ఎండ నుంచి మేనికి రక్షణ | Sun protection lotions can be kept in 10 minutes before you can save the skin | Sakshi
Sakshi News home page

ఎండ నుంచి మేనికి రక్షణ

Published Sat, Apr 20 2019 12:09 AM | Last Updated on Sat, Apr 20 2019 12:09 AM

Sun protection lotions can be kept in 10 minutes before you can save the skin - Sakshi

ఎండ వేడిమి దాడి చేస్తోంది. దీనికి విరుగుడుగా ఈ కాలం మేని సంరక్షణ విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు అవసరం. 

►ఎండ నుంచి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జు చర్మానికంతా పట్టించి, మూడు నిమిషాలుంచి కడిగేయాలి. మృతకణాలు తొలగిపోవడమే కాకుండా ఎండవేడిమికి కమిలిన చర్మం సాధారణ స్థితికి చేరుకుంటుంది. 

►చర్మం తాజాగా ఉండాలంటే ఎండలో బయటికి వెళ్లి వచ్చిన తర్వాత బొప్పాయి గుజ్జులో టీ స్పూన్‌ తేనె కలిపి ముఖానికి ప్యాక్‌ వేసుకొని, 5 నిమిషాల తర్వాత శుభ్రపరుచుకోవాలి.
 
►చలికాలానికి మాయిశ్చరైజర్లు మాదిరి ఈ కాలం సన్‌ప్రొటెక్షన్‌ లోషన్లు వాడుతుంటారు. అయితే, వీటిని బయటకు వెళ్లడానికి 10 నిమిషాల ముందు రాసుకుంటే చాలు ఎండబారి నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. 
   
►ఎండవేడికి చర్మం కమిలి, మంట పుడుతుంటే ఉపశమనానికి అలొవెరా జెల్‌ రాసి, పది నిమిషాలు ఆగి చల్లని నీటితో శుభ్రపరుచుకోవాలి. 
     
►ఈ కాలం శిరోజాలు పొడిబారడం సమస్య ఎక్కువ. అందుకని వారానికి ఒకసారి అరటిపండు గుజ్జును తలకు అంతా పట్టించి, పది నిమిషాలు ఉంచి, కడిగేయాలి. దీనివల్ల వెంట్రుకల మృదుత్వం దెబ్బతినదు.

►చర్మం నిస్తేజంగా మారకుండా రోజూ 8–10 గ్లాసుల నీళ్లు తప్పక తాగాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement