JAGGERY
-
మృగశిర కార్తెకు ఆ పేరే ఎలా వచ్చింది? బెల్లం ఇంగువ ఎందుకు తింటారు?
మృగశిర కార్తె అంటే.. ఆశ్విని మొదలుకుని రేవతి వరకూ మనకున్న 27 నక్షత్రాల్లో సూర్యుడి ప్రవేశం ఆధారంగా కార్తె నిర్ణయం జరుగుతుంది. భారతీయ జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం.. ఒక్కో కార్తెలో ఒక్కో విధంగా ప్రకృతిలో మార్పులు జరుగుతుంటాయి. ఈ క్రమంలో సూర్యుడు మృగశిర నక్షత్రంలోకి ప్రవేశించి నాటినుంచి నైరుతి రుతుపనాలు వస్తాయి. వాతావరణం ఒక్కసారి చల్లబడటం , ప్రకృతిలో అనేక మార్పులు చోటు చేసుకునే నేపథ్యంలో అనేక రకాల చెడు సూక్ష్మక్రిములు వంటివి పునురుత్పత్తి అవుతాయి.మానవునిలో రోగ నిరోధకశక్తి తగ్గి జ్వరం , దగ్గు , శ్వాస సంబంధ వ్యాధులు వస్తాయి. మృగశిర కార్తెలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది. బెల్లంలో ఇంగువ కలుపుకుని తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు , ఆస్తమా , మధుమోహ వ్యాధి ఉన్నవారు , గర్భిణులు ఈ సమయంలో బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. దీని వెనుక ఆరోగ్య రహస్యం దాగివుంది. ఇది శరీరంలో ఉష్ణోగ్రత ప్రేరేపించి వర్షాకాలంలో సోకే వ్యాధులను అడ్డుకుంటుందని పెద్దల విశ్వాసం. ఇది మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడిగా ఉండేందుకు బెల్లంలో ఇంగువ కలుపుకుని తింటారు. దీని వల్ల గుండె జబ్బులు , ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్లో చాలా మందికి జీర్ణశక్తితోపాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం , దగ్గు బారిన పడతారు. ఇలాంటి వాటి నుంచి గట్టెక్కాలంటే బెల్లంలో ఇంగువ కలుపుకుని తినాల్సిందే.ఇక మాంసాహారులైతే ఈ సీజన్లో కోళ్లు, పొట్టేళ్లు, మేకపోతులు, చేపలు వంటి వాటిని తింటారు. కార్తె ప్రారంభం శుక్రవారం అయినా కొంత మంది మాంసాహారాన్ని తీసుకోకపోవడంతో శని, ఆదివారాల్లో తీసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఆరోగ్య పరంగా చెప్పుకుంటే కోడి మాంసం వేడి చేస్తుందని, తద్వారా శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుందని, సీజనల్‌గా వచ్చే వ్యాధులు రావన్నది అందరికీ తెలిసిందే. ఈ సీజన్లోనే చేప మందు ఇవ్వడం జరుగుతుంది. చేపలు తినడం ద్వారా గుండె జబ్బులు, అస్తమా రోగులకు ఉపశమనం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో చేపలను ఇంగువలో, చింతచిగురులో పెట్టి తీసుకుంటారు.ఈ కార్తెలు ఎందుకంటే..పంచాంగ ప్రకారం ఆరుద్ర నక్షత్రంలో సూర్యుడు ప్రవేశించే సమయంలోని తిథి , వార , నక్షత్ర , యోగ , కరణాలు , శకునాలు తదితర అంశాల ఆధారంగా చేసుకుని ఆ సంవత్సరం యొక్క వర్షాన్ని నిర్ణయించడం జరుగుతుంది. ఈ విధంగా వ్యవసాయదారులకు నిత్యజీవనోపయోగిగా,వ్యవసాయం పనులకు మార్గదర్శకంగా ఈ కార్తెలు ఉపయోగపడుతున్నాయి.పురాణగాధ ప్రకారంమృగశిరస్సు కలిగిన మృగవ్యాధుడు అను వృతాసురుడు వరప్రభావంచే పశువులను , పంటలను హరించి వేయడం ప్రకృతి భీభత్సాలాను సృష్టించడం , వర్షాలకు అడ్డుపడటం జరుగుతూ ఉండేడిది. ఇతను చనిపోకుండా అనేక వరాలు కలిగి ఉండటంచేత ఇంద్రుడు సముద్రఅలల నుండి వచ్చే నురుగును ఆయుధంగా చేసి చంపేస్తాడు.ప్రకృతి మార్పు ప్రభావంఈ కథ ఆధారంగా ఖగోళంలో ఇంద్ర నక్షత్రమైన జ్యేష్టాకు మృగశిరకు 180 డిగ్రీల దూరంలో ఉండటం వలన తూర్పు ఆకాశంలో ఇంద్ర నక్షత్రం ఉదయించగానే వృతాసుర నక్షత్రం అస్తమిస్తుంటుంది. ఇక్కడ నురుగు అనేది ఋతుపవనాలకు , వర్షాలకు సూచన. ఇంద్ర నక్షత్రమైన జ్యేష్ట ఉదయించినపుడు సూర్యుడు మృగశిరలోకి ప్రవేశించడం వలన మృగశిరకార్తె ప్రవేశిస్తుంది. వర్షాలు పడకుండా అడ్డుపడ్డ మృగాసురుని చంపిన ఇంద్రున్ని వర్షప్రదాతగా , వర్షదేవుడుగా పిలుస్తారు. ఇది కథ. -
చలికాలంలో బెల్లం ఎందుకు తినాలి?నకిలీ బెల్లాన్ని ఎలా గుర్తించాలి?
బెల్లం ఆరోగ్యానికి ఎంత మంచిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మన శరీరానికి అవసరమైన మూలకాలు బెల్లంలో లభిస్తాయి. విటమిన్ ఎ, బి, గ్లూకోజ్, ఐరన్, కాల్షియం,పొటాషియం, జింక్, మెగ్నీషియం వంటి ఎన్నో పోషకాలు ఇందులో ఉంటాయి. ముఖ్యంగా చలికాలంలో బెల్లం క్రమం తప్పకుండా తీసుకోవాలని చెబుతారు. దీనివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి? రోజూ బెల్లం తినొచ్చా? ఆరోగ్య ప్రయోజనాలు.. ►బెల్లంలో ఉండే సహజ చక్కెరలు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి.దీనిలోని పొటాషియం, మెగ్నీషియం కారణంగా బెల్లం గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ► పంచదారకు బదులు బెల్లం తినే వారి శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ► బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ► ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. ► కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది. ► బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక. ► బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది. చలికాలంలో ఎందుకు? శీతాకాలంలో జీవక్రియ మందగిస్తుంది. అందుకే ఈ కాలంలో బెల్లం తినడం వల్ల జీవక్రియను మెరుగుపరుస్తుంది. బెల్లం శరీరంలో వేడిని పెంచుతుంది. ఈ కాలంలో ఎక్కువగా జలుబు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బెల్లం తినడం వల్ల రోగనిరోధక శక్తి మెరుగవుతుంది. బెల్లంలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. ఇది శరీర రక్తకణాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. అంతేకాకండా చలికాలంలో చాలామందిని వేధించే కీళ్లనొప్పుల సమస్యను కూడా దూరం చేస్తుంది. ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. అసలు బెల్లాన్ని ఎలా గుర్తించాలి? బెల్లం రంగును బట్టి అది అసలైనదా? నకిలీదా అనేది ఇలా తెలుసుకోవచ్చు. బెల్లాన్ని కల్తీ చేయడానికి కాల్షియం కార్బోనేట్ మరియు సోడియం బైకార్బోనేట్ ఎక్కువగా వాడతారు. దీనివల్ల బెల్లం రంగు తెలుపు, లేదా పసుపు రంగులో ఉంటుంది. అలా కాకుండా ముదురు గోధుమ రంగులో ఉంటే అది అసలైన బెల్లం అన్నమాట. ఇక నకిలీ బెల్లాన్ని గుర్తించడానికి మరో పద్దతి.. ఓ బెల్లం ముక్క తీసుకొని నీటిలో వేస్తే అది పూర్తిగా మునిగిపోతే కల్తీదని భావించాలి. పైకి తేలినట్లయితే నిజమైన బెల్లం అని భావించాలి. -
చక్కెర కంటే బెల్లమే ఎందుకు ఆరోగ్యానికి మంచిదంటే..!
సంప్రదాయక తియ్యటి పదార్థం బెల్లం. ఆరోగ్యపరంగా బెల్లమే మంచిదని మన పెద్దవాళ్లు పదే పదే చెబుతుంటారు. అదీగాక ఇటీవల కాలంలో షుగర్ వ్యాధిగ్రస్తులు విపరీతంగా పెరిగిపోయారు. దీంతో పలు ఛానెళ్లలోనూ, ఆరోగ్య నిపుణులు పంచదారకు బదులు బెల్లాన్ని ఉపయోగించండి, పంచదారను అస్సలు దగ్గరకు రానియ్యకండి అంటూ ఊదరగొట్టేస్తున్నారు. ఇందులో వాస్తవం ఎంతుంది. ఇది ఎంతవరకు నిజం? తదితరాలు గురించే ఈ కథనం. పంచదార లేదా చక్కెర అనేది రిఫైన్డ్ చేసినది. కానీ బెల్లం చెరుకు రసంతో తయారు చేసిన అన్ రిఫైన్డ్ పదార్థం. అందుకే దీన్ని నాన్ సెంట్రీఫూగల్ కేన్ షుగర్ అంటారు. ఐతే ఆరోగ్య నిపుణులు పంచదార కంటే బెల్లమే మంచిదైనపట్టికీ కాలాల వారికి వాటిని వినియోగించాలని చెబుతున్నారు. పూర్తిగా పంచదారను దూరం పెట్టేయకూడదని, మన శరీరానికి తగు మోతాదులో అందాల్సిన ఘగర్ని తీసుకోవచ్చని సూచిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే పంచదార తెల్లగా కనిపించేందుకు ఎక్కువ కెమికల్స్ వినియోగిస్తారు. దీని బదులు ఆర్గానిక్ పద్ధతిలో అంటే పటికి బెల్లం రూపంలో ఉండే షుగర్‌ని వినియోగించుకోవచ్చు. ఈ రెండింటిని కాలాల వారిగా వినియోగించుకుంటే సులభంగా మంచి ఆరోగ్య ప్రయోజనాలను పొందగలరని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. శీతకాలం జీర్ణవ్యవస్థ మందగిస్తుంది. అందువల్ల ఆ కాలంలో బెల్లంతో చేసిన వంటకాలు లేదా భోజనం అయిన వెంటనే కొద్ది మొత్తంలో బెల్లాన్ని సేవిస్తే మంచిది. ఇక వేసవి కాలం చెమట రూపంలో నీరంతా బయటకు వెళ్లిపోయి గ్లూకోజ్ స్థాయిలు పడిపోతాయి. ఆ సమయంలో మనకు తక్షణ శక్తిని ఇచ్చే గ్లూకోజ్ రూపంలో పంచదారను తీసుకోవచ్చు. అదికూడా ఎక్కువగా ప్రాసెస్ చేయనిది పటికి బెల్లం రూపంలోని పంచదారని తీసుకుంటే ఎలాంటి హాని ఉండదని చెబుతున్నారు. బెల్లంలో రకాలు ప్రయోజనాలు.. ఇక బెల్లం దగ్గరకు వస్తే..చెరుకుని ఉడకబెట్టి తయారు చేసే సాధారణ బెల్లం గాక పలురకాలు బెల్లాలు మార్కెట్లో విరివిగా లభిస్తున్నాయి. అవేంటంటే.. చెరుకు బెల్లం: ఇది అందరికీ తెలిసిన సాధారణ బెల్లం. చెరకు రసాన్ని ఉడకబెట్టి తయారు చేస్తారు. ఈ బెల్లం ఎంత ముదురు రంగులో ఉంటే అంత మంచిదని అంటారు. ఇది ఎన్నోరకాల ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. జీర్ణక్రియ వ్యవస్థను మెరుగుపరచడంలో ఎంతగానో సహయపడుతుంది. దీనిలో సమృద్ధిగా పోషకాలు ఉంటాయి. తాటిబెల్లం: తాటి చెట్ల రసంతో తయారు చేస్థారు. ఈ తాటి బెల్లంలో ఐరన్ సమృద్ధిగా ఉంటుంది. ఐరన్ లోపంతో బాధపడుతున్న వ్యక్తులకు చాలా మంచిది ఈ తాటి బెల్లం. ఖర్జూర బెల్లం: ఖర్జూర రసం నుంచి తయారు చేస్తారు. దీనిలో ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ బెల్లాన్ని ఆసియా వంటకాల్లో ప్రసిద్దిగా ఉపయోగిస్తారు. కొబ్బరి బెల్లం: కొబ్బరి, తాటి చెట్ల రసం నుంచి తయారు చేస్తారు. ఈ కొబ్బరి బెల్లంలో పొటాషియం పుష్కలంగా ఉంటుఒంది. పంచదార పాకం వంటి రుచిని ఇస్తుంది. భారత్‌లో కొన్ని చోట్ల ఈ కొబ్బరిబెల్లం బాగా ప్రాచుర్యం పొందింది. నల్లబెల్లం: సాంప్రదాయ ఆయుర్వేద ఔషధాలను రూపొందించడానికి ఈ రకమైన బెల్లాన్ని వివిధ మూలికలు, సుగంధ ద్రవ్యాలను చేర్చి తయారు చేస్తారు. అందువల్ల ఇందులో ఇతరత్ర బెల్లముల కంటే అదనంగా ఔషధ గుణాలు ఉంటాయి. నువ్వుల బెల్లం: వేయించిన నువ్వులకు బెల్లాన్ని జతచేసి తయారు చేస్తారు. ఇందులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఆరోగ్య ప్రయోజనాలు.. బెల్లంలో ఇనుము, మెగ్నీషియం, పొటాషియం ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఇవిగాక కొద్ది మొత్తంలో బి విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు కూడా ఉంటాయి. ఇందులో ఉండే అధిక కార్బోహైడ్రేట్ కంటెంట్ కారణంగా శరీరానికి కావల్సిన తక్షణ శక్తిని అందిస్తుంది. కాలేయం తీరుని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది. శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపి రక్తాన్ని శుద్ది చేయడానికి ఉపయోగపడుతుంది. దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలకు చక్కని నివారిణిగా ఈ బెల్లం ఉపయోగపడుతుంది. ఎర్రరక్తకణాల ఉత్తత్తికి ఉపయోగడుతుంది. ముఖ్యంగా అనీమియాతో బాధపుడుతున్న రోగులకు ఇది మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. బరువు తగ్గాలనుకునేవారికి ఈ బెల్లం చక్కటి ప్రత్యామ్నాయం. ఇందులో కేలరీలు తక్కువుగా ఉంటాయి. అందువల్ల బరువుతగ్గాలనుకునే వారికి ఆరోగ్యకరమైన తీపి పదార్థంగా మంచి ఎంపిక. బెల్లంలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చర్మం ఆరోగ్యాన్ని మెరుగుపరచడమే గాక వృద్ధాప్య ఛాయలను ఎదుర్కొవడంలో మంచి ఔషధంగా ఉపకరిస్తుంది. (చదవండి: కంటి రెప్పపై కురుపులు లేదా గడ్డలు ఇబ్బంది పెడుతున్నాయా?) -
పరగడుపునే ఆ నీళ్లు తాగితే..బరువు తగ్గడం ఖాయం!
ఉదయాన్నే నీళ్లు తాగడం మంచిదని అందరికీ తెలిసిందే. పైగా మలబద్దకం ఉండదని తేలిగ్గా ఆహారం జీర్ణం అవుతుందని ఉదయాన్నే గోరువెచ్చగానో లేదా చల్లగానో నీళ్లు తాగుతున్నారు. ఐతే ఆ నీళ్లనే ఔషధ గుణం గల నీళ్లుగా తయారు చేసుకుని తాగితే అధిక బరువు సమస్య నుంచి ఈజీగా బయటపడొచ్చు అంటున్నారు వైద్యులు. ఇంతకీ ఆ ఔషధం గుణాలు గల నీళ్లు అంటే ఏమిటి? ఎలా చేసుకోవాలి తెలుసుకుందాం!. ఎలా ఔషధ గుణాలు గల నీళ్లుగా మార్చాలి? తెల్లవారుజామునే గోరువెచ్చని నీటిలో బెల్లం కలిపి తాగడం వల్ల శరీరానికి తక్షణ శక్తి లభిస్తుందని ఆరోగ్య నిపుణుల చెబుతున్నారు. ఇది అద్భుత ఔషధ గుణాలను అందిస్తుంది. పాన్‌లో ఒక గ్లాసు నీటిని పోసి వేడి చేసి దానికి ఒక అంగుళం బెల్లం వేసి కరిగాక చల్లార్చి వకట్టి త్రాగాలి. లేదా బెల్లం ముక్క ప్లేస్‌లో బెల్ల పొడిని కూడా ఉపయోగించొచ్చు. ఇలా నీళ్లను ఔషధ గణాల గల నీరుగా మార్చుకుని తాగితే మరింత ప్రయోజనం ఉంటుంది. బెల్లం జీవక్రియలను పెంచడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల ముఖ్యంగా అధిక బరువుతో బాధపడుతున్నవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. షుగర్ వల్ల బరువు పెరిగితే బెల్లం తినడం వల్ల బరువు అదుపులో ఉండి శరీరం ఫిట్‌గా ఉంటుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు. అలాగే బెల్లంలో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి. బెల్లం కండరాల బలానికి ఉపయోగపడుతుంది. మనం నిత్య జీవితంలో వినియోగించే బెల్లంతో కలిగే అద్భుత ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. ప్రస్తుతం బిజీ షెడ్యూల్ రీత్యా అంతా షుగర్‌నే ఎక్కువగా వాడేస్తున్నారు. అదీకాగా షుగర్ అయితే ఈజీగా నీటిలో కరిగిపోతుంది. దీంతో అందరూ దాన్నే ఉపయోగిస్తున్నారు. నిజానికి బెల్లం వల్లే కలిగే ప్రయోజనాలు ఏమీ చక్కెరలో ఉండవు. బెల్లంలో ఉండే పోషక ప్రయోజనాలతో మరొకటి పోటీపడలేదంటే అతిశయోక్తి కాదేమో!. బెల్లంలోని అనేక పోషకాలు ఆరోగ్యానికి అద్భుతంగా మేలు చేస్తాయి. బెల్లం తినడం వల్ల అనేక వ్యాధులు బారిన పడకుండా కాపాడుతుంది. ఇందులో కాల్షియం, జింక్, ఫాస్పరస్, కాపర్ వంటి విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉన్నాయి. (చదవండి: తుమ్ము వస్తే.. ఆపుకుంటున్నారా!ఇక అంతే సంగతులు) -
బెల్లం పొడి అమ్మేస్తోంది
ఇంట్లో అందరికీ షుగర్ వస్తే మంచి డాక్టర్ ఎవరా అని వెతుకుతారు అంతా.కాని ఎంబీఏ చేసి మంచి హోదాలో ఉన్న నవనూర్ కౌర్ మాత్రం ఉద్యోగం వదిలేసింది. లోకంలో ఇంత మందికి షుగర్ ఉందంటే చక్కెరకు ప్రత్యామ్నాయమైన బెల్లం అమ్మితేఅటు ఆరోగ్యం, ఇటు లాభం అని నిశ్చయించుకుంది. ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ స్థాపించి నాణ్యమైన బెల్లం పొడిని తెగ అమ్మేస్తోంది.టీలో కలపాలన్నా, స్వీట్ చేయాలన్నా బెల్లం పొడి బెస్ట్ అంటోంది. ఈమె వ్యాపారం జామ్మని సాగుతోంది. నవనూర్ కౌర్ ప్రచార చిత్రాలు ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఒక పోస్టర్లో ‘బెల్లం పాలు తాగితే ఎన్ని ఉపయోగాలో తెలుసా? వత్తిడి తగ్గుతుంది, స్త్రీలలో రుతుస్రావ సమస్యలు తగ్గుతాయి, హిమోగ్లోబిన్ పెరుగుతుంది, చర్మానికి మంచిది, జీర్ణక్రియ బాగుంటుంది, కీళ్ల నొప్పలు తగ్గుతాయి’. ఆ పోస్టర్ చూసినవారెవరైనా బెల్లం పాలు తాగాలనే అనుకుంటారు.ఇంకో పోస్టర్లో చక్కెరకు బెల్లానికి ఉన్న వ్యత్యాసాలు చూపిస్తుందామె. ‘చక్కెర రక్తంలో వెంటనే కరిగిపోతుంది. కాని బెల్లం మెల్లగా కరిగి మెల్లగా శక్తిని విడుదల చేస్తుంది. చక్కెరలో ఏ పోషకాలూ లేవు. బెల్లంలో ఐరన్, పొటాషియం ఉంటాయి. చక్కెర అసిడిటీ ఇస్తుంది. బెల్లం జీర్ణానికి అవసరమైన ఆల్కలైన్‌గా మారుతుంది’. నవనూర్ కౌర్ బెల్లం అమ్మకాల్లో ఏదో గుడ్డిగా ప్రవేశించలేదు. ఒక సంపూర్ణ అవగాహన, లక్ష్యంతో తన ప్రయాణాన్ని మొదలుపెట్టింది. బిజినెస్ స్కూల్ విద్యార్థి నవనూర్ కౌర్‌ది లూధియానా. తండ్రి ప్రొఫెసర్. తల్లి స్కూల్ ప్రిన్సిపాల్. చురుకైన విద్యార్థి అయిన నవనూర్ కౌర్ ఐఎంటి ఘజియాబాద్ నుంచి ఎంబీఏ చేసింది. వెంటనే కొటాక్ మహేంద్ర బ్యాంక్‌లో మంచి ఉద్యోగం వచ్చింది. కాని తనకు వేరే ఏదో చేయాలని ఉండేది. ఒకవైపు ఉద్యోగం చేస్తూనే చేయదగ్గ వ్యాపారం ఏమిటా అని ఆలోచిస్తే తమ కుటుంబంలో బంధువుల్లో షుగర్ పేషెంట్లు ఎక్కువగా ఉన్నారని అర్థమైంది. డయాబెటిస్ పేషెంట్లు, డయాబెటిస్ ఉన్నవాళ్లు తీపి కోసం బెల్లం ఉపయోగించాలని అనుకున్నా మార్కెట్లో దొరుకుతున్న బెల్లం నాణ్యంగా లేదని తెలుసుకుంది. ఆర్గానిక్ బెల్లం అని చెప్పి అమ్ముతున్నది కూడా కల్తీయే అని అర్థమయ్యాక ఒక వైపు ఉద్యోగంలో తాను సంపాదించిన ఐదు లక్షల రూపాయలతో బెల్లం పొడి తయారీ కేంద్రం పెట్టి, అందులో బెల్లం పొడి తయారు చేసి అమ్మాలని నిశ్చయించుకుంది. అవాంతరాలు ఆర్గానిక్‌గా చెరకు పండించి, రసాయనాలు లేకుండా బెల్లం తయారు చేసి సరుకు వేసేవారి కోసం నవనూర్ కౌర్ పంజాబ్, ఉత్తర ప్రదేశ్ చాలా తిరగాల్సి వచ్చింది. అలా ఇస్తామని చెప్పిన వారు కూడా మోసం చేయక తప్పని పరిస్థితిలో ఉన్నారని గ్రహించింది. అయితే అదృష్టవశాత్తు తన తండ్రి దగ్గర చదువుకుని సేంద్రియ పద్ధతిలో చెరకు పండిస్తున్న కౌశల్ అనే రైతు పంజాబ్‌లోనే ఆమెకు దొరికాడు. అతనికి బెల్లం తయారీ కేంద్రం కూడా ఉంది. ‘నువ్వు నాణ్యమైన బెల్లం తయారు చేయ్. నేను మార్కెటింగ్, బ్రాండ్ చూసుకుంటాను. ఇద్దరం కలిసి వ్యాపారం చేద్దాం’ అని చెప్పింది. కౌశల్ సరే అన్నాడు. ఇద్దరూ కలిసి ‘జాగర్‌కేన్’ అనే బ్రాండ్ మొదలుపెట్టారు. వెంటనే ఆదరణ నవనూర్ కౌర్ తయారు చేసిన బెల్లం పొడి వెంటనే ఆదరణ పొందింది. కల్తీ లేనిది కావడాన... రుచి కూడా బాగుండటాన అందరూ కొనడం మొదలెట్టారు. దుకాణం దారులు నిల్వ ఉండటం లేదని ఫిర్యాదు చేస్తే తగిన ప్రయోగాలు చేసి 9 నెలల పాటు నిల్వ ఉండేలా తయారు చేశారు. ఇప్పుడు 22 జిల్లాల్లో ఆమెకు డిస్ట్రిబ్యూషన్ ఉంది. గత సంవత్సరం 2 కోట్ల టర్నోవర్ వచ్చింది. మరో ఐదేళ్లలో 100 కోట్ల టర్నోవర్‌కు చేరుకుంటామని భావిస్తోంది. కృత్రిమమైన చక్కెర కంటే బెల్లం ఎక్కువ ఆరోగ్యకరమైనదని తెలుసుకునే కొద్దీ తనలా బెల్లం ఉత్పత్తులు చేసేవారు తప్పక విజయం సాధిస్తారని ఆమె గట్టిగా సందేశం ఇస్తోంది. ఉద్యోగాలు మంచివే అయినా ఒక మంచి వ్యాపార ఐడియా ఎక్కడికో చేర్చగలదు. నవనూర సక్సెస్ స్టోరీ అందుకు ఉదాహరణ. -
AP: లాభాల తీపి పెంచేలా
సాక్షి, అమరావతి : పంచదారతో పోలిస్తే బెల్లంలో పోషక విలువలు ఎక్కువ. ఔషధ గుణాలకూ కొదవ లేదు. జీర్ణశక్తిని పెంచడం.. రక్తహీనతను తగ్గించడం వంటి సుగుణాలెన్నో బెల్లానికి ఉన్నాయి. అయినా పంచదారకు ఉన్నంత డిమాండ్ బెల్లానికి లేదు. ఈ నేపథ్యంలోనే బెల్లంతో విలువ ఆధారిత ఇతర ఉత్పత్తుల్ని తయారు చేయడంపై అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం చెరకు రైతులకు, బెల్లం తయారీదారులకు శిక్షణ ఇస్తోంది. తద్వారా వారి ఆదాయాలను.. మరోవైపు బెల్లం వినియోగాన్ని పెంచేందుకు కృషి చేస్తోంది. బెల్లం పొడి.. మంచి రాబడి గ్లూకోజ్, ఫ్రక్టోజ్, ఇతర లవణాలు, ప్రోటీన్ల వల్ల త్వరగా బూజు పట్టడం, నీరు కారటం వంటి కారణాల వల్ల బెల్లం నాణ్యత చెడిపోతుంది. దీనిని నివారించేందుకు అనకాపల్లి చెరకు పరిశోధనా కేంద్రం బెల్లాన్ని పొడి రూపంలో మార్చే సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఈ పొడి గోధుమ వర్ణంలో పంచదార రేణువుల్లా ఉంటుంది. దీనికి అమెరికా, ఫిలిప్పీన్స్, కొలంబియా, ఇండోనేషియా దేశాల్లో డిమాండ్ ఎక్కువ. చెరకు రసాన్ని స్థిరీకరించిన మోతాదులో స్ప్రే డ్రైయింగ్ ద్వారా పొడి రూపంలో మార్చుకోవచ్చు. చాక్లెట్లు.. కేకుల తయారీ ఇలా డబుల్ బాయిలింగ్ పద్ధతిలో కరిగించిన వెన్నలో కోకో, బెల్లం పొడి కలిపిన మిశ్రమానికి జీడిపప్పు, బాదం పప్పు ముక్కలు అద్ది చాక్లెట్ అచ్చులలో వేయడం ద్వారా చాక్లెట్లు తయారవుతాయి. ఇదే తరహాలో చోడి పిండి, బెల్లం పొడి కలిపి కూడా చాక్లెట్లను తయారు చేసుకోవచ్చు. బెల్లం కేకు తయారీ కోసం కరిగించిన వెన్నలో బెల్లం పొడి, గోధుమ పిండిలో బేకింగ్ పౌడర్లను కలిపి తయారు చేసుకున్న మిశ్రమానికి కొద్దికొద్దిగా నీళ్లు వేస్తూ కాస్త జారుగా వచ్చేటట్లు కలుపుకోవాలి. ఆ తరువాత మైక్రో ఓవెన్లో 100–190 డిగ్రీల సెంటీగ్రేడ్‌లో 20 నిమిషాల పాటుచేసి.. 5 నిమిషాలపాటు చల్లారిస్తే రుచికరమైన కేక్ తయారవుతుంది. ఓట్స్ కుకీస్.. న్యూట్రీ బార్స్ వెన్న, బెల్లం పొడి కలిపిన మిశ్రమంలో గోధుమ పిండి, బేకింగ్ పౌడర్, నానబెట్టిన ఓట్స్, యాలకుల పొడివేసి కలిపిన మిశ్రమాన్ని పాలు లేదా నీళ్లు వేసి చపాతి ముద్దలా చేసి డీప్ ఫ్రిజ్‌లో 10 నిమిషాలు పెట్టాలి. ఆ తర్వాత చపాతి కర్రతో ఒత్తుకుని కావాల్సిన ఆకారాల్లో బిస్కెట్లుగా కోసి ట్రేలో అమర్చి మైక్రో ఓవెన్లో 120 సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 20 నిమిషాల పాటు బేకింగ్ చేస్తే రుచికరమైన బెల్లం ఓట్స్ కుకీస్ తయారవుతాయి. న్యూట్రీ బార్స్ తయారీ విషయానికి వస్తే.. బెల్లం లేత పాకం వచ్చిన తర్వాత తొలుత కొర్రలు, సామలు, జొన్నల మిశ్రమాన్ని ఆ తర్వాత వేరుశనగ పప్పు, బెల్లం, యాలకుల పొడిని వేసి బాగా కలిపి ట్రేలో వేసి సమానమైన ముక్కలు చేసి చల్లారనివ్వాలి. ఇలా తయారైన న్యూట్రీ బార్లను ఆకర్షణీయంగా ప్యాకింగ్ చేసి గాలి చొరబడని ప్రదేశంలో భద్రపర్చుకోవాలి. బెల్లం పానకం చెరకు రసాన్ని శుద్ధి చేసి మరగబెట్టిన తరువాత చిక్కటి పానకం తయారవుతుంది. దీనిని దోశ, ఇడ్లీలు, గారెలు, రొట్టెలతో చట్నీ లేదా తేనె మాదిరిగా కలిపి తింటారు. మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో దీనిని చపాతీలు, పూరీల్లో కూడా వాడుతుంటారు. పరిశోధనా కేంద్రం అభివృద్ధి చేసిన జాగరీ ప్లాంట్ ద్వారా హానికరమైన రసాయనాలను తొలగించి బెల్లం పానకం లేదా బెల్లం, బెల్లం పొడిని తయారు చేస్తారు. బెల్లం కాఫీ ప్రీమిక్స్.. జెల్లీస్.. సోంపు బెల్లం పొడిని పాలు, యాలకుల పొడితో కలిపి ప్రీమిక్స్ మిశ్రమాన్ని తయారు చేసుకోవచ్చు. దీనిని 7.5 గ్రాముల మోతాదులో 100 గ్రాముల వేడి నీళ్లలో కలిపితే రుచికరమైన కాఫీ తయారవుతుంది. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద 5 నిమిషాలు మరిగించిన చెరకు రసానికి తగిన మోతాదులో జెలటీన్ అడార్ జెల్‌ని కలిపి చల్లారిన తర్వాత మౌల్డ్‌లో వేసుకుని శీతల ఉష్ణోగ్రత వద్ద భద్రపరిస్తే బెల్లం జెల్లీ రెడీ అవుతుంది. అల్లం లేదా ఉసిరిని శుభ్రంగా కడిగి ముక్కలుగా కోసుకొని డ్రయ్యర్లో ఆరబెట్టి బెల్లం కోటింగ్ మెషిన్లో 30–70 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత వద్ద తగినంత నీరు కలిపిన బెల్లం పొడి ద్రావణాన్ని కొద్దికొద్దిగా వేస్తే బెల్లం కోటింగ్‌తో రుచికరమైన అల్లం, ఉసిరి ముక్కలు తయారవుతాయి. అదేరీతిలో సోంపును కూడా తయారు చేసుకోవచ్చు. పాస్తా.. నూడిల్స్ బెల్లంతో నూడిల్స్ లేదా పాస్తా తయారు చేసుకోవచ్చు. పుడ్ ఎక్స్‌ట్రూడర్ అనే మెషిన్లో గంటకు 25–35 కేజీల వరకు పాస్తా పదార్థాలను వివిధ ఆకారాల్లో తయారు చేయవచ్చు. బెల్లం పొడి, గోధుమ పిండి, మొక్కజొన్న రవ్వ, మైదా, రాగి పిండి మిశ్రమాన్ని పాస్తా మెషిన్లో ట్యాంక్‌లో వేస్తారు. తగినంత నీళ్లు పోసి 5–10 నిమిషాల పాటు మిక్సింగ్ చేసి మరో 45 నిమిషాల తర్వాత నచ్చిన ఆకారంలో ఉండే ట్రేలలో వేస్తే పాస్తాలు తయారవుతాయి. వాటిని డ్రయ్యర్లో 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత దగ్గర 5 గంటలపాటు ఆరబెడితే చాలు. శిక్షణ ఇస్తున్నాం బెల్లంతో ఇతర ఉత్పత్తుల తయారీలో పాటించాల్సిన సాంకేతిక అంశాలపై శిక్షణ ఇస్తున్నాం. విదేశాలకు ఎగుమతి చేసే విధంగా బెల్లం దిమ్మలు, పాకం, పొడి రూపంలో తయారయ్యేలా నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ఆధునిక బెల్లం తయారీ ప్లాంట్ రూపొందించాం – డాక్టర్ పీవీకే జగన్నాథరావు, సీనియర్ శాస్త్రవేత్త, అనకాపల్లి ప్రాంతీయ పరిశోధనా కేంద్రం -
Recipe: పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం.. తామర గింజలతో పాంజిరి
శీతాకాలం పగలు తక్కువ.. రాత్రి ఎక్కువ. రాత్రి వేళల్లో చలి ఎక్కువ. భోజనం బరువుగా ఉండకూడదు. అలాగని తక్కువ తింటే పోషకాలందవు. కొద్దిగా తిన్నా సరే... అది సమతులంగా ఉండాలి. ఆహారాన్ని దేహం వెచ్చగా ఒంటబట్టించుకోవాలి. అందుకే... ఇది ట్రై చేసి చూడండి. పాంజిరి కావలసినవి: ►సన్నగా తరిగిన బాదం – కప్పు ►యాలకుల పొడి – ఒకటిన్నర టీ స్పూన్లు ►దోస గింజలు – పావు కప్పు ►తర్బూజ గింజలు – పావు కప్పు ►పిస్తా పప్పు – పావు కప్పు (తరగాలి) ►వాము – అర టీ స్పూన్ ►ఎండు కొబ్బరి తురుము – కప్పు ►అల్లం తరుగు లేదా శొంఠి పొడి– 2 టేబుల్ స్పూన్లు ►జీడిపప్పు– కప్పు (చిన్న పలుకులు) ►తామరగింజలు – కప్పు ►వాల్నట్ తురుము – 3 టేబుల్ స్పూన్లు ►కిస్మిస్ – 3 టేబుల్ స్పూన్లు ►నెయ్యి– 3 టేబుల్ స్పూన్లు. ప్రధానమైన పదార్థాలు: ►సూజీ రవ్వ – కప్పు ►నెయ్యి – ఒకటిన్నర కప్పు ►గోధుమ పిండి – రెండున్నర కప్పులు ►బెల్లం పొడి – ఒకటిన్నర కప్పు. తయారీ: ►మందంగా ఉన్న బాణలిలో నెయ్యి వేడి చేసి తామర గింజలు (మఖానియా) వేయించాలి. ►వాటిని తీసి పక్కన పెట్టుకుని అదే బాణలిలో జీడిపప్పు, వాల్నట్, బాదం, తర్బూజ, దోసగింజలు, పిస్తా, కొబ్బరి తురుము, కిస్మిస్ వేసి సన్నమంట మీద దోరగా వేయించాలి. ►ఇందులో అల్లం తరుగు లేదా శొంఠి, వాము, యాలకుల పొడి కలిపి పక్కన ఉంచాలి. ►ఇప్పుడు ప్రధాన దినుసులను వేయించాలి. ►మరొక బాణలిలో నెయ్యి వేడి చేసి గోధుమ పిండి వేసి సన్నమంట మీద వేయించాలి. ►గోధుమ పిండి వేగి మంచి వాసన వస్తున్న సమయంలో సూజీ రవ్వ వేసి కలుపుతూ వేయించాలి. ►రవ్వ కూడా దోరగా వేగిన తర్వాత బెల్లం పొడి వేసి కలపాలి. ►ఇందులో ముందుగా వేయించి సిద్ధంగా ఉంచిన గింజల మిశ్రమాన్ని వేసి కలిపితే పాంజిరి రెడీ. ►దీనిని కప్పులో వేసుకుని పొడిగా స్పూన్‌తో తినవచ్చు. పాలిచ్చే తల్లులకు ప్రయోజనకరం ►పిల్లలు కింద పోసుకోకుండా మొత్తం తినాలంటే మరికొంత నెయ్యి వేసుకుని లడ్డు చేయాలి. ►ఇది ఉత్తరభారతదేశంలో బాలింతకు తప్పనిసరిగా పెట్టే స్వీట్. ►పాలిచ్చే తల్లికి తగిన శక్తినిచ్చే ఆహారం. చదవండి: Kismis Doughnuts: మైదాపిండి, పంచదార.. కిస్మిస్ డోనట్స్ తయారు చేసుకోండిలా! Amla Candy: ఆరోగ్య లాభాలెన్నో.. ఇంట్లోనే ఇలా ఆమ్ల క్యాండీ తయారీ Nuvvula Annam: చిన్నా పెద్దా లొట్టలేసుకుంటూ తినేలా నువ్వుల అన్నం తయారీ ఇలా -
Recipe: కోవా, బెల్లం కోరు, డ్రై ఫ్రూట్స్.. నోరూరించే పన్నీర్ హల్వా తయారీ ఇలా
స్వీట్‌ను ఇష్టంగా తినేవారు ఇలా పనీర్ హల్వా ఇంట్లోనే తయారు చేసుకోండి. పనీర్ హల్వా తయారీకి కావలసినవి: ►పనీర్ తురుము – 500 గ్రాములు ►బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్ష – 30 గ్రాముల చొప్పున ►నెయ్యి – పావు కప్పు (అభిరుచిని బట్టి పెంచుకోవచ్చు) ►పాలు – 200 మిల్లీలీటర్లు ►కోవా – 200 గ్రాములు ►కుంకుమపువ్వు – 1/4 టీస్పూన్ ►బెల్లం కోరు – 100 గ్రాములు ►ఏలకుల పొడి – 1/4 టీస్పూన్ ►పిస్తా – గార్నిషింగ్ కోసం తయారీ: ►ముందుగా బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను 1 టేబుల్ స్పూన్ నేతిలో దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి. ►అనంతరం సగం నెయ్యి వేసి.. పనీర్ తురుముని దోరగా వేయించాలి. అందులో పాలు పోసి.. గరిటెతో తిప్పుతూ ఉడికించాలి. ►పాలు దగ్గర పడగానే.. కోవా, కుంకుమ పువ్వు వేసుకుని గరిటెతో బాగా తిప్పాలి. ►అనంతరం బెల్లం కోరు, ఏలకుల పొడి వేసి.. తిప్పుతూ ఉండాలి. ►దగ్గర పడే సమయానికి మిగిలిన నెయ్యి కూడా వేసి కాసేపు.. గరిటెతో అటు ఇటు తిప్పి.. చివరిగా నేతిలో వేగిన బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షలను వేసి కలపాలి. ►సర్వ్ చేసుకునేముందు పిస్తా ముక్కలు వేసి సర్వ్ చేసుకుంటే భలే రుచిగా ఉంటుంది పనీర్ హల్వా. ఇవి కూడా ట్రై చేయండి: Malpua Sweet Recipe: గోధుమ పిండి, బొంబాయి రవ్వ, పాలు.. మాల్ పువా తయారీ ఇలా Kova Rava Burfi Sweet Recipe: నోరూరించే కోవా రవ్వ బర్ఫీ తయారీ.. -
Health: రాత్రి నానపెట్టి కిస్మిస్లను పరగడుపున తింటే! అందులోని లైపేజ్ వల్ల
డెంగ్యూ, టైఫాయిడ్, ఇతర వైరల్ ఫీవర్ల బారిన పడిన వారు నీరసం తగ్గి త్వరగా కోలుకునేందుకు పోషకాహార నిపుణులు సూచిస్తోన్న ఆహార చిట్కాలు. రాగులు రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన వంటకాలను అల్పాహారంగా తీసుకోవాలి. రాగులతో చేసిన దోశ తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు, రాగుల్లో ఉన్న పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగుల్లో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లో ఉన్న క్యాల్షియం, ఫాస్పరస్ ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. అందువల్ల రాగి జావ, రాగి రొట్టెలు చాలా మంచిది. బెల్లం బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఏ, ఈ, డీ, కే, క్యాల్షియం అధికంగా ఉంటాయి. ఈ రెండింటిని కలిపి భోజనం తరువాత తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగు పడడమేగాక, ఎముకలు దృఢంగా తయారవుతాయి. బాదం, కిస్మిస్ బాదం పప్పులు, కిస్మిస్లను రాత్రి నానపెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానపెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. కిచిడి అదే విధంగా రాత్రి డిన్నర్లో కిచిడి తినాలి. దీనిలో పదిరకాల ఎమినో యాసిడ్స్ ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. చదవండి: రాత్రిపూట పదే పదే మూత్ర విసర్జన: కెఫిన్, శీతల పానీయాలు.. ఇంకా వీటికి దూరంగా ఉండకపోతే -
Sweet Recipe: బెల్లం గవ్వలు తయారీ విధానం ఇలా!
దీపావళి పండుగ వేళ నోటిని తీపి చేసుకోవడం ఆనవాయితీ. అయితే, కొందరు డైట్లో ఉన్న కారణంగా అన్ని స్వీట్లు తినలేరు. ముఖ్యంగా పంచదారకు దూరంగా ఉంటారు చాలా మంది! బెల్లం తినగలిగే వారైతే పండుగనాడు ఇలా బెల్లం గవ్వలతో నోరు తీపి చేసుకుంటే సరి! బెల్లం గవ్వల తయారీకి కావలసిన పదార్థాలు: ►గోధుమ పిండి – ఒక కప్పు ►బెల్లం – ఒక కప్పు ►నెయ్యి – 3 టేబుల్ స్పూన్లు ►వంట సోడా – చిటికెడు. బెల్లం గవ్వల తయారీ విధానం ►ఒక గిన్నెలో గోధుమ పిండి, నెయ్యి, వంట సోడా వేసి నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా కలపాలి. ►ఆ తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వల పీట మీద ఒత్తుకోవాలి ►అవి ఆరిపోకుండా మూత పెట్టి ఉంచాలి ►ఆ తర్వాత బాణలిలో నూనె పోసి, వేడి చేయాలి. ►అందులో గవ్వలను వేసి, దోరగా వేయించి పక్కన పెట్టాలి ►మరో గిన్నెలో బెల్లం వేసి, మునిగేంత వరకు నీరు పోయాలి ►దీనిని స్టవ్ మీద పెట్టి, ఉండపాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ►బెల్లం పాకం వచ్చిన తర్వాత, స్టవ్ ఆఫ్ చేయాలి. ►అప్పటికే వేయించి పెట్టుకున్న గవ్వలను పాకంలో వేసి బాగా కలపాలి. ►వాటిని నెయ్యి రాసిన పళ్లెంలోకి మార్చువాలి ►చల్లారిన తర్వాత గవ్వలు విడివిడిగా వస్తాయి. ఇది కూడా ట్రై చేయండి: Bread Kaja Recipe: ఈసారి దీపావళికి బ్రెడ్ కాజా ఇలా తయారు చేసుకోండి! -
Bathukamma: మక్క సత్తు ముద్దలు తిన్నారా? ఇలా చేసుకోండి! ఆరోగ్య ప్రయోజనాలివే!
బతుకమ్మ వేడుకల్లో భాగంగా ‘అమ్మ’కు వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తారు. ఇక బతుకమ్మ అంటేనే సత్తుపిండి ఘుమఘుమలు ఉండాల్సిందే! ఎక్కువగా పెసరపప్పు, నువ్వులు, పల్లీలతో సత్తుపిండిని తయారు చేసుకుంటారు. వీటితో పాటు మొక్కజొన్న గింజలతో చేసే సత్తు(మక్క సత్తు అని కూడా అంటారు)తో చేసిన ముద్దలు(లడ్డూలు) కూడా ఎంతో రుచికరంగా ఉంటాయి. మొక్కజొన్న గింజలు, బెల్లం లేదంటే చక్కెర.. నెయ్యి ఉంటే చాలు మక్క సత్తు ముద్దలు చేసుకోవచ్చు. ఇలా తయారు చేసుకోండి ►ముందుగా మొక్కజొన్న గింజలు వేయించి.. చల్లారాక పొడి చేసుకోవాలి. ►అదే విధంగా బెల్లం తరుము లేదంటే పంచదారను పొడి చేసి పెట్టుకోవాలి. ►ఈ రెండింటి మిశ్రమంలో నెయ్యి వేసి ఉండలుగా చుట్టుకుంటే మక్క సత్తు ముద్దలు రెడీ. మొక్కజొన్నతో ఆరోగ్య ప్రయోజనాలు ఇవే! ►మొక్కజొన్న వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ►దీనిలో విటమిన్- ఏ, విటమిన్- బీ, సీ ఎక్కువ. ►మొక్కజొన్నలోని బీటా కెరోటిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ►ఇందులో విటమిన్ బీ12, ఫోలిక్ యాసిడ్, ఐరన్ పుష్కలం. ఇవి ఎర్రరక్త కణాల ఉత్పత్తికి తోడ్పడి.. రక్తహీనతను నివారించేందుకు దోహదపడతాయి. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మేలు చేస్తుంది. చదవండి: Malida Muddalu: మలీద ముద్దల తయారీ విధానం! వీటిని తింటే ఇన్ని ఆరోగ్య లాభాలా?! -
Beauty Tips: బెల్లం వాష్‌తో ముఖం మీది ముడతలకు చెక్!
బెల్లంలో ఆరోగ్యానికి మేలు చేసే కారకాలే కాదు.. అందాన్ని ఇనుమడింపజేసే గుణాలు కూడా ఉన్నాయి. బెల్లంతో తయారు చేసిన ఫేస్ వాష్ యాంటీ ఏజింగ్‌గా పనిచేసి ముడతలను తగ్గిస్తుంది. బెల్లంతో పాటు శనగపిండి, పెరుగు కలిపి తరచుగా ముఖానికి అప్లై చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇలా చేయండి! ►చిన్న బెల్లం ముక్క తీసుకుని ఒక గిన్నెలో వేసి, టీస్పూను నీళ్లుపోసి మరిగించాలి. ►బెల్లం కరిగిన తరువాత టీస్పూను శనగపిండి, టీస్పూను పెరుగు వేసి చక్కగా కలుపుకోవాలి. ►ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి ఏడు నిమిషాలపాటు గుండ్రంగా మర్దన చేయాలి. ►ఆరిన తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. ►ముఖాన్ని పొడిగా తుడుచుకుని మాయిశ్చరైజర్ లేదా అలోవెరా జెల్ రాసుకోవాలి. ►ఈ ఫేస్‌వాష్‌ను వాడడం వల్ల ముఖం కాంతిమంతంగా కనిపిస్తుంది. ►వారానికి రెండుసార్లు క్రమం తప్పకుండా వాడడం వల్ల ముఖం మీద ముడతలు తగ్గుముఖం పడతాయి. చదవండి: Benefits Of Tamarind Syrup: చింతపండు సిరప్‌ను ముఖానికి రాసుకున్నా, నేరుగా తాగినా సరే! అద్భుత ప్రయోజనాలు! Benefits Of Onion Juice: ఉల్లి రసాన్ని కొబ్బరి నూనెతో కలిపి జుట్టుకు పట్టిస్తే! -
దిల్ ‘మ్యాంగో’మోర్... సమ్మర్ ఎండ్ పికిల్స్ ట్రెండ్
వేసవి ముగింపుకొచ్చింది. దాంతో పాటే సీజన్లో ఆవకాయ పచ్చడి తయారు చేసుకునే సమయం కూడా. ఆవకాయ అంటే ఒక పచ్చడి కాదు కొన్ని పచ్చళ్ల సమ్మేళనం. ఆ కొన్ని పచ్చళ్ల విశేషాలు... ► మామిడి ఆవకాయ తెలియనిదెవరికి?కనీస పదార్థాలతోనే చేసుకునేందుకు, ఎక్కువకాలం నిల్వఉంచుకునే వీలు వల్ల ఇది జాబితాలో అగ్రభాగంలో ఉంటుంది. ► బెల్లం తియ్యదనం, మామిడిలోని పుల్లదనం... కలిపిందే బెల్లం ఆవకాయ. అయితే బెల్లం నాణ్యత బాగుండాలనేది ఈ పచ్చడి పెట్టేటప్పుడు మర్చిపోకూడని విషయం. ► నువ్వులతో మామిడి పచ్చడి తయారు చేస్తారు. దీనినే నువ్వు ఆవకాయ అని కూడా అంటారు. కాకపోతే ఈ నువ్వులను పొడి రూపంలో వాడతారు. ► అల్లం ఆవకాయ వెల్లుల్లి పేస్ట్ మేళవింపు మరో రకం పచ్చడి. అయితే అల్లం తాజాగా ఉండాలి. పెరుగన్నంతో ఈ పచ్చడి అత్యుత్తమ కాంబినేషన్ . ► పల్లి ఆవకాయ నిల్వ పచ్చడి కాదు కానీ ఫ్రిజ్‌లో ఉంచితే ఓ వారం బాగానే ఉంటుంది. పల్లీలు నాణ్యతతో ఉంటే పచ్చడి మరింతగా నిల్వ ఉంటుంది. ► ఎక్కువ కాలం పచ్చడి నిల్వ ఉండాలనుకుంటే ఎండు మామిడి పచ్చడిని ఎంచుకోవాలి. ఎండబెట్టిన మామిడికాయలతో ఇది తయారు చేస్తారు. ► ఇవి గాక పెసర ఆవకాయ, మామిడి అల్లం ఊరగాయ, పండు మిరపకాయ నిల్వ పచ్చడి వంటివి కూడా ఈ సీజన్ లో ట్రై చేయొచ్చు. ‘‘చిన్నతనంలో ఇంటిలో పచ్చళ్లు తయారు చేసుకోవడం అంటే కుటుంబసభ్యులు, స్నేహితులను కలుసుకోవడం కూడా. భోజనం సమయంలో ఆవకాయ లేదా మరేదైనా పచ్చడి వాసన చూస్తేనే ఎక్కడా లేని ఆనందం కలిగేది’’ అని గోల్డ్‌డ్రాప్ డైరెక్టర్ మితేష్ లోహియా గుర్తు చేసుకున్నారు. -
అనకాపల్లి టు అమెరికా.. భలే గిరాకీ
అనకాపల్లి: తాతల నుంచి వచ్చిన వృత్తి.. దానికి వినూత్న ఆలోచనలు జత కలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కలగలిపారు. ప్రజల ఆరోగ్యం కోసం విటమిన్లు వేశారు. వెరసి అనకాపల్లి బెల్లం దేశదేశాలకు వెళ్తోంది. ఆంధ్రా నుంచి అమెరికాకు బెల్లాన్ని అందిస్తున్న ఆ రైతు అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఆయనే వేగి శ్రీనివాసరావు. ప్రధాన వాణిజ్య పంటల్లో ఒకటయిన చెరకు సాగు, ఉత్పత్తుల్లో ఆయన అద్భుతాలు సృష్టిస్తున్నారు. అత్యధిక నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఎటువంటి కలుషితం కాని బెల్లాన్ని అమెరికాకు కూడా ఎగుమతి చేస్తున్నారు. బీఏ, మెటలర్జీలో డిప్లొమా చదివిన శ్రీనివాసరావు సొంతూరు అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం రాజుపేట. శ్రీనివాసరావుది వ్యవసాయ కుటుంబం. తాతల కాలం నుంచి బెల్లం తయారీలో నిమగ్నమైన కుటుంబమది. శ్రీనివాసరావు కూడా వ్యవసాయం చేశారు. పామాయిల్, జీడిమామిడి, సరుగు సాగు చేశారు. అవి పెద్దగా కలిసి రాకపోవడంతో మళ్లీ బెల్లం తయారీపై దృష్టి సారించారు. తాతయ్య కాలం నుంచి వినియోగిస్తున్న బెల్లం క్రషర్‌తో బెల్లం తయారీ ప్రారంభించారు. ఇక్కడే ఆయన వినూత్నంగా ఆలోచించారు. మిగతా తయారీదారులకంటే తాను మరింత నాణ్యమైన సరుకు ఎలా తయారుచేయాలో ఆలోచించారు. బెల్లం తయారీలో సహజంగా సల్ఫర్, పంచదార వినియోగిస్తుంటారు. అయితే మనిషి ఆరోగ్యానికి హాని కలగజేసే ఈ పదార్థాలను శ్రీనివాసరావు ఉపయోగించరు. సుక్రోజు, విటమిన్ ఏ, విటమిన్ సీ తగిన మోతాదులో కలిపి అత్యున్నత ప్రమాణాలతో బెల్లం తయారీ ప్రారంభించారు. పంచదారతో సంబంధం లేకుండా, రంగుకు ప్రాధాన్యమివ్వకుండా, హైడ్రోస్ కలపకుండా బెల్లం అందించడమే ఆయన లక్ష్యం. ఇందుకోసం ఆయన తమిళనాడు, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో పర్యటించి ఆధునిక పద్ధతుల్లో బెల్లం తయారు చేసే యూనిట్లను పరిశీలించారు. మహారాష్ట్ర, కర్ణాటక, అనకాపల్లి పరిశోధన కేంద్రాల్లో విలువ ఆధారిత బెల్లం తయారీ గురించి తెలుసుకున్నారు. రూ.10 లక్షలతో ప్రారంభం సంప్రదాయ పద్ధతిలో బెల్లం తయారీకి మొదట రూ.10 లక్షలతో యూనిట్‌ను ప్రారంభించారు. 5 గ్రాముల నుంచి 850 గ్రాముల బరువు బెల్లం దిమ్మలు, కుందులు, పౌడర్, బెల్లం ద్రావణాన్ని తయారీ మొదలెట్టారు. క్రమంగా వ్యాపారం పెంచుకుంటూ పోయారు. భారత దేశం నుంచి ప్రపంచ దేశాలకు 8 మిలియన్ టన్నుల బెల్లం డిమాండ్ ఉంది. ఆరు మిలియన్ టన్నుల బెల్లాన్ని మాత్రమే ఎగుమతి చేయగలుగుతున్నారు. దీంతో బెల్లం ఎగుమతి పైనా శ్రీనివాసరావు దృష్టి పెట్టారు. విదేశీయులు ఇష్టపడే ఫ్లేవర్లలో బెల్లం తయారు చేయాలని నిర్ణయించారు. రూ. 2.5 కోట్లతో కొత్త యూనిట్ నెలకొల్పారు. శ్రీనివాసరావు ఎరుకునాయుడు ఆగ్రోస్ కంపెనీ పేరుతో అంతర్జాతీయ ప్రమాణాలతో బెల్లం తయారీ మొదలెట్టారు. ఇందుకోసం అత్యాధునిక యంత్రాలు తెప్పించారు. 40 మంది నిపుణులైన ఉద్యోగులను నియమించారు. చక్కని ప్యాకింగ్‌తో విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. ముందుగా మారిషస్‌కు, తర్వాత ఆఫ్రికా, యూరోప్ దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించారు. అంతర్జాతీయ ప్రమాణాలు పాటించినందుకు గాను ఐఎస్వో 22000, హెచ్ఏసీసీపీ, ఐఎస్వో 1001 పత్రాలను పొందారు. ప్రస్తుతం అమెరికా నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. ఏడాదికి 5 వేల టన్నుల చెరకు క్రషింగ్‌తో బెల్లం, ఉప ఉత్పత్తులను తయారు చేసి ఎగుమతి చేస్తున్నారు. బెల్లం సరఫరాకు శ్రీనివాసరావుకు ఆఫ్రికా దేశం ఘనా నుంచి అందిన టెండర్ సర్టిఫికెట్ రైతుకూ ఎక్కువ ధర ఒకవైపు చక్కెర కర్మాగారాలు గిట్టుబాటు కాక నష్టాల బాటన పడుతున్నాయి. చెరకు కొన్నందుకు రైతులకు కనీస ధర ఇవ్వలేకపోతున్నాయి. ఇదే సమయంలో శ్రీనివాసరావు చెరకు టన్నుకు రూ.2,800 వరకు ఇస్తున్నాడు. మాకవరపాలెం, నాతవరం, యలమంచిలి, గొలుగొండ, రోలుగుంట ప్రాంతాల నుంచి చెరకు కొంటున్నారు. శ్రీనివాసరావును ఆదర్శంగా తీసుకుంటే ప్రతి రైతు ఆదర్శ పారిశ్రామికవేత్త కావచ్చు. చెరకు సాగును కాపాడుకుందాం వాణిజ్య పంటైన చెరకు సాగును మనం కాపాడుకోవాలి. మా తాతగారు, తండ్రి ఆదర్శంగా బెల్లాన్ని నాణ్యత ప్రమాణాలతో తయారు చేస్తున్నా. రూ.10 లక్షలతో మా తండ్రి పేరిట ఆగ్రోస్ యూనిట్ నెలకొల్పా. ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో తయారు చేసిన బెల్లాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్నా. తాజాగా అమెరికా నుంచి కూడా ఆర్డర్లు వస్తున్నాయి. మా దగ్గర తయారయ్యే బెల్లం నాణ్యతతో కూడుకొన్నది. సేంద్రియ పద్ధతుల్లో తయారు చేస్తున్నాం. అందువల్లే డిమాండ్ పెరుగుతోంది. – వేగి శ్రీనివాసరావు -
బడి పిల్లల మధ్యాహ్న భోజనంలో మార్పులకు కేంద్రం నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని (ప్రధానమంత్రి పోషక్ పథకం) సమూలంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనపు పోషక విలువలున్న ఆహారాన్ని అందించేందుకు కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఈ విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేయాలని సూచించింది. విద్యార్థులందరికీ మధ్యాహ్నం పోషకాలు ఎక్కువగా ఉండే రాగిజావను ఇవ్వాలని, దీంతోపాటే మొలకలు, బెల్లం అందించాలని పేర్కొంది. దీని అమలుకు గల సాధ్యాసాధ్యాలపై రాష్ట్రాల నుంచి అభిప్రాయాలు కోరింది. అయితే, దీనిపై సమగ్ర అధ్యయనం చేయాల్సిఉందని రాష్ట్ర విద్యాశాఖ అధికారులు అంటున్నారు. దీనికి అదనపు నిధులు ఎలా సర్దుబాటు చేయాలన్న దానిపైనా స్పష్టత లేదని విద్యాశాఖలో అదనపు డైరెక్టర్ స్థాయి అధికారి ఒకరు చెప్పారు. గతంలో కూడా మధ్యాహ్నం భోజనంతోపాటు పల్లీ పట్టీ ఇవ్వాలని కేంద్రం సూచించిందని, పెరిగిన ధరల ప్రకారం దీన్ని అమలు చేయడం సాధ్యం కాలేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. రాగిజావను విధిగా ఇవ్వాల్సిందేనని కేంద్రంనుంచి ఒత్తిడి వస్తున్నట్టు చెప్పాయి. ఇప్పుడిచ్చే ఆహారంలో స్వల్ప మార్పులు చేసి రాగిజావ, బెల్లం, మొలకలు అందించే విషయం పరిశీలిస్తున్నామని, దీనిపై నిర్ణయం తీసుకుంటామని తెలిపాయి. జాతీయ సర్వే ప్రకారమే.. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల ప్రభుత్వ పాఠశాలలున్నాయి. ఇందులో 20 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరికి రోజూ మధ్యాహ్న భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై కేంద్రస్థాయిలో కొన్నేళ్లుగా తరచూ సర్వేలు చేస్తున్నారు. స్కూలు సమయానికి విద్యార్థుల కుటుంబాల్లో సరైన పోషక విలువలున్న ఆహారం అందించడం లేదని సర్వేలో తేలింది. తల్లిదండ్రులు ఉపాధి కోసం హడావిడిగా ఉదయం వెళ్లాల్సి రావడం, విద్యార్థులు కూడా ఇంట్లో ఉన్నదేదో తిని వస్తున్నారని, దీంతో చాలామందిలో పోషకాహార లోపం కన్పిస్తోందని వెల్లడైంది. ఐదేళ్లుగా కనీసం 40 శాతం మంది విద్యార్థులు రక్తహీనత, ఇతర ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. 32 శాతం మందిలో పోషక విలువలు లోపించడం వల్ల దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడుతున్నారని వెల్లడైంది. వీళ్లంతా ఎక్కువ రోజులు స్కూలుకు హాజరవ్వడం లేదని, ఫలితంగా విద్యా ప్రమాణాలు దెబ్బతింటున్నాయని సర్వే పేర్కొంది. ఈ నేపథ్యంలో బడిలోనే పోషకాలతో కూడిన ఆహారం అందించాలని ప్రతిపాదించింది. ఇందులో ప్రధానంగా రాగిజావ ఇవ్వాలని భావిస్తున్నారు. దీన్ని రోజూ ఇవ్వడమా? వారంలో కొన్ని రోజులు ఇవ్వడమా? అనే దానిపై రాష్ట్రాలు నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అధికారులు అంటున్నారు. నిధుల సర్దుబాటు ఎలా? మధ్యాహ్న భోజన పథకానికి కేంద్రం 60 శాతం, రాష్ట్రాలు 40 శాతం నిధులు మంజూరు చేస్తున్నాయి. ఈ పథకానికి ఏటా రూ.550 కోట్లు ఖర్చవుతుంది. ప్రస్తుతం విద్యార్థులకు రోజుకో విధంగా ఆహారం ఇస్తున్నారు. వారానికి మూడు రోజులు గుడ్డు, మిగతా రోజుల్లో ఆకు కూరలు, కాయగూరలు, సాంబార్, కిచిడీ ఇలా పలు రకాలుగా అందిస్తున్నారు. అయితే, కేంద్రం మెనూ ప్రకారం ధరలను నిర్ణయిస్తారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఇవి ఉండటం లేదని రాష్ట్ర అధికారులు అంటున్నారు. ఒక్కో గుడ్డు ధర దాదాపు రూ.6 ఉంటే.. ప్రభుత్వ లెక్కల్లో మాత్రం రూ.2 మాత్రమే ఉంటోంది. దీంతో నిధుల సర్దుబాటు సమస్య వస్తోంది. ఇప్పుడు కూడా రాగిజావ, మొలకల కోసం ప్రత్యేక నిధులు అవసరమవుతాయని, లేని పక్షంలో పథకం అమలులో అనేక ఇబ్బందులు వస్తాయని అధికారులు చెబుతున్నారు. (చదవండి: అంచు చీరలే ఆ‘దారం’) -
Health Tips: పనసతొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకుంటే..
Jackfruit Surprising Health Benefits: పనసలోని యాంటీఆక్సిడెంట్స్ క్యాన్సర్, టైప్ –2 డయాబెటీస్, గుండె సంబంధిత వ్యాధులను దరిచేరనీయ్యవు. యాంటీ ఆక్సిడెంట్స్‌తోపాటు యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు రక్తంలోని గ్లూకోజ్, రక్తపీడనం, కొలెస్ట్రాల్ స్థాయులను నియంత్రణలో ఉంచుతాయి. ►పనస తొనలతో పాటు కొబ్బరి పాలు, బెల్లంను కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి ఆరోగ్యకరమైన కొవ్వులు అందుతాయి. ►పనస జ్యూస్ తాగినప్పుడు పొట్ట నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు. ►ఫలితంగా తక్కువ ఆహారం తీసుకోవడం వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. ►విటమిన్ సి, ఈ, లారిక్ యాసిడ్లలోని యాంటీసెప్టిక్ గుణాల వల్ల బ్యాక్టీరియా, వైరస్, శిలీంధ్రాల వల్ల కలిగే వ్యాధులు దరిచేరవు. ►కొబ్బరిపాలు, బెల్లంలలో కావల్సినంత ఐరన్ ఉంటుంది. ►దీని జ్యూస్ తాగడంవల్ల హిమోగ్లోబిన్ స్థాయులు పెరగి రక్త హీనత సమస్య ఎదురవదు. ►జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపపడుతుంది. ►చర్మం, వెంట్రుకల ఆరోగ్యాన్ని పెంపొందించడంలో ఈ జ్యూస్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జాక్‌ఫ్రూట్ షేక్‌కు కావలసినవి: ►గింజలు తీసిన పనస తొనలు – రెండు కప్పులు ►చిక్కటి కొబ్బరి పాలు – కప్పున్నర ►బెల్లం తరుగు – నాలుగు టేబుల్ స్పూన్లు ►నీళ్లు – అరకప్పు, ఐస్ క్యూబ్స్ – ఎనిమిది. తయారీ... ►పనస తొనలను సన్నగా తరిగి బ్లెండర్లో వేయాలి ►తొనలకు బెల్లం, కొబ్బరిపాలను జోడించి మెత్తగా గ్రైండ్ చేయాలి ►మెత్తగా నలిగిన తరువాత ఐస్ క్యూబ్స్, అర కప్పు నీళ్లుపోసి మరోసారి గ్రైండ్ చేయాలి. ►అన్నీ చక్కగా గ్రైండ్ అయ్యాక వెంటనే గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. వేసవిలో ట్రై చేయండి: Summer Drinks: యాపిల్, నేరేడు.. జ్యూస్ కలిపి తాగితే.. కలిగే లాభాలివే! -
తోతాపురి మామిడికాయలు, అరకేజీ బెల్లం.. రుచికరమైన ఆవకాయ రెసిపీ!
బెల్లం ఆవకాయను ఇష్టపడే వారు చాలా మందే ఉంటారు. మరి ఈ వంటకం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామా! బెల్లం ఆవకాయ తయారీకి కావలసినవి: ►తోతాపురి మామిడికాయలు – ఐదు ►బెల్లం – అరకేజీ ►నువ్వులనూనె – పావుకేజీ ►ఆవాలు – పావు కేజీ ►కారం – కప్పు, ఉప్పు – కప్పు ►మెంతులు – రెండు టీస్పూన్లు ►పసుపు – రెండు టీస్పూన్లు ►ఇంగువ – అరటీస్పూను ►తొక్కతీసిన వెల్లుల్లి రెబ్బలు – కప్పు. బెల్లం ఆవకాయ తయారీ విధానం ►ముందుగా మామిడి కాయలను శుభ్రంగా కడిగి పొడిగా తుడుచుకోవాలి. ►కాయల్లో జీడి తీసేసి ముక్కలు చేసుకోవాలి. టెంకపైన ఉన్న జీడిపొరను తీసేసి శుభ్రంగా తుడవాలి. ►ఆవాలు, మెంతులను గంటపాటు ఎండబెట్టి పొడిచేసుకోవాలి ►ఇప్పుడు పెద్ద గిన్నెతీసుకుని ఆవపొడి, పసుపు, మెంతి పిండి, కారం, ఉప్పు వేసి కలపాలి. ►ఇప్పుడు బెల్లాన్ని సన్నగా తురిమి వేయాలి. దీనిలో ఇంగువ కూడా వేసి చక్కగా కలపాలి. ►ఇప్పుడు మామిడికాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి చేతితో కలపాలి. ►తర్వాత కొద్దిగా ఆయిల్ తీసి పక్కనపెట్టి, మిగతా ఆయిల్ వేసి కలపాలి. ►ఈ మిశ్రమాన్ని పొడి జాడీలో వేసి పైన మిగతా ఆయిల్ వేయాలి. ►మూడు రోజుల తరువాత పచ్చడిని ఒకసారి కలపాలి, జాడీలో నిల్వచేసుకోవాలి. చదవండి👉🏾Mango Pickle In Telugu: నోరూరించే నువ్వుల ఆవకాయ.. తొక్కుడు పచ్చడి.. తయారీ ఇలా చదవండి👉🏾Egg Bread Manchuria: గుడ్లు, టమాటా, పచ్చిమిర్చి.. నోరూరించే ఎగ్ బ్రెడ్ మంచూరియా రెసిపీ -
Health Tips: కోవిడ్ నుంచి త్వరగా కోలుకునేందుకు... బాదం, రాగి దోశ, బెల్లం, కిచిడి..
కోవిడ్ బారిన పడ్డవారు, ఇప్పుడిప్పుడే దానినుంచి కోలుకుంటున్న వారు త్వరగా శక్తిని పుంజుకుని, ఇమ్యూనిటీని పెంచుకునేందుకు సెలబ్రెటీలు, పోషకాహార నిపుణులు సూచిస్తున్న ఆహార చిట్కాలు... ►నాలుగైదు బాదం పప్పులు, పది కిస్మిస్లను రాత్రి నానబెట్టుకుని ఉదయాన్నే పరగడుపున తినాలి. నానబెట్టిన కిస్మిస్లు శరీరంలో లైపేజ్ ఎంజైమ్‌ను విడుదల చేసి ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు తోడ్పడతాయి. బాదం పప్పు శరీరానికి తగిన పోషకాలను అందిస్తాయి. ►రాగుల్లో క్యాల్షియం, పీచు పదార్థం అధికంగా ఉంటుంది. అందువల్ల రాగులతో చేసిన దోశ వంటి వాటిని తినడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగు పడడంతోపాటు వాటిలోని పాలీఫీనాల్స్ డయాబెటిక్ రోగులలో గ్లైసిమిక్ స్పందనలను తగ్గిస్తాయి. రాగుల్లోని క్యాల్షియం, ఫాస్పరస్‌లు ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. రాగుల్లో అధికంగా ఉండే ఐరన్ జీవక్రియలను మెరుగు పరిచి ఎర్ర రక్తకణాలకు పోషకాలను అందిస్తుంది. ►బెల్లంలో ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, విటమిన్ బి, సి అధికంగా ఉంటాయి. నెయ్యిలో ఫ్యాటీ యాసిడ్స్, విటమిన్ ఎ,ఇ, డి, కే, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఈ రెండింటిని తీసుకోవడం వల్ల జీర్ణశక్తి మెరుగుపడడమేగాక, ఎముకలు గట్టిపడతాయి. ►రాత్రి పూట తీసుకునే ఆహారంలో కిచిడి ఉండాలి. దీనిలో పదిరకాల అమినో యాసిడ్స్, ప్రోటీన్లు, పీచుపదార్థం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. దీనిలో కాస్త నెయ్యి వేసుకుని తింటే మరింత మంచిది. పలుచటి మజ్జిగ, సగ్గుజావ, రాగిజావ వంటివి తాగాలి. ఇవి శరీరంలో నీటి శాతాన్ని సమస్థితితో ఉంచడమేగాక జీర్ణక్రియ సక్రమంగా జరిగేందుకు తోడ్పడతాయి. చదవండి: Pista Pappu Benefits: రోజూ పిస్తా పప్పు తింటున్నారా.. అయితే అందులోని విటమిన్ బీ6 వల్ల.. -
Healthy Recipes: నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది.. కాబట్టి
కొత్త క్యాలెండర్ వచ్చింది. సంక్రాంతి తేదీని తెచ్చింది. నాన్న కొత్త దుస్తులు తెచ్చాడు. అమ్మ పిండివంటలకు సిద్ధమవుతోంది. ఏం చేయాలి? ఎలా చేయాలి? ఎప్పుడూ చేసే అరిశెలేనా! మరి... అరిశె బదులు మరేం చేసినా... సంక్రాంతి... పండుగ కళ తప్పుతుంది. అందుకే ఆరోగ్యాన్ని పెంచే అరిశెలనే చేద్దాం. అరిశెలతోపాటు మరికొన్నింటినీ చేద్దాం. ఏటా వచ్చే సంక్రాంతి రుచినే కొత్తగా ఆస్వాదిద్దాం. సంక్రాంతి పిండివంటల్లో ఉపయోగించే దినుసులన్నీ ఆరోగ్యకరమైనవే. బెల్లంలో ఐరన్ ఉంటుంది. నువ్వుల్లో మోనో అన్‌శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది మహిళల్లో హార్మోన్ లెవెల్స్‌ను మెయింటెయిన్ చేస్తుంది. జంక్ ఫుడ్ మాదిరిగా వీటిని తినగానే ఒంట్లో గ్లూకోజ్ లెవెల్స్ పెరగడం జరగదు. నెమ్మదిగా డెవలప్ అవుతాయి. వీటిలో పోషకాలు, కేలరీలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పండుగలకే కాకుండా రోజూ స్నాక్స్‌గా తీసుకుంటే మంచిది. ఎక్కువ మోతాదులో తిన్నప్పుడు ఒంట్లోకి ఎక్కువ కేలరీలు చేరిపోవడంతో అధిక బరువు సమస్య వస్తుంటుంది. చక్కటి డైట్ ప్లాన్‌తో వీటిని రోజుకు ఒకటి తింటే మంచిది. పిల్లలకు స్కూల్‌కి ఇతర స్నాక్స్‌కు బదులుగా వీటిని అలవాటు చేయవచ్చు. సహజంగా పోషకాలు, కేలరీలు అందుతాయి. వీటిని తిన్న తరువాత పిల్లలకు కాని పెద్దవాళ్లకు కాని చిప్స్ వంటి ఇతర జంక్‌ఫుడ్ మీదకు మనసు పోదు. అయితే వీటిని తయారు చేయడానికి మంచినెయ్యి వాడాలి. అరిశెలు కావలసినవి: బియ్యం – ఒక కిలో బెల్లం – 800 గ్రా., నువ్వులు, గసగసాలు– కొద్దిగా నెయ్యి లేదా నూనె– కాల్చడానికి సరిపడినంత (సుమారుగా ఒక కేజీ తీసుకుంటే చివరగా బాణలిలో పావుకేజీ మిగులుతుంది) తయారీ: అరిశెలు చేయడానికి ముందు రోజు నుంచి ప్రిపరేషన్ మొదలు పెట్టాలి. బియ్యాన్ని ముందు రోజు రాత్రి కడిగి నానబెట్టాలి. ఉదయాన్నే నీళ్లను వంపేసి తడిగా ఉన్నప్పుడే దంచాలి. దంచిన పిండిని సన్నని రంధ్రాలున్న జల్లెడతో జల్లించాలి ∙జల్లించేటప్పుడు పిండి ఆరిపోకుండా జాగ్రత్త తీసుకోవాలి. గాలికి ఆరకుండా ఎప్పటికప్పుడు ఒకపాత్రలో వేసి అదిమి మూత పెట్టాలి ∙పిండి సిద్ధమయ్యాక బెల్లాన్ని పాకం పట్టాలి పెద్దపాత్రలో ఒక గ్లాసు నీరు, పొడి వేసి పాకం వచ్చేదాకా మరగనిచ్చి బియ్యప్పిండి కలుపుకుంటే పాకం పిండి సిద్ధం. ఇప్పుడు బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగనివ్వాలి ∙పాకంపిండిని చపాతీకి తీసుకున్నట్లుగా తీసుకుని గోళీ చేసి గసాలు లేదా నువ్వులలో లేదా రెండింటిలోనూ అద్దాలి. ఇలా అద్దినట్లయితే అవి పిండికి చుట్టూ అంటుకుంటాయి ∙అప్పుడు పాలిథిన్ పేపర్ మీద పెట్టి వేళ్లతో వలయాకారంగా అద్ది కాగిన నూనెలో వేసి దోరగా కాలిన తర్వాత తీసి అరిశెల పీట మీద వేసి అదనంగా ఉన్న నూనె కారిపోయేటట్లు వత్తాలి ∙అరిశెల పీటకు బదులుగా రంధ్రాలున్న చెక్కలుంటాయి ∙వీటితో బాణలిలో నుంచి తీసేటప్పుడే నూనె వదిలేటట్లు వత్తేయవచ్చు. గమనిక:– అరిశె నొక్కులు పోకుండా వలయాకారంగా అంతా ఒకే మందంలో రావాలంటే చేతితో అద్దడానికి బదులుగా పూరీ ప్రెస్సర్ వాడవచ్చు ∙అరిశె మెత్తగా రావాలంటే పాకం లేతగా ఉన్నప్పుడే బియ్యప్పిండి కలుపుకోవాలి. గట్టిగా ఎక్కువ తీపితో కావాలనుకుంటే పాకం ముదరనివ్వాలి. ఒక ప్లేటులో నీళ్లు పోసి ఉడుకుతున్న బెల్లం మిశ్రమాన్ని స్పూనుతో కొద్దిగా తీసుకుని నీటిలో వేయాలి. దీనిని చేత్తో నొక్కి రౌండ్ చేయాలి. జారి పోకుండా రౌండ్ వచ్చిందంటే పాకం వస్తున్నట్లు. ఆ రౌండ్‌ను పైకెత్తి ప్లేటు మీద వేసినప్పుడు మెత్తగా జారిపోకుండా అలాగే ఉంటే పాకం వచ్చినట్లు. ముదురు పాకం కావాలనుకుంటే ఆ పాకం బాల్ ప్లేటుకు తగిలినప్పుడు ఠంగున శబ్దం వచ్చే దాకా మరగనివ్వాలి. ఇవి పదిహేను రోజుల వరకు తాజాగా ఉంటాయి. తినేటప్పుడు పెనం మీద సన్న సెగకు వేడి చేస్తే అప్పటికప్పుడు చేసిన అరిశెలాగా వేడిగా, మెత్తగా వస్తాయి. ఒవెన్ ఉంటే అందులో కూడా వేడి చేసుకోవచ్చు. సకినాలు కావలసినవి: కొత్త బియ్యం– అరకిలో, వాము– ఒక టేబుల్ స్పూన్, నువ్వులు– పావు కప్పు, ఉప్పు– రుచికి తగినంత, నూనె– వేయించడానికి తగినంత. తయారీ: బియ్యాన్ని కడిగి రాత్రంతా నానబెట్టాలి. ఉదయం నీటిని వంపేసి మెత్తగా పిండి పట్టాలి. పిండిని జల్లించిన తర్వాత ఆ పిండిలో వాము, నువ్వులు, ఉప్పు వేసి కలపాలి. ఈ పొడి మిశ్రమంలో తగినంత నీటిని పోస్తూ ముద్దలా కలుపుకోవాలి. కాటన్ క్లాత్‌ను తడిపి పలుచగా పరిచి దాని మీద పిండిని సకినాల ఆకారంలో చేత్తో చుట్టూ అల్లాలి. పది నిమిషాల సేపు ఆరనివ్వాలి. ఈ లోపు బాణలిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత ఆరిన సకినాన్ని నూనెలో వేసి రెండువైపులా దోరగా కాలనిచ్చి తీసేయాలి. పిండిని చేతిలోకి తీసుకుని వేళ్లతో సన్నని తాడుగా వలయాకారంగా చేయడానికి నైపుణ్యం ఉండాలి సకినాలు చేయడంలో అసలైన మెలకువ అదే. చదవండి: Radish Health Benefits: ముల్లంగి రసం తాగుతున్నారా.. అయితే.. -
Health Tips: వాతం ఎక్కువైందా? నిద్ర పట్టడం లేదా?
Health Tips: రాత్రిపూట త్వరగా భోజనం చేయడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. మనం తిన్న ఆహారాన్ని సరిగ్గా జీర్ణం చేసేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. అలాగే మరుసటి రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ చేసే వరకు చాలా సమయం ఉంటుంది కనుక జీర్ణవ్యవస్థకు మరమ్మత్తులు చేసుకునేందుకు కావల్సినంత సమయం లభిస్తుంది. దీంతో జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటుంది. రాత్రి త్వరగా భోజనం చేయడం వల్ల నిద్ర చక్కగా పడుతుంది. భోజనానికి, నిద్రకు 3 గంటల వ్యవధి ఉంటే నిద్ర చక్కగా వస్తుంది. లేదంటే నిద్రలేమి సమస్య వస్తుంది. కనుక రాత్రి చక్కగా నిద్ర పట్టాలంటే త్వరగా భోజనం చేసేయాలి. వాతం ఎక్కువైందా? ఒంట్లో వాతం ఎక్కువైనప్పుడు కీళ్ళ నొప్పి, ఎముకల్లో నుండి శబ్దాలు రావడం జరుగుతాయి. ఇక మోకాళ్ళలో జిగురు అరిగిపోవడం వలన ఎముకలు రాపిడికి గురయ్యి ఎక్కువ నొప్పిని కలుగజేస్తాయి. వీటన్నింటికి చెక్ పెట్టడానికి ఒక చిట్కా ఉంది.. దీనిని రెగ్యులర్‌గా 15 రోజులు తీసుకుంటే.. కీళ్ల నొప్పులు, వాతం నొప్పులు తగ్గుతాయి అంటున్నారు నిపుణులు. ఈ పొడి తయారీ గురించి తెలుసుకుందాం.. ►50 గ్రాములు సొంఠి, 50 గ్రాముల మెంతులు, 50 గ్రాములు వాము తీసుకుని.. వీటన్నిటిని కలిపి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ►రోజూ ఒక గ్లాస్ గోరు వెచ్చటి నీరు తీసుకుని అందులో ఈ పొడిని ఒక స్పూన్ వేసుకోవాలి. ►అందులో బెల్లం పొడి.. లేదా తేనే ను వేసుకుని తాగాలి. షుగర్ వ్యాధి ఉన్నవారు బెల్లం కలుపుకోకుండా తీసుకుంటే సరి. ►ఇలా ఈ టీ తాగడం వలన 15 రోజుల్లో వాతం తగ్గుతుంది. జాయింట్లలో జిగురు వచ్చేలా చేస్తుంది. చదవండి: Health Tips: చేదుగా ఉందని బెల్లం, చింతపండుతో వండిన కాకరకాయ కూర తింటే.. -
Weight Loss: ఈ జ్యూస్ తాగారంటే మీ బరువు అమాంతంగా ...
బరువు తగ్గేందుకు ఎంతో ప్రయాస, కృషి అవసరమనే విషయం మనందరికీ తెలిసిందే. రోజువారీ ఎక్సర్సైజులు, తక్కువ క్యాలరీలుండే ఆహారం తీసుకోవడం.. ఇతర పద్ధతులు అనుసరిస్తాం. ఇవే కాకుండా బరువుతగ్గడానికి డిటాక్స్ డ్రింక్స్ కూడా ఎంతో తోడ్పడతాయని మీకు తెలుసా! మన శరీరంలోని వ్యర్థాలను బయటికి పంపడంలో డిటాక్స్ డ్రింక్స్ ఎంతో ఉపయోగపడతాయి. అలాగే శరీర బరువును నియంత్రించడంలో కీలకంగా వ్యవహరిస్తాయి. కేవలం వంటింట్లో దొరికే పదార్ధాలతోనే ఈ డ్రింక్స్‌ను సులభంగా తయారు చేసుకోవచ్చు. బరువు నియంత్రించడానికి జీరా వాటర్ లాంటివి ప్రయత్నించినట్లే, బెల్లం-నిమ్మరసంతో తయారు చేసిన ఈ స్పెషల్ డ్రింక్‌ను కూడా ఉపయోగిస్తే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు సూచిస్తున్నారు. బెల్లం-నిమ్మతో ఆరోగ్య లాభాలు నిమ్మ రసం బరువుతగ్గించడంలో కీలప పాత్ర పోషిస్తుందని మనందరికీ తెలుసు. అయితే దీనికి కొత్తగా బెల్లం జోడిస్తే చేకూరే లాభాలు మాత్రం చాలా మందికి తెలియదు. నిమ్మలో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరంలో నీటి శాతాన్ని, చర్మ స్వభావాన్ని, జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. అలాగే గుండె పనీతీరును క్రమబద్ధీకరించి, హృదయ సంబంధిత వ్యాధుల నుంచి కాపాడుతుంది. ముఖ్యంగా బరువును నియంత్రించడంలో ఎంతో సహాయపడుతుంది. అలాగే స్వీట్స్ తయారీలో విరివిగా ఉపయోగించే బెల్లం కూడా బరువు తగ్గించడంలో కీలకంగా వ్యవహరిస్తుంది. బెల్లం చేకూర్చే లాభాలు అన్నీఇన్నీకాదండోయ్! ఇమ్యునిటీని పెంచడానికి, శరీరంలోని వ్యర్ధాలను బయటికి పంపడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి మాత్రమేకాకుండా బరువును నియంత్రించడంలోనూ బెల్లం బెస్టే!! కాబట్టి బరువును అదుపులో ఉంచడంలో బెల్లం, నిమ్మ రెండూ ఉపయోగపడతాయన్నమాట. బెల్లం - నిమ్మ వాటర్ ఏ విధంగా తయారు చేయాలంటే.. మొదటిగా ఒక గిన్నెలో గ్లాస్ నీళ్లుపోసి చిన్న బెల్లం ముక్కను వేసి, బెల్లం కరిగిపోయేంతవరకూ మరిగించాలి. చల్లబడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కలుపుకుంటే బెల్లం - నిమ్మ వాటర్ రెడీ అయిపోయినట్టే. ప్రతి ఉదయం క్రమంతప్పకుండా ఈ డ్రింక్ తాగితే మీ బరువు నిస్సందేహంగా తరిగిపోతుందని నిపుణులు చెబుతున్నారు. చదవండి : Weight Loss: అవిసె గింజలు, అరటి, రాజ్మా.... ఇవి తిన్నారంటే... -
తేనెలూరే తెనాలి జిలేబీ.. తింటే మైమరచిపోవాల్సిందే!
తెనాలి జిలేబీని నోట్లో వేసుకున్నామంటే తన్మయత్వంతో కళ్లు మూసుకుంటాం.. నోట్లో కరిగిపోతున్న ఆ జిలేబీ ముక్క మాధుర్యాన్ని ఆస్వాదిస్తూ మైమరచిపోతాం. ఒక్కసారి రుచి చూశామా.. ఇక జిహ్వ చాపల్యం చెప్పనలవి కాదు. మళ్లీ మళ్లీ కావాలంటూ మారాం చేస్తుంది. ఆ అద్భుత రుచి కోసం అర్రులు చాస్తుంది. బంగారు వర్ణంతో ధగధగలాడినా.. నలుపు రంగుతో నిగనిగలాడినా.. తేనెలూరే ఆ తెనాలి జిలేబీ టేస్టే వేరు.. తిని తీరాల్సిందే! సాక్షి, తెనాలి: తెనాలిలో బోస్ రోడ్డు నుంచి వహాబ్చౌక్కు దారితీసే యాకూబ్‌హుస్సేన్ రోడ్డును ‘జిలేబీ కొట్ల బజారు’ అంటారు. అక్కడుండే జిలేబీ దుకాణాల వల్ల దానికి ఆ పేరు స్థిరపడింది. 1965 నుంచి ఇక్కడ జిలేబీ వ్యాపారం సాగుతోంది. చీమకుర్తి సుబ్బయ్య అనే వ్యక్తి అక్కడ జిలేబీ తయారీకి ఆద్యుడు. రంగువేయని బెల్లంతో జిలేబి తయారీని ఆరంభించాడు. నలుపు రంగుతో ఉండే ఈ జిలేబీ స్థానంలో రంగు వేసిన బెల్లంతో ఆకర్షణీయ జిలేబీని తెచ్చిన ఘనత మాత్రం బొట్లగుంట రామయ్యకు దక్కుతుంది. 1972లో వ్యాపారంలోకి వచ్చిన రామయ్య.. తెనాలి జిలేబీకి బ్రాండ్ ఇమేజ్ను తెచ్చి ‘జిలేబీ రామయ్య’ అయ్యారు. ఆంధ్రాపారిస్లో తయారైన జిలేబీ అంటే హాట్ కేక్‌లా అమ్ముడుపోతుంది. స్థానికుల దగ్గర్నుంచి, ప్రముఖుల వరకూ లొట్టలేసుకుంటూ తింటారంటే అతిశయోక్తి కాదు. ప్రస్తుతం తెనాలిలోని జిలేబీ బజారులో ఆరు దుకాణాలున్నాయి. పట్టణంలో వేర్వేరు చోట్ల మరో ఏడెనిమిదుంటాయి. చక్కెర స్వీట్లతో పోలిస్తే.. జిలేబీనే శ్రేష్టం ఇతర స్వీట్లతో పోలిస్తే ధరలోనూ, నాణ్యతలోనూ జిలేబీనే శ్రేష్టం. పెరిగిన ధరల కారణంగా ప్రస్తుతం కిలో జిలేబీ రూ.140 పలుకుతున్నా, చక్కెర స్వీట్లతో చూస్తే దీని ధర తక్కువే. పైగా బెల్లంతో తయారీ అయినందున శరీరానికి ఐరన్ దొరుకుతుంది. రంగు వేయని బెల్లంతో చేసిన జిలేబీ మరింత సురక్షితం. వేడి వేడి జిలేబీ తింటే విరేచనాలు కట్టుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. అమ్మకానికి సిద్ధంగా రంగు వేయని జిలేబీ తయారీ విధానం.. ► చాయ మినప్పప్పు, బియ్యం పిండి, మైదా సమపాళ్లలో కలిపి 6–8 గంటలు నానబెడతారు. ► కొద్దిగా గోరు వెచ్చని నీళ్లు కలిపి మెత్తటి ముద్దలా, చపాతీల పిండి కంటే జారుడుగా చేస్తారు. ► చిన్న రంధ్రం కలిగిన వస్త్రంలో మూటగా తీసుకుని, బాణలిలో మరిగిన నూనెలో చేతితో వలయాలుగా పిండుతారు. ► వేగిన తర్వాత వాటిని.. పక్కన వేరొక స్టవ్‌పై ఉండే బాణలిలో వేడిగా సిద్ధంగా ఉంచుకున్న బెల్లం పాకంలో వేసి.. బయటకు తీస్తారు. ► ఇక వేడి వేడి జిలేబీ రెడీ జిలేబీ తిన్నాకే.. చుట్టుపక్కల దాదాపు వంద గ్రామాలకు తెనాలి కూడలి అయినందున జిలేబీ వ్యాపారం విస్తరించింది. మరిన్ని దుకాణాలు వెలిశాయి. తెనాలి వచ్చిన గ్రామీణులు ముందుగా జిలేబీని తిన్నాకే ఇతర పనులు చూసుకుంటారు. అతిథులకు జిలేబీ ప్యాకెట్ బహుమతిగా ఇవ్వటం సంప్రదాయమైంది. ఈ ప్రాంతం నుంచి విదేశాల్లో స్థిరపడినవారు, బంధువులు వచ్చిపోయేటప్పుడు జిలేబీని తీసుకురమ్మని చెబుతుంటారు. చెన్నైలో తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంతకాలం సినీ ప్రముఖులకు తెనాలి జిలేబీ వెళ్లేదని వ్యాపారి సోమశేఖరరావు చెప్పారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి ‘మెట్రో’లకే కాదు.. విదేశాల్లోని తెలుగువారికీ ఇక్కడ్నుంచి జిలేబీ పార్శిళ్లు వెళుతుంటాయి. కరోనా విపత్కర పరిస్థితుల్లో కొన్ని నెలలు మూతపడిన జిలేబీ దుకాణాలు, మళ్లీ ఆదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం రోజుకు ఒక్కో దుకాణంలో సగటున 50 కిలోలపైనే అమ్ముడుపోతోంది. అన్ని దుకాణాల్లో కలిపి నెలకు సుమారు రూ.10.50 లక్షల వ్యాపారం జరుగుతోంది. అదే మా జీవనాధారం.. మా తాత పేరు జిలేబీ రామయ్య. చిన్నప్పుడు ఆయన దుకాణంలోనే పనిచేశా. పెద్దయ్యాక వేరుగా వ్యాపారం చేస్తున్నా. జిలేబీ ప్రియుల సూచన మేరకు ఇప్పుడు నల్లబెల్లంతో తయారు చేస్తున్నాం. దేశవిదేశాలకూ సరఫరా చేస్తున్నాం. – కావూరి జనార్దనరావు, వ్యాపారి తింటానికే వస్తుంటాను.. తెనాలి జిలేబీని ఒక్క సారి రుచి చూస్తే, మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది. తరచూ జిలేబీ బజారుకు వస్తుంటాను. విరేచనాలు కట్టుకోవాలంటే వేడి వేడి జిలేబీ తింటే సరి. – భాస్కరుని లక్ష్మీనారాయణ, వినియోగదారుడు -
కోవిడ్ దెబ్బ; చేదెక్కిన చెరకు!
అందరికీ తీపిని పంచే చెరకు రైతన్న చేదును చవిచూస్తున్నాడు. కోవిడ్ దెబ్బకు కుదేలై విలవిల్లాడుతున్నాడు. కనీసం పెట్టుబడి ఖర్చులు రావడం కూడా కష్టంగా మారడంతో నష్టాలకు గురవుతున్నాడు. చెరకు పంట ఏపుగా పెరిగినా మార్కెట్లో డిమాండ్ తగ్గడంతో బావురుమంటున్నాడు. ఆశగా తయారు చేసిన బెల్లం బుట్టలు అమ్ముడుపోక దిక్కుతోచని స్థితిలో ఆలోచిస్తూ కూర్చున్నాడు. కోవిడ్ పరిస్థితుల నుంచి కోలుకునే కాలం కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నాడు. తాళ్లూరు: కరోనా ప్రభావానికి అల్లకల్లోలంగా మారిన అనేక రకాల మార్కెట్లలో బెల్లం మార్కెట్ కూడా ఉంది. ఆ ప్రభావం చెరకు రైతుపై తీవ్రంగా పడింది. గతంలో ఎన్నడూ తలెత్తని దుర్భర పరిస్థితుల్లోకి వారిని నెట్టేసింది. అమ్ముడుపోని బెల్లం బుట్టలతో పాటు నష్టాలను కూడా మూటగడుతోంది. ప్రకాశం జిల్లాలో సుమారు 3,000 ఎకరాల్లో చెరకు సాగవుతోంది. అందులో అధికంగా 1500 ఎకరాల వరకు తాళ్లూరు మండలంలో సాగవుతోంది. చెరకును బెల్లంగా మార్చేందుకు తాళ్లూరు ప్రాంతంలో ప్రత్యేకంగా బట్టీలు కూడా ఉన్నాయి. సుమారు 15 నుంచి 20 వరకు ఉన్న బట్టీల ద్వారా బెల్లం తయారు చేసి బుట్టల్లో అమర్చి ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తుంటారు. స్థానికంగా కూడా మార్కెట్ చేసుకుంటారు. ఇందుకోసం ప్రతి సంవత్సరం శ్రీకాకుళం నుంచి ప్రత్యేకంగా కూలీలు వస్తుంటారు. వారికి రోజుకు రూ.500కుపైగా కూలి ఇస్తుంటారు. అయితే, కోవిడ్ కారణంగా ప్రస్తుతం బెల్లం మార్కెట్ బాగా పడిపోయింది. ఎగుమతులు సైతం నిలిచిపోయాయి. తయారు చేసిన బెల్లం నిల్వలు ఎక్కడికక్కడే ఉండిపోయాయి. ఫలితంగా రైతులు సాగుచేసిన చెరకుతో పెద్దగా పనిలేకుండా పోయింది. ఆ రైతులంతా నష్టాల బాట పట్టారు. ఖర్చు ఎక్కువ.. మిగిలేది తక్కువ..! తాళ్లూరు పరిసర ప్రాంతాల్లో 33 ఏళ్లుగా చెరకు పంట సాగుచేస్తున్నారు. ప్రస్తుతం ఎకరా పొలంలో చెరకు సాగుచేసేందుకు రూ.లక్ష వరకూ ఖర్చవుతోంది. ఎకరాకు మూడు టన్నుల బెల్లం ఉత్పత్తవుతుంది. కోవిడ్ కారణంగా బెల్లం విక్రయాలు తగ్గడంతో ధర కూడా తగ్గింది. కేజీ రూ.36 మాత్రమే ఉంది. దాని ప్రకారం ఎకరా చెరకుతో తయారు చేసిన బెల్లం విక్రయిస్తే రాబడి రూ.1.08 లక్షలే ఉంది. అంటే.. ఎకరాకు రూ.8 వేలు మాత్రమే మిగులుదల ఉంది. చెరకు సాగు నుంచి బెల్లం తయారు చేయడం, మార్కెట్ చేసుకోవడం వరకూ అష్టకష్టాలుపడితే కనీసం పది వేలు కూడా మిగలడం గగనంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గతంలో బెల్లం తయారీ వ్యయం తక్కువ కాగా, ఆదాయం ఆశాజనకంగా ఉండేదని, ఇప్పుడు ఖర్చులు పెరగడంతో పాటు మార్కెట్లో బెల్లం ధరలు తగ్గడం, విక్రయాలపై కరోనా కాటేయడం వలన నష్టపోతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చక్కెర ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలి కోవిడ్ వలన బెల్లం వాడకం, అమ్మకం తగ్గి పెట్టుబడులు కూడా రావడం లేదు. కౌలు రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. తాళ్లూరు ప్రాంతంలో చక్కెర ఫ్యాక్టరీ నెలకొల్పి చెరకు రైతులను గట్టెక్కించాలి. లేకుంటే కోలుకోలేము. – లింగారెడ్డి, రైతు, తాళ్లూరు చీడపీడలతో చెరకు రైతుకు వెతలు బల్లికురవ: జిల్లాలోని అద్దంకి నియోజకవర్గంలో సాగుచేసిన చెరకు పంటను చీడపీడలు ఆశించడంతో రైతులు లబోదిబోమంటున్నారు. బల్లికురవ, అద్దంకి మండలాల్లో తిరునాళ్లు, ఉత్సవాల్లో అమ్మే నల్ల చెరకును జూన్ మొదటి వారం నుంచి సాగుచేస్తుంటారు. అందులో భాగంగా ఈ ఏడాది సాగుచేసిన నెల రోజుల చెరకు పంటను చీడపీడలు ఆశించాయి. బల్లికురవ మండలంలోని కూకట్లపల్లి, గొర్రెపాడు, వైదన, రామాంజనేయపురం, ఎస్ఎల్ గుడిపాడు, అంబడిపూడి, అద్దంకి మండలంలోని శింగరకొండపాలెం, సాధునగర్, చక్రాయపాలెంలో ఇప్పటికే సుమారు 55 ఎకరాల్లో సాగు చేసిన పంటకు నెలరోజులు పూర్తయింది. ప్రస్తుతం మరో 50 ఎకరాల్లో సాగు చేసేందుకు బల్లికురవ మండలంలోని రైతులు సమాయత్తమవుతున్నారు. ఈ నేపథ్యంలో పీక పురుగు, ఎర్రనల్లి ఉధృతంగా పంటపై దాడిచేశాయి. పంటంతా ఎండిపోతుండటంతో రైతులకు కంటిమీద కునుకు లేకుండా పోయింది. గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి తలెత్తలేదని రైతులు గొల్లుమంటున్నారు. వ్యవసాయశాఖ అధికారులు స్పందించి చీడపీడల నివారణకు సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరుతున్నారు. కార్బాపైరాన్ గుళికలు వేసుకోవాలి వర్షాధార పంటను పీకపురుగు ఆశిస్తుంది. పైరు పిలకలు వేసే దశలో మొవ్వలోకి చేరి తినడం వలన ఎండిపోతోంది. పీకపురుగు ఆశించకుండా గడల ముక్కలు నాటే ముందు ఎకరాకు 12 నుంచి 13 కేజీలు కార్బాపైరాన్ గుళికలను చాళ్లలో వేసుకోవాలి. పైరు నెలరోజుల దశలో ఉన్నందున కోరాజన్ 0.3 మిల్లీలీటరును లీటరు నీటికి కలిపి మొవ్వ పూర్తిగా తడిసేలా ఐదు రోజులకోసారి పిచికారీ చేసుకోవాలి. – ఎస్వీపీ కుమారి, వ్యవసాయాధికారిణి, బల్లికురవ -
అనకాపల్లి బెల్లంపొడికి పేటెంట్..
సాక్షి, అమరావతి: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అనకాపల్లి వ్యవసాయ పరిశోధన కేంద్రం అరుదైన ఘనత సాధించింది. బెల్లం, అనుబంధ ఉత్పత్తుల తయారీలో విశేష కృషికి పేటెంట్ దక్కింది. బెల్లాన్ని గుళికలు, పొడి రూపంలో తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానాన్ని, తయారీ పద్ధతుల్ని అందుబాటులోకి తెచ్చినందుకు 20 ఏళ్ల పాటు పేటెంట్ హక్కు లభించినట్టు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ ఎ.విష్ణువర్ధన్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. 1970 పేటెంట్ చట్టంలోని నిబంధనలకు అనుగుణంగా హక్కు కల్పించినట్లు కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని పేటెంట్ కార్యాలయం ప్రకటించిందన్నారు. బెల్లం పాడవకుండా వినూత్న పరిజ్ఞానం చెరకు నుంచి సంప్రదాయ పద్ధతిలో రసాన్ని తీసి దాన్ని ఉడకబెట్టి బెల్లాన్ని తయారు చేస్తుంటారు. ఈ తరహా బెల్లంలో అంతర్గతంగా తేమ ఉండడం వల్ల సూక్ష్మజీవులు అభివృద్ధి చెంది పాడవుతుంటుంది. ఈ నేపథ్యంలో అనకాపల్లిలోని అఖిల భారత సమన్వయ పరిశోధన సంస్థ (ఏఐసీఆర్పీ), ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రం (రార్స్) గుళికలు లేదా పలుకుల రూపంలో (గ్రాన్యూల్స్) ఉండే బెల్లాన్ని తయారు చేసే వినూత్న సాంకేతిక పరిజ్ఞానాన్ని రూపొందించింది. రెండేళ్ల పాటు నిల్వ ఈ సాంకేతికతో తయారయ్యే పలుకుల రూపంలో ఉండే బెల్లంలో అతి తక్కువ తేమ ఉంటుంది. తయారు చేసినప్పటి నుంచి రెండేళ్ల పాటు నిల్వ ఉంటుంది. ప్యాకింగ్ సులువు. సూపర్ ఫాస్ఫేట్, ఫాస్పొరిక్ యాసిడ్ వంటి ప్రమాదకర రసాయనాలను వినియోగించాల్సిన పని లేదు. ఎగుమతికి అనువైంది. సంప్రదాయ పద్ధతిలో తయారు చేసి అమ్మే బెల్లం కన్నా రైతులు ఎకరానికి అదనంగా రూ.40 వేలు సంపాదించవచ్చు. బెల్లంలో ఎన్నో ఔషధ గుణాలు వంద గ్రాముల బెల్లం పలుకుల్లో 80 నుంచి 90 గ్రాముల వరకు సుక్రోజ్, 0.4 గ్రాముల ప్రొటీన్, 0.1 గ్రాముల కొవ్వు, 0.6 నుంచి 1 గ్రాము వరకు ఖనిజాలు, 12 మిల్లీగ్రాముల ఐరన్, 4 మిల్లీగ్రాముల ఫాస్పరస్, 9 మిల్లీ గ్రాముల కాల్షియం ఉంటుంది. తీపిని తగ్గించే లక్షణాలూ ఉన్నాయి. అటువంటి గ్రాన్యూల్ జాగరీకి పేటెంట్ లభించడం యూనివర్సిటీకి గొప్ప గౌరవంగా వీసీ డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. 8 దశల్లో ఈ బెల్లం తయారవుతుందని వివరించారు. నాగజెముడు జెల్లీకి పేటెంట్ నాగజెముడు కాయలతో తయారు చేసే రసం లేదా తాండ్రకు తిరుపతిలోని శ్రీవెంకటేశ్వర విశ్వవిద్యాలయం, ఫుడ్ సైన్స్, టెక్నాలజీ కళాశాలలకు సంయుక్తంగా పేటెంట్ లభించింది. ఇది 20 ఏళ్ల పాటు అమల్లో ఉంటుంది. నాగజెముడు వర్షాధారిత మెట్ట ప్రాంతాల్లో లభిస్తుంది. ఇటీవలి కాలంలో నాగజెముడును వాణిజ్య పంటగా సాగు చేస్తున్నారు. నాగజెముడులో పోషకాలతో పాటు ఔషధ లక్షణాలున్నాయి. సౌందర్య పోషణ వస్తువుల్లో వాడుతున్నారు. క్యాక్టస్ జాతికి చెందిన ఈ మొక్కల నుంచి వచ్చే కాయల నుంచి రసాన్ని తీసి జెల్లీ రూపంలోకి వచ్చేలా ఎండబెట్టి వాడుతున్నారు. చాక్లెట్ల మాదిరిగా తయారు చేసి వినియోగిస్తున్నారు. ఇందుకు ఈ పేటెంట్ లభించిందని డాక్టర్ విష్ణువర్ధన్‌రెడ్డి తెలిపారు. -
తీరమంతా తియ్యనంట..
సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలు పిండి వంటకాలు సిద్ధమైపోతుంటాయి. ప్రధానంగా అరిసెలు, బెల్లం ఉండలు వంటివి చేయాలంటే బెల్లం తప్పనిసరి. అందుకే ఈ సీజన్లో మార్కెట్లో డిమాండ్ ఎక్కువ. మరోవైపు శుభకార్యాల సమయంలోనూ బెల్లం అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో నాగావళి తీరంలో చెరకు సాగుచేస్తున్న రైతులు బెల్లం తయారీలో నిమగ్నమయ్యారు. వేడి వేడి బెల్లాన్ని చెక్కీల రూపంలో మార్కెట్‌కు అందిస్తున్నారు. సాక్షి. రాజాం(శ్రీకాకుళం): జిల్లాలో ఏకైక షుగర్ ఫ్యాక్టరీ ఫ్యారిస్ చక్కెర కర్మాగారం సంకిలి వద్ద ఉంది. దీంతో పరిసర ప్రాంత రైతులు ఎక్కువగా చెరకును సాగు చేస్తుంటారు. నాగావళి నదీతీర మండలాలైన వంగర, రేగిడి, సంతకవిటి, బూర్జ తదితర మండలాల్లో భూములు అనుకూలంగా ఉండటంతో ఎక్కువ మంది వరికి ప్రత్యామ్నాయంగా చెరుకు సాగు చేస్తుంటారు. సారవంతమైన భూములు కావడంతో రసాయనాలు వినియోగించకుండానే మంచి రంగు, తియ్యదనంతో కూడిన బెల్లం తయారవుతుంది. కొత్తూరు, జావాం, హొంజరాం, చిత్తారిపురం, బూరాడపేట, రేగిడి మండలంలోని ఖండ్యాం, కొమెర, బూర్జ మండలంలోని గుత్తావల్లి, నారాయణపురం, బూర్జ ప్రాంతాల్లోని బెల్లానికి మంచి డిమాండ్ ఉంటుంది. ఇక్కడ బెల్లం గానుగల వద్దే విక్రయాలు జరిగిపోతుంటాయి. కుండలు నుంచి చెక్కీలు వైపు.. ఎకరా చెరకు పంటను బెల్లం తయారు చేసేందుకు సాధారణంగా 15 నుంచి 20 రోజుల కాలం పడుతుంది. పొలంలో చెరకును నరికి ఎండ్ల బండ్లు, ట్రాక్టర్ల ద్వారా గానుగల వద్దకు తీసుకొస్తారు. అక్కడ చెరకు గడలను నునుపుగా చేసి గానుగ యంత్రం ద్వారా రసం తీస్తారు. ఈ రసాన్ని ఇనుప పెనంలో వేసి పాకం తీస్తారు. బాగా పాకం వచ్చిన తర్వాత పక్కనే ఉన్న ఇనుప పల్లెంలో బెల్లం పాకం వేసి చెక్కీలు తయారుచేస్తారు. గతంలో బెల్లాన్ని కుండలకు ఎక్కించేవారు. ఇప్పుడు టెక్నాలజీ రావడంతో చెక్కీలకు ఎక్కించి అనంతరం కవర్లులో పెట్టి మార్కెట్‌కు తరలిస్తున్నారు. చిన్న చెక్కీ 6 నుంచి 7 కిలోలు ఉండగా, పెద్ద చెక్కీలు 14 కిలోలు ఉంటాయి. వాతావరణం అనుకూలించింది.. మాకున్న కొద్దిపాటి పొలంలో ఈ ఏడాది చెరకు సాగుచేశాం. ప్రస్తుతం పంట కోతదశకు వచ్చింది. బెల్లం తయారు చేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ పెరిగింది. వాతావరణం అనుకూలంగా ఉండటంతో పంట దిగుబడి బాగుంది. – లావేటి లక్షున్నాయుడు, చెరకు రైతు, బూరాడపేట డిమాండ్ ఉంది.. ప్రస్తుతం చెరకు పంట అన్ని ప్రాంతాల్లో కోతదశలో ఉంది. మేం చెరకును గానుగ ఆడించి బెల్లం తయారుచేస్తున్నాం. మార్కెట్లో డిమాండ్ ఉండటంతో పెట్టుబడులు పోనూ మంచి లాభం కనిపిస్తోంది. – మునకలసవలస దాలయ్య, చెరకు రైతు, హంజరాం సాగు బాగుంది... బెల్లం తయారీచేసే రైతులకు చెరకు సాగు అనుకూలిస్తోంది. జిల్లాలో తయారయ్యే బెల్లం నాణ్యతతో ఉంటుంది. ఇతర జిల్లాలకు ఇక్కడి నుంచి ఎగుమతి అవుతుంది. ఆరోగ్యపరంగా బెల్లం మనిషికి ఎంతో మంచిది. – డాక్టర్ జి.చిట్టిబాబు, కృషివిజ్ఞానకేంద్రం, ఆమదాలవలస -
ఇవి తినండి సరి అవుతుంది
ఆధునిక జీవన శైలిలో దేహ కదలికలు తగ్గిపోయాయి. దాంతో జీవక్రియల వ్యవస్థ గాడి తప్పడమూ ఎక్కువైంది. దానికి తోడు చలికాలంలో దేహక్రియల్లో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటి కారణంగా ప్రతి పదిమందిలో ఏడుగురు మహిళలు పీరియడ్స్ క్రమం తప్పడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి మందుల మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు. ►చలికాలంలో రోజూ కొద్దిగా బెల్లం తింటూ ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా బెల్లం అరికడుతుంది. ►ముప్పై రోజులు దాటినా కూడా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరలను తీసుకోవాలి. బొప్పాయిలోని ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ట్రోజెన్ హార్మోన్ల మీద ప్రభావం చూపించి సమస్యను సరిదిద్దుతుంది. ఈ సమస్యను పరిష్కరించే మరికొన్ని పండ్లు పైనాపిల్, మామిడి, కమలాలు, నిమ్మ, కివి. ►పచ్చి అల్లం తరుగులో స్వచ్ఛమైన తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి. ►స్వచ్ఛమైన పసుపును రోజూ ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ ఆలస్యమైతే గ్లాజు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సమస్య తలెత్తదు. పసుపును తేనెతో కలిపి చప్పరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది. ►పీరియడ్స్ సక్రమంగా రావడం, కండరాల నొప్పిని తగ్గించడంలో కాఫీ కూడా మంచి మందే. కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది. ►బీట్రూట్లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహక్రియలను సక్రమంగా ఉంచుతాయి. ►ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ వాము లేదా వాము పొడి వేసి మరిగించి తాగాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ టీ (కాన్కాక్షన్) తాగితే పీరియడ్ సక్రమం కావడంతోపాటు మెన్స్ట్రువల్ పెయిన్ కూడా ఉండదు. -
అనుదిన ద్రవ్యాలు అమోఘ గుణాలు
తెలుగువారి పండుగలు, ఆచారాలు, ధార్మిక సంస్కృతితో సమ్మిళితమై ఉంటాయి. దైవ కైంకర్యంలో నైవేద్యానిది ప్రధాన పాత్ర. చక్రపొంగలి, దద్ధ్యోదనం, పులిహోర వంటి ప్రసాదాలు మనకు అతి సాధారణం. వీటన్నింటిలోనూ సామాన్య ద్రవ్యం ‘వరి అన్నమే’. ఇతర పదార్థాలలో నెయ్యి, బెల్లం/శర్కర; పెరుగు, నిమ్మకాయ/చింతపండు’ ప్రధానమైనవి. ఇవి మనకి అతి సామాన్యంగా కనిపిస్తాయే గాని వాటి పోషక విలువలు, గుణధర్మాలు అమోఘం. వీటి ప్రయోజనాలు ఆయుర్వేద గ్రంథాలలో సుస్పష్టంగా కనిపిస్తాయి. నెయ్యి ఘృతం, ఆజ్యం, సర్పి మొదలైనవి నెయ్యికి సంస్కృత పర్యాయపదాలు. ఆయుర్వేదంలో ఆవు నేతికి విశిష్టత ఉంది. గుణధర్మాలు: మధురం, ప్రధానంగా పిత్త దోషహరం, వాత కఫ శ్యామకం, చలువ చేస్తుంది. తెలివితేటలను పెంచుతుంది. ఓజోకరం, శుక్రకరం, రసాయనం (సప్త ధాతు పుష్టికరమై క్షమత్వ వర్థకం). లావణ, కాంతి, తేజోవర్థకం. ముసలితనం రానీయకుండా యౌవనాన్ని పదిలపరుస్తుంది. ఆయు వర్థకం. మంగళకరం. కంటికి మంచిది. గవ్యం ఘృతం విశేషేణ చక్షుష్యం, వృషం, అగ్నికృత్.... మేధా లావణ్య కాంతి తేజో ఓజో వృద్ధికరం, వయస్థాపకం, బల్యం, సుమంగలం, ఆయుష్యం, సర్వ ఆజ్యేషు గుణాధికం ►ఆవు నెయ్యిని హోమం చేస్తే వచ్చే పొగ విషహరం, క్రిమిహరం, వాతావరణ కాలుష్య హరం. ►ఆవు పెరుగు: కొంచెం పులుపు. ఎక్కువ తీపి కలిగితే రుచిలో నుంచి ఆకలిని పెంచి, ధాతుపుష్టిని కలిగించి, గుండెకు కూడా శక్తినిస్తుంది. నాడీవ్యవస్థను పటిష్ఠపరుస్తుంది (వాత హరం). అందువలననే దీనిని చాలా పవిత్రమని వర్ణించారు. గవ్యం దధి విశేషేణ... రుచిప్రదం, పవిత్రం, దీపనం, హృద్యం, పుష్టికృత్, పవనాపహం... గేదె పెరుగు: ఇది చాలా చిక్కగా ఉండటం వలన బరువైన ఆహారంగా చెప్పబడింది. కఫకరం, స్రోతస్సులలో అవరోధం కలిగిస్తుంది. రక్తాన్ని దూషిస్తుంది. శుక్రకరం. రాత్రిపూట పెరుగు తినకూడదు (రాత్రౌ దధి న భుంజీత). పెరుగును వేడి చేయకూడదు. మితిమీరిన పరిమాణంలో పెరుగును సేవించకూడదు. బెల్లం చెరకు రసం నుంచి తయారుచేసిన బెల్లం తియ్యగా, జిగురుగా ఉండి శుక్రవర్థకంగా ఉపకరిస్తుంది. దేహంలో కొవ్వుని పెంచుతుంది. కొంతవరకు వేడిని తగ్గిస్తుంది కాని శర్కరంత చలువచేయదు. బలవర్థకమే కాని, కఫాన్ని క్రిములను పెంచుతుంది. పాతబెల్లం (పురాణ గుడం) చాలా మంచిది (పథ్యం). వేడిని తగ్గించి, కొవ్వును కరిగిస్తుంది. జఠరాగ్నిని పెంచి పుష్టిని కలిగిస్తుంది. (కాని ఈనాడు బెల్లం తయారీలో చాలా కెమికల్స్‌ని కలిపి, కల్తీ చేస్తున్నారు. ఇది హానికరం). శర్కర ఆయుర్వేద శాస్త్రంలో చెప్పిన శర్కర చాలా విశిష్టమైనది. దాని తయారీ వేరు. ఈనాడు చేస్తున్న పంచదార తయారీలో పోషక విలువలు శూన్యం. పరిపూర్ణంగా కెమికల్స్ మయం. చాలా అనర్థదాయకం. చింత చింతకాయ చక్కటి పులుపు కలిగి వాతహరంగానూ, కించిత్ పిత్తకఫాలను పెంచేదిగానూ ఉంటుంది. బరువుగా ఉండి ఆలస్యంగా జీర్ణమవుతుంది. పక్వమైనది (చింత పండు) ఆకలిని పెంచి, విరేచనం సాఫీగా అవటానికి సహకరిస్తుంది (సుఖరేచకం). ఉష్ణవీర్యమై వాతకఫహరంగా ఉంటుంది. ‘చించా, తింత్రిణీ, తింతిడీ, అమ్లీ, చుక్రికా... మొదలైనవి. చింతకాయ/పండునకు సంస్కృత పర్యాయపదాలు నిమ్మ నింబు, జంబీర అను పర్యాయపదాలున్నాయి. కఫవాత శ్యామకం. దప్పికను తగ్గిస్తుంది. (తృష్ణాహరం). రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మూత్రకరం. జ్వరహరం. కంఠవికారాన్ని తగ్గిస్తుంది. నేత్రదృష్టివర్థకం. బాగుగా పరిపక్వమైనది (పండు) వాడుకుంటే మంచిది. ఇంగువ (హింగు) ఉష్ణవీర్యం, ఆహారపచనం బాగా చేస్తుంది. కడుపునొప్పి, కడుపులోని వాయువు, క్రిములను పోగొడుతుంది. వాతకఫహరం. పసుపు (నిశా, హరిద్రా) ఇది కడుపులోకి సేవించినా లేక బయటపూతగా వాడినా కూడా క్రిమిహరం. రక్తశోధకం, జ్వరహరం, మధుమేహ హరం. శరీర కాంతిని పెంచి చర్మరోగాలని దూరం చేస్తుంది. – డా. వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి ఆయుర్వేద వైద్య నిపుణులు, హైదరాబాద్ -
గ్యాస్ సమస్య నుంచి ఉపశమనం కోసం...
ఇటీవల కాలంలో చాలా మందిని గ్యాస్ సమస్య వేధిస్తోంది. దీనికి రక రకాల మాత్రలు వాడేకంటే చిన్న చిన్న చిట్కాలు పాటించడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుంది. ►కడుపు ఖాళీగా ఉంటే గ్యాస్ సమస్య వస్తుంది. కాబట్టి రోజూ 6 నుంచీ 8 గ్లాసుల నీటిని తీసుకుంటే గ్యాస్ సమస్య తలెత్తదు. ►రోజూ భోజనానికి ముందు చిన్న అల్లం ముక్కను నమిలి మింగడం చాలా మంచిది. దానిని నేరుగా తినలేకపోతే కొద్దిగా బెల్లం లేదా పంచదార కలుపుకుని కూడా తినవచ్చు. ►నాలుగైదు వెల్లుల్లి రెబ్బలకు రెండేసి స్పూన్ల ధనియాలు, జీలకర్ర తీసుకుని 5 నిముషాలపాటు ఉడికించాలి. చల్లారాక వడపోసి గోరువెచ్చగా ఉన్నప్పుడే తాగాలి. ►దాల్చిన చెక్క గ్యాస్ సమస్యకు మంచి మందు. కొద్దిగా దాల్చిన చెక్కను తీసుకుని నీటిలో వేసి మరిగించాలి. తర్వాత ఆ జ్యూస్ ను తాగాలి. ఇలా రోజూ భోజనానికి ముందు తాగితే గ్యాస్ సమస్య తొలగి పోతుంది. ►గ్యాస్ సమస్య ఉన్నవాళ్లు రోజూ కొబ్బరి నీళ్ళని తాగటం అలవాటు చేసుకుంటే మంచిది. ఇలా నెల రోజులు ఈ చిట్కాలను పాటిస్తే మంచి ఫలితాలుంటాయి. -
అనుగ్రహానికి అన్నం నైవేద్యం
అమ్మ అంటేనే అనుగ్రహించేది అని అర్థం. దుర్గమ్మ తల్లి తన భక్తులను బిడ్డలుగా భావించి సదా అనుగ్రహిస్తూనే ఉంటుంది. అయినప్పటికీ పిల్లలు తమ సంతృప్తి కోసం తల్లికి ఇష్టమైన పదార్థాలను నైవేద్యంగా పెడుతుంటారు. ఆపై ప్రసాదంగా స్వీకరిస్తారు. నవరాత్రుల సందర్భంగా బియ్యంతో చేసే ఈ నైవేద్యాలను చేయండి. అనుగ్రహాన్ని పొందండి. పరమాన్నం కావలసినవి: బియ్యం – కప్పు; పంచదార – 4 కప్పులు; పాలు – 2 కప్పులు; నెయ్యి – టేబుల్ స్పూను; జీడిపప్పు – 10; కిస్మిస్ – గుప్పెడు; కొబ్బరి తురుము – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీస్పూను. తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి ►పాలు స్టౌ మీద పెట్టి, మరుగుతుండగా అందులో బియ్యం పోసి బాగా కలపాలి ►బాగా ఉడికిన తరువాత పంచదార వేసి కలిపి కొద్దిసేపు స్టౌ మీదే ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక జీడిపప్పు, కిస్మిస్ వేసి వేయించి తీసేయాలి ►ఉడుకుతున్న పరమాన్నంలో పచ్చి కొబ్బరి తురుము, వేయించిన జీడిపప్పు, కిస్మిస్లను వేసి బాగా కలపాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలిపి దించేయాలి ►ఈ ప్రసాదం తింటే సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఆశీర్వదించినట్లే. బెల్లం అన్నం కావలసినవి: బియ్యం – కప్పు; బెల్లం పొడి – కప్పున్నర; నెయ్యి – టేబుల్ స్పూను; కొబ్బరి ముక్కలు – అర కప్పు (నేతిలో వేయించాలి); పచ్చ కర్పూరం – టీ స్పూను; ఏలకుల పొడి – అర టీ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి రెండున్నర కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం పూర్తిగా ఉడికిన తరువాత బెల్లం పొడి వేసి బాగా కలిపి కొద్దిసేపు ఉడికించాలి ►ఏలకుల పొడి వేసి బాగా కలపాలి ►నెయ్యి, వేయించిన కొబ్బరి ముక్కలు, పచ్చ కర్పూరం వేసి బాగా కలిపి దించేయాలి ►వేడివేడిగా తింటుంటే సాక్షాత్తు మహిషాసుర మర్దని ప్రత్యక్షం కావలసిందే. కదంబం కావలసినవి: బాస్మతి బియ్యం – రెండు కప్పులు; క్యారట్, బీన్స్, పచ్చి బఠాణీ, క్యాప్సికమ్, ఉల్లికాడలు, ఉల్లిపాయలు, బంగాళ దుంప, మెంతి కూర, పుదీనా – అన్ని ముక్కలు కలిపి ఒక కప్పు; తరిగిన పచ్చి మిర్చి – 4; ఏలకులు – 2; లవంగాలు – 2; దాల్చినచెక్క – చిన్న ముక్క; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; ఉప్పు – తగినంత; నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు; జీడి పప్పు – గుప్పెడు; కిస్మిస్ – టేబుల్ స్పూను; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి నాలుగు కప్పుల నీళ్లు పోసి ఉడికించి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఏలకులు, లవంగాలు, దాల్చిన చెక్క వరుసగా వేసి కొద్దిగా వేయించాలి ►తరిగి ఉంచుకున్న కూర ముక్కలు, కరివేపాకు వేసి పచ్చి పోయేవరకు వేయించి తీసేయాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి విడివిడిలాడేలా చేయాలి ►కూర ముక్కలు, ఉప్పు వేసి కలపాలి ►జీడి పప్పు, కిస్మిస్, దానిమ్మ గింజలు జత చేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి వేడివేడిగా అందించాలి ►ఉల్లి రైతా కాంబినేషన్లో తింటే శాకంభరీదేవి ప్రత్యక్షం కావలసిందే. పెసర పొడి పులిహోర కావలసినవి: పెసర పప్పు – 4 టీ స్పూన్లు; అన్నం – 2 కప్పులు; ఎండు మిర్చి – 3 + 3; పసుపు – కొద్దిగా; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను + ఒక టీ స్పూను; ఇంగువ – పావు టీ స్పూను; పల్లీలు – రెండు టేబుల్ స్పూన్లు; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 4; కరివేపాకు – 2 రెబ్బలు; ఉప్పు – తగినంత. తయారి: ►స్టౌ మీద బాణలిలో పెసరపప్పు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ►అదే బాణలిలో ఎండు మిర్చి వేసి వేయించుకోవాలి ►చల్లారాక అందులో సరిపడా ఉప్పు, జీలకర్ర ఇంగువ వేసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి ►రెండు కప్పుల అన్నాన్ని ఒక పాత్రలోకి తీసుకుని ఇందులో నాలుగు టీ స్పూన్ల పెసర పొడి, ఉప్పు, కొద్దిగా పసుపు, ఒక స్పూను నూనె వేసి కలపాలి ►స్టౌ మీద బాణలిలో పులిహోర పోపు కోసం నూనె వేసి కాగాక, అందులో ఘుమఘుమలాడేలా ఇంగువ, పచ్చి సెనగ పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి దోరగా వేయించాలి ►పెసర పొడి వేసిన అన్నానికి పోపు జత చేయాలి ►అంతా ఒకసారి బాగా కలియబెడితే పెసర పొడి పులిహోర రెడీ. పెరుగన్నం లేదా దద్ధ్యోదనం కావలసినవి: బియ్యం – రెండు కప్పులు; అల్లం – చిన్న ముక్క; పచ్చి మిర్చి – 10; ఎండు మిర్చి – 5; సెనగ పప్పు – టీ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – చిన్న కట్ట; దానిమ్మ గింజలు – టేబుల్ స్పూను; చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష – కప్పు; చెర్రీ ముక్కలు – టీ స్పూను; టూటీ ఫ్రూటీ ముక్కలు – టీ స్పూను; జీడి పప్పులు – 10; నెయ్యి – టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత తయారీ: ►ముందుగా బియ్యం కడిగి నీళ్లు ఒంపేసి, ఐదు కప్పుల నీరు జత చేసి ఉడికించాలి ►అల్లం, పచ్చిమిర్చి కలిపి మెత్తగా దంచి పక్కన ఉంచాలి ►బాణలిలో నెయ్యి వేసి కాగాక పచ్చి సెనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి ►ఒక పెద్ద పాత్రలో అన్నం వేసి, అందులో వేయించిన పోపు సామాను వేసి బాగా కలపాలి ►తగినంత ఉప్పు జత చేసి మరోమారు కలపాలి ►చివరగా దానిమ్మ గింజలు, దానిమ్మ గింజలు చిన్న ద్రాక్ష లేదా కిస్మిస్ ద్రాక్ష, చెర్రీ ముక్కలు, టూటీ ఫ్రూటీ ముక్కలు, జీడి పప్పులు వేసి బాగా కలపాలి ►పుల్లగా ఉండే నిమ్మకాయ ఊరగాయతో అందిస్తే ప్రసాదాన్ని కూడా అన్నంలా తినేస్తారు. ఉప్పు పొంగలి లేదా కట్ పొంగల్ కావలసినవిః బియ్యం – కప్పు; పెసర పప్పు – కప్పు; జీలకర్ర – టీ స్పూను; మిరియాల పొడి – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఉప్పు – తగినంత; నెయ్యి – 4 టేబుల్ స్పూన్లు; జీడిపప్పు – గుప్పెడు. తయారి: ►ముందుగా ఒక గిన్నెలో బియ్యం, పెసర పప్పు వేసి నీళ్లతో బాగా కడిగి నీరు ఒంపేయాలి ►ఆరు కప్పుల నీరు జత చేసి, కుకర్‌లో ఉంచి, నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ముందుగా జీలకర్ర వేసి చిటపటలాడించాలి ►మిరియాల పొడి వేసి వేగుతుండగానే, జీడిపప్పు వేసి బాగా వేయించాలి ►కరివేపాకు వేసి వేయించి వెంటనే దించేయాలి ►ఉడికించుకున్న బియ్యం పెసరపప్పు మిశ్రమాన్ని గరిటెతో మెత్తగా మెదిపి, ఉప్పు జత చేయాలి ►నేతిలో వేయించి ఉంచుకున్న పదార్థాలను వేసి బాగా కలిపి వేడివేడిగా వడ్డించాలి ►అల్లం పచ్చడి, కొబ్బరి చట్నీల కాంబినేషన్‌తో ఈ ప్రసాదానికి రెట్టింపు రుచి వస్తుంది. పులిహోర కావలసినవి: బియ్యం – 4 కప్పులు; చింత పండు – 100 గ్రా.; పచ్చి సెనగ పప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – 2 టీ స్పూన్లు; జీలకర్ర – 2 టీ స్పూన్లు; ఎండు మిర్చి – 15; పచ్చి మిర్చి – 10; కరివేపాకు – 4 రెమ్మలు; వేయించిన పల్లీలు – 2 టేబుల్ స్పూన్లు; నువ్వుల పొడి – 2 టేబుల్ స్పూన్లు (నువ్వులు వేయించి పొడికొట్టాలి); జీడి పప్పులు – 15; నూనె – 100 గ్రా.; ఇంగువ – టీ స్పూను; పసుపు – టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ►ముందుగా బియ్యం శుభ్రంగా కడిగి, నీరు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి బియ్యం ఉడికించాలి ►ఉడికిన అన్నాన్ని వేడిగా ఉండగానే ఒక పెద్ద పళ్లెంలోకి తిరగబోసి, గరిటెతో పొడిపొడిగా అయ్యేలా కలపాలి ►ఒక గిన్నెలో చింతపండులో తగినంత నీరు పోసి నానబెట్టి, రసం తీసి పక్కన ఉంచుకోవాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, కరివేపాకు వరుసగా వేసి దోరగా వేయించాలి ►చింతపండు పులుసు, ఉప్పు, పసుపు వేసి బాగా కలిపి, ఉడికించి దించేయాలి ►అన్నంలో చింతపండు రసం, పోపు మిశ్రమం వేసి బాగా కలపాలి ►నువ్వుల పొడి, పల్లీలు, జీడి పప్పులు వేసి బాగా కలిపి సుమారు గంటసేపు ఊరిన తరవాత తింటే ప్రసాదాన్ని రుచిగా ఆస్వాదించవచ్చు. కొబ్బరి అన్నం కావలసినవి: బియ్యం – 2 కప్పులు; కొబ్బరి తురుము – 2 కప్పులు; పచ్చి మిర్చి – 10; పచ్చి సెనగపప్పు – టేబుల్ స్పూను; మినప్పప్పు – టేబుల్ స్పూను; ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; ఎండు మిర్చి – 6; పల్లీలు – టేబుల్ స్పూను (వేయించినవి); అల్లం ముక్కలు – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; జీడి పప్పు – గుప్పెడు (నేతిలో వేయించాలి); నెయ్యి – టేబుల్ స్పూను; నిమ్మకాయ – 1; ఉప్పు – తగినంత; నూనె – టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా తయారి: ►బియ్యం శుభ్రంగా కడిగి, 3 కప్పుల నీళ్లు జత చేసి ఉడికించాలి ►అన్నం వేడిగా ఉండగానే పెద్ద పళ్లెంలో వేసి విడివిడిలాడేలా కలపాలి ►బాణలిలో నూనె వేసి కాగాక పచ్చి సెనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►కొబ్బరి జత చేసి పచ్చి వాసన పోయే వరకు బాగా వేయించాక, ఉప్పు వేసి కలపాలి ►అన్నం జత చేసి బాగా కలిపి, దించే ముందు నిమ్మ రసం పిండాలి ►వేయించిన పల్లీలు, నేతిలో వేయించిన జీడిపప్పులు వేసి బాగా కలపాలి ►కొత్తిమీరతో అందంగా అలంకరించితే నోరూరించే కొబ్బరి అన్నం ప్రసాదం తినడం కోసం తొందరపడక తప్పదు. – నిర్వహణ: డా. వైజయంతి పురాణపండ -
తమిళనాడు తాటిబెల్లం
సంగారెడ్డి మున్సిపాలిటీ: బతుకుదెరువు కోసం తమిళనాడు రాష్ట్రం నుంచి తాటి గుంజల నుంచి తయారు చేసిన బెల్లాన్ని జిల్లా కేంద్రం సంగారెడ్డి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ఈ బెల్లం రుచిగా ఉండటంతో పట్టణ ప్రజలు, వాహనదారులు కొనుగోలు చేస్తూ తింటున్నారు. తమిళనాడు నుంచి వాహనంలో తీసుకువచ్చిన విక్రయదారులు పట్టణ శివారులో అక్కడక్కడా ప్రధాన కూడళ్ల వద్ద ఈ తాటి బెల్లం విక్రయిస్తున్నారు. ఈ బెల్లంతో ఎలాంటి హానీ జరగదని, ఆరోగ్యానికి మంచిదని పేర్కొంటున్నారు. -
వరంగల్.. బెల్లం బజార్ !
సాక్షి, రామన్నపేట: సాధారణంగా బెల్లం కేజీ ధర రకాన్ని బట్టి రూ.30 నుంచి రూ.40 వరకు ఉంటుంది. జిల్లావ్యాప్తంగా ఇదంతా ఒకే రీతిలో ఉన్నా హోల్‌సేల్ వ్యాపారానికి పేరు గాంచిన వరంగల్ బీట్‌బజార్‌లో మాత్రం ఇతర ప్రాంతాలతో సంబంధం లేకుండా పోతోంది. ఇక్కడి సిండికేట్ కారణంగా హోల్‌సేల్‌గానే బెల్లం ధర రూ.55 పలుకుతుండగా.. రిటైల్ మార్కెట్‌కు వచ్చే సరికి ఇది రూ.60కి చేరుతుండడం గమనార్హం. ‘సిండికేట్’గా ఏర్పడిన కొందరు వ్యాపారుల తీరు కారణంగా ఈ ధర ఒక్కో సారి ఇంత కంటే ఎక్కువగా పలికిన సందర్భాలు ఉన్నాయి. గుడుంబా ముడిసరుకులపై నిషేధం గుడుంబా తయారీ, అమ్మకాలను రాష్ట్ర ప్రభుత్వం నిషేధించింది. ఇందులో భాగంగానే గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం, పటిక అమ్మకాలపై నియంత్రణ పెంచింది. ఆధార్ కార్డు జిరాక్స్ ఇస్తేనే బెల్లం అమ్మాలనే నిబంధనను అమల్లోకి తెచ్చింది. క్రమక్రమంగా బెల్లం వినియోగాన్ని గృహ అవసరాలకు పరిమితం చేయడానికి ఉపక్రమించింది. గుడుంబా బట్టీలకు బెల్లం చేరకుండా అడ్డుకట్ట వేసేందుకు ప్రయత్నించింది. ఇలా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తూ వెళ్లడంతో బెల్లం గృహావసరాలకే పరిమితమైంది. రంగంలోకి సిండికేట్ వ్యాపారులు బెల్లం అమ్మకాలపై ప్రభుత్వం నిషేధం విధించడంతో గుడుంబా తయారీ తగ్గుముఖం పట్టింది. కొద్ది మంది వ్యక్తులే ఇతర రాష్ట్రాల నుంచి రైళ్ల ద్వారా బెల్లాన్ని గుడుంబావ్యాపారులకు చేరవేసేవారు. కొద్దిరోజుల్లోనే రైళ్ల ద్వారా కూడా బెల్లం రాకుండా అధికారులు నియంత్రించగలిగారు. ఇక్కడే సిండికేట్ రంగంలోకి దిగింది. గు డుంబా తయారీ తగ్గుముఖం పడుతున్న క్రమంలో సిండికేట్‌గా మారిన కొందరు వ్యాపారులు మళ్లీ బెల్లం అమ్మకాలకు తెర తీయడం ద్వారా ప్రభుత్వ స్పూర్తికి తూట్లు పొడిచారు. ఈ వ్యాపా రం వరంగల్ బీట్ బజార్ కేంద్రంగా కొనసాగుతుండడం.. ఇటువైపు అధికారులు కన్నెత్తి చూడ డం లేదనే విమర్శలు వస్తుండడం గమనార్హం. రెట్టింపు ధర మార్కెట్లో సాధారణ ప్రజలకు బెల్లం అమ్ముతున్నామన్న నెపంతో విక్రయిస్తున్నా ఎక్కువ శాతం సరుకు మళ్లీ గుడుంబా బట్టీలకే చేరుతోంది. బెల్లం అమ్మకాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు విధించినప్పుడు ఇతర రాష్ట్రాల నుంచి చాటుమాటుగా ఎంతో రిస్క్ తీసుకుని మరీ బెల్లం తీసుకొచ్చేవారు. కానీ ఇప్పుడు వరంగల్ మార్కెట్లో బెల్లం లభిస్తుండడంతో గుడుంబా తయారీ దారులు సిండికేట్‌ను ఆశ్రయిస్తున్నారు. ఇలా గు డుంబా అమ్మకం, తయారీదారుల నుంచి ఉన్న డి మాండ్‌ను ఆసరాగా చేసుకుని సిండికేట్ వ్యాపారులు ధరను రెట్టింపు చేసేశారు. కేజీ రూ.30 ఉండాల్సిన బెల్లాన్ని హోల్‌సెల్ మార్కెట్లోనే రూ.55కు పెంచారు. దీంతో గృహ అవసరాలు, శుభకార్యాలకు బెల్లం కావాల్సిన వారు ఇంత ధర వెచ్చించలేక సమస్యెదుర్కొంటున్నారు. దీనికి తోడు ఈ సిండికేట్ ఫలితంగా పల్లెల్లో గుడుంబా తయారీ, అమ్మకాలు జోరందుకోవడంతో ప్రభుత్వం విధించిన నిషేధం నీరుగారుతున్నట్లవుతోంది. ధర తగ్గనివ్వరు.. పది మంది బెల్లం వ్యాపారులతో కలిసి ఏర్పడిన సిండికేట్ మార్కెట్లో బెల్లం ధర తగ్గకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. కొత్త వారెవెరూ బెల్లం అమ్మకుండా చూస్తున్నారు. సరుకు తెప్పించడం, వ్యాపారుల వారీగా విభజించడం, డబ్బు వసూలు చేయడం, అధికారులను మచ్చిక చేసుకోవడం ఇలా పనులను విభజించకున్న వ్యాపారులు ధర ఇష్టారాజ్యంగా పెంచేస్తున్నారు. ఈ వ్యవహారమంతా ఎక్సైజ్ శాఖ అధికారులకు తెలిసినా ‘మామూలు’గా ఊరుకుంటున్నారని తెలుస్తోంది. దీనికి తోడు సిండికేట్‌ను కాదని బెల్లం అమ్మే వారి సమాచారం ఇచ్చిందే తడవుగా దాడులు చేస్తున్నారని చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం విధించిన నిషేధం సజావుగా అమలు జరగాలన్నా... సామాన్యులకు గృహ అవసరాల కు బెల్లం అందుబాటులోకి రావాల్సిన అధికారులు కొరఢా ఝులిపించాల్సిన అవసరం ఉంది. -
పెసరంత భక్తి
రాములవారికి ఏ నైవేద్యం పెట్టినా స్వీకరిస్తాడు. అందులో భక్తి నింపితే చాలు. పెసరంత నైవేద్యానికి కొండంత అండగా ఉంటాడు.పండగరోజు పెసరలతో స్వామికి నైవేద్యం!మీకు ప్రసాదం! వడ పప్పు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర తరుగు – 2 టీ స్పూన్లు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; పచ్చి మిర్చి తరుగు – 2 టీ స్పూన్లు; నిమ్మ రసం – 2 టీ స్పూన్లు; ఉప్పు – కొద్దిగా. తయారీ: ►ముందుగా పెసరపప్పును సుమారు మూడు గంటల సేపు నానబెట్టి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►కొబ్బరి తురుము, కొత్తిమీర తరుగు, క్యారట్ తురుము, పచ్చి మిర్చి తరుగు, నిమ్మ రసం, ఉప్పు వేసి బాగా కలిపి, సుమారు అర గంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. పానకం కావలసినవి: నీళ్లు – 4 కప్పులు; బెల్లం పొడి – రెండు కప్పులు; ఏలకుల పొడి – టీ స్పూను; మిరియాల పొడి – రెండు టీ స్పూన్లు. తయారీ: ►ముందుగా ఒక పెద్ద పాత్రలో నీళ్లు, బెల్లం పొడి వేసి బెల్లం కరిగేవరకు బాగా కలపాలి ►ఏలకుల పొడి, మిరియాల పొడి జత చేసి మరోమారు కలపాలి ►గ్లాసులోకి తీసుకుని తాగాలి. పెసర పప్పులడ్డు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; బియ్యం – అర కప్పు; మినప్పప్పు – ఒక కప్పు; నెయ్యి – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఉప్పు – చిటికెడు; ఎండు కొబ్బరి తురుము – అర కప్పు; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ►ముందుగా ఒక పాత్రలో మినప్పప్పు, బియ్యం, ఉప్పు వేసి సుమారు నాలుగు గంటలు నానబెట్టాలి ►మిక్సీలో వేసి మెత్తగా దోసెల పిండి మాదిరిగా రుబ్బి పక్కన ఉంచాలి ►పెసర పప్పుకి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు గంటసేపు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►బాణలి లో తగినన్ని నీళ్లు పోసి మరిగించాలి ►పెసరపప్పు జత చేసి ఉడికించి దింపేయాలి ►చల్లారాక, రంధ్రాలున్న గిన్నెలో పోసి నీళ్లు పోయేవరకు సుమారు ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి ►నీరంతా పోయాక మిక్సీలో వేసి మెత్తగా చేసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, బెల్లం పొడి, పావు కప్పు నీళ్లు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతుండాలి ►కొద్దిగా నెయ్యి వేసి బాగా కలిపి, ఉడికించి ఉంచుకున్న పెసర పప్పు ముద్ద వేసి కలిపి, గట్టి పడిన తరవాత దింపేయాలి ►కొద్దిగా చల్లారాక ఉండలుగా చేసి పక్కన ఉంచాలి ►బాణలిలో నూనె కాగాక, తయారుచేసి ఉంచుకున్న పెసర పూర్ణాలను మినప్పప్పు మిశ్రమం పిండిలో ముంచి బూరెల మాదిరి గా నూనెలో వేసి వేయించాలి ►దోరగా వేగిన తరవాత పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►కొద్దిగా చల్లారాక మధ్యకు చేసి, కాగిన నెయ్యి వేసి అందించాలి. పెసర పాయసం కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; నీళ్లు – ఒక కప్పు; పల్చటి కొబ్బరి పాలు – అర కప్పు; బెల్లం పొడి – ముప్పావు కప్పు; చిక్కటి కొబ్బరి పాలు – ఒక కప్పు; కొబ్బరి నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీడిపప్పులు – 15; కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను. తయారీ: ►పెసర పప్పును శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి ఐదారు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►చల్లారాక మూత తీసి ఉడికిన పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకోవాలి ►గరిటెతో మెత్తగా మెదపాలి ∙పల్చటి కొబ్బరి పాలు, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►బెల్లం పొడి జత చేసి కరిగేవరకు కలుపుతుండాలి ►చిక్కటి కొబ్బరిపాలను జత చేసి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి (ఎక్కువ సేపు ఉంచితే, పాలు విరిగిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో కొబ్బరి నూనె కాగాక, జీడిపప్పులు, కిస్మిస్లు ఒకదాని తరవాత ఒకటి వేసి దోరగా వేయించాలి ►ఉడికిన పాయసంలో వేయాలి ►ఏలకుల పొడి కూడా జత చేసి కలిపి దింపేయాలి. పెసర పప్పుహల్వా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నెయ్యి – 10 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; పిస్తా తరుగు – ఒక టేబుల్ స్పూను (అన్సాల్టెడ్); కిస్మిస్ – ఒక టేబుల్ స్పూను; చిక్కటి పాలు – ఒక కప్పు; నీళ్లు – 2 కప్పులు; పంచదార – ఒకటిన్నర కప్పులకు కొద్దిగా తక్కువ. తయారీ: ►పెసరపప్పుకు తగినన్ని నీళ్లు జత చేసి, సుమారు ఐదు గంటల సేపు నానబెట్టాక నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి, తగినన్ని నీళ్లు జత చేస్తూ మెత్తగా చేయాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కాగాక మెత్తగా రుబ్బుకున్న పెసరపిండిని అందులో వేసి ఆపకుండా సన్నటి మంట మీద కలుపుతుండాలి ►బాగా ఉడికి, బాణలి నుంచి విడివడేవరకు కలుపుతుండాలి ►ఈలోగా మరొక బాణలి స్టౌ మీద ఉంచి పాలు, నీళ్లు, పంచదార వేసి ఉడికించాలి ►పెసర పిండి మిశ్రమం కొద్దిగా రంగు మారుతుండగా, పంచదార పాలు మిశ్రమాన్ని జతచేసి కలియబెట్టాలి ►నెయ్యి వేరుపడే వరకు కలపాలి ►ఏలకుల పొడి, పిస్తా తరుగు, కిస్మిస్ జత చేసి కలియబెట్టాలి ►హల్వాను వేడిగానే అందించాలి. పెసర పప్పు బూరెలు కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; పంచదార – అర కప్పు; నెయ్యి – పావు కప్పు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; డ్రై ఫ్రూట్స్ – పావు కప్పు (జీడి పప్పు, బాదం పప్పులు, పిస్తాలు...) తయారీ: ►స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక పెసర పప్పు వేసి దోరగా అయ్యేవరకు వేయించి, ఒక ప్లేటులోకి తీసుకోవాలి ►చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పిండిలా అయ్యేలా గ్రైండ్ చేయాలి ►పిండిని జల్లించాలి ∙అదే మిక్సీలో పంచదార, ఏలకుల పొడి వేసి మెత్తగా చేయాలి ►ఒక పాత్రలో పెసర పిండి, పంచదార పొడి వేసి రెండూ కలిసేలా కలపాలి డ్రైఫ్రూట్స్ జత చేయాలి ►కరిగించిన నేతిని కొద్దికొద్దిగా జత చేస్తూ ఉండలు కట్టుకోవాలి ►బాగా చల్లారాక గాలి చొరని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి. పెసర పప్పు ఫ్రై కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; నీళ్లు – రెండున్నర కప్పులు; పసుపు – చిటికెడు. పోపు కోసం: ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (నిలువుగా మధ్యకు తరగాలి); ఎండు మిర్చి – ఒకటి; అల్లం తురుము – పావు టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 4; జీలకర్ర – ఒక టీ స్పూను; ఇంగువ – చిటికెడు; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; గరం మసాలా – పావు టీ స్పూను; కొత్తిమీర తరుగు – ఒక టేబుల్ స్పూను; కసూరీ మేథీ – అర టీ స్పూను; నూనె – 2 టేబుల్ స్పూన్లు; బటర్ – అర టేబుల్ స్పూను తయారీ: ►పెసర పప్పును ఒక గిన్నెలో వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►తగినన్ని నీళ్లు, పసుపు జత చేసి కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దింపేయాలి ►చల్లారాక గరిటెతో మెత్తగా మెదపాలి ►అవసరమనుకుంటే కొద్దిగా నీళ్లు జత చేసి, స్టౌ మీద సన్నని మంట మీద ఉంచాలి ►చిన్న బాణలిలో నూనె లేదా బటర్ వేసి కరిగాక, జీలకర్ర వేసి వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి మరోమారు వేయించాక, అల్లం తురుము, వెల్లుల్లి రెబ్బలు, పచ్చి మిర్చి తరుగు, ఎండు మిర్చి వేసి వేయించాలి ►టొమాటో తరుగు జత చేసి ముక్కలు మెత్తబడే వరకు ఉడికించాలి ►మిరప కారం, గరం మసాలా, ఇంగువ, కసూరీ మేథీ, కొత్తిమీర జత చేయాలి ►బాగా ఉడికేవరకు వేయించాలి ►తడ్కా మిశ్రమం జత చేసి మరోమారు కలిపి, రెండు నిమిషాల తరవాత దింపేయాలి. పెసర పప్పుతడ్కా కావలసినవి: పెసర పప్పు – ముప్పావు కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; నీళ్లు – 3 కప్పులు; ఉప్పు – తగినంత పోపు కోసం: జీలకర్ర – ఒక టీ స్పూను; వెల్లుల్లి రెబ్బలు – 5; గరం మసాలా పొడి – పావు టీ స్పూను; మిరప కారం – పావు టీ స్పూను; తరిగిన పచ్చిమిర్చి – 2; ఇంగువ – కొద్దిగా; నెయ్యి లేదా నూనె – 3 టేబుల్ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ►స్టౌ మీద కుకర్‌లో కొద్దిగా నూనె వేసి కాగాక, ఉల్లి తరుగు, టొమాటో తరుగు, అల్లం తురుము వేసి కలుపుకోవాలి ►పసుపు, మిరపకారం, నీళ్లు జత చేసి బాగా కలపాలి ►పెసర పప్పు వేసి కలియబెట్టి మూత పెట్టాలి ►నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►ఉప్పు జత చేసి కలియబెట్టాలి ►స్టౌ మీద చిన్న బాణలిలో కొద్దిగా నూనె లేదా నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి వేయించాలి ►వెల్లుల్లి రెబ్బలు, తరిగిన పచ్చి మిర్చి జత చేసి కలిపి దింపేయాలి ►గరం మసాలా, మిరప కారం, ఇంగువ జత చేసి బాగా కలిపి, ఉడికిన తడ్కా మీద వేసి కలపాలి ►కొత్తిమీరతో అలంకరించాలి ►అన్నం, చపాతీలలోకి రుచిగా ఉంటుంది. పెసర సలాడ్ కావలసినవి: పెసలు – రెండు కప్పులు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 1 (సన్నగా తరగాలి); మిరప కారం – పావు టీ స్పూను; చాట్ మసాలా – అర టీ స్పూను; నిమ్మ రసం – ఒక టీ స్పూను; ఉడికించిన బంగాళ దుంప – ఒకటి (తొక్క తీసి సన్నగా తరగాలి); కొత్తిమీర – కొద్దిగా; తయారీ: ►ముందు రోజు రాత్రి పెసలు నానబెట్టి, మరుసటి రోజు ఉదయం నీరు ఒంపేసి, పక్కన ఉంచాలి ►ఆ మరుసటి రోజు ఉదయానికి మొలకలు వస్తాయి ►మొలకలు వచ్చిన పెసలను ఉపయోగించాలి. తయారీ: ►మొలకలు వచ్చిన పెసలకు తగినన్ని నీళ్లు జతచేసి ఉడికించి, నీళ్లు ఒంపేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఉల్లితరుగు, టొమాటో తరుగు జత చేయాలి ►పచ్చి మిర్చి తరుగు, బంగాళదుంప తరుగు జత చే సి కలియబెట్టాలి ►పావు మిరపకారం, చాట్ మసాలా జతచేశాక, ఉప్పు, నిమ్మ రసం వేసి, బాగా కలపాలి ►కొత్తిమీరతో అలంకరించి, వెంటనే అందించాలి. పెసర కిచిడీ కావలసినవి: పెసర పప్పు – అర కప్పు; బియ్యం – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; టొమాటో తరుగు – పావు కప్పు; అల్లం తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – ఒకటి; జీలకర్ర – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – చిటికెడు; నీళ్లు – మూడున్నర కప్పులు; నూనె లేదా నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; ఉప్పు – తగినంత. తయారీ: ►ఒక పాత్రలో పెసర పప్పు, బియ్యం వేసి తగినన్ని నీళ్లు జత చేసి శుభ్రంగా కడగాలి ►మంచి నీళ్లు జత చేసి సుమారు అరగంటసేపు నానబెట్టాలి ►స్టౌ మీద కుకర్ ఉంచి, వేడయ్యాక నెయ్యి వేసి కాగాక జీలకర్ర వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►ఉల్లి తరుగు జత చేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి ►టొమాటో తరుగు, పచ్చి మిర్చి తరుగు, అల్లం తురుము జత చేసి వేయించాలి ►పసుపు, ఇంగువ జత చేసి టొమాటోలు మెత్తపడే వరకు వేయించాలి ►నానబెట్టుకున్న పెసర పప్పు, బియ్యం మిశ్రమంలోని నీటిని తీసేసి, బియ్యం మిశ్రమాన్ని కుకర్‌లో వేసి బాగా కలపాలి ►తగినన్ని నీళ్లు, ఉప్పు జత చేసి కుకర్ మూత పెట్టాలి ►ఆరేడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►మిశ్రమం మరీ ముద్దగా అనిపిస్తే కొద్దిగా నీళ్లు జత చేయాలి ►కిచిడీ మీద నెయ్యి వేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది ►పెరుగు, సలాడ్లతో తినొచ్చు. పెసర పప్పు కచోరీ కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు; ఉప్పు – తగినంత; నెయ్యి లేదా నూనె – పావు కప్పు; నీళ్లు – తగినన్ని కచోరీ స్టఫింగ్ కోసం: పెసర పప్పు – అర కప్పు; నెయ్యి – అర టేబుల్ స్పూను; పసుపు – పావు టీ స్పూను; మిరప కారం – అర టీ స్పూను; జీలకర్ర పొడి – అర టీ స్పూను; శొంఠి పొడి – అర టీ స్పూను; ధనియాల పొడి – ఒక టీ స్పూను; సోంపు పొడి – ఒక టీ స్పూను; ఆమ్చూర్ పొడి – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రై చేయడానికి తగినంత తయారీ: ►ఒక పాత్రలో మైదా పిండి, ఉప్పు వేసి కలపాలి ►పావు కప్పు నెయ్యి జత చేయాలి ►తగినన్ని నీళ్లు జత చేసి చపాతీ పిండిలా కలపాలి ►తడి వస్త్రం మూత వేసి గంట సేపు పక్కన ఉంచాలి ►పెసర పప్పును శుభ్రంగా కడిగి, తగినన్ని నీళ్లు జత చేసి రెండు గంటలపాటు నానబెట్టాలి ►నీళ్లు ఒంపేసి, పెసర పప్పును మిక్సీలో వేసి మెత్తగా కాకుండా కొద్దిగా రవ్వలా ఉండేలా మిక్సీ పట్టాలి ►స్టౌ మీద బాణలిలో నెయ్యి కాగాక మిరప కారం, ఆమ్చూర్ పొడి వంటి మసాలా దినుసులు జత చేసి దోరగా వేయించాలి ►రవ్వలా మిక్సీ పట్టిన పెసర పప్పు, ఉప్పు, ఇంగువ జత చేసి మూడునాలుగు నిమిషాలు ఆపకుండా కలియబెట్టి, దింపి చల్లార్చాలి ►చేతికి కొద్దిగా నూనె పూసుకుని, పిండిని తగు పరిమాణంలో చేతిలోకి తీసుకుని, ఉండలు చేసి పక్కన ఉంచాలి ►కలిపి ఉంచుకున్న మైదాపిండిని మరోమారు బాగా కలపాలి ►పిండిని పొడవుగా గుండ్రంగా ఒత్తి, సమాన భాగాలుగా కట్ చేయాలి ►ఒక్కో ఉండను చపాతీకర్రతో కొద్దిగా పల్చగా ఒత్తాలి ►పెసరపప్పు మిశ్రమాన్ని కొద్దిగా ఉంచి అంచులు మూసేసి, (మరీ పల్చగాను, మరీ మందంగాను కాకుండా చూసుకోవాలి) ►మరోమారు ఒత్తాలి (పల్చటి వస్త్రం పైన వేసి ఉంచాలి. లేదంటే ఎండిపోతాయి) ►స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఒత్తి ఉంచుకున్న కచోరీలను వేసి, దోరగా వేయించాలి ►కొద్దిగా పొంగుతుండగా, జాగ్రత్తగా వెనుకకు తిప్పాలి ►బంగారు వర్ణంలోకి వచ్చాక పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ►గ్రీన్ చట్నీ లేదా స్వీట్ చట్నీతో తింటే రుచిగా ఉంటాయి. పెసరపప్పు ఢోక్లా కావలసినవి: పెసర పప్పు – ఒక కప్పు; అల్లం + పచ్చి మిర్చి ముద్ద – టేబుల్ స్పూను; నీళ్లు – అర కప్పు; కొత్తిమీర ఆకులు – టేబుల్ స్పూను; నూనె – ఒక టేబుల్ స్పూను; నిమ్మ రసం – ఒక టేబుల్ స్పూను; ఉప్పు – తగినంత; నిమ్మ ఉప్పు – టీ స్పూను. పోపు కోసం: నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఆవాలు – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; ఇంగువ – చిటికెడు; వేయించిన నువ్వులు – టీ స్పూను; కరివేపాకు – రెండు రెమ్మలు గార్నిషింగ్ కోసం: కొత్తిమీర తరుగు – పావు కప్పు; పచ్చి కొబ్బరి తురుము – పావు కప్పు తయారీ: ►పెసరపప్పుకి తగినన్ని నీళ్లు జతచేసి రెండుమూడు సార్లు బాగా కడిగి, నాలుగు గంటల పాటు నానబెట్టి, నీళ్లు ఒంపేయాలి ►కొత్తిమీర, అరకప్పు నీళ్లు జత చేసి, మిక్సీలో వేసి కొద్దిగా పలుకులా ఉండేలా మిక్సీ పట్టాలి (మరీ ముద్దలా అవ్వకూడదు. మరీ పల్చగాను, మరీ గట్టిగానూ కూడా ఉండకూడదు) ►ఒక పాత్రలో రెండున్నర కప్పుల నీళ్లు పోసి, మరిగించాలి ►వెడల్పాటి పళ్లానికి కొద్దిగా నూనె పూసి పక్కన ఉంచాలి ►ఒక పాత్రలో అల్లం + పచ్చిమిర్చి ముద్ద, నూనె, నిమ్మరసం, ఉప్పు వేసి బాగా కలిపి, తయారుచేసి ఉంచుకున్న పెసర పిండి మిశ్రమాన్ని జత చేయాలి ►చివరగా నిమ్మ ఉప్పు జత చేసి బాగా కలిపి, నూనె పూసిన పాత్రలో పోసి సమానంగా పరవాలి ►స్టౌ మీద మరుగుతున్న నీళ్ల పాత్రలో ఈ పళ్లెం ఉంచి, మూత పెట్టి, సుమారు పావు గంట తరవాత దింపేయాలి ►బాగా చల్లారాక బయటకు తీయాలి ►చిన్న బాణలిలో నూనె వేసి కాగాక ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►నువ్వులు జత చేసి మరోమారు కలియబెట్టాలి ►ఇంగువ, కరివేపాకు వేసి వేయించి బాగా కలపాలి ►రెండు టేబుల్ స్పూన్ల నీళ్లు జత చేసి పోపు మిశ్రమాన్ని బాగా కలపాలి ►ఈ మిశ్రమాన్ని తయారు చేసి ఉంచుకున్న ఢోక్లా మీద వేయాలి ►కొత్తిమీర, కొబ్బరి తురుములతో అలంకరించి అందించాలి. పానకం– వడపప్పు ప్రాముఖ్యత ఏమిటి? శ్రీరామ నవమి రోజున అందరిళ్లలోనూ పానకం–వడపప్పు తయారు చేసి మహా ప్రసాదంగా స్వీకరిస్తారు. దీని వెనుక ప్రాకృతిక పరమార్థం దాగి ఉంది. ఇది ఎండాకాలం. కాబట్టి పానకాన్ని, వడపప్పును ప్రసాదరూపంలో సేవించడం వల్ల ఆరోగ్యం, ఆయుష్యాభివృద్ధి కలుగుతాయని ఆయుర్వేద శాస్త్రజ్ఞుల అభిప్రాయం. మన ప్రసాదాలన్నీ సమయానుకూలంగా, దేహారోగ్యాన్ని బట్టి నిర్ణయించినవే. వడపప్పు – పానకం కూడా అంతే. శరదృతువు, వసంత రుతువులు యముడి కోరల్లాంటివని దేవీభాగవతం చెబుతోంది. ఈ రుతువులో వచ్చే గొంతువ్యాధులకు... పానకంలో ఉపయోగించే మిరియాలు, ఏలకులు ఉపశమనాన్ని ప్రసాదిస్తాయని, ఔషధంలా పనిచేస్తాయని లౌకికంగా చెబుతారు. పానకం విష్ణువుకి ప్రీతిపాత్రమైనదని చెబుతారు. పెసరపప్పు శరీరంలోని ఉష్ణాన్ని తగ్గించి, చలవ చేస్తుంది. జీర్ణశక్తిని వృద్ధిచేస్తుంది. దేహకాంతికి, జ్ఞానానికి ప్రతీక. పెసరపప్పును ‘వడ’పప్పు అంటారు. అంటే మండుతున్న ఎండల్లో ‘వడ’ కొట్టకుండా వేడి నుంచి కాపాడుతుందని అర్థం. పెసరపప్పు బుధగ్రహానికి ప్రీతిపాత్రమైనది. అందుకే పూర్వీకులకు పెసరపప్పు ఎంతో ప్రశస్తమైనది. బాగా జ్వరంతో బాధపడి తిరిగి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న వారికి పెద్దలు పెసరపప్పుతో చేసిన కట్టు, పెసరపప్పు కలిపి వండిన పులగం వంటి వాటిని తినిపిస్తారు. ఎందుకంటే పెసరపప్పు తేలికగా అరుగుతుంది. శరీరం కోల్పోయిన బలాన్ని, సత్తువను తిరిగి తెస్తుంది. వేసవి కాలంలో వడపప్పును తినడం వంటికి చలువ చేస్తుంది. అలాగే తియ తియ్యటి బెల్లం పానకాన్ని సేవించడం వల్ల ఎండలను ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. -
ఆరంభం అమోఘం
నరికిన చెరకులు కొరికిన తియ్యన. చింత చిగురులు.. నలిపిన పుల్లన. కారము కారము.. మిరపలు కలిపిన. చేదు దిగును చెట్టెక్కి పూత రాల్పిన.వగరు చేరును లేత మామిళ్లు కోసిన.ఉగాది వచ్చును.. ఉప్పొక్కటి వేసిన. మిరియాలఫ్రైడ్ రైస్(కారం) కావలసినవి: బాస్మతి బియ్యం – మూడు కప్పులు; నెయ్యి – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; జీలకర్ర – ఒక టీ స్పూను; ఆవాలు – ముప్పావు టీ స్పూను; నల్ల మిరియాలు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; నువ్వులు – ఒకటిన్నర టేబుల్ స్పూన్లు; కరివేపాకు – 3 రెమ్మలు; ఉప్పు – రుచికి తగినంత. తయారి: ►ముందుగా బాస్మతి బియ్యాన్ని శుభ్రంగా కడిగి, గంటసేపు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, తగినన్ని నీళ్లు జత చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి ►బాణలిలో నూనె లేకుండా మిరియాలు, నువ్వులు, కరివేపాకు వేసి దోరగా వేయించి తీసి, బాగా చల్లారాక మిక్సీలో వేసి మెత్తగా పొడి చేయాలి ►బాణలిలో నెయ్యి వేసి కరిగాక ఆవాలు వేసి చిటపటలాడేవరకు వేయించాలి ►జీలకర్ర జత చేసి గోధుమరంగులోకి వచ్చేవరకు వేయించాలి ►ఉడికించిన అన్నం జత చేసి కలపాలి ►మెత్తగా పొడి చేసిన మిరియాల పొడి మిశ్రమం, ఉప్పు జత చేసి మరోమారు కలిపి దింపేయాలి ►అప్పడాలతో కలిపి తింటే రుచిగా ఉంటుం. చెరకురసం ఖీర్ (తీపి) కావలసినవి: చెరుకు రసం – 2 కప్పులు; బాస్మతి బియ్యం – ఒక కప్పు (శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి అరగంటసేపు నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; పాలు – 2 కప్పులు; జీడి పప్పులు – 3 టేబుల్‌స్పూన్లు; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు. తయారి: ►ఒక పెద్ద పాత్రలో పాలు పోసి స్టౌ మీద ఉంచి మరిగించాలి ►నానబెట్టిన బియ్యం జత చేసి ఉడికించాలి (మధ్యమధ్యలో కలుపుతుండాలి) ►చెరకురసం జత చేసి సుమారు అయిదారు నిమిషాలు ఉడికించి దింపేయాలి ►బెల్లం పొడి, కొబ్బరి తురుము, జీడిపప్పులు జత చేసి కలిపి అందించాలి. వేప పువ్వుముద్ద కూర(చేదు) కావలసినవి: ఎండబెట్టిన వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; నెయ్యి – ఒక టీ స్పూను; రసం పొడి – ఒక టీ స్పూను; పసుపు – పావు టీ స్పూను; ఆవాలు – పావు టీ స్పూను; ఎండు మిర్చి – 2; కరివేపాకు – 2 రెమ్మలు; చింతపండు – నిమ్మకాయ పరిమాణంలో; బెల్లం పొడి – రెండున్నర టీ స్పూన్లు; సెనగ పప్పు – అర టీ స్పూను; మినప్పప్పు – అర టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారి: ►అర గ్లాసు నీళ్లలో చింతపండును సుమారు పది నిమిషాలు నానబెట్టి, చిక్కటి రసం తీసి పక్కన ఉంచాలి ►స్టౌ మీద బాణలి ఉంచి, వేడయ్యాక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ►సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి ఒకదాని తరవాత ఒకటి వేసి వేయించాక, వేప పువ్వు వేసి దోరగా వేయించాలి ►చిక్కగా తీసిన చింతపండు రసం జత చేసి బాగా కలపాలి ►బెల్లం పొడి, రసం పొడి, ఉప్పు జత చేసి మరోమారు బాగా కలిపి, సుమారు ఏడెనిమిది నిమిషాలు స్టౌ మీద ఉంచి దింపేయాలి ►కరివేపాకుతో అలంకరించాలి ►పొంగల్, రాగి సంగడితో అందిస్తే రుచిగా ఉంటుంది. మామిడికాయడ్రింక్ (వగరు) కావలసినవి: మామిడికాయలు – 2; మిరియాల పొడి – చిటికెడు; నల్ల ఉప్పు – 2 టీ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 3 టేబుల్ స్పూన్లు; నీళ్లు – ఒక గ్లాసుడు; జీలకర్ర పొడి – పావు టీ స్పూను; బెల్లం పాకం – రెండు టేబుల్ స్పూన్లు; పుదీనా ఆకులు – కొద్దిగా. తయారి: ►మామిడికాయలను శుభ్రంగా కడగాలి ►ఒక గిన్నెలో మూడు కప్పుల నీళ్లు పోసి, కడిగిన మామిడికాయలను జతచేసి, కుకర్‌లో ఉంచి నాలుగు విజిల్స్ వచ్చాక దింపేయాలి ►బాగా చల్లారాక, మామిడి కాయల తొక్క వేరు చేసి, మామిడి గుజ్జును చేతితో మెత్తగా చేసి ఒక పాత్రలోకి తీసుకోవాలి ►ఒక పాత్రలో ముప్పావు కప్పు నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల బెల్లం వేసి కరిగించి, స్టౌ మీద ఉంచి, ఐదు నిమిషాలయ్యాక దింపేయాలి ►బ్లెండర్లో నాలుగు టేబుల్ స్పూన్ల మామిడికాయ గుజ్జు, పావు టీ స్పూను జీలకర్ర పొడి, 2 టేబుల్ స్పూన్ల బెల్లం పాకం, చిటికెడు మిరియాల పొడి, పావు టీ స్పూను నల్ల ఉప్పు, ఆరేడు పుదీనా ఆకులు వేసి మిక్సీ పట్టాక, తగినన్ని చల్లని నీళ్లు జత చేసి మరోమారు మిక్సీ తిప్పి తీసేసి, గ్లాసులలో పోసి అందించాలి. చింతపండు పచ్చి పులుసు (పులుపు) కావలసినవి: చింతపండు రసం – రెండు కప్పులు (కొద్దిగా పల్చగా తీసిన రసం); ఉల్లి తరుగు – పావు కప్పు; పచ్చి మిర్చి – 3 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); కొత్తిమీర – చిన్న కట్ట; బెల్లం పొడి – టీ స్పూను; ఉప్పు – రుచికి తగినంత. పోపు కోసం: ఆవాలు – టీ స్పూను; జీలకర్ర – టీ స్పూను; కరివేపాకు – 2 రెమ్మలు; ఇంగువ – చిటికెడు; ఎండుమిర్చి – 2; వెల్లుల్లి రేకలు – 4; నూనె – కొద్దిగా. తయారి: ►ఒక బౌల్లో చింతపండు రసం, కరివేపాకు, బెల్లం పొడి, ఉల్లి తరుగు, ఉప్పు వేసి చేతితో బాగా కలపాలి. (ఉప్పు, తీపి తగ్గినట్టుగా అనిపిస్తే, మరింత జత చేసుకోవచ్చు) ►స్టౌ మీద చిన్న బాణలి ఉంచి వేడయ్యాక కొద్దిగా నూనె వేసి కాగాక, ఆవాలు, జీలకర్ర వేసి వేయించాలి ►కరివేపాకు, ఇంగువ, ఎండు మిర్చి, వెల్లుల్లి రేకలు, కరివేపాకు జత చేసి బాగా వేగిన తరవాత తీసి, తయారుచేసి ఉంచుకున్న పచ్చిపులుసులో వేసి కలపాలి అన్నంలోకి రుచిగా ఉంటుంది. ఉగాది పచ్చడి కావలసినవి: నీళ్లు – మూడు గ్లాసులు; చింతపండు – పెద్ద నిమ్మకాయ పరిమాణం; చిన్న చిన్న చెరకు ముక్కలు – 20; అరటి పండు – 2 (చిన్న చిన్న ముక్కలు చేయాలి); బెల్లం పొడి – ఒక కప్పుడు; వేప పువ్వు – 2 టేబుల్ స్పూన్లు; మామిడి కాయ – 1 (తొక్క తీసి చిన్న చిన్న ముక్కలు చేయాలి); ఉప్పు – చిటికెడు; పచ్చి మిర్చి – 4 (చిన్న చిన్న ముక్కలు చేయాలి) తయారి: ►ముందుగా చింతపండును గ్లాసుడు నీళ్లలో నానబెట్టి, రసం తీసి ఒక గిన్నెలో పోయాలి ►మూడు గ్లాసుల మంచి నీళ్లు జతచేయాలి ►బెల్లం పొడి, ఉప్పు జత చేసి బాగా కలపాలి ►వేప పువ్వు, అరటి పండు ముక్కలు, మామిడికాయ ముక్కలు, చెరకు ముక్కలు, పచ్చి మిర్చి జత చేసి బాగా కలిపి గ్లాసులలో పోసి అందించాలి. -
తాటి చెట్టుకు పది వేలు!
చెరకు పంచదార, బెల్లంకు బదులుగా తాటి బెల్లాన్ని వినియోగించడం అత్యంత ఆరోగ్యదాయకమని నిపుణులు చెబుతుండటంతో ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం వాడకంపై ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. శ్రీలంక వంటి దేశాలు తాటి బెల్లం, తాటి చక్కెరను పెద్ద ఎత్తున ఉత్పత్తి చేయడంతోపాటు విదేశాలకూ ఎగుమతి చేస్తున్నాయి. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వం తాటి ఉత్పత్తుల అభివృద్ధి సంస్థ ద్వారా ప్రతి జిల్లాలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రోత్సహిస్తోంది. ఈ నేపథ్యంలో ఆహార శుద్ధి నిపుణులు, తూర్పు గోదావరి జిల్లా పందిరిమామిడిలోని డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయానికి చెందిన పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త పి సి వెంగయ్యతో ‘సాక్షి సాగుబడి’ ప్రతినిధి పంతంగి రాంబాబు ఇటీవల ముచ్చటించారు. ఎదిగిన ప్రతి తాటి చెట్టు నుంచి తాటి బెల్లం ఉత్పత్తి ద్వారా సంవత్సరానికి రూ. పది వేల ఆదాయాన్ని పొందేందుకు వీలుందని, గ్రామస్థాయిలో ఉపాధి అవకాశాలను పెంపొందించవచ్చని, కేవలం రూ. 20 వేల మూల పెట్టుబడితో గ్రామస్థాయిలో తాటి బెల్లం ఉత్పత్తిని ప్రారంభించవచ్చని ఆయన చెబుతున్నారు. తాటి బెల్లం ప్రయోజనాలు? తాటి బెల్లం చెరకు పంచదార, బెల్లం కన్నా ఆరోగ్యదాయకమైనది. ఇందులో ఫ్రక్టోజు (76.86 శాతం) ఎక్కువగా, గ్లూకోజ్ తక్కువగా ఉంటుంది. దీని గ్లైసెమిక్ ఇండెక్స్(జి.ఐ.) 40 లోపే. నెమ్మదిగా రక్తంలో కలుస్తుంది. చెరకు పంచదార జి.ఐ. 100. తిన్న వెంటనే గ్లూకోజ్ రక్తంలోకి చేరుతుంది. ఐరన్ ఎక్కువగా ఉంటుంది. కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం వంటి మాక్రో న్యూట్రియంట్స్ పుష్కలంగా ఉంటాయి. దీన్ని రోజుకు ప్రతి ఒక్కరూ 10 గ్రా. తీసుకుంటే మంచిది. చక్కెర బెల్లం, పంచదారకు బదులు ఇంట్లో తాటి బెల్లం వాడుకుంటే చాలు. తెలుగు రాష్ట్రాల్లో తాటి బెల్లం ఉత్పత్తికి ఉన్న అవకాశాలేమిటి? రైతులకు /గీత కార్మికులకు ఆదాయం వచ్చే అవకాశం ఉందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కనీసం 6 కోట్ల తాటి చెట్లు ఉంటాయని అంచనా. వీటిలో కొన్నిటి నుంచి కల్లు తీస్తున్నారు. మొత్తంగా చూస్తే ఒక్క శాతం చెట్లను కూడా మనం ఉపయోగించుకోవడం లేదు. 99% చెట్లు వృథాగా ఉండిపోతున్నాయి. చెట్టుకు రోజుకు కనిష్టం 4 (గరిష్టం 8)లీటర్ల చొప్పున వంద రోజుల పాటు నీరాను సేకరించవచ్చు. ఏటా సగటున చెట్టుకు 40 కిలోల తాటి బెల్లం తయారు చేయవచ్చు. ప్రతి చెట్టు నుంచి నెలకు కనీసం రూ. వెయ్యి ఆదాయం పొందవచ్చు. ఏటా కనీసం రూ. 10 నుంచి 12 వేల వరకు ఆదాయం పొందే మార్గాలున్నాయి. 1969 నీరా రూల్స్ ప్రకారం ఎక్సైజ్ శాఖ అనుమతి పొంది గ్రామ స్థాయిలోనే చాలా సులువుగా తాటి బెల్లం తయారు చేయటం ప్రారంభించవచ్చు. వాల్యూ చెయిన్‌ను ప్లాన్ చేస్తే ఏడాది పొడవునా తాటి బెల్లం ప్రజలకు అందుబాటులోకి వస్తుంది, రైతులకు, గీత కార్మికులకూ స్థిరమైన ఆదాయం వస్తుంది. పీచు, తేగల ద్వారా కూడా ఆదాయం వస్తుంది. తేగల పొడిని మైదాకు ప్రత్యామ్నాయంగా ఆరోగ్యదాయక బేకరీ ఉత్పత్తుల్లో వినియోగించవచ్చు. చిన్న యూనిట్‌కు ఎంత ఖర్చవుతుంది? తాటి చెట్ల నుంచి పరిశుద్ధమైన పద్ధతిలో సున్నం వాడకుండానే నీరాను సేకరించే కూలింగ్ బాక్స్‌ను మేం రూపొందించాం. సాధారణంగా కుండల్లో కొంచెం సున్నం వేసి చెట్టుకు కడతారు. నీరా త్వరగా పులిసిపోకుండా ఉండటానికి ఇలా చేస్తారు. అయితే, సున్నం వేయకుండానే ఈ కూలింగ్ బాక్సుల ద్వారా నీరాను సేకరించే పద్ధతిని మేం కనుగొన్నాం. సేకరించిన నీరాను బాండీల్లో పోసి ఉడకబెడితే రెండు గంటల్లో తాటి బెల్లం తయారవుతుంది. ఇందుకు ఇనుప బాండీల కన్నా స్టెయిన్లెస్ స్టీల్(ఎస్.ఎస్.) బాండీలను వాడితే మంచిది. వంద లీటర్ల ఎస్.ఎస్. బాండీ, కూలింగ్ బాక్సులు ఇతర పరికరాలు కలిపి మొత్తం రూ. 20,000 ఖర్చవుతాయి. బ్యాచ్‌కు పది కిలోల తాటి బెల్లం తయారవుతుంది. ఈ మాత్రం పెట్టుబడితో ప్రతి గ్రామంలోనూ కట్టెలు లేదా గ్యాస్ పొయ్యిలపై తాటి బెల్లం వండుకోవచ్చు. కొంత అధిక పెట్టుబడితో పరిశ్రమ నెలకొల్పితే స్టీమ్ ద్వారా నడిచే 300 లీటర్ల ఎస్. ఎస్. బాండీని కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. నీరా సీజన్ ఎన్నాళ్లు? నవంబర్ నుంచే మగ చెట్ల(పోత్తాళ్ల) నుంచి నీరా తీయొచ్చు. ఆడ చెట్ల (పలుపు తాళ్ల) నుంచి ఫిబ్రవరి నుంచి, పండు తాళ్ల నుంచి జూన్–ఆగస్టు నెలల వరకు నీరా తీస్తూనే ఉండొచ్చు. మెలకువలు పాటిస్తే ఏడాది పొడవునా నీరాను పొందే పద్ధతులను మేం రూపొందించాం. అంటే.. ప్రతి గ్రామంలో స్వల్ప పెట్టుబడితోనే ఆరోగ్యదాయకమైన తాటి బెల్లం తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో రెండు, మూడు చోట్ల తప్ప తాటి బెల్లం మరెక్కడా తయారు చేయటం లేదు. ఎన్నాళ్లు నిల్వ ఉంటుంది? నీరుగారిపోతుందని అంటున్నారు? తాటి చెట్లకు మట్టి కుండలు కట్టి నీరా సేకరించే పద్ధతిలో నీరా పులిసిపోకుండా ఉండేందుకు లీటరుకు 3–4 గ్రాముల సున్నం వేస్తుంటారు. సున్నం ఎక్కువైతే నీరా ఉదజని సూచిక(పి.హెచ్) పెరుగుతుంది. పి.హెచ్. 7–8 ఉంటే మంచిది. అంతకన్నా పెరిగితే నీరాలో నిమ్మరసం పిండి, ఉడకబెడుతుంటే సున్నం తెట్టులాగా పైకి తేలుతుంది. దాన్ని తీసేస్తే సరిపోతుంది. నీరా పి.హెచ్. హెచ్చుతగ్గులను సరిగ్గా చూసుకోకపోతే నిల్వ సామర్థ్యం దెబ్బతింటుంది. అయితే, జాగ్రత్తలు పాటించి తయారు చేసిన నాణ్యమైన తాటి బెల్లాన్ని ఎండలో 2–3 గంటలు ఆరబెట్టాలి. తర్వాత గాలి ఎక్కువగా లేకుండా ప్యాకింగ్ చెయ్యాలి. ఇలా చేస్తే ఏడాది వరకు నిల్వ ఉంటుంది. వాక్యూమ్ ప్యాకింగ్ చేస్తే మూడేళ్ల వరకు నిల్వ ఉంటుంది. తాటి బెల్లానికి గాలిలో తేమను చప్పున గ్రహించే స్వభావం ఉంటుంది. బెల్లం వండటంలో మెలకువలేమిటి? నీరాలో 80% నీరే ఉంటుంది. అరిసెల పాకం వచ్చే వరకు మరగకాచి.. అచ్చుల్లో పోసుకొని, అచ్చులను ఎండబెట్టి ప్యాకింగ్ చేసుకోవాలి. వంద లీటర్ల నీరాకు పది కిలోల బెల్లం వస్తుంది. అరిసెల పాకం వచ్చిన తర్వాత కూడా 10–15 నిమిషాలు బాండీలోనే ఉంచి తిప్పుతూ ఉంటే.. తాటి బెల్లం పొడి తయారవుతుంది. బెల్లంలో తేమ 7% కన్నా తక్కువ ఉంటే సంవత్సరం నిల్వచేసుకోవచ్చు. ఈత, జీలుగ బెల్లం కూడా మంచిదే కదా.. అవును. తాటి చెట్ల నుంచి నాటిన 14 ఏళ్లు, ఈత చెట్టు 6–7 ఏళ్లు, జీలుగ చెట్లు 6వ ఏట నుంచి నీరాను ఇవ్వడం ప్రారంభిస్తాయి. రోజుకు తాటి చెట్టు నుంచి 1–8 లీటర్లు, ఈత చెట్టు నుంచి 1–3 లీటర్లు, జీలుగ చెట్ల నుంచి 50 లీటర్ల వరకు నీరా ఉత్పత్తి అవుతుంది. వీటిలో ఏ నీరాతో బెల్లం అయినా ఆరోగ్యదాయకమైనదే. చెట్లు ఎక్కే వాళ్లే కరువయ్యారు కదా.. నిజమే. తాటి బెల్లానికి గిరాకీ పెరిగింది. కిలో రూ. 300 పలుకుతోంది. కాబట్టి ఆదాయమూ బాగా వస్తుంది. అయితే, చెట్లు ఒకే చోట వరుసగా ఉంటాయి కాబట్టి ఒక చోటున్న చెట్లకు కలిపి మంచె కట్టుకోవచ్చు. ఈ చివర చెట్టు దగ్గర మంచె ఎక్కితే, ఆ చివర చెట్టు దగ్గర కిందికి దిగొచ్చు. మా తాటి పరిశోధనా స్థానంలో ఇలాగే చేస్తున్నాం. అప్పుడు చెట్టెక్కే నిపుణులు కాని వారు కూడా సులువుగా నీరా సేకరించుకోవచ్చు. చెట్టుకు ఏటా రూ. 10 వేల నుంచి 12 వేలకు పర్మినెంట్ ఆదాయం పొందడానికి ఆస్కారం ఉంది. తమిళనాడులో మాదిరిగా మనమూ దృష్టి పెట్టాలి. (తూ.గో. జిల్లా పందిరిమామిడి తాటి పరిశోధనా స్థానం శాస్త్రవేత్త వెంగయ్యను 94931 28932 నంబరులో సంప్రదించవచ్చు). -
అటుకిటుకులు
అటు ఇటు తిరుగుతూ దంచుకుని... మంచుకునే సూపర్ స్నాక్. అటుకుల వంటకాలు చిటికెలో అయిపోతాయి. చేయడానికి ఇన్ని కిటుకులు ఉన్నాయి. అటుకులమిక్స్చర్ కావలసినవి: పల్చటి అటుకులు – 2 కప్పులు; వేయించిన పల్లీలు – పావు కప్పు; పుట్నాల పప్పు – పావు కప్పు; వేయించిన జీడి పప్పులు – పావు కప్పు; ఎండు కొబ్బరి ముక్కలు – పావు కప్పు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; నూనె – పావు కప్పు; బెల్లం పొడి – 2 టీ స్పూన్లు; ఉప్పు – తగినంత; నూనె – అర టేబుల్ స్పూను పోపు కోసం... కరివేపాకు – రెండు రెమ్మలు; తరిగిన పచ్చి మిర్చి – 2; పసుపు – పావు టీ స్పూను; ఇంగువ – కొద్దిగా ; తయారీ: స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, మంట బాగా తగ్గించి, అటుకులు వేసి దోరగా వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో నూనె వేసి కాగాక, పల్లీలు వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి ∙పావు కప్పు ఎండు కొబ్బరి ముక్కలు వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, ముక్కలను తీసి పక్కన ఉంచాలి ∙పుట్నాల పప్పు, జీడి పప్పులు, కిస్మిస్లను కూడా విడివిడిగా వేసి వేయించి తీసి పక్కన ఉంచాలి. అదే బాణలిలో అర టేబుల్ స్పూను నూనె వేసి కాగాక, మంట తగ్గించాలి ∙కరివేపాకు, పచ్చి మిర్చి, ఇంగువ వేసి వేయించాలి ∙పసుపు, ఉప్పు జత చేయాలిబెల్లం పొడి జత చేసి కలిపి, రంగు మారుతుండగా, వేయించిన అటుకులు జత చేసి ఐదు నిమిషాల పాటు కలపాలి ∙వేయించిన డ్రై ఫ్రూట్స్ జత చేసి కలిపి దింపేయాలి ∙చల్లారాక గాలిచొరని డబ్బాలో నిలవ చేసుకోవాలి ∙టీ టైమ్‌లో తినడానికి బాగుంటుంది. కిటుకు: కొద్దిగా నెయ్యి, కొద్దిగా గరం మసాలా జత చేస్తే మిక్స్చర్ మరింత రుచిగా ఉంటుంది. అటుకులలడ్డూ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; గింజలు తీసిన ఖర్జూరాలు – అర కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; ఎండు కొబ్బరి తురుము – పావు కప్పు; బెల్లం పొడి – ఒక టేబుల్ స్పూను; వేయించిన నువ్వులు – ఒక టేబుల్ స్పూను; నెయ్యి – ఒక టీ స్పూను. తయారీ: స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి వేయించి తీసేయాలి ∙మిక్సీ జార్లో అటుకులు, ఖర్జూరాలు, ఎండు కొబ్బరి తురుము, నువ్వులు, బెల్లం పొడి, ఏలకుల పొడి వేసి మెత్తగా చేసి, ఆ మిశ్రమాన్ని పాత్రలోకి తీసుకోవాలి ∙చేతికి కొద్దిగా నెయ్యి పూసుకుని, అటుకుల మిశ్రమాన్ని కొద్దికొద్దిగా తీసుకుంటూ, ఉండలు చేయాలి. కిటుకు: ఈ జీడి పప్పుల పొడి జత చేస్తే లడ్డూలు మరింత రుచిగా ఉంటాయి. అటుకుల పునుగులు కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పెరుగు – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; క్యారట్ తురుము – ఒక టేబుల్ స్పూను; బంగాళదుంప తురుము – ఒక టేబుల్ స్పూను; అల్లం తురుము – ఒక టీ స్పూను; వెల్లుల్లి తురుము – ఒక టీ స్పూను; తరిగిన పచ్చి మిర్చి – 3; కొత్తిమీర తరుగు – టీ స్పూను; ఉప్పు – తగినంత; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా. తయారీ: ఒక పాత్రలో అటుకులకు తగినన్ని నీళ్లు జత చేసి, ఐదు నిమిషాల పాటు నానబెట్టాలి ∙రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి, గట్టిగా పిండి, నీళ్లు వేరు చేయాలి ∙ఒక పాత్రలో అటుకులు, బియ్యప్పిండి, ఉల్లి తరుగు, క్యారట్ తురుము, బంగాళదుంప తురుము, అల్లం తురుము, వెల్లుల్లి తురుము, కొత్తిమీర తరుగు, ఉప్పు, పెరుగు వేసి పునుగుల పిండిలా కలపాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె వేసి కాచాలి ∙పిండిని పునుగుల మాదిరిగా నూనెలో వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి, పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి ∙టొమాటో సాస్‌తో తింటే రుచిగా ఉంటాయి. కిటుకు: నానబెట్టి, ఉడికించిన సగ్గుబియ్యాన్ని (రెండు టీ స్పూన్లు) జత చేస్తే పునుగులు మెత్తగా వస్తాయి. అటుకులచిక్కీ కావలసినవి: అటుకులు – ఒక కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; జీడిపప్పుల పొడి – ఒక టీ స్పూను; బాదం పప్పుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక అటుకులు వేసి దోరగా వేయించాలి ∙ఒక పాత్రలో బెల్లం పొడి, కొద్దిగా నీళ్లు పోసి, స్టౌ మీద ఉంచి ఉండ పాకం వచ్చే వరకు కలుపుతుండాలి ∙ఏలకుల పొడి, బాదం పప్పుల పొడి, జీడి పప్పుల పొడి వేసి కలిపి దింపేయాలి నెయ్యి వేసి కలియబెట్టాలి ∙ఒక ప్లేటుకి నెయ్యి పూసి, తయారుచేసి ఉంచుకున్న అటుకుల చిక్కీ మిశ్రమాన్ని అందులో పోసి, గరిటెతో సమానంగా పరవాలి ∙కొద్దిగా గట్టిపడుతుండగా, చాకుతో ముక్కలుగా కట్ చేసి, చల్లారాక ముక్కలను గాలి చొరని డబ్బాలో నిల్వ చేసుకోవాలి. కిటుకు: పాకంలో నెయ్యి వేసి కలిపితే చిక్కీ చూపడటానికి అందంగా ఉంటుంది. అటుకుల పులిహోర కావలసినవి: అటుకులు – 2 కప్పులు; చింతపండు – పెద్ద నిమ్మకాయంత; వేయించిన పల్లీలు – ఒక టేబుల్ స్పూను; వేయించిన జీడి పప్పులు – 15; నూనె – 2 టేబుల్ స్పూన్లు; ఇంగువ – అర టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – 2 టీ స్పూన్లు; మినప్పప్పు – 2 టీ స్పూన్లు; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 10; తరిగిన పచ్చి మిర్చి – 6; కరివేపాకు – 4 రెమ్మలు; పసుపు–పావు టీ స్పూను; ఉప్పు – తగినంత. తయారీ: ∙చింతపండును రెండు కప్పుల నీళ్లలో అరగంట సేపు నానబెట్టాక, రసం తీయాలి ∙అటుకులను శుభ్రంగా కడిగి, చింతపండు రసంలో నానబెట్టాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక, ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి, పచ్చి మిర్చి, కరివేపాకు వేసి వేయించి తీసేయాలి ∙ఒక పాత్రలో... చింతపండులో నానబెట్టిన అటుకులు, పోపు, పసుపు, ఉప్పు వేసి గరిటెతో జాగ్రత్తగా కలియబెట్టి అరగంట తరవాత తింటే రుచిగా ఉంటుంది. కిటుకు: తగినంత చింతపండు రసం మాత్రమే తీసుకుంటే రుచిగా ఉంటుంది. -
మరాఠీ దెయ్యం
ఊరికొసానున్న మంత్రాల పుల్లయ్య ఇంటిముందర కూర్చోని పుల్లలేసినప్పుడంతా కొరివి దెయ్యం తలమంటలా భగ్గునలేస్తున్న చలిమంటవొంకే చూస్తున్నాడు గోవిందు. కడపెళ్లిన నరసప్ప తిరిగిరావడం కోసం సాయంత్రం నుంచి ఎదురుచూస్తా పెద్దూర్‌లోనే ఉండిపోవాల్సొచ్చింది.మామూలుగా ఐతే పెద్దూరొచ్చిన చెర్లోపల్లెవాళ్లంతా వెల్తురుండగానే తిరిగెళ్లిపోతారు. మూడు మైళ్ల దారంతా తోటలు, వంకలు, డొంకలు, రాత్రైతే దెయ్యాల భయం.గోవిందుకు ఇవ్వాల్సిన బెల్లం డబ్బు ఇవ్వకుండా నరసప్ప సంవత్సరం నుంచి తిప్పుకుంటున్నాడు. అది చేతికొస్తే గాని మరుసటి కారుకు విత్తనాలు కొనలేడు గోవిందు.తప్పనిసరై ఉండిపోయాడు.అతనికి అసహనంగా ఉంది.ఆరోజు పట్టుకోకపోతే నరసప్ప మళ్లీ వారందాకా దొరకడు. అమావాస్య చీకటి కమ్ముకుంటావుంది. ఇంకా ఆలస్యమైతే తోడులేకుండా ఒక్కడే వాళ్లవూరు వెళ్లలేడు.‘‘నర్సప్ప రావాల్సిన లాస్ట్ బస్సు అడ్డరోడ్డు కాడికి వచ్చేసింటాదిగదా మామా’’ అడిగాడు గోవిందు, పొలాల్లో గొర్రెల మంద బెరుగ్గా అరవడం, కీచురాళ్ల చప్పుడు పెరగడం గమనిస్తూ.‘‘నీ పెండ్లానికి నీకునాలుగురోజులాయె మాటల్లేవంటాండావు. యేమైండాది?’’ అన్నాడు పుల్లయ్య బీడిని వెలిగిస్తూ.ఎర్రగా మెరుస్తున్న అతని పళ్లు, సారాకళ్లు, జులపాలు, బుర్రమీసాలు చూస్తూ ‘దయ్యం కంటే ఈనేబైంకరంగా వుండాడే’ అనుకున్నాడు గోవిందు.‘నెల్రోజుల్నించి దాని అన్న ఖాయిలాతో కడపాస్పత్రిలో జేరివుండాడు. దాని గొలుసు, గాజులు నాతో మాటైనా చెప్పకుండా వాళ్లన్న కంపించింది.తాళిబొట్టొకటే మిగిలుండాది.ఈతూరి యెరువుల ఖర్చులకు కుదవ నా తలకాయ బెట్టాల్సిందే’’ నిట్టూర్చాడు గోవిందు.‘‘యెట్లైనా నీ పెండ్లానికి ధైర్ణమెక్కువేబ్బీ’’ అన్నాడు బీడి పొగ వదుల్తూ పుల్లయ్య.‘దాని మొఖం. సస్తే సీకట్లో అడుగు బైటపెట్టదు, ఆడోల్ల ధైర్ణాన్ని నువ్వే పొగడాల...ఈరాత్రి ఇంటికి బోయినాక దాని కత వుంది’’అన్నాడు గోవిందు కోపంగా.‘‘నీ పెండ్లామ్మీదైతే వొంటికాలు మీద లేస్తాండావుగానీ, నర్సప్పను దుడ్లు గెట్టిగా అడగాలంటే నీకు బయ్యేం’’ అని నవ్వి–‘‘మనిసికి బయం నరాల మూలాల్లోనే వుంటాది. తెల్సినా నీ వొశంలో వుండదు. బతకి బట్టగట్టాలంటే బయంగూడా అవుసరమబ్బీ’’ అన్నాడు పుల్లయ్య. సగం కాలిన పుల్లల్ని జవిరి కుప్పగా మంటలో వేశాడు గోవిందు. మంట భగ్గుమంది.‘‘అందుకేనేమో నర్సప్ప అందర్నీ ఆడిస్తావుండాడు. మాసువుల్లో యేసిన బెల్లం. వాయన టౌన్లో అమ్ముకొనే ఆర్నెల్లయ్యుండాది. నా దుడ్లు నాకిచ్చేదానికి ఇన్ని తూర్లా తిప్పుకునేది. ఈ పొద్దెట్లైనా బాకీ వసూలు చేస్కోవాల’’ నరసప్ప మిద్దె వైపు చూసి అన్నాడు గోవిందు.ఊరివైపు నుంచి చలిమంట దగ్గరకు నీడలా నడిచొచ్చి నిలబడ్డాడు నరసప్ప పొలాలు చూసుకునే సిలారు.వొంగి మంటకు అరచేతులు పెట్టి ‘‘యేం గోవిందన్నా పెండ్లైనోడివి వూరికి బోకుండా ఈడ దయ్యాలాయన్తో చలిగాచుకుంటా వుండావా. ఇనేవోడుంటే ఈన యెన్ని గ్యాసు దయ్యాలకతలైనా చెప్తాడు’’ అనినవ్వాడు.అతని వైపు చురచురా చూశాడు పుల్లయ్య.‘‘మీ సౌకారొచ్చేది ఆల్చెమౌతాదాబ్బీ’’ అడిగాడు అతని కోసమే చూస్తున్న గోవిందు.‘‘ఆయన అనుకోకండా కడపలోనే కూతురింట్లో నిల్చిపోయినాడు.ఇప్పుడే రాజరత్నం సారు చెప్పిపాయె. మన్నాడొస్తాడంటన్నా’’ అన్నాడు సిలారు చేతులు మొహానికి రుద్దుకుంటూ, గోవిందు నిస్సత్తువగానిట్టూర్చి ‘కత మొదుటికొచ్చింది’ అనుకున్నాడు.‘‘మీవూరోళ్లు రాగిమానుకిందుండిరే’’ అని ఊరివైపు చూసి,‘‘యెళ్లిపోయినట్టుండార్నా. నువ్వు బిన్నే నాలుగడుగులేస్తే అందుకోవచ్చు’’ అని తమ ఇండ్లవైపు వెళ్లిపోయాడు సిలారు.మంట ఆరిపోయి నిప్పురవ్వలు మిగిలాయి.చీకటి కమ్ముకుంది. ‘‘నువ్వు ఇంటికి బొయేట్టుంటే తోడుంటేనే బయల్దేరాది మంచిదిబ్బీ. అమాస్య గడియ లొచ్చేస్తాండాయి. మీవూరి దావలో యాడైనా సమాలిచ్చుకోవచ్చుగానీ అంకాలు మామిడొనం దాటేటప్పుడు మాత్రం ప్రాణం మీది కొస్తాది. ఆడ మర్రిచెట్టు మీద మరాఠీ ఆడదయ్యం శానా యిరుడ్డమైంది, యేషాలేస్తాది. గొంతుచీల్చి రగతం తాగుతాది. మా బోటి మంత్రగాళ్లే తట్టుకోలేరు. పోనీ రాత్రికి మా యింట్లో పండుకోని పొద్దున్నేపోరాదు’’ అని పుల్లయ్య లేచాడు.‘‘సీకట్తోనే రాయారం బోవాల. నాగిరెడ్డి దుడ్లిస్తానన్నాడు. రేప్పొద్దునైతేనే వుంటాడంట. యిత్తనాలకు కసాలగా వుండాది’’ అని–‘‘అరే..ఈ నర్సప్ప ఖయాల్లోబడి మర్చేపోయినా. చెంచయ్యతోట నించి వొకబుట్ట తొమలపాకులు తెమ్మన్నాడు నాగిరెడ్డి. తెల్లార్తోనన్నా బొయ్యి తొమలపాకులు తీస్కోని పరిగెత్తాల. వుత్తచేతుల్తోబోతే యింట్లేకే రానీడు, బోకోపం మనిసి.దయ్యాలని నిల్చిపోతే మనకు జరుగుతదా. పోతా...యెట్టన్నాగానీ....దావలో మావూరోళ్లు యెవురోవొకరు తోడు దొరక్కపోరు’’ అంటూ తనూ లేచి బయల్దేరాడు గోవిందు. గోవిందు కళ్లు చిట్లించి చూస్తూ వడివడిగా నడుస్తున్నాడు. చీకట్లో ముందర మనుషులెళ్తున్నారో లేదో తెలీడం లేదు. వాళ్లవూరోళ్లు కల్సుకునే నామాలోళ్ల కళ్లం దగ్గరకొచ్చాడు.అక్కడ గుడ్డిలాంతరు వెల్తురులో నులకమంచమ్మీద నిద్రపోతున్న వాళ్ల సేద్యగాడు చెవిటి ఓబయ్య తప్ప మరో మనిషి జాడలేదు. సంశయిస్తూ ముందుకు నడిచాడు.అతనికి దెయ్యాల భయం మొదలైంది.‘యెనకరోజుల్లో ఆడోళ్లంతా చెట్టుకు వురేసుకొనో, బావిలో దూకో సచ్చేవాళ్లేమో. రేత్రైతే సాలు చెట్టు కోటి, బావికోటి యేడజూసినా దయ్యాలే. ఇవి మనుసులుగా వున్నప్పుటికంటే సచ్చి దెయ్యాలైనాకే చిన్నప్పబావిగట్టు మీద ఎవరో తెల్లగా కూర్చున్నట్టుంది.వొళ్లు జలదరించింది.అడుగు ముందుకుపడలేదు.పరికించి చూశాడు, అది కొత్తగా బెరడు లేచిపోయిన కానుగచెట్టు మొదలు.ఊపిరిపీల్చుకుని కదిలాడు. నక్కలమడుగు దగ్గరికొచ్చాడు. అక్కణ్ణుంచి దారి వరిమళ్లు వొదిలి తోటల్లో, డొంకలగుండా పోతుంది.‘అమాస్య సీకట్లో ఈ చెట్టుచేమా, కొండావాగూ మనిసివి కాదు, యేరే శక్తుల రాజ్జెం. యెనక్కిపోదామా’ అనుకుని ఓ క్షణం ఆగాడు.పద్దున్నే ఎట్లైనా రాయవరం పోవాలని గుర్తొచ్చింది.బెరుగ్గానే ముందుకు నడిచాడు.అతనికి పుల్లయ్య చెప్పిన భయానక ఘటనలు గుర్తుకొచ్చిభయమెక్కువైంది. చుట్టూ ఉన్నవి వేరేగా మారి కనబడుతున్నాయి. కొండలు నల్లగా మీదికి లేస్తున్నాయి. నక్షత్రాలు గుచ్చి చూస్తున్నాయి. చెట్లు నల్లనిజుట్టు విరబోసుకుని కదుల్తున్నాయి.టెంకాయ తోటల్లోంచి వీస్తున్న కీచురాళ్లతో కలిసి చలికి ఈదురుమంటోంది.మడుగుచుట్టూ కప్పలు, మడుగుపైన అడవిబాతులు, దూరంగా నక్కలు గుంభనగా అరుస్తున్నాయి. చెట్ల సందుల్లో నీడల్లాగా ఏవో ఆకారాలు కదుల్తున్నాయి. నడుస్తూంటే వెనకాలే ఎవరో వస్తూన్న చప్పుడు.ఎవరో నవ్వినట్టు, అంతలోనే ఏడ్చినట్టు, ఎవర్నో పిలిచినట్లు దగ్గర్లో గుసగుసలు. ఎలాగో మడుగును, ఆపైన బడేసాబ్ చెరకుతోటను దాటాడు. అంత చలిలోనూ చెమటలు పట్టాయి.మలుపు తిరిగాక అంతదూరంలో చిక్కగా అంకాలు మామిడివనం కనిపిస్తావుంది.‘ముందుకాలంలో మరాఠీ కుటుంబమొకటి నాటకాలేస్తా తిరగతా ఈవొరొస్తే, వోళ్ల సక్కటి ఆడకూతుర్ని అంకాలొనంలోనే అత్యాచారం జేసినారంట. ఆ పిల్ల ఆణ్ణే సీరతో మర్రిచెట్టుకు ఉరేసుకుని సచ్చిపోయి, దయ్యంగా మారి అమాస్యరేత్రిల్లు ఆ దోవన వొంటరిగా పొయ్యేవాళ్లని రకతం తాగి సంపుతాండాది’అనిచిన్నప్పట్నుంచి వింటున్నది వద్దనుకున్నా గుర్తుకొచ్చింది.అంకాలువనంలోని తాటిచెట్లు, మామిళ్ల మధ్యలో వున్న ఎల్తైన ముసలిమర్రిచెట్టు వికృతంగా అతని కోసం చేతులు సాచినట్టుంది. ఆ పక్కన చెంచయ్య తమలపాకులతోట అతను తప్పించుకోకుండా దడి కట్టినట్టుంది. కుడివైపున నాగమ్మ చెరకుతోట ప్రహరీగోడలాగుంది.ఉన్నట్టుండి గోవిందు నడక ఆగిపోయింది.గుండెలువరసతప్పినాయి.వనం పక్క నుంచి తెల్లని పొట్టి ఆకారం ఎగుడుదిగుడుగా అతనికేసి వస్తోంది.దాని గజ్జలు లయగా మోగుతున్నాయి.భయం కమ్మేసి అడుగులు వెనక్కిపడిబాటపక్కన లోతైన ఎండినకాలవలో పడ్డాడు.కాలిమడమ కలుక్కుమంది.‘‘అబ్బా’’ అన్నాడు.చేతులు నేల మీద ఆన్చి తలెత్తి చూశాడు. ఆ ఆకారం బాట మీద నిలబడి అతని వైపే చూస్తోంది.భయం శక్తినంతా లాగేసింది.గోవిందు కష్టం మీద లేచి బాట పైకెక్కి కుంటుతూ నడక సాగించాడు. భయం నుంచి వొళ్లు ఇంకా స్వాధీనంలోకి రాలేదు. ఎడమవైపు తలతిప్పకుండా బాటకు కుడివైపునడుస్తూమర్రిచెట్టును దాటాడు. అంతే, హఠాత్తుగా నడక మళ్లీ ఆగింది.అంకాలువనానికి చెంచయ్య తోటకు మధ్య సందులోంచి మర్రిచెట్టుకు వైపు నుంచి ఒక ఆకారం బాట మీదికి వస్తోంది.ఈసారిమనిషి ఆకారం. ఆడమనిషి. జుట్టు విరబోసుకుంది. వయ్యారంగా దగ్గరికొస్తావుంది.అది మరాఠీ దెయ్యమే, నా పని ఐపోయింది’ అనుకున్నాడు.అతని వెన్ను నిలువునా వణికింది.నక్షత్రాల వెల్తుర్లో చీర తెల్లగా మెరుస్తావుంది.ఆమె కుడిచేత్తో తమలపాకుల వెదురుబుట్ట పట్టుకుంది.ఆమె ఇరవైఅడుగుల దూరంలో బాట మీదికి వచ్చి ఒక్క క్షణం ఆగింది.పలకరింపుగా నవ్వినట్లు పలువరస చీకట్లో తెల్లగామెరిసింది. గోవిందుకు జల్దరింపు తప్ప ఏమీ తెలియడం లేదు. స్థాణువై నిలబడ్డాడు. చూస్తుండగానే ఆమె విసురుగా అటువైపు తిరిగి వాళ్లవూరి వైపు నడవసాగింది.అతను కళ్లప్పగించి చూస్తూ నిలబడ్డాడు.ఆమె డొంకలోకి తిరిగింది.రెండు నిమిషాల తరువాత కదలిక తెచ్చుకొని అతనూ డొంకలోకి నడిచాడు.రెండు పక్కలా చెట్లతో డొంక పైకప్పులేని పొడవాటి గుహలాగుంది. ఆమె అంతదూరంలో నిద్రలో నడిచేవాళ్లలాగ నడుస్తోంది. బుట్ట నడుం మీద పెట్టుకోడంతో ఆమె నడక ఉయ్యాల ఊగినట్టుంది.ఆమె మలుపు తిరిగింది. అతను డొంకదాటి తిరిగాక ఆమె కనబడలేదు. ‘బాట వొదిలేసి పోయింటాది. తోటలకా పక్క వాగు, వాగవతల తుమ్మచెట్లలో పాడుబడిన యెర్రంరాజు కొట్టాలు. అది పెద్ద దయ్యాలకొంప. ఆడికి పోయుంటుంద’నుకున్నాడు.‘‘ఈపొద్దు నా మీద దేవుడి దయూండాది, మరాఠీరాచ్చసి యెట్లో నన్ను సూడలేదు. సూసింటే ఆణ్ణే సచ్చుండేవాడిని’ అనుకుని కుంటుకుంటూ బాట వెంటబడి ఊరికేసి తిరిగాడు. కాలీడ్చుకుంటూ గోవిందు ఇల్లు చేరేసర్కి అలివేలు నులకమంచం మీద కొడుకును నిద్రపుచ్చుతా వుంది. ఆమెను చూడగానే అతనికి ఒక్కసారిగా నిస్సత్తువ వచ్చి గోడకానుకుని జారి కూర్చుండి పోయాడు.శరీరం వణుకుతావుంది.అలివేలు గాభరగా దగ్గరికొచ్చి చెంప మీద చెయ్యి వేసి చూసి–‘‘జొరంగా వుండాద...యేమయ్యిండాది’’ అనడిగింది.గోవిందు తనకు భార్యతో మాటల్లేవన్న విషయమే మర్చిపోయిఆయాసపడుతూ జరిగిందంతా చెప్పాడు.అతని వైఖరి చూసి అతని వెనకాలే లోపలికొచ్చిన ఎదురింటి గంగమ్మత్త అంతా వినింది.అలివేలు ఏదో చెప్పబోయే లోపలే గంగమ్మత్త గాభరగా ముందుకొచ్చి–‘‘గోయిందు జూసొచ్చింది యెవుర్ననుకుండావ్?’ అంకాలు తోట్లో వుండే మరాఠీదెయ్యాన్ని. అదెట్నో ఈణ్ణి సూళ్లేదు. సూసింటేరగతంగక్కోని ఆణ్ణే పడిపోయుండేవోడు. అది ఈపూట యాడికోపేరంటానికి బోతావుంది. ఈడు బతికి పోయినాడు’’ అని తెగేసి చెప్పి, తలుపు దగ్గరకెళ్లి–‘‘వొరే మహేసూ నువ్వు బేగిపొయ్యి జంగప్పసోమిని బిల్చుకోనిరా...మంత్రమేసి తాయెత్తు గడతాడు...మంగా పసుపునీళ్లు గలపవే...నేను ఆంజనేస్సావమి కుంకం దెస్తా. మల్లేరమ్మ బండారుగుడా వుండాది’’ అంటూ బయటున్న వాళ్లకి అరిచి చెప్పి తన ఇంటివైపు పరుగెత్తింది.అలివేలు భర్తవైపు చూసి పకపకా వ్వింది.గోవిందు అయోమయంగా చూశాడు.‘‘నువ్వు అంకాలొనం కాడ జూసింది నన్నే. మరాఠీదయ్యన్ని గాదు, మల్లేరమ్మ చెల్లెల్నీ గాదు. తొమలపాకుల కోసం బొయినా. నవ్వు నా మీద అలిగుండావని, మాట్లాడవని ఆడ పలకరించలా’’ అనిమూలనున్న తమలపాకుల బుట్టను చూపించింది.ఆమె తలస్నానం జేసుండడాన్ని, కట్టుకున్న సన్నపూల తెల్లచీరను అప్పుడు చూశాడు గోవిందు.‘‘నీకేమైనా మతిబోయిండాదా, ఆడికి వొక్కదానివే యింతరాత్రా పొయ్యేది. యేమన్నా అయ్యుంటే’’ ఆందోళనగా అడిగాడు నిటూరుగా కూర్చొని,గోవిందుకి ఇంకా వణుకు తగ్గలేదు.‘‘నాకేం బయం. ఆ దయ్యంనన్నేంజేస్తాది... నువ్వు తెల్లార్తో లేచి రాయారం నాగిరెడ్డి దెగ్గిరికి బోవాలనుకున్నావుగనా... మీయక్క జెప్పిందిలే.... తొమలపాకులు లేకుండాబోతే ఆయన నీతో మాట్లాడతాడా... అందుకే’’ అంటూ చిన్నగా నవ్వి అలివేలు అతని వీపు మీద చేత్తో రాసి, వాళ్లిద్దరి మధ్యా తగవుకు ఇక తావులేకుండా, అతని తలను తన గుండెలకు మృదువుగా హత్తుకుంది. - డా.కే.వి.రమణారావు -
వంటింటి చిట్కాలు...
పంచదార కంటె బెల్లం ఆరోగ్యపరంగా శ్రేష్ఠం, బెల్లంలో ఇనుము మొదలైన మూలకాలు ఉంటాయి ∙ తియ్యని పిండివంటల తయారీలో చాలామంది చక్కెర కంటెæ బెల్లాన్నే ఉపయోగిస్తారు ∙ఆయుర్వేద వైద్యశాస్త్రంలో బెల్లాన్ని చాలా రకాల మందులలో వాడతారు ∙పొడి దగ్గు ఇబ్బందిపెడుతుంటే... గ్లాసు బెల్లం పానకంలో కొద్దిగా తులసి ఆకులు వేసి రోజుకు మూడుసార్లు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది ∙అజీర్తి సమస్యతో విసిగిపోయిన వారు భోజనం చేశాక చిన్న బెల్లం ముక్క నోట్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. ∙కాకర ఆకులు, నాలుగు వెల్లుల్లి రెబ్బలు, మూడు మిరియాల గింజలు, చిన్న బెల్లం ముక్క వేసి గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని రోజూ రెండు పూటలా వారం రోజులు తీసుకున్నా లేదా గ్లాసు పాలలో పంచదారకి బదులు బెల్లం వేసి రోజూ తాగినా నెలసరి సమస్యలు ఉండవు ∙స్టౌ మీద నేతితో కలిపిన బెల్లం వేడి చేసి, నొప్పి ఉన్న చోట పట్టు వేస్తే బాధ తగ్గుతుంది ∙పెరుగు, బెల్లం కలిపి రోజుకు రెండు పూటలా తీసుకుంటే ముక్కు కారడం సమస్య తగ్గుతుంది ∙బెల్లం నెయ్యి సమపాళ్లలో కలిపి తింటే మైగ్రేన్ తలనొప్పి వారం రోజులలో తగ్గుతుంది. -
వెరీ గూడ్
సంస్కృతంలో బెల్లాన్ని ‘గుడము’ అంటారు.హిందీలో ‘గూడ్’ అంటారు.ఆరోగ్యకరమైన తీపి అంటే బెల్లమే...ఆయుర్వేద గుణాలు ఉన్నది బెల్లానికే...దీపావళి పండుగను స్వచ్ఛమైన బెల్లంతో జరుపుకోండి... ముఖంలో కాంతులు నింపుకోండి... తియ్యటి వేడుకలతో వెలిగిపొండి... అనరస కావలసినవి: బెల్లం పొడి – ఒక కప్పు – (100 గ్రా.); బియ్యప్పిండి – 150 గ్రా.; గసగసాలు – ఒక టీ స్పూను; నువ్వులు – ఒక టీ స్పూను; నెయ్యి లేదా నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙బియ్యానికి తగినన్ని నీళ్లు జత చేసి మూడు రోజుల పాటు నానబెట్టాలి (ప్రతిరోజూ రెండు సార్లు నీళ్లు మార్చాలి) ∙నాలుగో రోజు నీళ్లన్నీ శుభ్రంగా ఒంపేసి, ఒక పొడి వస్త్రం మీద బియ్యాన్ని నాలుగు గంటలసేపు ఆరబోయాలి ∙ఆరబోసిన బియ్యాన్ని మిక్సీలో వేసి మెత్తగా పిండి చేసుకోవాలి ∙మిక్సీ పట్టిన పిండిని ఒక పాత్రలోకి తీసుకుని, బెల్లం పొడి జత చేసి చలిమిడిలా అయ్యేలా బాగా కలిపి, మూత పెట్టి 12 గంటల పాటు పక్కన ఉంచాలి ∙పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి చేతితో అరిసె మాదిరిగా ఒత్తాలి ∙పైన గసగసాలు కాని నువ్వులు కాని ఒత్తాలి ∙ఇలా అన్నిటినీ ఒత్తుకుని పక్కన ఉంచాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె లేదా నెయ్యి పోసి కాగిన తరవాత ఒత్తి ఉంచుకున్న అనరసలను వేసి వేయించి తీసేయాలి ∙వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. కంచ గోలా కావలసినవి: పనీర్ – ఒక కప్పు; బెల్లం పొడి – 5 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – అర టీ స్పూను; రోజ్ వాటర్ – ఒక టీస్పూను; కుంకుమ పువ్వు – కొద్దిగా; పిస్తా తరుగు – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙ముందుగా పాలను విరగ్గొట్టి, గట్టి పనీర్ తయారుచేసుకోవాలి (ఒక్క చుక్క నీరు కూడా లేకుండా గట్టిగా పిండి తీసేయాలి) ∙పనీర్‌ను ఒక పాత్రలోకి తీసుకుని చేతితో సుమారు పావు గంట సేపు బాగా కలపాలి ∙(కొద్దిగా తడి ఉందనిపిస్తే, స్టౌ మీద బాణలిలో వేసి కొద్దిసేపు ఉంచితే తడి పోతుంది) ∙పనీర్ బాగా చల్లారాక రోజ్ వాటర్, ఏలకుల పొడి, కుంకుమపువ్వు, బెల్లం పొడి వేసి సుమారు ఐదు నిమిషాల పాటు కలుపుతుండాలి ∙ఈ మిశ్రమాన్ని సుమారు పన్నెండు సమాన భాగాలుగా చేసి, చేతితో ఒత్తాలి ∙పగుళ్లు లేకుండా చూసుకోవాలి ∙ప్రతి గోలాను పిస్తా తరుగుతో అలంకరించి, ఫ్రిజ్‌లో సుమారు నాలుగు గంటలపాటు ఉంచి బయటకు తీసి చల్లగా అందించాలి. పటిషప్త కావలసినవి: మైదా పిండి – ఒక కప్పు; బొంబాయి రవ్వ – అర కప్పు; బియ్యప్పిండి – పావు కప్పు; పాలు – 2 కప్పులు ఫిల్లింగ్ కోసం: పచ్చి కోవా తురుము / కొబ్బరి తురుము – 3 కప్పులు; బెల్లం పొడి – 2 టేబుల్ స్పూన్లు; ఏలకుల పొడి – ఒక టీ స్పూను ఫిల్లింగ్ తయారీ: ∙ఒక పాత్రలో కొబ్బరి తురుము/పచ్చి కోవా తురుము, బెల్లం పొడి వేసి బాగా కలిపి సన్న మంట మీద ఉంచాలి ∙(పచ్చి కోవాతో చేస్తుంటే కొద్దిగా పాలు జత చేయాలి) ∙కొద్దిగా ఉడికిన తరవాత ఏలకుల పొడి జత చేయాలి ∙ తీగలా సాగే వరకు సుమారు 20 నిమిషాల పాటు బాగా కలిపి దింపి, చల్లారనివ్వాలి. పటిషప్త తయారీ: ∙ఒక పాత్రలో మైదా పిండి, బొంబాయి రవ్వ, బియ్యప్పిండి వేసి బాగా కలపాలి ∙పాలు జత చేసి ఉండలు లేకుండా కలిపి, ఈ మిశ్రమాన్ని సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙స్టౌ మీద నాన్ స్టిక్ పాన్ ఉంచి, వేడయ్యాక కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి ∙తయారుచేసి ఉంచుకున్న మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి పల్చగా పరవాలి ∙వెంటనే దాని మీద ఫిల్లింగ్ మిశ్రమాన్ని ఒక స్పూనుడు వేసి, రోల్ చేయాలి ∙లేత గోధుమరంగులోకి వచ్చేవరకు ఉంచి, ప్లేట్లోకి తీసుకోవాలి ∙వీటిని వేడిగా కాని, చల్లగా కాని అందించవచ్చు ∙కండెన్స్డ్ మిల్క్ పోసి అందిస్తే, అందంగాను, రుచిగాను ఉంటుంది. స్వీట్ సమోసా కావలసినవి: మైదా పిండి – 2 కప్పులు (పావు కేజీ); పచ్చి సెనగ పప్పు – అర కప్పు (నానబెట్టాలి); బెల్లం పొడి – అర కప్పు; జీడిపప్పులు – 2 టేబుల్ స్పూన్లు; కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు; బాదం పప్పులు – 10; ఏలకుల పొడి – ఒక టీ స్పూను; నెయ్యి – వేయించడానికి తగినంత తయారీ: ∙సెనగ పప్పును శుభ్రంగా కడిగి, అర కప్పు నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి స్టౌ మీద ఉంచాలి ∙ఒక విజిల్ రాగానే మంట తగ్గించి మరో రెండు విజిల్స్ వచ్చాక స్టౌ మీద నుంచి దింపేయాలి ∙బాదం పప్పులు, జీడి పప్పులను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి ∙ఒక పాత్రలో మైదా పిండి, నెయ్యి వేసి బాగా కలపాలి ∙కొద్దిగా నీళ్లు జత చేసి పూరీల పిండి మాదిరిగా కలిపి, పైన వస్త్రంతో కప్పి, సుమారు అర గంట సేపు పక్కన ఉంచాలి ∙ఈలోగా స్టఫింగ్ తయారుచేసుకోవాలి ∙ఉడికించిన సెనగ పప్పులో నీళ్లు ఉంటే వాటిని వడకట్టి తీసేయాలి ∙సెనగ పప్పును మిక్సీలో వేసి కొంచెం పలుకులుగా ఉండేలా మిక్సీ పట్టి బయటకు తీసేయాలి ∙చిన్న బాణలి స్టౌ మీద పెట్టి వేడయ్యాక ఒక టీ స్పూను నెయ్యి వేసి కరిగించాలి ∙సెనగ పప్పు పొడి వేసి దోరగా వేయించాక, ఒక పాత్రలోకి తీసుకుని, బాగా చల్లారాక, బెల్లం జత చేసి కలియబెట్టాలి ∙ఆ తరవాత జీడిపప్పు పలుకులు, కిస్మిస్, ఏలకుల పొడి జత చేసి బాగా కలపాలి ∙మైదా పిండిని కొద్దికొద్దిగా చేతిలోకి తీసుకుని పూరీలా ఒత్తి, మధ్యలోకి కట్‌చేయాలి ∙ఒక్కో భాగాన్ని తీసుకుని కోన్ ఆకారంలో చేతితో చేసి, అందులో పచ్చి సెనగ పప్పు మిశ్రమం ఉంచి, సమోసాలాగ మూసేసి పక్కన ఉంచుకోవాలి ∙ఇలా అన్నీ తయారుచేసుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నెయ్యి వేసి కరిగాక, తయారుచేసి ఉంచుకున్న స్వీట్ సమోసాలను వేసి వేయించి పేపర్ టవల్ మీదకు తీసుకోవాలి. ఉన్ని యాప్పమ్ కావలసినవి: బియ్యం – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని; కొబ్బరి వేయించడానికి; నూనె – అర టేబుల్ స్పూను; పచ్చి కొబ్బరి తురుము – 3 టేబుల్ స్పూన్లు ఉన్నియాçప్పమ్ కోసం: అరటి పండ్లు – 2 ; నల్ల నువ్వులు – ఒక టీ స్పూను; బెల్లం పొడి – అర కప్పు; నీళ్లు – పావు కప్పు; ఏలకుల పొడి – అర టీ స్పూను; జీలకర్ర – అర టీ స్పూను; సోంపు పొడి – అర టీ స్పూను; బేకింగ్ సోడా – పావు టీ స్పూను; కొబ్బరి నూనె లేదా నెయ్యి – ఒక టీ స్పూను (ఒక్కో గుంటలో) తయారీ: ∙బియ్యాన్ని శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి సుమారు నాలుగు గంటలపాటు నానబెట్టాక, నీళ్లు ఒంపేసి, గ్రైండర్లో వేసి మెత్తగా చేయాలి ∙ముప్పావు కప్పు అరటి పండు గుజ్జు, అర కప్పు బెల్లం పొడి, ఏలకుల పొడి జత చేసి మరోమారు తిప్పాలి. (అవసరమనుకుంటే ముప్పావు కప్పు నీళ్లు జత చేయాలి) ∙రవ్వలా వచ్చేవరకు గ్రైండ్ చేయాలి (మరీ మెత్తటి పిండిలా రాకూడదు) ∙పిండిని మరో పాత్రలోకి తీసుకోవాలి. కొబ్బరి వేయించడానికి: బాణలిని స్టౌ మీద ఉంచి, కొబ్బరి నూనె లేదా నెయ్యి వేసి కరిగాక, పచ్చి కొబ్బరి ముక్కలను వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించాలి.ఉన్నియాప్పమ్ పిండి తయారీపిండిలో మిగిలిన నూనె, వేయించిన కొబ్బరి ముక్కలు జత చేసి కలపాలి. నల్ల నువ్వులు, జీలకర్ర పొడి, శొంఠి పొడి, బేకింగ్ సోడా జత చేసి మరోమారు బాగా కలపాలి.ఉన్నియాప్పమ్ తయారీఅప్పమ్ వేసే చట్టీ పాన్ (పొంగడం మౌల్డ్లా ఉంటుంది) స్టౌ మీద ఉంచి వేడి చేయాలి. ఒక్కో గుంటలోను ఒక టీ స్పూను కొబ్బరి నూనె వేసి, మంట బాగా తగ్గించాలి. నూనె వేడయ్యాక ఒక స్పూన్‌తో పిండి మిశ్రమం ఒక్కో గుంటలో మూడు వంతుల వరకు వేసి, సన్నటి మంట మీద ఉన్నియప్పమ్ బంగారు రంగులోకి వచ్చేవరకు ఉడికించాలి. రెండో వైపు తిప్పి మరి కాస్త నెయ్యి వేసి ఉడికించి దింపేయాలి. వీటిని వేడివేడిగా కాని, చల్లగా కాని తినొచ్చు. ఇవి రెండు రోజుల వరకు నిల్వ ఉంటాయి. ఫ్రిజ్‌లో ఉంచితే వారం రోజుల దాకా ఉంటాయి. గూడ్ కీ రోటీ కావలసినవి: గోధుమ పిండి – ఒకటిన్నర కప్పులు; నెయ్యి – అర కప్పు; బెల్లం పొడి – ఒక కప్పు; పాలు – అర కప్పు; బేకింగ్ సోడా – చిటికెడు; ఉప్పు – చిటికెడు; ఏలకుల పొడి – పావు టీ స్పూను; దాల్చిన చెక్క పొడి – చిటికెడు తయారీ: ∙ఒకపాత్రలో అర కప్పు పాలు, బెల్లం పొడి వేసి స్టౌ మీద ఉంచి బెల్లం కరిగించి దింపి చల్లారనివ్వాలి ∙ఒక పాత్రలో గోధుమ పిండి, బేకింగ్ సోడా, ఉప్పు, ఏలకుల పొడి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి ∙పాలు + బెల్లం మిశ్రమం జత చేస్తూ చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి (అవసరమనుకుంటే మరి కొన్ని పాలు జత చేయాలి) ∙కొద్దిగా నెయ్యి జత చేసి మరో మారు కలపాలి ∙చిన్న చిన్న ఉండలు చేసి పక్కన ఉంచుకోవాలి ∙ఒక్కో ఉండను పావు అంగుళం మందంగా చపాతీలా ఒత్తుకుని పక్కన ఉంచుకోవాలి ∙స్టౌ మీద పెనం వేడయ్యాక కొద్దిగా నెయ్యి వేసి, తయారుచేసి ఉంచుకున్న గుర్ కీ రోటీ వేసి, సన్నని మంట మీద బాగా కాల్చాలి ∙ రోటీ చుట్టూ నెయ్యి వేయాలి ∙రోటీ మీద కొద్దిగా నెయ్యి పూసి, రోటీని తిరగేసి మళ్లీ నెయ్యి వేసి బాగా కాలాక తీసేయాలి ∙ఈ రోటీలను వేడివేడిగా కాని చల్లగా కాని అందించాలి. గూడ్ కీ కుల్ఫీ కావలసినవి: జీడి పప్పులు – 50 గ్రా. (చిన్న చిన్న ముక్కలు చేయాలి); చిక్కటి పాలు – ఒక లీటరు; మిల్క్ మెయిడ్ – ఒక క్యాన్ (410 గ్రా.); ఏలకుల పొడి – అర టీ స్పూను; బెల్లం పొడి – 100 గ్రా.; పంచదార పొడి – 50 గ్రా; ఉప్పు – చిటికెడు తయారీ: ∙స్టౌ మీద బాణలి ఉంచి వేడయ్యాక, జీడిపప్పులు వేసి బంగారు రంగులోకి మారేవరకు వేయించి, తీసి చల్లారనివ్వాలి ∙ఒక పెద్ద పాత్రలో పాలు, కండెన్స్డ్ మిల్క్, ఏలకుల పొడి వేసి, మీడియం మంట మీద ఉంచి మరిగించాలి ∙కొద్దిపేయ్యాక మంట సిమ్ చేసి, సుమారు గంటన్నర సేపు అలానే ఉంచాలి ∙మధ్యమధ్యలో కలుపుతుండాలి ∙బెల్లం పొడి వేసి కరిగేవరకు కలుపుతుండాలి ∙పంచదార పొడి, ఉప్పు వేసి మరోమారు కలిపి, సుమారు పది నిమిషాలు ఉంచాలి ∙అడుగు అంటకుండా జాగ్రత్తపడాలి ∙జీడిపప్పు పలుకులు వేసి మరోమారు కలిపి దింపేయాలి ∙బాగా చల్లారాక కుల్ఫీ మౌల్డ్స్‌లో మూడు వంతుల వరకు పోసి, ఫ్రిజ్‌లో ఒక రోజు రాత్రంతా ఉంచాలి ∙ సర్వ్ చేయడానికి ఐదు నిమిషాల ముందర ఫ్రిజ్‌లో నుంచి బయటకు తీసి పైన మరికొన్ని జీడిపప్పు పలుకులు వేసి అందించాలి. -
బంగారంపై తీరిన బెంగ
పాల్వంచ (రూరల్) : ప్రతి రెండేళ్లకోసారి మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. భక్తులు అమ్మవార్లకు నిలువెత్తు బంగారం(బెల్లం) చెల్లిస్తారు. ఈ నెల 31 నుంచి నాలుగు రోజులపాటు జాతర జరగనుంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లా నుంచి భక్తులు అధిక సంఖ్యలో మేడారం తరలివెళ్తున్నారు. అయితే మొక్కలు చెల్లించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. బెల్లం స్థానికంగా ఎక్కువగా అమ్మకపోవడంతో మేడారం వెళ్లి కొనుగోలు చేయాల్సి వస్తోంది. నాటుసారా(గుడుంబా) నియంత్రణ పేరుతో ప్రభుత్వం సంక్రాంతి పండగ ముందునుంచే ఆంక్షలు విధించింది. ఒక్కరికి 2 కేజీలకు మించి విక్రయించొద్దని, అది కూడా ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని విక్రయించాలని వ్యాపారులను ఆదేశించింది. ఎక్సైజ్, పోలీసు శాఖల అధికారులు కేసులు నమోదు చేయడంతో వ్యాపారులు విక్రయాలను నిలిపివేశారు. దీంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో బెల్లం కొరత ఏర్పడింది. జాతర సమయంలో ఈ నిబంధన ఇటు వ్యాపారులకు, అటు భక్తులకు ఇబ్బంది కలిగించింది. ఆయా ప్రాంతాల్లో బెల్లం విక్రయాలు లేకపోవడంతో భక్తులు మేడారం వెళ్లి కొనుగోలు చేసి మొక్కలు చెల్లిస్తున్నారు. మార్కెట్లో బెల్లం కేజీ ధర సుమారు రూ.50 ఉంటే అక్కడ రూ.100పైగా విక్రయిస్తున్నారు. దీంతో భక్తుల్లో ఒకింత అసహనం ఏర్పడింది. ఈ క్రమంలో నిబంధనలు సడలించాలని ఎక్సైజ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇప్పటినుంచి ఫిబ్రవరి 5వ తేదీ వరకు ఆంక్షలు లేకుండా విక్రయాలు జరుపుకునేందుకు ఎక్సైజ్‌శాఖ అనుమతించింది. నిబంధనలను సడలించడంతో పలువురు భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
హెల్త్ టిప్స్
► ఎసిడిటీతో బాధపడుతున్నవారు భోజనానంతరం ఒక గ్లాసు నీటిలో కొద్దిగా బెల్లం కలుపుకొని తాగితే ఎసిడిటీ నుంచి ఉపశమనం పొందవచ్చు. ► పిల్లలకు రోజూ... ఒక టేబుల్ స్పూన్ తేనెకి కొద్దిగా క్యారెట్ జ్యూస్, టొమాటో జ్యూస్ కలిపి ఇస్తే... అది మంచి టానిక్‌లా పనిచేస్తుంది. ► శరీరంపై వచ్చే ర్యాష్ తగ్గడానికి కొన్ని తమలపాకులను స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయాలి. ►ముక్కులో రక్తం కారుతూ ఉంటే దానిమ్మ రసం రెండు చుక్కలు ముక్కులో పిండుకోవాలి. -
రామ నైవేద్యం
పానకం కావల్సినవి: బెల్లం తరుగు – 4 టేబుల్ స్పూన్లు నీళ్లు – 2 కప్పులు యాలకుల పొడి – చిటికెడు శొంఠి పొడి – చిటికెడు మిరియాల పొడి – చిటికెడు తయారీ: గిన్నెలో నీళ్లు పోసి, బెల్లం తరుగు వేసి కరిగించాలి. ఈ మిశ్రమాన్ని జల్లితో వడకట్టాలి. దీంట్లో యాలకుల పొడి, శొంఠి, మిరియాల పొడి కలపాలి. గ్లాసులో పోసి నివేదించాలి. వడపప్పు కావల్సినవి:పెసరపప్పు – పావు కప్పు; నీళ్లు – 2 కప్పులుమామిడికాయ ముక్కలు (సన్నగా తరగాలి) – టేబుల్‌స్పూన్; పచ్చిమిర్చి – 1 (బాగా సన్నగా తరగాలి); పచ్చికొబ్బరి ముక్కలు (సన్నగా తరగాలి) – 2 టేబుల్ స్పూన్లు; ఉప్పు – చిటికెడు కొత్తిమీర తరుగు – అర టీ స్పూన్ తయారీ: పెసరపప్పును 2 గంటల పాటు నీళ్లలో నానబెట్టాలి. తర్వాత నీళ్లను వడకట్టాలి. ఈ పప్పులో సన్నగా తరిగిన మామిడికాయ ముక్కలు, పచ్చికొబ్బరి ముక్కలు, ఉప్పు, కొత్తిమీర తరుగు కలపాలి. నోట్: ఏవీ కలపకుండా నానబెట్టిన పెసరపప్పును కూడా నివేదించవచ్చు. -
ఆపిల్ ఓట్స్ స్వీట్
హెల్దీ కుకింగ్ తయారి సమయం: 15 నిమిషాలు కావలసినవి: ఓట్మీల్ – నాలుగు టేబుల్ స్పూన్లు, బెల్లం తురుము – టేబుల్ స్పూన్, యాపిల్ – ఒకటి (చిన్న ముక్కలుగా తరగాలి), దాల్చిన చెక్క పొడి – చిటికెడు, ఉప్పు – చిటికెడు, కిస్మిస్లు – టేబుల్ స్పూన్, నీళ్లు – రెండు కప్పులు తయారి: పాత్రలో నీళ్లు, ఉప్పు, ఓట్స్ వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. బెల్లం తరుము, దాల్చిన చెక్క పొడి, యాపిల్ ముక్కలు వేసి కలిపి, మరో మూడు నిమిషాల పాటు ఉంచాలి. ∙కిస్మిస్లు వేసి దింపేసి వేడివేడిగా అందిస్తే రుచిగా ఉంటుంది. -
చిక్కుడుకాయ తీపికూర
క్విక్‌ఫుడ్ కావలసినవి: చిక్కుడుకాయలు – అర కిలో;శనగపప్పు – టేబుల్ స్పూను;మినప్పప్పు – టేబుల్ స్పూను;ఆవాలు – టీ స్పూను;జీలకర్ర – టీ స్పూను;ఎండుమిర్చి – 8;చింతపండుగుజ్జు – టేబుల్ స్పూను;బెల్లం తురుము – 2 టేబుల్ స్పూన్లు;బియ్యప్పిండి – టేబుల్ స్పూను;పసుపు – చిటికెడు; నూనె – 2 టేబుల్ స్పూన్లు;ఉప్పు – తగినంత;కరివేపాకు – 2 రెమ్మలు; కొత్తిమీర – కొద్దిగా తయారి: చిక్కుడుకాయలను శుభ్రంగా కడిగి ఈనెలు తీసి పెద్దపెద్ద ముక్కలు చేయాలి.బాణలిలో నూనె వేసి స్టౌ మీద ఉంచి కాగాక, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి వరసగా వేయాలి. చిక్కుడుకాయ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి. బాగా ఉడుకుపట్టాక బెల్లం తురుము, చింతపండు గుజ్జు, బియ్యప్పిండి, పసుపు వేసి కలిపి ఐదు నిముషాలు ఉంచి దించేయాలి కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేయాలి. -
బియ్యం మిఠాయిలు
కొత్త ధాన్యం ఇంటికి వచ్చింది... కొత్త సంతోషాల పంట పండుగ చేసింది. ఉగాదికైతే ఆరు రుచులు కావాలి కానీ, సంక్రాంతి మాత్రం తియ్యగానే ఉండాలి. ఆరుబయటి నుంచి ఇంట్లో దాకా... అంతా తియ్యతియ్యగానే ఉండాలి. అందుకే... ఈ బియ్యం మిఠాయిలతో తియ్యటి పండుగ జరుపుకోండి. పరమాన్నం కావల్సినవి: కొత్త బియ్యం – ముప్పావు కప్పు, బెల్లం – 250 గ్రాములు, యాలకులు – 4 (పొడి చేయాలి), పాలు – 5 కప్పులు, నీళ్లు – ఒకటిన్నర కప్పు, జీడిపప్పు , కిస్మిస్ – తగినన్ని, నెయ్యి – 3 టేబుల్‌స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి 15 నిమిషాలు నానబెట్టాలి. మందపాటి గిన్నెలో బెల్లం వేసి, నీళ్లు పోసి సన్నని మంట మీద కరిగించాలి. దీన్ని వడకట్టి, చెత్త తీసేయాలి. ఈ బెల్లం పానకాన్ని చల్లారనివ్వాలి. ∙ పాలు మరిగించి పక్కనుంచాలి. ∙బియ్యంలో నీళ్లు పోసి ఉడకించాలి. ∙చిన్న పాన్‌లో నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించాలి. ∙బియ్యం మెత్తగా ఉడికాక చల్లారిన బెల్లం పాకాన్ని పోసి కలపాలి. దీంట్లో యాలకుల పొడి, వేయించిన జీడిపప్పులు, కిస్మిస్ వేసి కలిపి, మంట తీసేయాలి. బూరెలు కావల్సినవి: కొత్తబియ్యం – పావు కేజీ, బెల్లం – పావు కేజీ, పచ్చికొబ్బరి తురుము – కప్పు, నూనె – వేయించడానికి తగినంత, నెయ్యి – 2 టీ స్పూన్లు తయారీ: ∙బియ్యం కడిగి కనీసం 6 గంటల పాటు నానబెట్టాలి. బియ్యంలో నీళ్లు వంపేసి కాటన్ క్లాత్‌లో వేసి పది నిమిషాలు మూటకట్టాలి. ఈ బియ్యాన్ని రోట్లో కానీ, మిక్సీలో కానీ వేసి మెత్తటి పిండి చేసుకోవాలి. బెల్లాన్ని తురిమి ఒక గిన్నెలో వేసి దాంట్లో పావు కప్పు నీళ్లు పోసి మరిగించాలి. దీంతో బెల్లం కరుగుతుంది. ఇలా కరిగిన బెల్లంలో కొబ్బరి తురుము వేసి కలపాలి. కొంచెం జిగురుగా అయ్యేంతవరకు ఉంచి, నెయ్యి వేసి కలపాలి. తర్వాత దీంట్లో బియ్యప్పిండి వేస్తూ అదేపనిగా కలుపుతూ ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నూనె వేసి కలిపి, ప్లేట్లోకి తీసుకోవాలి. పొయ్యి మీద బాణలి పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. సిద్ధం చేసుకున్న బియ్యప్పిండి చల్లారిందా లేదా చూసుకొని నిమ్మకాయ పరిమాణంలో చిన్న చిన్న ఉండలు చేసుకోవాలి. ఒక్కో ఉండను పాలిథిన్ కవర్ మీద పెట్టి, వెడల్పుగా వత్తి కాగుతున్న నూనెలో వేసి రెండువైపులా ముదురు గోధుమరంగు వచ్చేవరకు వేయించి, ప్లేట్లోకి తీసుకోవాలి. చల్లారిన తర్వాత వడ్డించాలి. తీపి పునుగులు కావల్సినవి: కొత్తబియ్యప్పిండి – కప్పు, ఓట్స్ పొడి – అర కప్పు, కాచి చల్లార్చిన పాలు – కప్పు, యాలకుల పొడి – టీ స్పూన్, పంచదార – కప్పు, మైదా – కప్పు, జీడిపప్పు పలుకులు – టేబుల్ స్పూన్, ఉప్పు – చిటికెడు, నూనె – వేయించడానికి సరిపడా తయారీ: ∙ఒక గిన్నెలో నూనె, పాలు మినహా మిగిలిన పదార్థాలన్నీ తీసుకొని బాగా కలపాలి. తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ పునుగుల పిండిలా కలిపి ఐదు నిమిషాలు నాననివ్వాలి. తరువాత పిండిని కాగుతున్న నూనెలో ఉండల్లా వేసుకొని ఎర్రగా వేగాక తీయాలి. తీపి పొంగలి కావల్సినవి: కొత్త బియ్యం – కప్పు, పెసరపప్పు – అర కప్పు, బెల్లం – ఒకటిన్నర కప్పు, నీళ్లు – 4 1/2 కప్పులు, యాలకుల పొడి – అర టీ స్పూన్, నెయ్యి – 3 టీ స్పూన్లు, జీడిపప్పులు – 12, కిస్మిస్ – 2 టేబుల్ స్పూన్లు తయారీ: ∙పొయ్యి మీద బాణలి పెట్టి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేయించి పక్కనుంచాలి. ∙అదే పాన్‌లో పెసరపప్పు కూడా కొద్దిగా వేయించి పక్కనుంచాలి. ∙వేడి బాణలిలో బెల్లం తురుము వేసి, కరిగేంతవరకు ఉంచి, చల్లారనివ్వాలి. ∙మరొక గిన్నెలో నీళ్లు పోసి మరిగించి, మంట తగ్గించాలి. ∙బియ్యం, పెసరపప్పు కడిగి నీళ్లు వంపి మరుగుతున్న నీటిలో నెమ్మదిగా పోయాలి. బియ్యం–పప్పు మెత్తగా ఉడికించి మంట తగ్గించాలి. దీంట్లో కిగించిన బెల్లం వేసి కలపాలి. మిశ్రమం ఉడికేంతవరకు ఉంచి యాలకుల పొడి, జీడిపప్పు, కిస్మిస్ వేసి మరో 2–3 నిమిషాలు ఉంచి మంట తీసేయాలి. ఈ తీపి పొంగలిని వేడిగానూ, చల్లగానూ సర్వ్ చేయవచ్చు. నోట్: జీడిపప్పు, కిస్మిస్లు మంచి టేస్ట్ రావాలంటే చిటికెడు ఉప్పు వేసి వేయించాలి. బెల్లం గారెలు కావల్సినవి: కొత్తబియ్యం – కప్పు, ఉప్పు – తగినంత, నూనె – వేయించడానికి తగినంత, బెల్లం – కప్పు, నీళ్లు – ఒకటిన్నర కప్పు తయారీ: ∙బియ్యం రెండుగంటల సేపు నానబెట్టాలి. నీళ్లు వడగట్టాలి. పిండి మెత్తగా వడలకు తగిన విధంగా రుబ్బుకోవాలి. ∙వేడినీళ్లలో బెల్లం వేసి కరిగించి, పాకం పట్టాలి. ∙బాణలిలో నూనె పోసి, కాగనివ్వాలి. చేతులు తడిలేకుండా చూసుకొని చేతిమీద గానీ, అరటి ఆకు మీదగానీ నిమ్మకాయ పరిమాణంలో పిండి తీసుకొని అదిమి మధ్యకు పెద్ద రంధ్రం చేయాలి. ∙ఇలా చే సిన దాన్ని కాగుతున్న నూనెలో నెమ్మదిగా వదలాలి. సన్నని మంట మీద రెండువైపులా వేయించాలి. ∙గారె బంగారు వర్ణం వచ్చేవరకు వేయించాక తీసి బెల్లం పాకంలో వేయాలి. మరో గారె సిద్ధమైంతవరకు బెల్లం పాకంలో గారెను ఉంచి, తర్వాత తీసి ప్లేట్లో పెట్టాలి. వేడి వేడిగా సర్వ్ చేస్తే కరకరలాడుతూ బెల్లం గారెలు రుచిగా ఉంటాయి. వీటిని పెసరపప్పు, మినప్పప్పుతోనూ చేసుకోవచ్చు. -
బెల్లం లేని అరిసెలు!
నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ అమ్మకాల నిషేధం కిలో, రెండు కిలోలు కూడా అమ్మకుండా కట్టడి పిండి వంటలు చేయలేక పోతున్నామని ప్రజల నిరాశ పరకాల : నాటుసారా తయారీకి వినియోగిస్తున్నారంటూ తెల్లబెల్లం అమ్మకాలను నిషేధించడంతో సంక్రాంతి పండుగకు అరిసెలు చేసుకునే ఆనవాయితీకి బ్రేక్ పడుతోంది. ఏటా సంక్రాంతి సందర్భంగా అరిసెలు, సకినాలు చేసుకోవడం సర్వసాధారణం. కానీ ఈసారి బెల్లం అమ్మకాలను కట్టడి చేయడంతో ఎక్కువ మంది ఇండ్ల నుంచి అరిసెల పాకం వాసన రావడం లేదు! దీంతో అరిసెలు లేకుండానే సంక్రాంతి చేసుకోవాలా అ ని ప్రజలు మధనపడుతుండగా.. కిలో, రెండు కిలోలు కూడా అమ్మనివ్వకపోవడంపై వ్యాపారులు మండిపడుతున్నారు. నల్లబెల్లం స్థానంలో తెల్లబెల్లం పలు గ్రామాల్లో గుడుంబా తయారీకి నల్లబెల్లం ఉపయోగించేవారు. ఈ విషయాన్ని గుర్తించి ఎక్సైజ్ అధికారులు నల్లబెల్లాన్ని నిషేధించడంతో కొంతకాలం గుడుంబా తయారీ నిలిచిపోయింది. అయితే, కొద్దిరోజులకు గుడుంబా తయారీదారులు తెల్లబెల్లం ఉపయోగించడాన్ని ప్రారంభించారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం నాటుసారాను నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో మేడారం సమ్మక్క సారలమ్మ జాతర సమయం నుంచి తెల్లబెల్లం అమ్మకాలను కూడా కట్టడి చేస్తోంది. ఈ నిర్ణయంతో గుడుంబా తయారీ ఏ మేరకు నిలిచిపోయిందో తెలియదు కానీ.. శుభకార్యాలు, వేడుకలతో పాటు పండుగల సమయంలో తీపి వంటకాలు చేసుకుందామనుకునే వారికి నిరాశ ఎదురవుతోంది. ఇక కిలో, రెండు కిలోల బెల్లం నిల్వ ఉన్నా కేసులు పెడుతున్నారంటూ వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఓ కిరాణం వ్యాపారి తన మనువడు పుట్టినరోజు సందర్భంగా వంటల్లో ఉపయోగించేందుకు ఐదు కిలోల బెల్లం తీసుకొస్తుంటే ఎక్సైజ్ అధికారులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. ఇలాంటి ఘటనలు తరచు చోటు చేసుకుంటుండడంతో బెల్లం అమ్మాలన్నా.. కొన్నాలన్నా బెంబేలెత్తిపోయే పరిస్థితి పరకాలలో నెలకొంది. -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేషన్ లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన బెల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
‘కానుక’ బెల్లంలో పురుగులు
కొవ్వూరు : క్రిస్మస్, సంక్రాంతికి అందించే చంద్రన్న కానుకల్లో నాణ్యత లేదని పదేపదే ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం నిమ్మ కు నిరెత్తి్తనట్టు వ్యవహరిస్తోంది. గతనెలలో క్రిస్మస్ సందర్భంగా ఇచ్చిన కానుక సరుకుల్లో నాణ్యత లేదని నాసిరకం బెల్లం పంపిణీ చేశారని పౌరసరఫరాల మంత్రి పరిటాల సునీత ఆగ్రహం వ్యక్తం చేసినా మార్పు కనిపించలేదు. ఈ క్రమంలో సం క్రాంతి కానుకల్లో అదే పరిస్థితి కొనసాగుతుండటంపై రేష¯ŒS లబ్దిదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాణ్యత లేని వస్తువులు సరఫరా చేసిన కంపెనీలను బ్లాక్ లిస్ట్‌లో పెడతామని మంత్రులు చెబుతున్నారే తప్ప ఆచరణలో అది అమలు కావడం లేదు. చాగల్లు మండలం దారవరం గ్రామంలో షాప్ నెం.5 లో సంక్రాంతి చంద్రన్న కానుకలో భాగంగా పంపిణీ చేసిన »ñ ల్లంలో పురుగులు, నల్లమట్టి ఉండటంతో లబ్దిదారులు ఖంగుతిన్నారు. కార్దుదారులు వెంటనే సంబంధిత డీలర్‌కు బెల్లం తిరిగి ఇచ్చేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై డీలర్ అధికారులను సంప్రదించడంతో హడావుడిగా ఈ బెల్లాన్ని తీసుకుని కొత్త బెల్లాన్ని అందించినట్టు సమాచారం -
ప్రాణం తీసిన బెల్లం అక్రమ రవాణ
కురవి : బెల్లం అక్రమ రవాణా ఓ వ్యక్తి ప్రాణం తీసిన ఘటన మండలంలోని నేరడ శివారులో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. నేరడ శివారు కాకులబోడు తండాకు చెందిన బానోత్ లాల్‌సింగ్(22), గుగులోత్ రెడ్డి, గుగులోత్ నరేష్ రెండు ద్విచక్రవాహనాలపై బెల్లం బస్తాలు తెచ్చేం దుకు మహబూబాబాద్ మండలంలోని చోక్లాతండాకు వెళ్లారు. తిరిగి వస్తుండగా రాయినిపట్నం క్రాస్ రోడ్ వద్ద ఓ వాహనం వెళ్తుండడాన్ని చూసి పోలీ సులుగా భావించి తమ ద్విచక్ర వాహనాలను రోడ్డు పక్కన ఆపారు. బెల్లం బస్తాలు పక్కన పడేసి సమీపంలోని మిరపతోటలోకి వెళ్లారు. కాగా, తోటలో ఉన్న మరో వ్యక్తి వీరిని చూసి ‘దొంగలు..దొంగలు..’ అని అరిచాడు. దీంతో ఆ ముగ్గురూ పరుగుతీశారు. ఈ క్రమంలో బానోత్ లాల్‌సింగ్ వ్యవసాయ బావిలో పడిపోయాడు. రెడ్డి, నరేష్ రోడ్డుపైకి వచ్చి తమ బైక్‌పై కాకులబోడు తండాకు వెళ్లిపోయారు. ఇంటికి వెళ్లాక లాల్‌సింగ్ బావిలో పడ్డాడని, అందులో వెతకాలని బంధువులకు ఫోన్ చేశారు. తండాలోని కొందరు వ్యక్తులు బావి వద్దకు వెళ్లి టార్చ్‌లైట్లతో వెతికినా కనిపించలేదు. ఈలోగా మిరప తోటలోని వ్యక్తి సమాచారం అందించడంతో రాత్రి 12 గంటలకు పోలీసులు వచ్చి బెల్లం బస్తాలను, బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత బావిలో వెతికి లాల్‌సింగ్ మృతదేహాన్ని బయటకు తీశారు. పరారీలో ఉన్న ఇద్దరు వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎస్సై అశోక్ తెలిపారు. -
బెల్లం వ్యాపారి విడుదల
మట్టెవాడ పోలీస్‌స్టేషన్ సమీపంలో ప్రత్యక్షం కిడ్నాపర్ సూడో నక్సలైట్ నిందితుడి కోసం పోలీసుల గాలింపు హసన్‌పర్తి : హసన్‌పర్తి సమీపంలో బుధవారం కిడ్నాప్‌నకు గురైన నిజామాబాద్ జిల్లాకు చెందిన బెల్లం వ్యాపారి గురువారు తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో విడుదలయ్యాడు. వరంగల్‌లోని మట్టెడవాడ పోలీస్‌స్టేçÙన్ వద్ద ఆ వ్యాపారి ప్రత్యక్షమయ్యాడు. కిడ్నాపర్ సూడో నక్సలైట్. ఇటీవల ఓ హత్యకేసులో జైలుకు వెళ్లి గత నెలలో విడుదలయ్యాడు. వివరాలిలా ఉన్నాయి... పరకాల మండలం నడికుడ గ్రామానికి చెందిన రేనుకుంట్ల బిక్షపతిది నేరచరిత్ర. అతనిపై వివిధ పోలీస్‌స్టేçÙన్లలో కేసులు ఉన్నా యి. ఇటీవల ఆత్మకూర్ పోలీస్‌స్టేçÙన్ పరిధిలో జరిగిన ఓ హత్య కేసులో జైలుకు వెళ్లాడు. గుమస్తాతో పరిచయం... నిమాజాబాద్ జిల్లా బిక్కనూర్‌కు చెందిన బెల్లం వ్యాపారి శ్యామల భరత్ వద్ద గుమస్తాగా పనిచేస్తున్న రవీందర్‌రెడ్డికి బిక్షపతితో వరంగల్ జైలులో పరిచయం అయ్యాడు. వీరిద్దరూ ఒకే గ్యారేజ్‌లో ఉండడంతో వారి మధ్య సాన్నిహిత్యం పెరిగింది. బెల్లం వ్యాపారం చేస్తానని నమ్మించి.. కాగా, తన వద్ద రూ.3 లక్షలు ఉన్నాయని, తాను కూడా బెల్లం వ్యాపారం చేస్తానని రవీందర్‌రెడ్డిని బిక్షపతి నమ్మించాడు. ఆగస్టు 2న రవీందర్‌రెడ్డి జైలు నుంచి విడుదల కాగా, బిక్షపతి అతడి సెల్ నెంబర్ తీసుకున్నాడు. అదే నెల 8న బిక్షపతి కూడా జైలు నుంచి బయటికి వచ్చాడు. నాలుగు రోజుల తర్వాత రవీందర్‌రెడ్డికి ఫోన్ చేసి, బెల్లం వ్యాపారం కోసం నిమాజాబాద్‌కు వెళ్లాడు. అక్కడ శ్యామల భరత్‌తో వ్యాపార వ్యవహారాలు మాట్లాడాడు. తనకు మూడు లారీల బెల్లం అవసరమని, ఒక్కో లారీ వరంగల్‌కు చేర్చడానికి రూ.3 లక్షల చొప్పున ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నాడు. డబ్బు కోసం రమ్మని కబురు... రెండు రోజుల క్రితం శ్యామల భరత్‌కు బిక్షపతి ఫోన్‌చేసి డబ్బుల కోసం వరంగల్ రమ్మని చె ప్పాడు. దీంతో బుధవారం భరత్ తన గుమస్తా రవీందర్‌రెడ్డితో కలిసి వరంగల్ వస్తూ.. హసన్çపర్తిలో ఆగి బిక్షపతికి ఫోన్ చేశారు. కొత్తవాడలో నిర్భంధం... కాగా, సమీపంలోనే పెద్ద వ్యాపారులు ఉన్నారని, అక్కడికి వస్తే డబ్బులు ఇస్తారని నమ్మిం చిన బిక్షపతి భరత్‌ను ద్విచక్రవాహనంపై హసన్‌పర్తి నుంచి తీసుకెళ్లాడు. మధ్యలో కిట్స్ క్రాస్ వద్ద ఆటోలో ఎక్కించుకుని వరంగల్‌లోని కొత్తవాడకు తీసుకెళ్లాడు. అక్కడ ఓ గదిలో నిర్బం ధించి నాలుగు గంటల పాటు చిత్రహింసలకు గురిచేసినట్లు తెలిసింది. ఆ తర్వాత రూ.50 లక్షలు ఇవ్వాలని, లేదంటే చంపుతానని అతడి కుటుంబసభ్యులకు ఫోన్ చేసి బెదిరించాడు. ఈ వ్యవహారంలో బిక్షపతితో పాటు మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. అర్ధరాత్రి కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్న పోలీసులు... ఎంత ప్రయత్నించినా బిక్షపతి పోలీసుల లైన్‌కు రాలేదు. దీంతో అర్ధరాత్రి బిక్షపతి ఇంటిపై దాడి చేసి వారి కుటుంబసభ్యులను అదుపులోకి తీసుకున్నారు. చివరికి పోలీసుల హెచ్చరికలతో భరత్‌ను మట్టెవాడ పోలీస్ స్టేషన్ సమీపంలో వదిలిపెట్టి వెళ్లినట్లు తెలిసింది. నిందితుడి కోసం గాలింపు... కాగా, బిక్షపతి కోసం పోలీసులు గాలింపు చర్య లు చేపట్టారు. గురువారం రాత్రి వరకు కూడా అతని కోసం ఆయా ప్రాంతాల్లో జల్లెడ పట్టారు. బిక్షపతి కుటుంబసభ్యులు ఇప్పటికీ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు తెలిసింది. భరత్‌తో పాటు గుమస్తా, కారుడ్రైవర్ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉన్నారని సమాచారం. -
చేదు అనుభవం
అనకాపల్లి: జాతీయస్థాయిలో రెండోస్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో అటు వర్తకులు, ఇటు కార్మికులు సతమతమవుతున్నారు. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అనకాపల్లి బెల్లానికి మంచి డిమాండ్. సహకార రంగంలోని చక్కెర మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్న తరుణంలో బెల్లానికి ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషకులు భావించారు. ఐతే దీని తయారీకి ముడి సరుకైన చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోవడంతో దాని ప్రభావం బెల్లం లావాదేవీలపై పడుతోంది. సహజంగా అనకాపల్లి బెల్లం మార్కెట్లో సెప్టెంబర్, అక్టోబర్ నుంచి లావాదేవీలు ప్రారంభమవుతాయి. జనవరి, ఫిబ్రవరిలో అధికంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు సీజన్ కొనసాగుతుంది. మే, జూన్ నాటికి రైతులు బెల్ల తయారీ, అమ్మకాలు ఆపేస్తారు. ఆ సమయంలో కోల్డ్‌స్టోరేజీలో ఉన్న బెల్లాన్ని పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్ మేరకు కొంచెం కొంచెంగా విక్రయిస్తారు. ఈ కారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో బెల్లం లావాదేవీలు లేక మార్కెట్ వెల వెలబోతుంది. కొలగార్లు, కలాసీలు, బెల్లాన్ని రైతుల నుంచి మార్కెట్‌కు తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు, మార్కెట్లో పని చేసే గుమస్తాల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. 184 క్వింటాళ్ల లావాదేవీలు... జూలై నెలలో శుక్రవారం నాటికి కేవలం 184 క్వింటాళ్ల లావాదేవీలతో 5.29 లక్షల వ్యాపారం మాత్రమే జరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 66,815 క్వింటాళ్ల లావాదేవీలతో 18.25 కోట్ల వ్యాపారం సాగింది. ఇందులో ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.15 కోట్లు జరిగింది. మే, జూన్, జూలై మాసాల్లో కేవలం రూ. 3 కోట్లే వ్యాపారమన్నమాట. గత సీజన్లో జూలైలో 3వేల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరిగాయి. 2014–15సీజన్లో మొత్తంగా 5,67, 575 క్వింటాళ్ల లావాదేవీలతో 121.42 కోట్ల వ్యాపారం జరిగింది. 2015–16లో 4, 81, 694 క్వింటాళ్ల లావాదేవీలతో రూ. 108 కోట్లకు వ్యాపారం పడిపోయింది. అంటే జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పాదక శక్తి తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రానున్న సీజన్ మరీ గడ్డుగా ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటైన చెరకు సాగు, దాని చుట్టూ ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడకపోతే చెరకుపై ఆధారపడిన నాలుగు చక్కెర కర్మాగారాలు, బెల్లం మార్కెట్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే తుమ్మపాల చక్కెర కర్మాగారం గానుగాట నిలిచిపోవడం ఒక చేదు ఫలితంగా చెప్పవచ్చని వారు పేర్కొంటున్నారు. -
చేదు అనుభవం
చేదు అనుభవం అనకాపల్లి బెల్లం మార్కెట్‌కు అన్‌సీజన్ దెబ్బ భారీగా పడిపోయిన లావాదేవీలు బెల్లం,మార్కెట్, నష్టాలు, అనకాపల్లి,jaggery,market,falls,anakapalli అనకాపల్లి: జాతీయస్థాయిలో రెండోస్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు క్రమంగా పడిపోతున్నాయి. దీంతో అటు వర్తకులు, ఇటు కార్మికులు సతమతమవుతున్నారు. ఉత్తరభారతదేశంలోని పలు రాష్ట్రాల్లో అనకాపల్లి బెల్లానికి మంచి డిమాండ్. సహకార రంగంలోని చక్కెర మిల్లులు ఒక్కొక్కటిగా మూతపడుతున్న తరుణంలో బెల్లానికి ప్రాధాన్యం పెరుగుతుందని విశ్లేషకులు భావించారు. ఐతే దీని తయారీకి ముడి సరుకైన చెరకు సాగు విస్తీర్ణం ఏటేటా తగ్గిపోవడంతో దాని ప్రభావం బెల్లం లావాదేవీలపై పడుతోంది. సహజంగా అనకాపల్లి బెల్లం మార్కెట్లో సెప్టెంబర్, అక్టోబర్ నుంచి లావాదేవీలు ప్రారంభమవుతాయి. జనవరి, ఫిబ్రవరిలో అధికంగా ఉంటుంది. ఏప్రిల్ వరకు సీజన్ కొనసాగుతుంది. మే, జూన్ నాటికి రైతులు బెల్ల తయారీ, అమ్మకాలు ఆపేస్తారు. ఆ సమయంలో కోల్డ్‌స్టోరేజీలో ఉన్న బెల్లాన్ని పొరుగు రాష్ట్రాల్లో డిమాండ్ మేరకు కొంచెం కొంచెంగా విక్రయిస్తారు. ఈ కారణంగా జూన్, జూలై, ఆగస్టు నెలల్లో బెల్లం లావాదేవీలు లేక మార్కెట్ వెల వెలబోతుంది. కొలగార్లు, కలాసీలు, బెల్లాన్ని రైతుల నుంచి మార్కెట్‌కు తరలించే వాహనాల యజమానులు, డ్రైవర్లు, మార్కెట్లో పని చేసే గుమస్తాల ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయి. 184 క్వింటాళ్ల లావాదేవీలు... జూలై నెలలో శుక్రవారం నాటికి కేవలం 184 క్వింటాళ్ల లావాదేవీలతో 5.29 లక్షల వ్యాపారం మాత్రమే జరిగింది. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 66,815 క్వింటాళ్ల లావాదేవీలతో 18.25 కోట్ల వ్యాపారం సాగింది. ఇందులో ఏప్రిల్ నెలలో అత్యధికంగా రూ.15 కోట్లు జరిగింది. మే, జూన్, జూలై మాసాల్లో కేవలం రూ. 3 కోట్లే వ్యాపారమన్నమాట. గత సీజన్లో జూలైలో 3వేల క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరిగాయి. 2014–15సీజన్లో మొత్తంగా 5,67, 575 క్వింటాళ్ల లావాదేవీలతో 121.42 కోట్ల వ్యాపారం జరిగింది. 2015–16లో 4, 81, 694 క్వింటాళ్ల లావాదేవీలతో రూ. 108 కోట్లకు వ్యాపారం పడిపోయింది. అంటే జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం, ఉత్పాదక శక్తి తగ్గిపోయిందని శాస్త్రవేత్తలు విశ్లేషిస్తున్నారు. రానున్న సీజన్ మరీ గడ్డుగా ఉంటుందని వ్యవసాయ రంగ నిపుణుల అభిప్రాయం. ముఖ్యంగా జిల్లాలో ప్రధాన వాణిజ్యపంటైన చెరకు సాగు, దాని చుట్టూ ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల నుంచి బయటపడకపోతే చెరకుపై ఆధారపడిన నాలుగు చక్కెర కర్మాగారాలు, బెల్లం మార్కెట్‌కు గడ్డు పరిస్థితులు తప్పవన్న వాదన వ్యక్తమవుతోంది. ఈక్రమంలోనే తుమ్మపాల చక్కెర కర్మాగారం గానుగాట నిలిచిపోవడం ఒక చేదు ఫలితంగా చెప్పవచ్చని వారు పేర్కొంటున్నారు. -
నల్ల బెల్లం పట్టివేత
మిర్యాలగూడ అర్బన్: సారా తయారీకి ఉపయోగించే నల్లబెల్లం తరలిస్తున్న వ్యక్తిని మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎక్సైజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్ర ప్రాంతంలోని దాచేపల్లి నుంచి అక్రమంగా సార బెల్లాన్ని తరలిస్తుండగా సమాచాం మేరకు తనిఖీలు నిర్వహిస్తుండగా ఆటోలో తరలిస్తున్న 2క్వింటాళ్ల నల్లబెల్లం, 50కిలోల పట్టికను స్వాధీనం చేసుకున్నారు. బెల్లాన్ని తరలిస్తున్న వ్యక్తి ధరవత్ రమేష్‌తో ఆటోను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ దాడుల్లో ఎక్సైజ్ సీఐ బి.సుధాకర్, ఎస్ఐ అక్రం అలీతో పాటు ఎక్సైజ్ సిబ్బంది పాల్గొన్నారు. -
వంటిప్స్
కాకరకాయ కూరలో సోంపు గింజలు, బెల్లం వేస్తే చేదు తగ్గి కూర రుచిగా ఉంటుంది.అప్పడాలు వేయించే ముందు కొద్దిసేపు ఎండలో పెడితే నూనె ఎక్కువ లాగదు.మైదా పిండితో చిప్స్ చేసేటప్పుడు బంగాళదుంపలు ఉడికించి పిండిలో కలిపితే చిప్స్ కరకరలాడతాయి. బంగాళదుంపల మధ్యలో కొన్ని వెల్లుల్లి రేకలు ఉంచితే ఎక్కువ రోజులు పాడవకుండా ఉంటాయి.బెండకాయలు తాజాగా, ముదిరిపోకుండా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి ఫ్రిజ్‌లో ఉంచాలి.ఇడ్లీ, దోశ చేసేటప్పుడు బియ్యం కొద్దిసేపు వేయించి నానబెడితే ఇడ్లీ మెత్తగా, దోశ కరకరలాడుతూ ఉంటుంది. దంచిన పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే పసుపు డబ్బాలో కొన్ని ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. -
ఏటంతారేటి!
ఏముందండీ అంటానికి?! నార్త్ కోస్టు ఫుడ్డు. గాలి మళ్లక తప్పదు. చప్పరించినా, లొట్టలేసుకున్నా సికెన్ పీసు, పీతల వేపుడు.. ఆవ చేప.. బలేగుంటాయి. ఏతంటారేటి? కోవా పూరీ కావల్సినవి: కోవా - 200 గ్రా.లు మైదా - అర కేజీ డ్రై ఫ్రూట్స్(బాదం, జీడిపప్పు) పొడి - 30 గ్రా.లు యాలకుల పొడి - టీ స్పూన్ నూనె - వేయించడానికి తగినంత బెల్లం - అర కేజీ నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు తయారీ: ఒక గిన్నెలో మైదా వేసి తగినన్ని నీళ్లు పోసి పూరీ పిండిలా కలిపి, పక్కనుంచాలి. మరో గిన్నెలో కోవా, డ్రై ఫ్రూట్స్ పొడి, యాలకులపొడి వేసి బాగా కలిపి పక్కనుంచాలి. మైదా పిండిని చిన్న చిన్న ఉండలు తీసుకొని పూరీలా వత్తి, కోవా మిశ్రమాన్ని దాంట్లో కూరాలి. (కజ్జికాయల మాదిరి చేయాలి). బాణలిలో నూనె కాగాక, అందులో వేసి అన్నివైపులా బాగా వేయించి తీయాలి. మరొక గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి, బెల్లం వేసి కరిగించాలి. ఈ గిన్నెను పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. పాకం వచ్చాక యాలకుల పొడి వేసి కలపాలి. ముదురు పాకం వచ్చాక వేయించి సిద్ధంగా పెట్టుకున్న కోవా పూరీలను వేసి, కలిపి, తీయాలి. లక్ష్మీ చారు కావల్సినవి: తరవాణి/కలి నీళ్లు (బియ్యం రెండోసారి కడిగిన 2 కప్పుల నీళ్లు ఒక కుండలో పోసి రెండు రోజుల పాటు ఉంచినవి. దీంట్లో అరకప్పు గంజి కూడా కలపాలి) - కప్పు వెల్లుల్లి - 4 రెబ్బలు వెల్లుల్లి ముద్ద - 1 టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు కరివేపాకు - 3 రెమ్మలు చింతపండు - నిమ్మపండంత. ఉప్పు - తగినంత పచ్చిమిర్చి - 4 (నిలువుగా చీరాలి) పసుపు - 1/2 టీ స్పూన్ మిరియాల పొడి - అర టీ స్పూన్ ఎండుమిర్చి - 2 జీలకర్ర- ఆవాలు - టీ స్పూన్ నూనె - టేబుల్ స్పూన్ తయారీ: మూకుడులో నూనె వేసి, కాగాక ఎండుమిర్చి, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి, వెల్లుల్లి+ముద్ద, పసుపు వేసి కలపాలి. చింతపండు రసం, సరిపడా కలి/తరవాణి నీళ్లు పోసి, ఉప్పు వేసి మరిగించాలి. తరువాత మిరియాల పొడి, కొత్తిమీర వేసి దించాలి. ఈ చారు అన్నంలోకి వడ్డించాలి. జీడిపప్పు చికెన్ పలావ్ కావల్సినవి: జీడిపప్పు - 100 గ్రా.లు చికెన్ - 100 గ్రా.లు బియ్యం - 200 గ్రా.లు; కొబ్బరి పాలు - కప్పు ఉప్పు - తగినంత; పచ్చిమిర్చి - 4 అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ గరం మసాలా (యాలకులు, లవంగాలు, సాజీర, అనాసపువ్వు ) - 2 టీ స్పూన్లు ఉల్లిపాయలు - 4 (2 ఉల్లిపాయలను తరిగి, వేయించి పక్కనుంచాలి) నెయ్యి - 2 టీ స్పూన్లు నూనె - 50 గ్రా.లు; బిర్యానీ ఆకు - 2 కొత్తిమీర - చిన్న కట్ట పుదీనా - కప్పు తయారీ: బియ్యం అరగంట సేపు నానబెట్టాలి. ఒక మందంపాటి గిన్నెను పొయ్యిమీద పెట్టి, నూనె వేసి వేడయ్యాక మసాలా దినుసులు కలపాలి. ఉల్లిపాయ తరుగు వేసి వేగాక అల్లం-వెటల్లుల్లి పేస్ట్ కలపాలి. తరువాత చికెన్ ముక్కలు వేసి ఉప్పు, పుదీనా, కొత్తిమీర, జీడిపప్పులు వేసి కాస్తవేగనివ్వాలి. దీంట్లో బియ్యానికి సరిపడా నీళ్లు పోసి కొత్తిమీర, పుదీనా వేసి మరిగించాలి. తరువాత నానబెట్టిన బియ్యం వేసి కలపాలి. అన్నం ఉడికి నీళ్లు తగ్గాక నెయ్యి, ఇంకాస్త కొత్తిమీర వేసి కలపాలి. మంట తగ్గించి అన్నం పూర్తిగా ఉడకనిచ్చి దించాలి. దీనికి ఉలవచారు కాంబినేషన్ రుచిగా ఉంటుంది. స్టఫ్డ్ క్రాబ్స్ కావల్సినవి: పీతలు (బోన్‌లెస్) - 4 పీత మాంసం - 200 గ్రా.లు జీడిపప్పు - 50 గ్రా.లు అల్లం తరుగు - టీ స్పూన్ వెల్లుల్లి తరుగు - టీ స్పూన్ కొత్తిమీర - చిన్న కట్ట; పచ్చిమిర్చి - 4 గుడ్డు - 1; ఉప్పు - సరిపడా నూనె - వేయించడానికి తగినంత మొక్కజొన్న పిండి - టీ స్పూన్ తయారీ: పీతల డిప్పలను తీసి, లోపలి గుజ్జు భాగాన్ని వేరొక గిన్నెలోకి తీసుకోవాలి. డిప్పలను వేడి నీటితో కడిగి పక్కన పెట్టాలి. ఒక గిన్నెలో క్రాబ్ మీట్, వెల్లుల్లి, అల్లం, కొత్తిమీర, గుడ్డు సొన, ఉప్పు, పచ్చిమిర్చి, మొక్కజొన్న పిండి.. అన్నీ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని పీతల డొప్పల మధ్యలో పెట్టి, మూసి, కాగుతున్న నూనెలో వేసి రెండు వైపులా వేయించాలి. ఏదైనా సాస్‌తో వడ్డించాలి. సొరకాయ మటన్ పులుసు కావల్సినవి: చింతపండు - 2 నిమ్మకాయల పరిమాణం అంత (కప్పు గుజ్జు తీయాలి); సోరకాయ - సగ భాగం (పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయాలి) మటన్ - 200 గ్రా.లు; బెంగుళూరు మిర్చి - 100 గ్రా.లు ఉల్లిపాయ - 2 (సన్నగా తరగాలి); కరివేపాకు - 2 రెమ్మలు కొత్తిమీర - చిన్న కట్ట; అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్ వెలుల్లి రెబ్బలు - 4 ; కారం - 2 టీ స్పూన్లు నూనె - 3 టేబుల్ స్పూన్లు; గరం మసాలా - అర టీ స్పూన్ పసుపు - అర టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: మటన్‌లో అర టీ స్పూన్ పసుపు వేసి, కొద్దిగా ఉడికించాలి. మందపాటి గిన్నెను స్టౌ మీద పెట్టి నూనె పోసి మిర్చి తరుగు, సొరకాయ ముక్కలు, ఉల్లిపాయతరుగు, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, పసుపు వేసి, కలిపి మగ్గనివ్వాలి. తరువాత మటన్ ముక్కలు, చింతపండు పులుసు, కారం, ఉప్పు, గరం మసాలా, ధనియాల పొడి, కొత్తిమీర వేసి కలిపి ఉడికించాలి. ముక్క ఉడికాక దించాలి. బేబీకార్న్ వడలు కావల్సినవి: బేబీ కార్న్ తరుగు - కప్పు మొక్కజొన్న గింజలు - కప్పు (కచ్చాపచ్చాగా గ్రైండ్ చేయాలి) పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్; నూనె - వేయించడానికి తగినంత పుదీనా - చిన్న కట్ట; ఉల్లిపాయలు - 4 (నిలువుగా తరగాలి) ఉప్పు - తగినంత; శనగపిండి - 50 గ్రా.లు బియ్యప్పిండి - 50 గ్రా.లు; అల్లం-వెల్లుల్లి ముక్కలు - అర కప్పు తయారీ: ఒక గిన్నెలో బేబీకార్న్ తరుగు, మొక్కజొన్న గింజల ముద్ద, అల్లం వెల్లుల్లి తరుగు, పచ్చిమిర్చి, పుదీన, ఉల్లిపాయ తరుగు, శనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు, తగినన్ని నీళ్లు పోసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి వేడి చేయాలి. పిండి మిశ్రమాన్ని చిన్న ఉండలు చేసి, చేత్తో అదిమి కాగిన నూనెలో వేసి రెండువైపులా బాగా వేయించి, తీయాలి. ఆవకాయ చేప కావల్సినవి: ఆవకాయ - 3 గరిటెలు; చేపలు (బోన్‌లెస్) - 200 గ్రా.లు నూనె - వేయించడానికి తగినంత; మైదా - కప్పు; మొక్కజొన్న పిండి - కప్పు ఉప్పు - తగినంత; కారం - టీ స్పూన్; మిరియాల పొడి - టీ స్పూన్ కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); పచ్చిమిర్చి - 4; గుడ్డు - 1 అల్లం-వెల్లుల్లి ముద్దు - టీ స్పూన్; అల్లం-వెల్లుల్లి సన్నగా తరిగిన ముక్కలు - 2 టేబుల్ స్పూన్లు ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి) తయారీ: ముందుగా చేపలను శుభ్రపం చేసి, ఒక గిన్నెలో వేసి అందులో గుడ్డు సొన, ఉప్పు, మిరియాలపొడి, కారం, అల్లం-వెల్లుల్లి ముద్ద, మైదా, మొక్కజొన్న పిండి వేసి బాగా కలపాలి. కడాయిలో నూనె పోసి కాగాక ఈ చేప ముక్కలను పకోడీల మాదిరి వేయించి తీసి పక్కన పెట్టాలి. తరువాత మరో కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అల్లం-వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయ తరుగు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆవకాయ పచ్చడి వేసి కలపాలి. దీంట్లో వేయించిన చేప ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కొత్తిమీర వేసి సర్వ్ చేయాలి. అరటి ఆకు కోడి కావల్సినవి: చికెన్ (బోన్‌లెస్) - 200 గ్రా.లు; అరటి ఆకు - 1 గరం మసాలా - అర టీ స్పూన్; జీలకర్ర పొడి - అర టీ స్పూన్ ఉల్లిపాయ - 1 (సన్నగా తరగాలి); కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట) పుదీన - కప్పు (చిన్న కట్ట); కారం - టీ స్పూన్; నూనె - 2 టేబుల్ స్పూన్లు అల్లం-వెల్లుల్లి ముద్ద - టీ స్పూన్; నిమ్మరసం - టీ స్పూన్; ఉప్పు - తగినంత తయారీ: ముందు చికెన్, గరంమసాలా, జీలకర్ర పొడి, కొద్దిగా అల్లం-వెల్లుల్లి ముద్ద వేసి కలపాలి. కడాయిలో నూనె పోసి ఉల్లిపాయ తరుగు, అల్లం-వెల్లుల్లి పేస్ట్, చికెన్ వేసి ఉడికించాలి. దీంట్లో నిమ్మరసం కలపాలి. తరువాత పుదీనా, కారం, కొత్తిమీర, ఉప్పు వేసి బాగా కలపాలి. రసం అంతా ఇంకిపోయేంతవరకు ఉంచి శుభ్రపరిచిన అరటి ఆకులోకి తీసి, అన్నివైపులా మడిచి, నిప్పుల మీద కాల్చి, తీయాలి. లేదంటే ఇడ్లీ పాత్రలో పెట్టి ఆవిరి మీద కూడా ఉడికించవచ్చు. మునగాకు పప్పు కావల్సినవి: పెసరపప్పు - 100 గ్రా.లు; కందిపప్పు - 100 గ్రా.లు మునగాకు - కప్పు; ఉప్పు - తగినంత; వెల్లుల్లి రెబ్బలు - 6 జీలకర్ర - టీ స్పూన్; కరివేపాకు - 2 రెమ్మలు; పచ్చిమిర్చి - 4 కొత్తిమీర తరుగు - 2 టీ స్పూన్లు (చిన్న కట్ట); ఉల్లిపాయల- 1(సన్నగా తరగాలి) చింతపండు రసం - 2 టేబుల్ స్పూన్లు; నూనె - 2 టేబుల్ స్పూన్లు, ఎండుమిర్చి - 2 పసుపు - అర టీ స్పూన్ ; ధనియాల పొడి - టీ స్పూన్ తయారీ: కుకర్‌లో పెసరపప్పు, కందిపప్పు వేసి కడిగి, తగినన్ని నీళ్లు పోసి, పసుపు నూనె వేసి ఉడికించి పక్కనుంచాలి. ఒక కడాయిలో నూనె పోసి, ఎండుమిర్చి, జీలకర్ర, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగనివ్వాలి. పసుపు, చింతపండు రసం పోసి, మునగాకు వేయాలి. ధనియాల పొడి, తగినంత ఉప్పు వేసి ఒక పొంగు వచ్చేవరకు ఉడికించి పప్పులో కలపాలి. చివరగా కొత్తిమీర వేసి, మరికాసేపు ఉడికించి దించాలి. వేడి వేడిగా అన్నం, చపాతీలోకి వడ్డించాలి. -
ఇంటిప్స్
కాకరకాయ కూరలో సోంపుగింజలు, బెల్లం వేస్తే చేదును లాగేస్తుంది. కూర రుచిగానూ ఉంటుంది. బంగాళదుంపలను వెల్లుల్లితో కలిపి ఉంచితే అవి చాలా రోజుల వరకు తాజాగా ఉంటాయి. పాల నుంచి జున్ను వడకట్టినప్పుడు ఆ నీరు పారపొయ్యకుండా పిండిలో కలుపుకోవచ్చు లేదా గ్రేవీకూరలో పోసి ఉడికిస్తే ఆ వంటకానికి మంచి రుచి వస్తుంది . అప్పడాలు వేయించే రోజున వాటిని ఎండలో పెడితే నూనె ఎక్కువ పట్టదు. బెండకాయలు తాజాగా ఉండాలంటే రెండువైపులా తొడిమెలు తీసేసి ప్లాస్టిక్ కవర్లో వేసి, ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇడ్లీ, దోసె పిండి చేయడానికి ముందు బియ్యం కొద్దిగా వేయించి తర్వాత నానబెట్టాలి. ఈ విధంగా చేస్తే ఇడ్లీ మెత్తగా, దోసె కరకరలాడుతూ వస్తాయి. పసుపు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే డబ్బాలో కొద్దిగా ఎండుమిరపకాయలు, రాళ్ల ఉప్పు వేసి ఉంచాలి. దోసె, పకోడీ, జంతికలు లాంటివి చేసేటప్పుడు కొద్దిగా పాలుపోసి పిండి కలపాలి. ఆ తర్వాత ఉప్పు కలపాలి. ఆ వంటకాలు రుచిగా, కరకరలాడుతూంంటాయి. -
ఇంటిప్స్
వేడినీళ్లలో ముంచిన కత్తిని వాడితే డ్రైఫ్రూట్స్‌ని సులభంగా కట్ చేయవచ్చు. నెయ్యి ఎక్కువ కాలం తాజాగా ఉండాలంటే అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసి ఉంచాలి. వంటగదిలో చీమల దండు అధికంగా ఉంటే దోసకాయను ముక్కలుగా తరిగి చీమలు తిరిగే చోట ఉంచాలి. వంకాయ ముక్కలు నల్లబడకుండా ఉండాలంటే కూరలో చెంచాడు పాలు పోయాలి. నానబెట్టిన గోరింటాకు పొడితో వెండి వస్తువుల్ని శుభ్రం చేస్తే అవి కొత్తవాటిలా మెరుస్తాయి. -
7 టన్నుల బెల్లం స్వాధీనం
ఖమ్మం జిల్లా: అశ్వారావుపేటలో అక్రమంగా నిల్వ ఉంచిన 7 టన్నుల బెల్లంను మంగళవారం ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బెల్లంను అక్రమంగా నిల్వ ఉంచారనే సమాచారంతో నాలుగు కిరాణా షాపులపై దాడి చేశారు. పోలీసులు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బెల్లం స్వాధీనం
అక్రమంగా బెల్లం రవాణ చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలం కోయలగూడెం గ్రామం నుంచి బెల్లం అక్రమంగా రవాణ చేస్తున్నారనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆరుగురు వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నారు. ఈ ఘటనలో ట్రాలీతో పాటు.. 18బస్తాల బెల్లం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పల్లీ... రుచి మనది కాదా?!
తిండి గోల పొడి చేసి పచ్చడి నూరినా, బెల్లం కలిపి అచ్చులో పోసినా, నూనెలో దోరగా వేయించినా... పల్లీలు... అదే వేరుశనగ గింజల రుచే వేరు. వంటకాల్లో పసందైన దినుసుగా భారతీయుల చేత ప్రశంసలు అందుకున్న పల్లీ పుట్టినిల్లు మన దేశం కాదంటే ఆశ్చర్యపోవాల్సిందే! కాని ఇది నిజం. సుమారు 7,600 ఏళ్ల కిందటే పెరూలో పల్లీ పురుడు పోసుకుందని పురాతత్వశాస్త్ర నిపుణులు కనిపెట్టినట్టు చరిత్ర చెబుతోంది. అయితే దీనిమీదా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. లెగ్యూమ్ జాతికి చెందిన పల్లీలు బ్రెజిల్లో పుట్టి ప్రపంచమంతటా వ్యాపించాయి అని మరో కథనమూ ఉంది. ఏది ఏమైనా పల్లీలు లేకుండా మనకు రోజు గడవదంటే మాత్రం ఒప్పుకొని తీరాల్సిన మాట. అంతగా పల్లీలను మన జీవనంలో కలిపేసుకున్నాం. ఆంగ్లంలో పీనట్, గ్రౌండ్నట్ అని పేరున్న పల్లీల ఉత్పిత్తిలో చైనా అగ్రస్థానంలో ఉండగా, మన దేశం రెండవస్థానంతో సరిపెట్టుకుంది. -
మార్కెట్‌కు కొత్త బెల్లం
క్రమంగా పెరుగుతున్న లావాదేవీలు పుంజుకుంటున్న ధర... క్వింటా రూ. 3530లు సానుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాల్లో ఆశ అనకాపల్లి: అనకాపల్లి మార్కెట్‌కు కొత్త బెల్లం వస్తోంది. వారం రోజులుగా పరిసర ప్రాంతా ల్లో తయారీతో మార్కెట్లో లావాదేవీలు పుంజుకుంటున్నాయి. ప్రధానంగా మునగపాక, కశింకోట, తిమ్మరాజుపేట ప్రాంతాల్లో బెల్లం వండుతున్నారు. దసరా నాటికి ఇది మరింత ఊపందుకుంటుంది. ధర సైతం ఆశాజనకంగా ఉండటంతో మార్కెట్ వర్గాల్లో ఆశావహ దృక్పథం కనిపిస్తోంది. హుద్‌హుద్ నష్టాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే బయటపడుతూ కొత్త సీజన్‌పై కోటి ఆశలు పెట్టుకుంటున్నారు. ఈ నెల ఒకటో తేదీన మార్కెట్‌కు 501 దిమ్మలు రాగా.. మొదటి రకం గరిష్టంగా క్వింటా రూ.2940లు ధర పలికింది. గురువారం మార్కెట్‌కు 1064 దిమ్మలు వచ్చాయి. మొదటి రకం రూ.3530లు పలకడంతో రైతుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. గతేడాది సెప్టెంబర్ లో మార్కెట్‌కు 5170 క్వింటాళ్ల బెల్లం రాగా, మొదటి రకం సరాసరి క్వింటా రూ. 3020లు పలికింది. అక్టోబర్‌లో హుద్‌హుద్ ధాటికి మార్కెట్‌ను కుదేలయింది. అప్పటి నష్టాల నుంచి రైతులు ఇప్పుడిప్పుడే తేరుకుంటూ బెల్లం తయారీ చేపడుతున్నారు. ఆశ, నిరాశల మధ్య... మార్కెట్లో ఈ ఏడాది బెల్లం లావాదేవీలపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. గతేడాది నాటి పరిస్థితులు ఉండవని వాతావారణ శాస్త్రవేత్తలు చెబుతున్నప్పటికీ, ఆర్థిక శాస్త్రవేత్తల ముందస్తు ధరల సూచికలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. అదే సమయంలో జిల్లాలో చెరకు విస్తీర్ణం సైతం సాధారణం కంటే 6వేల హెక్టార్లు తగ్గిపోయినట్టు గణాంకాలు పేర్కొంటున్నాయి. ఇవన్నీ మార్కెట్‌కు ప్రతికూల పరిస్థితులను ప్రస్పుటం చేస్తుండగా, బెల్లం వ్యాపారానికి మేలు కలుగుతుందనే వాదన కూడా లేకపోలేదు. తుమ్మపాల యాజమాన్యం ఇప్పటికీ గతేడాది బకాయిలు రైతులకు చెల్లించకపోవడం, రానున్న సీజన్‌కు సన్నాహాలు ప్రారంభం కాకపోవడంతో బెల్లం తయారీకే రైతులు మొగ్గు చూపుతున్నారు. ఇదే సమయంలో గోవాడ సైతం న ష్టాల్లోకి వెళ్లింది. పొరుగు జిల్లాకు చెందిన ప్రైవేట్ కర్మాగారం సైతం తక్కువ ధరకు అగ్రిమెంట్లు తీసుకోవడంతో బెల్లం తయారీయే మేలని రైతులు భావిస్తున్నారు. వినాయక చవితి, దసరా, దీపావళి పండగలు నాటికి లావాదేవీలు పెరుగుతాయని, ధర కూడా అనుకూలంగా ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆశపడుతున్నాయి. దీనికి సూచనగానే వారం రోజుల నుంచి మార్కెట్లో లావాదేవీలు ఊపందుకున్నాయి. ధర సైతం పుంజుకుంటోంది. ఈ సీజన్ బాగుంటుందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. -
సారా స్థావరాలపై ఎక్సైజ్ దాడులు: ఐదుగురి అరెస్ట్
నల్గొండ: ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు సారాస్థావరాలపై బుధవారం దాడులు నిర్వహించి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ జిల్లా దేవరకొండ, చెన్నంపేట, కొండమర్రిపల్లి గ్రామాల్లో ఎక్సైజ్ అధికారులు దాడులు నిర్వహించారు. నాటుసారా కోసం దాచిన 10వేల కిలోల బెల్లం, వంద కిలోల పటికను స్వాధీనం చేసుకుని ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. నల్గొండ ఎక్సైజ్ అధికారులతో పాటు స్థానిక ఎక్సైజ్ అధికారులు ఈ దాడుల్లో పాల్గొన్నారు. -
మన జాతీయాలు
రామలింగడి పిల్లి! పాలు కనబడితే పిల్లికి పండగే. కన్నుమూసి తెరిచేలోపే ఆ పాలను గుటుక్కుమనిపిస్తుంది. అలాంటి పిల్లి పాలను చూసి ‘వామ్మో’ అని పరుగెడితే ఆశ్చర్యమే కదా! ఓసారి తెనాలి రామలింగడికొక చిలిపి ఆలోచన వచ్చింది. పిల్లికి పాల మీద ఉండే ఇష్టాన్ని ‘భయం’గా మార్చాలని! ఒకరోజు పిల్లి కోసం కావాలనే వేడి పాలు సిద్ధం చేశాడు. విషయం తెలియక పాపం ఆ పిల్లి గటగటమని తాగడానికి ప్రయత్నించి నోరు కాల్చుకుంది. వెనక్కి తిరిగి చూడకుండా పరుగులు తీసింది. ఇక అప్పటి నుంచి పాలను చూస్తే చాలు... భయంతో పారిపోయేది. ఆ పిల్లిలాగే కొందరు ఉత్తుత్తి భయాలతో, అపోహలతో తమ ఇష్టాలను, అలవాట్లను మార్చేసుకుంటారు. అలాంటివారి గురించి చెప్పేటప్పుడు ‘అదంతా రామలింగడి పిల్లి వ్యవహారం’ అంటుంటారు. దొందు దొందేరా తొందప్పా... విమర్శ చేయడం మంచిదేగానీ సద్విమర్శ చేయాలి. ఎదుటి వారిని విమర్శించే ముందు మనల్ని మనం ఓసారి చెక్ చేసుకోవాలి. లేకపోతే పదిమందిలో తేలికైపోతాం. ‘‘విమర్శించే అర్హత నీకు లేదు. దొందు దొందేరా తొందప్పా అన్నట్లు ఉంది’’ అంటుంటారు కొందరు. ఇంతకీ తొందప్ప కథ ఏమిటంటే... పూర్వం ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. వారికి ఉన్న నత్తి కారణంగా పదాలను సరిగ్గా పలకలేకపోతున్నారు. వారి సంభాషణ విన్న ఒకడు బిగ్గరగా నవ్వుతూ- ‘‘దొందు దొందేరా తొందప్పా’’ అన్నాడట. అలా ఎందుకన్నా డంటే... నిజానికి ఇతడికి కూడా నత్తి ఉంది. తన మిత్రుడి పేరు కొండప్ప. ఆ పేరు సరిగ్గా పలకలేక ‘తొందప్పా’ అన్నాడన్నమాట! బెల్లం కొట్టిన రాయి రాయితో ఏ వస్తువును కొట్టినా శబ్దం వస్తుంది. కానీ బెల్లపు అచ్చును కొట్టినప్పుడు మాత్రం తక్కువ శబ్దం వస్తుంది. చాలాసార్లు రాయికి బెల్లం పేరుకుపోయి, ఆ బరువుతో శబ్దమే చేయదు. అంటే రాయి కాస్తా తన సహజమైన లక్షణాన్ని కోల్పోయిందన్నమాట. మనిషన్నాక భావోద్వేగాలు ఉంటాయి. ఉండాలి కూడా! సున్నితమైన భావోద్వేగాలకు సంబంధించిన విషయాలే కాదు... సామాజిక సంచలనాలు, వర్తమాన ధోరణులు... ఇలా రకరకాల విషయాలపై మనిషి సహజంగానే స్పందిస్తాడు. కొందరు మాత్రం వీటికి అతీతంగా ఉంటారు. ప్రకృతి అందాల నుంచి విలయాల వరకు వారిని ఏవీ ప్రభావితం చేసినట్లుగా అనిపించవు. ఎప్పుడూ ఒకే మూడ్‌తో స్పందనా రాహిత్యంతో కనిపిస్తారు. ఇలాంటి వారిని ‘బెల్లం కొట్టిన రాయి’తో పోల్చుతారు. చేతడి ఆరేలోపే! బద్ధకంగా, తీరుబడిగా చేసేవారి కంటే వీలైనంత త్వరగా పని పూర్తి చేసేవారికి ఎక్కువ గుర్తింపు వస్తుంది. అలా వేగంగా పని చేసేవారికి తగిన ప్రాధాన్యత కూడా లభిస్తుంది! అటువంటి పనిమంతుల ప్రతిభ గురించి మాట్లాడేటప్పుడు వాడే జాతీయం ఇది. ‘అతనికి పని అప్పజెప్పి చూడు... చేతడి ఆరేలోపు పూర్తి చేస్తాడు’ అని అంటారు. చేతికి పట్టిన చెమట, నీటి తడి ఆరడానికి పెద్దగా సమయమేమీ పట్టదు. అంత తక్కువ సమయంలో చేసేస్తాడు అని చెప్పడమే అందులోని ఉద్దేశం! -
బెల్లం మార్కెట్‌కు ఆషాడం దెబ్బ
- లావాదేవీలు నామమాత్రం - తగ్గిపోతున్న ధరలు - గిట్టుబాటుకాక రైతుల ఆందోళన అనకాపల్లి: బెల్లం తయారీ సీజన్ ముగియడంతో జాతీయ స్థాయిలో రెండవ స్థానంలో ఉన్న అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు మందగించాయి. ఒకవైపు అన్ సీజన్, మరోవైపు ఆషాడమాసం కావడంతో ధరలు నేలచూపులు చూస్తున్నాయి. ఏప్రిల్, మే వరకూ తయా రు చేసిన బెల్లాన్ని ప్రస్తుతం గోదాముల్లో నిల్వ చేస్తున్నారు. గతేడాది హుద్‌హుద్ ధాటికి కకావికలమైన అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఇంకా చేదు ఫలితాలు కనిపిస్తున్నాయి. అనకాపల్లి మార్కెట్‌కు శనివారం 195 బెల్లం దిమ్మలు మాత్రమే వచ్చాయి. అక్టోబర్ వరకూ ఇదే తరహా పరిస్థితులు కొనసాగేలా ఉంది. ధరలు సైతం మార్కెట్ వర్గాలను నిరాశ పరుస్తున్నాయి. మొదటి రకం బెల్లం రాకపోవడం ప్రతికూల స్థితిని ప్రస్పుటం చేస్తుండగా, రెండో రకం గరిష్టంగా క్వింటా రూ. 2480లు, మూడో రకం కనిష్టంగా క్వింటాల్ రూ. 2210లు ధర పలుకుతున్నాయి. దీంతో మార్కెట్ బోసిపోయినట్టు కనిపిస్తోంది. గతేడాది జూలైలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది జూలైలో కేవలం 2014 క్వింటాళ్ల లావాదేవీలు మాత్రమే సాగాయి. మొదటి రకం గరిష్టంగా రూ. 2838లు, కనిష్టంగా రూ. 2540లకు అమ్ముడుపోయింది. నెలంతా కేవలం 45,47,122 రూపాయల వ్యాపారమే జరిగింది. 2013లో మార్కెట్లో క్వింటా గరిష్టంగా రూ.4వేలు దాటిన సందర్భం ఉంది. ఇదే దూకుడు 2014లోనూ కొనసాగుతుందని మార్కెట్ వర్గాలు ఆశించినప్పటికీ ప్రతికూల పరిస్థితులే ఎదురయ్యాయి. చివరకు గతేడాది హుద్‌హుద్ మార్కెట్‌ను కోలుకోలేని దెబ్బతీసింది. 2015లో కూడా మార్కెట్లో ప్రతికూల పరిస్థితులే కొనసాగుతున్నాయి. చెరకు రైతు విలవిల... రోజురోజుకు బెల్లం ధరలు తగ్గిపోవడంతో చెరకు రైతులు ఆందోళన చెందుతున్నారు. క్వింటా ధర రూ.2210లకు పడిపోవడం, చక్కెర మిల్లులు టన్నుకు రూ. 2300లకు మించి చెల్లించకపోవడంతో వారికి మింగుడు పడడంలేదు. చెరకు సరఫరా చేసిన సభ్య రైతులకు నెలల తరబడి చెల్లింపులు లేకపోవడంతో అప్పుల పాలవుతున్నారు. మిల్లులకు తరలించే బదులు బెల్లం తయారు చేసుకుందామన్నా...మార్కెట్లో గిట్టుబాటు ధర లభించడం లేదు. పరిస్థితులు చెరకు రైతులను నిరాశకు గురిచేస్తున్నాయి. -
చిక్కుల్లో చక్కెర
►తుమ్మపాల కర్మాగారానికి నిధులిచ్చేందుకు ఆప్కాబ్ వెనుకంజ ►చక్కెర కర్మాగారాల రుణానికి గ్యారంటీ ఇవ్వని ప్రభుత్వం ►సహకార రంగంపై సవతి తల్లి ప్రేమ ►ఇచ్చిన మాట నిలబెట్టుకోని బాబు ►ఎన్నికల హామీపై ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు ►అప్పుల్లో రైతులు.. ఆందోళనలో సుగర్ ఉద్యోగులు అనకాపల్లి: చెరకు ఉత్పత్తుల్లో ఒక్కటైన బెల్లం లావాదేవీల్లో జాతీయ స్థాయి కీర్తిని ఆర్జించిన అనకాపల్లి.. చక్కెర కర్మాగారం విషయంలో మాత్రం అవస్థల పాలవుతోంది. మాటల గారడీతో గద్దెనెక్కిన పాలకులు ఇంకా రైతుల్ని మాయ మాటలతో మోసం చేస్తున్నారు. సహకార రంగానికి పూర్వవైభవం తీసుకొస్తున్నామని చెబుతున్న ప్రభుత్వం సహకార రంగంలో కొనసాగుతున్న కర్మాగారాలకు రుణం వచ్చే విషయంలో గ్యారంటీ కూడా ఇవ్వకుండా చోద్యం చూస్తోంది. ఏడాది క్రితం స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఇచ్చిన మాటకు విలువలేకుండా పోయింది. ఎన్నికల ముందు తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణ తన లక్ష్యమని చెప్పుకున్న టీడీపీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత హామీని గాలికొదిలేశారు. అప్పుకు సైతం నోచుకోని దయనీయ స్థితి : భవితవ్యంపై స్పష్టత లేని తుమ్మపాల కర్మాగార యాజమాన్యానికి అప్పు సైతం పుట్టడంలేదు. ఉన్న వనరులతో ఏదోలా నెట్టుకొద్దామని యాజమాన్యం భావిస్తున్నా పైసలు లేక తలలు పట్టుకుంది. ఆప్కాబ్ సహాయంతో కొద్దిగా రుణం పొందాలని అనుకున్నా ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వకపోవడంతో 3 కోట్ల రుణం మంజూరు ప్రక్రియ నిలిచిపోయింది. గానుగాటకు సన్నాహాలు లేవు: 2015-16 సీజన్‌కు సంబంధించి తుమ్మపాల కర్మాగారం పరిధిలో గానుగాటకు సన్నాహాలు మొదలుకాలేదు. ఖజానాలో ఒక్క పైసా కూడా లేకపోవడంతో ఎటువంటి కదలిక లేకుండా పోయింది. గానుగాటకు ముందు ఓవర్‌హాలింగ్ చే యాల్సి ఉన్నప్పటికీ నిధుల కొరతతో యాజమాన్యం చేతులెత్తేసింది. కనీసం 70లక్షల రూపాయిల నిధులుంటేనే ఓవర్‌హాలింగ్ సాధ్యమవుతుంది. గత ఏడాది ఓవర్‌హాలింగ్ కో సం వినియోగించిన సామాగ్రి కొనుగోలుకు సంబంధించి రూ. 50 లక్షలు ఇం కా యాజమాన్యం చెల్లించాల్సి ఉంది. కమిటీలతో కాలయాపన : చంద్రబాబు ప్రభుత్వం సహకార చక్కెర కర్మాగారాల భవితవ్యం కోసం ఇప్పటికే ఒక కమిటీని నియమించగా, కమి టీ నివే దికలు ఏమయ్యాయో తెలి యదు. తాజాగా ముగ్గురు మంత్రుల తో కూడిన ఉపసంఘం సహకార కర్మాగాల భవితవ్యంపై ఎటువంటి నిర్ణయాలు తీసుకుకోకుండానే కాలయాపన చేస్తోంది. అప్పులు.. ఆందోళనలే.. : తుమ్మపాల కర్మాగారం ఆధునీకరణకు కనీసం రూ.800 కోట్లు అవసరమని యాజమాన్యం చెబుతోంది. అది కూడా కర్మాగారం ఏటా లక్ష టన్నులకు పైబడి క్రషింగ్ చేస్తేనే సుగర్కేన్ డవలప్మెంట్ ఫోరం అనుమతిస్తుంది. ప్రస్తుత పరిస్థితుల్లో రెండూ సాధ్యం కాదు. ఇక కర్మాగారంలో పనిచేస్తున్న 36 మంది రెగ్యులర్ ఉద్యోగులకు రూ.60 లక్షల జీతాల బకాయిలు, తాత్కాలిక ప్రాతిపదికన పనిచేసే ఉద్యోగులకు రూ.కోటి బకాయిలు, రైతులకు చెల్లించాల్సిన మద్దతు ధర బకాయిలు 3.56 కోట్ల వరకూ ఉ న్నాయి. కర్మాగారం భవితవ్యంపై స్పష్టత రాకపోవడంతో రైతులు అప్పుల్లో, ఉద్యోగలు ఆందోళనలో కొట్టుమిట్టాడుతున్నారు. ఎమ్మెల్యే పిల్లిమొగ్గలు : ఎన్నికలకు ముందు పీలా గోవింద సత్యనారాయణ కర్మాగారం ఆధునీకరణే లక్ష్యమని చెప్పారు. పదవిలోకి వచ్చి ఏడాది దాటుతున్నా ఆయన దాటవేత వైఖరితో వ్యవహరిస్తున్నారు. ఆధునీకరణ చేయకుంటే రాజీనామా చేస్తానన్న ఎమ్మెల్యే తన మాటకు కట్టుబడాలని రైతులు అంటున్నారు. గత ఆగస్టు మొదటి వారంలో కర్మాగారంలో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునీకరణకు సంబంధించిన కమిటీ వేసి త్వరలోనే తీపికబురు చెబుతామని నమ్మించినా ఇప్పటికీ ఏ కబురూ లేదు. -
మనకేదీ చెత్తశుద్ధి!
ఝాన్సీ కి వాణీ వట్టిమాటలు కట్టిపెట్టోయ్.. గట్టిమేల్ తలపెట్టవోయ్ !! వెన్నుతట్టి లేపిన చిరు పట్టణంలోని చెత్త మూటల నిర్వహణ ముందు మహానగర పెద్దరికం చిన్నబోయింది. గతవారం ఓ సినిమా షూటింగ్ కోసం బొబ్బిలిలో ఉన్నాను. విజయనగరం జిల్లాలోనే ప్రత్యేక స్థానం సంపాదించిన బొబ్బిలిలో విశేషాలన్నీ ఒక్కొక్కటిగా చూస్తున్నాను. బొబ్బిలి కోట, వేణుగోపాల స్వామి దేవాలయం, వీణల తయారీ అన్నీ చూసి చివరగా అక్కడి బెల్లం కూడా బావుంటుందని ఓ బెల్లం బట్టీలో వేడి వేడి బెల్లం కొన్నాను. మట్టి ముంతలోని మెత్తని బెల్లం ముచ్చటగా ఉంది. రాత్రికి గట్టి పడుతుందని జాగ్రత్తగా పట్టుకుని కోటలో షూటింగ్‌కు వెళ్లిపోయాను. ముంత మీద కవర్ కట్టి సీల్ చేయడానికి ఏదైనా పాలిథిన్ కవర్ ఉంటే ఇవ్వమని ఆ కోటలో పని చేస్తున్న సూపర్వైజర్ను అడిగాను. వెంటనే కోటలో హడావిడి మొదలైంది. మేడంగారు మైకా కవర్ అడిగారంటూ కోటంతా పాకిపోయింది. ఇంత చిన్న విషయానికి అంత హడావిడి ఎందుకో అర్థం కాలేదు. చివరికి అక్కడి వంట మనిషి నా దగ్గరకొచ్చి ‘ఎందుకమ్మ మైకా కవర్ కోసం అందరినీ ఇబ్బంది పెడతావు, పేపర్ తెచ్చి తాడుతో కట్టేసుకోవచ్చును కదా’ అని జ్ఞానోపదేశం చేసింది. బొబ్బిలిలో నో పాలిథిన్.. ఇంతకీ మైకా కవర్ వెనుక ఈ హడావిడి ఏంటంటే బొబ్బిలి మున్సిపాలిటీలో పాలిథిన్ నిషేధం. ఇందులో వింతేముంది. మన దగ్గర కూడా ఇంతే కదా అనుకోకండి. ఇక్కడ మనం చుట్టూ ఉన్నా కూడా పట్టించుకోం. అక్కడి ప్రజలు చట్టాన్ని వంట బట్టించుకున్నారు. తు.చ. తప్పకుండా నియమ నిబంధనలను పాటిస్తూ పాలిథిన్ కవర్లు, గ్లాసులు, ప్లేట్లు వంటి వాటిని తమ జీవితాల నుంచి తుడిచి వేసిన ఈ నవనాగరికులను చూసి ఎంతో గర్వపడ్డాను. అక్కడ పర్యావరణం కేవలం నినాదం కాదు జీవన విధానం. నేను కలసిన ఈ కోటలోని ఉద్యోగులే కాదు బయటకు వచ్చి ఎవరిని కదిపినా ఇదే సమాధానం వచ్చింది. అక్కడ పాలిథిన్ వాడినా, రోడ్డుపై చెత్త వేసినా జరిమానా కట్టాల్సిందే. ఇందులో అమలుపరుస్తున్న యంత్రాంగం పాత్ర ఎంతుందో ప్రజల భాగస్వామ్యం కూడా అంతే ఉంది. మహానగరంలో నివసిస్తున్న మహానుభావులంతా.. నాగరికతకు ఆనవాళ్లు అని చాటుకునే వారు దూరంగా విసిరేనట్టున్న మున్సిపాలిటీ నుంచి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది. తడిని తరిమి.. బొబ్బిలి మున్సిపాలిటీలో ప్రతి ఇంటి నుంచి చెత్త సేకరించేటప్పుడే తడి చెత్తని వేరు చేసే బాధ్యతని ప్రజలే అలవరుచుకున్నారు. ఆరెంజ్, బ్లూ రెండు రంగుల బుట్టలో చెత్తను సేకరించి డంపింగ్ యార్డ్‌కు తరలిస్తారు. సారీ, అది డంపింగ్ యార్డ్ అంటే వారు ఒప్పుకోరు. దాని పేరు ఎస్డబ్ల్యూఎమ్ (సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్) పార్క్. నిజంగానే అది సుందరవనంగా కనిపించింది. మన హైదరాబాద్ జవహర్‌నగర్‌లోని డంపింగ్ యార్డ్‌ని బాగుచేయడం ఆ భగవంతుడి తరం కూడా కాదేమో అని అనుమానం వస్తుంది. ఎంత ఆధునిక టెక్నాలజీ సాయం ఉందనుకున్నా.. మన చెత్త కొండలా పేరుకుపోతోంది. ప్రజల భాగస్వామ్యం పెరగనంత వరకూ హైదరాబాద్‌లోని చెత్తకు పరిష్కారం దొరకదు. స్టిక్ ఫర్ నో ప్లాస్టిక్.. ప్లాస్టిక్, పాలిథిన్ మన చెత్తలో అత్యంత పెద్ద సమస్య. దాని నియంత్రణ వినియోగం దగ్గరే జరగాలి. మైక్రాన్ల పెరుగుదల ఒక్కటే పాలిథిన్‌కు పరిష్కారం కాదు. రీసైక్లింగ్ వరకూ రాని ప్లాస్టిక్ ఎటు చూస్తే అటు పేరుకుపోతోంది. పార్కులు, చెరువులు, గుట్టలు, మైదానాలు, నాలాలు.. ఎటు చూసినా ప్లాస్టిక్ మయం. దీనికి పూర్తి విరుద్ధంగా బొబ్బిలి పరిసర ప్రాంతాల్లో ఎక్కడా పాలిథిన్ కనబడదు. వస్తువు కొనాలన్నా, చెత్త మూట కట్టాలన్నా.. కవర్లు కావాలనుకుంటే డబ్బుకు సైతం వెనుకాడకుండా కొనేస్తాం. టీ తాగాలన్నా, పార్సిల్ చేయాలన్నా, పార్టీలైనా ప్లాస్టిక్‌ని యూజ్ అండ్ త్రోగా వాడేస్తాం. కన్వీనియన్స్ మాట అటుంచితే.. చెత్తభారం ఎంత పెచుతున్నామో కనీసం ఆలోచించం. పెరుగుతున్న క్యాన్సర్‌కి పాలిథిన్, ప్లాస్టిక్ వినియోగానికి ఉన్న సంబంధం గురించి తెలిసినా తేలిగ్గానే తీసుకుంటున్నాం. లక్షల్లో ఉన్న జనాభాకి వేలల్లోని జనాభా స్ట్రాటజీలు ఉపయోగ పడకకోవచ్చు. కాని, గ్రామీణ ప్రజలకు ఉన్న అవగాహన నగరవాసుల్లో ఎందుకు లేదు ? అన్నింట్లోనూ ఆధునికంగా జీవిస్తున్న మనం ఇందులో మాత్రమే ఎందుకు వెనుకబడి ఉన్నాం. బొబ్బిలి పరిశుభ్రతలో పది శాతం అయినా పురోగతి హైదరాబాద్ సాధించాలంటే వంద శాతం ప్రజల భాగస్వామ్యం కావాలి. లెట్స్ స్టార్ట్ టు డే! facebook.com/anchorjhansi ఫొటో: ఎస్.ఎస్.ఠాకూర్ -
రికార్డు స్థాయిలో బెల్లం లావాదేవీలు
కళకళలాడిన మార్కెట్ యార్డు ఈ సీజన్‌కు ఇదే అత్యధికం మొదటిరకం క్వింటా రూ. 3వేలు అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం రికార్డుస్థాయిలో లావాదేవీలు సాగాయి. అమ్మకం, కొనుగోలుదారులతో యార్డులన్నీ కళకళలాడాయి. మార్కెట్‌కు 57,455 దిమ్మలు వచ్చాయి. మొదటిరకం క్వింటా రూ. 3 వేలు ధర పలికింది. దిగుమతి, ఎగుమతి వర్తకుల వేలంపాటలతో అంతటా సందడి నెలకొంది. ఈ సీజన్ ప్రారంభంలో బెల్లం లావాదేవీలపై హుద్‌హుద్ ప్రభావం గట్టిగానే కనిపించింది. అయినా రైతులు పెద్ద మొత్తంలో బెల్లాన్ని తయారు చేశారు. ఈక్రమంలో గతేడాది డిసెంబర్ 29న 32,644 దిమ్మలు, ఈ నెల 12న 37,431 దిమ్మలు అత్యధికంగా మార్కెట్లో లావాదేవీలు సాగాయి. మంగళవారం ఏకంగా అరలక్షకు పైబడి దిమ్మలు రావడంతో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. మొదటిరకం క్వింటా రూ. 3వేలు ధర పలికింది. రైతులకు పరవాలేదనిపించింది. వాస్తవానికి ఈ నెల 7న బెల్లం మార్కెట్లో మొదటిరకం రూ.3340లు పలకగా,సంక్రాంతి ముందు రోజు గణనీయంగానే బెల్లం ధర పడిపోయింది. ఈదశలో లావాదేవీలు నాలుగోవారం పుంజుకోవడం మార్కెట్ వర్గాలకు ఉత్సాహాన్ని నింపింది. అనకాపల్లి మార్కెట్ నుంచి బెల్లం కలకత్తా, ఒడిశా తదితర ప్రాంతాలకు ఎగుమతి అవుతున్నప్పటికీ, తెలంగాణకు సరఫరా అయ్యే బెల్లం విషయంలో ఎదురవుతున్న సవాళ్లు ధరలను ప్రభావితం చేస్తున్నట్టు ఇక్కడి వర్తకులు చెబుతున్నారు. -
బెల్లానికి కష్టం
గతమెంతో ఘనం.. నేడు దైన్యం జాడలేని మార్క్‌ఫెడ్ కొనుగోలు కేంద్రాలు బయటి మార్కెట్లో గిట్టుబాటుకాని ధర క్వింటాళుకు రూ.3 వేలు ఇవ్వాలంటున్న రైతులు కొనుగోలుకు అంతగా ఆసక్తి చూపని వ్యాపారులు ఇప్పటికే భారీగా తగ్గిపోయిన చెరుకు సాగు తీపి పంచే కర్షకుడికి మిగులుతున్నది చేదే కామారెడ్డి : బెల్లం కొనుగోలు విషయాన్ని మార్క్‌ఫెడ్ అధికారులు మరిచిపోయారు. మరోవైపు ఆరుగాలం కష్టించి చెరుకు పండించిన రైతులు బెల్లం తయారీకి రాత్రీపగలు తేడా లేకుండా కష్టపడుతున్నారు. ఇంత చేసినా బెల్లాన్ని అమ్ముకోవడానికి కొనుగోలు కేంద్రాలు లేకపోవడం, మార్కెట్లో ధర గిట్టుబాటు కాకపోవడంతో మిగిలేది ఏమీ లేదని రైతులు వాపోతున్నారు. అనధికార ఆంక్షలను బూచిగా చూపుతూ బెల్లం వ్యాపారులు కొనుగోలుకు ఆసక్తి చూపక పోవడంతో ధరలు పెరగడం లేదు. గతేడాది మార్క్‌ఫెడ్ అధికారులు క్వింటాళుకు రూ.2,600 చొప్పున కొనుగోలు చేశారు. డబ్బుల చెల్లింపు విషయంలో ఆలస్యం జరిగినా ధర కొంత అనుకూలంగా ఉండేది. ఈ సారి కొనుగోలు కేంద్రాల సంగతిని మార్క్‌ఫెడ్ అధికారులు పట్టించుకోవడం లేదు. దీంతో రైతులు బెల్లాన్ని అమ్ముకోవడానికి అవస్థలు పడుతున్నారు. బెల్లం తయారీలో కామారెడ్డి టాప్ బెల్లం ఉత్పత్తిలో తెలంగాణలోనే కామారెడ్డి ప్రాంతం ఉన్నత స్థానంలో ఉండేది. అప్పట్లో ఏటా కామారెడ్డి డివిజన్లో 60వేల ఎకరాల నుంచి 70 వేల ఎకరాల వరకు చెరుకు పంట సాగయ్యేది. వందలాది లారీలలో బెల్లం గుజరాత్, మహారాష్ట్ర, కర్నాటక వంటి రాష్ట్రాలకు తరలిపోయేది. చెరుకు పంట నరికివేతకు రాకన్నా ముందే క్ర షర్లను, పొయ్యిలను రెడీ చేసుకునేవారు. ఏ ఊరికి వెళ్లినా వందలాది క్రషర్లు నడిచేవి. రాత్రి, పగలు తేడా లేకుండా రైతులు క్రషర్ల వద్ద పనులలో నిమగ్నమయ్యేవారు. బెల్లం తయారు చేసిన రైతులేగాక, బెల్లం వ్యాపారులు కూడా లాభాలు ఆర్జించేవారు. ఇదంతా గతం. ఇప్పుడు బెల్లం పేరెత్తితే చాలు పెదవి విరుస్తున్నారు. చెరుకు పం ట సాగు నుంచి మొదలుకొంటే బెల్లం తయారీదాకా అన్ని రకాల పెట్టుబడులు భారీగా పెరిగాయి. కామారెడ్డి ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే నల్లబెల్లంపై అప్పట్లో తెలుగు దేశం ప్రభుత్వం విధించిన ఆంక్షల ప్రభావంతో ధరలు పడిపోయి తయారీకి బ్రేకులు పడ్డాయి. ఇప్పుడు కామారెడ్డి డివిజన్లో 20 వేల ఎకరాలకు మించి చెరుకు పంట సాగు కావడం లేదు. ఆంక్షలపై బెల్లం రైతులు ఎన్నో పోరాటాలు చేశారు. భిక్కనూరులో ఆందోళనలు తీవ్రరూపం దాల్చి పోలీసు లాఠీచార్జీ చేయడంతో, కోపోద్రిక్తులైన రైతులు పోలీసు వాహనాలను, బస్సులను ధ్వంసం చేశారు. ఈ సంఘటన అప్పట్లో సంచలనం రేపింది. 40 మంది వరకు రైతులను జైలుకు పంపించారు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయిన తరువాత బెల్లంపై ఆంక్షలను ఎత్తివేశారు. గత రెండుమూడేళ్ల కాలంలో బెల్లంపై అనధికార ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఇటీవల రైతులు, వ్యా పారులు సీఎం కేసీఆర్‌ను కలిసి విన్నవించగా ఎలాంటి ఇబ్బందులు పెట్టొద్దని అధికారులను ఆదేశించారు. అయినప్పటికీ మార్కెట్లో బెల్లం ధరలు పెరగడం లేదు. భారీగా పెరిగిన బెల్లం తయారీ ఖర్చు చెరుకు సాగుతోపాటు, బెల్లం తయారీ విషయంలోనూ ఖర్చులు భారీగా పెరిగాయి. సాగుకు ఎకరానికి రూ.45 వేల నుంచి రూ.50 వేల వరకు ఖర్చవుతుంది. బెల్లం తయారీకి ఎకరాకు రూ. 25 వేల వరకు ఖర్చవుతుంది. మొత్తంగా ఎకరాకు రూ.70 వేల నుంచి రూ.80 వేల వరకు ఖర్చవుతుంది. ప్రస్తుతం మార్కెట్లో బెల్లం క్విం టాళుకు రూ.2,300 ధర పలుకుతోంది. ఎకరాకు 250 ముద్దల బెల్లం తయారవుతుంది. ఒక్కో ముద్ద తయారీకి రూ. వంద ఖర్చవుతుంది. బెల్లం 35 క్వింటాళ్ల వరకు అవుతోంది. అమ్మడం ద్వారా రూ.80 వేల ఆదాయం వస్తోంది. ఖర్చులకు రూ.80 వేల వరకు వెచ్చించాల్సి వస్తోంది. పెట్టుబడి, ఆదాయం ఒకే స్థాయిలో ఉంటోంది. దీంతో ఏడాది శ్రమించినా మిగులుబాటు ఉండడం లేదు. అందరికీ తీపిని పంచే రైతులు తమకు మాత్రం చేదు తప్పదడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమవైపు చూడాలని వేడుకుంటున్నారు. -
చంద్రన్న గిప్ట్ తంతులో మరో వివాదం
హైదరాబాద్: చంద్రన్న సంక్రాంతి గిప్ట్ తంతులో మరో వివాదం తెర మీదికి వచ్చింది. తాజాగా బెల్లం స్కాం వెలుగులోకి వచ్చింది. అనకాపల్లి మార్కెట్లో కేజీ బెల్లం గరిష్ట ధర 30 రూపాయిలు ఉండగా, పౌర సరఫరాల శాఖ మాంత్రం కేజీ రూ.54కు టెండర్ ఖరారు చేసింది. కేజీకి రూ.20 అదనంగా చెల్లించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమైంది. టెండర్‌దారులు రిటైల్ మార్కెట్ కంటే అదనపు ధరను దక్కించుకోవటంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో అధికారులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కయినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దాంతో ధరను చూసి బెల్లం వ్యాపారులు ఆశ్చర్యపోతున్నారు. మరోవైపు చంద్రన్న కానుక అందుకునేందుకు జనాలు రేషన్ షాపులు వద్ద బారులు తీరారు. అయితే సంగమందికే సరిపడా సరుకులు రావటంతో అధికారుల్లో హైరానా మొదలైంది. -
రైస్‌మిల్లుల్లో నల్లబెల్లం డంప్‌లు
జోరుగా చీకటి వ్యాపారం * బియ్యం చాటున బెల్లం, పటిక విక్రయాలు * రోజు రూ.5 లక్షల వ్యాపారం * పోలీసుల సహకారంతోనే బిజినెస్ భీమారం : రైస్‌మిల్లులు, పాడుబడిన గోదాంలు, జనావాసం లేని భవనాల్లో చీకటి వ్యాపారం సాగుతోంది. హసన్‌పర్తి కేంద్రంగా బెల్లం, పటిక వ్యాపారం మూడు పూలు, ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. శనివారం ఎక్సైజ్ అధికారులు సీతంపేట క్రాస్‌లోని ఓ రైస్‌మిల్లులో దాడులు నిర్వహించగా భారీగా బెల్లం నిల్వలు పట్టుబడిన విషయం తెలిసిందే. 15 ఏళ్లుగా ఎక్సైజ్ అధికారులు ఇంత పెద్దమొత్తంలో బెల్లం, పట్టికను స్వాధీనం చేసుకోలేదని ఎక్సైజ్ అధికారులే చెప్పడం గమనార్హం. జిల్లాలో నల్లబెల్లం వ్యాపారులు సిండికేట్‌గా మారినట్లు తెలుస్తోంది. పరకాలకు చెందిన బెల్లం వ్యాపారి సదాశివుడు నగరానికి చెందిన మరో వ్యాపారితో కలిసి.. రెండున్నర ఏళ్లుగా ఈ బిజినెస్ చేస్తున్నట్లు ఎక్సైజ్ అధికారుల విచారణలో వెల్లడైంది. సదాశివుడికి పరకాలలో బెల్లం షాపు ఉంది. ఇందులో అతడు ప్రజల అవసరాలకు బెల్లం విక్రయించాల్సి ఉండగా.. గుడుంబా తయూరీ కోసం నల్లబెల్లం, పటిక విక్రయిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. హసన్‌పర్తి పరిసర ప్రాంతాలకు రవాణా పరకాల నుంచి ప్రతి రోజు వివిధ ప్రాంతాలకు బెల్లం, పటిక దిగుమతి చేయడానికి ఇబ్బందవుతుందనే ఉద్దేశంతో సీతంపేట క్రాస్ వద్ద ఉన్న ఓ రైస్‌మిల్లును లీజుకు తీసుకున్నట్లు తెలిసింది. ఈ క్రమంలోనే రైస్‌మిల్లులో పెద్దఎత్తున బెల్లం, పటిక నిల్వ చేశాడు. ఇక్కడి నుంచి ట్రాలీ, ఆటోల ద్వారా నగర పరిధిలోని కోమటిపల్లి, హరిశ్చంద్రనాయక్ తండా, సిద్దాపురం, గుండ్లసింగారం, సీతంపేట, మడికొండ, కడికొండకు బెల్లం సరఫరా చేస్తుండేవారు. ఈ ప్రాంతాలకు రోజూ సుమారు రూ.5 లక్షల వ్యాపారం చేస్తున్నారంటే గుడుంబా తయూరీ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. అయితే గుట్టుచప్పుడు కాకుండా చేసిన వ్యాపారం.. మూడు నెలలకే రట్టయిపోయింది. -
బెల్లం మార్కెట్‌కు చేదు ఫలితం
అనకాపల్లి: అనకాపల్లి బెల్లం మార్కెట్లో ఏడాదికేడాది లావాదేవీలు తగ్గిపోతున్నాయి. 2014-15 సీజన్ చేదు గణాంకాలను నమోదు చేసుకోనుంది. మా ర్కెట్ వర్గాలే పరిస్థితి నిరాశజనకంగా ఉంటుందని పేర్కొంటున్నాయి. హుద్‌హుద్ ప్రభావంతో లావాదేవీలు 50శాతం తగ్గిపోనున్నాయని విశ్లేషిస్తున్నాయి. ప్రస్తుతం పొలాల్లోని చెరకు తోటలు దయనీయ స్థితిలో ఉన్నాయి. ఈ కారణంగా బెల్లం దిగుబడులు బాగా తగ్గిపోయే ప్రమాదముందని అంటున్నారు. దీనివల్ల టర్నోవర్‌తో పాటు మార్కెట్‌కు లభించే సెస్ కూడా తగ్గనుంది. గతేడాది అక్టోబర్‌లో 7981 క్వింటాళ్ల బెల్లం (రూ.2.27 కోట్లు) లావాదేవీలు జరగ్గా, ఈ ఏడాది అదే నెలలో కేవలం 4942 క్వింటాళ్ల బెల్లం (రూ.1.19 కోట్లు) లావాదేవీలు ఇందుకు నిదర్శనం అంటున్నారు. 2013-14 సీజన్లో 6,06,475.4 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.144.65 కోట్ల వ్యాపారం జరిగింది. 2014-15 సీజన్లో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు 1,87,079 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలతో రూ.41.03 కోట్ల వ్యాపారం జరిగింది. గత సీజన్ లావాదేవీలను చేరుకోవాలంటే రానున్న ఐదు నెలల్లో రూ.వంద కోట్లు పైబడి వ్యాపారం జరగాలన్నమాట. సోమవారం 3888 బెల్లం దిమ్మలు మార్కెట్‌కు రాగా, మొదటిరకం గరిష్టంగా రూ. 3010లు, మూడో రకం రూ.2300లు పలికింది. దీంతో మార్కెట్ కళకళలాడగా, మంగళవారం నాటికి బెల్లం దిమ్మల సంఖ్య 1742కి పడిపోయింది. మొదటిరకం గరిష్టంగా క్వింటా రూ.3290లు, మూడో రకం రూ.2250లకు తగ్గింది. వాస్తవానికి మూడేళ్లుగా అక్టోబర్, నవంబర్లలో తుఫాన్లు, సమైక్యాంధ్ర ఉద్యమాల కారణంగా అనకాపల్లి మార్కెట్ సంక్షోభాన్ని ఎదుర్కోగా.. ఈ ఏడాది హుద్‌హుద్‌తో పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అనకాపల్లి మార్కెట్ నుంచి నవంబర్, డిసెంబర్ నెలల్లో ఒడిశా, ఛత్తీస్‌గఢ్, పశ్చిమబెంగాల్‌కు బెల్లం ఎగుమతి అవుతుంటుంది. జనవరి నాటికి చిత్తూరు నుంచి కూడా బెల్లం ఆయా రాష్ట్రాలకు ఎగుమతి అవుతుంది. ఇప్పుడవన్నీ ఉత్తరప్రదేశ్‌లో బెల్లం ఉత్పత్తిపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని వర్తకులు చెబుతున్నారు. -
చేదుగుళిక
కలిసిరాని చెరకు సాగు స్వల్పకాలిక వంగడాలపై రైతుల ఆసక్తి ఏటేటా తగ్గుతున్న పంట జిల్లాలో చెరకు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. ఈ పంటకు మదుపులు బాగా పెరిగిపోయాయి. ఇంటిల్లిపాదీ రెక్కలు ముక్కలు చేసుకున్నా గిట్టుబాటు కావడం లేదు. గడచిన పదేళ్లలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది తక్కువ విస్తీర్ణంలో నాట్లు వేశారు. చక్కెర మిల్లులు మద్దతు ధరను చెల్లించకపోవడంతో నీటి వసతి పుష్కలంగా ఉన్న భూములలో సైతం సరుగుడు, పొద్దుతిరుగుడు, మొక్కజొన్న పంటలు వేస్తున్నారు. చెరకు ఏక వార్షిక పంట. సుమారు పది నెలలు పెంచాల్సి ఉంటుంది. ఈ సమయంలో అతివృష్టి, అనావృష్టికి గురయితే అంతే సంగతి. మునగపాక : చెరకు సాగు రైతుకు లాభసాటి కావడం లేదు. దీంతో ఈ పంట విస్తీర్ణం జిల్లాలో ఏటేటా తగ్గిపోతోంది. సాధారణ విస్తీర్ణం 38,329 హెక్టార్లు. ఈ ఏడాది 37,459 హెక్టార్లే సాగయింది. మూడేళ్లుగా చీడపీడల బెడద, చక్కెర మిల్లులు మద్దతు ధర చెల్లించకపోవడం, మార్కెట్లో బెల్లం ధరల్లో హెచ్చు తగ్గులు ఈ పంటను చేపట్టే రైతులను దివాలా తీసేలా చేస్తున్నాయి. తాతల కాలం నుంచి జీవనాధారంగా వస్తున్న పంటను వదులుకోలేక వేరే పనులు చేసే అవకాశం లేక రైతులు తీవ్ర దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. కుటుంబమంతా ఏడాది పాటు కష్టపడినా పెట్టుబడులు కూడా దక్కకపోవడంతో అప్పులపాలైపోతున్నారు. ఎకరా చెరకు సాగుకు రూ. 40వేల నుంచి రూ. 45వేలు వరకు ఖర్చవుతోంది. పంట చీడపీడలు, అతివృష్టి, అనావృష్టికి గురయి దిగుబడి తగ్గిపోతోంది. కనీసం పదిపాకాలకు మించి దిగుబడులు రావడం లేదు. బెల్లం మొదటిరకం క్వింటా రూ.2910 నుంచి రూ. 3070లు పలుకుతోంది. ఈ లెక్కన పదిపాకాలకు సుమారు రూ.30వేలు ఆదాయం వస్తోంది. అంటే ఎకరాకు రూ.15వేలు నష్టం తప్పడం లేదు. చక్కెర మిల్లులు కూడా మద్దతు ధర చెల్లించడం లేదు. గతేడాది సరఫరా చేసిన చెరకుకు ఇప్పటి వరకు తుమ్మపాల యాజమాన్యం చెల్లింపులు జరపలేదు. దీనికి తోడు అతివృష్టి, అనావృష్టిలు దిగుబడిపై ప్రభావం చూపుతున్నాయని వ్యవసాయ అధికారులు అంటున్నారు. మద్దతు ధర లేదు నాది మునగపాక. చెరకు సాగే జీవనాధారం. అయితే పంట మదుపులకు, ఆదాయానికి పొంతన ఉండడం లేదు. బెల్లం తయారు చేస్తే మార్కెట్లో ధర ఉండడం లేదు. ఫ్యాక్టరీకి తరలిస్తే మద్దతు ధర లేదు సరికదా చెల్లింపులు లేవు. తీవ్రంగా నష్టపోతున్నాం. అందుకే ఈ ఏడాది 30సెంట్ల తోటను రసానికి అమ్మాను. పది టన్నులు వస్తుంది. టన్ను రూ. 2300లు. మొత్తం రూ. 23వేలు వరకు ఆదాయం వస్తుంది. ఇదే బాగుంది. - పెంటకోట శ్రీనివాసరావు ఏటా నష్టమే నాది మునగపాక. రెండెకరాల్లో చెరకు వేశా. గతేడాది రెండెకరాల్లోని పంటకు తెగుళ్లు సోకాయి. నివారణ చర్యలు చేపట్టినా ఫలితం లేకపోయింది. ఎకరాకు రూ.45వేలు వరకు మదుపు పెట్టా. చీడపీడల కారణంగా ఎకరా చెరకు గానుగాడితే పదిపాకాలకు మించి బెల్లం రాలేదు. మార్కెట్ ధర ప్రకారం ఎకరాకు రూ. 23వేలు మాత్రమే వచ్చింది. ఈ లెక్కన ఎకరాకు రూ 22వేలు వరకు నష్టపోయా. ఇంటిల్లిపాదీ కష్టపడినా నష్టమే వచ్చింది. - పెంటకోట వెంకటరావు, వ్యవసాయ రైతు -
మళ్లీ బెల్లం లావాదేవీలు
కళకళలాడిన అనకాపల్లి మార్కెట్ 54,980 దిమ్మలు రాక రూ.2 కోట్ల క్రయ, విక్రయాలు జరిగినట్లు అంచనా అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్లో సోమవారం నుంచి బెల్లం లావాదేవీలు మళ్లీ మొదలయ్యాయి. నల్లబెల్లంపై ఆంక్షలు, బెల్లం రవాణాపై కేసుల వేధింపుల నేపధ్యంలో వర్తకులు వారం రోజుల క్రితం లావాదేవీలు నిలిపివేసిన సంగతి తెలిసిందే. సున్నితమైన ఈ అంశంలో ఓ వైపు రైతుల మనోభావాలు, వ్యాపారుల ఆర్థిక ఆసరా, రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు సమస్యను గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లేందుకు చొరవ చూపడంతో పరిస్థితి తాత్కాలికంగా సద్దుమణిగింది. అనకాపల్లికి చెందిన వర్తకులు ఇటీవల గవర్నర్ కార్యదర్శి, ఇతర పోలీస్ శాఖ ఉన్నతాధికారులను కలిసి తమ సమస్యను విన్నవించడంతో అధికారుల నుంచి సానుకూల స్పందన వెల్లడయింది. దీంతో సోమవారం నుంచి బెల్లం లావాదేవీలు ప్రారంభించారు. మార్కెట్‌కు 54,980 దిమ్మలు రావడంతో యార్డులన్నీ కళకళలాడాయి. మొదటిరకం గరిష్టంగా క్వింటాల్‌కు 2,650 రూపాయలు, మూడో రకం కనిష్టంగా 2,260 రూపాయలు పలికింది. దాదాపు 2 కోట్ల రూపాయలకు పైబడి వ్యాపారం జరిగింది. దీంతో కార్మికులు, కొలగార్లు, వర్తకులు కాసింత ఊరట పొందారు. ప్రస్తుతం ఎన్నికల కోడ్, గవర్నర్ పాలన వంటి అంశాలు అమల్లో ఉన్నందున కొత్త ప్రభుత్వం కొలువుదీరాక నల్లబెల్లం సమస్యపై స్పష్టత వచ్చే అవకాశం ఉన్నట్టు మార్కెట్ వర్గాలు చర్చించుకుంటున్నాయి. రూ.10 కోట్ల లావాదేవీలకు బ్రేక్ గత 8 రోజులుగా అనకాపల్లి బెల్లం మార్కెట్లో లావాదేవీలు నిలిచిపోవడంతో సుమారు 10 కో ట్ల రూపాయల వ్యాపారం నిలిచిపోయింది. దీ నివల్ల ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయంతోపాటు వర్తకులు, కార్మికులు, కొలగార్లు, రైతులకు బాగా నష్టం జరిగింది. బెల్లాన్ని రవాణా చే సే వాహన యజమానులకు, వాటిపై పనిచేసే డ్రైవర్ల ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. మొత్తమ్మీద సమస్య తాత్కాలికంగానైనా పరిష్కారం కావడంతో మార్కెట్‌పై ఆదారపడే అన్నివర్గాలు మళ్లీ ఊరట చెందినట్టయింది. -
‘బెల్లం’ బాగుంది
అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి బెల్లం మార్కెట్లో మంగళవారం రికార్డుస్థాయిలో 42887 బెల్లం దిమ్మల లావాదేవీలు జరిగాయి. ఈ సీజన్లో ఇదే అత్యధికం. ఈ నెల 16న 25,535 దిమ్మలు రాగా, మంగళవారం 42,887 దిమ్మలు అమ్మకం జరగడం గమనార్హం. మొదటిరకం రూ.2960లు ధర పలికింది. లావాదేవీలతో పాటు ధరలు పెరగడంతో వ్యాపారులు, రైతులు ఆనందపడ్డారు. ఆదివారం సెలవు కావడంతో పాటు సోమవారం నల్లబెల్లంపై నోటీసులు కారణంగా మార్కెట్లో అమ్మకాలు, కొనుగోలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఇలా రెండురోజులు లావాదేవీలు ఆగిపోవడంతో రైతులు పెద్ద ఎత్తున బెల్లం మార్కెట్‌కు తెచ్చారు. మార్కెట్లోని యార్డులన్నీ కళకళలాడాయి. ప్రస్తుతం నల్లబెల్లం వివాదం ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. లావాదేవీలపై ఆ ప్రభావం ఉన్నప్పటికీ రైతులకు ఊరటనిచ్చేలా ధర పలికింది. పండగ దృష్ట్యా రైతులు బెల్లాన్ని అధికంగా ఉత్పత్తి చేసి మార్కెట్‌కు తరలిస్తున్నారు. లావాదేవీలు జరపగా వచ్చిన సొమ్ముతో పండగకు అవసరమైన వస్తువులు కొనుగోలు చేస్తున్నారు. సంక్రాంతి ముందు వరకు ఇదే తరహా జోరు మార్కెట్లో కనిపించనుంది. -
బెల్లంపై తీపి ఆశలు
=ఈ ఏడాది రూ.30 కోట్ల లావాదేవీలు =ఊపందుకోనున్న క్రయవిక్రయాలు అనకాపల్లి, న్యూస్‌లైన్: అనకాపల్లి మార్కెట్ కమిటీ అధికారుల సమ్మె విరమణతో లావాదేవీలపై ఆశలు చిగురిస్తున్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తొలి అర్థ సంవత్సరం లావాదేవీలు బాగానే ఉన్నా, బెల్లం ధరలలో ఆశించిన ఫలితాలు కనిపించడం లేదు. రెండు నెలల పాటు మార్కెట్ కమిటీ అధికారులు విధులకు గైర్హాజరుతో ఔట్సోర్సింగ్ సిబ్బంది బెల్లం బీట్ వ్యవహారాన్ని పర్యవేక్షించారు. ఈ సమయంలో బెల్లం క్రయవిక్రయాలలో ఆటంకాలు ఏర్పడనప్పటికీ ఉత్పత్తి చేసే రైతులు మాత్రం వెనుకంజ వేశారు. 2012-13లో మొదటి ఆరు నెలల లావాదేవీలు రూ.19.46 కోట్లు జరగ్గా 2013-14లో తొలి ఆరు నెలలు రూ.30.86 కోట్ల లావాదేవీలు జరిగాయి. అదే 2011-12లో రూ.161 కోట్లు, 2012-13లో రూ.143.50 కోట్ల వ్యాపారం జరిగింది. రూ.17 కోట్ల లావాదేవీలు తగ్గుముఖం పట్టడంతో 2013-14 పై కూడా ఇదే తరహా ప్రభావం ఉంటుందని మార్కెట్ వర్గాలు ఆందోళన వ్యక్తం చేశా యి. కానీ 2013-14 మొదటి అర్థ సంవత్సర లావాదేవీలతో గత ఆర్థిక సంవత్సరాన్ని పోలిస్తే రూ.11 కోట్ల లావాదేవీలు అదనంగా జరిగినట్టు స్పష్టమవుతోంది. అంతేకాదు.. బెల్లం పరిమాణంలోనూ పు రోగతి కనిపిస్తోంది. ఈ ఆగస్టులో మాత్ర మే లావాదేవీలు తగ్గగా, సెప్టెంబర్‌లో కాసింత పెరుగుదల కనిపించింది. ఆగస్టులో తగ్గుదల గత ఏడాది ఆగస్టులో అనకాపల్లి మార్కెట్లో 2408 క్వింటాళ్ల లావాదేవీలతో 66 లక్షల 93 వేల 72 రూపాయల వ్యాపారం జరిగింది. 2013 ఆగస్టులో బెల్లం లావాదేవీలు 1207 క్వింటాళ్లకు పడిపోయి, 27 లక్షల 91 వేల 329 రూపాయలకు తగ్గింది. అక్టోబర్ తొలిపక్షంలోనూ నెమ్మదిగా లావాదేవీలు కొనసాగుతున్నాయి. సమ్మె విరమణ నేపథ్యంలో బెల్లం లావాదేవీలు ఊపందుకుంటాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నా, ధరలు మాత్రం ఆశాజనకంగా లేవని రైతులు వాపోతున్నారు. ఉదాహరణకు గత అక్టోబర్ 19న ఈ మార్కెట్లో 1715 బెల్లం దిమ్మలు క్రయవిక్రయాలు జరగ్గా, మొదటిరకం బెల్లం గరిష్టంగా 3480 రూపాయల ధర పలికింది. కాగా శనివారం అనకాపల్లి మార్కెట్‌కు 3512 బెల్లం దిమ్మలు రాగా, మొదటిరకం గరిష్టంగా 3410 రూపాయలు పలికింది. అంటే బెల్లం ధర గత ఏడాది ఇదే రోజుతో పోలిస్తే 70 రూపాయలు తగ్గినట్లయింది. 2011-12 ఆర్థిక సంవత్సరంలో 8 లక్షల 17 వేల 958 క్వింటాళ్ల బెల్లం లావాదేవీలు జరగ్గా, 2012-13 ఆర్థిక సంవత్సరంలో 5 లక్షల 89 వేల 685 క్వింటాళ్లకు పడిపోవడంతో మార్కెట్ వర్గాలు డీలాపడ్డాయి. ఈ ఏడాది తొలి అర్థ భాగంలో లక్షా 24 వేల 102 క్వింటాళ్ల లావాదేవీలు జరగడంతో బెల్లం సరఫరా తగ్గుతుందనే వాదన వినిపిస్తోంది. వచ్చే ఆరు నెలల్లో జరిగే వ్యాపారంపైనే టర్నోవర్ ఆధారపడి ఉంటుంది.