Summer Drink- Maredu Juice: మారేడు జ్యూస్ శరీరంలోని టాక్సిన్‌లను బయటకు పంపి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్‌లోని టానిన్, పెక్టిన్‌లు డయేరియాను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రపోషిస్తాయి.
విటమిన్ సీ, క్యాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్, ఐరన్‌లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వెంటనే దాహార్తి తీరాలంటే మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ఈ సమ్మర్ డ్రింక్‌ను తయారుచేసుకోండి.
మారేడు జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు:
పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా.
మారేడు జ్యూస్ తయారీ ఇలా:
►ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి.
►తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్‌ను పిండుకోవాలి.
►జ్యూస్‌ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి.
►దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి.
►చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకోవాలి.
చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment