ఆధునిక జీవన శైలిలో దేహ కదలికలు తగ్గిపోయాయి. దాంతో జీవక్రియల వ్యవస్థ గాడి తప్పడమూ ఎక్కువైంది. దానికి తోడు చలికాలంలో దేహక్రియల్లో ఒడిదొడుకులు ఎదురవుతుంటాయి. వీటన్నింటి కారణంగా ప్రతి పదిమందిలో ఏడుగురు మహిళలు పీరియడ్స్ క్రమం తప్పడం అనే సమస్యను ఎదుర్కొంటున్నారు. దీనిని నివారించడానికి మందుల మీద ఆధారపడాల్సిన పని లేదు. ఆహారంలో మార్పులు చేసుకుంటే చాలని గైనకాలజిస్టులు సూచిస్తున్నారు.
►చలికాలంలో రోజూ కొద్దిగా బెల్లం తింటూ ఉంటే రుతుక్రమం సక్రమంగా ఉంటుంది. రుతుస్రావ సమయంలో వచ్చే కడుపు నొప్పిని కూడా బెల్లం అరికడుతుంది.
►ముప్పై రోజులు దాటినా కూడా పీరియడ్స్ రాకుండా ఉన్నప్పుడు విటమిన్ సి పుష్కలంగా ఉండే పండ్లు, కూరలను తీసుకోవాలి. బొప్పాయిలోని ఆస్కార్బిక్ యాసిడ్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ల మీద ప్రభావం చూపించి సమస్యను సరిదిద్దుతుంది. ఈ సమస్యను పరిష్కరించే మరికొన్ని పండ్లు పైనాపిల్, మామిడి, కమలాలు, నిమ్మ, కివి.
►పచ్చి అల్లం తరుగులో స్వచ్ఛమైన తేనె కలిపి ప్రతి రోజూ ఉదయం తీసుకోవాలి. ఇవి హార్మోన్లలో అసమతుల్యతను క్రమబద్ధీకరిస్తాయి.
►స్వచ్ఛమైన పసుపును రోజూ ఆహారంలో తీసుకోవాలి. పీరియడ్స్ ఆలస్యమైతే గ్లాజు వేడి పాలలో చిటికెడు పసుపు వేసుకుని తాగుతుంటే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ సమస్య తలెత్తదు. పసుపును తేనెతో కలిపి చప్పరించినా కూడా మంచి ఫలితం ఉంటుంది.
►పీరియడ్స్ సక్రమంగా రావడం, కండరాల నొప్పిని తగ్గించడంలో కాఫీ కూడా మంచి మందే. కాఫీలో ఉండే కెఫీన్ ఈస్ట్రోజెన్ హార్మోన్‌ను ప్రభావితం చేస్తుంది.
►బీట్‌రూట్‌లో ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం సమృద్ధిగా ఉంటాయి. ఇవి దేహక్రియలను సక్రమంగా ఉంచుతాయి.
►ఒక గ్లాసు నీటిలో ఒక స్పూన్ చక్కెర, ఒక స్పూన్ వాము లేదా వాము పొడి వేసి మరిగించి తాగాలి. రోజూ ఉదయాన్నే పరగడుపున ఈ టీ (కాన్‌కాక్షన్) తాగితే పీరియడ్ సక్రమం కావడంతోపాటు మెన్‌స్ట్రువల్ పెయిన్ కూడా ఉండదు.
Comments
Please login to add a commentAdd a comment