
మృదువైన మోము కోసం మగువలు చేయని ప్రయత్నాలు ఉండవు. ఎలాగైనా మచ్చలులేని మృదువైన చర్మం కావాలని మార్కెట్‌లో దొరికే రకరకాల ఫేస్‌క్రీమ్స్, లోషన్స్ కొనేందుకు సిద్ధపడతారు. ఎంత ఖరీదైనా కొని వాడేస్తుంటారు. కానీ నిజానికి మార్కెట్‌లో దొరికే ఫేస్‌క్రీమ్స్‌లో హానికరమైన కెమికల్స్ ఎక్కువగా ఉంటాయి. దాంతో చర్మం మరింత పాడయ్యే అవకాశం ఉంటుంది. అందుకే సహజసిద్ధమైన ఫేస్ ప్యాక్సే అన్నివిధాలా మంచిది. మరింకెందుకు ఆలస్యం? ఇలా ట్రై చెయ్యండి!
కావలసినవి: ముల్తానీ మట్టి – 1 టేబుల్ స్పూన్, కీరదోస గుజ్జు – 1 టేబుల్ స్పూన్, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, ఆర్గన్ ఆయిల్ – అర టీ స్పూన్ (మార్కెట్‌లో లభిస్తుంది)
తయారీ : ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో ముల్తానీ మట్టి, కీరదోస గుజ్జు వేసుకుని బాగా కలుపుకోవాలి. తరువాత ఆ మిశ్రమంలో రోజ్ వాటర్, ఆర్గన్ ఆయిల్ యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చల్లని వాటర్‌తో ముఖాన్ని శుభ్రం చేసుకుని, ఆవిరి పట్టించుకోవాలి. తరువాత ఆ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు అప్లై చేసుకుని, 20 నిమిషాల పాటు బాగా ఆరనివ్వాలి. ఇప్పుడు గోరువెచ్చని నీళ్లతో క్లీన్ చేసుకోవాలి. ఇదే విధంగా వారానికి రెండు లేదా మూడుసార్లు చెయ్యడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment