Jackfruit Surprising Health Benefits: పనసలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, టైప్ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి.
►పనస తొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి.
►పనస జ్యూస్ తాగినప్పుడు పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు.
►ఫలితంగా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది.
►విటమిన్ సి, ఈ, లారిక్ యాసిడ్‌లలోని యాంటీసెప్టిక్ గుణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు.
►కొబ్బరిపాలు, బెల్లంలలో కావల్సినంత ఐరన్ ఉంటుంది.
►దీని జ్యూస్ తాగడంవల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరగి రక్త హీనత సమస్య ఎదురవదు.
►జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపపడుతుంది.
►చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది.
జాక్‌ఫ్రూట్ షేక్‌కు కావలసినవి:
►గింజలు తీసిన పనస తొనలు – రెండు కప్పులు
►చిక్కటి కొబ్బరి పాలు – కప్పున్నర
►బెల్లం తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు
►నీళ్లు – అరకప్పు, ఐస్ క్యూబ్స్ – ఎనిమిది.
తయారీ...
►పనస తొనలను సన్నగా తరిగి బ్లెండర్‌లో వేయాలి
►తొనలకు బెల్లం, కొబ్బరిపాలను జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి
►మెత్తగా నలిగిన తరువాత ఐస్ క్యూబ్స్, అర కప్పు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి.
►అన్నీ చక్కగా గ్రైండ్ అయ్యాక వెంటనే గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవాలి.
వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే!
Comments
Please login to add a commentAdd a comment