Summer Drinks
-
Summer Drinks: కొకుమ్ జ్యూస్.. వేసవిలో భోజనం తర్వాత తాగితే!
Summer Drink- Kokum Solkadhi Juice: కొంకణి కూరల్లో పులుపు కోసం వాడే ప్రధాన పదార్థం కొకుమ్. వేసవిలో భోజనం తరువాత ఈ జ్యూస్‌ను తప్పని సరిగా తాగుతారు . ఇది ఆకలిని నియంత్రించి, అధిక బరువుని తగ్గిస్తుంది జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి, గ్యాస్ ఎసిడిటీ సమస్యలను దరిచేరనియ్యదు. దీనిలోని యాంటీఆక్సిడెంట్స్ చర్మ ఆరోగ్యాన్ని పరిరక్షిస్తాయి. ఈ జ్యూస్ శరీరానికి సహజ సిద్ధమైన చల్లదనాన్ని అందిస్తుంది. కొకుమ్ (సొల్కది) జ్యూస్ తయారీకి కావలసినవి: ►ఎండు కొకుమ్స్ – 12 ►చిక్కటి కొబ్బరి పాలు – ఒకటిన్నర కప్పులు ►కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా ►నూనె – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు ►ఆవాలు – టీస్పూను ►జీలకర్ర – టీస్పూను ►కరివేపాకు – ఒక రెమ్మ ►ఇంగువ – చిటికెడు ►వెల్లుల్లి రెబ్బలు – రెండు. తయారీ: ►కొకుమ్స్ను శుభ్రంగా కడిగి, కప్పు నీటిలో అరగంటపాటు నానబెట్టుకోవాలి ►అరగంట తరువాత కొకుమ్స్ను బాగా పిసకాలి. తరువాత వడగట్టి రసాన్ని వేరు చేయాలి ►ఇప్పుడు ఈ రసానికి రెండు కప్పులు నీళ్లు, కొబ్బరి పాలు, రుచికి సరిపడా ఉప్పువేసి కలిపి పక్కనపెట్టుకోవాలి ►బాణలిలో ఆయిల్ వేడెక్కిన తరువాత ఆవాలు, జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి ►ఇప్పుడు ఇంగువ కరివేపాకు, వెల్లుల్లిని దంచి వేయాలి ►ఇవన్నీ వేగాక కొకుమ్ జ్యూస్‌లో కలిపి, రెండు గంటల పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టాలి ►చల్లబడిన జ్యూస్‌లో చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. ఇది కూడా ట్రై చేయండి: Pineapple- Keera: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల! -
Health: పైనాపిల్ కీరా జ్యూస్ తాగుతున్నారా.. దీనిలోని బ్రోమెలైన్ అనే ఎంజైమ్ వల్ల!
Summer Drinks- Pineapple Keera Juice: పైనాపిల్, కీరా ముక్కల్లో విటమిన్ సి, ఐరన్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రెండు చర్మాన్ని పొడిబారనియకుండా కాపాడతాయి. విటమిన్ సి ప్రోటిన్‌తో కలిసి ముఖం మీద ముడతలు రాకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. సెబేసియస్ గ్రంథుల పనితీరు మెరుగుపడి, చర్మం తేమగా ఉంటుంది. వీటిని కలిపి తయారు చేసిన జ్యూస్‌లో బ్రోమెలైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది యాంటీఇన్ఫ్లమేటరి విధులను నిర్వహిస్తుంది. క్యాన్సర్ కణాల పెరుగుదలను నియంత్రిస్తుంది. తరచూ ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాన్సర్ ముప్పు కూడా తగ్గుతుంది. పొటాషియం, ఫాస్ఫరస్, మెగ్నీషియంలు ఉండడం వల్ల రక్త పీడనం నియంత్రణలో ఉంటుంది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీకి కావలసినవి: ►పైనాపిల్ ముక్కలు – ఒకటింబావు కప్పులు ►కీర దోసకాయ ముక్కలు – కప్పు ►యాపిల్ ముక్కలు – అరకప్పు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు ►నిమ్మరసం – రెండు టేబుల్ స్పూన్లు ►ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. పైనాపిల్ కీరా జ్యూస్ తయారీ: ►కీరా, యాపిల్ ముక్కలను తొక్కతీయకుండా తీసుకోవాలి. ►పైనాపిల్, కీరా, యాపిల్ ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ మెత్తగా అయ్యాక జ్యూస్‌ను గ్లాసులో వడగట్టుకోవాలి. ►వడగట్టిన జ్యూస్‌లో నిమ్మరసం, తేనె వేసి కలపాలి. ∙ ►చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
Health Tips: పనసతొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకుంటే..
Jackfruit Surprising Health Benefits: పనసలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, టైప్ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. ►పనస తొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ►పనస జ్యూస్ తాగినప్పుడు పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు. ►ఫలితంగా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ►విటమిన్ సి, ఈ, లారిక్ యాసిడ్లలోని యాంటీసెప్టిక్ గుణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు. ►కొబ్బరిపాలు, బెల్లంలలో కావల్సినంత ఐరన్ ఉంటుంది. ►దీని జ్యూస్ తాగడంవల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరగి రక్త హీనత సమస్య ఎదురవదు. ►జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపపడుతుంది. ►చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్ షేక్‌కు కావలసినవి: ►గింజలు తీసిన పనస తొనలు – రెండు కప్పులు ►చిక్కటి కొబ్బరి పాలు – కప్పున్నర ►బెల్లం తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు ►నీళ్లు – అరకప్పు, ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. తయారీ... ►పనస తొనలను సన్నగా తరిగి బ్లెండర్లో వేయాలి ►తొనలకు బెల్లం, కొబ్బరిపాలను జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి ►మెత్తగా నలిగిన తరువాత ఐస్ క్యూబ్స్, అర కప్పు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►అన్నీ చక్కగా గ్రైండ్ అయ్యాక వెంటనే గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే..
Summer Drinks: Apple Blueberry Juice: యాపిల్ నేరేడు జ్యూస్‌లో పీచుపదార్థంతోపాటు విటమిన్ సి, విటమిన్ ఏ ఇంకా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, గ్లూకోజ్, ప్రోటిన్ పోషకాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్స్, ఫ్లేవనాయిడ్స్ ఫ్రీ ర్యాడికల్స్‌తో పోరాడి సెల్ డ్యామేజ్‌ను నియంత్రిస్తాయి. ఈ జ్యూస్ జీర్ణవ్యవస్థ, గుండె పనితీరుని క్రమబద్ధీకరిస్తుంది. నోటి ఆరోగ్యాన్ని పెంపొందించడంతోపాటు, చర్మం నిగారింపుకు తోడ్పడుతుంది. తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి సైతం వేసవిలో ఈ డ్రింక్ చాలా బాగా ఉపయోగపడుతుంది. యాపిల్ నేరేడు జ్యూస్ తయారీకి కావలసినవి: ►గింజలు తీసేసిన నేరేడు పండ్లు – కప్పు ►యాపిల్ ముక్కలు – కప్పు ►బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను ►అల్లం – చిన్న ముక్క ►చాట్ మసాలా – చిటికెడు ►నిమ్మరసం – టేబుల్ స్పూను ►ఐస్ క్యూబ్స్ – ఐదు ►తేనె – రెండు టేబుల్ స్పూన్లు. తయారీ: ►నేరేడు, యాపిల్ ముక్కలు, అల్లం ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►ముక్కలు నలిగాక, కప్పు నీళ్లు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ జ్యూస్‌ను వడగట్టకుండా గ్లాసులో పోసి, తేనె, చాట్ మసాలా, ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. ∙ వేసవిలో ట్రై చేయండి: Pomegranate Strawberry Juice: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! -
Summer Drinks: దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్.. పోషకాలెన్నో! రోజుకో గ్లాస్ తాగితే
Summer Drink- Pomegranate Strawberry Juice: స్ట్రాబెరీలో విటమిన్ సి, కె, పీచుపదార్థం, ఫోలిక్ యాసిడ్, మ్యాంగనీస్, పొటా షియం పుష్కలంగా ఉంటాయి. ఇక, దానిమ్మగింజల్లో యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి, ఇ, కె, ఫోలేట్, పొటాషియం ఉంటాయి. కాబట్టి దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్‌తో పై పోషకాలన్నీ శరీరానికి అంది.. జీర్ణక్రియ సక్రమంగా జరగడంతోపాటు, అధిక రక్తపీడనం నియంత్రణలో ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్స్, ఖనిజ పోషకాలు శరీరంలోని మలినాలను తొలగించి, రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీకి కావలసినవి: ►దానిమ్మ గింజలు –రెండు కప్పులు ►స్ట్రాబెరీలు – ఆరు ►రాక్‌సాల్ట్ – టీస్పూను ►జీలకర్రపొడి – అరటీస్పూను ►నీళ్లు – పావు కప్పు ►ఐస్ క్యూబ్స్ – పది. దానిమ్మ స్ట్రాబెరీ జ్యూస్ తయారీ: ►స్ట్రాబెరీలను శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగాలి. ►బ్లెండర్లో దానిమ్మ గింజలు, స్ట్రాబెరీ ముక్కలు, రాక్ సాల్ట్‌ను వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ► గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ను విడిగా తీసుకోవాలి. ►ఇప్పుడు జ్యూస్‌లో జీలకర్రపొడి, ఐస్‌క్యూబ్స్ వేసి బాగా కలిపి సర్వ్ చేసుకోవాలి. జ్యూస్ మరింత రుచిగా ఉండాలంటేæ తేనెను కలుపుకోవచ్చు. ►తాజాగా ఉన్న స్ట్రాబెరీ, దానిమ్మ గింజలతో చేసే ఈడ్రింక్ మంచి రిఫ్రెషింగ్ జ్యూస్‌గా పనిచేస్తుంది. ►దీనిలో పంచదార వేయకపోవడం, వీగన్, గులెటిన్ ఫ్రీ కూడా కాబట్టి ఉపవాసంలో ఉన్నవారు కూడా ఈ జ్యూస్‌ను నిరభ్యంతరంగా తాగవచ్చు. వేసవిలో ట్రై చేయండి: Banana Milkshake: బరువు తగ్గాలా.. తియ్యటి పెరుగు, చల్లని పాలు.. ఇది తాగితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
Summer Drinks: బనానా మిల్క్ షేక్ తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
Summer Drink- Banana Milkshake: వేసవిలో బనానా మిల్క్ షేక్ ఉపశమనాన్ని ఇస్తుంది. పంచదార వేయకుండా తయారు చేసిన జ్యూస్ కాబట్టి దీనిని డయాబెటీస్ ఉన్నవారు కూడా తాగవచ్చు. దీనిలోని ప్రోబయోటిక్స్, ఆరోగ్యవంతమైన కార్బొహైడ్రేట్స్ తీసుకున్న ఆహారాన్ని త్వరగా జీర్ణం చేసి పొట్టని తేలిగ్గా ఉంచుతాయి. ఐరన్ అధికంగా ఉండడం వల్ల రక్తహీనత సమస్య ఏర్పడదు. క్యాలరీలు తక్కువగా ఉండి, యాంటీ ఆక్సిడెంట్స్, పొటాషియం అధికంగా ఉన్న ఈ జ్యూస్ తాగితే దాహం తీరడంతోపాటు, కడుపునిండిన భావనతో ఆకలి త్వరగా వేయదు. వేసవిలో బరువు తగ్గాలనుకునేవారు దీనిని ట్రై చేస్తే బెటర్. బనానా మిల్క్‌షేక్ తయారీకి కావలసినవి: ►అరటిపండ్లు – రెండు ( తొక్కతీసి ముక్కలుగా తరుక్కోవాలి) ►తియ్యటి పెరుగు – అరకప్పు ►చల్లటి పాలు – ఒకటిన్నర కప్పులు ►యాలకుల పొడి: అర టీ స్పూన్. బనానా మిల్క్‌షేక్ తయారీ: ►బ్లెండర్లో అరటిపండు ముక్కలు వేయాలి. ►దీనిలో పెరుగు, చల్లటి పాలు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►చివరలో యాలకుల పొడి కూడా వేసి మరోసారి బ్లెండ్చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి, ఐస్ క్యూబ్స్ వేసి సెర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Watermelon Apple Juice: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగుతున్నారా.. అయితే! Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు -
Summer Drinks: వేసవిలో పుచ్చకాయ, యాపిల్ జ్యూస్ కలిపి తాగితే!
వేసవిలో పుచ్చకాయ యాపిల్ జ్యూస్ మంచి రుచికరమైన రిఫ్రెషింగ్ డ్రింక్. పుచ్చకాయలోని నీరు శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. యాపిల్‌లో ఉన్న పోషకాలు శరీరానికి అంది ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఈ రెండింటినీ కలిపి తాగడం వల్ల దాహం తీరడంతో పాటు, శరీరానికి కావాల్సిన అనేక ఖనిజ పోషకాలు అందుతాయి. పుచ్చకాయ యాపిల్ జ్యూస్ తయారీకి కావాల్సినవి: ►గింజలు తీసిన పుచ్చకాయ ముక్కలు- రెండు కప్పులు ►పంచదార- రెండు టేబుల్ స్పూన్లు ►యాపిల్- పెద్దది ఒకటి ►రాక్‌సాల్ట్- టీస్పూను ►జీలకర్ర పొడి- అర టీ స్పూను ►ఐస్ క్యూబ్స్- అరకప్పు ►పుదీనా ఆకులు- ఐదు తయారీ: ►పుచ్చకాయ ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►ముక్కలతో పాటు పంచదార, రాక్‌సాల్ట్ వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ నలిగాక జీలకర్ర పొడి, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన జ్యూస్‌ను ఒక పాత్రలో తీసుకోవాలి ►ఇప్పుడు యాపిల్ తొక్కతీసి గ్రేటర్‌తో సన్నగా తురిమి జ్యూస్‌లో వేసి చక్కగా కలుపుకోవాలి. ►జ్యూస్‌ను గ్లాస్లో పోసి, సన్నగా తరిగిన పుదీనా ఆకులను వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Carrot Apple Juice Health Benefits: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే.. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Summer Drinks: రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగారంటే..
Summer Drinks- Carrot Apple Juice: తియ్యగా పుల్లగా ఎంతో రుచిగా ఉండే క్యారట్ యాపిల్ జ్యూస్ వేసవిలో తాగడానికి చాలా బావుంటుంది. దీనిలో ఫాలీఫీనాల్స్, పొటాషియంలు అధికంగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు, ఆల్జీమర్స్ ముప్పుని తగ్గిస్తాయి. ►విటమిన్ ఎ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. ►అల్లం, క్యారట్, యాపిల్ కలిపి తీసుకోవడం వల్ల యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ►దీనివల్ల దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు దరిచేరవు. ఆరెంజ్‌లోని విటమిన్ సి శరీరానికి తగినంత అందుతుంది. ►రోజుకొక గ్లాసు ఈ జ్యూస్ తాగడం వల్ల ఎముకలు, దంతాలు దృఢంగా తయారవుతాయి. క్యారట్ యాపిల్ జ్యూస్ తయారీకి కావలసినవి: తొక్కతీసి తరిగిన క్యారట్ ముక్కలు – కప్పు, యాపిల్ ముక్కలు – కప్పు, తొక్క తీసిన నారింజ లేదా కమలా తొనలు – కప్పు, అల్లం తరుగు – టీస్పూను, ఐస్ క్యూబ్స్ – కప్పు. తయారీ విధానం: ►ముక్కలన్నింటిని బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►అన్ని ముక్కలు మెదిగాక కొన్ని ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ని గ్లాసులో వేయాలి. ►దీనిలో ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Summer: పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకుంటే..
Summer Drinks: వేసవి అంటే మామిడి పండ్ల సీజన్. కేవలం పండ్లతోనే కాదు.. పచ్చి మామిడితోనూ ఎన్నో ఆరోగ్య లాభాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం. ►పచ్చిమామిడికాయ ముక్కలను ఉప్పుతో కలిపి తీసుకోవడం వల్ల శరీరంలోని నీరు బయటకు పోకుండా ఉంటుంది. ►అంతేగాక శరీర ఉష్ణోగ్రతలు నియంత్రణలో ఉంటాయి. ►దీనితో తయారు చేసే కచ్చీకేరి షర్బత్ షర్బత్‌లో పుష్కలంగా సి విటమిన్ ఉండడం వల్ల, సి విటమిన్ లోపం వల్ల వచ్చే స్కర్వి వ్యాధిని ఈ డ్రింక్ నిరోధిస్తుంది. ►వేసవిలో అధిక ఉష్ణోగ్రతల వల్ల చెమట రూపంలో చాలా నీరు పోతుంది. ఈ నీటిలో కీలకమైన ఖనిజ పోషకాలు ఐరన్, సోడియం, క్లోరైడ్లు కూడా బయటకు వెళ్లి పోతాయి. ►పచ్చిమామిడి ఈ పోషకాలను బయటకు పోనీయకుండా నియంత్రిస్తుంది. ►అజీర్ణం, డయేరియా వంటి ఉదర సమస్యలు ఈ షర్బత్ తాగితే తగ్గుతాయి. ►పచ్చిమామిడి రక్తహీనత, క్యాన్సర్, అధిక రక్తస్రావాన్ని నిరోధించడంతోపాటు, రోగనిరోధక వ్యవస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►పచ్చిమామిడి కాలేయ ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. ►దంతాలు, చిగుళ్లను కూడా రక్షిస్తుంది. ►నోటి నుంచి వెలువడే దుర్వాసనను రానివ్వదు. ►మరి ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలు కలిగి ఉన్న పచ్చి మామిడితో కచ్చీకేరి షర్బత్ షర్బత్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! కచ్చీకేరి షర్బత్ తయారీకి కావలసినవి: తొక్కతీసిన పచ్చిమామిడికాయ ముక్కలు – అరకప్పు, పుదీనా ఆకులు – పది, పంచదార – టీస్పూను, వేయించిన జీలకర్ర పొడి – టీస్పూను, రాక్‌సాల్ట్ – టీస్పూను, నీళ్లు – మూడు కప్పులు, ఐస్‌క్యూబ్స్ – ఆరు. తయారీ: ►మామిడికాయ ముక్కలు, పంచదార, పుదీనా ఆకులు, జీలకర్ర పొడి , రాక్‌సాల్ట్‌ను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి ►ఈ మిశ్రమాన్ని వడగట్టి జ్యూస్‌ని గ్లాస్లో తీసుకుని ఐస్‌క్యూబ్స్ వేసుకుంటే రుచికరమైన, ఆరోగ్యకరమైన సమ్మర్ డ్రింక్ కచ్చీ కేరి షర్బత్ రెడీ. వేసవిలో ట్రై చేయండి: Mango Mastani: మ్యాంగో మస్తానీ తాగుతున్నారా.. ఇందులోని సెలీనియం వల్ల! -
Summer Drinks: మ్యాంగో మస్తానీ.. ఇందులోని సెలీనియం వల్ల..
Summer Drinks- Mango Mastani Recipe: మంచి ఎండలో బయట నుంచి ఇంటికి వచ్చాక మ్యాంగో మస్తానీ తాగితే దాహం తీరుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ మస్తానీ తాగే కొద్ది తాగాలనిపిస్తుంది. ఈ ఒక్క జ్యూస్ తాగడం వల్ల.. విటమిన్ ఎ, బి2, బి6, బి12, సి, డి, క్యాల్షియం, అయోడిన్, ఫాస్ఫరస్, పొటాషియం, పీచుపదార్థం, ఫోలేట్, మెగ్నీషియం, మ్యాంగనీస్, సెలీనియంలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. యాంటీ ఆక్సిడెంట్ అయిన సెలీనియం రోగ నిరోధక శక్తిని పెంపొందించడంలో తోడ్పడుతుంది. మ్యాంగో మస్తానీ తయారీకి కావాల్సినవి: మామిడి పండు ముక్కలు – కప్పు, చల్లటి క్రీమ్ మిల్క్ – కప్పు, జాజికాయ పొడి – చిటికెడు, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు, పంచదార – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు, ఐస్‌క్రీమ్ – రెండు స్కూపులు, చెర్రీ, పిస్తా, బాదం పప్పు, టూటీప్రూటీ, మామిడి ముక్కలు – గార్నిష్‌కు సరిపడా, ఉప్పు – చిటికెడు. మ్యాంగో మస్తానీ తయారీ విధానం: ►మామిడి పండు ముక్కల్ని బ్లెండర్లో వేయాలి. ►దీనిలో పంచదార, జాజికాయ పొడి, ఉప్పు వేసి ప్యూరీలా గ్రైండ్ చేయాలి. ►ఈ ప్యూరీలో పాలు, ఐస్‌క్యూబ్స్ వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంగుళం గ్యాప్ ఉండేలా గ్లాసులో పోయాలి. ►గ్లాసులో గ్యాప్ ఉన్న దగ్గర ఐస్‌క్రీమ్, మామిడి పండు ముక్కలు, డ్రైఫ్రూట్స్‌తో గార్నిష్ చేసి సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే.. -
సత్తు షర్బత్.. వేసవిలో శరీరానికి వేడిచేయకుండా కాపాడుతుంది..!
కావలసినవి: వేయించిన శనగపప్పు – కప్పు, నిమ్మకాయలు – రెండు, పంచదార పొడి – రెండు టేబుల్ స్పూన్లు, పుదీనా ఆకులు – ఏడు, పచ్చిమిర్చి – ఒకటి (సన్నగా తరగాలి), జీలకర్ర పొడి – అరటీస్పూను, బ్లాక్ సాల్ట్ – పావు టీస్పూను, సాధారణ సాల్ట్ – పావు టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావు కప్పు. తయారీ: ∙శనగపప్పుని మిక్సీజార్‌లో వేసి మెత్తగా పొడిచేయాలి. ఈ పొడిని జల్లెడపట్టుకుని ఒకగిన్నెలోకి తీసుకోవాలి. ∙శనగపిండిలో కొద్దిగా నీళ్లుపోసి ఉండలు లేకుండా కలపాలి. తరువాత కప్పు నీళ్లుపోసి మరోసారి కలుపుకోవాలి ∙ఇప్పుడు దీనిలో బ్లాక్‌సాల్ట్, సాధారణ సాల్ట్, పంచదార పొడి, జీలకర్ర పొడి, పచ్చిమిర్చి తరుగు, నిమ్మరసం, పుదీనా ఆకులను సన్నగా తరిగి వేసి చక్కగా కలపాలి ∙చివరిగా ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్చేసుకుంటే సత్తు షర్బత్ ఎంతో రుచిగా ఉంటుంది. ఈ షర్బత్లోని ఉప్పు, ఐరన్, పీచుపదార్థం జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేసి గ్యాస్, ఎసిడిటీ, మలబద్ధ్దకం వంటి సమస్యలను దరిచేరనివ్వవు. దీనిని పరగడుపున తీసుకుంటే మరింత బాగా పనిచేస్తుంది∙ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి మంచి డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేస్తుంది. వేసవిలో రోజుకొక గ్లాస్ తాగితే.. దాహం తీరడంతోపాటు, శరీరానికి వేడిచేయకుండా ఉంటుంది. -
పైనాపిల్ – బత్తాయి.. పోషకాల జ్యూస్!
కావలసినవి: బత్తాయిలు – మూడు, పైనాపిల్ ముక్కలు – కప్పు, పంచదార – టేబుల్ స్పూను, ఐస్‌క్యూబ్స్ – ఐదు. తయారీ విధానం: ►బత్తాయిలను రెండు ముక్కలుగా కట్ చేసి జ్యూస్ తీసి పక్కన పెట్టుకోవాలి. ►పైనాపిల్ ముక్కలు, పంచదారను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ► పైనాపిల్ ముక్కలు గ్రైండ్ అయ్యాక బత్తాయి జ్యూస్‌ను వేసి మరోసారి గ్రైండ్ చేసి వడగట్టాలి. ► వడగట్టిన జ్యూస్‌ను గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్స్ వేసి సర్వ్ చేసుకోవాలి. పైనాపిల్-బత్తాయి జ్యూస్ పోషకాల విలువలు.. ►పైనాపిల్, బత్తాయిలలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ►పుల్లగా, తియ్యగా ఉండే ఈ జ్యూస్ దాహం తీరుస్తుంది. ► జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేయడమేగాక, రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. ► డీటాక్సింగ్ ఏజెంట్‌గా పనిచేసి ఒత్తిడి, కాలుష్య ప్రభావాలను తగ్గిస్తుంది. ►వర్క్అవుట్లు చేసేవారికి ఈ జ్యూస్ బాగా పనిచేస్తుంది. కండరాల తిమ్మిరిని తగ్గిస్తుంది. ►దీనిలోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కంటికి సంబంధించిన ఇన్ఫెక్షన్లను రానివ్వవు. ►చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి యవ్వనంగా కనిపించేలా చేస్తుంది. ► జుట్టుకి పోషకాలనందించి వెంట్రుకలు చిట్లకుండా చేస్తుంది. -
రోజు గ్లాసు బీట్రూట్ – దానిమ్మ జ్యూస్ తాగారంటే..
కావలసినవి బీట్రూట్ – మీడియం సైజువి రెండు, దానిమ్మ – రెండు, పుదీనా ఆకులు – పది, తేనె – రెండు టేబుల్ స్పూన్లు, నిమ్మరసం – అరచెక్క. తయారీ విధానం ►బీట్రూట్ను తొక్కతీసి ముక్కలుగా తరగాలి ►దానిమ్మ గింజలను ఒలుచుకోవాలి ►బ్లెండర్లో బీట్రూట్ ముక్కలు, దానిమ్మ గింజలు, పుదీనా ఆకులు వేసి గ్రైండ్ చేయాలి ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని వడపోసి జ్యూస్‌ను గ్లాసులో పోయాలి ► దీనిలో తేనె, నిమ్మరసం కలిపి సర్వ్ చేసుకోవాలి. దానిమ్మ-బీట్రూట్ జ్యూస్ ఉపయోగాలు ►వేసవిలో దాహం తీర్చే డ్రింకేగాక, మంచి డీటాక్స్ డ్రింక్‌గా ఈ జ్యూస్ పనిచేస్తుంది. ► బీట్రూట్ రోగనిరోధక వ్యస్థను మరింత దృఢంగా మారుస్తుంది. ►దానిమ్మ గింజలు, బీట్ రూట్‌ను కలిపి తీసుకోవడం వల్ల రక్త హీనత సమస్య తగ్గుతుంది ►ఈ జ్యూస్‌లో ఉన్న పుష్కలమైన యాంటీ ఆక్సిడెంట్స్ రక్తపీడనాన్ని నియంత్రణలో ఉంచుతాయి. ►బీట్రూట్లో.. ఐరన్, క్యాల్షియం, జింక్, సోడియం, మెగ్నీషియం, విటమిన్ ఎ, బీ 6, సి, ఫోలేట్,, నియాసిన్‌లు..æ, దానిమ్మ గింజల్లోని.. విటమిన్ బి, సి, కె, పొటాషియం, పీచుపదార్థాలు శరీరానికి పుష్కలంగా అందుతాయి. ►రోజుకొక గ్లాసు తాగడం వల్ల చర్మానికి, జుట్టుకు పోషణ అందుతుంది. -
పోషకాల పపాయ.. సింపుల్‌గా లస్సీ చేసుకుని తాగితే..!
కావలసినవి: తొక్క తీసిన బొప్పాయిపండు ముక్కలు – కప్పు, తేనె – టేబుల్ స్పూను, మజ్జిగ – కప్పు, యాలకులపొడి – చిటికెడు, పుదీనా తరుగు – టీస్పూను, ఐస్‌క్యూబ్స్ – పావుకప్పు, నిమ్మరసం – టీస్పూను. తయారీ విధానం.. ►బొప్పాయి ముక్కలను బ్లెండర్లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ►తరువాత తేనె, పుదీనా తరుగు, యాలకుల పొడి వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక ఐస్‌క్యూబ్స్ మజ్జిగ, నిమ్మరసం వేసి గ్రైండ్ చేసి, సర్వ్ చేసుకోవాలి. ►బొప్పాయిలోని పాపిన్ అనే ఎంజైమ్ జీర్ణవ్యవస్థ సక్రమంగా పని చేసేలా చేస్తుంది. ►దీనిలో విటమిన్ సి, కార్బోహైడ్రేట్స్, పీచుపదార్థం, ప్రోటిన్, విటమిన్ ఎ, ఫోలేట్, పొటాషియం, క్యాల్షియం, మెగ్నీషియం, విటమిన్ బి1, బి 3, బి 5, ఇ, ఐరన్ లు, కెరోటినాయిడ్స్ శరీరానికి అంది జీవక్రియలు క్రమబద్ధీకరిస్తాయి. ►బొప్పాయి, తేనెను కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది ►ఈ లస్సీని రోజుకొక గ్లాసు చొప్పున క్రమం తప్పకుండా తాగితే బరువు నియంత్రణలో ఉంటుంది. -
Summer Drinks: సొరకాయ జ్యూస్ తాగితే అద్భుత ప్రయోజనాలు!
Summer Drink- Sorakaya Juice: సొరకాయలో విటమిన్లు, పొటాషియం, ఐరన్లు, పీచుపదార్థం పుష్కలంగా ఉంటాయి. అందువల్ల సొరకాయ జ్యూస్ తాగితే బరువు తగ్గుతారు. దీనిలోని పీచుపదార్థం జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అదే విధంగా.. పొటాషియం అధిక రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది. రోజూ ఈ డ్రింక్ తాగడం వల్ల కాలేయ సంబంధ సమస్యలు తగ్గుముఖం పడతాయి. ఐస్‌క్యూబ్స్ వేయకుండా చేసిన సొరకాయ జ్యూస్‌ను పరగడుపున తాగితే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరతాయి. సొరకాయ జ్యూస్ తయారీకి కావలసినవి: ►సొరకాయ – మీడియం సైజుది ఒకటి ►పుదీనా ఆకులు – పది ►అల్లం – అరంగుళం ముక్క ►నిమ్మకాయ – ఒకటి ►బ్లాక్ సాల్ట్ – రుచికి సరిపడా ►ఐస్ క్యూబ్స్ – అరకప్పు. తయారీ విధానం: ►సొరకాయ తొక్కతీసి శుభ్రంగా కడిగి ముక్కలుగా తరిగి బ్లెండర్లో వేయాలి. ►దీనిలోనే తొక్కతీసిన అల్లం, పుదీనా, రుచికి సరిపడా బ్లాక్‌సాల్ట్, ఐస్ క్యూబ్స్వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ►గ్రైండ్ అయిన మిశ్రమాన్ని పలుచని వస్త్రంలో వడగట్టి జ్యూస్‌ను తీసుకోవాలి. ►ఈ జ్యూస్‌లో నిమ్మరసం పిండి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. చదవండి👉🏾ప్రెగ్నెన్సీ సమయంలో చేపలు, లివర్‌ను తినొచ్చా? -
Summer Drinks: ఈ డ్రింక్ తాగితే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి!
Summer Drinks- Elaichi Sharbat: ఇలాచి షర్బత్ తాగితే వేసవి కాలంలో ఎదురయ్యే గుండెల్లో మంట, ఎసిడిటీ వంటి సమస్యలు ఇట్టే తగ్గిపోతాయి. అధిక రక్తపోటును నియంత్రించే గుణాలు ఈ డ్రింక్‌లో పుష్కలంగా ఉన్నాయి. యాలకుల్లో ఉన్న ఔషధ గుణాలు మహిళల్లో తరచూ ఎదురయ్యే మూత్రనాళ ఇన్ఫెక్షన్లు తగ్గిస్తాయి. ఈ డ్రింక్ తాగడం వల్ల క్యాల్షియం, పీచుపదార్థం శరీరానికి పుష్కలంగా అందుతాయి. ఇలాచి షర్బత్ తయారీకి కావలసినవి: యాలక్కాయలు – కప్పు, పంచదార – కేజీ, రోజ్ వాటర్ – పావు కప్పు, గ్రీన్ ఫుడ్ కలర్ – పావు టీస్పూను, నిమ్మకాయలు – రెండు. ఇలాచి షర్బత్ తయారీ విధానం: ►యాలక్కాయలను శుభ్రంగా కడిగి, రెండు కప్పుల నీళ్లుపోసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ►నానిన యాలక్కాయలను నీటితోపాటు మిక్సీజార్‌లో వేసి బరకగా గ్రైండ్ చేయాలి. ►స్టవ్‌మీద పాత్రను పెట్టి లీటరు నీళ్లు, గ్రైండ్ చేసిన యాలక్కాయల మిశ్రమాన్ని వేసి సన్నని మంట మీద ఇరవై నిమిషాలపాటు మరిగించాలి. ►మరిగిన మిశ్రమాన్ని పలుచటి వస్త్రంలో వడగట్టి నీటిని తీసుకోవాలి. ►ఇప్పుడు స్టవ్ మీద మరో పాత్రను పెట్టి వడగట్టిన నీటిని అందులో పోయాలి. ►దీనిలో పంచదార వేసి సన్నని మంటమీద పదిహేను నిమిషాలపాటు మరిగించాలి. ►తరువాత రోజ్‌వాటర్, గ్రీన్ ఫుడ్ కలర్, నిమ్మకాయల రసం పిండి, చక్కగా కలపాలి. ►ఈ మిశ్రమం సిరప్‌లా చిక్కబడేంత వరకు మరిగించి దించేయాలి ∙మిశ్రమం చల్లారాక ఎయిర్‌టైట్ కంటైనర్‌లో వేసి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేసుకోవాలి. ►రెండు నెలలపాటు నిల్వ ఉండే ఈ ఇలాచీ షర్బత్‌ను కప్పు పాలు, లేదా గ్లాస్ నీళ్లలో రెండు టేబుల్ స్పూన్ల చొప్పున కలుపుకుని తాగాలి. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Summer Drinks: నీర్ మోర్.. ఎసిడిటీ సమ్యసలు దూరం! ఇంకా..
Summer Drinks- Neer Mor: పెరుగుతో తయారు చేసే నీర్ మోర్‌ను మంచి ఎండల్లో తాగడం వల్ల డీహైడ్రేషన్‌కు గురికారు. దాహం కూడా తీరుతుంది. జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా ప్రోత్సహించి, ఎసిడిటీ సమస్యలను దరిచేరనివ్వదు. రక్త పోటు(బీపీ)ను నియంత్రణలో ఉంచుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! నీర్ మోర్ తయారీకి కావలసినవి: ►పెరుగు – కప్పు, నీళ్లు – కప్పు ►అల్లం తరుగు – టీస్పూను ►మిరియాల పొడి – పావు టీస్పూను ►పచ్చిమిర్చి – ఒకటి ►కరివేప ఆకులు – ఏడు, కొత్తిమీర తరుగు – రెండు టేబుల్ స్పూన్లు ►ఉప్పు – రుచికి సరిపడా. ►తాలింపునకు: ఆయిల్ – టీస్పూను, ఆవాలు – పావు టీస్పూను, ఇంగువ – చిటికెడు. నీర్ మోర్ తయారీ విధానం: ►బ్లెండర్లో కప్పు పెరుగు, అల్లం, పచ్చిమిర్చి, మిరియాల పొడి, కరివేపాకు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక కప్పు నీళ్లు, రుచికి సరిపడా ఉప్పు వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాసులో పోసి కొత్తిమీర తరుగు వేసి పక్కన పెట్టుకోవాలి. ►ఇప్పుడు బాణలిలో ఆయిల్ వేసి వేడెక్కాక ఆవాలు వేసి చిటపటలాడనివ్వాలి. ►తర్వాత ఇంగువ వేసి దించేయాలి. ►తాలింపు మిశ్రమాన్ని మజ్జిగ మిశ్రమంలో వేసి తిప్పితే నీర్ మోర్ రెడీ. దీనిని వెంటనే తాగితే చాలా బావుంటుంది. చదవండి👉🏾 Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Summer Drinks: పైన్ మ్యాంగో జ్యూస్.. పైనాపిల్లోని మాంగనీస్ వల్ల..
Summer Drinks- Pine Mango Juice: వేసవికాలంలో బయటకు వెళ్లేముందు పైన్ మ్యాంగో జ్యూస్ తాగితే దాహం వేయదు. దీనిలో విటమిన్లు, ఖనిజ పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. మామిడి పండులోని బీటా కెరోటిన్, విటమిన్ సి, ఐరన్, పొటాషియం రోగనిరోధక శక్తిని పెంచడంలో ప్రముఖ పాత్ర పోషిస్తాయి. దీనిలోని పోషకాలు కండరాలను ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇక పైనాపిల్లోని మాంగనీస్, జింక్, బీ 6, సీ విటమిన్ శరీరానికి శక్తిని అందిస్తాయి. జింక్ ఫాస్పరస్, క్యాల్షియం, క్లోరిన్, ఐరన్, విటమిన్ ‘కే’లు కండరాల ఎదుగుదల, రోగనిరోధక వ్యస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. మరి ఈ సమ్మర్ డ్రింక్ తయారీ విధానం తెలుసుకుందామా! పైన్ మ్యాంగో జ్యూస్ తయారీకి కావలసినవి: ►మామిడిపండు ముక్కలు – రెండు కప్పులు ►పైనాపిల్ ముక్కలు – కప్పు ►పంచదార – రెండు టీస్పూన్లు ►నిమ్మరసం – అరటీస్పూను ►ఐస్ ముక్కలు – అరకప్పు ►పుదీనా తరుగు – టీస్పూను. పైన్ మ్యాంగో జ్యూస్ తయారీ విధానం: ►మామిడి, పైనాపిల్ ముక్కలు, పంచదార, పుదీనా, నిమ్మరసం, ఐస్ ముక్కలు, రెండు కప్పుల నీళ్లను బ్లెండర్లో వేసి గ్రైండ్ చేయాలి. ►మెత్తగా గ్రైండ్ చేసిన జ్యూస్ మిశ్రమాన్ని వెంటనే సర్వ్ చేసుకుంటే చల్లగా ఎంతో రుచిగా ఉంటుంది. చదవండి👉🏾Thati Munjala Smoothie: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి.. -
Summer Drinks: ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే!
Summer Drinks- Gulkand Banana Milkshake: గులాబీ రేకులతో తయారు చేసే గుల్ఖండ్ను పాన్‌లో ముఖ్యమైన పదార్థంగా వాడతారు. భోజనం తరువాత ఇది మంచి మౌత్ ఫ్రెష్నర్గా పనిచేస్తుంది. ఇక గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్‌లో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్ గుణాలు పుష్కలంగా ఉండి, మొటిమలు రానివ్వవు. ఈ మిల్క్‌షేక్‌ను రాత్రి పడుకునే ముందు తాగితే, శరీరానికి సహజసిద్ధమైన చల్లదనాన్ని అందించి మంచి నిద్రకు ఉపక్రమించేలా చేస్తుంది. ఒత్తిడి, నీరసం, అలసటను తగ్గించి మైండ్‌ను ఫ్రెష్‌గా ఉంచుతుంది. దీనిలో వాడిన కొబ్బరిపాలు, అరటిపండ్లు శరీరానికి కావాల్సిన పోషకాలను అందిస్తాయి. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీకి కావలసినవి అరటిపండ్లు – పెద్దవి రెండు, గుల్ఖండ్ – మూడు టేబుల్ స్పూన్లు, కొబ్బరి పాలు – రెండు కప్పులు, రోజ్ ఎసెన్స్ – రెండు టీస్పూన్లు, ఐస్ క్యూబ్‌లు – మిల్క్ షేక్‌కు సరిపడా. గుల్ఖండ్ బనానా మిల్క్ షేక్ తయారీ విధానం ►అరటిపండ్లను తొక్కతీసి ముక్కలు చేసి బ్లెండర్లో వేయాలి. ►దీనిలో గుల్ఖండ్, కొబ్బరి పాలు వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవన్నీ గ్రైండ్ అయ్యాక మిశ్రమాన్ని గ్లాసులో పోసి ఐస్‌క్యూబ్‌లు, రోజ్ ఎసెన్స్ చల్లుకుని సర్వ్ చేసుకోవాలి. ►ఈ మిల్క్‌షేక్ మరింత తియ్యగా కావాలనుకుంటే పంచదార లేదా ఏదైనా స్వీట్నర్, ఒక స్కూప్ వెనీలా ఐస్‌క్రీమ్ వేసి కలుపుకోవాలి. చదవండి👉🏾Mango Health Benefits: సీజన్ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్ వల్ల.. -
Summer Drinks: తాటి ముంజలలో ఫైటో కెమికల్స్ పుష్కలం.. కాబట్టి..
Summer Drinks- Thati Munjala Smoothie: ముంజలలో ఫైటో కెమికల్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి వృద్ధాప్యఛాయలను త్వరగా రానివ్వకుండా నెమ్మదిపరుస్తాయి. అనారోగ్యాలను దరిచేరనియ్యవు. బరువు తగ్గాలనుకునేవారికి ఇది మంచి డ్రింక్‌గా పనిచేస్తుంది. శరీరానికి పోషకాలను అందించడంతోపాటు తక్కువ క్యాలరీలు ఉండడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. మండే ఎండల్లో ముంజల స్మూతీ తాగితే వడదెబ్బకు గురికారు. చురుక్కుమనే ఎండల వల్ల చర్మం పై ఏర్పడే చెమటకాయలు, దద్దుర్లు రావు. అజీర్ణం, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలో బాధపడుతున్న వారు ఈ జ్యూస్ తాగితే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేసి సమస్యలన్నింటికి చక్కటి పరిష్కారం దొరుకుతుంది. పాలిచ్చే తల్లులుకు దీనిని తాగితే పుష్కలమైన పోషకాలు అందుతాయి. ఫలితంగా తల్లిపాల నాణ్యత కూడా పెరుగుతుంది. ఈ జ్యూస్‌లోని పుష్కలమైన ఖనిజ పోషకాలు, విటమిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా ప్రేరేపిస్తాయి. ముంజల స్మూతీ తయారీకి కావలసినవి తాటి ముంజలు – ఆరు, కాచిన చల్లటి చిక్కటి పాలు – రెండు కప్పులు, పంచదార – మూడు టేబుల్ స్పూన్లు, నానబెట్టిన సబ్జాగింజలు – టేబుల్ స్పూను. తయారీ: ►ముందుగా తాటిముంజలను తొక్కలు లేకుండా శుభ్రం చేసి మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి ►మిక్సీజార్‌లో పాలు, పంచదార వేసి నిమిషం పాటు గ్రైండ్ చేయాలి ►ఇప్పుడు పాలమిశ్రమాన్ని మెత్తగా రుబ్బుకున్న తాటిముంజల మిశ్రమంలో వేసి కలపాలి. దీనిలో సబ్జాగింజలు వేసి చక్కగా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾 Muskmelon Mojito Health Benefits: కొవ్వులు తక్కువ.. బరువు తగ్గాలనుకునేవాళ్లకు ఇది చాలా మంచిది! Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
Summer Drinks: బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగండి!
Summer Drink- Muskmelon Mojito: కర్బూజాలో శరీరానికి అవసరమైన ముఖ్యమైన పోషకాలు, పుష్కలంగా నీరు ఉంటాయి. వేసవిలో దీనితో తయారు చేసే మస్క్ మిలాన్ మొజిటో తాగిన వెంటనే పొట్టనిండిన భావన కలిగి దాహం తీరి ఫ్రెష్‌గా అనిపిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సీ, బీటా కెరోటిన్లు రోగనిరోధక వ్యవస్థను మరింత సమర్థవంతంగా పనిచేసేలా చేస్తాయి. పీచుపదార్థం అధికంగా ఉండడం, గ్లైసిమిక్స్ ఇండెక్స్, కొవ్వులు తక్కువగా ఉండడం వల్ల బరువు తగ్గాలనుకునేవారికి ఇది బాగా పనిచేస్తుంది. బ్లడ్ సుగర్ స్థాయులను నియంత్రణలో ఉంచుతూ బరువుని అదుపులో ఉంచుతుంది. మస్క్ మిలాన్ మొజిటో తయారీకి కావలసినవి: తొక్కతీసిన కర్బూజా ముక్కలు – కప్పు, పుదీనా ఆకులు – ఆరు, నిమ్మరసం – అరచెక్క రసం, పంచదార – టీస్పూను, సోడా, నీళ్లు, ఐస్ ముక్కలు – మోజిటోకు సరిపడా. మస్క్ మిలాన్ మొజిటో తయారీ విధానం: ►కర్బూజ ముక్కలు, పంచదారను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. ►ఇవి గ్రైండ్ అయ్యాక పుదీనా ఆకులు, నిమ్మరసం వేసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►ఇప్పుడు గ్లాస్లో ఐస్ ముక్కలు వేయాలి. దీనిలోనే గ్రైండ్ చేసిన మస్క్‌మిలాన్ మిశ్రమం వేయాలి. ►ఈ మిశ్రమంలో సోడా నీళ్లు వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Maredu Juice: మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల.. -
మారేడు జ్యూస్ తాగుతున్నారా.. ఇందులోని టానిన్, పెక్టిన్‌ల వల్ల..
Summer Drink- Maredu Juice: మారేడు జ్యూస్ శరీరంలోని టాక్సిన్లను బయటకు పంపి శరీరానికి తక్షణ శక్తిని అందిస్తుంది. శరీరానికి చల్లదనంతోపాటు ఫ్రెష్‌నెస్ ఇస్తుంది. ఈ జ్యూస్‌లోని టానిన్, పెక్టిన్లు డయేరియాను తరిమికొట్టడంలో ప్రముఖ పాత్రపోషిస్తాయి. విటమిన్ సీ, క్యాల్షియం, పీచుపదార్థం, ప్రోటీన్, ఐరన్లు పుష్కలంగా ఉండి, జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చేసి పొట్టను ఆరోగ్యంగా ఉంచుతాయి. వేసవిలో వెంటనే దాహార్తి తీరాలంటే మారేడు జ్యూస్ చక్కగా పనిచేస్తుంది. ఇంకెందుకు ఆలస్యం ఇలా సింపుల్‌గా ఇంట్లోనే ఈ సమ్మర్ డ్రింక్‌ను తయారుచేసుకోండి. మారేడు జ్యూస్ తయారీకి కావలసిన పదార్థాలు: పండిన మారేడు – ఒకటి, పంచదార లేదా బెల్లం – రుచికి సరిపడా, దాల్చిన చెక్కపొడి – పావు టీస్పూను, జాజికాయ పొడి – పావు టీస్పూను, చల్లటి నీళ్లు – జ్యూస్‌కు సరిపడా. మారేడు జ్యూస్ తయారీ ఇలా: ►ముందుగా మారేడు పండును పగులకొట్టి లోపలి గుజ్జును వేరుచేయాలి. ►తీసిన గుజ్జునుంచి విత్తనాలు, పీచు వేరుచేసి, జ్యూస్‌ను పిండుకోవాలి. ►జ్యూస్‌ను వడగట్టి రుచికి సరిపడా పంచదార లేదా బెల్లం వేయాలి. ►దీనిలో చల్లటి నీళ్లు పోసి పంచదార కరిగేంత వరకు తిప్పుకోవాలి. ►చివరిగా దాల్చిన చెక్క, జాజికాయ పొడి వేసి సర్వ్ చేసుకోవాలి. చదవండి👉🏾Palmyra Palm: వేసవిలో తాటి ముంజలు తింటున్నారా.. ఈ విషయాలు తెలుసా? -
బరువు పెరుగుతామన్న భయం లేదు.. ఈ స్మూతీ హెల్దీగా, రుచిగా..
మ్యాంగో గ్రీన్ స్మూతి.. ఉదయం ఆల్పాహారంగానూ, సాయంత్రాల్లో స్నాక్స్తోపాటు ఈ స్మూతీ తీసుకుంటే రుచిగా హెల్థీగా ఉంటుంది. బాదం పాలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది తాగడం వల్ల బరువు పెరుగుతామన్న భయం లేదు. మామిడిపండులో ఉన్న విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్స్ శరీరానికి అంది రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అరటిపండులోని పొటాషియం, పీచుపదార్థం, పాలకూరలోని ఐరన్, విటమిన్ కే లు చర్మం, జుట్టుకు పోషణ అందిస్తాయి. మ్యాంగో గ్రీన్ స్మూతి తయారీకి కావలసిన పదార్థాలు: చల్లటి మామిడిపండు ముక్కలు – ఒకటిన్నర కప్పులు, అరటి పండు – ఒకటి, లేత పాలకూర – కప్పు, బాదం పాలు – పావు కప్పు. తయారీ: మామిడి ముక్కలు, తొక్కతీసిన అరటిపండు, పాలకూర, బాదం పాలను మిక్సీజార్‌లో వేసి మేత్తగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన వెంటనే ఈ స్మూతీని సర్వ్ చేసేకుంటే చాలారుచిగా ఉంటుంది. చదవండి👉🏾 Best Calcium Rich Foods: కాల్షియం లోపిస్తే..? ఎదురయ్యే సమస్యలు ఇవే! ఇవి తిన్నారంటే.. -
Summer: మామిడి, పుదీనా, నిమ్మరసం.. ఈ లస్సీ ఒక్కసారి తాగితే..
Mango Peppermint Lassi Recipe: పుదీనా, నిమ్మరసం ఆహారం చక్కగా జీర్ణమయ్యేలా చేస్తాయి. ఇక వేసవిలో లభించే మామిడిపండు కలిగించే ఆరోగ్య ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఇందులోని పొటాషియం, మెగ్నీషియం బీపీని కంట్రోల్ చేస్తాయి. విటమిన్ సీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. ఇలా చెప్పుకొంటూ పోతే ఇంకెన్నో ఉపయోగాలు. మరి మండే ఎండల్లో మధ్యాహ్నం పూట వీటితో తయారు చేసిన మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తాగితే దాహార్తి తీరుతుంది. అంతేకాదు ఇందులోని పోషకాలు చర్మం, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ ఇంట్లో ఈ సమ్మర్ డ్రింక్‌ను ఈజీగా తయారు చేసుకోండి. మ్యాంగో పిప్మర్మెంట్ లస్సీ తయారీకి కావాల్సిన పదార్థాలు: మామిడిపండు గుజ్జు – కప్పు, పంచదార – నాలుగు టేబుల్ స్పూన్లు, పుదీనా తరుగు – మూడు టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – టీస్పూను, నిమ్మరసం – టేబుల్ స్పూను, పెరుగు – నాలుగు కప్పులు, ఐస్ ముక్కలు – కప్పు తయారీ విధానం: బ్లెండర్లో మామిడి పండు గుజ్జు, పుదీనా, పాలు, యాలకుల పొడి, నిమ్మరసం వేసి గ్రైండ్ చేయాలి. ఇవన్నీ గ్రైండ్ అయ్యాక పెరుగు, ఐస్ ముక్కలు వేసి మరోసారి గ్రైండ్ చేసి సర్వ్‌చేసుకోవాలి. చదవండి👉🏾Boppayi Banana Smoothie: ఈ స్మూతీ తాగితే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే! -
Summer: పోషకాల స్మూతీ.. క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది! ఇంకా
Summer Drinks- Boppayi Banana Smoothie: బొప్పాయి బనానా స్మూతీలో యాంటీ ఆక్సిడెంట్స్, కెరాటిన్స్, విటమిన్ సీ, ఫ్లేవనాయిడ్స్ పుష్కలంగా ఉంటాయి. బొప్పాయిలో ఫోలేట్, పాంథోనిక్ యాసిడ్, ఖనిజ పోషకాలు పొటాషియం, కాపర్, మెగ్నీషియంలతోపాటు పీచుపదార్థం కూడా ఉంటుంది. ఈ స్మూతి తాగడం వల్ల ఈ పోషకాలన్నీ శరీరానికి అందడంతోపాటు, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. కోలన్ క్యాన్సర్ ముప్పు తగ్గుతుంది. వేసవిలో తాగే స్మూతీ ఆరోగ్యానికి మేలు చేస్తుంది. బొప్పాయి బనానా స్మూతీ తయారీకి కావలసిన పదార్థాలు: పాలు – రెండు కప్పులు, తొక్కతీసిన బొప్పాయి పండు ముక్కలు – అరకప్పు, బాగా పండిన అరటి పండు – ఒకటి (ముక్కలు తరగాలి), కర్జూరపండ్లు – ఆరు, ఐస్ ముక్కలు – ఆరు, చాక్లెట్ తరుగు – గార్నిష్‌కు సరిపడా. తయారీ: ►బొప్పాయి, అరటి పండు ముక్కలను, కప్పు పాలు, ఐస్‌ముక్కలను బ్లెండర్లో వేసి స్మూత్‌గా వచ్చేంత వరకు గ్రైండ్ చేయాలి. ►ముక్కలన్నీ మెదిగాక, కర్జూరం పండ్లలో గింజలు తీసేసి వేయాలి. ►మిగిలిన కప్పు పాలను పోసి మరోసారి గ్రైండ్ చేసుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని గ్లాస్లో పోసి చాక్లెట్ తరుగుతో గార్నిష్ చేస్తే ఎంతో రుచికరమైన బొప్పాయి బనానా స్మూతీ రెడీ. చదవండి👉🏾 Poha Banana Shake: ఫైబర్, ఐరన్ అధికం.. బరువు తగ్గాలనుకుంటే ఈ జ్యూస్ తాగితే!