Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా? | Beauty Anti Aging Treatment Precautions And Instructions | Sakshi
Sakshi News home page

Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?

Published Wed, Sep 25 2024 8:02 AM | Last Updated on Wed, Sep 25 2024 8:02 AM

Beauty Anti Aging Treatment Precautions And Instructions

యాంటీ ఏజింగ్‌ ట్రీట్‌మెంట్‌

డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.

ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! 
‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్‌ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్‌ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్‌ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్‌లైన్‌లో విపరీతంగా సెర్చ్‌ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్‌ వైద్యులు.

క్రీమ్‌ల వాడకం తగ్గాలి! 
లుకింగ్‌ యూత్‌ఫుల్, ఫ్లాలెస్‌ స్కిన్‌ కోసం, గ్లాసీ స్కిన్‌ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్‌ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్‌ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్‌ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్‌ యాసిడ్స్‌ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్‌ఫోలియేషన్‌ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్‌ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. 
    – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం 
    – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. 
    – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్‌ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం 
    – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్‌ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్‌ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్‌ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.

ఓసీడీగా మారకూడదు..
శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్‌మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్‌మెంట్‌లు తీసుకోవడం, ఏ ట్రీట్‌మెంట్‌ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్‌మెంట్‌లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్‌ ప్రతినిధి

ఆ గీతను అర్థం చేసుకోవాలి..
ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్‌ శ్రీనివాస్‌ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్‌ కాలేజ్‌

ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement