Bottle Gourd Juice: Top 10 Amazing Health Benefits in Telugu - Sakshi
Sakshi News home page

Bottle Gourd Juice: సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్‌ చేసుకుంటే అద్భుత ఫలితాలు! జ్యూస్‌ అస్సలు వదలరు!

Published Sun, Dec 5 2021 2:03 PM | Last Updated on Sun, Dec 5 2021 6:09 PM

Bottle Gourd Juice: Top 10 Amazing Health Benefits In Telugu - Sakshi

Bottle Gourd Juice: Top 10 Amazing Health Benefits In Telugu: ఈ డిజిటల్‌ యుగంలో ‘నేను సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాను’ అని చెప్పగలిగినది ఎంత మంది? నూటికి అరవై మంది సరైన నిద్రకు దూరమయ్యారు. కలత నిద్ర కారణంగా మరుసటి రోజు పనిలో నాణ్యత తగ్గుతుంటుంది. కౌమారదశలోనే తెల్లజుట్టు పరిహసిస్తోంది. తింటే అజీర్తి, తినకపోతే ఎసిడిటీ. ఉరుకుల పరుగుల జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు తప్పని జంక్‌ఫుడ్‌. ఆ జంక్‌ఫుడ్‌ కారణంగా వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను నింపుకుని దేహం బద్ధకంగా రోజులు వెళ్లదీస్తుంటుంది.

దీనికితోడు వృత్తి, వ్యాపారాల కారణంగా తప్పనిసరి అవుతున్న మానసిక ఒత్తిడి. ఈ స్థితి నుంచి కళ్లు తెరిచేలోపే రక్తప్రసరణ వేగం పెరిగిపోయి ఉంటుంది. మొత్తానికి ఈ దుష్ప్రభావాలన్నింటినీ గుండె లయ మారుతుంటుంది. ఇన్నింటినీ దూరం చేయగలిగిన ఆహారం మన పెరట్లోనే పండుతుంది. పెరడు లేకపోతే కూరగాయల మార్కెట్‌లో దొరుకుతుంది. అదే సొరకాయ.

సొరకాయ పీచు, నీటితో నిండిన కూరగాయ. ఇందులో ఐరన్, పొటాషియంతోపాటు విటమిన్‌లు కూడా ఉంటాయి.
సొరకాయ రసం తాగడం వల్ల సంపూర్ణ ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. సలాడ్, కూర, హల్వా చేసుకుని కూడా తినవచ్చు.
సొరకాయ తింటే... మంచి నిద్రపడుతుంది. 
జుట్టు తెల్లబడిన టీనేజ్‌ పిల్లలు రోజూ ఒక గ్లాసు రసం తాగితే జుట్టు ఆరోగ్యంగా మారుతుంది. తిరిగి పూర్వపు స్థితికి వస్తుంది. 
ఎసిడిటీ తగ్గుతుంది. జీర్ణక్రియ సక్రమమవుతుంది.
చదవండి: Betel Leaves: తమలపాకులు నములుతున్నారా.. అయితే మీరు...


దేహంలో వృద్ధి చెందిన విషపూరిత వ్యర్థాలను తొలగించడంలో సమర్థంగా పని చేస్తుంది.
ఇందులో సహజసిద్ధంగా ఉన్న మత్తు కలిగించే గుణం వల్ల  మానసిక ఒత్తిడి తగ్గడంతోపాటు అలసిన దేహం సాంత్వన పొందుతుంది కూడా.
హైబీపీ ఉన్న వాళ్లు వారానికి మూడుదఫాలు ఈ రసం తాగితే రక్తప్రసరణ అదుపులోకి వస్తుంది.
గుండె ఆరోగ్యం మెరుగవుతుంది. బరువు తగ్గడానికి కూడా దోహదం చేస్తుంది.
ఇది సొరకాయలు పండే కాలం. హైబీపీ ఉన్న వాళ్లు ఒకరోజు సొరకాయ తిని మరుసటి రోజు బీపీ చెక్‌ చేసుకుంటే ఫలితం కళ్ల ముందు కనిపించి తీరుతుంది.
బాటిల్‌ గార్డ్‌ బీపీ గార్డ్‌ అని కూడా నిర్ధరణ అవుతుంది.

చదవండి: Health Tips: రోజూ నిమ్మకాయ పులిహోర, ఎండు ద్రాక్ష, ఖర్జూర తింటున్నారా!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement