమ్ఖాత్ పండ్లను చేర్చుకుంటే మంచిది. ఈ పండ్లలోని విత్తనాలను కూడా నమిలి తినాలి. ఈ విత్తనాల్లో ఒమెగా ఫాటీ ఆసిడ్లు ఉంటాయి కాబట్టి దేహంలో బాడ్ కొలెస్ట్రాల్ తగ్గి, గుడ్ కొలెస్ట్రాల్ పెరుగుతుంది.యాంటీఆక్సిడెంట్‌గా ఉపయోగంకుమ్ఖాత్ పండ్లలో విటమిన్ ఎ, సి వంటి యాంటీఆక్సిడెంట్ విటమిన్లు ఉన్నాయి. ఫ్రీ రాడికల్స్ దేహంలో ఎక్కువైతే కణ నిర్మాణం దెబ్బతింటుంది. మన దేహంలో ఫ్రీ రాడికల్స్ కలిగించే ఆక్సిడేటివ్ స్ట్రెస్‌ను కుమ్ఖాత్ పండ్లలోని యాంటీఆక్సిడెంట్లు తగ్గిస్తాయి.గుండె ఆరోగ్యానికి మేలుకుమ్ఖాత్ పండ్లలోని విటమిన్ సి, పీచు, యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ ఎ వంటి పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పేరుకు పోయి గుండెపోటు రాకుండా చూస్తాయి. గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలా అధిక రక్తపోటును అదుపులో ఉంచుతాయి. మొత్తంగా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. ఎల్‌డిఎల్‌ను తగ్గించటం ద్వారా గుండె సమస్యల్ని నిరోధిస్తాయి.ఇన్ఫ్లమేషన్కు చెక్కుమ్ఖాత్ పండ్లలో కీంప్‌ఫెరాల్, లుటియోలిన్, హెస్పెరిడిన్, క్యుఎర్సెటిన్, సి–గ్లైకోసైడ్ వంటి ఫ్లేవనాయిడ్లు ఉన్నాయి. సి–గ్లైకోసైడ్ దేహంలో వాపును నివారించే గుణం కలిగిఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. రోగనిరోధక వ్యవస్థలో ఇన్ఫ్లమేటరీ రీయాక్షన్ను, ప్రమాదకరమైన ఫ్రీ రాడికల్స్ పుట్టుకను తగ్గించటంలో సి–గ్లైకోసైడ్ ఉపయోగపడుతుంది.యాంటీబాక్టీరియల్ ప్రభావంకుమ్ఖాత్ పండు తొక్కలోని నూనెకు సూక్ష్మక్రిములను హరించే గుణం ఉందని పరిశోధనల్లో తేలింది. ఆహార పదార్థాలపై పెరిగే బూజు, సూక్ష్మజీవులను నిరోధించడానికి ఇది ఉపయోగపడుతుంది. తద్వారా ఆహార పదార్థాలు త్వరగా చెడిపోకుండా ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు ఇది దోహదం చేస్తుంది.కేన్సర్‌నూ అరికడుతుందికుమ్ఖాత్ పండులో ఉండే అపిజెనిన్ అనే ఫ్లేవనాయిడ్ కేన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటుందని పరిశోధనల్లో తేలింది. అపిజెనిన్ కేన్సర్ కణాలను ఇతర ఆరోగ్యకరమైన కణాలకు సోకకుండా అరికట్టగలుగుతుందని భావిస్తున్నారు.ఊబకాయాన్ని తగ్గిస్తుందికుమ్ఖాత్ పండ్లలోని పోన్సిరిన్ అనే ఓ ఫ్లావనాయిడ్ ఊబకాయాన్ని తగ్గించటంలో కీలక పాత్ర పోషిస్తుంది. దేహం కొత్త కొవ్వు కణాలను తయారు చేసుకోకుండా అడ్డుకోవటం ద్వారా బరువు పెరగకుండా ఉండేందుకు పోన్సిరిన్ దోహదపడుతుందని ఒక అధ్యయనంలో వెల్లడైంది. దీనితో పాటు ఈ పండ్లలోని అధిక పీచుపదార్థం కడుపులో ఎక్కువ సేపు దన్నుగా ఉండటం వల్ల ఆకలి భావనను త్వరగా కలగనివ్వదు.కంటి చూపునకు మంచిదికుమ్ఖాత్ పండ్లలో బీటా కరోటెన్ రూపంలో విటమిన్ ఎ పుష్కలంగా ఉంది. ఈ పండ్లలో ఉన్న 11 కెరొటెనాయిడ్లలో ఇదొకటి. బీటీ కరోటెన్, జియాక్సాంతిన్, లుటీన్ వంటి కెరొటెనాయిడ్లు కంటి ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కంటి చూపు బాగుండాలంటే విటమిన్ ఎ తోడ్పాటుతో రోడోస్పిన్ ఉత్పత్తి అవుతుంది.మూడ్ డిజార్డర్లకూ... వత్తిడి సమస్యలను, మూడ్ డిజార్డర్లను, నిద్ర సమస్యలను విటమిన్ సి ఆహారాలు అరికడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి. వత్తిడి, కుంగుబాటు, ఆందోళనల తీవ్రతను తగ్గించటం ద్వారా మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించే యాంటీడిప్రెసెంట్ మాదిరిగా కుమ్ఖాత్ పండ్లు పనిచేస్తాయి. ఆరోగ్యదాయకమైన నిద్రకు దోహదం చేస్తాయి. అయితే, అది ఏ విధంగా దోహదపడతాయో ఇంకా స్పష్టంగా తెలియదు.ఎముక పుష్టికి.. ఎముక పెరుగుదలలో విటమిన్ సి పాత్ర కీలకమైనది. విటమిన్ సి కొల్లజెన్ ఏర్పడటానికి దోహదపడుతుంది. కుమ్ఖాత్ పండ్లలో కాల్షియం, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. ఎముకలు పటుత్వాన్ని కోల్పోయే ఆస్టియోపోరోసిన్ వంటి సమస్యలను విటమిన్ సి తగ్గిస్తుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎముకల నుంచి కాల్షియంను హరించే యాసిడ్ ఫుడ్స్ ఎముక సమస్యల్ని పెంచుతాయి. కుమ్ఖాత్ పండ్లు ఆల్కలిన్ ఫ్రూట్స్ కాబట్టి ఆస్టియోపోరోసిన్కు దారితీయకుండా కాపాడుతాయని చెప్చొచ్చు.రోగనిరోధక శక్తి కుమ్ఖాత్ పండ్లలోని బీటా–క్రిప్టోక్సాంతిన్, ఎల్–లైమోనెనె మన దేహంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయని ఓ అధ్యయనం చెబుతోంది. సహజ సిద్ధమైన కిల్లర్ సెల్స్ కార్యకలాపాలను పెంపొందించటం ద్వారా దేహంలో మెటబాలిక్ స్ట్రెస్‌ను తగ్గించటంలో ఇవి ఉపయోపడతాయి.చదవండి: పొలాల్లో రసాయనాల వాడకంతో మనుషుల్లో జబ్బుల పెరుదలకుమ్ఖాత్ పోషక విలువలు: 100 గ్రాముల కుమ్ఖాత్ పండ్లలో పోషకవిలువలు ఇలా ఉంటాయి... శక్తి : 71 కిలోకేలరీలు; పిండిపదార్థాలు : 15.9 గ్రా; మాంసకృత్తులు : 1.8 గ్రా; కొవ్వు : 0.8 గ్రా; పీచు : 6.5 గ్రా; విటమిన్ ఎ : 15 మిల్లీ గ్రాములు; విటమిన్ సి : 43.9 ఎం.జి; రిబొఫ్లేవిన్ : 0.09 ఎం.జి; క్లోరిన్ : 8.4 ఎం.జి; కాల్షియం : 62 ఎం.జి; ఐరన్ : 0.87 ఎం.జి; మెగ్నీషియం : 20 ఎం.జి; మాంగనీసు : 0.13 ఎం.జి; జింక్ : 0.17 ఎం.జి; -
పారాసిటమాల్ నాసిరకం
న్యూఢిల్లీ: ఒళ్లు కాస్తంత వేడిగా అనిపించినా వెంటనే మింగే మాత్ర పారాసిటమాల్. అది నాసిరకం మాత్ర అని కేంద్ర ఔషధాల ప్రమాణాల నియంత్రణ సంస్థ (సీడీఎస్సీఓ) తేల్చింది! పారాసిటమాల్ 500 ఎంజీతో పాటు విటమిన్ సి, విటమిన్ డీ3, విటమిన్ బి కాంప్లెక్స్ వంటి 53 సర్వసాధారణ ఔషధాల నాణ్యత కూడా ప్రమాణాల మేరకు లేదని ప్రకటించింది. తాజా నెలవారీ నాణ్యతా పరీక్షలో ఇవన్నీ ఫెయిలైనట్టు పేర్కొంది. యాంటీబయాటిక్స్, రక్తపోటు ఔషధాలు, విటమిన్ల మాత్రల్లో కూడా నాణ్యత లోపించిందని వెల్లడించింది. పలు రాష్ట్రాల్లో డ్రగ్ ఆఫీసర్లు ర్యాండమ్‌గా ఆయా విభాగాల ఔషధాలను చెక్ చేసి ఈ మేరకు నిర్ధారించారు. విటమిన్ సీ సాఫ్ట్‌జెల్స్, ఎసిడిటీ నివారణకు వాడే పాన్ డీతో పాటు చక్కెరవ్యాధికి వాడే గ్లిమిపిరిడిన్. బీపీకి వాడే టెల్మీసార్టాన్ మందులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.ఆల్కెమ్ లేబొరేటరీస్, హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్, కర్ణాటక యాంటీబయోటిక్స్, ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్, మెగ్ లైఫ్‌సైన్సెస్, ప్యూర్ అండ్ క్యూర్ హెల్త్‌కేర్, హెటెరో డ్రగ్స్ సహా చాలా ఔషధ తయారీ సంస్థల డ్రగ్స్ పరీక్షల్లో ఫెయిలయ్యాయి. జీర్ణకోశ, ఉదర సంబంధ ఇన్ఫెక్షన్లకు అత్యంత ఎక్కువగా వాడే మెట్రోనిడజోల్ (హిందుస్తాన్ యాంటీబయోటిక్స్ లిమిటెడ్) కూడా నాణ్యత పరీక్షలో విఫలమైంది. షెల్కాల్ (టోరెంట్ ఫార్మాస్యూటికల్స్), క్లావమ్ 625, పాన్ డీ (ఆల్కెమ్ హెల్త్‌కేర్ సైన్సెస్), పారాసిటమాల్ (కర్ణాటక యాంటీబయోటిక్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్), సెపోడెమ్ చిన్నారులకు తీవ్రమైన బాక్టీరియా ఇన్ఫెక్షన్ చికిత్సకు ఎక్కువగా వాడే ఎక్స్పీ50 (హెటిరో–హైదరాబాద్) కూడా ప్రమాణాలను అందుకోలేకపోయాయని సీడీఎస్సీఓ పేర్కొంది. భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న 156 ఫిక్స్ డోస్ డ్రగ్ కాంబినేషన్ ఔషధాలు హానికరమంటూ సీడీఎస్సీఓ వాటిని గత ఆగస్ట్‌లో నిషేధించడం తెల్సిందే. సర్వసాధారణంగా వాడే జ్వరం మందులు, నొప్పి నివారిణులు, అలర్జీని తగ్గించే ఔషధాల వంటివి వాటిలో ఉన్నాయి. -
ఒంట్లో నీరసంగా అనిపిస్తుందా? ఇలా చేయండి
ఉరుకుల పరుగుల జీవితంలో మన ఆరోగ్యం గురించి ఎక్కువగా దృష్టిపెట్టం. ఏదైనా సమస్య వచ్చినప్పుడే అసలు ఎందుకిలా అయ్యింది? ఇప్పుడేం చేయాలి అని ఆలోచిస్తుంటాం. అలా కాకుండా ప్రతిరోజు మనకోసం కొంత సమయాన్ని కేటాయించుకొని ఆరోగ్యంపై దృష్టి పెడితే లక్షలకు లక్షలు ఆసుపత్రులకు వెచ్చించాల్సిన అవసరం ఉండదు. సింపుల్‌గా మన వంటింట్లో దొరికే వస్తువులతో ఆరోగ్యంగా ఎలా ఉండొచ్చో కొన్ని తెలుసుకుందాం.. హెల్త్ టిప్స్ తేనెలో ఐరన్, కాపర్, మాంగనీస్‌లు సమృద్ధిగా ఉండటం వల్ల నీరసంగా అనిపించినప్పుడు ఒక గ్లాస్ నీటిలో రెండు స్పూన్ల తేనె కలుపుకొని తాగితే ఒంటికి వెంటనే శక్తి వస్తుంది. సోయా బీన్ ఎక్కువగా తీసుకుంటే శరీరం పోషకాలను గ్రహించే శక్తి పెరుగుతుంది. దాంతో మనం తీసుకున్న ఆహారంలోని ఐరన్‌ని శరీరం బాగా గ్రహిస్తుంది. విటమిన్ సి సమృద్ధిగా లభించే నిమ్మ, ఉసిరి, జామ వంటి పళ్ళు, మొలకెత్తిన పప్పుధాన్యాలు తీసుకుంటూ ఉంటే రక్తహీనత నుంచి బయట పడవచ్చు. -
ఆహారంలో మునగాకు, మునక్కాయలు వారంలో రెండుసార్లైనా తీసుకోవాలి! ఇంకా..
ఎండ కన్నెరగని జీవితాల్లో డీ విటమిన్ లోపం సాధారణమైపోయింది. నరాలు, కండరాలు, వ్యాధినిరోధక శక్తి మీద విటమిన్ డీ ప్రభావం ఉంటుంది. దేహంలో డీ విటమిన్ లోపిస్తే... నీరసం, నిస్సత్తువ, తరచూ అంటువ్యాధుల బారిన పడడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. క్యాల్షియమ్ సమృద్ధిగా లభించే ఆహారాన్ని తీసుకున్నా సరే... దేహం ఆ క్యాల్షియమ్‌ను స్వీకరించదు. ఆహారంలోని క్యాల్షియమ్ని దేహం చక్కగా స్వీకరించాలంటే దేహంలో డీ విటమిన్ తగినంత ఉండాలి. అలాగే ఐరన్ కూడా. మనం ఆహారంలో తీసుకున్న ఐరన్‌ని దేహం గ్రహించాలంటే దేహంలో సీ విటమిన్ తగినంత ఉండాలి. విటమిన్ సీ లోపం ఉన్న వాళ్లు ఐరన్ సమృద్ధిగా ఉన్న ఆహారం తీసుకున్నా సరే దేహం సంగ్రహించుకోలేదు. దాంతో ఐరన్ లోపం ఏర్పడి రక్తహీనతకు దారి తీస్తుంది. అంతేకాదు... మనం పీల్చిన గాలి నుంచి ఆక్సిజెన్ తగు పాళ్లలో మెదడుకు చేరడం కూడా ముఖ్యమే. అలాగే ఛాతీ నిండుగా గాలి పీల్చుకోగలగడమూ అంతే అవసరం. దైనందిన ఆహారపు అలవాట్లలో భాగంగా అన్నం కూరలు, రొట్టె, పప్పులకు తోడుగా అవసరాన్ని బట్టి ఈ కింద చెప్పిన వాటిని ఆహారంలో భాగం చేసుకుందాం. క్యాల్షియమ్ కోసం... ►రాగులు, నువ్వులు, సబ్జా, అవిశె గింజలు, వాల్నట్, గెనస గడ్డ (స్వీట్ పొటాటో), పాలకూర, పుదీనలో క్యాల్షియమ్ పుష్కలంగా ఉంటుంది. ►ప్రొటీన్ పుష్కలంగా ఉండే సోయాబీన్స్తోపాటు మునగాకు, మునక్కాయలు వారంలో రెండు దఫాలు ఆహారంలో భాగం కావాలి. ►పాలు, పెరుగు లేదా మజ్జిగ రోజూ తీసుకోవాలి. ఐరన్ కోసం... ►మష్రూమ్, క్యాలీఫ్లవర్, లివర్, ట్యూనా ఫిష్, రొయ్యలు, బీట్రూట్, శనగలు, బ్రౌన్ రైస్, పుచ్చకాయ, దానిమ్మ, స్ట్రాబెర్రీలు, ఆపిల్‌తోపాటు విటమిన్ సీ సమృద్ధిగా ఉండే పైనాపిల్, పియర్, నారింజ, కమలాలు తీసుకోవాలి. ►డ్రైఫ్రూట్స్‌లో ఆప్రికాట్, కిస్మిస్, ఖర్జూరాలు, గుమ్మడి గింజలు నమిలి తినాలి. ►అన్ని కాలాల్లో దొరికే సంపూర్ణ పోషకాల అరటి పండ్లు నిత్య ఆహారంగా ఉండాలి. ►పైవన్నీ తీసుకుంటే డీ విటమిన్ కూడా తగినంత అందుతుంది. విటమిన్ డీ కోసం ►మష్రూమ్, సోయా, గుడ్లు, పాలు, పెరుగు, మీగడలు, చేపలు డీ విటమిన్నిచ్చే ఆహారాలు. ►వీటితోపాటు రోజుకు కనీసం పావుగంట సేపు దేహానికి సూర్యరశ్మి తగలాలి. ►సూర్యరశ్మి సోకే చోట మార్నిగ్ లేదా ఈవెనింగ్ వాకింగ్ చేస్తే మంచిది. ►ఇవి సాధారణ ఆరోగ్యం కోసం పాటించాల్సిన ప్రధానమైన ఆహార జాగ్రత్తలు మాత్రమే. ►మనదేహంలో క్యాల్షియమ్, ఐరన్ స్థాయులను బట్టి డాక్టర్ సూచన మేరకు కచ్చితమైన డైట్ ప్లాన్‌ను అనుసరించాలి. నోట్: ఈ కథనం కేవలం ఆరోగ్యంపై అవగాహన కొరకు మాత్రమే! -
క్యాన్సర్‌తో బాధపడుతున్నారా.. బీట్రూట్ తిన్నారంటే..!
బీట్రూట్ క్యాన్సర్‌ను మూడు విధాలుగా నివారిస్తుంది. 1) బీట్రూట్లో బిటాలెయిన్స్ అనే పోషకం ఉంటుంది. బీట్రూట్కు ఎర్రటి రంగునిచ్చేది ఇదే. ఇదో శక్తిమంతమైన యాంటీ–ఆక్సిడెంట్. అంతేకాదు... బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కూడా ఉంటాయి. క్యాన్సర్‌ను నివారించడంలో యాంటీ ఆక్సిడెంట్స్ కీలక భూమిక పోషిస్తాయి. బీటాలెయిన్స్లో ఉన్న యాంటీక్యాన్సరస్ గుణాల సహాయంతో అది క్యాన్సర్‌ను నివారిస్తుంది. 2) బీట్రూట్లో విటమిన్–సి పుష్కలంగా ఉంటుంది. విటమిన్–సి వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందన్న విషయం తెలిసిందే. బీట్రూట్ వాడటం వల్ల వ్యాధినిరోధక వ్యవస్థ బలోపేతమౌతుంది. అది క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. 3) బీట్రూట్ రక్తంలోని హీమోగ్లోబిన్ను పెంచడం ద్వారా అన్ని కణాలకూ ఆక్సిజన్‌ను పెంచడానికి దోహదపడుతుంది. ఆక్సిజన్‌కు క్యాన్సర్‌ను తుదముట్టింటే శక్తి ఉంటుంది. పెరిగిన హీమోగ్లోబిన్ వల్ల, బీట్రూట్లోని పోషకాల వల్ల ఎక్కువ సేపు, మరింత స్టామినాతో వ్యాయామం చేసే సామర్థమూ పెరుగుతుంది. దాంతో కణాలకు ఆక్సిజన్ సప్లై మరింత పెరుగుతుంది. ఈ అంశం కూడా క్యాన్సర్ నివారణకు తోడ్పడేదే. వెరసి... ఇలా ఈ మూడంశాల ముప్పేట దాడితో క్యాన్సర్‌ను బీట్రూట్ సమర్థంగా నివారిస్తుంది. చదవండి: Cancer Prevention: ఈ అలవాట్లు ఉన్నాయా..? క్యాన్సర్ బారిన పడినట్టే..! -
Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే..
Summer Drinks: Apple Blueberry Juice: యాపిల్ నేరేడు జ్యూస్‌లో పీచుపదార్థంతోపాటు విటమిన్ సి, విటమిన్ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి సెల్ డ్యామేజ్‌ను నియంత్రిస్తాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి సైతం వేసవిలో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ నేరేడు జ్యూస్ తయారీకి కావలసినవి: ►గింజలు తీసేసిన నేరేడు పండ్లు – కప్పు ►యాపిల్ ముక్కలు – కప్పు ►బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను ►అల్లం – చిన్న ముక్క ►చాట్ మసాలా – చిటికెడు ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►ఐస్ క్యూబ్స్ – ఐదు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►నేరేడు, యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ముక్కలు నలిగాక, కప్పు నీళ్లు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ జ్యూస్‌ను వడగట్టకుండా గ్లాసులో పోసి, తేనె, చాట్ మసాలా, ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ∙ వేసవిలో ట్రై చేయండి: Pomegranate Strawberry Juice: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! -
Summer Drinks: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! రోజుకో గ్లాస్ తాగితే
Summer Drink- Pomegranate Strawberry Juice: స్ట్రాబెరీలో విటమిన్ సి, కె, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటా షియం పుష్కలంగా ఉంటాయి. ఇక, దానిమ్మగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. కాబట్టి దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌తో పై పోషకాలన్నీ శరీరానికి అంది.. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు, అధిక రక్తపీడనం నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజ పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీకి కావలసినవి: ►దానిమ్మ గింజలు –రెండు కప్పులు ►స్ట్రాబెరీలు – ఆరు ►రాక్‌సాల్ట్ – టీస్పూను ►జీలకర్రపొడి – అరటీస్పూను ►నీళ్లు – పావు కప్పు ►ఐస్ క్యూబ్స్ – పది. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీ: ►స్ట్రాబెరీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి. ►బ్లెండర్లో దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు, రాక్ సాల్ట్‌ను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ను విడిగా తీసుకోవాలి. ►ఇప్పుడు జ్యూస్‌లో జీలకర్రపొడి, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ మరింత రుచిగా ఉండాలంటేæ తేనెను కలుపుకోవచ్చు. ►తాజాగా ఉన్న స్ట్రాబెరీ, దానిమ్మ గింజలతో చేసే ఈడ్రింక్ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్‌గా పనిచేస్తుంది. ►దీనిలో పంచదార వేయకపోవడం, వీగన్, గులెటిన్ ఫ్రీ కూడా కాబట్టి ఉపవాసంలో ఉన్నవారు కూడా ఈ జ్యూస్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు. వేసవిలో ట్రై చేయండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
Health Tips: గుండె ఆరోగ్యం.. ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారం తీసుకుంటే..
Best Diet For Heart Health And Weight Loss: ఇటీవల కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె జబ్బుల బారిన పడటం, కొందరు ఆకస్మాత్తుగా మృత్యువాత పడటాన్నీ చూస్తున్నాం, వింటున్నాం. గుండె ఆరోగ్యాన్ని పదికాలాలు పదిలంగా ఉంచుకోవాలంటే నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకోవాలి. కొన్నిరకాల ఆహారాలు గుండె జబ్బులు వచ్చే అవకాశాలను పెంచుతాయి. కానీ కొన్ని మాత్రం గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ క్రమంలోనే గుండె ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన ఆహారం ఏమిటో, దానిని ఎందుకు, ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం. ఫైబర్ ఎక్కువగా ఉండాలి.. ►నిత్యం మనం తీసుకునే ఆహారంలో ఫైబర్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. దీంతో గుండె సంబంధ వ్యాధులు వచ్చే అవకాశాలు బాగా తగ్గుతాయని సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల్లో వెల్లడైంది. ►ఫైబర్ హైబీపీని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. దీంతో హార్ట్ స్ట్రోక్స్ రాకుండా ఉంటాయి. ►ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు గుండె ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి.ఇవి ఉన్న ఆహారాన్ని నిత్యం తీసుకోవాలి. ►దీంతో శరీరంలో వాపులు తగ్గుతాయి. తద్వారా గుండె ఆరోగ్యం మెరుగు పడుతుంది. ►చేపల్లో ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు పుష్కలంగా ఉంటాయి కనుక వాటిని తరచూ తినడం వల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. వెజిటేరియన్లు ఎలా? ►ఇక వెజిటేరియన్లు నట్స్, సీడ్స్ తినడం ద్వారా ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు లభిస్తాయి. ►బాదంపప్పు, వాల్నట్స్ వంటి వాటిని నిత్యం గుప్పెడు మోతాదులో తింటే గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. ►వీటిల్లో ఉండే పోషకాలు గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుతాయి. ►నట్స్‌ను తినడం వల్ల అధిక బరువు తగ్గుతారు. అధిక బరువు తగ్గించుకుంటేనే.. ►అధికంగా బరువు ఉండడం వల్ల కూడా గుండె వ్యాధులు వచ్చేందుకు అవకాశం ఉంటుంది. కనుక బరువును ఎప్పుడూ నియంత్రణలో ఉంచుకోవాలి. అధికంగా బరువు ఉన్నవారు బరువు తగ్గే ప్రయత్నం చేయాలి. దీనివల్ల గుండె వ్యాధులు రాకుండా చూసుకోవచ్చు. ప్రొటీన్ ఫుడ్ ►ప్రొటీన్ అధికంగా ఉండే ఆహారాలను తీసుకోవటం మంచిది. ►చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. ►అదే విధంగా కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి. కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు.. ►సాల్మన్ ఫిష్, ట్యూనా, హెర్రింగ్ లాంటి చేపలు గుండెకు ఆరోగ్యకరం. ►వీటిలో గుండె కొట్టుకోవడంలో తేడానీ, రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోవడాన్నీ, ట్రై గ్లిజరైడ్స్‌నూ తగ్గించే ఒమేగా–3 ఫ్యాటీ యాసిడ్స్ వీటిలో ఎక్కువుంటాయి. వారానికి కనీసం రెండు సార్లయినా ఈ చేపలు తింటే బెటరని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ సిఫార్సు చేసింది. ►ఓట్ మీల్ తింటే మంచిది. పీచు పదార్థం ఉండే ఈ ఓట్ మీల్ ఒంట్లో కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. ►జీర్ణకోశ మార్గంలో ఇది ఒక స్పాంజ్‌లా పనిచేసి, కొలెస్ట్రాల్‌ను నానిపోయేలా చేసి, రక్తంలో ఇంకిపోకుండా ఒంట్లో నుంచి తొలగిస్తుంది. హోల్ వీట్ బ్రెడ్ లాంటి తృణధాన్యాలతో చేసినవి తిన్నా మంచిదే. ►స్ట్రాబెర్రీలు, బ్లూ బెర్రీల లాంటివి తింటే, ఆ పండ్లలో ఉండే ఫైటోన్యూట్రియెంట్స్, పీచుపదార్థాలు రక్తనాళాల్ని వెడల్పు చేసి, గుండె పోటు వచ్చే అవకాశాలు తగ్గిస్తాయని ఒక పరిశోధనలో వెల్లడైంది. చాక్లెట్లు కూడా.. ►డార్క్ చాక్లెట్లు, అంటే కనీసం 60 నుంచి 70 శాతం కోకోతో తయారైన చాక్లెట్లు తింటే, అధిక రక్తపోటు, రక్తం ఊరిగే గట్టకట్టుకుపోవడం లాంటివి తగ్గుతాయి. ►అయితే, మామూలు మిల్క్ చాక్లెట్లు, క్యాండీ బార్ల వల్ల ఉపయోగం లేదు. అయితే వీటిని కూడా చాలా పరిమితంగా తీసుకోవాలి. వీటిని తీసుకుంటే.. ►విటమిన్ ‘సి’ ఎక్కువగా ఉండే బత్తాయిలు, కమలా పండ్ల లాంటి నిమ్మజాతి పండ్లు తినాలి. అయితే, ఈ పండ్ల రసాల్లో మళ్ళీ అతిగా పంచదార కలుపుకోకూడదు. ►సోయా పాలు, సోయా జున్ను (తోఫూ) తింటే ఒంటికి కావాల్సిన ప్రొటీన్లు వస్తాయి. ►అనారోగ్యకరమైన కొవ్వు, కొలెస్ట్రాల్ ఒంట్లో చేరవు. సోయా ప్రొటీన్లు ఒంట్లో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. ఈ కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో.. ►బంగాళదుంపలు అనగానే అతిగా పిండిపదార్థమని చాలామంది పక్కనపెడుతుంటారు. కానీ, అతిగా వేయించనంత వరకు బంగాళదుంపలు గుండెకు ప్రమాదకరం కావు. ►పొటాషియం ఎక్కువగా ఉండే వీటిలో ఫైబర్ ఉంటుంది. ►టొమాటోలలో కూడా గుండెకు ఆరోగ్యమిచ్చే పొటాషియం ఉంటుంది. ఇందులోని విటమిన్లు రక్తాన్ని శుద్ధి చేస్తాయి. ►గుప్పెడన్ని నట్స్ అంటే బాదంపప్పు, అక్రోటు కాయలు (వాల్నట్స్), వేరుసెనగ లాంటివి తగు మోతాదులో తినాలి. వాటిలో చెడ్డ కొలెస్ట్రాల్‌ను తగ్గించే విటమిన్ ‘ఇ’ ఉంటుంది. ►బచ్చలి కూర లాంటి ఆకుకూరలు గుండెకు అదనపు బలం ఇస్తాయి. ►దానిమ్మలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. రోజూ నిర్ణీత మోతాదులో కనీసం మూడు నెలల పైగా దానిమ్మ రసం తాగితే, గుండెకు రక్తప్రసారం బాగా మెరుగవుతుంది. ►దానిమ్మ పండు గుండె రక్తనాళాల్లో పేరుకుపోయే అడ్డంకులు (ప్లాక్స్)నూ శుభ్రం చేస్తాయి. యాపిల్ పండ్లు కూడా. ►అవిశె గింజలలో (ఫ్లాక్ సీడ్స్) పీచు, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. వాటిని రోజుకు 20 గ్రాములు తింటే మేలు. చదవండి👉🏾Vitamin C Deficiency: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఇవి తింటే మేలు! చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
Health Tips: విటమిన్ ‘సి’ లోపిస్తే అంతే సంగతులు.. ఏం జరుగుతుందంటే!
Vitamin C Deficiency Symptoms: మన ఆరోగ్యానికి విటమిన్ ‘సి’ తగిన మోతాదులో అందడం చాలా ముఖ్యం. ఎముకల అభివృద్ధికి, రక్త నాళాల పనితీరుకు, గాయాలు త్వరగా నయం కావడానికి... విటమిన్ సి అత్యవసరం. ఇది లోపిస్తే అనేక వ్యాధులు శరీరంపై దాడి చేసేందుకు సిద్ధంగా ఉంటాయి. 1. స్కర్వీ విటమిన్ సి లోపం వల్ల కలిగే వ్యాధి ఇది. ఆహారం ద్వారా తగినంత సి విటమిన్ అందనప్పుడు స్కర్వీ లక్షణాలు కనిపించడం మొదలవుతాయి. పంటి చిగుళ్ల నుంచి రక్తస్రావం కావడం, గాయాల నుంచి రక్తం కారడం, అలసటగా అనిపించడం, దద్దుర్లు రావడం, నీరసంగా అనిపించడం వంటివన్నీ స్కర్వీ వ్యాధి లక్షణాలు. మొదట్లో అలసటగా అనిపించడం, ఆకలి లేకపోవడం, ప్రతి దానికి చిరాకు పడడం, కీళ్ల నొప్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. 2. హైపర్ థైరాయిడిజం థైరాయిడ్ గ్రంధి అధికంగా హార్మోన్లను స్రవించడాన్ని హైపర్ థైరాయిడిజం అంటారు. థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ సి అవసరం. లేకుంటే బరువు హఠాత్తుగా తగ్గడం, గుండె కొట్టుకోవడంతో తేడా, విపరీతమైన ఆకలి, భయం, వణుకు, మహిళల్లో రుతుక్రమంలో మార్పులు వంటి లక్షణాలు కలుగుతాయి. 3. రక్తహీనత శరీరం ఇనుమును శోషించుకోవడానికి విటమిన్ సి సాయపడుతుంది. తగిన స్థాయిలో ఈ విటమిన్ అందకపోతే ఐరన్ శోషణ తగ్గి రక్తహీనత వంటి ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. దీని వల్ల బరువు తగ్గడం, ముఖం పాలిపోయినట్టు అవడం, శ్వాస ఆడకపోవడం వంటి ఆరోగ్య లక్షణాలు కనిపిస్తాయి. 4. చర్మ సమస్యలు విటమిన్ సిలో యాంటీఆక్సడెంట్ లక్షణాలు అధికంగా ఉంటాయి. చర్మానికి బిగుతును, సాగే గుణాన్ని ఇచ్చే కొల్లాజెన్ ఉత్పత్తిలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. దీని లోపం వల్ల చర్మంపై దద్దుర్లు, మచ్చలు, రక్తస్రావం వంటివి కలుగుతాయి. Vitamin C Rich Foods: ఏం తినాలి? ►విటమిన్ సి లోపం తలెత్తకుండా ఉండాలంటే రోజు వారీ ఆహారంలో కొన్ని రకాల పదార్థాలు తప్పకుండా ఉండేలా చూసుకోవాలి. ►నారింజలు, నిమ్మ రసాలు తాగుతూ ఉండాలి. ►బంగాళాదుంపలు, స్ట్రాబెర్రీలు, బ్రకోలి, క్యాప్సికమ్, బొప్పాయి, జామ, కివీలు, పైనాపిల్, టమోటాలు, పచ్చిబఠాణీలను మీ ఆహార మెనూలో చేర్చుకోవాలి. ►విటమిన్ సి టాబ్లెట్లను వైద్యుల సలహా మేరకే ఉపయోగించాలి. చదవండి👉🏾Fruits For Arthritis Pain: కీళ్ల నొప్పులా.. ఈ పండ్లు తిన్నారంటే చదవండి👉🏾Hair Fall Control Tips: జుట్టు రాలకుండా ఉండాలంటే..? -
Hair Fall: జుట్టు రాలకుండా ఉండాలంటే..?
జుట్టు రాలిపోవడం అనే సమస్యను ఎదుర్కోని యువత ఇంచుమించు ఇటీవల కాలంలో ఎవరూ లేరంటే అతిశయోక్తి కాదు. జుట్టు రాలిపోవడానికి అనేక కారణాలున్నప్పటికీ ఐరన్, విటమిన్ – సి. ఈ మూడూ పుష్కలంగా అందేలా మన ఆహారాన్ని ప్లాన్ చేసుకుంటూ ఉంటే జుట్టు రాలిపోవడాన్ని చాలావరకు అరికట్టవచ్చు. జుట్టు రాలిపోకుండా చేసే వాటిలో ఐరన్ కీలకమైనది. మనకు ఐరన్ సమృద్ధిగా అందాలంటే... గుడ్డు, డ్రైఫ్రూట్స్, జీడిపప్పు లాంటి నట్స్, సీఫుడ్స్ వంటి తీసుకోవాలి. మాంసాహారంలో.. కాలేయం, కిడ్నీల వల్ల ఐరన్ ఎక్కువగా సమకూరుతుంది. శాకాహారులైతే ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరల్లో ఐరన్ ఎక్కువ. అందుకే ఆహారంలో వాటి పాళ్లు ఎక్కువగా ఉండేలా చూసుకోవడం అవసరం. విటమిన్–సి కోసం: ఉసిరిలో విటమిన్–సి పుష్కలంగా దొరుకుతుంది. అలాగే బత్తాయి, నారింజ వంటి నిమ్మజాతి పండ్లన్నింటిలోనూ విటమిన్–సి ఎక్కువగా ఉంటుందన్న విషయం తెలిసిందే. జింక్: గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. అందుకే వాటిని మీ ఆహారంలో భాగం చేసుకోండి. జుట్టు విపరీతంగా ఊడిపోయేవారి ఆహారం లో జింక్, ఐరన్ పుష్కలంగా ఉండాలని బ్రిటిష్ న్యూట్రిషన్ ఫౌండేషన్ గట్టిగా సిఫార్సు చేస్తోంది. జింక్‌కు గుమ్మడి గింజలు మంచి వనరు. దానితోపాటు సీఫుడ్, డార్క్‌చాక్లెట్, వేరుసెనగలు, వేటమాంసంలోనూ జింక్ ఎక్కువే. పుచ్చకాయ గింజల్లోనూ జింక్ ఎక్కువే. మీరు తినే సమతులాహారంలో ఇవి తీసుకుంటూనే... జుట్టు ఆరోగ్యం కోసం వారంలో కనీసం రెండు సార్లు తలస్నానం చేయండి. జుట్టు రాలిపోవడం తగ్గుతుంది. అప్పటికీ జుట్టు రాలుతుంటే మాత్రం... ఒకసారి థైరాయిడ్ పరీక్ష చేయించుకుని డాక్టర్‌ను కలవాల్సి ఉంటుంది. ఎందుకంటే థైరాక్సిన్ హార్మోన్ అసమతౌల్యతతో జుట్టు రాలే సమస్య ఉంటుంది. ఆహారం ద్వారానే ఈ సమస్యను అధిగమించాలనుకుంటే మీ డైట్లో క్రమం తప్పకుండా చేపలు ఉండేలా చేసుకొండి. ఇన్ని జాగ్రత్తల తర్వాత కూడా జుట్టు రాలడం ఆగకపోతే ఓసారి ట్రైకాలజిస్ట్‌ను కలిసి వారి సలహా మేరకు మందులు, పోషకాలు తీసుకోవడం మంచిది. -
ఉత్సాహాన్నిచ్చే పోటాషియం కావాలా? బనానా కివీ స్మూతీ తీస్కో!
కావలసినవి: పాలు – కప్పు, అరటిపండు – ఒకటి, కివి – ఒకటి, తేనె – మూడు టేబుల్ స్పూన్లు, లేత పాలకూర – కప్పు, ఆవకాడో – అర చెక్క, ఐస్‌క్యూబ్స్ – కప్పు. తయారీ: ⇔ అరటిపండు, కివి తొక్కతీసి ముక్కలుగా తరగాలి ⇔ పాలకూరను శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి ⇔ఇప్పుడు బ్లెండర్ తీసుకుని అరటిపండు, కివి ముక్కలు వేయాలి. దీనిలోనే పాలకూర, అవకాడోను ముక్కలు తరిగి వేయాలి. వీటన్నింటిని మెత్తగా గ్రైండ్ చేయాలి చదవండి👉🏻 అసలే ఎండాకాలం.. చుండ్రు సమస్యా? సులభైన 2 చిట్కాలు మీకోసం ⇔ అన్నీ మెత్తగా నలిగాక పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరొసారి గ్రైండ్ చేసి ..గ్లాసులో పోసుకోవాలి. దీనిలో తేనె వేసి బాగా కలిపి సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ⇔తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకున్నవారికి ఈ స్మూతీ మంచి డ్రింక్ గా పనిచేస్తుంది. దీనిలో క్యాలరీలు, సోడియం తక్కువగా ఉండి పోషకాలు అధికంగా ఉంటాయి. ⇔ విటమిన్ బి, సి, పీచుపదార్థంతోపాటు పొటాషియం కూడా పుష్కలంగా ఉంటుంది. ⇔పొటాషియం జీవనశైలిని మరింత ఉత్సాహపరుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. కండరాలను సంరక్షిస్తుంది. ⇔ అరటి, కివిలలో రెండు రకాల పీచుపదార్థాలు ఉంటాయి. ఇవి జీర్ణక్రియను క్రమబద్ధీకరిస్తాయి. చదవండి👉🏼 సత్తువ పెంచే సగ్గుబియ్యం -
మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
Summer Drink- Maredu Juice: మారేడు జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్‌లోని టానిన్, పెక్టిన్లు డయేరియాను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రపోషిస్తాయి. విటమిన్ సీ, క్యాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్, ఐరన్లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వెంటనే దాహార్తి తీరాలంటే మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ఈ సమ్మర్ డ్రింక్‌ను తయారుచేసుకోండి. మారేడు జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు: పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా. మారేడు జ్యూస్ తయారీ ఇలా: ►ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి. ►తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్‌ను పిండుకోవాలి. ►జ్యూస్‌ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి. ►దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి. ►చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
వెల్లుల్లిని పరగడుపునే తింటున్నారా?
-
Health Tips: రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగుతున్నారా.. అయితే
వేసవి కాలం రాగానే చాలామంది రాగిజావ తాగుతుంటారు. రాగిజావ నిజంగా ఆరోగ్య ప్రదాయినే. వేసవిలో రోజుకోసారి రాగిజావ తీసుకోవడం వల్ల కడుపులో చల్లగా ఉండటంతోపాటు మరెన్నో లాభాలు ఉన్నాయి. ఆ లాభాలేమిటో చూద్దాం... ►రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతిరోజూ తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. ►వీటిలో ఐరన్ కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది. ►రాగి పిండిలో విటమిన్–సి కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతోపాటు చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ►రాగులు లేదా రాగిజావ తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయులు అదుపులో ఉంటాయి. ►బరువు తగ్గాలనుకునేవారికి రాగి జావ లేదా రాగిసంగటిగానూ తీసుకోవడం వల్ల పొట్ట నిండినట్లుగా అనిపించి ఎక్కువ ఆహారం తీసుకోరు. అందువల్ల త్వరగా బరువు తగ్గుతారు. ►రాగిపిండిలో పలు రకాల అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి మనలోని ఒత్తిడీ, ఆందోళనలను తగ్గిస్తాయి. ►అంతేకాదు కండరాల ఆరోగ్యానికీ, రక్తం తయారవడానికీ, జీవక్రియలు సాఫీగా జరగడానికి తోడ్పడతాయి. ►దీనిలో మాంసకృత్తులు కూడా మెండుగా ఉంటాయి. కాబట్టి ఈ చిరుధాన్యాన్ని తీసుకోవడం వల్ల పోషకాహార లోపం తలెత్తదు. ►రక్తంలో కొలెస్ట్రాల్స్‌ను తగ్గిస్తుంది. అలా గుండెజబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు. ►అల్పాహారం తీసుకోవడం కుదరనివారు రాగులతో సమానంగా దంపుడు బియ్యం కలిపి మర పట్టించి, జావ కాచుకుని తాగితే ఎక్కువసేపు ఆకలి కాదు. నీరసం రాకుండా ఉంటుంది. ►బీపీ ఉండి, మధుమేహం లేనివారు రాగిజావను పాలు, బెల్లం, యాలకుల పొడితో కలిపి కాచుకుని తాగవచ్చు. ఇది పిల్లలకు కూడా మంచిది. ►షుగర్ ఉన్న వారు తీపికి బదులుగా మజ్జిగ, ఉప్పుతో తీసుకోవాలి. చదవండి: Health Tips- Curry Leaves: షుగర్ పేషెంట్లకు శుభవార్త.. ఈ పొడి ఉదయం, రాత్రి ఒక్కో టీ స్పూన్ తీసుకున్నారంటే -
Gongura: షుగర్, రేచీకటి ఉన్నవాళ్లు గోంగూరను తిన్నారంటే...
Health Benefits Of Gongura Leaves: ఆంధ్రమాతగా... శాకంబరీ వర ప్రసాదంగా పేరొందిన గోంగూరను తేలిగ్గా తీసిపారేయడానికి వీల్లేదు. ఎందుకంటే గోంగూరలో చాలా ఔషధ గుణాలున్నాయి. గోంగూరలోని పీచు పదార్ధం గుండెకు ఎంతో మేలు చేస్తుంది. శరీరంలోని కొవ్వును నియంత్రిస్తుంది. వారానికి ఒక్కసారైనా గోంగూరతో పప్పు లేదా పచ్చడి చేసుకుని తింటే ఎన్నో ప్రయోజనాలున్నాయని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. తరచూ గోంగూరను తినడం వలన మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం... ►గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడి రక్తపోటు అదుపులో ఉంటుంది. ►రక్తంలో ఇన్సులిన్ స్థాయిని పెంచి, చక్కెర శాతాన్ని తగ్గించే శక్తి గోంగూరకు ఉంది. మధుమేహంతో బాధపడేవారు ఆహారంలో గోంగూరను తీసుకుంటే మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ►గోంగూరలో విటమిన్ ఎ, బి 1, బి 2, బి 9 తో పాటు సి విటమిన్ కూడా అధిక మొత్తంలో ఉంటుంది. విటమిన్ ఎ వల్ల కంటికి సంబంధించిన అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. ►బీకాంప్లెక్స్, సి విటమిన్లతో దంత సమస్యలు దూరంగా ఉంటాయి. దీనిలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. కాబట్టి రోజువారీ ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎముకలు పటిష్టంగా ఉంటాయి. చదవండి: విటమిన్ బి12 లోపం ఉందా..? ల్యాబ్‌కు వెళ్లక్కర్లేదు.. ఇలా చేస్తే తెలుస్తుంది..! ►అలాగే ఫోలిక్ యాసిడ్, మినరల్స్ కూడా అత్యధికంగా ఉంటాయి. ఇవి యాంటీ ఆక్సిడెంట్‌గా పనిచేస్తాయి. గుండె, కిడ్నీ సంబంధ వ్యాధులు, కొన్ని రకాల క్యాన్సర్ లాంటి భయంకర వ్యాధులను నివారించడానికి గోంగూర ఉపయోగ పడుతుంది. ►దగ్గు, ఆయాసం, తుమ్ములతో ఇబ్బంది పడేవాళ్లు ఏదో ఒక రూపంలో గోంగూరను తీసుకుంటే సహజ ఔషధంలా పనిచేస్తుంది. ►రేచీకటి ఉన్నవారు తరచూ గోంగూరను తీసుకోవాలి. అలాగే గోగుపూలను దంచి రసాన్ని తీసుకుని వడపోసి తాగడం వల్ల కూడా మంచి ప్రయోజనం ఉంటుంది. ►కొందరికి కొన్ని రకాల ఆహార పదార్థాల వల్ల అలెర్జీలు వస్తుంటాయి. అటువంటి వాటిలో గోంగూర కూడా ఒకటి. కాబట్టి శరీరానికి సరిపడని వారు మినహా మిగిలిన అందరూ నిరభ్యంతరంగా గోంగూరను తీసుకోవచ్చు. చదవండి: Health Tips: జీలకర్రను నీటిలో వేసి రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే తాగుతున్నారా.. అయితే -
Health Tips: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే అద్భుత ఫలితాలు!
Bottle Gourd Juice: Top 10 Amazing Health Benefits In Telugu: ఈ డిజిటల్ యుగంలో ‘నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను’ అని చెప్పగలిగినది ఎంత మంది? నూటికి అరవై మంది సరైన నిద్రకు దూరమయ్యారు. కలత నిద్ర కారణంగా మరుసటి రోజు పనిలో నాణ్యత తగ్గుతుంటుంది. కౌమారదశలోనే తెల్లజుట్టు పరిహసిస్తోంది. తింటే అజీర్తి, తినకపోతే ఎసిడిటీ. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పని జంక్‌ఫుడ్. ఆ జంక్‌ఫుడ్ కారణంగా వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను నింపుకుని దేహం బద్ధకంగా రోజులు వెళ్లదీస్తుంటుంది. దీనికితోడు వృత్తి, వ్యాపారాల కారణంగా తప్పనిసరి అవుతున్న మానసిక ఒత్తిడి. ఈ స్థితి నుంచి కళ్లు తెరిచేలోపే రక్తప్రసరణ వేగం పెరిగిపోయి ఉంటుంది. మొత్తానికి ఈ దుష్ప్రభావాలన్నింటినీ గుండె లయ మారుతుంటుంది. ఇన్నింటినీ దూరం చేయగలిగిన ఆహారం మన పెరట్లోనే పండుతుంది. పెరడు లేకపోతే కూరగాయల మార్కెట్లో దొరుకుతుంది. అదే సొరకాయ. ►సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్లు కూడా ఉంటాయి. ►సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు. ►సొరకాయ తింటే... మంచి నిద్రపడుతుంది. ►జుట్టు తెల్లబడిన టీనేజ్ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది. ►ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది. చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు... ►దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది. ►ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా. ►హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుదఫాలు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది. ►గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది. ►ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుంది. ►బాటిల్ గార్డ్ బీపీ గార్డ్ అని కూడా నిర్ధరణ అవుతుంది. చదవండి: Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా! -
World Sight Day: ఆరెంజ్, క్యారెట్, రాగులు, ఉసిరి.. తిన్నారంటే.. మీ కంటి చూపు..
ఆరోగ్యమైన జీవనానికి పోషకాహారం అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే! పోషకాహారం అనే ఆలోచన మదిలోమెదలగానే బరువు తగ్గడం, మధుమేహం, గుండె ఆరోగ్యం.. వంటి ఇతర సమస్యలను దృష్టిలో పెట్టుకుని జాగ్రత్తలు తీసుకుంటాం. ఐతే కంటి ఆరోగ్యం కూడా ముఖ్యమైనదే. ఆరోగ్యకరమైన చూపు పొందుకోవాలంటే.. లూటిన్, ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు, బేటాకెరొటిన్, ‘ఎ, సి, ఈ’ విటమిన్లు, జింక్.. వంటి పోషకాలు అవసరమౌతాయని ఢిల్లీ నూట్రీషనిస్ట్ లోకేంద్ర తోమర్ సూచిస్తున్నారు. ఏయే ఆహారాల్లో ఆయా పోషకాలు పుష్కలంగా ఉంటాయో తెలుసుకుందాం.. ఆరెంజ్ పండ్లు విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉండే ఆహారాలు నయనారోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆరెంజ్‌లో విటమిన్ ‘సి’ అధికంగా ఉంటుంది. ఇది రోగనిరోధకతకు మాత్రమే కాకుండా కంటిలో శుక్లాలు పెరగకుండా నిరోధిస్తుంది. అంతేకాకుండా నల్లగుడ్డుపై కొల్లాజెన్ ఉత్పత్తికి కూడా సహాయపడుతుంది. ఇది కళ్లు పొడిబారకుండా ఉండటానికి, గాయాలను మాన్పడానికి, ఎముకల పుష్టికి ఎంతో ఉపయోగపడుతుందని న్యూట్రిషనిస్ట్ రూపాలీ దత్తా తెలిపారు. చదవండి: బాప్రే! టోపీపై ఏకంగా 735.. ‘గుడ్డు’ రికార్డు! క్యారెట్ మన ఇంట్లో పెద్దవాళ్లు క్యారెట్ తింటే కంటి ఆరోగ్యానికి మంచిదని పదేపదే చెప్తుంటారు. ఎందుకంటే.. క్యారెట్లలో అధికంగా ఉండే బీటా కెరొటిన్ విటమిన్ ‘ఎ’గా రూపాంతరం చెందుతుంది. ఇది కంటి ఆరోగ్యానికి ఎంతో ప్రయోజనకారని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ కూడా సూచిస్తున్నారు. ఆప్రికాట్ పండ్లు సాధారణంగా వేసవికాలంలో లభించే ఈ పండ్లు మన సంప్రదాయ వంటకాల్లో ఎప్పటినుంచో విరివిగా ఉపయోగంలో ఉన్నాయి. వీటిని డ్రైఫ్రూట్స్‌గా కూడా వినియోగిస్తాం. డీకే పబ్లిషింగ్వారి ‘హీలింగ్ ఫుడ్స్’ పుస్తకం ప్రకారం వృద్ధాప్యం వల్ల కలిగే దృష్టిలోపాలను నివారించడంలో ఈ పండ్లు కీలకంగా వ్యవహరిస్తాయి. ఈ పండ్లలో బీటాకెరోటిన్ కంటెంట్ కూడా అధికమే. చదవండి: టీలో ‘తేనె’ కలిపి తాగుతున్నారా? స్లో పాయిజన్‌గా మారి..! రాగులు రాగుల్లో కంటి ఆరోగ్యానికి మేలు చేసే పోలీఫెనాల్స్ అధికంగా ఉంటాయని నూట్రీషనిస్ట్ శిల్సా ఆరోరా తెలిపారు. యాంటీ క్యాటెర్యాక్ట్ స్థాయిలు ఎక్కువ ఉండే పోలీఫెనాల్స్ కంట్లో శుక్లాలు ఏర్పడకుండా నిరోధిస్తుంది. అలాగే రక్తంలో షుగర్ స్థాయిలను నియంత్రించి డయాబెటిక్ ముప్పు నుంచి కాపాడటంలోనూ వీటి పాత్ర కీలకమైనదే. ఉసిరి మనకు అందుబాటులో ఉండో ఆహారాల్లో ఉసిరి ఒకటి. ఉసిరి రోగనిరోధకతను పెంచడమేకాకుండా దృష్టిలోపాలను నివారించడంలోనూ కీలకంగా వ్యవహరిస్తుందని ఆయుర్వేద నిపుణులు రామ్ ఎన్ కుమార్ సూచిస్తున్నారు. ఉసిరిలోని కెరోటిన్ కళ్లను ఆరోగ్యంగా ఉంచి మెరుగైన చూపుకు తోడ్పడుతుందని అనేక అధ్యయనాలు కూడా వెల్లడించాయి. శరీరంలోని వివిధ అవయవాల మాదిరిగానే కళ్ల ఆరోగ్యం కూడా ప్రధానమైనదే. కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడానికి ప్రతి యేటా అక్టోబర్‌లో వచ్చే రెండో గురువారాన్ని ప్రపంచ దృష్టి దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ఈ యేడాది అక్టోబర్ 14న జరుపుకునే ప్రపంచ దృష్టి దినోత్సవం సందర్భంగా నిపుణులు సూచించిన ఈ ఆహార అలవాట్ల ద్వారా నయనారోగ్యాన్ని పదిలంగా కపాడుకుందాం.. చదవండి: Helath Tips: కాఫీ తాగే అలవాటుందా? నిద్రలేమి, యాంగ్జైటీ, చిరాకు.. -
జామపండు.. ఆరోగ్య ఖజానా!!
Health Benefits of Guava fruit: వ్యాధినిరోధకతను సమకూర్చే ప్రాథమిక పోషకం ‘విటమిన్–సి’ అన్న విషయం మనందరికీ తెలిసిందే. అది కావాలంటే మనందరికీ గుర్తొచ్చే పండ్లు నిమ్మజాతికి చెందిన ఒకింత పుల్లటి–తియ్యటి పండ్లు. కానీ... నారింజలో ఉండే విటమిన్–సి కంటే కూడా జామ లో ఉండే ‘విటమిన్–సి’ యే ఎక్కువ. అందుకే జామపండు ఎన్నెన్నో వ్యాధుల నుంచి రక్షణ ఇస్తుంది. ఇందులో పొటాషియమ్ కూడా ఎక్కువ కాబట్టి రక్తపోటునూ సమర్థంగా నివారిస్తుంది. అంతేకాదు... టొమాటోలో ఉన్నట్లే జామలోనూ లైకోపిన్ మోతాదులు చాలా ఎక్కువేనంటూ యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పేర్కొంది. ‘లైకోపిన్’ అనే అద్భుత పోషకం... ప్రోస్టేట్ క్యాన్సర్‌తో పాటు అనేక రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. అంటే... లైకోపిన్ ఉన్నందున ఈసోఫేజియల్ క్యాన్సర్, పెద్దపేగు క్యాన్సర్లను నివారించడంలో జామ దోహదపడుతుంది. కాస్తంత ముగ్గిన జామపండులో పీచు (ఫైబర్) చాలా ఎక్కువ. దానివల్ల మలబద్దకం తేలిగ్గా నివారితమవుతుంది. అలా వేళకు విసర్జన జరిగే ఈ ఒక్క జీవనశైలి మంచి అలవాటు కారణం గా ఎన్నెన్నో రకాల జబ్బులు నివారితమవుతాయి. ఉజ్జాయింపుగా చూస్తే 100 గ్రాముల జామపండులో 300 మి.గ్రా. కండర నిర్మాణ సామర్థ్యం ఉంటుంది. ఇలా చూసినప్పుడు ఎదిగే పిల్లలకూ ఇది చాలా మంచిది. ఇలాంటి అనేక గుణాలున్నందున దీన్ని ఆరోగ్యానికి ఖజానాగా పిలిచినా అది అతిశయోక్తి కాబోదు. -
లింఫోమా అంటే ఏంటి?.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏవి?
Lymphoma disease Precautions: లింఫోమా అనేది రక్త సంబంధిత క్యాన్సర్లలో ఒకటి. తెల్ల రక్తకణాల్లో ఒక రకం కణాలైన లింఫోసైట్స్ ఉత్పత్తి చేసి, నిల్వ చేసి, ఆ తర్వాత వాటిని తరలించుకు వెళ్లే కణజాలాల్లో వచ్చే క్యాన్సర్ ఇది. దీనిలో ప్రాథమికంగా రెండు రకాలు ఉంటాయి. అవి... 1) హాడ్జ్కిన్స్ లింఫోమా 2) నాన్–హాడ్జ్కిన్స్ లింఫోమా. లక్షణాలు : ∙మెడలో, చంకలో, గజ్జల్లో వాపు వస్తుంది. ఆ వాపు నొప్పి లేకుండానే వస్తుంటుంది. ►ప్లీహం (స్ప్లీన్) పెరుగుతుంది. పొట్టలో నొప్పితో పాటు అసౌకర్యంగా ఉంటుంది. ►జ్వరంతో చలిగా అనిపించడం లేదా రాత్రిళ్లు చెమటలు పట్టడం, విపరీతమైన నిస్సత్తువ కనిపిస్తుంది. నిర్ధారణ పరీక్షలు : ∙రక్త పరీక్షలు ∙బయాప్సీ ∙ఎముక మూలుగ పరీక్ష ∙సెరిబ్రోస్పినల్ ఫ్లుయిడ్స్ పరీక్ష ∙మాలిక్యులార్ రోగ నిర్ధారణ పరీక్షలు ∙ఎక్స్‌రే, సీటీ స్కాన్, పెట్ స్కాన్ వంటి ఇమేజింగ్ పరీక్షలు చేయించాలి. వాటిని వైద్యులు క్షుణ్ణంగా పరీక్షించి, లింఫోమా ఉందా, ఉంటే అది ఏ దశలో ఉందనే విషయాన్ని తెలుసుకుంటారు. చికిత్స : ఒకసారి లింఫోమా ఉందని నిర్ధారణ అయ్యాక ఎలాంటి చికిత్స అందించాలన్న విషయం మూడు ప్రధాన అంశాలపై ఆధారపడి ఉంటుంది. ►బాధితుడికి ఉన్నది ఏ రకమైన లింఫోమా ∙దాని దశ (అంటే... లింఫోమా కారణంగా ఏయే అవయవాలు ప్రభావితమయ్యాయి) ∙బాధితుడి సాధారణ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది... అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని చికిత్స నిర్ణయిస్తారు. లింఫోమా తర్వాత... చికిత్స తీసుకుంటూనే బాధితులు కొన్ని జాగ్రత్తలతో వ్యాధి అనంతర జీవితాన్ని సాధ్యమైనంత ఆరోగ్యంగానే జీవించవచ్చు. అందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలివి. ►పుష్టికరమైన సమతులాహారం తీసుకోవాలి. అయితే అది ఒకేసారి ఎక్కువ పరిమాణంలో కాకుండా... సాధ్యమైనంత తక్కువ మోతాదుల్లో వీలైనన్ని ఎక్కువసార్లు తింటుండాలి. నోట్లో పుండులాంటిది ఏదైనా ఉంటే దాన్ని గాయపరచని రీతిలో మెత్తటి ఆహార పదార్థాలు తీసుకోవాలి. మసాలాలనూ, బత్తాయిరసాన్ని పూర్తిగా దూరంగా ఉంచాలి. అయితే మిగతా ద్రవాహారాలను పుష్కలంగా తీసుకోవడమే మంచిది. డాక్టర్ సలహా మేరకు తేలికపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలతో పాటు, శరీరానికి శ్రమ కలగని రీతిలో కొద్ది పాటి నడక వంటి ఎక్సర్సైజ్లు చేయాలి. ∙తగినంత విశ్రాంతి తీసుకుంటూ, కంటి నిండా నిద్రపోవాలి తాజా గాలి పీల్చాలి. ∙కుంగుబాటు (డిప్రెషన్)ను దరిచేరనివ్వకూడదు ఒకవేళ డిప్రెషన్‌తో బాధపడుతుంటే తప్పక డాక్టర్‌ను సంప్రదించాలి. ఒకసారి లింఫోమా ఉందని తేలాక బాధితులు ఆపైన... లిపిడ్లను, థైరాయిడ్, కాలేయం, మూత్రపిండాల పరీక్షలను క్రమం తప్పకుండా చేయించుకుంటూ ఉండాలి. అవి మాత్రమే కాదు... డాక్టర్ సూచన మేరకు మరికొన్ని పరీక్షలూ చేయించాల్సి ఉంటుంది. -
ఘుమఘుమలాడే బెంగాలీ రొయ్యల ఇగురు, క్యాబేజీ చికెన్.. ఎలా వండాలంటే..
మన దగ్గర చాలా మంది క్యాబేజీ తినడానికి పెద్దగా ఆసక్తి కనబరచరు. కానీ ఇతర దేశాల్లో ప్రతి సలాడ్లోనూ క్యాబేజీ ఉండాల్సిందే. దీనిలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. నారింజ పండులోకంటే క్యాబేజీలోనే విటమిన్ సీ అధికంగా ఉంటుంది. పీచుకూడా ఎక్కువే. ఇవేగాక సల్ఫర్, మెగ్నీషియం, బీటా కెరోటిన్, విటమిన్ కే, అయోడిన్, పొటాషియం, క్యాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి సైతం ఇది మంచి ఆహారం. ఇన్ని ప్రయోజనాలు ఉన్న క్యాబేజీని రుచికరంగా ఎలా వండుకోవచ్చో చూద్దాం... కావల్సిన పదార్థాలు: రొయ్యలు – పావు కేజీ, ఆవ నూనె – నాలుగు టేబుల్ స్పూన్లు, బంగాళ దుంప – ఒకటి (ముక్కలుగా తరగాలి), బిర్యానీ ఆకు – ఒకటి, జీలకర్ర – టీస్పూను, ఉల్లిపాయ ముక్కలు – అరకప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు – టేబుల్ స్పూను, పసుపు – టీస్పూను, కారం – రుచికి సరిపడా, టొమాటో – ఒకటి( సన్నగా తరగాలి), ఉప్పు – రుచికి సరిపడా, పంచదార – అర టీస్పూను, క్యాబేజీ తరుగు – నాలుగు కప్పులు ( ఉప్పునీళ్లల్లో అరగంటపాటు నానబెట్టుకోవాలి), గరం మసాలా పొడి – అరటీస్పూను. తయారీ విధారం: ►ముందుగా రొయ్యలను శుభ్రంగా కడిగి పసుపు, కొద్దిగా ఉప్ప వేసి కలిపి పదినిమిషాలపాటు నానబెట్టాలి. ►స్టవ్ మీద బాణలి పెట్టి అవనూనె వేసి వేడెక్కిన తరువాత నానబెట్టిన రొయ్యలు వేసి ఒక నిమిషంపాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►బంగాళ దుంప ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ►ఇదే పాన్‌లో జీలకర్ర, బిర్యానీ ఆకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►ఉల్లిపాయ వేగాక అల్లం వెల్లుల్లి పేస్టు, కొద్దిగా నీళ్లు పోసి పచి్చవాసన పోయేంత వరకు వేయించాలి. ►ఇప్పుడు పసుపు, జీలకర్ర పొడి, కారం, టొమాటో తరుగు, కొద్దిగా నీళ్లు పోసి ఐదు నిమిషాల సేపు మగ్గనివ్వాలి. ►ఇప్పుడు ముందుగా వేయించి పెట్టుకున్న బంగాళ దుంప ముక్కలు, రొయ్యలు, నానబెట్టిన క్యాబేజీ, రుచికి సరిపడా ఉప్పు వేసి ఒకసారి కలిపి మూతపెట్టి సన్నని మంటమీద ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించి, తరువాత గరం మసాలా పొడి చల్లితే బెంగాలీ రొయ్యల ఇగురు రెడీ. క్యాబేజీ చికెన్ ఎలా వండాలో తెలుసా! కావల్సిన పదార్థాలు: చికెన్ బ్రెస్ట్ ముక్కలు – అరకేజీ, ఉల్లిపాయ – ఒకటి (ముక్కలుగా తరగాలి), వెల్లుల్లి రెబ్బలు – మూడు (సన్నగా తురుముకోవాలి), ఆయిల్ – మూడు టేబుల్ స్పూన్లు, క్యాబేజీ తరుగు – ఐదు కప్పులు, ఎర్ర రంగు క్యాప్సికమ్ – ఒకటి( ముక్కలు చేయాలి), కొబ్బరి సాస్ – పావు కప్పు, తరిగిన అల్లం – అర టేబుల్ స్పూను, ఉప్పు – రుచికి సరిపడా, మిరియాల పొడి – రెండు టీస్పూన్లు, స్రింగ్ ఆనియన్ తరుగు – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ విధానం: ►ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడిక్కిన తరువాత వెల్లుల్లి తురుము, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగనివ్వాలి. ►తరువాత చికెన్ ముక్కలు వేసి గోల్డ్ కలర్లోకి వచ్చేంతవరకు వేయించాలి. ►చికెన్ వేగాక క్యాబేజీ తరుగు, క్యాప్సికమ్ ముక్కలు, కొబ్బరి సాస్, అల్లం, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి వేసి మూత పెట్టి నూనె పైకి తేలేంత వరకు మగ్గనిస్తే క్యాబేజీ చికెన్ రెడీ. -
Vitamin C: తక్కువైతే తంటా.. ఎక్కువైతే మంట!
కరోనా వైరస్ మహమ్మారి ఎంతో మందిని బలి తీసుకుంటోంది. పైగా వైరస్‌లో కొత్త వేరియంట్స్ పుట్టుకొస్తూ మనిషికి కునుకు లేకుండా చేస్తోంది. కేసులు తగ్గినంత మాత్రాన అశ్రద్ధ ఉండొద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఏదైనా తేడా అనిపిస్తే వెంటనే అప్రమత్తం అవుతున్నాయి. ఈ సమయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం వంటి కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఉండాలని అంటున్నారు. ఇక వీటితోపాటు వ్యాయామం చేస్తూ.. సరైన పోషకాలు శరీరానికి అందేలా చూసుకోవాలి. అయితే విటమిన్-సీ.. మనలో రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. రకరకాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది. మరి విటమిన్-సీ వల్ల కలిగే ప్రయోజనాలు.. నష్టాలను ఓసారి తెలుసుకుందాం. హృదయం పదిలం: గుండె జబ్బులు పెరగడానికి ప్రదాన కారణం అధిక బరువు. చెడు కొలెస్ట్రాల్ స్థాయి పెరిగి అది క్రమంగా వివిధ రకాల జబ్బులకు దారి తీస్తుంది. అయితే విటమిన్ సి తీసుకుంటే బరువును నియంత్రిస్తుందని పలు పరిశోధనలు పేర్కొంటున్నాయి. ఇది గుండె జబ్బులను అరికడుతుందని నిపుణులు అంటున్నారు. బరువు పెరిగే వారికి సహజంగానే పొట్ట వస్తుంది. పొట్ట పెరుగుతూ ఉంటే... బరువు కూడా పెరుగుతారు. దీనంతటికీ కారణం... బాడీలో సరిపడా విటమిన్-సీ లేకపోవడమే అంటున్నారు పరిశోధకులు. జ్ఞాపకశక్తికి శ్రీరామ రక్ష: మెదడు, వెన్నెముక, నరాల దగ్గర ఉన్న ఆక్సీకరణ ఒత్తిడి జ్ఞాపకశక్తి లోపాలను పెంచుతుంది. విటమిన్-సీ బలమైన యాంటీ ఆక్సిడెంట్ కావడం వల్ల మెదడు ఆలోచన, జ్ఞాపకశక్తి సామర్థ్యాన్ని పెంపొదిస్తుందని పోషకాహార నిపుణులు అంటున్నారు. ఐరన్ లోపం నియంత్రణ: ఐరన్ ఒంట్లో తగినంత లేకపోతే శరీరం చతికిల పడిపోతుంది. హిమోగ్లోబిన్, మయోగ్లోబిన్ అనే ప్రోటీన్ల తయారీకిది అత్యంత అవసరం. హార్మోన్లు, కండర బంధనాలు, ఇతర అనుసంధాన కణజాలాల తయారీకి సైతం ఐరన్ తోడ్పడుతుంది. అయితే విటమిన్ సీ ఉండే ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఐరన్ లోపం నుంచి బయటపడవచ్చని నిపుణలు పేర్కొంటున్నారు. గౌట్ వ్యాధికి అడ్డుకట్ట: రక్తంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్నప్పుడు గౌట్ వ్యాధి సంభవిస్తుంది. ఈ యాసిడ్ కీళ్ళ మధ్యలో సూది వంటి స్పటికాలను ఏర్పరుస్తుంది. దీంతో ఆ ప్రాంతం ఎరుపెక్కడం, తీవ్రమైన నొప్పి, కీళ్ళవాపులకు కారణమవుతుంది. ఈ గౌట్ వ్యాధి ఎక్కువగా కాలి పెద్ద బొటనవేలు దగ్గర సంభవిస్తుంది. అలాగే చేతివేళ్ళు, మణికట్టు, మోకాళ్లలో కూడా సంభవించవచ్చు. కాగా, విటమిన్ సి యూరిక్ ఆమ్లం రక్త స్థాయిలను తగ్గించి, గౌట్ వ్యాధి ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడుతుందని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. వాయు కాలుష్యం వల్ల కలిగే హానికరమైన ప్రభావాలకు చెక్: బహిరంగ ప్రదేశాల్లో వాయు కాలుష్యం ఉబ్బసం వంటి అనేక శ్వాస సంబంధిత సమస్యలను కలిగిస్తుంది. అయితే విటమిన్-సీ యాంటీ ఆక్సిడెంట్స్‌గా మారి ఫ్రీ రాడికల్స్ అని పిలిచే హానికరమైన అణువుల నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. వాయు కాలుష్యం ఊపిరితిత్తులలోకి ప్రవేశించినప్పుడు గుండె జబ్బులు, క్యాన్సర్, శ్వాసకోశ వ్యాధులకు దారి తీస్తుంది. అయితే యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్‌ను బంధించి వాటితో పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. విటమిన్-సీ దుష్ప్రభావాలు: ఏదైనా తక్కువగా తీసుకోవడం, అధికంగా తీసుకోవడం రెండూ హానికరమే. విటమిన్-సీ అధికంగా ఉండటం వల్ల వికారం, వాంతులు, విరేచనాలు, కడుపు నొప్పి, ఛాతీలో మంట, తలనొప్పి, నిద్రలేమి వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. విటమిన్-సీ ని అధికంగా తీసుకుంటే జీర్ణ సమస్యలకు దారి తీస్తుంది. అంతే కాకుండా విటమిన్ సీ ఐరన్‌ను పెంచుతుంది. కాబట్టి ఇది ఎక్కువైతే హిమోక్రోమాటోసిస్ అనే వ్యాధి బారిన పడే అవకాశం ఉంటుంది. ఇక విటమిన్-సీ శరీరం నుంచి మూత్రం ద్వారా ఆక్సలేట్ గా విసర్జించబడుతుంది. కొన్ని పరిస్థితులలో, ఆక్సలేట్ ఖనిజాలతో బంధించి, మూత్రపిండాల్లో రాళ్లు వచ్చే స్ఫటికాలను ఏర్పరుస్తుందని పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు. శరీరానికి “విటమిన్-సీ” ఎంత అవసరం నిపుణుల అభిప్రాయం ప్రకారం రోజూ 65 నుంచి 90 మీ.గ్రా.ల విటమిన్-సీ తీసుకుంటే సరిపోతుంది. కాని మనం 1000 మి.గ్రా కంటే ఎక్కువగా విటమిన్-సీ తీసుకుంటే అది మన ఆరోగ్యానికి హానికరంగా మారుతుంది. సాధారణంగా మహిళలు విటమిన్-సీ 75 మి.గ్రా, పురుషులకు 90 మి.గ్రా, గర్భిణీ స్త్రీలకు 85 మి.గ్రా, పాలిచ్చే మహిళలకు 120 మి.గ్రా సరిపోతుంది. విటమిన్-సీ ఎలా లభిస్తుంది విటమిన్-సీ… నారింజ, కివి, ఆకుపచ్చ మిరపకాయ, అరటి, బ్రోకలీ, స్ట్రాబెర్రీ, బచ్చలికూర, బొప్పాయి, పైనాపిల్, నిమ్మ, ఉసిరి, మామిడి మొదలైన వాటిలో పుష్కలంగా లభిస్తుంది. చదవండి: మీకు తెలుసా.. డయాబెటీస్ పేషెంట్లకు ప్రత్యేక మామిడి పండ్లు Amla: విటమిన్ ఉసిరి.. ఎన్నెన్నో ఉపయోగాలు -
Amla: విటమిన్ ఉసిరి.. ఎన్నెన్నో ఉపయోగాలు
సాక్షి, అమరావతి: వ్యాధి నిరోధక శక్తిని పెంపొందించటంలో ఉసిరి అద్భుతంగా పని చేస్తుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. కరోనా బారిన పడినవారికి తొలి రోజు నుంచి కోలుకునేంత వరకు వాడే మందుల జాబితాలో ‘సీ’తో పాటు పలు విటమిన్ల టాబ్లెట్లు ఉంటున్నాయి. వీటిలో ప్రధానమైన సీ విటమిన్ కోసం టాబ్లెట్ వాడటం కన్నా ఉసిరి కాయను నేరుగా లేదా పొడి రూపంలో తీసుకుంటే మేలని సలహా ఇస్తున్నారు. అందువల్లే ఉసిరికి ప్రపంచ దేశాల్లో గిరాకీ పెరిగింది. రాష్ట్రంలో విరివిగా లభించే ఉసిరి కాయలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. ఇది వైరస్‌లను నివారిస్తుంది. గుండె జబ్బులు, అధిక రక్తపోటు, రక్త కణాల హీనతను తగ్గించడంతో పాటు జీర్ణశక్తిని పెంచుతుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఇదొక బూస్టర్‌గా పని చేస్తుందని డాక్టర్ జి.భార్గవ్ వివరించారు. ఉసిరితో ఉపయోగాలు విటమిన్ సీ,¯ కాల్షియం, ఫాస్పరస్, ఐరన్, కెరోటిన్, బీ–కాంప్లెక్స్‌తోపాటు ఇతర విటమిన్లు, ఖనిజాలు ఉసిరిలో ఎక్కువ. చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు ఉసిరి దివ్య ఔషధంగా పేర్కొంటున్నారు. ఇందులో ఉండే క్రోమియం చక్కెర వ్యాధిని అదుపులో ఉంచేందుకు తోడ్పడుతుంది. గుండె కవాటాలు మూసుకుపోకుండా క్రోమియం నివారిస్తుంది. ఆయుర్వేదంలో ఉసిరి వినియోగం చాలా ఎక్కువ. చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. మార్కెట్లో ఉసిరి కాయలతోపాటు పొడి, మాత్రల రూపంలోనూ లభిస్తోంది. తేనెతో కలిపి ఉసిరిని తీసుకుంటే ఆస్తమా, శ్వాసకోశ సమస్యలను దూరం చేసుకోవచ్చు. రాష్ట్రంలో 11,982 టన్నుల ఉత్పత్తి ఉద్యాన శాఖ అంచనా ప్రకారం రాష్ట్రంలో 13,336 ఎకరాల్లో ఉసిరి పంట సాగవుతోంది. ఏటా దిగుబడి 11,982 టన్నుల వరకు ఉంది. ఒకప్పుడు శీతాకాలంలో మాత్రమే దొరికే ఉసిరి కాయలు ఇప్పుడు అన్ని కాలాలలోనూ లభిస్తున్నాయి. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, జర్మనీ, కెనడా, దక్షిణ కొరియా, హాంకాంగ్, మలేషియా, ఫ్రాన్స్, లెబనాన్, స్విట్జర్లాండ్, స్వీడన్, జపాన్, నార్వే, డెన్మార్క్, చెక్ రిపబ్లిక్, ఆస్ట్రియా తదితర దేశాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతోంది. దివ్య ఔషధమే ప్రస్తుత కరోనా కాలంలో ప్రజలకు ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. సహజ సిద్ధంగా దొరికే పండ్లు, కాయలు, సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులపై ఆసక్తి పెరిగింది. అందుకే ప్రత్యామ్నాయ వైద్య పద్ధతులను పాటిస్తున్నారు. అందులో భాగంగానే జనం ఇటీవల కాలంలో ఉసిరి ఉత్పత్తులను ఎక్కువగా వాడుతున్నారు. ఉసిరి కచ్చితంగా రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అనేక వ్యాధులను నయం చేస్తుంది. – డాక్టర్ కె.అప్పారావు, ఆయుర్వేద వైద్య నిపుణులు చదవండి: సపోటా పండు తింటే ఇన్ని లాభాలా! -
అమ్మ నా ‘బత్తాయో’..! ధర అంతేంటి?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో రోగ నిరోధక శక్తిని పెంచుకునేందుకు విటమిన్-సీ అధికంగా ఉండే పండ్ల వినియోగానికి డిమాండ్ పెరగడంతో బత్తాయి పండ్లకు గిరాకీ పెరిగింది. దేశవ్యాప్తంగా కరోనా విస్తృతి నేపథ్యంలో ఇతర రాష్ట్రాల నుంచి సైతం వ్యాపారులు ఇక్కడికే వచ్చి రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేస్తుండటంతో బహిరంగ మార్కెట్లకు బత్తాయి రాక తగ్గింది. ఒక్క కొత్తపేట పండ్ల మార్కెట్‌కే కనీసంగా రోజుకు 300 టన్నుల మేర బత్తాయి సరఫరా తగ్గింది. దీంతో రాష్ట్ర మార్కెట్లో డిమాండ్‌కు తగ్గ సరఫరా లేక ధర అమాంతం పెరుగుతోంది. గత ఏడాది ఇదే సమయానికి కిలో రూ.20 నుంచి రూ.30 పలకగా, ఇప్పుడది ఏకంగా రూ.70కి చేరి సామాన్యులకు చుక్కలు చూపిస్తోంది. పొరుగు నుంచి ఎగబడ్డ వ్యాపారులు రాష్ట్రంలో రోజుకు ఐదు వేలకుపైగా కోవిడ్ కేసులు నమోదవుతుండగా, ఆస్పత్రులన్నీ రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు సామాన్యులు సైతం ప్రతిరోజూ 500 మిల్లీగ్రామ్ల విటమిన్–సీ పండ్లను రోజువారీ ఆహారంగా తీసుకోవాలని, దీనిద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో సిట్రిక్ ఆమ్లం అధికంగా ఉండే బత్తాయి వైపు సామాన్యులు ఎగబడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా బత్తాయికి డిమాండ్ పెరిగింది. రాష్ట్రంలో నల్లగొండ జిల్లాలో బత్తాయి సాగు ఎక్కువగా ఉండటంతో వ్యాపారులు నేరుగా రైతుల పంటల వద్దకే వెళ్లి కొనుగోళ్లు చేస్తున్నారు. వ్యాపారులే కోతలు చేసి, ప్యాకేజింగ్, రవాణా, లోడింగ్ ఇలా అన్నీ సొంత ఖర్చులతో కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు వీరికి అమ్ముకునేందుకు మొగ్గుచూపుతున్నారు. ఎక్కువగా ఢిల్లీ, హరియాణా, కోల్‌కతాతోపాటు రాజస్తాన్ నుంచి వ్యాపారులు టన్నుకు రూ.35 వేల నుంచి 40 వేలకు కొనుగోలు చేస్తున్నారు. బయటి రాష్ట్రాలకే ఎక్కువగా ఎగుమతి అవుతుండటంతో హైదరాబాద్ మార్కెట్‌కు బత్తాయి రాక తగ్గిపోయింది. ముఖ్యంగా కొత్తపేట పండ్ల మార్కెట్‌కు దీని సరఫరా తగ్గింది. ప్రతి ఏటా కొత్తపేట మార్కెట్‌కు రోజుకు 500–600 టన్నుల మేర బత్తాయి రాగా, ఈ ఏడాది కేవలం 100–125 టన్నులు మాత్రమే వస్తోంది. ఇది మార్కెట్ అవసరాలను ఏమాత్రం తీర్చడం లేదు. వచ్చిన కొద్దిపాటి బత్తాయిని వ్యాపారులు హోల్‌సేల్‌లో టన్నుకు రూ.40 వేల నుంచి 50వేల వరకు కొనుగోలు చేస్తున్నారు. అంటే కిలో రూ.40–50 వరకు ఉంది. ఇది గత ఏడాది ధరలతో పోలిస్తే రూ.20 అధికం. ఇదే బత్తాయిని బహిరంగ మార్కెట్‌కు వచ్చే సరికి రూ.70 వరకు కొనుగోలుదారులకు విక్రయిస్తున్నారు. దీంతో సామాన్యులు బెంబేలెత్తుతున్నారు. నిమ్మ, కివీ సైతం... ఇక సీ-విటమిన్ అధికంగా ఉండే నిమ్మకాయలకు చెప్పలేనంత డిమాండ్ ఉంది. గతంలో బహిరంగ మార్కెట్లలో రూ.10కి 3 నిమ్మకాయలు విక్రయించగా, ప్రస్తుతం ఒక్క నిమ్మకాయే అమ్ముతున్నారు. సీ-విటమిన్‌కు ఉన్న డిమాండ్ నేపథ్యంలో కివీ పండ్ల ధరలు సైతం అమాంతం పెరిగాయి. గత ఏడాది 24 పండ్లు ఉండే ఒక్క బాక్స్ ధర రూ.వెయ్యి పలుకగా, ప్రస్తుతం రూ.3 వేలకు చేరింది. రోజుకు కొత్తపేట మార్కెట్‌కు వెయ్యి బాక్స్‌ల వరకు రాగా, ఇప్పుడది 500 నుంచి 600 బాక్స్‌లకు తగ్గింది. దీంతో అటు పండ్ల లభ్యత లేక.. ఇటు అధిక ధరలకు పండ్లు కొనలేక వినియోగదారులు సతమతమవుతున్నారు. చదవండి: కరోనా ఎంతున్నా ఎన్నికలు జరుపుతాం చదవండి: ఉత్సవంతో వచ్చిన కరోనా.. అటవీ గ్రామాల్లో కల్లోలం -
‘పండు’ గగనమే..
సాక్షి, సిటీబ్యూరో: ఎలాంటి వైరస్‌నైనా ఎదుర్కోవాలంటే శరీరంలో రోగ నిరోధకశక్తి పుష్కలంగా ఉండాలి. కరోనా మహమ్మారిని సైతం సమర్ధవంతంగా తిప్పికొట్టేందుకు ఆ శక్తే ఎంతో కీలకమైనది. వైద్యులు, పోషకాహారనిపుణులే కాకుండా ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు విటమిన్–సి ఉన్న పండ్లు తినాలని చెప్పారు. కానీ లాక్డౌన్ కారణంగా ఆ పండ్లు ఇప్పుడు ప్రజలకు దూరమయ్యాయి.కొత్తపేట పండ్ల మార్కెట్లో గుట్టలకొద్దీ బత్తాయిలు, సంత్రాలు, బొప్పాయి, దానిమ్మ వంటి పండ్లు ఉన్నప్పటికీ రిటైల్ పండ్ల మార్కెట్లు స్తంభించిపోవడంతో సామాన్యులు పండ్లు కొనుక్కోలేని పరిస్థితి నెలకొంది. కొత్తపేట పండ్ల మార్కెట్లో ప్రస్తుతం 50 టన్నులకు పైగా బత్తాయి, సంత్రా, దానిమ్మ, తదితర పండ్లు ఉన్నట్లు మార్కెటింగ్‌శాఖ అధికారులు తెలిపారు. నల్లగొండ, మహబూబ్‌నగర్‌ల నుంచి ప్రతి రోజు లారీల్లో బత్తాయిలు మార్కెట్‌కు చేరుతున్నాయి. అలాగే నాగ్‌పూర్ నుంచి సంత్రాలు వస్తున్నాయి. కానీ కొద్ది రోజులుగా రిటైల్ విక్రయాలు నిలిచిపోవడంతో వివిధ ప్రాంతాల నుంచి నగరానికి వచ్చే పండ్ల దిగుమతులను కూడా తగ్గించారు. ఇప్పటికే టన్నుల కొద్దీ నిల్వ ఉండడం వల్ల కొత్తగా వచ్చే పండ్లను తగ్గించినట్లు పేర్కొన్నారు. కూరగాయల తరహాలో విక్రయించాలి... లాక్డౌన్ నేపథ్యంలో నగరంలో నిత్యావసర వస్తువులకు, కూరగాయలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. రైతుబజార్లు, ప్రధాన మార్కెట్ల నుంచి కాలనీలకు, అపార్ట్మెంట్లకు సరఫరా చేసేందుకు 150 సంచార రైతుబజార్లను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు. ఇదే తరహాలో విటమిన్– సి పుష్కలంగా లభించే బత్తాయి, సంత్రాలు, దానిమ్మ, బొప్పాయి వంటి పండ్లను కూడా ప్రజలకు అందుబాటులోకి తెస్తే వాటి వినియోగం పెరుగుతుంది. ప్రస్తుత కరోనా వ్యాప్తి దృష్ట్యా రోగనిరోధకశక్తిని పెంచుకొనేందుకు అవకాశం లభిస్తుంది. సంచార వాహనాల ద్వారా సమీప కాలనీల వద్దనే కూరగాయలు కొనుగోలు చేయగలుగుతున్నారు. అదేవిధంగా పండ్లను అందుబాటులోకి తీసుకురావడం మంచిదని పోషకాహార నిపుణులు సైతం సూచిస్తున్నారు. ఆహారంలో పండ్లు భాగమవ్వాలి : నిమ్మజాతి ఫలాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది. ఒక మనిషి రోజుకు ఒక బత్తాయి, సంత్రా, జామ పండ్లలో ఏదో ఒకటి తప్పనిసరిగా తీసుకోవాలి, కనీసం 100 గ్రాముల ఫలాలు ఆహారంలో భాగంగా ఉండాలి. అంతకంటే ఎక్కువ తీసుకున్నా మంచిదే.కానీ తగ్గకూడదు. నిమ్మ, ఉసిరి వివిధ రూపాల్లో తీసుకోవడం మంచిది. అలాగే 30 గ్రాముల డ్రైఫ్రూట్స్ 100 గ్రాముల ఆకుకూరలు, 200 గ్రాముల కూరగాయలు, 80 గ్రాముల పప్పులు, భోజనంలో ఉండేలా చూసుకోవాలి. 300 గ్రాముల ఆహారం తీసుకోవాలి. వ్యాయామం, నడక సరే సరి. ఇలా చేయడం వల్ల రోగనిరోధకశక్తి పెరుగుతుంది.-ప్రొఫెసర్ దమయంతి,రిటైర్డ్ సైంటిస్ట్ ,ఎన్ఐఎన్ -
స్వీటాఫలం
ఇటీవల మార్కెట్లోకి సీతాఫలాలు విరివిగా వస్తున్నాయి. ఎంతో తియ్యగా ఈ పండుతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఎన్నెన్నో. అసలే చలి సీజన్లో ఈ పండు తింటే మరింత ఎక్కువగా జలుబు చేస్తుందని కొందరు ఈ పండును తినడానికి పెద్దగా ఇష్టపడరు. కానీ వేసవిలో దొరికే మామిడి వేడిచేస్తుందన్నా, శీతకాలంలో దొరికే సీతాఫలాలు జలుబు చేస్తాయన్నా... ఏ సీజన్లో దొరికే పండ్లను ఆ సీజన్లో తినాల్సిందే. సీతాఫలంతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలను తెలుసుకుంటే ‘జలుబూ–గిలుబూ జాన్తానై’ అంటూ ఆ అపోహలన్నీ పక్కనబెట్టి తప్పక తినేస్తారు. సీతాఫలంతో మనకు సమకూరే ప్రయోజనాల్లో ఇవి కొన్ని మాత్రమే. ►సీతాఫలంలో అనేక రకాల యాంటీఆక్సిడెంట్స్, విటమిన్–సి వంటివి కలిసి శరీరానికి రోగనిరోధక శక్తిని ఇస్తాయి. ఫలితంగా ఈ పండు ఎన్నో రకాల జబ్బులను నివారిస్తుంది. సీతాఫలంలోని యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా అది ఎన్నో రకాల క్యాన్సర్లను నివారిస్తుంది. ►సీతాఫలంలో పొటాషియమ్ చాలా ఎక్కువ. అందుకే... అధిక రక్తపోటు (హైబీపీ) ఉన్నవారు ఈ పండును తింటే... రక్తపోటును అదుపులో ఉంటుంది. ►రక్తహీనత ఉన్నవారికి సీతాఫలం చాలా మంచిది. ఇందులో ఐరన్, కాపర్ పుష్కలంగా ఉంటాయి. అవి రక్తహీనత (అనిమియా)ను సమర్థంగా అరికడతాయి. ►సీతాఫలాల్లోని విటమిన్–ఏ వల్ల జుట్టు ఆరోగ్యకరంగా మెరుస్తూ ఉండటంతో పాటు, మేనికి మంచి నిగారింపు వస్తుంది. ఇలా జుట్టు బాగా పెరగడానికి సీతాఫలంలోని ఐరన్ ఉపకరిస్తుంది. ►సీతాఫలంలో పీచు చాలా ఎక్కువ. ఈ పీచుతో పాటు ఇందులోని కాపర్ కలిసి మలబద్దకం వంటి సమస్యను నివారిస్తాయి. ఈ పండులోని పీచు పదార్థాలు జీర్ణవ్యవస్థ ఆరోగ్యాన్ని మెరుగుపరిచి, జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చూస్తాయి. ►ఇందులో ఉండే మెగ్నీషియమ్ రక్తప్రవాహాన్ని మెరుగుపరుస్తుంది. ఫలితంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ►సీతాఫలం కీళ్లవాతాన్ని (రుమాటిజమ్)నూ, ఆర్థరైటిస్ వంటి ఎముకల సమస్యలనూ నివారిస్తుంది. ►ఈ పండు కండరాల బలహీనతను తగ్గిస్తుంది. చురుగ్గా ఉంచుతుంది. ►సీతాఫలం డిప్రెషన్‌ను తగ్గిస్తుంది.