Creams
-
Health: ఈ సమస్యలు.. కొనితెచ్చుకుంటున్నారా?
డెర్మోరెక్సియా... ఈ పదంలో డెర్మో ఉంది, కానీ ఇది చర్మ సమస్య కాదు. మానసిక సమస్య. ఒకరకంగా అనెరొక్సియా వంటిదే. సాధారణ బరువుతో ఉన్నప్పటికీ లావుగా ఉన్నామనే భ్రాంతికి లోనవుతూ సన్నబడాలనే ఆకాంక్షతో ఆహారం తినకుండా దేహాన్ని క్షీణింపచేసుకోవడమే అనెరొక్సియా. ఇక డెర్మోరెక్సియా అనేది చర్మం అందంగా, యవ్వనంగా, కాంతులీనుతూ ఉండాలనే కోరికతో విపరీతంగా క్రీములు వాడుతూ చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకోవడమే డెర్మోరెక్సియా. ఇటీవల మధ్య వయసు మహిళల్లో ఎక్కువగా కనిపిస్తోంది.ఆత్మవిశ్వాసానికి అందం కొలమానం కాదు! ‘అందం ఆత్మవిశ్వాసాన్ని పెం΄÷ందిస్తుంది’ అనే ప్రచారమే పెద్ద మాయ. సౌందర్య సాధనాల మార్కెట్ మహిళల మీద విసిరిన ఈ వల దశాబ్దాలుగా సజీవంగా ఉంది, ్రపాసంగిక అంశంగానే కొనసాగుతోంది. ఈ తరం మధ్య వయసు మహిళ ఈ మాయలో పూర్తిగా మునిగి΄ోయిందనే చె΄్పాలి. వార్ధక్య లక్షణాలను వాయిదా వేయడానికి, ముఖం మీద వార్ధక్య ఛాయలను కనిపించకుండా జాగ్రత్తపడడానికి యాంటీ ఏజింగ్ క్రీములను ఆశ్రయించడం ఎక్కువైంది. ఒక రకం క్రీము వాడుతూండగానే మరోరకం క్రీమ్ గురించి తెలిస్తే వెంటనే ఆ క్రీమ్‌కు మారి΄ోతున్నారు. వీటి కోసం ఆన్లైన్లో విపరీతంగా సెర్చ్ చేస్తున్నారు. క్రమంగా ఇది కూడా ఒక మానసిక సమస్యగా పరిణమిస్తోందని చెబుతున్నారు లండన్ వైద్యులు.క్రీమ్‌ల వాడకం తగ్గాలి! లుకింగ్ యూత్‌ఫుల్, ఫ్లాలెస్ స్కిన్ కోసం, గ్లాసీ స్కిన్ కోసం అంటూ ప్రచారం చేసుకునే క్రీమ్‌లను విచక్షణ రహితంగా వాడుతూ యాక్నే, ఎగ్జిమా, డర్మటైటిస్, సోరియాసిస్ వంటి చర్మ సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. గాఢత ఎక్కువగా ఉన్న గ్లైకోలిక్ యాసిడ్, నియాసినామైడ్, రెటినాల్, సాలిసైలిక్ యాసిడ్, అల్ఫా హైడ్రాక్స్ యాసిడ్స్ చర్మానికి హాని కలిగిస్తున్నాయి. అలాగే చర్మం మీద మృతకణాలను తొలగించడానికి చేసే ఎక్స్ఫోలియేషన్ విపరీతంగా చేయడం వల్ల చర్మం మరీ సున్నితమై΄ోతోంది. కళ్లచుట్టూ ఉండే చర్మం మీద ఈ క్రీమ్‌లను దట్టంగా పట్టించడం వల్ల ఆర్బిటల్ ఏరియాలో ఉండే సన్నని సున్నితమైన రక్తనాళాలు పలుచబడి వ్యాప్తి చెందుతాయి. దాంతో కళ్ల కింద చర్మం ఉబ్బెత్తుగా మారుతుంది. డెర్మోరెక్సియాను గుర్తించే ఒక లక్షణం ఇది. డెర్మోరెక్సియాను నిర్ధారించే మరికొన్ని లక్షణాలిలా ఉంటాయి. – చర్మం దురదగా ఉండడం, మంటగా అనిపించడం, ఎండకు వెళ్తే భరించలేక΄ోవడం – తరచూ చర్మ వ్యాధి నిపుణులను కలవాల్సి రావడం, ఎన్ని రకాల చికిత్సలు తీసుకున్నప్పటికీ సంతృప్తి కలగక΄ోవడం. – చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పటికీ తరచూ అద్దంలో చూసుకుంటూ అసంతృప్తికి లోనవడం. తళతళ మెరిసే గ్లాసీ స్కిన్ కోసం చర్మం మీద ప్రయోగాలు చేయడం – షెల్ఫ్‌లో అవసరానికి మించి రకరకాల బ్యూటీ ్ర΄ోడక్ట్స్ ఉన్నాయంటే డెర్మోరెక్సియాకు దారితీస్తోందని గ్రహించాలి. మధ్య వయసు మహిళలే కాదు టీనేజ్ పిల్లల విషయంలో కూడా ఈ లక్షణం కనిపించవచ్చు. పేరెంట్స్ గమనించి పిల్లలకు జాగ్రత్తలు చె΄్పాలి.ఓసీడీగా మారకూడదు..శరీరం అందంగా కనిపించట్లేదనే అసంతృప్తి వెంటాడుతూనే ఉండడం బాడీ డిస్మార్ఫోఫోబియా అనే మానసిక వ్యాధి లక్షణం. ముఖం క్లియర్‌గా, కాంతిమంతంగా కనిపించాలనే కోరిక మంచిదే. కానీ అది అబ్సెషన్‌గా మారడం ఏ మాత్రం హర్షణీయం కాదు. ఇది ఎంత తీవ్రమవుతుందంటే... అందంగా కనిపించడానికి రకరకాల ట్రీట్మెంట్లు తీసుకోవడం, ఏ ట్రీట్మెంట్ తీసుకున్నప్పటికీ, ఆ ట్రీట్మెంట్లో ఎంత మంచి ఫలితం వచ్చినప్పటికీ సంతృప్తి చెందక΄ోవడం, తీవ్రమైన అసంతృప్తితో, ఎప్పుడూ అదే ఆలోచనలతో మానసిక ఒత్తిడికి లోనుకావడం వంటి పరిణామాలకు దారి తీస్తుంది. మెదడు ఇదే ఆలోచనలతో నిండి΄ోయినట్లయితే కొంతకాలానికి ఆ సమస్యకు వైద్యం చేయాల్సి వస్తుంది. – వాకా మంజులారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధిఆ గీతను అర్థం చేసుకోవాలి..ఒక మనిషితో మాట్లాడుతున్నప్పుడు, ఆ సంభాషణ తాలూకు విషయమే ముఖ్యం. అంతే తప్ప వారి ముఖం ఎలా ఉంది అనేది పట్టించుకునే అంశం ఏ మాత్రం కాదు. అందం– ఆత్మవిశ్వాసం ఒకదానితో ఒకటి ముడివడి ఉంటాయనేది కొంతవరకే. ఆత్మవిశ్వాసానికి అందం గీటురాయి కానేకాదు. ఈ సన్నని గీతను అర్థం చేసుకోవాలి. సాధారణంగా వయసుతోపాటు దేహంలో మార్పు వస్తుంటుంది. ఆ మార్పు ప్రభావం చర్మం మీద కనిపిస్తుంటుంది. ఈ మార్పును స్వీకరించాల్సిందే. చర్మం కాంతిమంతంగా ఉండడం కోసం రసాయన క్రీములను ఆశ్రయించడం కంటే మంచి ఆహారం, వ్యాయామం, ఒత్తిడి లేని జీవనశైలి, మంచి నిద్ర ఉండేటట్లు చూసుకోవాలి. – ప్రొఫెసర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై, హెచ్‌వోడీ, సైకియాట్రీ విభాగం, కాకతీయ మెడికల్ కాలేజ్ఇవి చదవండి: Lathika Sudhan: రేకులు విప్పిన కలువ.. కొలనైంది! -
బర్త్‌డే బాయ్
-
తళుక్కున మెరిసేందుకు
క్రీమ్స్, లోషన్స్ రాసుకోవడం వల్ల వచ్చే అందంకంటే సహజసిద్ధమైన ఫేస్‌ప్యాక్‌ల వల్ల నిలిచే అందానికే ఓటేస్తుంటారు చాలామంది. అలాంటి వారికోసమే ఈ చిట్కాలు. ఇంటిపట్టున దొరికే... వాటితోనే ఫేస్‌ప్యాక్‌లు సిద్ధం చేసుకోవచ్చు. అయితే ఫేస్ప్యాక్కు ముందు క్లీనప్, స్క్రబ్ వంటివి తప్పని సరిగా చేసుకుంటే చర్మంపైన పేరుకుపోయిన మృతకణాలు పూర్తిగా తొలిగిపోయి మృదువుగా, మచ్చలు, మొటిమలు వంటివి లేకుండా అందంగా తయారవుతుంది. మరింకెందుకు ఆలస్యం ఇలా ప్రయత్నించండి. కావల్సినవి : క్లీనప్ : పెరుగు – పావు టీ స్పూన్, ఆరెంజ్ జ్యూస్ – 1 టీ స్పూన్ స్క్రబ్ : ఆరెంజ్ తొక్కల పొడి – 2 టీ స్పూన్లు, అరటి పండు గుజ్జు – 2 టీ స్పూన్లు, చిక్కటిపాలు – 2 టీ స్పూన్లు మాస్క్ : కిస్మిస్ గుజ్జు – అర టీ స్పూన్, శనగపిండి – 2 టీ స్పూన్లు, కొబ్బరిపాలు – 2 టీ స్పూన్లు తయారీ: ముందుగా పెరుగు, ఆరెంజ్ జ్యూస్ ఒక బౌల్లో పోసుకుని బాగా కలుపుకోవాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి రెండు లేదా మూడు నిమిషాల తర్వాత మెత్తని క్లాత్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు ఆరెంజ్ తొక్కల పొడి, అరటి పండు గుజ్జు, చిక్కటిపాలు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకుని మూడు లేదా ఐదు నిమిషాల పాటు స్క్రబ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుని ఆవిరి పట్టించుకోవాలి. ఇప్పుడు శనగపిండి, కొబ్బరిపాలు, కిస్మిస్ గుజ్జు ఒక బౌల్లోకి తీసుకుని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఆ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసుకుని, పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
తళతళా మెరవాలంటే...
మృదువైన మోము కోసం మగువలు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎలాగైనా మచ్చలులేని మృదువైన చర్మం కావాలని మార్కెట్లో దొరికే రకరకాల ఫేస్‌క్రీమ్స్, లోషన్స్ కొనేందుకు సిద్ధపడతారు. ఎంత ఖరీదైనా కొని వాడేస్తుంటారు. కానీ నిజానికి మార్కెట్లో దొరికే ఫేస్‌క్రీమ్స్‌లో హానికరమైన కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే అన్నివిధాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి! కావలసినవి: ముల్తానీ మట్టి – 1 టేబుల్ స్పూన్, కీరదోస గుజ్జు – 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, ఆర్గన్ ఆయిల్ – అర టీ స్పూన్ (మార్కెట్లో లభిస్తుంది) తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మట్టి, కీరదోస గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో రోజ్ వాటర్, ఆర్గన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని, 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. -
వస్తాదులు ముస్తాబవుతున్నారు...
మగాడంటే... ఒకప్పుడు వస్తాదులా ఉండాలి. మరిప్పుడో..! ముస్తాబై ఉండాలి. ఎప్పుడో చెప్పారు బ్రహ్మంగారు... వారు వీరవుతారని... వీరు వారవుతారని... ఆయన ఏం ఊహించుకుని అన్నారో తెలీదు గానీ, అందచందాల విషయంలో మాత్రం మగాళ్లు ఇప్పుడు శ్రద్ధ పెంచుతున్నారు. ఫేస్ టర్నింగ్ ఇచ్చుకుంటున్నారు. ‘వారేవా... ఏమి ఫేసు... అచ్చం హీరోలా ఉంది బాసూ’ అనేలా తయారవుతున్నారు. సౌందర్య పోషణ ఆడాళ్లకే పరిమితమా..? మగాళ్లకు మాత్రం ఉండొద్దూ..? పౌడర్లు, క్రీములు వగైరాలన్నీ ఆడాళ్లకే ప్రత్యేకమా..? మగాళ్లకు అక్కర్లేదూ..? ఇంకెన్నాళ్లు ఈ వివక్ష..? అని ప్రశ్నిస్తున్నారు మగమహారాజులు. ప్రశ్నించే మగపుంగవుల ఆక్రోశాన్నీ, ఆవేదనను అర్థం చేసుకున్న మార్కెట్ శక్తులు... ఇదిగిదిగో... మీ కోసం మేమున్నాం... మరేం ఫర్వాలేదు అంటూ ముందుకొస్తున్నాయి. ‘మగాళ్లకు మాత్రమే’ పౌడర్లు, క్రీములు వగైరా ఉత్పత్తులతో మార్కెట్‌ను ముంచెత్తుతున్నాయి. సహజంగానే కళాపోషకులైన పురుషపుంగవులు సదరు ఉత్పత్తులను సాదరంగా సొంతం చేసుకుంటున్నారు. మేని మెరుపుల కోసం ఎంతటి ఖర్చుకైనా వెనుకాడకుండా తమ సౌందర్య పిపాసను చాటుకుంటున్నారు. సౌందర్య పోషణలో కొన్నేళ్లుగా పురుష ‘ప్రపంచ దృక్పథం’ మారింది. అభివృద్ధి చెందిన అగ్రరాజ్యాల్లోనే కాదు, మన దేశంలో కూడా. పైగా, మన దేశంలో ధవళకాంతులతో అలరారే మేనిఛాయకే అగ్రతాంబూలం. సూటిగా చెప్పాలంటే, మనోళ్లకు తెల్లతోలుపై మోజెక్కువ. సౌందర్య పోషక ఉత్పత్తులను తయారు చేసే బడా కార్పొరేట్ సంస్థలన్నీ, ఈ బలహీనతను సొమ్ము చేసుకునేందుకు పోటాపోటీగా కొత్త కొత్త ఉత్పత్తులతో మన మగమహారాజులను ఊరిస్తున్నాయి. ఇదే అదనుగా మహానగరాలు మొదలుకొని చిన్న చిన్న పట్టణాల్లో సైతం సందు సందునా మెన్స్ బ్యూటీపార్లర్లు, సెలూన్లు, స్పాలు వెలుస్తున్నాయి. మెన్స్ పార్లర్లు, సెలూన్లలో వినియోగించే క్రీములు, పౌడర్లు, బ్లీచింగ్ ప్రక్రియల వల్ల మేనిఛాయ తాత్కాలికంగా మెరుగుపడినా, ఆ తర్వాత వాటి దుష్ర్పభావాల ఫలితంగా చర్మంపై నల్లని పొరలా ఏర్పడటం, మొటిమలు ఏర్పడటం వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు పడే పురుష పుంగవులు ఎలాంటి సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తే ఏమవుతుందో తెలియని భయంతో కుంగిపోతుండటం కూడా మామూలే. చర్మతత్వానికి తగిన మేలిరకం సౌందర్య పోషక ఉత్పత్తులను వినియోగించడం, సమతుల ఆహారం తీసుకోవడం, తగినంత నీరు తాగడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వంటి కొద్దిపాటి జాగ్రత్తలతో మగ మహారాజులు సోగ్గాళ్లలా వెలిగిపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇవి కాకుండా వృత్తి, ఉద్యోగాల రీత్యా పురుషుల చర్మసౌందర్యాన్ని దెబ్బతీసే రకరకాల సమస్యలు, వాటి నివారణ మార్గాలపై నిపుణులు ఏం చెబుతున్నారంటే... ఖతర్నాక్ కాలుష్యం వృత్తి, ఉద్యోగాల కారణంగా చాలామంది ద్విచక్ర వాహనాలపై గంటల తరబడి ఎండనపడి తిరగడం చాలామందికి అనివార్యం. భవన నిర్మాణ పనుల్లో సిమెంటు, ధూళి సోకే పరిసరాల్లో గంటల తరబడి గడపడం కూడా సమస్యలను తెచ్చిపెడుతుంది. నిత్యం కాలుష్యంబారిన పడేవారికి పాలీమార్ఫిక్ లైట్ ఎరప్షన్ (పీఎంఎల్‌ఈ) ర్యాషెస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. ఈ ర్యాషెస్ ‘సన్‌బర్న్’ అంత తీవ్రమైన సమస్య కాకపోయినా, నిరంతరం చర్మంపై దురదపెడుతూ ఇబ్బంది కలిగించే సమస్యే. ఇలాంటి సమస్యతో బాధపడేవారు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. వ్యాధి తీవ్రత బట్టి పైపూతగా వాడే కార్టికో స్టిరాయిడ్ క్రీములు లేదా నోటి ద్వారా తీసుకునే కార్టికో స్టిరాయిడ్ మాత్రలు ఇస్తారు. ఈ సమస్య రాకుండా ముందుగానే జాగ్రత్త తీసుకోవాలనుకుంటే, నాణ్యమైన సన్‌స్క్రీన్ ఉపయోగించాలి. గంటల తరబడి ఎండలో ఉండకుండా, వీలైనంత వరకు నీడ పట్టున ఉండేలా చూసుకోవాలి. ముందస్తు ముదిమి వయసు మళ్లడం మొదలయ్యాక చర్మం వదులై, ముఖంపై ముడతలు పడటం ఎవరికైనా సహజమే. కొందరిలో మాత్రం ముప్పయిలు దాటకుండానే ముదిమి లక్షణాలు మొదలవుతాయి. చర్మంలో ఒకదానినొకటి బిగుతుగా అంటిపెట్టుకుని ఉండే కణజాలం బలహీనపడుతూ ఉంటుంది. ఫలితంగా చర్మం వదులై, ముఖాన ముడుతలు దేరి ముసలాళ్లలా కనిపిస్తారు. దీనినే ‘ప్రీమెచ్యూర్ ఏజింగ్’ అంటారు. తెలుగులో చెప్పుకోవాలంటే, ఈ సమస్యను ముందస్తు ముదిమి అనుకోవచ్చు. ఇలాంటి లక్షణాలు కనిపించే వారు తీక్షణమైన ఎండకు దూరంగా ఉండాలి. సన్‌బాతింగ్ వంటి చర్యలు ఇలాంటి వారికి అసలు పనికిరావు. ఎండలోకి వెళ్లే ముందు తప్పనిసరిగా సన్‌స్క్రీన్ లోషన్ వాడాల్సి ఉంటుంది. గంటల తరబడి ఎండలో గడపడం తప్పనిసరి అయితే, ప్రతి రెండు గంటలకు ఒకసారి సన్‌స్క్రీన్ అప్లై చేయాల్సి ఉంటుంది. సబ్బు బదులు మాయిశ్చరైజింగ్ బాడీవాష్ వాడటం వల్ల ఫలితం ఉంటుంది. చర్మం బిగుతు సడలకుండా ఉండేందుకు వ్యాయామాలు, మసాజ్‌లు కొంతవరకు దోహదపడతాయి. ఈ సమస్యకు ‘నాన్ అబ్లేటివ్ రేడియో ఫ్రీక్వెన్సీ’ చికిత్స కూడా ఇప్పుడు అందుబాటులో ఉంది. వర్ణం చర్మాంతర్యామి పుట్టుకతోనే చర్మానికి రంగు వస్తుంది. దానినెవరూ మార్చలేరు. కొందరిలో వయసు పెరుగుతున్న కొద్దీ చర్మంలో అసహజమైన మార్పులు జరుగుతూ ఉంటాయి. చర్మంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడటం, చర్మం గరుకుగా మారడం వంటి సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. కొందరికి ముఖంపై అక్కడక్కడా నల్లని మచ్చలు ఏర్పడుతుంటాయి. ఇవి ఒక క్రమ పద్ధతిలో కాకుండా అడ్డదిడ్డంగా ఉంటాయి. చర్మానికి గాఢమైన రంగునిచ్చే మెననోసైట్స్ ఒకేచోట ఎక్కువగా పోగుపడటం వల్ల ఇలాంటి మచ్చలు ఏర్పడుతూ ఉంటాయి. ఈ పరిస్థితిని ‘మెలాస్మా’ అంటారు. ఇక కొందరికి నుదురు, మెడ, బాహుమూలలు, మర్మాయవాల వద్ద చర్మం చాలా నల్లగా మారడమే కాకుండా, దళసరిగా మారుతుంది. ఈ పరిస్థితిని ‘అకాంథోసిస్ నెగ్రికాన్స్’ అంటారు. దీనిని డయాబెటిస్‌కు ముందస్తు సూచనగా కూడా పరిగణిస్తారు. ఇలాంటి అసహజమైన చర్మ సమస్యలు తలెత్తినప్పుడు చర్మవ్యాధి నిపుణులను సంప్రదించి, తగిన చికిత్స తీసుకోవాల్సి ఉంటుంది. కొందరి చర్మం జిడ్డుగాను, మరికొందరి చర్మం పొడిగాను ఉంటుంది. చర్మం అడుగున ఉత్పత్తయ్యే ‘సీబమ్’ హెచ్చుతగ్గుల కారణంగానే ఇలా జరుగుతుంది. కొందరిలో ముఖంపై జుట్టు మరీ దట్టంగా పెరుగుతుంది. గడ్డం దాదాపు కళ్ల దిగువ వరకు ముఖమంతా కప్పేసినట్లు పెరిగితే చూడటానికి ఇబ్బందిగానే ఉంటుంది. నిపుణులను సంప్రదిస్తే, లేజర్ చికిత్స ద్వారా ఈ సమస్యను చక్కదిద్దుతారు. కొందరిలో కనుబొమలు బాగా పల్చబడిపోవడం లేదా పూర్తిగా లేకుండా పోవడం జరుగుతుంది. ఇలాంటి సమస్యలకు కూడా ఇప్పుడు తగిన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. - ఇన్పుట్స్: డా. స్మిత ఆళ్లగడ్డ, చీఫ్ డర్మటాలజిస్ట్, త్వచ స్కిన్ క్లినిక్, గచ్చిబౌలి, హైదరాబాద్ నీడలో నీటుగాళ్లు ఎండ కన్నెరుగకుండా ఎంతసేపూ నీడపట్టున ఆఫీసుల్లో, ఇళ్లలో కంప్యూటర్లు, లాప్‌టాప్‌లు, టీవీ తెరలకు అతుక్కుపోయి బతికేసే నీటుగాళ్లకు కూడా రకరకాల చర్మ సమస్యలు తప్పవు. గంటల తరబడి ఎండలో గడిపే వాళ్లకు అల్ట్రావయొలెట్ కిరణాల కారణంగా ఎలాంటి హాని జరుగుతుందో, నిత్యం డెస్క్‌టాప్, లాప్టాప్, టాబ్లెట్లు, సెల్ఫోన్లతో బిజీబిజీగా గడిపేసే ఐటీ, బీపీవో ఉద్యోగులకు కూడా అలాంటి దుష్ర్పభావాలే కలుగుతాయి. వారు వాడే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాల వల్ల చర్మం కాంతి విహీనంగా మారుతుంది. పైగా, నీరెండ అయినా సోకకుండా బతికేయడం వల్ల విటమిన్-డి లోపం ఏర్పడి ఎముకలు కూడా బలహీనపడతాయి. ఈ పరిస్థితిని నివారించడానికి మంచి సన్‌స్క్రీన్ ఉపయోగించడం, తగినంత నీరు తాగడం, తరచు ఖనిజ లవణాలతో కూడిన ఎలక్ట్రోలైట్స్ తీసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. టీనేజీ కుర్రకారు అందచందాలపై తాపత్రయం టీనేజ్లోనే మొదలవుతుంది. టీనేజ్ కుర్రాళ్లు గంటల తరబడి అద్దం ముందు గడుపుతుంటారు. అమ్మాయిల దృష్టిలో పడేందుకు నానా తంటాలు పడుతుంటారు. తమ అభిమాన కథానాయకుల తరహాలో తయారయ్యేందుకు అష్టకష్టాలు పడుతుంటారు. టీవీ, పేపర్లలో కనిపించే ప్రతి యాడ్‌లోని ఉత్పత్తినీ వెంటనే కొనేసి, ముఖాలకు పూసుకుంటూ ఉంటారు. ఇక స్ప్రేలు, సెంట్లు సరేసరి. కుర్రకారులోని ఈ ప్రయోగశీలత ఒక్కోసారి సమస్యలను కూడా తెచ్చిపెడుతుంది. ఎలాంటి పదార్థాలతో తయారు చేశారో, నాణ్యత ఏమిటో తెలుసుకోకుండా హానికరమైన క్రీములు వాడేస్తే, ముఖవర్చస్సు దెబ్బతిని, మొటిమల వంటి సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలంటే, యాడ్స్ మాయాజాలంలో కొట్టుకుపోకుండా, వైద్యుల సలహాపై తమ చర్మం తీరుకు సరిపడే ఉత్పత్తులనే వాడాలి. ఆహారంలో ఆకుకూరలు, కూరగాయలు పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే, తగిన వ్యాయామం చేయడం ద్వారా చర్మ సౌందర్యాన్ని, శరీరాకృతిని కాపాడుకోవచ్చు -
స్టెరాయిడ్ క్రీములతో చర్మానికి హాని
హైదరాబాద్: మేని నిగారింపును పెంచే హామీతో మార్కెట్లో లభిస్తున్న పలు స్టెరాయిడ్ ఆధారిత క్రీములు నిజానికి చర్మానికి మేలుకన్నా ఎంతో హాని చేసేవిగా ఉంటున్నాయని ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ డెర్మటాలజిస్ట్స్, వెనిరియాలజిస్ట్స్ అండ్ లెప్రోలజిస్ట్స్(ఐఏడీవీఎల్) తెలిపింది. పాండెర్మ్ తదితర క్రీములు ఈ కోవకి చెందినవిగా పేర్కొంది. ఇవి క్లోబీటాసోల్ అనే స్టెరాయిడ్‌తో పాటు యాంటీబయోటిక్, యాంటీ-అమీబిక్, యాంటీ-ఫంగల్‌గా ఉపయోగపడే 4 రకాల ఔషధాల అసంబద్ధ కాంబినేషన్లతో తయారవుతున్నాయంది. రూ. 1,555 కోట్ల టాపికల్ స్టెరాయిడ్స్(చర్మంపై పూసే స్టెరాయిడ్స్ క్రీములు) మార్కెట్లో సుమారు 85 శాతం వాటా ఈ తరహా కాంబినేషన్ క్రీములదే ఉంటోందని తెలిపింది. చర్మ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న వారిలో దాదాపు 60 శాతం మంది ఎటువంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా స్టెరాయిడ్స్ గల క్రీములను వాడుతున్నట్లు 2011లో 12 నగరాల్లో తాము నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైనట్లు వివరించింది. వీటిపై 2005 నుంచి పోరాడుతున్నప్పటికీ ప్రభుత్వపరంగా ఎలాంటి చర్యలూ లేవని ఐఏడీవీఎల్ టాస్క్‌ఫోర్స్ కన్వీనర్ అబీర్ సారస్వత్ తెలిపారు. ఈ నేపథ్యంలో ఔషధ రంగ నియంత్రణ సంస్థ డీసీజీఐతో పాటు ఫార్మా విభాగం కార్యదర్శిని కలిసిన ఐఏడీవీఎల్ బృందం ఇటువంటి అసంబద్ధ కాంబినేషన్ల క్రీముల తయారీ, అమ్మకాలకు వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది.